
ఆరోగ్య ప్రధాయని యోగా అని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. తిరుపతి వివేకానంద కేంద్రం, ఎస్వీయూ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో సామూహిక సూర్యనమస్కార్–2025 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు

పది వేల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. కన్యాకుమారి వివేకానంద కేంద్ర వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు, వేదిక్, సంస్కృత వర్సిటీల వీసీలు రాణిసదాశివమూర్తి, జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, మంత్రమహేశ్వరి శక్తి పీఠాధిపతి రమ్యానంద సరస్వతి స్వామి, చెరుకూరి వెంకటేశ్వర్ ప్రసాద్, శ్యాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు











