Surya Namaskar
-
పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం!
ఈరోజు నూతన సంవత్సరంలో తొలి రోజు.. అందుకే ఈరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలు సందర్శించి, దేవునికి పూజలు చేస్తుంటారు. ఫలితంగా ఈరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. కాగా పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, గవర్నర్లు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'havan' and 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur (Video source: CMO) pic.twitter.com/0juG1CX7Vd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2024 యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (సోమవారం) ఉదయం గోరఖ్‌పూర్ చేరుకుని, గోరఖ్‌నాథ్ ఆలయంలో యాగం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ 2024 సంవత్సరం తొలి రోజు మోధేరా సూర్య దేవాలయంలో సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఈ రోజు అత్యధిక సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూర్య నమస్కార కార్యక్రమంలో నాలుగువేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు #WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi participate in the Suryanamaskar Program at Modhera Sun Temple, on the first morning of the year 2024. pic.twitter.com/t3z3iBBIuk — ANI (@ANI) January 1, 2024 -
మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొద్ది నెలల క్రితమే భూమా మౌనికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఏడాదిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన సుమలత కుమారుడి పెళ్లిలో ఈ జంట సందడి చేశారు. తాజాగా యోగా డే సందర్భంగా మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?) మనోజ్ వైఫ్ భూమా మౌనిక యోగా డే సందర్భంగా అరుదైన ఫీట్ సాధించింది. ఏకంగా 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మనోజ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. మై వైఫ్ భూమా మౌనిక అంటూ యోగాసనం వేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందే యోగా డే సందర్భంగా భూమా మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా మిత్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు 108 సూర్యనమస్కారాలు పూర్తి చేసి.. యోగాపై నా ప్రేమకు అంకితం చేస్తున్నా. నాకు యోగాను పరిచయం చేసినందుకు మా అమ్మ శోభానాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్.. ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా) View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika) -
‘సూర్య నమస్కారాల’ సర్క్యులర్.. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండన
న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 30 వేల విద్యా సంస్థల్లోని 3 లక్షల మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయాలంటూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన సర్క్యులర్‌పై అలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి కార్యక్రమాల్లో ముస్లిం విద్యార్థులు పాల్గొనరాదని పిలుపునిచ్చారు. యూజీసీ డిసెంబర్ 29వ తేదీన జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో.. ‘దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని 75 కోట్ల సూర్యనమస్కారాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జనవరి ఒకటి నుంచి 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షల విద్యార్థులు సూర్యనమస్కారాల్లో పాల్గొంటారు’ అని పేర్కొంది. ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ ముస్లిం బోర్డు కార్యదర్శి మౌలానా ఖాలేద్ రహమానీ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మెజారిటీ సంప్రదాయాలు, సంస్కృతిని ఇతరులపై రుద్దాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. -
సూర్య నమస్కారంతో సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ: యోగా, ధ్యానం మన జీవితంలో అంతర్భాగం కావాలని కేంద్రమంత్రి శర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హార్ట్‌ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హార్ట్‌ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శర్భానంద హాజరయ్యారు. యోగా గురు రామ్‌దేవ్ బాబా, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..75 కోట్ల సూర్య నమస్కారాలు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కమ్లేష్ డి.పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా అకాడమీని స్థాపించడం ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుందని అన్నారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా సాధన చేయాలని, అలాంటి వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
హైదరాబాద్ వేదికగా.. 75 కోట్ల సూర్య నమస్కారాలు!
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా సరికొత్తగా 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ జరగబోతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జరిగే ఈ ఆన్లైన్ చాలెంజ్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. నందిగామ మండలంలోని కన్హా విలేజ్‌లో ఉన్న కన్హా శాంతి వనంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 3న మొదలై ఫిబ్రవరి 20 వరకు కార్యక్రమం కొనసాగనుంది. హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్ తదితర జాతీయ స్థాయి సంస్థలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాయి. రామ్‌దేవ్ బాబాతో పాటు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగానే అథెంటిక్ యోగా బుక్ ఆవిష్కరణ, హార్ట్ ఫుల్ నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి శంకుస్థాపన కూడా జరగనుంది. చదవండి: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపు.. మందు, బీర్లు తెగ లాగించేశారు.. 21 రోజులు.. రోజుకు 13 సర్కిల్స్ చాలెంజ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులు క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ 12 సూర్య నమస్కారాల సర్కిల్‌ను రోజుకు 13 సార్లు చొప్పున సాధన చేస్తారు. ఫిబ్రవరి 20లోపు వీలును బట్టి 21 రోజుల్లో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసిన వారికి నిర్వాహకులు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. 30 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేలా.. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలు ఈ 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్‌లో పాల్గొననున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేసేందుకు కృషి జరుగుతోంది. చదవండి: సర్కారు తప్పిదాలతోనే విద్యుత్ మోత! -
18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
-
గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు యోగా ఆవశ్యకతను చాటే కార్యక్రమాలను ప్రారంభించాయి. ఇక మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు యోగాసానాలు సాధన చేస్తూ.. దాని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీబీపీ అధికారి ఒకరు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాన్ని ప్రదర్శించారు. గడ్డకట్టే చలిలో 18 వేల అడుగుల ఎత్తున సూర్యనమస్కారాలు చేశారు. అది కూడా కేవలం షార్ట్ మీదనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’’ అంటూ యోగా గొప్పతనాన్ని తెలిపారు. చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి! -
108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత
ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్ సమంత. ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా జిమ్‌లో చెమటలు చిందిస్తూ కఠినమైన వర్కౌట్లు చేస్తారు. ఇక లాక్డౌన్ కాలంలో భర్త నాగచైతన్యతో కలిసి యోగా చేయడం ప్రారంభించిన సమంత.. ఈ వీకెండ్‌ను సరికొత్త ఫీట్‌తో ఆరంభించారు. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి వావ్ అనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో చేశారు. ఈ వారాంతానికి ఒక మంచి ఆరంభం అన్న సమంత.. తన ఫిట్నెస్ ట్రైనర్ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్కట్లు ఉండవని ఆమె నిరూపించారు. కఠిన శ్రమ, అంకిత భావం, సుస్థిరతకు నిదర్శనం. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ నో చెప్పరు’’అని సమంతపై ప్రశంసలు కురిపించారు.(చదవండి: వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు ) కాగా లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు సమంత. టెర్రస్ గార్డెనింగ్ మొదలు పెట్టి మన ఆహారం మనమే పండించుకోవాలి, అంతేకాదు వాటికి కావాల్సిన ఎరువులను కూడా సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో చెబుతూ సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేశారు. ‘గ్రో విత్ మీ’ అంటూ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్‌సింగ్ తదితర నటీమణులకు సవాల్ విసిరారు. అదే విధంగా వంట చేయడం కూడా నేర్చుకున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా హీరోయిన్గా అగ్రస్థానంలో కొనసాగుతున్న సమంత.. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టారు. ఇందులో ఆమె టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆమె వ్యాపారం రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్ క్వీన్‌గా అభిమానుల చేత ప్రశంసలు అందుకున్న సామ్.. 'సాకీ వరల్డ్' పేరుతో యువతను ఆకట్టుకునే విధంగా వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. -
ఒకేచోట 86,707 సూర్యనమస్కారాలు
భివండీ: భివండీ పట్టణంలోని ఎన్ఈఎస్ హైస్కూ వార్శికోత్సవం వినూత్న పద్దతిలో చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కలసి 86,707 సూర్యనమస్కారాలు చేశారు. ఎన్ఈఎస్ పాఠశాలను స్థాపించి 50 వసంతాలు పూర్తయ్యాయి. దీంతో పాఠశాల వార్శికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వార్శికోత్సవాలలో భాగంగా 2,240 మంది విద్యార్థులు మూడు ప్రాంతాల్లో ఒకే సారి సూర్య నమస్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు ప్రతి ఒక్కరు 13 సూర్య నమస్కారాలు చొప్పున కొంత సమయం విశ్రాంతి తీసుకుని మళ్లీ 123 సార్లు ఇలా మూడు పర్యాయాలుగా చేశారు. అయితే వీరిలో కొందరు 13 సార్లు సూర్యనమస్కారాలు చేయలేకపోవడంతో మొత్తం 86,707 సూర్య నమస్కారాలు పూర్తిచేసినట్లయింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మాజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా మహర్శి అరుణ్ దాతర్, క్రీడా భారతి సంస్థా మహామంత్రి రాజ్ చౌదరి, కమలా కిశోర్ హెడా, డాక్టర్ రాహుల్ జోషి, వినోద్ శెటే, దాస్బాయి పటేల్‌లు హాజరయ్యారు. అభినందనీయం: అరుణ్ దాతర్ క్రీడా మహర్శి అరుణ్ దాతర్ మాట్లాడుతూ.. వార్శికోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. నేటి యుగం వేగంగా పరుగెడుతున్న తరుణంలో యువకులు, విద్యార్థులు యోగ, కసరత్తులాంటివికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతున్నారు. ఉదయం నిత్యం సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు విద్యార్థులు అన్ని విద్యల్లో చురుకుగా ఉంటారని సూచించారు. అదేమాదిరిగా పాఠశాల ఉపాధ్యక్షులు డాక్టర్ వివేక్ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులకు సూర్యనమస్కారాలు నేర్పించడానికే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. -
నీటిపై ఆసనం.. ఆకట్టుకున్న విన్యాసం
సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ వీజీకే నాయుడు మంగళవారం నీటిపై ఆసనాలు వేసి, అబ్బురపరిచారు. సోమవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో విద్యాలయ ఆవరణలోని కుంటలు నిండాయి. ప్రిన్సిపాల్ నీటిపై ఆసనాలు వేస్తారని తెలుసుకున్న విద్యార్థులు విన్యాసాలు ప్రదర్శించాలని విన్నవించగా ఆయన అంగీకరించారు. గతంలో కృష్ణానదిలో ఆసనాలు వేసిన ఆయన ఇక్కడికి కుంటలోనూ ఆసనాలు వేసి ఆశ్చర్యపరిచారు. నిద్రాసనం, శవాసనం, పూర్ణాసనం, వజ్రాసనం, కూర్మాసనం, కలైరాసనం, దర్వాసనం, అధోముఖాసనం, సూర్యనమస్కారాసనం, కత్తిరాసనం తదితర ఆసనాలను వేశారు. చివర్లో చేతిలో కర్పూరం వెలిగించిన మట్టి తట్టను నీటిలో తడవకుండా చేతిలో పెట్టుకుని ఆసనం వేశారు. ఆయన నీటిలో వేసిన ఆసనాలను తిలకించిన విద్యార్థులు, అధ్యాపకులు ప్రిన్సిపాల్ ప్రతిభకు చపట్లు కొట్టి, అభినందించారు. -
నిన్న షమీ భార్య.. నేడు మహ్మద్ కైఫ్
భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇటీవల తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేయగా.. షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకుని ఫొటోలో కనిపించడంపై కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. దీనిపై షమీ ఘాటుగా స్పందించగా, మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతనికి అండగా నిలిచాడు. తాజాగా మహ్మద్ కైఫ్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. కైఫ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోపై వివాదం ఏర్పడింది. ఈ ఫొటోలో కైఫ్ సూర్యనమస్కారాలు చేస్తున్నట్టుగా ఉంది. దీనిని కొందరు మతకోణంలో విమర్శించారు. సూర్య నమస్కారాలు చేయడం ఇస్లాం సంప్రదాయాలకు, సంస్కృతికి వ్యతిరేకమని, వివాదాస్పదమైన ఫొటోను ఎందుకు పోస్ట్ చేశావని ఓ నెటిజన్ కైఫ్‌ను విమర్శించాడు. ఇస్లాంలో సూర్యనమస్కారం వందశాతం నిషేధం అంటూ మరో నెటిజెన్ తప్పుపట్టాడు. దీనికి కైఫ్ ఘాటుగా సమాధానాలిచ్చాడు. సూర్య నమస్కారం అన్నది పూర్తిగా భౌతిక వ్యవస్థ పనితీరుకు సంబంధించినదని, ఏ పరికరం లేకుండా ఎక్సర్సైజ్ చేసే పద్ధతని, తన హృదయంలో అల్లా ఉన్నాడని, సూర్యనమస్కారం చేసినా, జిమ్‌లో కసరత్తులు చేసినా అందరికీ ఉపయోగమని.. కైఫ్ రీ ట్వీట్ చేశాడు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం కోసం కైఫ్ ఈ ఫొటోలను పోస్ట్ చేయడాన్ని చాలామంది ప్రశంసించారు. (చదవండి: క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..)