నేడు గవర్నర్ నరసింహన్ జిల్లా రాక | Today, the arrival of the District Governor Narasimhan | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్ నరసింహన్ జిల్లా రాక

Published Wed, Apr 20 2016 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM

Today, the arrival of the District Governor Narasimhan

చిత్తూరు (అగ్రికల్చర్): ఈ నెల 20,21 తేదిల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 1.50 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.



సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 4.35 గంటలకు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి 5.05 గంటలకు బయలుదేరి 7 గంటలకు కడపలోని స్టేట్ గెస్ట్‌హౌస్ చేరుకుంటారు. 21 తేది ఉదయం 7.30 గంటలకు కడప నుంచి బయలుదేరి 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 9.45 గంటలకు హైదరాబాదు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement