Kazakhstan
-
చైనా తీరు మారాలి!
ఆవిర్భవించిన నాటి లక్ష్యాలు విడిచి చాన్నాళ్లుగా దారీ తెన్నూ లేకుండా మిగిలిపోయిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు కజఖ్‌స్తాన్‌లోని ఆస్తానాలో గురువారం ముగిసింది. ఈ సదస్సువల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చుగానీ మనతోవున్న సరిహద్దు సమస్యను నాలుగేళ్లుగా దాటవేస్తున్న చైనాతో మన విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ కావటం ఉన్నంతలో జరిగిన మేలు. వాస్తవానికి ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సివుండగా ఆయన బదులు విదేశాంగ మంత్రి వెళ్లారు. ప్రధాని ప్రసంగాన్ని చదివి వినిపించారు. మోదీ గైర్హాజరు ఆ సంస్థనుంచి భారత్ దూరం జరగటానికి సంకేతమనీ, అమెరికా ఒత్తిడే ఇందుకు కారణమనీ చైనా అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. నిరుడు భారత్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి భాష్యాలే చెప్పారు. చైనాతో నేరుగా సమావేశం కావటం ఇష్టం లేకే ఈ లాంఛనం పూర్తిచేసిందని ఆ భాష్యాల సారాంశం. నిజమే... ప్రపంచంలో 40 శాతం జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీఓను విస్మరించటం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలంనాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదనే చెప్పాలి. వర్తక, వాణిజ్యాల్లో దాని ముద్ర లేకపోలేదు. అయితే ఆ సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వగైరా పోకడల గురించి అది సక్రమంగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మోదీ ప్రసంగంలో ఈ సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. 1996లో షాంఘై ఫైవ్‌గా ఏర్పడ్డ బృందంలో చైనా, రష్యా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్లున్నాయి. 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలాక ఆ ప్రాంతంలో తెగల ఘర్షణలు పెచ్చుమీరటంతో భద్రతాపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ బృందం ఆవిర్భవించింది. అంతర్జాతీయ సంస్థగా మలచాలన్న లక్ష్యంతో 2001లో దీన్ని ఎస్సీఓగా మార్చారు. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌ను ఇందులో చేర్చింది చైనాయే. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు వెల్లడై అనేకసార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురైన పాక్‌ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది. అలాగే పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాబితాను మన ప్రతిపాదన పర్యవసానంగా భద్రతామండలి చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా గండికొట్టింది. సరిగదా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)ను పాకిస్తాన్ అధీనంలోవున్న ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లేలా రూపొందించింది. అందుకే 2018లో ఎస్సీఓలో బీఆర్‌ఐను అందరూ అంగీకరించినా మన దేశం వ్యతిరేకించాల్సి వచ్చింది. నిరుడు జరిగిన ఆన్లైన్ సదస్సులో కూడా మన దేశం బీఆర్ఐ గురించిన పేరా తొలగిస్తే తప్ప ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేది లేదని చెప్పింది.ఆ సంగతలావుంచి ఎస్సీఓను అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చైనా అందుకు అనుగుణమైన నడవడి కనబరచవద్దా? వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. 2020లో ఘర్షణలు చెలరేగాక భారత్, చైనాల సైనికాధికారుల స్థాయిలో 20 సార్లు, దౌత్యస్థాయిలో 13 రౌండ్లు చర్చలు జరిగాక ప్యాంగాంగ్ సో సహా అయిదు చోట్ల ఇరు దేశాల సైన్యాలూ వెనక్కి తగ్గటానికి అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్‌లోని ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. దీన్ని పక్కనబెట్టి ఇరు దేశాల సంబంధాలూ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతోంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ నాలుగేళ్లలో చైనా 600 ‘సంపన్న గ్రామాల’ను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్‌లో 60 గ్రామాలు నిర్మిస్తోంది. మున్ముందు అరుణాచల్, హిమాచల్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3,000 గ్రామాలు నిర్మించాలన్నది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు వచ్చిన తగాదాలో ఫిలిప్పీన్స్‌ను సమర్థించటం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహసంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ సమస్యపై భారత్‌తో చర్చించి, దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్ఏసీ మ్యాప్‌లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వటం లేదు. ఆ పని చేస్తే తన పాపం బద్దలవుతుందని దాని భయం. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా పెరిగేలా, కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఎస్సీఓను తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను విస్మరించటం ఏ రకంగా చూసినా చైనాకు తోడ్పడదు. పొరుగుతో సఖ్యతకు రాలేని దేశం ఇటువంటి సంస్థల అభ్యున్నతికి ఏమాత్రం పాటుపడగలదన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి. అందువల్లే మళ్లీ చర్చల పునరుద్ధరణకు చైనా చొరవ తీసుకోవాలి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, జైశంకర్‌ల మధ్య జరిగిన భేటీ ఆ దిశగా తోడ్పడితే మంచిదే. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలూ చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమైతేనే ఎస్సీఓ వంటి సంస్థల నిజమైన లక్ష్యాలు నెరవేరతాయి. -
‘షాంఘై’ సదస్సుకు ప్రధాని దూరం
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో వచ్చే నెలలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు (ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ సదస్సుకు ప్రధాని స్థానంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ వెళ్లనున్నారు. జులై 3-4 తేదీల్లో జరగనున్న షాంఘై సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన వెళ్లడం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం(జూన్28) మీడియా సమావేశంలో చెప్పారు. గత ఏడాది ఎస్సీవో సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వగా చైనా, రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్‌గా సదస్సును నిర్వహించారు. -
టైటిల్ పోరుకు తరుణ్
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 190వ ర్యాంకర్ తరుణ్ 21–8, 21–7తో ప్రపంచ 78వ ర్యాంకర్ లె డక్ ఫాట్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 76వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా)తో తరుణ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 22–20, 21–14తో దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 15–21, 15–21తో వోంగ్ తియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోగా... సెమీఫైనల్లో మనీషా–సంజయ్ (భారత్) ద్వయం 21–16, 10–21, 21–14తో కొసియెలా–తనీనా (అల్జీరియా) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ ఖరారైంది. ఫైనల్ పోరు ఇద్దరు భారత క్రీడాకారిణులు అనుపమా ఉపాధ్యాయ, ఇషారాణి బారువా మధ్య జరగనుంది. -
క్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక–రోహన్ కపూర్ (భారత్) జోడీ 22–20, 21–17తో కెన్నెత్–గ్రోన్యా సోమర్విల్లె (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి 22–24, 21–18, 21–13తో భారత్‌కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ లో జాతీయ చాంపియన్ అన్మోల్ 21–11, 21–7తో నూరానీ అజారా (యూఏఈ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య
విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్‌లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్‌పోర్ట్ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్‌కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్‌కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు. కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్‌కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్‌కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్‌కు మార్పించినట్లు చెప్పింది. డబ్బు చెల్లిస్తేనే పాస్‌పోర్ట్ ఇస్తామంటూ.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్‌పోర్ట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. -
వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా..
నిద్ర అనేది మని షి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలా అతిగా నిద్రపోయినా ప్రమాదమే. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, దైనందిన జీవితానికి ఆటంకంగానే ఉంటుంది. అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది. వారికి నిద్ర ఏదోమైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడపడితే అక్కడే మత్తుగా నిద్రపోతారట. పైగా చాలా రోజుల వరకు లేవరట. ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట. చెప్పాలంటే మన రామాయణ ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు. ఆ వింత గ్రామం ఎక్కడుందంటే.. కజకిస్తాన్‌లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెల పాటు నిద్రపోతాడు. ఇలా నిద్ర పోయిన వ్యక్తి మళ్లీ నెల పాటు మేల్కోడట. అందుకే ఈ ఊరును "స్లీపీ హోల్" అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు. ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం బాధకరం. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీత కలాచి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?) -
గనిలో అగ్ని ప్రమాదం
లండన్: కజఖిస్తాన్లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది. మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది. -
సుదీర్ఘ అంతరిక్షయాత్ర చేసి సురక్షితంగా భూమికి
మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్‌కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్‌లోని జెజ్‌కజ్‌గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రోస్కోస్మొస్ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్‌క్రాఫ్ట్‌లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్‌లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. #SoyuzMS23Landing@roscosmos cosmonauts and commander of the Soyuz-MS23 spaceship 👨🏻🚀Sergey Prokopyev is out from the spacecraft. pic.twitter.com/vHbeOpSBr4 — The Space Pirate🥷🏻👨🏻🚀 💫🪐🚀 (@TheSpacePirateX) September 27, 2023 🇺🇸🇸🇻 | El astronauta Frank Rubio, estadounidense de origen salvadoreño, se vio obligado a quedarse en órbita debido a una falla en su nave. Ahora, tras 371 días y 5.963 vueltas alrededor de la Tierra, su nave ha aterrizado y reunirá con su familia. pic.twitter.com/VezH1FHdV4 — El Salvador Avanza (@SvAvanza) September 27, 2023 ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు -
సమయానికి దేవుడిలా రక్షించారు! లేదంటే ఆ చిన్నారి..
ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికి నుంచి వేలాడుతున్నాడు. ఆ చిన్నారి తల కిటికిలో ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతున్నాడు. ఏ క్షణంలో పడిపోతాడో అని నరాలు తెగే ఉత్కంఠ సాగుతుండగా.. అనూహ్యంగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కజికిస్తాన్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఓ మూడేళ్ల చిన్నారి అకస్మాత్తుగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా పడిపోయాడు. ఐతే అతడి తల ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోని వారు సైతం ఆ చిన్నారిని గమనించకపోవడంతో.. ఆచిన్నారి అలా చాలా సేపు ఏ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దీన్ని గమనించారు. ఐతే ఆ కుర్రాడిని రక్షించేందుకు ఏం చేయాలో తొలుత వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పిల్లాడి తల విండోలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. కాబట్టి కింద ఏ స్టూలో వేసి సాయం చేసి.. ఆ చిన్నారిలో ఉత్సాహం నింపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు స్టూల్స్‌ని ఆ చిన్నారి కాళ్ల వద్ద ఉంచారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఆ స్టూల్‌పై కాళ్లు నిలబడకుండా వేలాడిపోతుంటాయి. దీంతో వారు కూడా ఆ భవనంపై స్టూల్స్ పట్టుకుని ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలా నుంచొని ఉంటారు. సరిగ్గా ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్ వచ్చి కంగారుపడుతూ, అరుస్తూ.. ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగే యత్నం చేస్తారు. దీంతో ఆ చిన్నారి స్పృహలోకి వస్తాడు. హమ్మయ్యా! ఆ చిన్నారి బతికే ఉన్నాడనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. ఆ పిల్లాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. Amazing men🙏 pic.twitter.com/WOQNoFP8ZB — Tansu YEĞEN (@TansuYegen) April 26, 2023 (చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్) -
‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుదే చెస్ టైటిల్
అస్తానా: కజకిస్తాన్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్ టోర్నమెంట్లో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు పైచేయి సాధించి టైటిల్ దక్కించుకుంది. బుధవారం ముగిసిన టోర్నీలో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు బ్లిట్జ్ ఈవెంట్లో 38.5–25.5 పాయింట్ల తేడాతో... ర్యాపిడ్ ఈవెంట్లో 34.5–29.5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్ జట్టును ఓడించింది. భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హారిక, సవితాశ్రీలతోపాటు నానా జాగ్‌నిద్జె (జార్జియా), హూ ఇఫాన్ (చైనా), గునె మమద్‌జాదా (అజర్బైజాన్), సోకా గాల్ (హంగేరి), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్), నుర్గుల్ సలిమోవా (బల్గేరియా) కూడా ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కజకిస్తాన్ జట్టు తరఫున దినారా, బిబిసారా, మెరూర్ట్, జన్సాయా అబ్దుమలిక్, జెనియా బలబయేవా, లియా, అలువా నుర్మనోవా, జరీనా పోటీపడ్డారు. చదవండి: IPL 2023: సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్ -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి జ్యోతి
ఈనెల 10 నుంచి 12 వరకు కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగే ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీకి చోటు లభించింది. విశాఖపట్టణానికి చెందిన జ్యోతి 60 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్స్‌లో పోటీపడుతుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించింది. -
హంపికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం
-
ప్రపంచపు అత్యంత భారీ కార్పెట్ ఇదే...
World Largest Carpet ప్రపంచంలోనే అతిపెద్ద కార్పెట్ మన దేశంలో రూపుదిద్దుకుంది. కార్పెట్ సిటీగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో పటోడియా కాంట్రాక్ట్ అనే సంస్థ ఈ భారీ కార్పెట్‌ను సాకారం చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు అయిన కజకిస్తాన్‌లోని నుర్–సుల్తాన్ మసీదు కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్‌మేడ్ కార్పెట్‌ను అందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశేషాలివే... మొత్తంగా 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో మెడాలియన్ 70 మీటర్ల వ్యాసార్థంతో ఉండగా, 80 టన్నుల నిఖార్పైన న్యూజిలాండ్ ఊల్ స్పన్ వినియోగించారు. దీనిని వెయ్యి మందికి పైగా కార్మికులు ఆరు నెలల పాటు నిర్విరామంగా శ్రమించి తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో ప్రధానంగా రెండు డిజైన్లు ఉంటాయి. మసీదులో కోర్ట్‌యార్డ్ సెంటర్‌పీస్‌గా వృత్తం, దానిచుట్టూ 8 గొడ్డళ్లు ఉంటే, జన్నత్ ఉల్ ఫిరదౌస్ స్ఫూర్తితో ఇంకో డిజైన్ ఉంటుంది. అతిపెద్ద కార్పెట్ కళ... ప్రపంచంలో ఇంతవరకూ ఎప్పుడూ ఇంతటి భారీ స్ధాయిలో హ్యాండ్‌మేడ్ కార్పెట్‌ను తీర్చిదిద్దిన సందర్భం లేదు. ఈ కార్పెట్‌కు సంబంధించి యార్న్ స్పిన్నింగ్ మొదలు, సైట్లో దాని ఇన్స్టాలేషన్ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్ నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం చేసిన ఈ కార్పెట్ రూపకల్పనలో అనేక జాగ్రత్తలను తీసుకుంది. మసీదు నిర్మాణానికి సంబంధించి ప్రతి సూక్ష్మ అంశమూ అంటే ముఖ్యమైన చాండ్లియర్, కార్నర్స్, ఫ్లోరింగ్, కన్వర్జింగ్ వాల్స్, పిల్లర్లు వంటివి పరిగణలోకి తీసుకుని కార్పెట్ తీర్చిదిద్దారు. పటోడియా కాంట్రాక్ట్ కంపెనీ 1881 నుంచి కార్పెట్ తయారీ రంగంలో ఉంది. ప్రపంచంలో అగ్రగామి కార్పెట్ డిజైనర్లతో కలిసి పనిచేస్తోంది. -
World Athletics Championships: జెరుటో జోరు...
ఈవెంట్ ఆరో రోజు రెండు విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో నోరా జెరుటో (కజకిస్తాన్)కు స్వర్ణం దక్కింది. రేస్‌ను ఆమె 8 నిమిషాల 53.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నమోదు చేసింది. వెర్కుహ గెటాచూ (ఇథియోపియా – 8 నిమిషాల 54.61 సె.) రజతం సాధించగా, మెకిడెస్ అబీబీ (ఇథియోపియా – 8 నిమిషాల 56.08 సె.) కాంస్యం గెలుచుకుంది. ఈ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన ముగ్గురు అథ్లెట్లు కూడా పరుగును 9 నిమిషాల్లోపే పూర్తి చేయడం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలి సారి కావడం విశేషం. జూనియర్ స్థాయిలో కెన్యాకు ప్రాతినిధ్యం వహించి గత ఏడాది కజకిస్తాన్‌కు వలస వెళ్లిన జెరుటో ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగి కజకిస్తాన్‌కు ఈ క్రీడల చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించింది. మహిళల డిస్కస్‌త్రోలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత వలరీ అల్మన్ (అమెరికా)కు నిరాశ ఎదురైంది. డిస్క్‌ను 68.30 మీటర్లు విసిరిన అల్మన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. చైనాకు చెందిన బిన్ ఫింగ్ స్వర్ణం గెలుచుకుంది. 69.12 మీటర్లతో ఆమె అగ్ర స్థానంలో నిలిచింది. సాండ్రా పెర్కోవిక్ (క్రొయేషియా – 68.45 మీ.)కు రజతం దక్కింది. -
Wimbledon Tennis tournament: ‘క్వీన్’ రిబాకినా
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడికి తలొగ్గకుండా... తొలి సెట్ కోల్పోయినా ఆందోళన చెందకుండా... ఆద్యంతం పట్టుదలతో పోరాడిన కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తన ‘గ్రాండ్’కలను సాకారం చేసుకుంది. శనివారం జరిగిన వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్‌గా అవతరించింది. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ జబర్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తడబడి... నిలబడి ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జబర్ ఫైనల్లోనూ జోరు కొనసాగించింది. వైవిధ్యభరిత డ్రాప్ షాట్లు, పాసింగ్ షాట్లతో చెలరేగిన జబర్ మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. తొలి సెట్ కోల్పోయినా రిబాకినా పట్టుదల కోల్పోలేదు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా అదే జోరులో ఐదో గేమ్‌లోనూ బ్రేక్ సాధించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శక్తివంతమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో విజృంభించిన రిబాకినా 39 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లో మళ్లీ జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా... ఆ తర్వాత ఏడో గేమ్‌లో మరోసారి జబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఎనిమిదో గేమ్‌లో రిబాకినా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నేడు జొకోవిచ్ (సెర్బియా), కిరియోస్ (ఆస్ట్రేలియా) మధ్య పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ గణాంకాలు రిబాకినా ఆన్స్ జబర్ 4 ఏస్‌లు 4 3 డబుల్‌ఫాల్ట్‌లు 1 17/36 నెట్ పాయింట్లు 7/14 4/6 బ్రేక్ పాయింట్లు 2/11 29 విన్నర్స్ 17 33 అనవసర తప్పిదాలు 24 86 మొత్తం పాయింట్లు 80 -
కజకిస్తాన్‌లో కర్నూలు యువకుడి మృతి
కర్నూలు(సెంట్రల్): కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాదు, మేరీ కుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు పి.వినయ్‌కుమార్(23) కజకిస్తాన్‌లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మూడో సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం గురువారం స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న కుంటలో ఈతకు వెళ్లాడు. అయితే నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి తలకొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు. తరువాత మెడికల్ కాలేజీ యూనివర్సిటీ కూడా యువకుడి మరణాన్ని ధ్రువీకరించి సమాచారం ఇచ్చింది. జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువు కోసం కజకిస్తాన్ వెళ్లిన వినయ్‌కుమార్ మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని తలుచుకొని విలపిస్తున్న తల్లిని నిలువరించడం బంధుమిత్రులకు సాధ్యం కావడంలేదు. కడసారి చూపుకోసం తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించాలని ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడిన కలెక్టర్... ఎంతో భవిష్యత్ ఉన్న పి.వినయ్‌కుమార్ కజకిస్తాన్ లో చనిపోవడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే అతడి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. విదేశాంగ శాఖ అధికారులు, ఏపీ భవన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కజకిస్తాన్‌లోని ఎంబసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. వినయ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
సిమ్రన్‌జిత్ శుభారంభం..!
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ శుభారంభం చేసింది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన 60 కేజీల విభాగం తొలి రౌండ్లో సిమ్రన్‌జిత్ 5–0తో ఇస్చనోవా (కజకిస్తాన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల 54 కేజీల విభాగం తొలి రౌండ్లో అనంత చొపాడె 3–2తో గన్‌బోల్డ్ (మంగోలియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. చదవండి: Wimbledon 2022: పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..! -
యాపిల్ పుట్టినిల్లు ఎక్కడో తెలుసా? ఆ పండ్లు చిన్నగా, చేదుగా ఉండేవా!
హాలిఫాక్స్: యాపిల్ పండును వర్ణించమంటే ఎలా వర్ణిస్తాం? ఎర్రగా, తియ్యగా, పెద్దగా ఉంటుంది అంటాం. కానీ నిజానికి పురాతన కాలంలో యాపిల్ ఇలా ఉండేది కాదట! చాలా చిన్నగా, చేదుగా ఉండేదని కెనడా పరిశోధకులు చెప్తున్నారు. వేలాది సంవత్సరాల కాలంలో రకరకాల పద్ధతుల ద్వారా ఇప్పుడున్న ఆకారం, రంగు, రుచికి తీసుకొచ్చారని తేల్చారు. యాపిల్ పుట్టినిల్లు ఇప్పటి కజకిస్తాన్‌లోని తియాన్షెన్ కొండలు. ఆ దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మాటీ పేరు యాపిల్ నుంచే పుట్టింది. అల్మాటౌ అంటే కజక్ భాషలో యాపిల్ కొండ అని అర్థం. మానవులు గత 5,000 సంవత్సరాలుగా యాపిల్‌ను సాగు చేస్తున్నారు. పురాతన కాలంలో యాపిల్ విత్తనాలను సిల్క్ రూట్ గుండా ఆసియా అంతటికీ రవాణా చేశారు. తర్వాత ఇవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ చేరాయి. అప్పట్లో యాపిల్స్ చాలా చిన్నవిగా, చేదుగా ఉండేవి. కజకిస్తాన్ కొండల్లో సహజంగా యాపిల్ చెట్లు పెరుగుతుంటాయి. వాటికి కాసే పండ్లు చిన్న, చేదుగా, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ అటవీ జాతి యాపిల్స్‌తో పోలిస్తే మనుషులు సాగు చేసే పండ్లు 3.6 రెట్లు అధిక బరువు, 43 శాతం తక్కువ అమ్లత్వాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. చేదుకు కారణమయ్యే ఫినోలిక్ కాంపౌండ్ 68 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే చేదు చాలావరకు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత 200 ఏళ్లుగా యాపిల్స్‌లో కొత్త రకాలను సృష్టించడంలో వేగం పెరిగింది. ఎక్కువ కాలం నిలువ ఉండే పండ్లను సాగు చేస్తున్నారు. అందులో తీపి శాతాన్ని పెంచుతున్నారు. -
ఎల్పీజీ ధరల పెంపుతో... భగ్గుమన్న కజకిస్తాన్
మాస్కో: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది. కజకిస్తాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకయేవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి. -
Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్‌చేస్తే!
Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్‌షిప్’ పోటీలకు వేదిక కజకిస్థాన్. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్ ఈ రోజు కజకిస్థాన్‌కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్‌కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతా కాకతాళీయం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్ బీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాస్‌లో ఉండగా మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌కి పేరు ఇచ్చేశారు మా స్కూల్ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా తొలి ఇంటర్నేషనల్ మెడల్ నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్‌గా లేను. కోచ్ చెప్పినట్లు ప్రాక్టీస్ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్‌నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్. అడ్డంకులు లేవు కరాటే ప్రాక్టీస్ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్‌లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్‌తో కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్‌కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్. ఫలక్ అంటే ఆకాశం అని అర్థం. స్టార్ క్యాంపెయినర్ సాయెదా ఫలక్ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్ ఓపెన్ మెడల్’ అని 2016లో లాస్వేగాస్లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) -
చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు!
క్రిప్టోకరెన్సీకి భారీ మార్కెట్ అవుతుందేమోనని భావించిన చైనా.. దానిని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదంటూ బ్యాన్‌తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూర్ఖంగా ముందుకు పోతోందంటూ విమర్శలు సైతం వినిపించాయి. అయితే ఆ నిర్ణయం సరైందేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కొన్ని దేశాలు. ఈ ఏడాది మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్‌కాయిన్ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు వెలువడుతాయని ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని, పైగా ఎనర్జీ విపరీతంగా ఖర్చై కరెంట్ కొరతలు ఏర్పడతాయని ప్రకటించుకుంది చైనా. ఆపై ఏకంగా క్రిప్టోకరెన్సీలను మొత్తంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రిప్టోకరెన్సీ తయారీ కోసం ఇంతకాలం చైనాలో థర్మల్ కేంద్రాలపై ఆధారపడ్డ క్రిప్టోకరెన్సీ కంపెనీలు.. నిషేధం దెబ్బకు వేరే దేశాలకు క్యూ కట్టాయి. ఇదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది. చైనాకు పొరుగున ఉన్న దేశాలతో ఖర్చు ఎంతైనా పర్వాలేదనుకుని ఒప్పందాలు చేసుకుంటున్నాయి క్రిప్టో కంపెనీలు. అయితే ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు నాలిక కర్చుకుంటున్నాయి. సాధారణంగా క్రిప్టోకరెన్సీ ఉత్పత్తికి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం పడుతుంది. ఇది ఊహించని కజకిస్తాన్ లాంటి దేశాలు కరెంట్ కోతలను అనుభవిస్తున్నాయి. కంప్యూటర్ ఫామ్‌లకు నెలవైన కజకిస్తాన్‌లో ఇప్పుడు పట్టుమని నాలుగైదు గంటల సేపు కూడా పవర్ ఉండడం లేదు. దీనికితోడు ఏర్పడిన కోతలను అధిగమించేందుకు రష్యా నుంచి అధిక ధరలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది కజకిస్తాన్. ఊహించని పరిణామాల నడుమ నష్టనివారణ చర్యలు చేపట్టింది కజకిస్తాన్ ప్రభుత్వం. 2022 జనవరి నుంచి క్రిప్టోమైనింగ్‌కు అవసరమైన విద్యుత్ సప్లయ్‌కి కఠిన నిబంధనలను విధించబోతోంది. రేషన్ విధానంలో క్రిప్టో మైనర్లకు విద్యుత్ అందిస్తామని కజకిస్తాన్ గ్రిడ్ ఆపరేటర్ స్పష్టం చేసింది.ఒక్క కజకిస్తాన్ మాత్రమే కాదు.. ముప్ఫైకి పైగా దేశాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. క్లిక్ చేయండి: తెలివైన అడుగు.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ -
FIFA World Cup 2022: ఫ్రాన్స్ అర్హత.. బెల్జియం, క్రొయేషియా కూడా
FIFA World Cup 2022: France Qualified For Tourney After Beat Kazakhstan: వచ్చే ఏడాది ఖతర్‌లో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ బెల్జియం, 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా ఫ్రాన్స్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. కజకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 8–0తో ఘనవిజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె ఏకంగా నాలుగు గోల్స్ చేయగా... కరీమ్ బెంజెమా రెండు గోల్స్... రాబియోట్, గ్రీజ్మన్ ఒక్కో గోల్ సాధించారు. గ్రూప్ ‘డి’లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఫ్రాన్స్ నాలుగు విజయాలు, మూడు ‘డ్రా’లతో 15 పాయింట్లు సాధించి గ్రూప్ విజేత హోదాలో ప్రపంచకప్‌కు అర్హత పొందింది. గ్రూప్ ‘ఇ’లో ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3–1తో నెగ్గింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన బెల్జియం 19 పాయింట్లతో గ్రూప్ ‘ఇ’ విజేతగా అర్హత పొందింది. గ్రూప్ ‘హెచ్’లో క్రొయేషియా 23 పాయింట్లతో టాపర్‌గా నిలిచి బెర్త్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 1–0తో రష్యాను ఓడించింది. రష్యా ప్లేయర్ కుద్రయెశోవ్ 81వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేసి క్రొయేషియాను గెలిపించాడు. 32 జట్లు పాల్గొనే 2022–ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటివరకు ఆతిథ్య ఖతర్ జట్టుతోపాటు జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, బెల్జియం, ఫ్రాన్స్, క్రొయేషియా అర్హత పొందాయి. -
భారత్, కజకిస్తాన్ క్వార్టర్స్ తొలి మ్యాచ్ ‘డ్రా’
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం కజకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. జన్సయ అబ్దుమాలిక్తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 80 ఎత్తుల్లో... దినార సదువాకసోవాతో గేమ్‌ను ఆర్ వైశాలి 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అనంతరం భక్తి కులకర్ణి 52 ఎత్తుల్లో కమలిదెనోవా చేతిలో ఓడింది. చివరగా జరిగిన గేమ్‌లో మేరీఆన్ గోమ్స్ 85 ఎత్తుల్లో గుల్మిరాపై నెగ్గడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు.. -
తెలంగాణ కుర్రాడు.. స్నేహిత్ ఖాతాలో రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: కజకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో రజతం... డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 6–11, 9–11, 3–11, 11–9, 6–11తో 46వ ర్యాంకర్ కిరిల్ జెరాసిమెంకో (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. డబుల్స్ సెమీఫైల్లో స్నేహిత్–సుదాన్షు గ్రోవర్ (భారత్) జోడీ 11–8, 2–11, 6–11, 12–10, 5–11తో జెరాసిమెంకో–అలెన్ (కజకిస్తాన్) జంట చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది. చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు