ఈరోజు నూతన సంవత్సరంలో తొలి రోజు.. అందుకే ఈరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలు సందర్శించి, దేవునికి పూజలు చేస్తుంటారు. ఫలితంగా ఈరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. కాగా పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, గవర్నర్లు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'havan' and 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2024
(Video source: CMO) pic.twitter.com/0juG1CX7Vd
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (సోమవారం) ఉదయం గోరఖ్‌పూర్ చేరుకుని, గోరఖ్‌నాథ్ ఆలయంలో యాగం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ 2024 సంవత్సరం తొలి రోజు మోధేరా సూర్య దేవాలయంలో సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఈ రోజు అత్యధిక సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూర్య నమస్కార కార్యక్రమంలో నాలుగువేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు.
ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
#WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi participate in the Suryanamaskar Program at Modhera Sun Temple, on the first morning of the year 2024. pic.twitter.com/t3z3iBBIuk
— ANI (@ANI) January 1, 2024
Comments
Please login to add a commentAdd a comment