pull out
-
యూఎస్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన టిమ్ స్కాట్
కొలంబియా(యూఎస్ఏ): 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్ ప్రకటించారు. మరో రెండు నెలల్లో అయోవాలో ఓటింగ్ ప్రారంభం కానున్న వేళ ఆదివారం అర్ధరాత్రి టిమ్ స్కాట్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉపాధ్యక్ష పదవికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. రిపబ్లికన్ సెనేటర్లలో ఏకైక నల్లజాతీయుడైన స్కాట్ అందరి కంటే ముందుగా మేలోనే అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు తెలిపారు. -
శివ థాపా పసిడి పంచ్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్ శివ థాపా కజకిస్తాన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్ (కజకిస్తాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్ లభించింది. స్వర్ణం ఖాయమైంది. పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన దుర్యోధన్ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు. -
యుద్ధానికి దిగినట్లుగా వేల సాలీడులు..
బ్రిటన్: అదొక అటవీ ప్రాంతంతో నిండిన పార్క్ లాంటి ప్రదేశం. అందులో కొండలు. సరదాగా గడిపేందుకు తమ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు. సాధారణంగా స్వేచ్ఛగా ప్రకృతిలో విహరించే చిన్నారులంతా ఆ రోజు కూడా గంతులు వేస్తూ ఓ బండరాయి వద్దకు చేరుకున్నారు. దానికి చాలా చోట్ల రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఏమున్నాయా అని తొంగిచూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో కుప్పలుకుప్పలుగా సాలీడు పురుగులు ఉన్నాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయారు. ఇదే విషయం అక్కడ ఉన్న ఓ వ్యక్తికి చెప్పగా ఆశ్చర్యపోతూ.. ఒక వేళ సాలీడులు ఉన్నా అవేం చేయవని, భయపడాల్సిన పనిలేదంటూ వారి భయం పోగొట్టేందుకు ఆ రంధ్రంలో చేయిపెట్టి సాలీడు తుట్టెను కిందపడేశాడు. అంతే.. అందులోని వేలకొలది సాలీడు ఒక్కసారిగా దాడికి దిగినట్లుగా ఎగబాకడంతో భయంతో పిల్లలంతా పరుగులు తీశారు. దానిని బయటకు తీసిన వ్యక్తి కూడా వాటిని చూసి హడలెత్తిపోయాడు. కాసేపట్లోనే వేల సాలీడులు ఆ బండరాయిని చుట్టేశాయి.