నూర్ సుల్తాన్ : కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆల్‌మటీ ఎయిర్‌పోర్ట్ నుంచి టెకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం అదుపు తప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులతో పాటు, 5గురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం కజకిస్తాన్‌లోని ప్రధాన నగరం ఆల్‌మటీ నుంచి రాజధాని నూర్ సుల్తాన్‌కు బెక్ ఎయిర్‌కు చెందిన విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కొల్పోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే రెండతస్తుల బిల్డింగ్‌ను ఢీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కజకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment