Rest of world team
-
‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుదే చెస్ టైటిల్
అస్తానా: కజకిస్తాన్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్ టోర్నమెంట్లో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు పైచేయి సాధించి టైటిల్ దక్కించుకుంది. బుధవారం ముగిసిన టోర్నీలో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు బ్లిట్జ్ ఈవెంట్లో 38.5–25.5 పాయింట్ల తేడాతో... ర్యాపిడ్ ఈవెంట్లో 34.5–29.5 పాయింట్ల తేడాతో కజకిస్తాన్ జట్టును ఓడించింది. భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హారిక, సవితాశ్రీలతోపాటు నానా జాగ్‌నిద్జె (జార్జియా), హూ ఇఫాన్ (చైనా), గునె మమద్‌జాదా (అజర్బైజాన్), సోకా గాల్ (హంగేరి), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్), నుర్గుల్ సలిమోవా (బల్గేరియా) కూడా ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కజకిస్తాన్ జట్టు తరఫున దినారా, బిబిసారా, మెరూర్ట్, జన్సాయా అబ్దుమలిక్, జెనియా బలబయేవా, లియా, అలువా నుర్మనోవా, జరీనా పోటీపడ్డారు. చదవండి: IPL 2023: సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్ -
సచిన్ ఆటను మళ్లీ చూడొచ్చు
లండన్: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కూ గుడ్‌బై చెప్పిన భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అయితే అది ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మాత్రమే. ఇంగ్లండ్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఆవిర్భవించి 200 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నిర్వహించనున్న వన్డే మ్యాచ్‌లో సచిన్ ఆడనున్నాడు. ఎంసీసీ-రెస్టాఫ్ వరల్డ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లో జూలై 5న జరగనున్న ఈ మ్యాచ్‌లో మాస్టర్.. ఎంసీసీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఎంసీసీ తరఫున ఆడనున్నాడు. రెస్టాఫ్ వరల్డ్ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నాయకత్వం వహించనున్నాడు. దీంతో సచిన్-వార్న్‌ల పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇంగ్లండ్‌లో అభిమానులకు దక్కనుంది. వార్న్ జట్టులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ పొలాక్ కూడా ఉన్నాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఎంసీసీ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని సచిన్ తెలిపాడు. ‘క్రికెట్‌కు లార్డ్స్ ప్రత్యేకమైన వేదిక. ఇక్కడ మరోసారి ఆడే అవకాశం లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది’అని మాస్టర్ అన్నాడు. లార్డ్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడడం సచిన్‌కు ఇది రెండోసారి. 1998లో ప్రిన్సెస్ డయానా స్మారక మ్యాచ్‌లోనూ ఆడాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ రెస్టాఫ్ వరల్డ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.