తిరుపతిలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం | Tirumala Tour: CM YS Jagan Reached Renigunta Airport | Sakshi
Sakshi News home page

తిరుపతిలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం

Published Mon, Oct 11 2021 3:11 PM | Last Updated on Mon, Oct 11 2021 3:54 PM

Tirumala Tour: CM YS Jagan Reached Renigunta Airport - Sakshi

సాక్షి, తిరుమల: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి సీఎంకు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి మొదటి రోజు(సోమవారం)పర్యటన వివరాలివి.. 
► 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరిక
► అక్కడి నుంచి తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. 
► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.
►సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు.


►అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
► స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement