'Rest Of The World' Won Chess World Championship - Sakshi
Sakshi News home page

Chess world championship: ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుదే చెస్‌ టైటిల్‌

Published Thu, Apr 20 2023 1:23 PM | Last Updated on Thu, Apr 20 2023 1:41 PM

Rest of world wins Chess world championship - Sakshi

అస్తానా: కజకిస్తాన్, రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్‌ టోర్నమెంట్‌లో ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టు పైచేయి సాధించి టైటిల్‌ దక్కించుకుంది. బుధవారం ముగిసిన టోర్నీలో ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టు బ్లిట్జ్‌ ఈవెంట్‌లో 38.5–25.5 పాయింట్ల తేడాతో... ర్యాపిడ్‌ ఈవెంట్‌లో 34.5–29.5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్‌ జట్టును ఓడించింది. భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

హారిక, సవితాశ్రీలతోపాటు నానా జాగ్‌నిద్జె (జార్జియా), హూ ఇఫాన్‌ (చైనా), గునె మమద్‌జాదా (అజర్‌బైజాన్‌), సోకా గాల్‌ (హంగేరి), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్‌), నుర్గుల్‌ సలిమోవా (బల్గేరియా) కూడా ‘రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కజకిస్తాన్‌ జట్టు తరఫున దినారా, బిబిసారా, మెరూర్ట్, జన్సాయా అబ్దుమలిక్, జెనియా బలబయేవా, లియా, అలువా నుర్మనోవా, జరీనా పోటీపడ్డారు.
చదవండిIPL 2023: సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్‌ టెండూల్కర్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement