Moscow-Goa flight diverted to Uzbekistan after bomb threat - Sakshi
Sakshi News home page

రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. గాల్లో ఉండగానే..

Published Sat, Jan 21 2023 11:45 AM | Last Updated on Sat, Jan 21 2023 1:15 PM

Russia Goa Plane Bomb Threat Call Diverted To Uzbekistan - Sakshi

మాస్కో: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దుండగులు ఫోన్ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారిమళ్లించారు.

అజూర్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి సమయంలో బయల్దేరింది.

అయితే ఇందులో బాంబు అమర్చినట్లు గోవా దబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12:30 గంటలకు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానం భారత గగనతలంలోకి ప్రవేశించకముందే ఉబ్జెకిస్తాన్‌కు మళ్లించారు.  ఇలా జరగకపోయి ఉంటే విమానం ఉదయం 4:15 గంటలకు గోవాలో ల్యాండ్ అయ్యేది.
చదవండి: అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కూడా కవర్లా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement