అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ జనవరి 19న క్యాబినెట్(cabinet ) కోసం క్యాండిల్ లైట్ ప్రైవేట్ డిన్నర్(private dinner)ని ఏర్పాటు చేశారు. ఈ విందుకి ఎందరెందరో అతిరథ మహారథులు హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో అమెరికా(United States) ఉపాధ్యాక్షుడు(Vice-President) జేడీ వాన్స్(JD Vance), ఆయన భార్య ఉషా చిలుకూరి(Usha Chilukuri )స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో మెరిశారు. ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా నిలిచి ఈ విందులో సందడి చేశారు. ఉషా ఈ డిన్నర్ పార్టీ కోసం అమెరికా ప్రసిద్ధ డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్ వేర్ గౌనులో ఉషా మెరిశారు. అందుకు తగ్గట్టుగా కురులను బన్ మాదిరిగా స్టైలిష్‌గా వేసుకున్నారు. ఆ లుక్‌లో ఉషా అదిరిపోయింది.
ఇక వైస్ ప్రెసిడెంట్ జేడీ ఆన్స్ సంప్రదాయ వేషధారణకు ప్రాధాన్యతమిచ్చేలా తరుచుగా సింగిల్-బ్రెస్ట్ సూట్‌లలో కనిపిస్తాడు. ఆ సూట్‌కి సరిపోయేలా సిన్సినాటిలోని ఇటాలియన్ దర్జీ వద్ద కొనుగోలు చేసే నెక్ టెక్‌లను ధరిస్తాడు. ఆయన ఎక్కువగా నేవీ లేదా గ్రే కలర్ సూట్‌లనే ధరిస్తారు. ఉపాధ్యక్షుడిగా మారాక వాన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మరింతగ మారడమే గాక బరువు కూడా తగ్గడం విశేషం.
కాగా, ట్రంప్ క్యాండిల్‌లైట్ డిన్నర్‌లో ఇవాంకా ట్రంప్ కూడా ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్‌కి సంబంధించిన మరో గౌనులో తళుక్కుమంది. ఇవాంక స్టమ్ ఆఫ్-షోల్డర్, క్రిస్టల్, పెర్ల్-ఎంబ్రాయిడరీడ్ ఎంపైర్ వెయిస్ట్ గౌనులో మెరిసింది. సింపుల్‌గా వజ్రపు చెవిపోగులను ధరించింది.
(చదవండి: ‘పుష్ప-2’విలన్‌కి ఆ సమస్య..భార్య ఏం చేసిందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment