మరోసారి విదేశాలకు బాబు | Chandra babu naidu to go on foreign tour once again | Sakshi
Sakshi News home page

మరోసారి విదేశాలకు బాబు

Published Tue, Jul 5 2016 7:16 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

మరోసారి విదేశాలకు బాబు - Sakshi

మరోసారి విదేశాలకు బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. గత రెండేళ్ల కాలంలో అనేక దేశాలు పర్యటిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు తాజాగా ఈ నెల 9 నుంచి అయిదు రోజుల పాటు కజకిస్థాన్, రష్యా దేశాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఇటీవలే రెండోసారి చైనాలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు చైనా, సింగపూర్, జపాన్, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, మలేషియా తదితర దేశాల్లో పర్యటించారు.

చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ నెల 9 న బయలుదేరి 14 వ తేదీ వరకు ఆయా దేశాల్లో పర్యటించడానికి సంబంధించి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులను, వ్యాపార వేత్తలను కలవనున్నారు.

ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ కమ్యునికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రన్సిపల్ సెక్రెటరీ సాయి ప్రసాద్, మౌలిక సదుపాయాలు, సీఆర్ డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ అరోకియా, సీసీడీఎంసీ చైర్మన్ డి. లక్ష్మీపార్థసారథి, రాష్ట్ర స్కిల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె. లక్ష్మినారాయణ, ఎకనమిక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈవో జాస్తి క్రిష్ట కిషోర్, సీఎం పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూచిపూడి నగేష్ బాబు తదితరులు ఉంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement