
ప్రపంచ అపరకుభేరుడు, మైక్రోసాఫ్ట్ విండోస్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ దంపతులు అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి స్వస్థి చెబుతూ విడిపోయారు. అయితే దీన్ని అతిపెద్ద విచారంగా పేర్కొన్నారు బిల్‌గేట్స్. ఆ వ్యాఖ్యలపై ఎప్పుడు స్పందించలేదు మెలిండా ఫ్రెంచ్ గేట్స్. అయితే ఆమె తొలిసారిగా విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మెలిండా తన మాజీ భర్త బిల్‌గేట్స్ మాటలకు నేరుగా స్పందించకపోయినప్పటికీ..పరోక్షంగా సమాధానమిచ్చారు. "అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవంచలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అవసరంగా అభివర్ణించారు. అయితే బిల్‌గేట్స్ వ్యాఖ్యలపై మాట్లాడనని నిర్మోహటంగా చెప్పేశారు.
ఎందుకంటే అతనికి తనకంటూ సొంత జీవితం ఉంది. ఇప్పుడు నా జీవితం నాకు ఉంది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి విడాకులు అనేది భావోద్వేగ భారం అన్నారు." ఎందుకంటే ఆ సమయంలో తానెంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. వివాహం విడిచిపెడుతున్నప్పుడు..చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఆ సమయంలో జరిగే చర్చలన్నీ కఠినంగా ఉంటాయన్నారు. 2014లో గేట్స్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అచ్చం అలాంటి భాధ, తీవ్ర భయాందోళనలు కలిగాయని అన్నారు.
అలాంటి సమయంలో వెంటనే ఇది సరైనది కాదా అని సానుకూలంగా ఆలోచించి..త్వరితగతిన బయటపడాలి లేదంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుందన్నారు. ఆ తర్వాత తాను నెమ్మదిగా దాని విలువ అర్థం చేసుకుని నిశబ్దంగా నిష్క్రమించానన్నారు. అలాగే ఇక్కడ భయాందోళనలకు గురవ్వడం అంటే తాను దెబ్బతిన్నట్లు కాదని కూడా చెప్పారు. ఇక్కడ తాను గుర్తించాల్సిన కొన్ని కష్టమైన విషయాలను ఎదుర్కొన్నానని అందువల్ల తనకు విడిపోవడం అనేది తప్పనిసరి అంటూ మెలిండా విడాకుల తీసుకోవడానికి గల కారణాలను వివరించారు.
కాగా, ఈ జంటకు జెన్నిఫర్(28) రోరీ(25), ఫోబ్(22)లు ఉన్నారు. అంతేగాదు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇక బిల్‌గేట్స్ 2022 నుంచి మాజీ ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో లేటు వయసు విడాకులు ఎక్కువఅవుతున్నాయి. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత తాము ఏం కోల్పోయామో వెతుకుతూ విడిపోతున్నారు. మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే..
ఎంతోమంది సెలబ్రిటీలు, ప్రముఖులు పిల్లలు సెటిల్ అయిపోయాక విడిపోతున్నారు. మాకు స్పేస్ కావాలని కొందరూ..ఇనాళ్లు తన ఉనికే కోల్పోయానని కొందరూ అంటున్నారు. అన్నేళ్లు కలిసి ఉండటానికి.. బాధ్యతలు, పిల్లలు వంటి తదితర కారణాలే గానీ ఎప్పుడో వాళ్ల మధ్య బంధం విచ్ఛిన్నమైందని, అందువల్లే ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు మానసిక నిపుణులు.
ఏదీఏమైనా..ఆ పరిస్థితి ఎదురవ్వక ముందే భాగస్వాముల్లో ఎవ్వరో ఒక్కరో దీన్ని గుర్తించి తమ బంధాన్ని కాపాడుకునే యత్నం చేయాలంటున్నారు. అలాగే మనతో సాగే సహచరులను నిర్లక్ష్యం చేస్తే..వాటి పర్వవసానం చివర్లో ఇలానే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి వయసులో కంటే వృద్ధాప్యంలోనే తోడు ఉండాలని ఆ సమయంలోనే.. అసలైన దాంపత్యం ఇరువురి నడుమ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?)