
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి మెలిందా గేట్స్(Melinda Gates) విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత తన మాజీ భర్త ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎల్లే మ్యాగజైన్‌తో మాట్లాడిన 60 ఏళ్ల మెలిందా గేట్స్ తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ‘విడాకులు బాధాకరమైనవి. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మెలిందా, బిల్ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2021 మేలో విడాకులు తీసుకున్నారు. తర్వాత మూడు నెలలకు అధికారికంగా వీరు విడిపోయారు. ఇటీవల తమ బ్రేకప్‌పై బిల్‌గేట్స్ టైమ్స్ ఆఫ్ లండన్‌తో మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారం తనకు, మెలిందాకు కనీసం రెండేళ్ల పాటు బాధను మిగిల్చిందని అన్నారు. తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని తమ విడాకులేనన్నారు. తాను ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నెలల తర్వాత మెలిందా తాజాగా స్పందించడం గమనార్హం. తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు మెలిందా తెలిపారు. విడాకులు బాధాకరమైనవని చెప్పారు. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం కష్టమైనప్పటికీ జీవితాన్ని స్వతంత్రంగా పునర్నిర్మించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె అన్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ బ్రాండ్ ప్రచారకర్తలుగా మహేష్, సితార
2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్‌తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment