Bomb threat
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘బాంబు’ అలజడి
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్! -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
బాంబు బెదిరింపుల వేళ.. విమానంలో పేలుడు పదార్థాలు
ఢిల్లీ: దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ విమానంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. ప్రయాణీకులందరూ విమానం దిగిన తర్వాత విమానంలోని ఓ సీటులో క్యాట్రిడ్జ్‌ను సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI916 సీటు జేబులో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరికింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. భద్రతా ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఈ విషయంపై ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలుసులు కూడా వెల్లడించారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో విమానాలు, స్కూల్స్, హోటల్స్‌కు బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిన విషయం తెలిసిందే. పలువురు ఆకతాయిలు.. ఫేర్ బెదిరింపు కాల్స్ చేయడంతో ఈ ఘటనపై అధికారులు, పోలీసులు కూడా దృష్టిసారించారు. ఇక, గడిచిన 20 రోజుల్లో మొత్తం 600కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది."One ammunition cartridge was found in the pocket of a seat of our flight AI916 after it had landed from Dubai at Delhi on 27 October 2024 and all passengers had safely disembarked. A complaint was immediately lodged with the Airport Police by Air India strictly adhering to the… pic.twitter.com/INwG7Kf9K5— ANI (@ANI) November 2, 2024 -
Vizag: రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో దాదాపు 200కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.సాక్షి, విశాఖపట్నం: తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంతోపాటు చెన్నై నుంచి విశాఖపట్నం వస్తున్న విమానానికి మంగళవారం బెదిరింపులు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే భద్రత సిబ్బంది రెండు విమానాల్లోనూ బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు.కాగా సోమవారం కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా ముంబయికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విమానాశ్రయానికి ఆగంతకుడు ఫోన్ చేసి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని బెదిరించడంతో.. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆకాశంలో ఉన్న విమానాన్ని పైలెట్లు వెంటనే వెనక్కి మళ్లించి విశాఖలో ల్యాండ్ చేశారు. 120 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. బాంబు స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, బాంబు లేదని గుర్తించారు. అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ముంబయికి బయలుదేరింది. -
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. -
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం అంగతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అగంతకుల ఫోన్ కాల్‌తో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 130 ప్రయాణికులతో చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని దించి సోదాలు నిర్వహించారు.గతకొన్ని రోజులగా విమానాలకు బాంబుల బెదిరింపుల బెదడ ఎక్కువైంది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. 9 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారించింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ ఫేక్ కాల్ చేసిన బాలుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
విస్తారా విమానానికి మరో బాంబు బెదిరింపు
సాక్షి, ఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపుతున్నాయి. తాజాగా విస్తారా విమానానికి మరో బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానానికి బెదిరింపు మెయిల్ రావడంతో జైపూర్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.కాగా, గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి.దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది.ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది. -
Tirupati: అమ్మో.. బాంబ్
తిరుపతి అర్బన్: నగరంలోని స్టార్ హోటళ్లకు గుర్తుతెలియని వ్యక్తు లు గురువారం రాత్రి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా లీలామహల్ సర్కిల్, కపిలతీర్థం, అలిపిరి సమీపంలోని నాలుగు గుర్తింపు పొందిన హోటళ్లకు మెయిల్స్ ద్వారా బెదిరింపులకు దిగారు. నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చర్చసాగుతోంది. లేదంటే చంపుతామని, మీ హోటళ్లలో పలుచోట్ల బాంబులు పె ట్టామని హెచ్చరించినట్లు సమాచారం. వెంటనే హోటళ్ల యాజ మాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు హోటల్స్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బూచీ సమాచారంతో తిరుపతి నగర వాసులు ఉలిక్కి పడ్డారు. గురువారం రాత్రి ఆ హోటల్స్‌తోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు.విమానాశ్రయానికి..ఏర్పేడు: బాంబు బెదిరింపు ఈ మెయిల్‌పై తిరుపతి విమానాశ్రయ స్టార్ ఎయిర్‌లైన్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ షబీర్ గురువారం ఫిర్యాదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని స్టార్ ఎయిర్ హెడ్ ఆఫీస్‌తో అనుబంధించిన తిరుపతి ఎయిర్ ఫోర్ట్ అధికారిక స్టార్ ఎయిర్ ట్విట్టర్ ఖాతాకు గుర్తుతెలియని వ్యక్తి గురువారం బాంబు బెదిరింపు సందేశాన్ని పంపినట్లు చెప్పారు. విమానాలను ఎస్5–154(టీఐఆర్–ఐఎక్స్జీ) ప్రధాన అ««ధి కారుల అనుమతి పొందిన అనంతరం మధ్యాహ్నం 1.21 గంటలకు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
బాంబు బెదిరింపులు: సోషల్‌మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు. ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. -
నగరంలో సీఆర్పీఎఫ్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
జవహర్‌నగర్: ఢిల్లీలోని ఓ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ వద్ద మూడు రోజుల కిందట బాంబు పేలుడు సంభవించిన ఘటనను మరువక ముందే హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలకు వచ్చిన బాంబు బెదిరింపు సందేశం మంగళవారం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ పాఠశాలకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశం పంపారు. జవహర్‌నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాలతోపాటు ఢిల్లీలోని రోహిణి, ద్వారకాలోగల సీఆర్పీఎఫ్ పాఠశాలలో బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పాఠశాల ప్రారంభమయ్యాక యాజమాన్యం ఈ–మెయిల్‌ను చూసి అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను బస్సుల్లో ఇళ్లకు తరలించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించింది.దీంతో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ పోలీసులతోపాటు రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఏసీపీ మహేశ్, జవహర్‌నగర్ సీఐ సైదయ్య పాఠశాలకు చేరుకొని పరిసర ప్రాంతాలను, పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాగిలాలతో, బాంబు స్క్వాడ్‌తో అనువనవూ గాలించి బాంబు లేదని నిర్ధారించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం సతీమణి పేరున కొందరు దుండగులు ఫేక్ ఐడీ సృష్టించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. -
మరో 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 100కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.తాజాగా మంగళవారం మరో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్గాల్లో ఈ బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులు జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను లక్ష్యంగా చేసుకుని వచ్చినట్లు తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించింది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపి,తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే విమానం, అహ్మదాబాద్ నుంచి జెద్దాకు వెళ్లే విమానం, లక్నో నుంచి పుణె, హైదరాబాద్ నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి డమ్మాం, బెంగళూరు నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ, కోజికోడ్ నుంచి జెడ్డా, ఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లే విమానాలకు ఈ బెదిరింపులు అందినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ... వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు ఈ-మెయిల్స్‌ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్‌లోని అన్ని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్‌గా భద్రత అధికారులు భావిస్తున్నారు.ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’ -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
వారంలో 100కుపైగా బెదిరింపులు.. ‘నో-ఫ్లై లిస్ట్‌లో చేరుస్తాం’
విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్‌లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్‌పోర్ట్‌కు రమ్మని పైలట్‌కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు. -
24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. -
విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లండన్-ఢిల్లీ విస్తారా విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రత్తమైన అధికారలు ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్ఫర్టకు పైలట్లు దారి మళ్లించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. STORY | Vistara's Delhi-London flight diverted to Frankfurt after bomb threatREAD : https://t.co/d6PLa4w0GV pic.twitter.com/R1BzJcO2rW— Press Trust of India (@PTI_News) October 19, 2024విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తేలిపారు. అనంతరం విమానం లండన్‌కు బయలుదేరింది. ఇటీవల కాలంలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. కేవలం ఒక వారంలో 15 విమానాలకు ఇలాంటి బెదిరింపులు గమనార్హం. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లించారు. -
మరో అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు
-
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలు
భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది.ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్‌జెట్ విమానం, బాగ్డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
-
ఎయిరిండియా విమానంలో బాంబు?
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో పైలట్‌కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్పోర్ట్ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఇటీవల తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో టేకాఫ్ అయిన విమానం వీల్స్ లోపలికి ముడుచుకోలేదు. హైడ్రాలిక్స్ సమస్య కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. వెంటనే పైలట్ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసి చర్యలు చేపట్టారు. -
సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్‌లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్‌గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.కాగా సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు.