
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్ శివ థాపా కజకిస్తాన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్ (కజకిస్తాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్ లభించింది. స్వర్ణం ఖాయమైంది. పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన దుర్యోధన్ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు.