బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు | Bomb threat diverts Turkish Airlines flight | Sakshi
Sakshi News home page

బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు

Published Sun, Nov 22 2015 11:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు

బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు

ఇస్తాంబుల్: ఉగ్రవాద చర్యలు ప్రపంచానికి సవాల్గా మారగా, బాంబు బెదిరింపులతో విమానయాన సంస్థలు కలవరపడుతున్నాయి. బాంబు బెదిరింపు రావడంతో టర్కీ ఎయిర్లైన్స్ విమానాన్ని మార్గమధ్యంలో దారిమళ్లించారు. నూయార్క్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానాన్ని కెనడాలోని హాలిఫాక్స్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

కెనడా అత్యవసర సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తయ్యారు. విమానంలోని ప్రయాణికులందరినీ దించివేసి, క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా నుంచి ప్రాన్స్కు వెళ్తున్న రెండు విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని వెంటనే దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల అనంతరం ఫ్రాన్స్కు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement