నేడు రేణిగుంటకు జగన్
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 9.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ దబ్బల రాజారెడ్డి మృతి చెందారని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట నుంచి సూళ్లూరుపేటకు వెళతారని చెప్పా రు. జగ న్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.