డొనాల్డ్ ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేసి వైట్‌హౌస్‌కి మరోసారి కుంటుంబంతో తిరిగి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబసభ్యులు, వంశవృక్షం గురించి హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ట్రంప్ తల్లిదండ్రులు, అతని సోదర సోదరిమణలు ఎవరనేది వెలుగులోకి వచ్చింది. మరీ ట్రంప్ కుటుంబ వృక్షం ఏంటో ఓ లుక్కేద్దామా..!.
డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తల్లిదండ్రులు వలసదారులు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్(Fred Trump) కాగా, తల్లి మేరీ ట్రంప్(Mary Trump). ట్రంప్ తండ్రి జర్మన్ వలసదారుల కుమారడు. బ్రోంక్స్‌లో జన్మించిన ఆయన నిర్మాణ రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇక తల్లి మేరి మాక్లియోడ్ ట్రంప్ లూయిస్ ద్వీపంలో జన్మించిన స్కాటిష్ వలసదారు. ఆమె కేవలం 50 డాలర్లు(రూ.40 వేలు)తో యూఎస్ వచ్చింది. బతకు భారం కావడంతో పనిమనిషిగా జీవనం సాగించేది.
ఆ తర్వాత ఫ్రెడ్ ట్రంప్‌ని కలిసింది. ఇరువురు తొలిచూపులోనే ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. వారు మేరియన్నే, ఫ్రెడ్ జూనియర్, ఎలిజబెత్, డోనాల్డ్ , రాబర్ట్. అయితే ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ పన్ను ఎగవేసి, ఫెయిర్ హౌసింగ్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. అలాగే 1927లో, కు క్లక్స్ క్లాన్ మార్చ్‌లో పాల్గొన్నందుకు కూడా అరెస్టు అయ్యాడు.
ట్రంప్ సోదర, సోదరీమణులు..
పెద్ద అక్క మేరియన్నే ట్రంప్ బారీ..
ఈమె దశాబ్దాలుగా యూఎస్ ఫెడరల్ న్యాయమూర్తిగా సేవలందించింది. ఆమెకు ఒక కుమారుడు విడ్ విలియం డెస్మండ్ ఉన్నాడు.
ట్రంప్ అన్న ఫ్రెడ్ జూనియర్..
ఈయనే పెద్దకొడుకు. ట్రంప్ తండ్రి కుటుంబ వ్యాపారాన్ని చూసుకునేవాడు. కొన్నాళ్లు పైలెట్‌గా కూడా పనిచేశారు. అయితే మద్యపాన వ్యసనానికి గురై కెరీర్ దెబ్బతింది. జస్ట్ 42 ఏళ్లకే మరణించాడు. ఈయనకు జూనియర్‌కు మేరీ ట్రంప్, ఫ్రెడ్ ట్రంప్ III అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిన్న అక్క ఎలిజబెత్ ట్రంప్ గ్రౌ
1942లో జన్మించిన ఎలిజబెత్ కొన్నాళ్లు అమెరికా ఆర్థక సేవల బహుళ సంస్థ జేపీ మోర్గాన్‌లో చేశారు. డాక్యుమెంటరీ నిర్మాత జేమ్స్ గ్రౌను వివాహం చేసుకున్నార. పామ్ బీచ్‌లో నివశిస్తోంది. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు.
చిన్న తమ్ముడు రాబర్ట్ ట్రంప్
డోనాల్డ్ విశ్వసనీయ మిత్రుడుగా వ్యవహరిస్తాడు. అదీగాక ట్రంప్ ఆర్గనైజేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా. రెండు వివాహాల చేసుకున్నారు. ఒక కూమారుడుని దత్తత కూడా తీసుకున్నారు. ఆయన 2020లో మరణించారు.
డోనాల్డ్ ట్రంప్ భార్యలు, పిల్లల
ఇవానా ట్రంప్
ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (1949-2022), ఒక చెక్-అమెరికన్ వ్యాపారవేత్త. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె 2022లో మరణించింది.
డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (1977): ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్.
ఇవాంకా ట్రంప్(Ivanka Trump (1981)): ఆమె గతంలో ట్రంప్‌కి మాజీ సీనియర్ సలహాదారు. జారెడ్ కుష్నర్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన కూడా ట్రంప్ అధ్యక్ష పదవిలో కీలక సలహాదారు. వారికి ముగ్గురు పిల్లలు: అరబెల్లా, జోసెఫ్,థియోడర్.
ఎరిక్ ట్రంప్ (1984): ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. లారా ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రెండో భార్య మార్లా మాపుల్స్
డోనాల్డ్ రెండవ భార్య మార్లా మాపుల్స్ (1963). ఆమె ఒక టెలివిజన్ నటి. వారికి ఒక కుమార్తె. టిఫనీ ట్రంప్
టిఫనీ ట్రంప్ (1993): ఆమె జార్జ్‌టౌన్ లా గ్రాడ్యుయేట్.
మూడో భార్య మెలానియా ట్రంప్
ట్రంప్ ప్రస్తుత భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (1970). స్లోవేనియన్-అమెరికన్ మాజీ మోడల్. ఆమెకు ఒక కుమారుడు బారన్ ట్రంప్
బారన్ ట్రంప్ (2006): ట్రంప్ చిన్న కుమారుడు. తల్లిదండ్రలతో కలిసి ఉంటున్నాడ. ప్రస్తతం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.
ట్రంప్ అన్న పిల్లలు..
మేరీ ట్రంప్ (1965): ఫ్రెడ్ జూనియర్ కుమార్తె. ఆము మనస్తత్వవేత్త, రచయిత్రి. కటుంబంపై విమర్శలు చేస్తుంటుందని సమాచారం
ఫ్రెడ్ ట్రంప్ III (1962): ఫ్రెడ్ జూనియర్ కుమారుడు.రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్‌గా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.
ట్రంప్ మనవరాళ్ళు, మనవళ్లు..
అరబెల్లా, జోసెఫ్, థియోడర్ కుష్నర్ (కూతురు ఇవాంకా, జారెడ్ దంపతుల పిల్లలు)
కై, డోనాల్డ్ III, ట్రిస్టాన్, స్పెన్సర్, క్లో ట్రంప్ (కుమారుడు డొనాల్డ్ జూనియర్ పిల్లలు).
ఎరిక్, లారా ట్రంప్ ఇద్దరు పిల్లలు.
ఇది అమెరికా అధ్యక్షుడి వంశ వృక్షం. చాలా పెద్దగానే ఉంది కదూ..!
(చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment