Renigunta airport
-
రేణిగుంట ఎయిర్ పోర్టుకు YS జగన్
-
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
-
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల నిరసన
సాక్షి, తిరుపతి: విమాన సర్వీస్ రద్దు కావడంతో రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసనకు దిగారు. ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8.15 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమాన సర్వీస్ రద్దు విషయం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళనకు దిగారు. ఉదయం నుండి వేచి ప్రయాణికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎటువంటి ప్రత్యామ్నయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు సహనం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. -
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అగంతకుడు.. సీఐఎస్ఎఫ్ అధికార వెబ్‌సైట్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ పంపించాడు. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా, ఎయిర్‌పోర్టు అథారిటీ గోప్యంగా ఉంచింది.ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఏర్పేడు పోలీసులు బృందాలుగా దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు -
రేణిగుంట విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్
రేణిగుంట: పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సిన స్పైస్‌జెట్ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి స్పైస్‌జెట్ విమానం చేరుకుంది. అయితే పొగమంచు దట్టంగా కమ్మేయడాన్ని గమనించిన పైలట్ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే కాసేపు తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత పొగమంచు తొలగడంతో సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేశారు. చదవండి: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్ -
తిరుపతిలో సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, తిరుమల: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్ గురుమూర్తి సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి మొదటి రోజు(సోమవారం)పర్యటన వివరాలివి.. ► 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరిక ► అక్కడి నుంచి తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. ► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. ►సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. ►అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ► స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. -
హైడ్రామా: చంద్రబాబు ‘కపట’ దీక్ష
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా.. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. నన్నే అడ్డగిస్తారా..? మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నా.. ఎక్కడున్నా వదిలిపెట్టను.. అధికారం వచ్చాక మీ అంతుచూస్తా’ అంటూ చంద్రబాబునాయుడు పేట్రేగిపోయారు. సహనం కోల్పోయి పోలీసులపై ప్రతాపం చూపారు. నోటికొచ్చినట్టు మాట్లాడి రేణిగుంట విమానాశ్రయంలోనే నిరసన చేస్తున్నట్టు నటించారు. పోలీసులు బతిమలాడినా మాట వినక వారిపై దూషణలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏమైందని.. ఎందుకొచ్చారని.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ల పరిధిలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అక్కడ టీడీపీ వ్యూహాలు ఫలించలేదు. దీనికితోడు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని టీడీపీ కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. ఓటమిపాలవ్వడం ఇష్టం లేక రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. విషయం తెలుసుకున్న విపక్ష నేత అక్కడి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధపడ్డారు. అనుకున్నదే తడువుగా అడ్డదారులు ఎంచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి కపటదీక్ష చేయాలని నిశ్చయించారు. ఆ మేరకు సమాచారం జిల్లా నేతలకు చేరవేశారు. సోమవారం ఉదయం 9.30కు రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఐదేళ్లూ పోలీసు 30 యాక్టు 2014–19 చంద్రబాబు హయాంలో పోలీసు 30 యాక్టు అమల్లో ఉంది. ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టాలన్నా అనుమతి ఇవ్వలేదు. పేదల కోసం కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాలన్నా నిరాకణే ఎదురైంది. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ నిబంధనలు, కోవిడ్–19 నిబంధనలు అమల్లో ఉన్నాయి. ధర్నాలు చేపట్టాలంటే ముందుస్తు అనుమతి తప్పనిసరి. రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఎన్నికల కమిషన్ అనుమతి ఉండాలి. 40 ఏళ్లు అనుభవం ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదు. చీప్ ‘ట్రిక్స్’ ప్లే చేసి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రణాళిక రచించారు. ఆ మేరకు రేణిగుంట విమానాశ్రయంలో రోజంతా నానాయాగీ చేశారని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. పరువు కోసమే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవాలనే తాపత్రయం ఆ పార్టీ నేతల్లో ఉంది. టీడీపీ అభ్యర్థుల నుంచి ఆశించిన స్థాయిలో పోటీ లేదు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో కొంతమంది పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు సంసిద్ధపడ్డారు. అందుకు ప్రధాన కారణం నాయకత్వలోపం. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చిత్తూరులో ఏదో జరగబోతుందనే వాదన బహిర్గతం చేయడానికి టీడీపీ సరికొత్త వ్యూహం పన్నింది. ఆ మేరకే అన్నీ తెలిసీ చిత్తూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నీ తెలుసు కదా బాబూ! చంద్రబాబునాయుడు రాజకీయ కురువృద్ధుడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది. రాజ్యంగం.. ఎన్నికల కోడ్.. కోవిడ్ నిబంధనలు.. అన్నీ తెలుసు. పోలీసులు ధర్నాకు అనుమతివ్వరనీ తెలుసు. ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని తెలుసు.. కానీ వీటిని ఖాతరు చేయలేదు. ప్రణాళిక ప్రకారం నాటకాన్ని రక్తికట్టించారు. తమకు అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగించారు. రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉండగా వామపక్షాలను, ప్రతిపక్ష నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేయించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో అనుమతి లేకుండా నిరసనలు, ధర్నాలు చేయడం, అపార అనుభవం ఉన్న బాబుకు తెలియదా?. రాజకీయ లబ్ధికోసం ఇన్ని డ్రామాలా..?. – కందారపు మురళి, సీపీఎం, సీనియర్ నాయకులు, తిరుపతి బాబు ప్రవర్తన దారుణం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం గుర్తుకు రాలేదా? కావాలని ప్రజలను రెచ్చగొట్టేందుకు బాబు నాటకమాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన చేయాలనుకోవడం విడ్డూరంగా ఉంది. –వి.లక్ష్మణరెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ జనచైతన్య వేదిక ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ప్రతిపక్షనేత చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రవర్తించిన తీరు దారుణం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ధర్నాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. గతంలో ప్రజాసంఘాలు ప్రజా సమస్యల మీద ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తే దారుణంగా అరెస్ట్‌లు చేసి హింసించారు. – పి అంజయ్య, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చదవండి: కోడ్, కోవిడ్.. గాలికి! యథేచ్ఛగా చంద్రబాబు క్యాడర్‌ను కాపాడుకోవడానికే చంద్రబాబు చిల్లర డ్రామా -
చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదు..
సాక్షి, విజయవాడ: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఉదయం చంద్రబాబునాయుడు చేసిన హంగామాపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఎయిర్ పోర్టు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. సోమవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదని, ఏదో ఒక హడావిడి చేసి వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు డ్రామాలను కవర్ చేసేందుకు పచ్చ మీడియా ఉండనే ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న నాలుగు ఛానల్లు ఇలాంటి చెత్త వార్తలను ప్రసారం చేసేందుకే పని చేస్తాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ కొట్టడంతో చంద్రబాబుకు మతి భ్రమించిందని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయనే భయంతోనే చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిరసన చేయకూడదన్న కనీస పరిజ్ఞానం లేని చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తన డప్పు తానే వాయించుకునే చంద్రబాబుకు నియమ నిబంధనలను పట్టవా అని నిలదీశారు. నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందన్నారు. మంగళగిరిలో కొడుకును, సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోలేని చంద్రబాబు ఇక రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో పచ్చ పార్టీ మద్దతుదారులకు బుద్ది చెప్పిన అక్కడి ప్రజానికం, తదుపరి ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నుంచి తరిమికొడతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
-
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్‌లోని ఫ్లోర్‌పైనే బైటాయించి నానా హంగామా సృష్టించారు. ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి -
చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు
-
రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా
సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం హైడ్రామాకు తెరతీశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి.. చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమవ్వగా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా దీక్షలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. ఎస్ఈసీ ఆధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొన కూడదని నిన్ననే ఎస్ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు హితవు పలికిన సంగతి విధితమే. చదవండి: చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..! కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ.. -
నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు
గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రారంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ రద్దయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సోమవారం నుంచి సర్వీస్‌లు ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే చివరి నిమిషం వరకూ ప్రయాణికుల విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపించాలా? లేదా? అనే విషయంపై స్పష్టత లేక సోమవారం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన నాలుగు ఇండిగో, ఒక ఎయిర్ ఆసియా విమాన సర్వీసులు నిలిచిపోనున్నట్లు విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజా కిశోర్ తెలిపారు. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రేణిగుంట నుంచి ఓకే.. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్ర విమానయాన శాఖ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు డైరెక్టర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, 8.50 గంటలకు బెంగళూ రు నుంచి ఇక్కడికి ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొ న్నారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు, 11.55 గంటలకు రేణి గుంట నుంచి కొల్హాపూర్‌కు రాకపోకలు కొనసాగుతాయని తెలియజేశారు. హైదరాబాద్ నుంచి 140 విమానాలు హైదరాబాద్: శంషాబాద్ నుంచి ఆదివారం అర్ధరాత్రి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం నుంచి జూన్ 30 వరకు విమానాల షెడ్యూల్‌ను ఎయిర్పోర్ట్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. -
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బృందం..
సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేశ్ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు. రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
సాక్షి, తిరుపతి : ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో స్పైస్‌జెట్ విమానం అత్యవరసంగా ల్యాండ్ అయింది. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విమానంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి స్పైస్ జెట్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. ట్రాక్టర్ సహాయంతో విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు తరలించారు. -
నేడు తిరుమలకు ప్రధాని మోదీ
తిరుమల: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలుకుతారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం ఇక్తాఫర్ స్వాగతం పలికి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా వుంటే ప్రధానమంత్రిగా మోదీ 2015 అక్టోబర్ 3వతేదీ, 2017 జనవరి 3వతేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఆయన మూడోసారి తిరుమల వస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్రమోది తిరుమల పర్యటన సందర్భంగా శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి పీఎం, సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించి అణువణువునా తనిఖీలు చేస్తూ భద్రత పటిష్ట పరిచారు. మూడు వేల మందితో భద్రత పీఎం, గవర్నర్, సీఎం రానుండడంతో తిరుమల, తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్ర««ధాన మంత్రి సెక్యూరిటీ ఎన్ఎస్జి ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి పబ్లిక్ మీటింగ్ ప్రాంతం వరకు అక్కడ నుంచి తిరుమల వరకు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు ఎస్పీలు, ఏడుగురు అడిషనల్ ఎస్పీలు, 33 మంది డీఎస్పీలు, 77 మంది సీఐలు, 146 మంది ఎస్ఐలు, 1899 మంది సిబ్బందితో పాటు ఏపీఎస్పీ ఆర్మ్డ్Š ఫోర్స్ 200, స్పెషల్ పోలీసులు 300, గ్రేహౌండ్స్ 50 మందితో పాటు కూంబింగ్, బాంబ్ డిస్పోజల్ పార్టీలు తిరుమల ఘాట్‌లో, రేణిగుంట మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటన వివరాలు: ►ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. ►4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►4.40 గంటలకు విమానాశ్రయం దగ్గరగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశ స్థలికి చేరుకుంటారు. ►5.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తిరుమల చేరుకుని దర్శనానికి వెళతారు. ►శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 7.20 గంటలకు రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి 8.10 గంటలకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా: ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4.30 గంటలకు ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారు. ►దర్శనం అనంతరం తిరుమల నుంచి బయలుదేరి 8గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. ►8.15 గంటలకు ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన తర్వాత 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు పయనమవుతారు. -
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగే వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకి వైఎస్ జగన్ బయలుదేరారు. సమర శంఖారావ సభకు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో సభ జరిగే ఎస్వీజీఎస్ మైదానం వద్దకు జగన్ చేరుకోనున్నారు. -
శ్రీలంక ప్రధానికి ఘన స్వాగతం
చిత్తూరు, రేణిగుంట:శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమె సింఘేకు గురువారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం ఆయన చెన్నై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సతీమణి మైత్రి విక్రమె సింఘేతో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, లెఫ్టినెంట్ కల్నల్ అశోక్‌బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, తిరుపతి ఆర్డీఓ నరసింహులు, కోదండరామిరెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ హెచ్.పుల్లా పుష్పగుచ్ఛాలను అం దించి స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని అధికారులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. -
కలగా అంతర్జాతీయ విమానయానం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం... పేరుకే అంతర్జాతీయం... కనీసం దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు కూడా విమానాలు తిరగని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్ ఏర్పాటు చేసి మూడేళ్లు దాటుతున్నా విమానాలు భాగ్యనగరాన్ని దాటి బయటకు వెళ్లడంలేదు. ఫలితంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రేణిగుంట: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్‌ను ప్రారంభించారు. టెర్మినల్ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్‌లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయానికి రాని అనుమతులు ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్‌కు ఉంది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను నడపాలి.. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అనేక మంది వెళుతున్నారు. వీరికి అనువుగా రేణిగుంట నుంచి కనీసం వారానికి ఒక్క కనెక్టింగ్ ఫ్లైట్‌ను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుం ది. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ఎగిరితే పేరుకు సార్థకత ఉంటుంది. – శ్రీనివాసులు రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం.. రెండేళ్లలో నూతన టెర్మినల్‌లో ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం. రూ.కోట్లు వెచ్చించి ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సుందరీకరణ పనులు చేపట్టాం. విమాన సర్వీసులను విస్తరించాం. 2015–16 ఏడాదికి గాను ‘బెస్ట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఎయిర్‌పోర్టు’గా అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల అనుమతులతో అంతర్జాతీయ విమానయాన సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం. – హెచ్.పుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్, తిరుపతి -
ప్రేక్షకాదరణే శ్రీరామ రక్ష..
సాక్షి, తిరుపతి: ప్రేక్షకుల, అభిమానుల ఆదరణతోనే సినీ పరిశ్రమలో తమ కుటుంబమంతా రాణించగలుగుతోందని, ప్రేక్షకులే శ్రీరామరక్ష అని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. తిరుపతికి విచ్చేసిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో మంచు విష్ణు, మనోజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎం సునీల్ చక్రవర్తి శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. గాయత్రి సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమాని మాట్లాడుతూ.. గాయత్రి సినిమాలో తమ అభిమాన నటుడు అద్భుతంగా నటించాడని తెలిపారు. ఆయనకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇండిగో విమాన సర్వీసులు
రేణిగుంట: ఇండిగో విమాన సర్వీసు సంస్థ తిరుపతి విమానాశ్రయం నుంచి తమ సర్వీసులను ఆదివారం ప్రారంభించనుంది. రోజూ మూడు సర్వీసులు హైదరాబాద్‌కు, రెండు సర్వీసులు బెంగళూరుకు నడపనున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఉదయం 9 గంటలకు ఈ సర్వీసులను ప్రారంభిస్తారు. ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, శివప్రసాద్ హాజరుకానున్నారు. ఇప్పటి వరకు రేణిగుంట విమానాశ్రయం నుంచి కేవలం హైదరాబాద్, విజయవాడలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్, ట్రూజెట్ కంపెనీలు మాత్రమే తమ సర్వీసులు కొనసాగిస్తున్నాయి. -
తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
-
రేణిగుంటలో కేసీఆర్‌కు ఘనస్వాగతం