
బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్‌గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్‌తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్‌గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్ బాడీతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్ ప్లాన్, వర్కౌట్‌లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్‌నెస్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..
ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్ ఫిగర్‌ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్-వర్కౌట్ ప్లాన్‌ని అనుసరించిందంటే.
రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...
తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.
ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్
రెండు గంటలు వ్యాయామం
అల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్
మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.
సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .
రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.
100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవు
చివరగా టైనర్ సత్యజిత్ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన్గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్ ప్లాన్‌ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు.
నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు.
(చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!)
Comments
Please login to add a commentAdd a comment