సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అగంతకుడు.. సీఐఎస్‌ఎఫ్ అధికార వెబ్‌సైట్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ పంపించాడు. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా, ఎయిర్‌పోర్టు అథారిటీ గోప్యంగా ఉంచింది.
ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఏర్పేడు పోలీసులు బృందాలుగా దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు
Comments
Please login to add a commentAdd a comment