divert
-
రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
మాస్కో: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దుండగులు ఫోన్ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారిమళ్లించారు. అజూర్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి సమయంలో బయల్దేరింది. అయితే ఇందులో బాంబు అమర్చినట్లు గోవా దబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12:30 గంటలకు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానం భారత గగనతలంలోకి ప్రవేశించకముందే ఉబ్జెకిస్తాన్‌కు మళ్లించారు. ఇలా జరగకపోయి ఉంటే విమానం ఉదయం 4:15 గంటలకు గోవాలో ల్యాండ్ అయ్యేది. చదవండి: అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కూడా కవర్లా? -
జనం సొమ్ముతో జల్సాలు.. పాలన గాలికి
– చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత ఉదయభాను ధ్వజం – పుష్కరాల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ వత్సవాయి : గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు జల్సాలు చేస్తూ పాలనను గాలికి వదిలేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. శనివారం వత్సవాయిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేస్తున్న దుబారా ఖర్చులకు అంతం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని చెబుతూనే పుష్కర ముగింపునకు విదేశాల నుంచి బాణాసంచా తెచ్చి కాల్పడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారన్నారు. మొత్తం మీద పుష్కరాలకు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెబుతున్న ప్రభుత్వం కేవలం రూ. 500 నుంచి 600 కోట్ల మేరకే ఖర్చు పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారని మిగతా నిధులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారపిచ్చిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో పేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంజం కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రచార పిచ్చితో ప్రజలకు నష్టం
వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వేదాద్రి (పెనుగంచిప్రోలు) : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చి ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాలు తొమ్మిదో రోజు శనివారం వేదాద్రి పుష్కర ఘాట్‌లో ఆయన స్నాన మాచరించి పిండ ప్రదానాలు చేశారు. శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పుష్కర నిధులు చాలా వరకు దుర్వినియోగమయ్యాయన్నారు. రూ.80 కోట్ల పనులు నామినేషన్‌పై ఇచ్చారన్నారు. హై సెక్యూరిటీ పేరుతో భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పుష్కరాల్లో అందరికీ దానాలు చేయడం సంప్రదాయమని, అలాంటిది ఎక్కడా బిచ్చగాళ్లు ఉండకూడదని ముఖ్యమంత్రి వారిని విజయవాడలో లేకుండా పంపించడం దారుణమన్నారు. ఆయన వెంట జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఉన్నారు. -
బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు
-
బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు
ఇస్తాంబుల్: ఉగ్రవాద చర్యలు ప్రపంచానికి సవాల్‌గా మారగా, బాంబు బెదిరింపులతో విమానయాన సంస్థలు కలవరపడుతున్నాయి. బాంబు బెదిరింపు రావడంతో టర్కీ ఎయిర్‌లైన్స్ విమానాన్ని మార్గమధ్యంలో దారిమళ్లించారు. నూయార్క్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానాన్ని కెనడాలోని హాలిఫాక్స్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కెనడా అత్యవసర సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తయ్యారు. విమానంలోని ప్రయాణికులందరినీ దించివేసి, క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా నుంచి ప్రాన్స్‌కు వెళ్తున్న రెండు విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని వెంటనే దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల అనంతరం ఫ్రాన్స్‌కు చేరుకున్నాయి.