Uzbekistan
-
నమస్తే దివ్య..!
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ యకుబొయెవ్(Nodirbek Yakubboev) తీరు మార్చుకున్నాడు. ప్రత్యర్థిని గౌరవించి సంస్కారం చూపాడు. ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భాగంగా చాలెంజర్ టోర్నమెంట్లో పాల్గొంటున్న నొదిర్బెక్ తనకు ఎదురైన భారత ప్రత్యర్థి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh)కి రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నాడు. దీనికి దివ్య కూడా ప్రతి నమస్కారం చేసింది.కాగా 23 ఏళ్ల యకుబొయెవ్ మూడో రౌండ్‌కు ముందు దివ్యకు నమస్కరించాడు. ఈ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... భారత అమ్మాయిపై విజయం సాధించాడు. మూడు రౌండ్లలో ఒక గేమ్ నెగ్గిన దివ్య రెండు గేముల్లో ఓడింది. ఉజ్బెక్ ప్లేయర్ తాజా వ్యవహారశైలి గతంలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఉదంతాన్ని మరిచిపోయేలా చేసింది. That moment when Nodirbek Yakubboev greeted Divya Deshmukh with a traditional "Namaste" before the start of their 3rd round game at @PragueChess Festival Challengers 2025! #praguechessfestival pic.twitter.com/07zSR0ymh6— ChessBase India (@ChessbaseIndia) March 1, 2025 అప్పుడేం జరిగిందంటే... జనవరిలో టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో (విక్‌ఆన్‌జీ, నెదర్లాండ్స్) నొదిర్బెక్... వైశాలి మధ్య మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆనవాయితీ ప్రకారం భారత అమ్మాయి కరచాలనం కోసం చేయి చాచగా... అదేం అక్కర్లేదన్నట్లుగా ఉజ్బెక్ ఆటగాడు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించాడు. ఈ ‘నో షేక్‌హ్యాండ్’ ఉదంతం సోషల్ మీడియాలో వివాదం రేపింది. నెటిజన్లంతా నొదిర్బెక్ సంస్కారహీనుడంటూ కామెంట్లు పెట్టారు.ఇది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... కావాలని నిరాకరించలేదని, మతపరమైన కట్టుబాట్లతోనే పరాయి అమ్మాయి చేతిని తాకలేదని... ప్రతిభావంతురాలైన వైశాలీ అన్నా... భారతీయులన్నా తనకెంతో గౌరవమని ‘ఎక్స్’లో వివరణ ఇచ్చాడు. కేవలం ట్వీట్‌తో ఆగకుండా టోర్నీ ఆడేందుకు వచ్చిన అక్కాతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందలతో పాటు తోడుగా వచ్చిన వారి తల్లి నాగలక్ష్మిని వ్యక్తిగతంగా కలిసి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. ఇదీ చదవండి:తెలంగాణ శుభారంభం పంచ్‌కుల: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ‘బి’ డివిజన్ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 3–1 గోల్స్ తేడాతో అస్సాంపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అస్సాం జట్టే ముందుగా బోణీ కొట్టింది. తొలి క్వార్టర్‌లోనే అస్సాం కెప్టెన్ మున్మునీ దాస్ 14వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో జట్టు 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అస్సాం జోరు ఆ క్వార్టర్‌కే పరిమితమైంది.రెండో క్వార్టర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ అమ్మాయిలు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో అస్సాం క్రీడాకారిణులు చేష్టలుడిగారు. 23 నిమిషంలో ప్రతివ కిండో, 26వ నిమిషంలో సుమి ముందరి, 28వ నిమిషంలో పూజ రాథోడ్ తలా ఒక గోల్ చేశారు. తర్వాతి క్వార్టర్లలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలంగాణ 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఇదే డివిజన్లో జరిగిన పూల్ ‘బి’ పోటీల్లో ఢిల్లీ 1–0తో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందగా... చత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల మధ్య జరిగిన పోరు 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
పురుషుల జట్టుకు అన్నీ ‘డ్రా’లే
బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు అజేయంగా సాగుతోంది. శుక్రవారం ఉజ్బెకిస్తాన్ జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో టై చేసుకుంది. ఈ పోరులో బరిలోకి దిగిన నలుగురు ఆటగాళ్లు కూడా తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో వరుసగా ఎదురులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను నిలువరించిన జట్టుగా ఉజ్బెకిస్తాన్ నిలిచింది. దొమ్మరాజు గుకేశ్... నొదిర్బెక్ అబ్దుసత్తొరొవ్తో, ప్రజ్ఞానంద.... జవొఖిర్ సిందరొవ్తో, విదిత్ గుజరాతి... జకొంగిర్ వఖిదొవ్తో, ఇరిగేశి అర్జున్... షంసిద్దీన్తో తమ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్లో భారత బృందం 2–2తో అమెరికా జట్టుతో టై చేసుకుంది. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 2–1తో అమెరికా ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో వంతిక అగర్వాల్ వేసిన ఎత్తులు భారత్‌ను పైఎత్తుకు చేర్చింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో ఆమె ఇరినా క్రుశ్ను ఓడించి 2–2తో స్కోరును సమం భారత మహిళల జట్టు ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు ఎనిమిదో రౌండ్లో అమ్మాయిల జట్టు పోలండ్ చేతిలో ఓడింది. దీంతో ఏడురౌండ్ల దాకా అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టుకు ఈ టోరీ్నలో తొలిసారి ఓటమి ఎదురైంది. ఉత్తమ ఆటగాళ్లుగా కార్ల్సన్, పోల్గర్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తమ శతాబ్ది ఉత్సవాలను బుడాపెస్ట్‌లోనే ఘనంగా నిర్వహించింది. ‘ఫిడే 100’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఒలింపియాడ్‌లో ఎనిమిదో రౌండ్ పోటీలు ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. తమ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని మొత్తం 18 కేటగిరీల్లో ‘ఫిడే’ అవార్డులు అందజేసింది. శతాబ్ది అత్యుత్తమ ఆటగాళ్లుగా పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్, మహిళల విభాగంలో జూడిత్ పోల్గర్ ఎంపికయ్యారు. కార్ల్సన్ క్లాసిక్ విభాగంలో ఐదు సార్లు, ర్యాపిడ్ విభాగంలో ఐదు సార్లు, బ్లిట్జ్ విభాగంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యుత్తమ రేటింగ్ (2882) సాధించిన ఘనత కార్ల్సన్ సొంతం. మహిళల చెస్‌కు సుదీర్ఘ కాలం చిరునామాగా నిలిచిన పోల్గర్ 15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ అయింది. 12 ఏళ్లకే టాప్–100 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పోల్గర్ 2700 రేటింగ్ దాటిన ఏకైక మహిళ. -
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. హెడ్‌కోచ్‌కు గుండె పోటు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్‌లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.అసలేం జరిగిందంటే?ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. -
Bengaluru: మొబైల్ ఫోన్ కోసం విదేశీ మహిళ హత్య
బెంగళూరు: ఉజ్బెకిస్తాన్ మహిళ జరీనా(37) హత్య కేసులో రాబర్ట్, అమృత్ సోను అనే ఇద్దరిని బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్, విదేశీ కరెన్సీ కోసమే జరీనాను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. హోట్‌ల్ సీసీటీవీ కెమరాల ఫుటేజిని పరిశీలించి కేసును పోలీసులు చేధించారు. బెంగళూరులోని జగదీష్ హోటల్లో జరీనా బుధవారం హత్యకు గురైంది. హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితులిద్దరు జరీనా స్టే చేసిన హోటల్లోనే హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. నిందితులిద్దరూ అస్సోంకు చెందిన వారే. జరీనాను హత్య చేసిన అనంతరం రూమ్ లాక్ చేసి వీరిద్దరూ కేరళ పారిపోయారు. విచారణసమయంలో ఉజ్బెకిస్తాన్ కరెన్సీని పోలీసులు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి.. ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ రాకెట్ -
బెంగళూరు హోటల్లో ఉజ్బెక్ మహిళ హత్య
బనశంకరి: బెంగళూరులోని ఓ హోటల్లో విదేశీ మహిళ హత్యకు గురయ్యారు. శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా (37) వ్యాపార వీసాపై నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం శేషాద్రిపురంలో ఓ హోటల్ రెండో అంతస్తు గదిలో బస చేశారు. బుధవారం రాత్రి 10:30 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచి్చన హోటల్ సిబ్బంది మాస్టర్ కీ ద్వారా తెలుపు తెరిచారు. లోపల చూడగా జరీనా విగతజీవిగా కనిపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ, సెల్ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
నేటి నుంచి ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ
ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు భారత చెస్ క్రీడాకారులు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఉజ్బెకిస్తాన్లోప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 18 మంది, మహిళల విభాగంలో 11 మంది బరిలోకి దిగుతున్నారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిల నుంచి పతకాలు ఆశించవచ్చు. -
ఉజ్బెకిస్తాన్ గడ్డపై తెలంగాణ బిడ్డల సత్తా
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్‌షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విఘ్నేశ్ అద్వైత్ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్‌లో యశ్వి జైన్ కాంస్యం పతకం సొంతం చేసుకుంది. -
రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
మాస్కో: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దుండగులు ఫోన్ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారిమళ్లించారు. అజూర్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి సమయంలో బయల్దేరింది. అయితే ఇందులో బాంబు అమర్చినట్లు గోవా దబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12:30 గంటలకు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానం భారత గగనతలంలోకి ప్రవేశించకముందే ఉబ్జెకిస్తాన్‌కు మళ్లించారు. ఇలా జరగకపోయి ఉంటే విమానం ఉదయం 4:15 గంటలకు గోవాలో ల్యాండ్ అయ్యేది. చదవండి: అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కూడా కవర్లా? -
భారత్‌కు చెందిన ఆ రెండు దగ్గు మందులు వాడకండి.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!
చిన్న పిల్లల కోసం భారత్‌లో తయారైన రెండు దగ్గు మందులు(సిరప్స్) వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్ మందుల్లో విషపూరితమైన ఇథిలీన్ ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఈ క్రమంలో చిన్నారులకు ఈ సిరప్స్ ఇవ్వకూడదని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, గతేడాది డిసెంబర్లో ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారులు ఆకస్మికంగా మృతిచెందారు. వారికి మృతికి డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. దీంతో, అప్రమత్తమైన ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం.. మందులను ల్యాబ్‌లో పరిశీలించగా వాటిలో విషపూరితాలు ఉన్నట్టు గుర్తించింది. దగ్గు మందులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. అనంతరం, ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో దృష్టికి తీసుకువెళ్లింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది. దీంతో, డబ్ల్యూహెచ్‌తో సైతం వీటిని వాడరాదంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో కూడా భారత్ చెందిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లల మరణించారు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల వల్లే వారు మృతిచెందినట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీంతో, ఆ ముందులను కూడా వాడరాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. "Substandard": WHO Alert On 2 Indian Syrups After Uzbekistan Child Deaths https://t.co/SKxgzPbNy0 NDTV's Vedanta Agarwal reports pic.twitter.com/JMzxKEpZBE — NDTV (@ndtv) January 12, 2023 -
ఏదడిగినా దగ్గుతున్నాడ్సార్!
ఏదడిగినా దగ్గుతున్నాడ్సార్! -
SCO Summit 2022: యుద్ధాన్ని ముగించండి
సమకాలీన ప్రపంచంలో యుద్ధాలకు తావు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. ఎస్ఈఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. ‘‘ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం నేడు వర్ధమాన దేశాలకు అతి పెద్ద సమస్య. వీటికి వెంటనే పరిష్కారం కనిపెట్టేందుకు మీరు కృషి చేయాలి’’ అని పుతిన్‌కు సూచించారు. యుద్ధంపై భారత్ వైఖరిని, ఆందోళనను అర్థం చేసుకోగలనని పుతిన్ బదులిచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ, పుతిన్ సమావేశమవడం ఇదే తొలిసారి. చర్చలు అద్భుతంగా సాగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘‘వర్తకం, ఇంధనం, రక్షణ వంటి పలు రంగల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకొచ్చాయి’’ అని వివరించారు. రష్యాతో బంధానికి భారత్ ఎంతో ప్రాధాన్యమిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారంతో 72వ ఏట అడుగు పెడుతున్న మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రేపు నా ప్రియమిత్రుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రష్యా సంప్రదాయంలో ముందుగా శుభాకాంక్షలు చెప్పరు. అయినా మీకు, భారత్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్ మరింత అభవృద్ధి చెందాలి’’ అని ఆకాంక్షించారు. గత డిసెంబర్లో తన భారత పర్యటన తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. -
Shanghai Cooperation Organisation: అనుసంధానమే బలం
సమర్ఖండ్: షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల నడుమ అనుసంధానం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. లక్ష్యాల సాకారానికి మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాల విషయంలో పరస్పరం పూర్తి హక్కులు కల్పించడం ముఖ్యమన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో శుక్రవారం ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం దేశాలతో మధ్య రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే విశ్వసనీయమైన, ప్రభావవంతమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్లను అభివృద్ధికి సభ్యదేశాలన్నీ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా 7.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య మరింత సహకారం, పరస్పర విశ్వాసానికి భారత్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి ప్రపంచదేశాల్లో ఆహార భద్రత సంక్షోభంలో పడిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీనికి ఆచరణీయ పరిష్కారముంది. తృణధాన్యాల సాగును, వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. తృణధాన్యాల సాగు వేల ఏళ్లుగా ఉన్నదే. ఇవి చౌకైన సంప్రదాయ పోషకాహారం. మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి’’ అన్నారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి మోడల్ ‘‘కరోనాతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అవి తిరిగి కోలుకోవడంలో ఎస్సీఓ పాత్ర కీలకం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచ జీడీపీలో ఎస్సీఓ వాటా 30 శాతం. జనాభాలో 40 శాతం’’ అన్నారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిభావంతులైన యువత వల్ల ఇండియా సహజంగానే ప్రపంచదేశాలకు పోటీదారుగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధితో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదగబోతున్నామని వివరించారు. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని, తమ అభివృద్ధి మోడల్‌కు ప్రజలే కేంద్రమని తెలిపారు. ప్రతి రంగంలో నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నామని, ఇండియాలో ప్రస్తుతం 70,000కు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇండియా సంపాదించిన అనుభవం ఎస్సీఓలోని ఇతర దేశాలు సైతం ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌పై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని చెప్పారు. ప్రపంచానికి భారత్ గమ్యస్థానం మెడికల్, వెల్నెస్ టూరిజంలో ప్రపంచానికి భారత్ గమ్యస్థానంగా మారిందని మోదీ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం తమదేశంలో పొందవచ్చని తెలిపారు. ఇక భారత్ సారథ్యం రొటేషన్ విధానంలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల ఎస్సీఓ సారథ్యం ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్ చేతికి వచ్చింది. 2023లో ఎన్సీఓ శిఖరాగ్రానికి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తామని ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకట్ మిర్జియోయెవ్ చెప్పారు. ఆయనతో కూడా మోదీ భేటీ అయ్యారు. పలకరింపుల్లేవ్.. కరచాలనాల్లేవ్ న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో ఎస్సీవో సదస్సుకు హాజరైన భారత్ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. శుక్రవారం ఒకే వేదికపైన ఫొటోల కోసం మిగతా నేతలతో కలిసి పక్కపక్కనే నిలబడిన సమయంలోనూ ఒకరినొకరు పట్టనట్లుగా వ్యవహరించారు. చిరునవ్వుతో పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోలేదు. గల్వాన్ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం తెలిసిందే. అప్పటినుంచి వారు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. అమెరికాపై జిన్‌పింగ్ విమర్శలు ‘‘కొన్ని శక్తులు ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ భావజాలం, ఏకపక్ష పోకడలు ప్రదర్శిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను విచ్ఛిన్నం చేయజూస్తున్నాయి’’ అని అమెరికానుద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమర్శలు గుప్పించారు. వాటిపట్ల ఎస్సీఓ సభ్యదేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రక్షణ సహా అన్ని రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం సభ్య దేశాలకు చెందిన 2,000 మంది సైనిక సిబ్బందికి చైనాలో శిక్షణ ఇస్తాం. ఉమ్మడి అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసుకుందాం’’ అంటూ ప్రతిపాదించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు తదితరాల కోసం వర్ధమాన దేశాలకు 105 కోట్ల డాలర్ల మేరకు సాయం అందిస్తామని ప్రకటించారు. -
చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్, నో షేక్‌హ్యండ్
సమర్ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో ఫాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించారు. గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. అయితే చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ దూరం దూరంగా ఉన్నారు. వేదికపై ఫోటో దిగే సమయంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే నిల్చున్నప్పటికీ కనీసం నవ్వలేదు. ఇరువురు కరచాలనం(షేక్‌హ్యండ్) కూడా చేసుకోలేదు. శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం వ్యవహరించిన దూరం చూస్తుంటే భారత్-చైనా సరిహద్దు వివాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార-వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా 2020లో మయన్మార్ పర్యటన అనంతరం జిన్‌పింగ్ కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం కూడా ఇదే తొలిసారి. చదవండి: ‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’ -
SCO Summit: ప్రధాని మోదీ కీలక భేటీపై ఉత్కంఠ
సమర్ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ తదితర నేతలు హాజరుకానున్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీ అక్కడకు చేరుకున్నారు. ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార–వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కాత్ మిర్జీయోయెవ్‌తోపాటు ఇతర దేశాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం ఉజ్బెకిస్తాన్‌కు బయలుదేరడానికి ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిన్‌పింగ్, పుతిన్ సమావేశం చైనా, రష్యా అధినేతలు షీ జిన్‌పింగ్, పుతిన్ గురువారం సమర్ఖండ్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రష్యాకు జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామన్నారు. సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ సిటీకి చేరుకున్నారు. శుక్రవారం జరిగే సదస్సులో ఆయన పాలుపంచుకుంటారు. ఇదీ చదవండి: పాక్‌కు తాలిబన్ల కౌంటర్ -
ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్!
బీజింగ్: చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. జిన్‌పింగ్ 2020 జనవరిలో మయన్మార్ పర్యటన తర్వాత కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ సభ్యదేశాలు. ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇంకోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. ఈ తరుణంలో ఆంక్షల నడుమ ఉన్న రష్యా ఈ భేటీలో పాల్గొనడం, ఇంకోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. భారత్ తరపున ప్రధాని మోదీ సైతం పాల్గొనబోతుండడంతో.. జిన్‌పింగ్‌తో భేటీ అవుతారా? అనే విషయంపైనా ఓ సంగ్దిగ్ధత నెలకొంది. ఇదీ చదవండి: ప్రజల్ని బెదిరిస్తారా? ఏం తమాషాగా ఉందా? -
ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!!
కన్నపేగు మమకారం మరిచిన ఆ తల్లి.. కర్కకశంగా వ్యవహరించింది. మూడేళ్ల బిడ్డను నిర్దాక్షిణ్యంగా ఎలుగుబంటి బోనులోకి విసిరేసింది. పదహారు అడుగుల లోపలికి పడిపోయిన ఆ బిడ్డ తలకు గాయమై.. స్పృహ కోల్పోయింది. అందరూ అరుస్తుండగా.. ఆ బిడ్డ వైపు వెళ్లింది ఓ ఎలుగుబంటి. మరి ఆపై ఏం జరిగిందంటే.. కన్నబిడ్డను చేజేతులారా చంపాలని ప్రయత్నించింది ఓ తల్లి. తాష్కెంట్ జూలో ఎలుగు బంటి ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లి.. తన బిడ్డను అందులోకి విసిరేసింది. అప్పటికే ఆమె చేష్టలు అనుమానంగా ఉండడంతో పక్కనే ఉన్న సందర్శకులు, జూ సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, హఠాత్తుగా ఆమె ఆ చిన్నారిని విసిరేసింది. ఆ ఎన్‌క్లోజర్ పదహారు అడుగుల లోతు ఉండడంతో.. కింద పడ్డ బిడ్డ తలకు గాయమైంది. ఇంతలో జూజూ అనే ఎలుగుబంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి వాసన చూసింది. కానీ, అదృష్టవశాత్తూ ఏం చేయకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో ఆరుగురు జూ సిబ్బంది ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. ఆ ఎలుగు బంటిని మళ్లీ బిడ్డ దగ్గరికి వెళ్లనీయకుండా.. దారి మళ్లించారు. ఆపై బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేయగా.. బిడ్డ ప్రాణం తీసేంత కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. హత్యాయత్నం కింద నేరం రుజువైతే ఆమెకు పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉంది. Have You Seen This?#Tashkent, #Uzbekistan A girl survives after her mom recklessly placed her child over the security fence and she fell into a bear sanctuary at #TashkentZoo. The brown bear #Zuzu, slowly approached the girl, sniffed and walked away. pic.twitter.com/dXCZwo8YVa — Geovanni Villafañe (@RezZureKtedPoeT) January 31, 2022 -
మధ్యాసియాలో విద్యుత్ సంక్షోభం
మాస్కో: మధ్యాసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ల్లో మంగళవారం విద్యుత్ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. టర్కిస్తాన్‌లోని కొన్ని నగరాల్లో సైతం ఈ సంక్షోభం కనిపించింది. ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్ సరఫరా అంతరాయంతో పలు పౌర సేవలు నిలిచిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు చీకట్లో మగ్గిపోయారు. ఈ అంతరాయానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కజకిస్తాన్‌లో పవర్‌లైన్ ఫెయిల్యూర్ ఇందుకు కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ మూడు దేశాలు వన్ పవర్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం కారణంగా తాష్కెంట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?) -
ఉజ్బెకిస్తాన్‌లో కూలిన అఫ్గన్ మిలిటరీ విమానం
తాష్కెంట్: అఫ్గనిస్తాన్‌కు చెందిన మిలిటరీ విమానం ఉజ్బెకిస్తాన్‌లో కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ మేరకు ఉజ్బెకిస్తాన్ రక్షణశాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. అఫ్గనిస్తాన్‌కు సమీపంలో గల సర్జోదార్యో ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. ‘‘అఫ్గనిస్తాన్ సైన్యానికి చెందిన విమానం ఉజ్బెకిస్తాన్‌లో అక్రమంగా ప్రవేశించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది’’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి అంతర్జాతీయ మీడియా(ఏఎఫ్‌పీ)కు వెల్లడించారు. విమానం కూలిపోయిన ఘటన గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. కాగా తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు అఫ్గాన్లు, విదేశీయులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక కొంతమంది సైనికులు సైతం సరిహద్దులు దాటి ఉజ్బెకిస్తాన్‌లో ప్రవేశించారు. వైద్య సహాయం కోసం అక్కడి వారిని అర్థించారు. ఈ నేపథ్యంలో 84 మంది అఫ్గన్ సైనికులను ఉజ్బెకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని తిరిగి అప్పగించే విషయమై అఫ్గన్లతో చర్చలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. చదవండి: Afghanistan: తాలిబన్ల గుప్పిట్లో అఫ్గనిస్తాన్.. చైనా కీలక ప్రకటన -
శ్రీహరి నటరాజ్‌కు స్వర్ణం
తాష్కెంట్: ఉజ్బెకిస్తాన్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ల పతకాల వేట కొనసాగుతోంది. గురువారం భారత్‌కు ఎనిమిది పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉంది. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 20 ఏళ్ల తమిళనాడు స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ స్వర్ణం గెలిచాడు. అతను 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే శ్రీహరి 0.22 సెకన్లతో టోక్యో ఒలింపిక్స్ ‘ఎ’ గ్రేడ్ అర్హత ప్రమాణాన్ని (53.85 సెకన్లు) కోల్పోయాడు. 2019 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో శ్రీహరి టోక్యో ఒలింపిక్స్ గ్రేడ్ ‘బి’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. గ్రేడ్ ‘ఎ’ ప్రమాణం ఉంటే నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఒకవేళ గ్రేడ్ ‘ఎ’ కోటాలో ఖాళీలు మిగిలితే గ్రేడ్ ‘బి’ సమయం నమోదు చేసిన వారికి అవకాశం లభిస్తుంది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మానా పటేల్ (1ని:04.47 సెకన్లు) బంగారు పతకాన్ని గెల్చుకుంది. సువన భాస్కర్ ఖాతాలో రజతం చేరింది. పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో సజన్ ప్రకాశ్ (3ని:56.03 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఈ టోర్నీలోని సజన్‌కిది మూడో స్వర్ణం కావడం విశేషం. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో శివాని కటారియా స్వర్ణం పొందగా... మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చాహత్ అరోరా బంగారు పతకాన్ని ౖకైవసం చేసుకుంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో లిఖిత్, ధనుశ్ వరుసగా రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. -
పని పూర్తి
‘రాంగీ’ చిత్రం కోసం ఉబ్జెకిస్తాన్‌కు మళ్లీ వెళ్లారు హీరోయిన్ త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ త్రిష ఉబ్జెకిస్తాన్‌కు వెళ్లింది ‘రాంగీ’ సినిమాలో తన పాత్రలో మిగిలిన చిన్న భాగం చిత్రీకరణ కోసమే. దీంతో ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన పని పూర్తయిందని పేర్కొన్నారు త్రిష. ఎ మ్. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’ (వర్కింగ్ టైటిల్), మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’ చిత్రాలతో పాటు ఎప్పటిలాగే కొన్ని తమిళ ప్రాజెక్ట్స్‌తో ఈ ఏడాది కూడా తీరిక లేకుండా ఉన్నారు త్రిష. -
సెక్స్ రాకెట్; ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్
ముంబై: సెక్స్ రాకెట్ నడుపుతున్న బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ ఒకరిని అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. జుహు సబర్బన్‌లోని జెడ్ లగ్జరీ రెసిడెన్సీ హోటల్‌పై సోషల్ సర్వీస్(ఎస్ఎస్) అధికారులు దాడి చేసి బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్ కుమార్ లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ నుంచి ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను కాపాడారు. లాల్ సహకారంతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా అనే మహిళ ఈ రాకెట్‌ను నడిపిస్తోందని పోలీసులు వెల్లడించారు. విదేశాల నుంచి మహిళలను ముంబైలోని స్టార్ హోటల్స్‌కు పంపిస్తూ ఒక్కొక్క కస్టమర్ నుంచి రూ.80 వేలకు వసూలు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద లాల్‌పై కేసు నమోదు చేశారు. జరీనాను ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. -
పవర్ ఫుల్ రాంగీ
‘రాంగీ’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో త్రిష కనిపించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో స్టంట్స్ అన్నీ స్వయంగా త్రిషానే చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం బులెట్ నడపడం కూడా నేర్చుకున్నారట. యం. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ కానుంది. -
చలో ఉజ్బెకిస్తాన్
సామాన్లు సర్దుకుని ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ త్రిష. ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారనుకుంటే మాత్రం పొరపాటే. ‘రాంగి’ సినిమా కోసం త్రిష ఫ్లైట్ ఎక్కనున్నారు. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘రాంగి’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం విశేషం. ఇటీవల చెన్నైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో ప్లాన్ చేశారు టీమ్. అక్కడ త్రిషపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో త్రిష పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక త్రిష నటించిన ‘పరమపదమ్ విలయాట్టు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే హీరోయిన్ సిమ్రాన్‌తో కలిసి త్రిష ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమంత్ దర్శకుడు. -
100వ టైటిల్ వేటలో...
మెల్బోర్న్: కెరీర్లో 100వ ఏటీపీ టైటిల్ సొంతం చేసుకునే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగుతున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు సులువైన ‘డ్రా’ ఎదురైంది. 2019లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ గురువారం విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్‌తో తలపడతాడు. 2017, 2018 సహా ఫెడెక్స్ ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టైటిల్ నెగ్గాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 99వ స్థానంలో ఉన్న ఇస్టోమిన్‌కు 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో నొవాక్ జొకోవిచ్‌కు ఓడించిన రికార్డు ఉంది. అంచనాల ప్రకారమే అన్ని మ్యాచ్‌లు సాగితే ఫెడరర్, రాఫెల్ నాదల్ మధ్య సెమీ ఫైనల్ పోరు జరుగుతుంది. గత ఏడాది ఫెడరర్ చేతిలో ఫైనల్లో ఓడిన మారిన్ సిలిచ్‌తో పాటు బెర్నార్డ్ టామిక్, ఆండీ ముర్రే కూడా ఒకే పార్శ్వంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ లభించింది. అయితే జొకోవిచ్ ‘డ్రా’ మాత్రం కాస్త కఠినంగా ఉంది. రెండో రౌండ్లోనే అతను విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఎదుర్కోవాల్సి రావచ్చు. జపాన్ స్టార్, ఇటీవలి బ్రిస్బేన్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్న కి నిషికోరి కూడా అతని పార్శ్వంలోనే ఉండటం నంబర్‌వన్‌కు కఠిన పరీక్షగా మారనుంది. 2018లో అద్భుతంగా ఆడి వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకోవడంతో పాటు నంబర్‌వన్‌గా నిలిచిన జొకోవిచ్ ఖాతాలో కూడా ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్లు ఉన్నాయి. కెరీర్లో ఒకే ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు ప్రిక్వార్టర్ వరకు ఇబ్బంది లేకపోయినా క్వార్టర్స్‌లో వింబుల్డన్ రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే ప్రమాదం ఉంది. తొలి రౌండ్లో నాదల్...ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ఎంట్రీ జేమ్స్ డక్‌వర్త్‌ను ఎదుర్కొంటాడు. సొంతగడ్డపై ఆడనున్న అన్‌సీడెడ్ నిక్ కిర్గియోస్, 16వ సీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా) మధ్య జరిగే ఆసక్తికర మ్యాచ్‌తో సోమవారం నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు తెర లేవనుంది. అలీసన్ వాన్తో వోజ్నియాకీ పోరు... మహిళల విభాగంలో ఎనిమిదో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఆశిస్తున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ విజయమార్గం అంత సులువుగా లేదు. ఈ టోర్నీలో ఆమె 16వ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్లో తత్జానా మారియా (జర్మనీ)ను ఎదుర్కోనున్న సెరెనా ప్రిక్వార్టర్స్‌లోనే వరల్డ్ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా)తో తలపడే అవకాశం ఉంది. అంతకు ముందు రెండో రౌండ్ ప్రత్యర్థి బౌచర్డ్ (కెనడా)నుంచి కూడా సెరెనాకు ఇబ్బంది తప్పకపోవచ్చు. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వోజ్నియాకీ (డెన్మార్క్) తన మొదటి పోరులో అలీసన్ వాన్ (బెల్జియం)ను ఎదుర్కొంటుంది. మూడో రౌండ్లో మారియా షరపోవా (రష్యా)ను ఆమె ఎదుర్కోవాల్సి రావచ్చు. -
భారత్–ఉజ్బెకిస్తాన్ల మధ్య 17 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకఘట్టం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ రక్షణ, వైద్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ సహా 17 కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రసుత్తం భారత పర్యటనలో ఉన్న మిర్జియోయెవ్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే రక్షణ, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మేం పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. దీర్ఘకాల ప్రయోజ నాల దృష్ట్యా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. శాంతియుత, ప్రజాస్వామ్య, సుసంపన్న అఫ్గానిస్తాన్తోనే అందరికీ లాభం కలుగుతుంది’ అని ఈ విషయంలో సహకరించుకోవాలని భారత్, ఉజ్బెకిస్తాన్‌లో ఓ అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు. -
అపోలో ఘనత: 32 ఏళ్ల తర్వాత కూర్చొంది
సాక్షి, న్యూఢిల్లీ : జీవితమంతా నిలబడే బ్రతకాల్సి వస్తే?. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటాం. ప్రమాదవ శాత్తు తన ఐదవ ఏట అగ్ని ప్రమాదం బారిన పడిన ఓ మహిళ గత 32 ఏళ్లుగా నిల్చొనే ఉంటున్నారు. నిల్చొవడం లేదా పడుకోవడం మినహా ఆమె గత 32 ఏళ్లుగా కూర్చొనేలేదు. అలాంటి వ్యక్తిని కూర్చొనేలా చేసి ఆమె మొహంలో నవ్వులు పూయించారు ఢిల్లీ వైద్యులు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన గుల్నోరా రాపిఖోవా(37) కథ ఇది. ఒక రోజు ఇంట్లోని స్టవ్ దగ్గర నిల్చున్నప్పుడు గుల్నోరా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. మంటలతోనే ఆమె బయటకు పరిగెత్తింది. ఇరుగూ పొరుగు వారు చూసి మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో గుల్నోరాకి తొడల కింద భాగం తీవ్రంగా కాలిపోయింది. దాదాపు 18 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంది. ఈ సమయంలో దాదాపు ఐదు సార్లు శస్త్ర చికిత్సలు జరిగాయి. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆమె కూర్చోలేకపోయారు. అధైర్యపడని గుల్నోరా అలానే పాఠశాలకు వెళ్లి నిల్చొని పాఠాలు వినేవారు. అదృష్టవశాత్తు ఈ ఏడాది మేలో తాష్కెంట్లో అపోలో వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గుల్నోరా వచ్చారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు అంగీకరించారు. ఓ మానవతావాది సాయంతో గుల్నోరా చికిత్సకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వచ్చారు. తాష్కెంట్ నుంచి న్యూఢిల్లీకి వచ్చే విమానంలో సైతం ఆమె నిల్చొనే వచ్చారు. 10 నుంచి 15 ఏళ్ల కంటే ఎక్కువకాలం ఉండే గాయాలు క్యాన్సర్స్‌గా మారే ప్రమాదం ఉండటంతో గుల్నోరాకు పలుమార్లు బయాప్సీ పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ణయించుకున్న తర్వాత శరీరంలోని వేరే భాగాల నుంచి కొంత కండను తీసి గాయాలైన చోట్ల అమర్చారు. నెల రోజులకు పూర్తిగా కోలుకున్న గుల్నోరా కూర్చొగలిగారు. అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తాను కూర్చొగలుగుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పానని, తనని చూస్తేగానీ వారు ఈ విషయం నమ్మలేరని గుల్నోరా అన్నారు. -
అమనగల్లులో విదేశీ యువతి ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : వ్యభిచారం కేసులో పట్టుబడిన ఓ విదేశీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలల క్రితం ఉబ్జెకిస్తాన్‌కు చెందిన వర్ఫాలియా జుళ్ఫియాస్ అనే యువతిని పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సదరు యువతికి కౌన్సిలింగ్ నిర్వహించిన కోర్టు పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించాలంటూ ఆదేశించింది. దీంతో వర్ఫలియాను ఆమనగల్లుకు సమీపంలోని ప్రజ్వల మహిళా పునరావాస కేంద్రంలో ఉంచారు. అయితే శనివారం ఆకస్మికంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. దీనిపై పునరావాస నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. -
బస్సులో మంటలు : 52 మంది మృతి
-
బస్సులో మంటలు : 52 మంది దుర్మరణం
కజకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం అలమటీ : కజకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 52 మంది మృతిచెందారు. కజకిస్తాన్‌లో అక్టావులోని ఇర్గిజ్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కజకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులందరూ ఉజ్జేకిస్తాన్‌కు చెందినవారుగా సమాచారం. బస్సు రష్యాకు వెళ్తుండగా, లేదా రష్యా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
యురేనియం దిగుమతులపై భారత్ దృష్టి
అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో భారత్ కూడా యురేనియం నిల్వలపై దృష్టి సారించింది. ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్న దశలో.. భవిష్యత్ అవసరా దృష్ట్యా ఇతర దేశాల నుంచి యురేనియాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్ సమాయత్తమవుతోంది. అదే సమయంలో అణువిద్యుత్ అవసరాల కోసమూ.. యురేనియం నిల్వలు పెంచుకోవడం భారత్‌కు తప్పనిసరి. సాక్షి, న్యూఢిల్లీ : యురేనియం నిల్వలను పెంచుకునేదిశగా భారత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఉబ్జెకిస్తాన్ సహా ఇతర దేశాల నుంచి యురేనియం నిల్వలను దిగుమతి చేసుకునేందుకు భారత్ సమాయాత్తమవుతోంది. యురేనియం నిల్వలు పెంచుకోవడం అనేది.. భారత్‌కు దీర్ఘకాలంలో భద్రతను పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని అణు రియాక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి.. భవిష్యత్ అవసరాలకు, ఇతర కారణాల వల్ల యురేనియం నిల్వలను వ్యూహాత్మకంగా పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా రాబోయే ఐదేళ్లకు సరిపడా యురేనియాన్ని నిల్వ చేసుకోవాలని.. అప్పుడే మన రియాక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేయగలవని.. నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ అవసరాలే..! యురేనియం విషయంలో 1974 నాటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం ప్రధానం. అప్పట్లో పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడంతో.. యురేనియంపై అంతర్జాతీయంగా ఆంక్షలు వెల్లువెత్తాయి. యురేనియం సరిపోక రియాక్టర్లు మూతపడ్డాయి. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు తలెత్తకూడదనే నిల్వలను మరింత పెంచుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఉబ్జెకిస్తాన్ నుంచి.. యురేనియం అమ్మకం కొనుగోళ్ల గురించి ప్రస్తుతం భారత్.. ఉబ్జెకిస్తాన్‌తో చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఉబ్జెకిస్తాన్ బృందం ఒకటి.. గత నెల్లో భారత్‌లో పర్యటించింది. రెండునెలల కిందట షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ.. ఉజ్బెక్ అధ్యక్షుడు షవాకత్ మిర్జయోవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో ప్రధానంగా యురేనియం దిగుమతి గురించి చర్చించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో అనాసక్తి.. ఇప్పుడు ఆసక్తి గతంలో ఉబ్జెకిస్తాన్ మనకు యురేనియం ఎగుమతి చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించలేదు. అయితే జాతీయంగా, అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో నేడు యురేనియాన్ని ఎగుమతి చేసేందుకు ఉజ్బెక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా యురేనియాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉజ్బెకిస్తాన్ ఏడో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం భారత్ ఖజకిస్తాన్, కెనడాల నుంచి అత్యధికంగా యురేనియాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఉజ్బెక్ నుంచి యురేనియం వస్తే..! ఉజ్బెకిస్తాన్ నుంచి యురేనియం దిగముతి అయితే.. భారత్‌కు చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. ప్రధానంగా నాణ్యమైన యురేనియం లభించడంతో పాటు.. రవాణా ఖర్చులు తగ్గుతాయి. అదే సమయంలో భారత్ కొత్తగా చేపట్టిన 7 వేల మెగావాట్ల అణువిద్యుత్ ప్లాంట్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఇప్పటికే పనిచేస్తున్న 22 అణు రియాక్టర్ల కెపాసిటీని మరింత పెంచుకోవడం సాధ్యమవుతుంది. -
ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్‌కు భారత్
► డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ జంట విజయం ► ఉజ్బెకిస్తాన్‌పై భారత్‌కు 3–0 ఆధిక్యం బెంగళూరు: అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న... అరంగేట్రం చేసిన శ్రీరామ్ బాలాజీ జోడీ కుదిరింది. వీరిద్దరూ ఆద్యంతం సమన్వయంతో రాణించి అదరగొట్టారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోటీలో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ప్రపంచకప్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధిం చింది. ఈ ఏడాది సెప్టెంబరులో వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ ద్వయం 6–2, 6–4, 6–1తో దస్తోవ్–ఫెజీవ్ జంటపై గెలిచింది. తమ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ భారత జంటకు పోటీ ఎదురుకాలేదు. తన కెరీర్లో తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన బాలాజీ సర్వీస్ అద్భుతంగా చేయడంతోపాటు నెట్ వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. మరో వైపు అపార అనుభవజ్ఞుడైన బోపన్న శక్తివంతమైన సర్వీస్‌లు చేయడంతోపాటు సింగిల్ హ్యాండెడ్ రిటర్న్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ మొత్తంలో భారత జంట 16 ఏస్‌లు సంధించడం విశేషం. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
రెజ్లింగ్‌లో వివాదం...
రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల చివరి రోజు డ్రామా జరిగింది. ఇఖ్తియోర్ నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్), మండక్‌నరన్ గన్‌జోరిగ్ (మంగోలియా) మధ్య పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో ఈ వివాదం చోటు చేసుకుంది. నిర్ణీత సమయం పూర్తికావడానికి మూడు సెకన్లు ఉందనగా 7-6తో ఆధిక్యంలో ఉన్న గన్జోరింగ్ తన విజయం ఖాయమైందనుకొని విజయ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఉజ్బెకిస్తాన్ రెజ్లింగ్ కోచ్ రివ్యూ కోరడం... వారు నవ్రుజోవ్కు రెండు పాయింట్లు ప్రదానం చేసి అతను 8-7తో గెలిచినట్లు ప్రకటించడంతో మంగోలియా రెజ్లర్ గన్‌జోరిగ్, అతని కోచ్‌లు ఆశ్చర్యపోయారు. తమకు అన్యాయం జరిగిందని మ్యాట్‌పైనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగోలియాకు చెందిన ఇద్దరు కోచ్‌లు తమ ట్రాక్ సూట్‌ను, బూట్లు విప్పేసి మ్యాట్‌పై విసిరేశారు. బౌట్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రిఫరీ వారిద్దరికీ రెడ్ కార్డు చూపెట్టారు. నవ్రుజోవ్ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు ఫ్రాంక్లిన్ గోమెజ్ (పోర్టోరికో), నవ్రుజోవ్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్ కూడా వివాదాస్పదమైంది. నవ్రుజోవ్కు అనుకూల ఫలితం వచ్చేలా రిఫరీలు తెమో కజారష్విలి (జార్జియా), టాంగ్ కున్ చుంగ్ (కొరియా), నొవకోస్కీ (రష్యా) వ్యవహరించారని అనుమానిస్తూ రిఫరీ కమిషన్ చైర్మన్ అంటోనియా సిల్వెస్ట్రి (జర్మనీ) ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ
తాష్కెంట్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం చైనా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. రెండురోజుల పాటు జరుగనున్న ఎస్సీవో సమ్మిట్ (షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్)లో పాల్గొనేందుకు ఆయన ఇవాళ తాష్కెంట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ...చైనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. అంతకు ముందు ఉజ్బెకిస్థాన్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ ట్విట్ చేశారు. 'స్నేహపూరిత దేశానికి మరోసారి రావటం సంతోషకరం. ఎస్సీవో సమ్మిట్‌లో పలువురు నేతలతో సమావేశం అవుతాను' అని మోదీ ట్విట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉజ్బెకిస్థాన్ ప్రధాని షౌకత్ మీర్జియోయెవ్తో కలిసి దిగిన ఫోటోను మోదీ పోస్ట్ చేశారు. ఈ సమ్మిట్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, చైనా, రష్యా,కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. దేశాల మధ్య శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, తీవ్రవాదం అణచివేత, రక్షణ రంగానికి సంబంధించిన చర్యలపై సమ్మిట్‌లో కీలక చర్చలు జరుపనున్నారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా భేటీ కానున్నారు. న్యూక్లియార్ సప్లై గ్రూప్ దేశాల సమావేశం కూడా రేపటి నుంచే సియోల్‌లో ప్రారంభం అవుతుండటంతో మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం అమెరికాతో పాటు రష్యా తదితర దేశాలు మద్దతిస్తున్నా చైనా వ్యతిరేకిస్తోందనే వార్తలు వస్తుండటంతో మోదీ పర్యటన కీలకం కానుంది. -
ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు
థష్కెంత్లో : ఈజిప్టుకు చెందిన ఎయిర్ లైన్స్ విమానం బుధవారం ఉబ్జెకిస్తాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ంగ్కు సూచించినట్లు కజిక్ మీడియా వెల్లడించింది. విమానం కైరో నుంచి బీజింగ్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఉబ్జెక్ ఎయిర్‌లైన్స్ ప్రెస్ సర్వీస్ ధ్రువీకరించింది. బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో ప్రయాణికులను దించివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానంలో 118 మంది ప్రయాణికులు, 17మంది విమాన సిబ్బంది ఉన్నారు. కాగా గత నెలలో 50 ప్రయాణికులతో వెళుతున్న ఈజిప్టు విమానం ఒకటి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తుండగా అదృశ్యం అయింది. ప్యారిస్ నుండి ఈజిప్టు రాజధాని కైరోకు తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఫెడ్ కప్‌లో భారత్ బోణీ
హువా హిన్ (థాయ్‌లాండ్): రెండు వరుస పరాజయాల తర్వాత ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఉజ్బెకిస్తాన్‌పై నెగ్గింది. అంకిత రైనా సింగిల్స్, డబుల్స్‌లో గెలవడం టీమిండియాకు కలిసొచ్చింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 6-1, 6-1తో సబీనా షరిపోవాపై; రెండో సింగిల్స్‌లో అంకిత 6-1, 6-0తో నిజినా అబ్డురామివాపై గెలిచారు. డబుల్స్‌లో అంకిత-సానియా 6-2, 6-0తో అగుల్ అమన్మురదోవా-అరినా ఫోల్ట్స్పై గెలవడంతో భారత్ విజయం పరిపూర్ణమైంది. -
మోదీ మధ్య ఆసియా పర్యటన
-
తాష్కెంట్ లో భారతీయులతో మోదీ భేటీ
ఉజ్బెకిస్థాన్ : విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో భారతీయులతో భేటీ అయ్యారు. అక్కడి ఎన్నారైలతో సమావేశం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భారతీయ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతానికి ఎనలేని ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. మనిషి వికాసంలో భాష కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భాష అన్ని ప్రాంతాలు, సంప్రదాయాలను కలుపుతుందన్నారు. 50 ఏళ్లుగా ఇక్కడి రేడియోల ద్వారా హిందీలో ప్రసారాలు జరగడం గొప్ప విషయమని, ఇది తనకు సంతోషాన్ని కలిగించిదని తెలిపారు. మనిషి హింసా మార్గం వైపు వెళ్లకుండా సంగీతం తోడ్పడుతుందన్నారు. ఆందోళనల నుంచి విముక్తికి, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం మంచి మార్గమని ప్రధాని సూచించారు. -
ఉజ్బెక్‌తో బంధం బలోపేతం
తాష్కెంట్లో కరిమోవ్‌తో మోదీ చర్చలు * ఇంధనం, రక్షణ, వాణిజ్యాల్లో మరింత సహకారం * మూడు ఒప్పందాలు.. * ఉగ్రవాదంపై ఆందోళన తాష్కెంట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య ఆసియా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్‌తో చర్చలు జరిపారు. అణు ఇంధనశక్తి, రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఉజ్బెక్ నుంచి భారత్‌కు యురేనియం సరఫరా చేయటం కోసం గత ఏడాది కుదుర్చుకున్న కాంట్రాక్టును అమలు చేసే మార్గాలపై చర్చించారు. ఇరు దేశాల ఇరుగు పొరుగుల్లో ఉగ్రవాదం పెరుగుతుండటంపై చర్చించారు. యుద్ధం వల్ల కల్లోలమైన అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితి సహా పలు ప్రాంతీయ అంశాలపై సమీక్షించారు. భారత్, రష్యా, ఇరాన్, యూరప్, మధ్య ఆసియాల మధ్య సరకు రవాణా కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ ప్రాజెక్టు గురించి కరిమోవ్‌కు మోదీ వివరించారు. ఆ ప్రాజెక్టులో ఉజ్బెక్ కూడా భాగస్వామిగా అయ్యే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. అలాగే.. ఉజ్బెకిస్తాన్, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఒమన్‌ల మధ్య ప్రయాణ ఒప్పందమైన అష్గాబాట్ అగ్రిమెంట్లో భారత్ కూడా చేరేందుకు ఉజ్బెక్ మద్దతివ్వాలని కోరారు. భేటీ తర్వాత రెండు దేశాల విదేశాంగ కార్యాలయాల మధ్య, సంస్కృతి, పర్యాటక రంగంలో సంబంధాలను బలోపేతం చేసే దిశగా మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం ఇరువురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఆసియాలో భారత్ ఉజ్బెక్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ తన పర్యటనను ఈ దేశం నుంచి మొదలుపెట్టానని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ద్వైపాక్షిక సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఈ ఏడాది సమావేశమవుతుందని చెప్పారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవటం తమ దేశ అత్యున్నత విదేశాంగ ప్రాధాన్యాల్లో ఒకటని కరిమోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వ డిమాండుకు ఉజ్బెకిస్తాన్ తన మద్దతును పునరుద్ఘాటించింది. మధ్య ఆసియా దేశాల పర్యటన షురూ మధ్య ఆసియాలోని ఐదు దేశాల పర్యటనతో పాటు రష్యాలో శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు మోదీ సోమవారం 8 రోజుల విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలి అడుగులో భాగంగా ఆయన ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని మిరోమోనోవిచ్ మీర్జియోయెవ్ స్వాగతం పలికారు. మోదీ మంగళవారం కజకిస్తాన్ వెళ్తారు. ఈ నెల 8న రష్యా చేరుకుని ఆ దేశంలోని ఉఫా నగరంలో జరిగే ‘బ్రిక్స్’, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులకు హాజరవుతారు. 10న తుర్క్మెనిస్తాన్కు, 11న కిర్గిజిస్తాన్, 12న తజకిస్తాన్‌కు వెళ్తారు. రష్యాలోని ఉఫాలో జరిగే ఎస్సీఓ సదస్సు సందర్భంగా మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశం కానున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరు నవంబర్‌లో కఠ్మాండులో సార్క్ సదస్సులో కలుసుకున్నప్పటికీ.. ఎలాంటి చర్చలూ జరపలేదు. -
ఉజ్బెకిస్తాన్‌లో 250 మంది రాష్ట్రవాసుల నిర్భంధం
-
ఉజ్బెకిస్తాన్‌లో 250 మంది రాష్ట్రవాసుల నిర్భంధం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 250 మంది కూలీలు కొంతకాలంగా ఉజ్బెకిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నారు. వేతనాలు ఇవ్వడం లేదు సరికదా.. మంచినీళ్లు, తినడానికి ఆహారం కూడా సరిగా పెట్టకుండా చీకటి గదిలో ఉంచుతూ వారు పనిచేస్తున్న సంస్థ యూజమాన్యం నరకం చవి చూపిస్తోంది. ఈ విధంగా నిర్బంధంలో ఉన్న విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ అనే కార్మికుడు అక్కడినుంచి తప్పించుకొని ఉజ్బెకిస్తాన్‌లో తాము పడుతున్న బాధలను సమాచార పౌరసంబంధాలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేసి చెప్పడంతో వివరాలు వెలుగు చూశారుు. వెంటనే స్పందించిన మంత్రి.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్ చేసి కార్మికుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. వివరాలను మంత్రి పల్లె మంగళవారం సచివాలయంలో విలేకరులకు వెల్లడిం చారు. ప్రభుత్వ ఖర్చులతో వారిని ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తామని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కూలీలను మోసం చేసిన ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఎస్పీకి, సీఐడీ అధికారులకు లేఖలు రాసినట్లు తెలిపారు. విదేశాల్లో ఇబ్బం దుల్లో వున్న వారి సమాచారం, ఫిర్యాదుల కోసం హైదరాబాద్ ఎన్ఆర్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ (9949054467)ను సంప్రదించవచ్చని పల్లె వివరించారు. -
ఉజ్జెక్‌లో బతుకు బితుకు
వరుస దాడులతో తెలుగువారు బెంబేలు స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ ఆర్తనాదాలు స్పందించని ఏజెన్సీలు, దౌత్య కార్యాలయం తమ వెతలతో ‘సాక్షి’కి బాధితుల ఈమెయిల్ గాజువాక : రష్యాలో ఉపాధి కోసమంటూ వెళ్లి ఉజ్బెకిస్థాన్‌లో చిక్కుకుపోయిన కొందరు విశాఖ వాసుల సహా 250 మంది భారతీయులు వరుస దాడులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఒక కంపెనీలో అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న ఫిలిప్ఫీనీయుల కబంధహస్తాల్లో చిక్కుకొని ఆర్నెల్లుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. తట్టుకోలేక స్వదేశానికి వెళ్లిపోతామని మొర పెట్టుకున్నా తమను ఉద్యోగానికి పంపిన ఏజెన్సీగానీ, భారత దౌత్య కార్యాలయం అధికారులు కానీ స్పందించట్లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటూ ‘సాక్షి’కి ఈ మెయిల్ పంపారు. 250 మంది భారతీయులు దాదాపు వంద మంది తెలుగువారు సహా 250 మంది భారతీయులు రష్యాలో ఉద్యోగం కోసమని ప్లేస్వెల్ హెచ్ఆర్డీ సర్వీసెస్ ద్వారా వెళ్లారు. విశాఖకు చెందిన ప్రజ్ఞ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా విశాఖతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందినవారు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తీరా నిర్వాహకులు రష్యాలో గాకుండా ఉజ్బెకిస్థాన్‌లోని కర్కల్ పాకిస్థాన్ జిల్లా అకలక్ ప్రాంతంలో యూజీసీసీ ప్లాంట్ ప్రాజెక్టుకు చెందిన సంగ్చంగ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిర్చారు. అయితే అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఫిలిప్ఫీనీయులు వీరిని అడ్డగిస్తున్నారు. ఇప్పటికి ఐదారుసార్లు దాడులు చేశారని బాధితులు వాపోతున్నారు. రెండ్రోజుల క్రితం ఆరుగురు భారతీయుల ఆచూకీ లభించకుండా పోయిందని చెబుతున్నారు. రూ. 1.20 లక్షలు (2వేల యూఎస్ డాలర్లు) చొప్పున చెల్లించిన తమకు సరైన ఉద్యోగం లేకపోగా ఉజ్బెకిస్థాన్‌లో చిత్రహింసలు అనుభవిస్తున్నా మని ఈమెయిల్లో వెల్లడించారు. తాగడానికి సరిపడా మంచినీరు కూడా ఇవ్వట్లేదని, కంపెనీ కన్స్ట్రక్షన్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ల ముందే ఫిలిప్ఫీనీయులు తమను చితకబాదుతున్నా వారెవరూ కిమ్మనట్లేదని వాపోయారు. తామెలా ఉన్నామోనని స్వస్థలాల్లో ఉన్న తమ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారని, అధికారులు స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు. తమ సమాచారం కోసం +998912608667, +998941405802, +998941460299, +998912724395 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
ఉజ్బెకిస్తాన్‌లో చిక్కుకున్న 250 మంది భారతీయులు