
విమాన సర్వీస్ రద్దు కావడంతో రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసనకు దిగారు.
సాక్షి, తిరుపతి: విమాన సర్వీస్ రద్దు కావడంతో రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసనకు దిగారు. ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8.15 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది.
అయితే, విమాన సర్వీస్ రద్దు విషయం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళనకు దిగారు. ఉదయం నుండి వేచి ప్రయాణికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎటువంటి ప్రత్యామ్నయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు సహనం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు.
