
న్యూఢిల్లీ : కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న ఫాలోయింగ్‌పై ఆమె స్పందించారు. రాహుల్ గాంధీ తన ట్విటర్ అకౌంట్ నుంచి అధికంగా రీట్వీట్‌లు చేస్తుండడంతో ఫాలోవర్లు విపరీతంగా పెరుగుతున్నట్లు తాజాగా ఒక వార్తాసంస్థ పేర్కొంది. రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఆటోమేటెడ్ బాట్‌లను ఉపయోగించడం వల్లే ఇది సామధ్యమవుతోందని సదరు వార్తా సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ.. తాజాగా రాహుల్ గాంధీ రష్యా, కజకిస్తాన్‌లోనూ గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉందంటూ ట్వీట్ చేశారు.
అంతేకాక రాహుల్ గాంధీకి ఫాలోవర్లు పెరగడంపైనా ఆమె స్పందించారు. రాహుల్ గాంధీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఆటోమేటెడ్ బాబ్‌లను ఉపయోగించడం వల్లే.. ఫాలోవర్లు పెరిగారని సదరు సంస్థ తెలిపింది. అందువల్లే రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ ఖాతా ‘ఆఫీస్‌ఆఫ్‌ఆర్‌జీ’కి కజకిస్తాన్, రష్యా, ఇండోనేషియాల నుంచి రీ ట్వీట్లు వస్తున్నాయని.. వీటిని ఆటోమేటెడ్ బాట్స్ చేస్తున్నాయని ఆ వార్త సంస్థ తెలిపింది. దీనిపైనే స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా స్పందించారు.
Perhaps @OfficeOfRG planning to sweep polls in Russia, Indonesia & Kazakhstan ?? #RahulWaveInKazakh https://t.co/xVanl2mKGh https://t.co/Yhl1oAGqOg
— Smriti Z Irani (@smritiirani) October 21, 2017