పోరాడి ఓడిన సాకేత్‌  | saketh myneni loss the game | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సాకేత్‌ 

Published Sat, Jul 21 2018 12:56 AM | Last Updated on Sat, Jul 21 2018 12:56 AM

saketh myneni loss the game - Sakshi

అస్తానా: ప్రెసిడెంట్స్‌ కప్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్‌లోని అస్తానాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ 4–6, 7–6 (12/10), 5–7తో డానియల్‌ బ్రాండ్స్‌ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
 

2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ 13 ఏస్‌లు సంధించడంతోపాటు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. క్వార్టర్స్‌లో ఓడిన సాకేత్‌కు 3,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 50 వేలు)తోపాటు 18 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement