
కజకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం
అలమటీ : కజకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 52 మంది మృతిచెందారు. కజకిస్తాన్‌లో అక్టావులోని ఇర్గిజ్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కజకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులందరూ ఉజ్జేకిస్తాన్‌కు చెందినవారుగా సమాచారం. బస్సు రష్యాకు వెళ్తుండగా, లేదా రష్యా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment