
సాక్షి, హైదరాబాద్: కజకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో రజతం... డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 6–11, 9–11, 3–11, 11–9, 6–11తో 46వ ర్యాంకర్ కిరిల్ జెరాసిమెంకో (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. డబుల్స్ సెమీఫైల్లో స్నేహిత్–సుదాన్షు గ్రోవర్ (భారత్) జోడీ 11–8, 2–11, 6–11, 12–10, 5–11తో జెరాసిమెంకో–అలెన్ (కజకిస్తాన్) జంట చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది.
చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు