కజకిస్తాన్‌ ప్రమాదంపై కొత్త ట్విస్ట్‌.. రష్యానే కారణమా? | Internet Conspiracy Did Russia shoot down Azerbaijan Airlines | Sakshi
Sakshi News home page

కజకిస్తాన్‌ ప్రమాదంపై కొత్త ట్విస్ట్‌.. రష్యానే కారణమా?

Dec 26 2024 10:42 AM | Updated on Dec 26 2024 11:27 AM

Internet Conspiracy Did Russia shoot down Azerbaijan Airlines

మాస్కో: కజకిస్తాన్‌లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమాన ప్రమాదానికి రష్యానే కారణమంటూ సోషల్‌ మీడియాతో కామెంట్స్‌ వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకూ సిటీ నుంచి విమానం.. రష్యాలోని నార్త్‌ కాకస్‌ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో అక్టౌకు వెళ్తున్న సందర్బంగా విమానం కూలిపోయింది. అయితే, ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమని పలువురు చెబుతున్నారు. ఇదే సమయంలో రష్యా దాడి కారణంగానే విమాన ప్రమాదం జరిగిందని మరికొందరు కొన్ని వీడియోలను షేర్‌ చేస్తున్నారు.

 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానం బాడీపై పలుచోట్ల అనుమానాస్పదంగా రంధ్రాలు ఉన్నాయి. దాడులు జరిగితే రంధ్రాలు ఏర్పడినట్టుగా కనిపించడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సమయంలోనే ఈ విమానంపై దాడి జరిగిందని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంజిన్‌ టెక్నికల్‌ సమస్యల కారణంగా పైలట్‌ అ‍త్యవసర ల్యాండింగ్‌ కోరి ఉంటారని అంటున్నారు. ఇక, విమానం రాడార్‌ దిశను చూసినప్పుడు విమానం మొదట రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ మీదుగా వెళ్తోంది. తర్వాత ట్రాకర్ నుండి అదృశ్యమైందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రమాదానికి ముందు విమాన పరిస్థితిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో విమానం లోపల ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. విమానం కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement