puja
-
సరస్వతి పూజలో టీమిండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా కుటుంబం (ఫొటోలు)
-
పూజా ఖేద్కర్‌కు మరో షాక్.. అరెస్టు తప్పదా?
ఢిల్లీ : వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. అధికార దుర్వినియోగంతో పాటు, ఐఏఎస్‌కు ఎంపిక అయ్యేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. #BREAKING Delhi High Court denies anticipatory bail to former probationer IAS officer Puja Khedkar accused of “misrepresenting and falsifying facts" in her UPSC application. #PujaKhedkar #UPSC pic.twitter.com/mgw3QYhaux— Live Law (@LiveLawIndia) December 23, 2024పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..జస్టిస్ చంద్ర ధరి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. పూజా ఖేద్కర్ ఉద్దేశ పూర్వకంగానే ఐఏఎస్ ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించినట్లు తాము గుర్తించాం. ఆమె కుట్ర పూరితగా చర్యలు ఐఏఎస్‌కు అనర్హులు. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలు ‘అధికారం కోసమే కాకుండా, దేశం మొత్తాన్ని మోసం చేశారనే దానికి ఉదాహరణ నిలుస్తారు.‘పిటిషనర్ (పూజా ఖేద్కర్) ప్రవర్తన పూర్తిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ పత్రాలు సమర్పించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు భారీ ఎత్తున మోసానికి తెరతీశారు.’ ‘ప్రస్తుతం కేసు దర్యాప్తు, అందుబాటులో ఉన్న రికార్డ్ల ఆధారంగా పూజా ఖేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందేందుకు అనర్హులు. దీంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కుమ్మక్కయ్యే అవకాశం ఉంది’. దీంతో ప్రభుత్వ అధికారులు, సంబంధిత విభాగాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉండననుంది.వివాదాస్పద కేసులో గతంలో పూజా ఖేదర్కర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చిన జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం.. ఈ రోజు విచారణలో ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో పోలీస్ శాఖ పూజా ఖేద్కర్ అరెస్ట్ తప్పదన్న చర్చ మొదలైంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కారు. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా యూపీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆమె ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ఎంపిక అవ్వడం వరకూ పూజా ఖేద్కర్ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమెపై కోర్టులో కేసు నడుస్తోంది. నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.ఐఏఎస్ సర్వీస్ నుంచి తొలగింపుఇలా వరుస వివాదాల నేపథ్యంలో కేంద్రం పూజా ఖేద్కర్‌పై విచారణకు ఆదేశించింది. విచారణాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరణఈ వివాదంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు మార్లు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. తాజాగా, సోమవారం సైతం ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. -
వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు
-
365 వత్తులు.. కార్తీక పురాణం ఏం చెబుతోంది?
కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానంగంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. -
న్యూజర్నీ: దీపావళి వేళ నటి గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
దీపావళి వేడుకలు: అయోధ్య నుంచి అమృత్సర్ వరకూ..
దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి ప్రత్యేక సంప్రదాయాలనున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలు ప్రధాన నగరాల్లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.అయోధ్యఈ ఏడాది ప్రపంచమంతా అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలను చూసేందుకు పరితపిస్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టితుడయ్యాడు. రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని ఓడించి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళికి అయోధ్యలో 28 లక్షల దీపాలు వెలిగించి, ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వారణాసికాశీ అని కూడా పిలిచే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడి గాలిలో ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికి లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తుంటారు. ఇక్కడ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.ఉదయపూర్రాజస్థాన్లోని ఉదయపూర్ నగరం సరస్సుల నగరంగా పేరొందింది. ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సరస్సుల ఒడ్డున ఉన్న ప్యాలెస్‌లు విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతుంటాయి. ఉదయపూర్‌లోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అమృత్సర్అమృత్సర్లో దీపావళి వేడుకలు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. స్వర్ణ దేవాలయంలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి నాడు గ్వాలియర్ కోట నుండి ఆరవ సిక్కు గురువుతో పాటు 52 మంది ఇతర ఖైదీలను విడుదల చేసిన రోజును సిక్కు సోదరులు గుర్తు చేసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ కూడా బంగారు దీపాలతో ప్రకాశవంతంగా మారిపోతుంది.కోల్కతాపశ్చిమబెంగాల్లో దీపావళి నాడు కాళీ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రాత్రివేళ కాళీ పూజలు చేస్తారు. దీంతో దీపావళి రాత్రి వేళ నగరం దీపకాంతులతో శోభాయమానంగా మారిపోతుంది.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
లంబోదరుడి సేవలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా (ఫొటోలు)
-
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ సవాల్!
ఢిల్లీ : తన అభ్యర్థిత్వం రద్దు చేసే హక్కు యూపీఎస్సీకి లేదని వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒకసారి ఎంపికై ప్రొబేషనర్‌గా నియమితులైన తర్వాత, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం లేదన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే ఉందని, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954 సీఎస్ఈ 2022 రూల్స్‌లోని రూల్ 19 ప్రకారం ప్రొబేషనర్ రూల్స్ ప్రకారం చర్య తీసుకోవచ్చు’అని ఖేద్కర్ పేర్కొన్నారు.పూజా ఖేద్కర్ కేసు ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న పూజా ఖేద్కర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆమె వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.ఆ తర్వాత ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. విచారణలో ఆమె తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలింది. దీంతో పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. -
పూజా ఖేద్కర్ వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వైకల్య ధ్రువీకరణ పత్రాల వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల నియామకం, శిక్షణ, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)విభాగం అప్రమత్తమైంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఆర్ఎస్ అధికారి ఉన్నట్లు సమాచారం.లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికెట్తో పాటు కంటి, మానసిక సంబంధిత సమస్యలపై తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించేందుకు నిర్వహించే వైద్య పరీక్షలకు ఖేద్కర్ ఆరుసార్లు గైర్హాజరవ్వడం వంటి వరుస వివాదాలు ఆమె ఐఏఎస్ అభ్యర్థితత్వం రద్దుకు దారి తీసింది. ట్రైనీ ఐఎస్ఎస్ అధికారిణి చేసిన తప్పుల్ని గుర్తించిన యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది.తదుపరి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్ తప్పదేమోనన్న అనుమానంతో ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ వరుస పరిణామాలతో ఖేద్కర్ విదేశాలకు పారిపోయినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.Puja Khedkar case: Following the row over #IAS probationer #PujaKhedkar, the Department of Personnel and Training (#DoPT) will now scrtutinise the disability certificates of six other civil servants.https://t.co/F4bXZs7rL9— Business Today (@business_today) August 2, 2024 -
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేద్కర్?
న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?. ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. -
పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షల్లో గట్టెక్కేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. నకిలీ పత్రాల కేసులో ఖేద్కర్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. తనని (ఖేద్కర్) ఓ అధికారి లైంగికంగా వేధించారని, ఆయనపై ఫిర్యాదు చేసినందుకు తనని టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఖేద్కర్ వ్యవస్థను మోసం చేశారని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆమె ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను రాసినట్టు గుర్తించిన యూపీఎస్సీ ఈ మేరకు ఆమెపై చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. #Justin: Delhi's Patiala House Court denying bail to #IAS Puja Khedkar says she's able to breach the wall of #UPSC not only once but repeatedly with deceitful means.It also says that she snatched rights of other eligible aspirants with disability benchmark quota@CNNnews18 pic.twitter.com/YCR2bfzoPr— Ananya Bhatnagar (@anany_b) August 1, 2024పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఖేద్కర్‌పై ఢిల్లీ పోలీసులకు యూపీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, డిసెబిలిటీ యాక్ట్ కింద ఫోర్జరీ,చీటింగ్ కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ ఈ కేసులో దర్యాప్తు "చాలా ప్రారంభ దశలో ఉంది" అని వాదించారు. కేసు తదుపరి విచారణ కోసం ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని వాదించారు.పూజా ఖేద్కర్ లాంటి వారి పట్ల కఠినంగా వ్యహరించాలి" వాదన సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖేద్కర్ గురించి ప్రస్తావిస్తూ.. వ్యవస్థల్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇంకా దుర్వినియోగం చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయి " అని అన్నారు. -
పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ప్రొవిజినల్ అభ్యర్ధిత్వాన్ని యూపీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. అదే విధంగా భవిష్యత్తులోనూ కమిషన్ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు హాజరు అవ్వకుండా ఆమెపై నిషేధం విధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూజా దోషిగా తేలినట్లు నిర్ధారించిన కమిషన్ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.కాగా పూజా ఖేద్కర్‌కు 18 జూలైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జూలై 25 లోపు సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరగా.. యూపీఎస్సీ జూలై 30 వరకు డెడ్‌లైన్ విధించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకునే విషయంపై కూడా యూపీఎస్సీ ఆమెకు వెల్లడించింది. ఇక నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వడంతో పూజా విఫలమవ్వడంతో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం తప్పుడు పత్రాల సమర్పణ, అంగ వైకల్యం, మానసిక వైకల్యాల గురించి అబద్దాలు చెప్పడమే కాకుండా సాధారణ కేటగిరీలో అనుమతించిన ఆరు కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసినట్లు తెలిపింది. .తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడినట్లు వివరించింది. పుణెలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆమెను మరో చోటుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుంది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించడం, మెడికల్ టెస్టులకు హాజరు కాకపోవడం బయటపడింది. దీంతో పూజా ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఖేద్కర్ తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్‌పై పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఖేద్కర్ తల్లి మనోరమ కూడా భూ వివాదం కేసులో రైతలను తుపాకీతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. -
ఆషాఢ గజానన సంకష్ట చతుర్థి : విశిష్టత, లాభాలు
ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంకష్ట చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట. అందుకే ఈ మాసంలో శివుడితోపాటు, ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం కలిసివస్తుందని అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజానన సంకష్ట చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు. అన్నార్తులకు అవసరమైన ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు. తద్వారా కష్టనష్టాలు తొలగి ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు. -
పూజా ఖేద్కర్‌కు UPSC షాక్.. అభ్యర్థిత్వం రద్దు
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) షాకిచ్చింది. నకిలీ దృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ సెలక్షన్‌ను క్యాన్సిల్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు భవిష్యత్‌లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనకుండా డీబార్ చేసింది. UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek— ANI (@ANI) July 19, 2024శుక్రవారం (జులై 19) యూపీఎస్సీ కమిషన్ పూజా ఖేద్కర్ వివాదంపై అధికారికంగా స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు.సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫొటోలు,సంతకాలు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్‌తో పాటు ఇతర వివరాలన్నీ తప్పుడు ధృవీకరణ పత్రాలను అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటిస్తూ మీడియోకు ఓ నోట్‌ను విడుదల చేసింది.ఆ నోట్లో మోసపూరిత కార్యకాలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్‌పై అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 నిబంధనల ప్రకారం.. భవిష్యత్‌లో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా, అభ్యర్ధిత్వాన్ని ప్రకటించకుండా డీబార్ చేసినట్లు పేర్కొంది. పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించడంతో పూజా ఖేద్కర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. -
మరో మలుపు తిరిగిన పూజా ఖేద్కర్ వ్యవహారం
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పుణే జిల్లా కలెక్టర్ సుహార్ దివాసే తనను వేధించారంటూ వాశిం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓ అధికారి ధృవీకరించారు. మహిళా పోలీసులు సోమవారం వాశింలోని ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె పుణే కలెక్టర్ సుహాస్ దివాసేపై ఫిర్యాదు చేశారు అని ఆ అధికారి తెలిపారు. అయితే.. గత రాత్రి 11 గం. సమయంలో ముగ్గురు మహిళా పోలీస్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 1గం. టైంలో వెళ్లిపోయారు. పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై నిన్న మీడియా ముందు పూజా ఖేద్కర్ మరోలా స్పందించారు. తనకు పని ఉండి మహిళా పోలీసులను తానే పిలిచానని ఆమె చెప్పారు. అయితే ఆ పని ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు. ట్రెయినింగ్‌లో ఉంటూనే పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆమెను వాశింకు బదిలీ చేసింది కలెక్టర్ సుహార్ దివాసే. మరోవైపు ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ.. రీకాల్ ఆదేశాలు జారీ చేసింది ముస్సోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తక్షణమే ఆమెను వెనక్కి రావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆమెపై చర్యల కోసమే ఆ ఉత్తర్వులు వెలువడి ఉంటాయనే చర్చ నడుస్తోంది. -
అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్
ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె. శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్ సర్వీస్‌లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె. #WATCH | Maharashtra: Trainee IAS officer Puja Khedkar says "I will testify in front of the expert committee and we will accept the decision of the committee...I do not have the right to tell you whatever investigation is going on. Whatever submission I have, will become public… pic.twitter.com/vsGISCyRho— ANI (@ANI) July 15, 2024నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు. -
పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం!
ఈరోజు నూతన సంవత్సరంలో తొలి రోజు.. అందుకే ఈరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలు సందర్శించి, దేవునికి పూజలు చేస్తుంటారు. ఫలితంగా ఈరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. కాగా పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, గవర్నర్లు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'havan' and 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur (Video source: CMO) pic.twitter.com/0juG1CX7Vd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2024 యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (సోమవారం) ఉదయం గోరఖ్‌పూర్ చేరుకుని, గోరఖ్‌నాథ్ ఆలయంలో యాగం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ 2024 సంవత్సరం తొలి రోజు మోధేరా సూర్య దేవాలయంలో సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఈ రోజు అత్యధిక సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూర్య నమస్కార కార్యక్రమంలో నాలుగువేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు #WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi participate in the Suryanamaskar Program at Modhera Sun Temple, on the first morning of the year 2024. pic.twitter.com/t3z3iBBIuk — ANI (@ANI) January 1, 2024 -
అయోధ్యలో అక్షత పూజ
అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు. వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది. -
వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!
గణపతి పూజావిధానంలోనే ‘...పత్రం సమర్పయామి’ అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. ఆ పత్రిలో ఒక్కో ఆకుకు ఒక్కో విశిష్టత ఉంది. అవేమిటో తెలుసుకుందాం. మాచీ పత్రం (దవనం ఆకు): ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది. బృహతీ పత్రం (నేల మునగ ఆకు): దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది. బిల్వ పత్రం (మారేడు ఆకు): దీనికే మరో పేరు ’బిలిబిత్తిరి’. ’త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం’ అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది. దూర్వాయుగ్మం (గరిక): చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి లా పనిచేసి మాడ్చేస్తుంది. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు): దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది. బదరీ పత్రం (రేగు ఆకు): జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి. అపామార్గ పత్రం (ఉత్తరేణి): పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి. తులసీ పత్రం: ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి. చూత పత్రం (మామిడి ఆకు): దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు): పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి): జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు. దాడిమి పత్రం (దానిమ్మ ఆకు): రక్తవద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు. దేవదారు పత్రం (దేవదారు ఆకు): జ్ఞానవద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది. 14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ. – డి.వి.ఆర్. (చదవండి: వినాయకుని పూజలో చదవాల్సిన కథ) -
ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్న పూజలు
తమిళనాడు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సొరకాల్‌నత్తం గ్రామానికి చెందిన కేశవన్ ఇతని భార్య వాసంతి. వీరికి ఎయిల్ అరసన్, ఉదయ్‌వసంత్(20) పిల్లలున్నారు. ఎయిల్ అరసన్ సొరకాల నత్తం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఉంటున్నాడు. ఉదయ్‌వసంత్ రెండు నెలల క్రితం అదే గ్రామంలో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని శ్మశానంలో దహన క్రియలు చేశారు. చెరువు గట్టు వద్ద ఆత్మగా తిరుగుతున్న ఉదయ్‌వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం మృతిచెందిన ఉదయ్‌వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు చెరువు గట్టు వద్ద కుటుంబ సభ్యులు పూజలు చేశారు. అక్కడ పూలకరగం పెట్టి నేలపై పసుపు, పుష్పాలు పెట్టి మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయ్‌వసంత్ చిత్రపటంతో పాటు కరగను చెరువు గట్టు నుంచి ఇంటికి మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఒకటిన్నర కిలో మీటరు దూరం పసుపు నీల్లు, పుష్పాలు చల్లి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ఉదయ్‌వసంత్ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టి పూల మాల వేసి పూజలు చేశారు. మృతి చెందిన కుమారుడి ఆత్మ ఇంటికి రావాలని కుటుంబసభ్యులు పూజలు చేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. -
Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్
కర్ణాటక: సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాలు.. కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు. మృతదేహాన్ని దహనం చేసేముందు అఘోర శవంపై కూర్చొని పూజలు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్‌ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
తెలంగాణ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్
-
నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ
ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా మహాపూజకు తొలి అడుగుపడింది. జనవరి 21న నిర్వహించనున్న మహాపూజలో భాగంలో సోమవారం ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్‌లోని మురాడి వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచారయాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. అనంతరం పూజలు చేసి ప్రచారరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాథోడ్ జనార్దన్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. –ఇంద్రవెల్లి -
జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది దుర్మరణం
పాట్నా: బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. నయా గావ్ టోలి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భూయాన్ బాబా పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వచినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాజిపూర్లోన సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు సహాయంగా అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు -
గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్
-
రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ..
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు నడిపే ప్రత్యేక రైళ్లలో భక్తులు పూజలు చేసుకోవచ్చని.. కానీ హారతి కర్పూరం, దీపాలు, అగరొత్తులు వెలిగించరాదని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది. నిప్పు వల్ల రైళ్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, భక్తులు రైళ్లలో అగ్గి పుల్లలు కూడా వెలిగించొద్దని ఆ ప్రకటనలో సూచించింది. మండే స్వభావం ఉన్న వాటిని వినియోగించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి రైల్వే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయంలో జరిగిన పెన్షన్ అదాలత్‌లో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ సెల్‌ను ప్రారంభించారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు! -
దెయ్యం ఉందంటూ శాంతి పూజలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం శాంతిపూజలు చేశారు. వసతిగృహంలో దెయ్యం ఉం దంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు. దీంతో ‘శాంతి పూజలు చేశాం. వేదపండితుల సమక్షంలో దెయ్యం పారిపోవాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. దెయ్యం వసతి గృహంవైపు రాకుండా అష్టదిగ్బంధనం చేశాం’ అని మామిడిగూడ ఆదివాసులు తెలిపారు. వసతి గృహంలో ఎలాంటి దెయ్యం లేదని, వదంతులు నమ్మొద్దని కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. కరోనాతోనే పిల్లలు రెండేళ్లు చదువులు నష్టపోవాల్సి వచ్చిందని, మళ్లీ దెయ్యం ఉందనే అపోహలు నమ్మి పిల్లల చదువులకు ఇబ్బందులు కలిగించొద్దని తల్లిదండ్రులను కోరారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తులందరం అండగా ఉంటామని తెలిపారు. -
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళసై తొలిపూజ
-
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
ఖైరతాబాద్: శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఈ సంవత్సరం రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. తొలిపూజ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, మహాగణపతి ఆశీర్వాదంతో తెలు గు రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలు పాల్గొన్నారు. విఘ్నాధిపతికి 60 అడుగుల కండువా మహాగణపతికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల కండువా, గరికమాల, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వామి వారికి 25 కిలోల లడ్డూను సమర్పించారు. మహాగణపతిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని పూజలు చేశారు ఇవీ చదవండి: మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ మహాకాయ.. అభయమీయవయా! -
ఢిల్లీలో TRS పార్టీ ఆఫీస్ భూమి పూజ
-
పూజలతో గ్రహస్థితి బాగు చేస్తానంటూ.. మహిళను..
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్): పూజలతో గ్రహస్థితి బాగు చేస్తానంటూ మాయమాటలతో మహిళను నమ్మించి రూ.25 లక్షలకు పూజారి టోకరా వేసి అనంతరం పరారయ్యాడు. డిచ్పల్లి ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొంత కాలంగా శ్రీనివాస్ శర్మ పూజారి (అర్చకుడు)గా పని చేస్తున్నాడు. నిజామాబాద్ కంఠేశ్వర్ న్యూ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన కొత్త మాధవీలత ఖిల్లా రోడ్లో షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త గణేష్ పక్షవాతం, మనవరాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మాధవీలత ధర్మారం(బి)లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజారికి తన సమస్యలను ఏకరువు పెట్టుకుంది. మీ గ్రహస్థితి బాగలేదని, కొంత మంది భక్తులకు లడ్డూలతో భోజనాలు వడ్డిస్తే సమస్యలన్నీ తీరుతాయని నమ్మించాడు. మాయమాటలకు నమ్మిన మాధవీలత శ్రీనగర్‌లో రెండు ఎకరాల భూమి అమ్మగా వచ్చిన రూ.25 లక్షలనుదశల వారీగా పూజారికి ఇచ్చారు. మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తడి తేవడంతో పూజారి శ్రీనివాస శర్మ మే 29 నుంచి కన్పించలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆషాఢం: కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?
ఆషాఢ మాసం.. ఎంతో విశిష్టం.. ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు.. పూరీలో జగన్నాథుని రథయాత్ర.. ఇలా ఎన్నో పండుగలు.. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం.. అయితే నవదంపతులకు మాత్రం భారం.. కోటి ఆశలతో ఒక్కటైన జంటకు నెలపాటు ఎడబాటు.. అయితే ‘సెల్’మోహన రంగా అంటూ.. విరహగీతం ఆలపిస్తారు.. వీడియో కాలింగ్‌లో విహరిస్తారు. ప్రణయ మధురిమలు పంచుకుంటారు.. సరాగాల సరిగమలు పెంచుకుంటారు.. శ్రావణం రావాలి అంటూ నిరీక్షిస్తూ ఉంటారు. సాక్షి, కడప : ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసాన్ని శూన్యమాసమంటారు. వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ► ఆషాఢమాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ► ఆషాఢ పౌర్ణమిని మనం వేద వ్యాసుని పేరిట గురుపౌర్ణమిగానిర్వహించుకుంటాం. ► తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు. వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి.. శ్రీ దుర్గామాతను శాకంబరిగా అలంకరించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. ► ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వధూవరుల విరహం.. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. కొత్త కోడలు పుట్టింటికి... ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే. ఎందుకిలా.. ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు. చాతుర్మాస దీక్షలు చేపడతారు.. ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు. – విజయ్‌భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప ఎన్నో ప్రత్యేకతలు.. ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి. – హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప -
తొలి ప్రమిద ఎవరిది?
సూర్య చంద్ర తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి పెట్టిన తొలి ప్రమిదలని శాస్త్రం చెబుతోంది. భిన్నమైన పలు గాధల సమాహారమే దీపావళి. శ్రీరామ పట్టాభిషేకం, బలి పాతాళ నిర్బంధనం, నరకుని మరణం, విక్రమార్కుని పట్టాభిషేకం, యమధర్మజునికి నీరాజనోత్సవం, గోపూజా, గోవర్ధన గిరి పూజలు, లక్ష్మీపూజ, జ్యేష్ట్యా దేవి నిష్క్రమణోత్సవం, తీర్ధంకరుడిని జ్ఞానలక్ష్మి అనుగ్రహించిన దినం, కాళీ పూజలు, మార్గ పాలిని పూజ.. వీటిలో కొన్ని మన అందరికి తెలిసి గాధలైతే ఇంకొన్ని తెలియనివి ఉన్నాయి. కాలక్రమంలో దీపావళి పండుగ పలు పేర్లను పొందింది అన్న విషయం కూడా మనకి తెలియనిదే. ఈ పండుగ మార్చుకున్న పేర్లు, వాటి వెనుక దాగిన గాథలూ, ఈ పండుగ పుట్టుక వంటి ఆసక్తికర అంశాలను పరిశీలిస్తే విస్మయం కలుగుతుంది. ఋగ్వేద కాలంలో పుట్టిన సంప్రదాయం ఇది. దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే .. అని ఆర్యోక్తి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది యేదో గుర్తించే మనం, చీకటిలో ఆ శక్తిని కోల్పోతాం. చీకటినే పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. పర బ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదే విధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్ధాలైన సూర్య–చంద్ర–తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి ప్రకాశాలే తప్ప మరొకటి కావని స్పష్టం చేశాయి. మన పండుగలు అన్ని జ్యోతిశ్శాస్త్త్ర్రంతో ముడిపడి ఉన్నవే కావడం గమనించదగిన అంశం. దీపావళి కూడా అందుకు భిన్నమైన పండుగ కాదు అంటోంది శాస్త్రం. వేదకాలంలో దీపావళి పదమూడు రోజుల పండుగ. అసలు దీపావళి అనే శబ్దం ప్రాచీన వేదాలలో ఎక్కడా కనిపించదు. అప్పట్లో దీపావళి పేరు ‘యక్ష రాత్రి’ అని పి. కె .గోడే అనే కాశీ పండితుడు పేర్కొన్నాడు. పదిహేనవ శతాబ్ది గ్రంధాలైన ‘నిర్ణయం’, ‘ధర్మ సింధువు’ లలో మొదటిసరిగా దీపావళి అనే పదం కనిపించింది. అంటే సుమారుగా గత ఐదు వందల ఏళ్ల కిందటి నుంచి మాత్రమే దీపావళి పండుగను దీపావళి పేరుతో జరుపుకుంటున్నాం. పదహారవ శతాబ్ది వరకు దీపావళి ఐదు రోజుల పాటు సాగిన పండగ కాగా నేడది కేవలం రెండు రోజుల పాటు మాత్రమే చేసుకునే పండగ అయ్యింది. చారిత్రక విశేషాలు నరకాసురుని రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురం నేటి మన అస్సాం రాష్ట్రంలోని గౌహతి. అయితే అప్పట్లో అది బర్మా వరకు వ్యాపించి ఉన్న ప్రాంతం. కృష్ణ, సత్య, నరకాసుర యుద్ధం గౌహతిలో 5065 సంవత్సరాల క్రితం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. కృష్ణుని ద్వారకా నగరం అరేబియా సముద్ర తీరమైన కథియవాడ్ ప్రాంతంలో ముంబైకి కొంత దూరంలోఉంది. ద్వారక పడమటి కొనలో ఉంటే, ప్రాగ్జ్యోతిష్యపురం తూర్పు కొనలో ఉంది.రామ, రావణ సంగ్రామ కాలం నాటికే ఫిరంగుల వాడకం ఉంది. వీటినే రావణ ఫిరంగులని,రావణ శతఘ్నులు అని పిలిచేవారు. నరక–సత్యల సంగ్రామంలోనూ వీటిని ఉపయోగించారు. అవి కాలగమనంలో బాణాసంచా అయ్యాయి. (చదవండి: దీపం జ్యోతి పరబ్రహ్మ.. ) -
అందుకే ఈ ఆడియో!
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్‌బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు. -
ప్రియుడిని పెళ్లాడిన నటి..!
‘దేవోంకీ దేవ్ మహదేవ్’(హరహర మహాదేవ శంభో శంకర) సీరియల ఫేం పూజా బెనర్జీ తన చిరకాల మిత్రుడు, నటుడు కునాల్ వర్మను వివాహమాడారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అదేంటి కరోనా లాక్డౌన్ కాలంలో ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ స్టార్ జంట గత నెలలోనే కోర్టు మ్యారేజీ ద్వారా తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఈలోగా మహమ్మారి కరోనా విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో పూజా, కునాల్ నిరాశకు గురయ్యారు. అయితే లాక్డౌన్ కారణంగా వివాహ వేడుకలను రద్దు చేసుకున్న ఈ జంట.. వాటి కోసం ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పూజా, కునాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. గతేడాది దుర్గా పూజలో సింధు ఖేల్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేసిన పూజా.. ‘‘ఈరోజు మా పెళ్లి వేడుక జరగాల్సింది. అయితే దానిని మేం రద్దు చేసుకున్నాం. అధికారికంగా మేము ఇప్పుడు భార్యభర్తలం. మా తల్లిదండ్రులు, తాతా- బామ్మల ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది తమ ప్రియమైన వాళ్లను కోల్పోవడం హృదయాలను కలచివేస్తోంది. వారి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. అదే విధంగా మా వంతు సాయంగా పెళ్లి వేడుకల కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును విరాళంగా ఇస్తున్నాం. మళ్లీ ఈ ప్రపంచం త్వరలోనే పూర్వస్థితికి రావాలని ఆశిస్తున్నాం. జై మాతాది’’అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో నూతన వధూవరులకు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు సాయపడాలన్న మీ దాతృత్వ గుణం ఆదర్శనీయం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. View this post on Instagram This is a pic from last year durga puja sindoor khela. TODAY WAS SUPPOSED TO BE OUR WEDDING BUT THE SITUATION IS SUCH THAT WE HAVE CANCELLED ALL OUR CEREMONIES ALTHOUGH WE HAD REGISTERED OUR MARRIAGE BEFORE A MONTH SO WE ARE OFFICIALLY MARRIED AND TOGETHER FOREVER NOW. WITH THE BLESSING OF OUR PARENTS AND GRANDPARENTS WE STARTING OUR NEW LIFE NEED ALL OF UR BEST WISHES. OUR FAMILY IS HAPPY AND SO ARE WE BUT GIVEN CIRCUMSTANCES OUR HEART GOES OUT TO ALL THE PEOPLE WHO ARE FIGHTING FOR THEIR LIVES RIGHT NOW AND TO ALL THE FAMILIES WHO LOST THEIR LOVED ONES . OUR PRAYERS WITH ALL OF YOU AND A SMALL CONTRIBUTION FROM OUR SIDE AS THE MONEY WE WERE TO SPEND FOR OUR MARRIAGE FUNCTION WE ARE DONATING TO PEOPLE WHO ARE IN NEED NOW 🙏 THIS IS NO TIME TO CELEBRATE BUT WE WILL CELEBRATE WITH OUR LOVED ONES ONCE THE WORLD BECOMES A HAPPY PLACE AGAIN.🙏 JAI MATA DI A post shared by Puja Banerjee (@banerjeepuja) on Apr 15, 2020 at 6:59am PDT -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత బి. వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వీఎన్ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్ విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’ చిత్రం హీరో సాగర్ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్ జి. -
అమిత్, పూజ ‘పసిడి’ పంచ్
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. చివరి రోజు పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్లో ఓడిన దీపక్ సింగ్ (49 కేజీలు), కవిందర్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సోనియా (57 కేజీలు), మనీషా (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు)లకు కాంస్యాలు దక్కాయి. ఫైనల్లో అమిత్ 5–0తో కిమ్ ఇంక్యు (కొరియా)పై, పూజా రాణి 4–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వాంగ్ లీనా (చైనా)పై గెలుపొందారు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ 2–3తో నొదిర్జాన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... కవిందర్ 0–5తో మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకి స్తాన్) చేతిలో... ఆశిష్ కుమార్ 0–5తో కులాఖ్‌మెత్ (కజకిస్తాన్) చేతిలో... సిమ్రన్‌జిత్ కౌర్ 1–4తో డాన్ డుయు (చైనా) చేతిలో ఓడిపోయారు. -
వరం ఫలితం
మనిషికి సంబంధించిన వాటికంటే, ఆదాము అనుయాయులు ఇతర స్వభావాలతో పుట్టడం జరుగుతూంటుంది. ఎవరో ఒకరు మీకు ఆ వృక్ష, జంతు జాలాలు ప్రత్యేకంగా గుర్తుచేస్తుంటారు. ఒకసారి ఓ పూజారి మహిళ కడుపున మనిషిగా జన్మించాడు. కానీ అతను చూడ్డానికి కాకి, దాతుర, కాక్టస్లకు జన్మించినవాడిలా ఉన్నాడు. తమ పిల్లవాడే అయినప్పటికీ వాడి వికృతచేష్టలకు భయపడి తల్లిదండ్రులు పిల్లవాడిని అమ్మవారి గుడికి పంపించారు, అక్కడ ఆమె కరుణతో మార్పు వస్తుందని. కానీ ప్రతీరోజు కాక్టస్కు పాలు, వెన్న పెట్టినా, అది కాక్టసే కదా. ఈ బ్రాహ్మణుడు చందనం ఎంత రాసుకుంటాడో, జపమాలతో అంత ధ్యానం చేస్తాడు. దేవీపూజ చేస్తాడు. భంగ్, గంజాయి తీసుకుంటాడు. పగలు, రాత్రీ అతని కళ్లు కాగడాల్లా ఎర్రగా ఉంటాయి. బండ పెదవులు, పచ్చని పలువరస పొట్టవరకూ గడ్డం, జుత్తు మేటవేసి పక్షి గూడులా ఉంటుంది. పైకి కట్టబడి ఉంటుంది. పొడవాటి మెడ, శరీరమంతా ఎలుగుకిలా జుత్తు.అదృష్టవశాత్తూ, ఈ బ్రాహ్మణుడి భార్య ఎంతో సాదాసీదా మనిషి. భయస్తురాలు. కానీ అతను కొట్టాలనిపించినపుడల్లా కొడుతూంటాడు, అదో రోజూవారీ కార్యక్రమంలాగా. ఆమె కూడా భర్త చేత తన్నులు తినడం కుటుంబ జీవితంలో భాగంగా భావిస్తుంది. వండటానికి ఏమీ లేనపుడు ఆమె ఎంతో ఆందోళనపడుతుంది. ఆ సమయంలో దేవతకు అర్చనగా పెట్టేది చాలా స్వల్పం. దీంతో బతుకుడు కష్టం. పైగా ఇటువంటి బ్రాహ్మణుడితో ఆమెకు దైవభక్తి రెండింతలయింది. అర్చనలు రోజు రోజుకీ తగ్గిపోయాయి. గుడిలో అమ్మవారికీ ఆందోళన పట్టుకుంది.ఒకరోజు రాత్రి భోజనం తర్వాత కాస్తంత గంజాయి లాగించి నిద్రకి ఉపక్రమిస్తూ భార్యతో ‘‘మన అమ్మవారు చాలా తక్కువస్థాయి మనిషి. పూజారే యింత దరిద్రంలో వుంటే ఈ దేవతను ఎవరు మాత్రం పూజిస్తారు?’’ అన్నాడతను. రోజూ ఈ పూజా పునస్కారాలతో ఏమి ప్రయోజనం లేదు. గుడికి వెళ్లి దేవతతోపాటు తగలబడదామనిపిస్తోంది. ఇహ కొన్ని రోజులు వేచి చూస్తా, ఆ తర్వాత నువ్వే చూద్దువు... ఆమెకు బుద్ధి చెబుతాను’’ అన్నాడు.‘‘నన్ను అలా వదిలేసి వెళ్ళకండి’’ ఈ లోకంలో భర్త లేకుండా ఒంటరిగా ఎలా బతకగలను?’’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఓహ్! ఆ సంగతి ఆలోచించనేలేదు. నయం పైకి చెప్పావు. మంచిది.’’మంచం మీద కూర్చున్నాడు. అతని భార్య వచ్చి ‘‘ఇలా జరగకుండా ఉండాల్సింది! నన్నింకా తన్నకుండానే ఎలా నిద్ర పోతారు?’’ అంది.ఇప్పుడు పిల్లాడిలా ఆ బ్రాహ్మణుడు తనను తాను మర్చిపోయి ఒకటి లేదా రెండుసార్లు నవ్వాడు. నవ్వడం అనేది అతని పెదవుల మీదికి వచ్చినప్పటి నుంచీ, దాని జ్ఞాపకం అతనికి అంతగా లేదు. భార్య మాట వినగానే, మొదటిసారిగా పెదవులపై చిర్నవ్వు మెరిసింది.‘‘నీకు విశ్రాంతి కావాలంటే నేను తన్నాలా? నీకు ఆశ్చర్యం కలగవచ్చుగానీ, నేను మనిషిగా భావించినప్పుడు మాత్రమే నిన్ను కొడుతూంటాను. మనకి పిల్లలు ఉంటే, వాళ్లనీ కొట్టేవాడిని. ఇప్పటినుంచీ ఎవరిపైనా చెయ్యెత్తితే, అది ఆ దేవత మెడమీదే. ఒక గొడ్డలి సంపాదించి వెళ్లి ఆ దేవత విగ్రహాన్ని ముక్కలు చేస్తాను. అంతా తగలబెడతాను, లోపల ఉండి పోయి. ప్రశాంతంగా మరణిస్తాను, చూడు. ఒకవేళ నేను మర్చిపోతే నాకు గుర్తుచెయ్యి. మర్చిపోకు. రాబోయే పౌర్ణమిని అలా వట్టిగా పోనీయద్దు.’’కాలం విస్ఫోటాన్ని సైతం పట్టించుకోదు. ఈ పిసినారి, పిచ్చిబ్రాహ్మణుడిని పట్టించుకుంటుందా? పగలు, రాత్రి కాలచ్రకంలో అలా సహజసిద్ధంగా కదలిపోతున్నాయి. చివరగా పౌర్ణమి రానే వచ్చింది. దేవత ఆగ్రహించింది. ఆ పిచ్చాడు ఏం చేయబోతున్నాడో చెప్పనయినా చెప్పలేదు! ఒక్కక్షణం నమ్మకస్తుడి విశ్వాసం సన్నగిల్లితే ఆమె పేరు జపించేవారు ఒక్కరయినా మిగలరు. పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆమె తన భర్తకి ప్రమాణాన్ని గుర్తుచేసింది.అతను కోపగించుకున్నాడు, వెర్రెత్తిపోయాడు, ‘‘బుద్ధిహీనురాలా! మంచి నిద్రలోకి వెళ్లే సమయంలోనా చెప్పేది? రేపు ఉదయాన్నే మొదటగా చెప్పు!’’ అన్నాడు.మర్నాడు ఉదయం ఆ బ్రాహ్మణుడు గుడికి వెళుతోండగా, అతని భార్య వేరే పనుల్లోపడి అతనికి గుర్తుచేయడం మర్చిపోయింది. దీంతో అతనికి మరింత కోపం వచ్చింది. ‘‘ఎన్నిసార్లు చెప్పాను. నాకు గుర్తుచేయమని, అయినా నువ్వు మర్చిపోయావ్! నేను యివాళ ఎవరి దగ్గర్నుంచయినా ఓ సుత్తిని తెద్దామనుకున్నాను. చెక్కలు కొట్టడానికి.’’గుడిలో అమ్మవారు ఆలోచనలో పడింది. హారతుల మీద దృష్టి పెట్టలేకపోతోంది. ఆమెకు ఈ బ్రాహ్మణుడి సంగతి బాగా తెలుసు. అతడిని శాంత పరిచేందుకు ఏదో ఆలోచన చేయాలి. అదే మంచిదనిపించింది.సూర్యాస్తమయ సమయానికి బ్రాహ్మణుడు ఆ రోజుకు చివరగా పూజచేస్తున్నాడు. అమ్మవారు విగ్రహం నుంచి వచ్చి ప్రత్యక్షమయింది. తలనించి పాదాల వరకూ ఎంతో విలువయిన వజ్రవైడూర్యాలతో మెరిసిపోతోంది. గర్భగుడి అంతా వేయి దీపాల వెలుగుగా ఉంది. బ్రాహ్మణుడు తల ఎత్తి చూశాడు. తన పక్కనున్న ఒకే ఒక్క భక్తుడు, అదో మహా అదృష్టంగా భావించాడు. ఆమె అంది, ‘‘కుమారా! ఇన్నాళ్లూ నిన్ను పరీక్షిస్తున్నాను. మరి కొంతకాలం వేచి ఉన్నట్లయితే. నీకు ఏకంగా ఇంద్రుని సింహాసనమే లభించేది. కానీ, ముందే నువ్వు సహనం కోల్పోయావు. అయినా ఫరవాలేదు, నువ్వు ఏది అడిగితే అది ప్రసాదిస్తాను’’ అన్నది.అతను భయపడకుండా అడిగాడు, ‘‘నేను ముందే చనిపోతే ఏమవుతుంది?’’ అని.ఆమె నవ్వింది.‘‘అది జరగకుండా చూస్తాను. దివ్యరాజ్యంలో రవ్వంత ఆలస్యం కారణంగా నీ జన్మ చాలా ఆలస్యం జరిగింది.’’ఆమె వచ్చినంత వేగంగా మాయమయితే ఏమవుతుంది? ఏమీ ఉండదు. అందువల్ల అతను చాలా కచ్చితంగా, ‘‘నీ నగలన్నీ నాకివ్వు. మనిద్దరం చాలా ప్రశాంతంగా జీవించొచ్చు.’’ అన్నాడు.‘‘కానీ ఆభరణాలు లేకుండా నేను ఉండకూడదు. మానవులకు దేవతల ఆభరణాలు ఉపయోగపడవు. మీరు తాకితే అవి మట్టిగా మారిపోతాయి.’’‘‘అందుకనా, నేను ఏది అడిగితే అది యిస్తానన్నావు? నాకు కావలసినదే నేను అడిగాను. అయినా, నా యిబ్బందులు నీ నుంచీ దాచలేను. నువ్వు నిజంగా నాకు వరం యివ్వదలిస్తే ఇచ్చేయ్. నీకిష్టమైనది ఇవ్వదలచుకున్నదయినా సరే, యివ్వు.’’ఎంత ధైర్యం! ఆమె అతికష్టం మీద కోపం అణచుకుంది. ఈ భక్తుడి గురించీ ఆమెకు బాగా తెలుసు. సుఖసంతోషాలతో వున్నవాడెవడూ యింత నిర్లక్ష్యంతో ఉండడు. కానీ ఈ బ్రాహ్మణుడు ఎంత భోగాన్ని రుచి చూసినా, చాలా సున్నితమయినవాడు! కనుక ఆమె చింతించనవసరం లేదు. ఇటువంటివాడే చుట్టూ ఉన్నవారంతా అసహ్యంగా కనిపించడానికి ముక్కు కోసేసుకోగలడు. అంచేత అతనికి ఆవేశం కలిగించే వరం యివ్వాలి. చుట్టపక్కల వారందరికీ మరింత వరాలివ్వాలి. అది అతనికి ఈరష్య కలిగిస్తుంది. ఆమె అన్నది, ‘‘ఇన్నాళ్లు నన్ను పూజిస్తున్నావు. అయినా నీ మనసు స్వచ్ఛంగా మారలేదు. నీ హృదయంలోని ఆ అగ్నిని చల్లార్చుకో. అది రేగినప్పుడల్లా యితరులకు సహాయం చెయ్యి.’’సలహా వినడంతో అతను నీరసపడ్డాడు.‘‘ఇదేం మాట? అంతా నాకు ముందే తెలుసు. బోధన చేయడం ఆపి నాకు ఒక్క వరం యివ్వు.’’‘‘నువ్వు నిజంగా కోట్లలో ఒక్కడివి. నీ మొండితనం ఎంతో నచ్చింది. ఆ మూర్ఖులతో నాకు ప్రయోజనం లేదు. ఎప్పుడూ ఏడుస్తూ, అడుక్కు తింటూంటారు. ఇక్కడ నీ ఆసక్తిని నువ్వు పట్టించుకోలేవు. ఇప్పటినుంచీ నీ బాగోగులు నేను చూసుకుంటాను.’’‘‘చాలా సంతోషం. ఇంత గొప్ప ఆలోచనతో పోవడానికి యింత కాలం పట్టిందా?’’అమ్మవారు దయతో నవ్వి, ‘‘నీకిచ్చు వరం వంటిది యింతవరకూ ఎవరికీ లభించలేదు. నీతోపాటు యితరులకూ ఎంతో లబ్ధి కలుగుతుంది.’’‘‘యితరులూ లబ్ధిపొందుతారా? అంతకంటే దారుణం మరోటి ఉంటుందా? ఇలాంటి వరంతో ప్రయోజనం లేదు.’’‘‘ఒకదాని తర్వాత ఒకటి యిలా అనేక కష్టాలు జీవితమంతా అనుభవిస్తున్నావు. కోపగించుకుంటే ప్రయోజనం లేదు. వెళ్లు. ఇవాళ్టి నుంచీ నువ్వు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది.’’‘‘దీన్ని వరం అంటావా? శాపం కన్నా దారుణం! నీవు ఇచ్చిన ఈ వరంతో పోలిస్తే నా దారుణమయిన జీవితమే వేయి రెట్లు నయం. తెలివిలేని నీ వరాన్ని వెనక్కి తీసుకో, నన్ను వదిలేయ్’’ అన్నాడు.అతను ఆ మాట అనగానే ఆమ్మవారు కనిపించినంత వేగంగా ఆశ్చర్యంగా మాయమయింది. ఆలోచనలో పడ్డాడు. ఇంటికి వెళ్లి ఈ సంగతి తన భార్యతో చెప్పాలనుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అమ్మవారు ఒక వరాన్ని యిచ్చింది.’’అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అతను గుడి నుంచీ యింటికి వెళ్లాడు. గుమ్మంలో అతని భార్య వేచి ఉంది. ‘‘ఏమయింది? ఏమిటా తొందర?’’ గాబరాతో అడిగింది.బ్రాహ్మణుడు తనకు అమ్మవారు వరం యివ్వడం గురించీ అంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు ఇన్నాళ్లూ ఆమె పడ్డ కష్టాలు కష్టాలు కాదన్నంతగా అయింది. ఆమె ఆనందానికి అంతేలేదు. అతనితో అంది, ‘‘నాకు తెలుసు పూజల్లో యిన్నాళ్లు గడిపిన సమయమంతా వృ«థాపోదని.’’‘‘గొప్ప ఫలమా? ఏమంటున్నావు? నేను ఏదో పొందితే అది యితరులకు అంతకు రెండింతలు లభిస్తుంది. ఇంతకంటే దారుణ శాపం విని ఉండవ్. నువ్వుగాని భంగు తాగావా?’’‘‘మహిళగా నేను మీకు సలహానిచ్చే అర్హత లేకపోవచ్చు. కానీ, నిజానికి యితరులకు మనకంటే రెండింతలు లాభిస్తే నష్టమేమిటి? ఇన్నాళ్లూ ఎన్నో కష్టాలను భరించాం. మనం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. సౌఖ్యమేమిటో మనకూ తెలుస్తుంది. యిక మీ యిష్టం. దాన్ని గురించి ఆందోళన చెందాల్సిందేముంది? మీ నిరాశతో నా అదృష్టాన్ని కాదనుకుంటాను. మీరు నాకు ఈ చిన్న ఆనందపు మెరుపు ఎందుకు ప్రసాదించలేదు?’’‘‘నువ్వు చెప్పింది సబబే. అదెలా పనిచేస్తుందో చూద్దాం.. ఏమయినప్పటికీ అమ్మవారు మనకు మార్పు తేవడానికి వరం యిచ్చిందేమో?’’ అన్నాడు సాలోచనగా.కానీ మొదటగా ఏమి కోరుకోవాలి? హఠాత్తుగా అతనికి తన పగిలి పోయిన పైపు, ఖాళీ గంజాపాత్ర గుర్తుకు వచ్చాయి. ‘‘అమ్మా, నువ్విచ్చిన వరమే నిజమైతే, నాకు ఓ కొత్త పైపు, గంజాతో నిండిన పాత్రనీ ప్రసాదించు’’ అన్నాడు.అతని పెదవుల నుంచి మాట బయటకు వచ్చిందో లేదో, కోరిన బహుమతులు ప్రత్యక్షమయ్యాయి. అవి చూసినవారు ఆశ్చర్యంతో బొమ్మల్లా ఉండిపోయారు. ఇంత సులభంగా ప్రతీ కోరికా తీరితే, వారి ఆనందానికి అంతేదీ! గంజాను పైప్ నిండా కుక్కి దాన్ని అంటించడానికి అతని భార్య నిప్పుకణిక తెచ్చింది. తర్వాత ఏం కోరుకోవాలో ఆలోచిస్తున్నాడు. జీవితమంతా వాళ్లు నానా కష్టాలూ పడ్డారు. ఇప్పుడు మంచిది ఏది అడగాలి? ఇదా లేక అదా, అదా లేక ఇదా? మనసు ముడి వీడటం లేదు. కోరడానికి అనేకం ఆలోచించాడు. భార్యను సంతోష పెట్టడానికి పిండి, ఉప్పు, సుగంధద్రవ్యాలు, వంటచెరకు కావాలి. ఒక నిమిషం కొన్ని వస్తువుల గురించి అడుగుతాడు. మరుక్షణం అవి అతని ముందుంటున్నాయి.భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంలో తలమునకలవుతున్నారు. పొయ్యి వెలిగించడానికి అతని భార్య పరిగెట్టుకెళ్లింది. ఎందుకు సందేహించడం? అతను ఎంత ఆనందంగా ఉన్నాడో అంతగా యిబ్బందిపడుతున్నాడు. అతని చుట్టుపక్కలవారు రెండింతలు పొందుతున్నారు. అదేం తప్పుకాదే.బ్రాహ్మణుడి భార్య తన భర్తకి భోజనం పెట్టి తాను తినడానికి కూర్చుంది. సంతృప్తిగా భోజనం చేయడం కంటే ఆనందం మరోటి ఉండదు. బ్రాహ్మణుడు తన జీవితంలో మొదటిసారి సంతృప్తిగా భోజనం చేశాడు. కానీ అది విచారపరిచింది. తన భార్య దగ్గరికి వెళ్లి ‘‘నాకో పని చేసిపెడతావా?’’ అని అడిగాడు.‘‘నీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా? ఇంత హఠాత్తుగా అడిగారు?’’‘‘కాదంటే, నేనే సమాధానం చెబుతాను. ఊళ్లోకి వెళ్లు. ప్రతీ యింటా మనకంటే రెండింతలు ఉన్నదీ లేనిదీ చూసిరా.’’‘‘ఇతరుల సంగతి మనకెందుకు? మనం యిప్పుడు చిన్న దీపందివ్వె కోసమయినా యితరులను అడుక్కోనక్కర్లేదు. అంతేగాదు ప్రతీవారు మీ వల్లనే ఎంతో సమృద్ధులవుతున్నారు. మనకంటే తక్కువేమీ అభివృద్ధి చెందడంలేదు!’’ఆమె యిల్లు చేరేసరికి ఆమె భర్త విచారంతో కూచోనున్నాడు. ఆమె రాక తెలిసి తలెత్తి, ‘‘నిజమేనా? మనకంటే వాళ్లంతా రెండింతలు పొందారా?’’ అడిగాడు.పూజారి భార్య అవునని చెప్పగానే, అతనికి చెవుల్లో తుపాకులు పేల్చినట్లయింది. అతనికి తెలియనివాటి గురించి అతనికి దిగులు లేదు, కానీ, తన గ్రామంలో ప్రజలంతా పొందుతున్నవాటి గురించి అమితాశ్చర్యపడ్డాడు. కనీసం ఒక్కరైనా కృతజ్ఞతలు చెప్పలేదు. దుర్మార్గులు ఒక మాట అనలేదు. ఇటువంటి ద్రోహులకు సహాయపడటం పాపం అనుకున్నాడు. పిచ్చెత్తిపోయాడు. మంచంమీద పడిపోయాడు. అతని భార్య అతని చేతులు, కాళ్లూ రుద్దడం ఆరంభించింది.కొంతసేపటికి అతన్ని ఇలా శాంతపరిచింది, ‘‘ఏమీ లేనివాని కోసం ఎందుకు అంతగా బాధపడతారు. లోకం కాలిపోని, మనకేంటి?’’ అంది.‘‘అంత సులభంగా అందరినీ అలా వెళ్లనిస్తాను? అదే నిజంగా జరిగితే, నేను నిశ్చింతగా ఉంటాను.’’‘‘శ్వాస ఉన్నంతకాలమే ఈ లోకం ఉండేది. నీ గురించీ జాగ్రత్తపడు. మిగతావన్నీ సక్రమమవుతాయి. అద్దంలో చూడు. ఎంత ఆరోగ్యంగా ఉండేవాడివి. నా కళ్ల ముందే చిక్కి శల్యమయ్యావు. ముందు ఆరోగ్యంగా తయారవు. తర్వాత నువ్వు ఏం చెయ్యదల్చుకుంటే అది చేద్దువుగానీ. జీడిపప్పు, పాలు తీసుకురా నీకు పాయసం, లడ్డూ, హల్వా చేస్తాను రాత్రి భోజనంలోకి.’’ఆమె అడిగింది‘‘నా చేతులతో నేనే వీటిని వండాలా? నాకు మంచి పెనం, వెండి గిన్నెలు కావాలి.’’ అని.ఆశ్చర్యంగా బ్రాహ్మణుడు జాబితాలో పెనం, గిన్నెలు వేపు చూశాడు. వంటసామగ్రి ఆమె ఎదుట క్షణంలో ప్రత్యక్షమయ్యాయి. ఆమె హల్వా చేయడానికి యిక ఆట్టే సమయం పట్టలేదు.బ్రాహ్మణుడు నోరారా వేడి వేడి హల్వా తిన్నాడు. తర్వాత తన భార్యవంక చూసి, ‘‘నేను కలగంటున్నానా? కళ్లు తెరిచే ఉన్నాయా? నన్ను సరిగా చూసి చెప్పు.’’‘‘ముందు నువ్వే చెప్పు, తెరిచే ఉన్నాయా?’’‘‘అవును. విప్పారి ఉన్నాయి. ఇవాళ మన సొంత పొయ్యి మీదే హల్వా చేసుకున్నాం. నిన్నటి వరకూ ఊహించనివన్నీ ఇవాళ మన కళ్లతో చూస్తున్నాం.’’వాళ్లకి తెలీకుండానే, ఆనందం అనుభవించాలన్న కోరిక బలంగా కలిగింది. ఇవాళ్టివరకూ కష్టాలు అనుభవించారు. భరించలేని నష్టాలు భరించారు. ఇప్పుడు వీలయినంత ఆనందాన్ని ఆశిస్తున్నారు. మిగతా లోకమంతా తొలగిపోయింది.తెలవారుతోంది. నక్షత్రాలతోటి చీకటి నేలపైకి దిగుతోంది. పక్షులు కిలకిలా రావం, పాటతో అందెలసవ్వడి చేస్తోన్నాయి. అద్భుతం, నక్షత్రాలు ఆగి చూస్తున్నాయి! అలాంటి పల్చటి చీకటి తెర! చల్లని చిరుగాలి లోకం ఆహ్లాదం కలిగిస్తోంది. లోకం ఎంత బావుందో చూడ్డానికి యిపుడు! ‘‘మనకు కొన్ని ఆవులు, ఎద్దులు ఉంటే ఎలా ఉంటుంది? కోరుకున్నప్పుడల్లా పెరుగు, మీగడ ఉంటుంది.’’‘‘ఇలాంటి వరంతో చిన్నవాటిని కోరడమెందుకు? మనం అనుకున్నంత హాయిగా ఉండవచ్చు.’’హఠాత్తుగా బ్రాహ్మణుడి మనసులో ఓ ఆలోచన మెరిసింది. ‘‘అసలు అమ్మవారిపైనే ఓ తమాషా చేస్తే ఎలా వుంటుందంటావ్? ఇంటికి కావలసిన చిన్న చిన్నవాటిని ఎలాగూ ఇస్తుందనుకో. కానీ నిజంగా మనం ఎంతో ఘనమైనదే కోరితే? చేతులు జోడించి కోరుకున్నాడు, ‘‘ఓ తల్లీ, నా మాట ప్రకారం మహిమాన్వితవే అయితే, బంగారు భవంతి కావాలన్న నా కోరిక తీర్చు. అందుకు సరిపడా బంగారు వస్తుపరికరాలు అమర్చు.’’ఆ మాటలు అతని నోటనుండి వచ్చిన తక్షణమే ఓ అద్భుత బంగారు భవంతి అతని చుట్టూ వచ్చేసింది. సరిగా నవారు లేని తుక్కి మంచం బంగారంగా మారిపోయింది! అతను లేచి కూచున్నాడు, అమితాశ్చర్యపోయాడు, నోటమాటరాలేదు. ఆవుపేడ అలికిన బలహీనమైన గోడలు మంచి పసుపు ఛాయలోకి మారాయి. కళ్లు నులుముకుని మరీ చూశాడు. దుర్లభమయిన తన కోరిక నిజంగానే నిజమయినదా? పక్కనే అతని భార్య నిలబడింది, ఆశ్చర్యంతో నోటమాటరావడం లేదు. ఇదేమి లీల.అతని భార్య బంగారు దీపం వెలిగించింది. అతను భార్యతో అన్నాడు, ‘‘మనం అసలు నేరుగా ఈ భవంతినే కోరుకొని ఉండాల్సింది! ఉప్పు, వంటనూనె రెండింతలయ్యుండేవి, కానీ ఆమె ఇలాంటి రెండు బంగారు భవంతులు కల్పించడం చూడాలనుంది’’. దేవతకి ఈ కరుణ ఇరవయ్యేళ్ల క్రితమే కలిగి ఉంటే అతని జీవితం ఎంతో బాగుండేది. కానీ ఇపుడు వాళ్లు ఈ అద్భుత భవంతిలో ఎన్నాళ్లు సుఖంగా జీవించాలి? తన భార్యతో అన్నాడు, ‘‘నువ్వు ముసలిదానివయ్యావు. ఇలాంటి భవంతిలో ఉండే వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా, యవ్వనంతో ఉండాలి.’’‘‘నువ్వు నాకంటే ఘోరంగా వున్నావ్. నా గురించి ఆందోళనపడకు. నేను నీకంటే ముందే ఈ లోకాన్ని విడిచివెళ్లాలన్నదే నాకోరిక. బంగారుభవంతిని నా కళ్లతో చూశాను, ఇంతకంటే నాకింకేమి కావాలి? ఒక్క ఆలోచన.. అమ్మవారు మనల్ని యవ్వనంలోకి తీసికెళ్లలేదా?’’‘‘అరే, నిజమే, ఎందుకు తీసికెళ్లలేదు? నా మనసుకు ఏమయింది! పోనీలే, ఆలస్యమైనా ఫరవాలేదు. ’’అతను అడిగిన మరుక్షణం వారిద్దరినీ అమ్మవారు యవ్వనవంతుల్ని చేసింది. వారి యవ్వనం తిరిగివచ్చింది. ఇలాంటి లీలను కనీసం కలలోనైనా ఎవరూ ఊహించరు. కానీ ఇద్దరూ మళ్లీ యవ్వనంలోకి వచ్చారు! రెప్పపాటు కాలంలో ఆ అద్భుత రాత్రి గడచిపోయింది.మర్నాడు తెల్లవారుతుండగానే బ్రాహ్మణుడు నిద్రలేచాడు. ‘‘ఇవాళ్టిలా సూర్యుడు ఎన్నడయినా సరికొత్తగా ఉదయిస్తాడా?’’ అతను ఆశ్చర్యపోయాడు.అతను బంగారు మెట్లు ఎక్కి బంగారు మేడ మీదకి వచ్చాడు. చుట్టూరా అంతటా బంగారు భవంతులే. లెక్కలేనన్ని సూర్యులు ఉదయించినట్టుంది. అసూయతో అతని హృదయం మండిపోయింది. ఇతరులకు తన వల్ల ఎంతో మంచి జరుగుతుందని, ఎంతో ఆనందంగా ఉన్నారన్న ఆలోచనే అతనికి మింగుడు పడదు. ఇంత కంటే ప్రారబ్ధం ఉంటుందా?అతనో ప్రమాదకర చిట్టడవిలో ఇరుక్కున్నాడు. అతని హృదయంలో మంటలు మరింత పెరిగాయి, సూర్యుడిని సైతం కాల్చివేసేంతగా ఎదిగాయి. సహజసిద్ధమయిన అతనిలోని జంతువులు.. నక్క, కాకి, పులి, పాము అన్నీ క్రూరంగా తిరుగుతున్నాయి. రేబిస్ వచ్చిన కుక్కలా అరుస్తూ గుండ్రంగా తిరుగుతూన్నాడు.‘ ‘నా కళ్లలో ఒకటి గుడ్డిదే కాని! ఓ చెవి చిల్లుపడనీ! అంతులేని లోతు బావి నా భవంతి మధ్యలో పడని!’’ అన్నాడు.ఆ మాటలు అతని నోటినుండి రాగానే అతని భార్య గట్టిగా బాధతో అరిచింది. ‘‘భగవంతుడా, ఏం జరుగుతోంది? మా అద్భుత భవనం కనుమరుగవుతుందా? ఎదుగుతున్న సూర్యుడు భూమిలోకి పడిపోతాడా?’’ఏం జరుగుతోందో అతనికి అర్థమయింది. పరుగు పరుగున బంగారు మెట్లు దిగి భార్య వద్దకి వచ్చాడు. ఆమె తన ముందున్న గోడను పట్టుకుని ముందుకు వెళ్లబోయింది. అప్పుడే వచ్చిన బ్రాహ్మణుడు ‘‘ఆగు, అక్కడే ఆగిపో! ఒక్క అడుగు ముందుకేస్తే పెద్దగొయ్యి ఉంది నీముందు!’’ అంటూ గట్టిగా అరిచాడు. కానీ ఆమెకి అతని మాట వినపడలేదు. అలా ముందుకు కదిలింది. ఆమెను పట్టుకోవడానికి గెంతాడు. కింద ఎక్కడో పడిన శబ్దం వినపడింది. ఆమె అతన్ని వదిలిపోయింది. ఆ తరువాత అతను ఇరవై నాలుగు కోసుల దూరం వరకూ ప్రతీ ఇల్లూ, ప్రతీ గ్రామం తిరిగాడు. అతను ఏ గ్రామానికి వెళ్లినా అతను ఒక్క కంటితోనే చూడగలుగుతున్నాడు, ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఆ బావుల్లో పడుతున్నారు. అంతానికి ఆట్టే కాలం పట్టలేదు. అతను దయ్యంలా అరిచాడు. మృత్యువు వొడిలోకి దారి తీయించిన తన రెండు బంగారు భవంతులపట్ల ఎంతో సంతసించాడు!ఇప్పుడు తాను అన్ని బంగారు భవంతులకు ఏకైక యజమాని. కాదని ఎదిరించడానికి ఎవరూ లేరు. రోజుకో కొత్తభవంతిలో నిద్రబోతున్నాడు. అతనికిలా రెండేసి పొందడానికి ఇపుడు ఇక ఎవరూ లేరు. అమ్మవారు అతనికి వరం ఇచ్చి ప్రయోజనమేమిటి? వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. కనుక అమ్మవారిచ్చిన వరమూ చివరికి పోయింది. ఆనందంతో ఎగిరి గంతేశాడు, చేతులు పైకెత్తి తన ఒక్క కంటితో బంగారు భవంతులను చూసుకున్నాడు. కానీ అతని అత్యంత ఆనందకర సమయాన్ని చూసేందుకే ఎవరూ లేకపోవడం చాలా దురదృష్టకరం.‘చౌబోలీ అండ్ అదర్స్టోరీస్’ నుంచి మూలం : విజయదన్ దెత (రాజస్థాన్) అనువాదం: టి. లలితప్రసాద్ -
పోలింగ్ బూత్‌లో పూజలు చేసిన ఛత్తీస్‌గఢ్ మంత్రి
-
వైరల్.. ఈవీఎం మిషన్కి పూజలు చేసిన ఎమ్మెల్యే
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రంలో పూజలు నిర్వహించడంమే ఇందుకు కారణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవగఢ్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశ పోలీంగ్ ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున నవగఢ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక మంత్రి దయాల్‌దాస్ బాఘెల్ ఓ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంకి పూజలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. బేమెతర జిల్లాలోని నవగఢ్ నియోజకవర్గంలో గత మంగళవారం పోలింగ్ ప్రారంభమవడానికి ముందు దయాల్‌దాస్ స్థానిక పోలింగ్ కేంద్రంలో పూజలు చేశారు. ఈవీఎం మిషన్‌కు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తీలు కూడా ముట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల కావడంతో స్పందించిన రిటర్నింగ్ అధికారి దయాల్దాస్కు నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో నేతలు సామాన్యులను పూజించాలి గానీ ఈవీఎంలను కాదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత 15ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ప్రజల కోసం పనిచేయకుండా ఇప్పుడు ఈవీఎంలకు పూజలు చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేసింది. కాగా ఈ వార్తలపై దయాల్‌దాస్ ఇంతవరకూ స్పందించలేదు. -
లడ్డూలు పంచండి
మండపాలు వెలుగుతుంటాయి... పూజలు జరుగుతుంటాయి... పిల్లలూ పెద్దలూ అక్కడే చేరి ఉత్సాహంగా ఏకదంతుని స్తుతిస్తూ భజనలు చేస్తుంటారు. పూజతో పాటు ప్రసాదం కూడా ఉండాలి. ఈ లడ్లు చేయండి. దేవుడికి పెట్టండి. నలుగురికీ పంచండి. పండగను సంతోషాలతో నింపండి. కొబ్బరి లడ్డు కావలసినవి: తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు; పాలు – అర కప్పు; పంచదార – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడి పప్పులు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నెయ్యి – ఒక టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ♦ జీడిపప్పు ముక్కలు వేసి, వేయించి తీసి, పక్కన ఉంచాలి ♦ అదే బాణలిలో పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి బాగా కలిపి ఉడికించాలి ♦ మిశ్రమంలో తడి అంతా పోయి, బాగా గట్టిపడ్డాక, ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న నట్స్ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ♦ మిశ్రమం కొద్దిగా చల్లారాక లడ్డూల మాదిరిగా చేతితో గుండ్రంగా చేయాలి ♦ గాలిచొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి ♦ ఇవి రెండు మూడు రోజుల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. బందరు లడ్డు కావలసినవి: సెనగ పిండి – 300 గ్రా.; బెల్లం – 400 గ్రా.; నీళ్లు – అర కప్పు (బెల్లం పాకం కోసం) ; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి/నూనె – ఒక కప్పు; జీడిపప్పులు + కిస్మిస్ – పావు కప్పు తయారీ: ♦ ఒక వెడల్పాటి పాత్రలో సెన గ పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలిపి పక్కన ఉంచాలి ♦ పిండి మరీ గట్టిగా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె పోసి కాగనివ్వాలి ♦ జంతికల పిండిని జంతికల గొట్టలోకి కొద్దికొద్దిగా పెట్టుకుంటూ నెయ్యి/నూనెలోకి జంతికలు చుట్టాలి ♦ రెండువైపులా బాగా వేగిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి ♦ ఈ విధంగా మొత్తం పిండిని జంతికలుగా చేసుకుని పక్కన ఉంచాలి ♦ బాగా చల్లారిన తరవాత జంతికలను చేతితో చిదిపి మిక్సీలో వేసి మెత్తగా పొడిలా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ♦ పిండిని జల్లించుకోవాలి ♦ మెత్తగా ఉన్న పిండిని మాత్రమే వాడుకోవాలి ♦ జల్లెడలో మిగిలిన పిండిని రెండు మూడు సార్లు మిక్సీలో పడితే చాలావరకు మెత్తగా వస్తుంది ♦ జల్లెడలో కొద్దిగా మాత్రమే మిగులుతుంది ♦ ఇలా తయారుచేసుకున్న పిండిని పక్కన ఉంచాలి ♦ ఒక మందపాటి పాత్రలో బెల్లం, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి కొద్దిగా ఉండపాకం వచ్చేవరకు ఉడికించాలి ♦ ఉడుకుతుండగానే ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ♦ ఉండ పాకం రాగానే పక్కన ఉంచుకున్న జంతికల పిండిని కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలిపి దింపేయాలి ♦ ఈలోపుగా స్టౌ మీద మరో బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, కిస్మిస్లను వేసి వేయించి పక్కన ఉంచాలి ♦ పిండిని పాకంలో బాగా తిప్పుతూ ఉండాలి ♦ (ఇంట్లో రోలు, రోకలిబండ ఉన్నవారు రోట్లో వేసి తొక్కాలి) మిశ్రమం గట్టిపడుతుండగా, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి మరోమారు కలిపి, మిశ్రమం చల్లారకుండా, వేడిగా ఉండగానే గబగబ లడ్డూలుగా గుండ్రంగా చేయాలి ♦ (ఆలస్యం అయితే మిశ్రమం పొడిపొడిలా అయిపోయి, ఉండలు చేయడానికి కుదరదు) ♦ లడ్డూలు చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ♦ ఇవి కనీసం నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. డేట్స్ మావా లడ్డు కావలసినవి: ఖర్జూరాలు – 300 గ్రా. (గింజలు తీసినవి); పచ్చి కోవా – 200 గ్రా.; నెయ్యి – ఒక టీస్పూను; న ట్స్ – కొద్దిగా (బాదం పప్పులు, పిస్తా, జీడి పప్పుల తరుగు); రోజ్ వాటర్ – ఒక టీ స్పూను తయారీ: ♦ ఖర్జూరాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. (ఖర్జూరాలు కొద్దిగా గట్టిగా అనిపిస్తే, కొద్దిగా పాలలో నానబెట్టిన తరవాత మిక్సీలో వేయాలి) ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ♦ మెత్తగా చేసుకున్న ఖర్జూరాలు, పచ్చికోవా వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ♦ బాణలి అంచులను విడిచిపెడుతున్నట్లుగా అయ్యేవరకు ఉడికించాక రోజ్‌వాటర్ జతచేసి మరోమారు కలపాలి ♦ మిశ్రమం ముద్దలా అయిన తరవాత దింపేసి, నెయ్యి పూసిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ♦ నట్స్ జత చేయాలి ♦ కొద్దిగా చల్లబడిన తరవాత లడ్డూల మాదిరిగా గుండ్రంగా చేసుకోవాలి ♦ ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అందువల్ల ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. వాల్నట్ లడ్డు కావలసినవి: వాల్నట్స్ – ఒక కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); అటుకులు – ఒక కప్పు; తాటి బెల్లం పొyì / బెల్లం పొడి∙– ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను. తయారీ: ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక అటుకులు వేసి దోరగా వేయించి తీసేయాలి ♦ అదే బాణలిలో వాల్నట్స్ వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి ♦ అటుకులు చల్లారిన తరవాత చేతితో పొడిలా చేయాలి ♦ వాల్నట్స్ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ బెల్లం కూడా జత చేసి మరోమారు మిక్సీ పట్టాక, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ♦ అటుకుల పొడి జత చేసి బాగా కలిపి, చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూలు తయారుచేయాలి ♦ వాల్నట్స్ లడ్డూలు సిద్ధమైనట్లే. మలడు లడ్డు కావలసినవి: పుట్నాల పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడిపప్పులు – గుప్పెడు తయారీ: ♦ పుట్నాలపప్పు (వేయించిన సెనగ పప్పు) మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి ♦ పంచదార, ఏలకులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక జీడిపప్పులు వేసి వేయించి, మంట ఆర్పేయాలి ♦ పంచదార పొడి, పుట్నాల పప్పు పొడి వేడివేడి నేతిలో వేసి బాగా కలపాలి ♦ వేడి బాగా తగ్గేవరకు పక్కన ఉంచాలి ♦ (పూర్తిగా చల్లారనివ్వకూడదు) ♦ గోరువెచ్చగా ఉన్న సమయంలోనే కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూ ఉండలు చేసి పక్కన ఉంచాలి ♦ చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కోకోనట్ లడ్డు కావలసినవి : కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు + 2 టేబుల్స్పూన్ల స్వీట్ కండెన్స్డ్ మిల్క్; ఏలకుల పొడి – చిటికెడు; వేయించిన నట్స్ – కొద్దిగా (పిస్తా పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ కలిపి); పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు (బాగా మెత్తగా ఉండాలి) తయారీ ♦ ఒక పాత్రలో పచ్చి కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్ + స్వీట్ కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి ♦ మిశ్రమం బాగా ఉడుకుపట్టి, దగ్గర పడిన తరవాత ఏలకుల పొడి, నట్స్ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ♦ కొద్దిగా చల్లారిన తరవాత లడ్డూల మాదిరిగా చేసుకుని గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. మలై లడ్డు కావలసినవి: పాలు – 2 లీటర్లు (8 కప్పులు); పంచదార – అర కప్పు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – చిటికెడు; కుంకుమ పువ్వు – చిటికెడు; జీడి పప్పులు – తగినన్ని; కిస్మిస్ – తగినన్ని తయారీ: ♦ ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మీగడ పొర వచ్చేవరకు పాలను కాచి, స్టౌ మీద నుంచి దింపేయాలి ♦ రెండు కప్పుల పాలు, మీగడ వేరే పాత్రలోకి తీసుకోవాలి ♦ మిగిలిన ఆరు కప్పుల పాలలో నిమ్మ రసం వేసి పాలను విరగ్గొట్టాలి ♦ పాల విరుగును ఒక పల్చటి వస్త్రంలో వేసి మూట గట్టి, నిమ్మరసం పోయేవరకు చన్నీళ్లలో కడగాలి ♦ నీరంతా పోయేవరకు గట్టిగా పిండాలి ♦ పనీర్ రెడీ అయినట్లే ∙పక్కన ఉంచుకున్న రెండు కప్పుల పాలకు పంచదార జత చేసి స్టౌ మీద ఉంచి అర కప్పు పాలు మిగిలే వరకు మరిగించాలి ♦ తయారు చేసి ఉంచుకున్న పనీర్ వేసి బాగా కలపాలి ♦ మిశ్రమం బాగా చిక్కపడేవరకు కలుపుతుండాలి ♦ ఏలకుల పొడి పంచదార మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ♦ లడ్డూ మౌల్డ్‌కి కొద్దిగా నెయ్యి పూసి, తగినంత మలై లడ్డూ మిశ్రమం అందులో ఉంచి మూసేయాలి ♦ ¯ð మ్మదిగా తెరిచి లడ్డూ ఆకారం చెyì పోకుండా జాగ్రత్తగా బయటకు తీసి ఒక ప్లేట్లో ఉంచాలి ♦ ఈ విధంగా లడ్డూలన్నీ తయారుచేసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ♦ అందువల్ల ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. తంబిట్టు కావలసినవి: పుట్నాల పప్పు – ఒక కప్పు (పొడి చేయాలి); బెల్లం పొడి – అర కప్పు; నెయ్యి – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; వేయించిన నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు (పొడి చేయాలి); వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు (పొడి చేయాలి); గసగసాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: వెడల్పాటి పాత్రను స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ♦ బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ♦ బెల్లం పూర్తిగా కరిగి, పొంగులు వస్తుండగా ఏలకుల పొడి, పుట్నాల పొడి (2 టేబుల్ స్పూన్ల పొడి పక్కన ఉంచాలి) ♦ కొబ్బరి తురుము, నువ్వుల పొడి, గసగసాలు, పల్లీల పొడి వేసి బాగా కలపాలి ♦ బెల్లం పాకంలో బాగా కలిసేవరకు కలుపుతుండాలి ♦ పల్చగా అనిపిస్తే, పక్కన ఉంచుకున్న పుట్నాల పొడి జత చేసి మరోమారు కలపాలి ♦ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరవాత, చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, పుట్నాల పొడి మిశ్రమం కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూలు చేయాలి ♦ (మరీ ఆలస్యం చేస్తే లడ్డూ చేయడానికి రాదు) ♦ వారం రోజుల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ♦ ఈ లడ్డూలను కర్ణాటక రాష్ట్రంలో గౌరీ పూజ, వినాయక పూజ వంటి సందర్భాలలో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఆటా లడ్డు కావలసినవి : గోధుమ పిండి – 2 కప్పులు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కిస్మిస్ – తగినన్ని; జీడి పప్పులు – తగినన్ని తయారీ ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ♦ జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ♦ బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక గోధుమ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, తీసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి ♦ మిక్సీలో పంచదార, ఏలకులు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ♦ ఒక పాత్రలో ఈ పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి ♦ కొద్దికొద్దిగా నెయ్యి, వేయించి∙ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి లడ్డూలు చేసుకోవాలి ♦ గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ♦ ఈ లడ్డూలు చిన్న పిల్లలకు మంచిది అనారోగ్యం, అజీర్తి చేయకుండా ఉంటుంది. -
విశేష ఘనపతి
గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. ఘనపతి. ఘనపాఠి. ఆయన పుట్టుకే చాలా చిత్రమైనదనుకుంటే, ఆకృతి అంతకన్న విచిత్రమైనది. అయితేనేం, ఎవరిని పూజించాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ ఆయనదే! తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు. దోసెడు మట్టి లేదా చిటికెడు పసుపు ఉంటే చాలు.. .క్షణాల్లో గణాధ్యక్షుని రూపు తయారు చేసేయవచ్చు. గుప్పెడు గరికె... కణుపంత బెల్లం ముక్క ఉంటే చాలు...ప్రశాంతంగా పూజించుకుని, నిండుగా నైవేద్యం పెట్టేయవచ్చు. సర్వవిఘ్నాలనూ ఉపశమింపజేసి, వరాల వర్షం కురిపించే మహా ఉదారుడైన ఆ మహోదరుడి విశేషాలను వీక్షిద్దాం... గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తూ గణాలమయం. అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం, మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం– మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు– ఈ గణాలన్నింటిలో నూ అంతర్యామిగా వుంటూ, సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. బ్రహ్మసూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు. అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలయిన వారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలు. ప్రథమ పూజ ఎందుకు? ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే గణపతికి వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వినాయకుడు వివాహితుడేనా? వినాయకుడు ‘హస్తిముఖుడు’, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ‘ఏనుగు ముఖం వా’డనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం ‘హస్త’ హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని ‘అవివాహితు’డన్నారు. అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకునికి సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలుగానూ, క్షేమం, లాభం సంతానంగానూ చెబుతారు. పత్రి పూజ వల్ల ప్రయోజనమేమిటి? వినాయకుడిని పత్రితో పూజించడంలో కొన్ని రహస్యాలు ఇమిడి ఉన్నాయి. విఘ్నేశ్వర పూజకు మాచపత్రి, ములక, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేసపత్రి, ఉత్తరేణి, తులసి, మామిడి, విష్ణుక్రాంత, దానిమ్మ, రేగు, దేవదారు, గన్నేరు, మరువం, వావిలి, జాజి, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు. గణపతి పూజకు ఉపయోగించే ఈ 21 రకాల ఆకులూ ఓషధీ విలువలు కలిగినవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం వల్ల వాటిలో ఉండే ఓషధీ విలువలను మనం పొందగలం. తులసి, మారేడు, ఉత్తరేణి వంటి ఆకులను స్పర్శించడం వల్ల చర్మరోగాలు నశిస్తాయి. మెదడు ఉత్తేజితమవుతుంది. విశేష నాయకుడు అకారాన్నీ ఉకారాన్నీ మకారాన్నీ కలిపి ‘ఓమ్’ అనే ఓ మంత్రాన్ని సిద్ధం చేశారు దేవతలు. మొదటగా కన్పించిన విఘ్ననివారక దైవానికి ఈ వేదాలద్వారా ఏర్పాటు చేసిన ఓంకారాన్ని సంకేతంగా ఏర్పాటు చేశారు. ‘ఓం’అనడమంటే వినాయకుణ్ణి ప్రార్థించినట్లన్నమాట. అందుకే అష్టోత్తర శతనామాలను పఠించబోయేముందు ప్రతినామానికీ ముందు ఓంకారాన్ని చేర్చారు. ఓంకారం లేకుండా నామాన్ని చదివితే ఆ నామానికి అక్షరతత్వమే ఉంటుంది తప్ప మంత్రత్వం సిద్ధించదన్నమాట. ‘ఓమ్’ అని పలికితే వినాయకుని నామాన్ని ఉచ్చరించినట్టూ, ఓమ్ అని పూజా ప్రారంభంలో మన పూజామందిరం ముందు రాస్తే వినాయకుని చిత్రాన్ని మనకొచ్చినంత నైపుణ్యంతో గీసినట్టూ ఔతుందన్నమాట. ఎలుక వాహనం ఏమి చెబుతోంది? వినాయకుని వాహనం మూషకం. ‘ముషస్తేయే’ అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ‘ఎలుక’ అని అర్థం. ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే ఉండేదీ ఏ క్షణమూ కూడ కదలకుండా ఉండనిదీ ఆ ప్రాణి. నిశ్చలంగా కూచున్నప్పుడు కూడ మూతినో కళ్లనో కదుపుతూనే ఉండే లక్షణం దానిది. ఇక రెండవది– ఎక్కడినుండో దొంగతనంగా తెచ్చి బొరియలో దాచిపెట్టుకునే లక్షణం దానిది. ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడంటే ఎవరైనా సరే, దొంగబుద్ధితో దాచకు. అనుభవించకుండా నిలవ ఉంచుకోకు! చంచలత్వాన్ని నియంత్రించుకుని నిశ్చలతతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు, విజయం నీ చెంత నుంచి వెనక్కు మళ్లదు అని సంకేతార్థం. పత్రి అంటే ఎందుకంత ప్రీతి? వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది నుంచి ప్రకృతి ప్రియుడు. గడ్డిజాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది. అందుకే ఆయనకు గరిక అంటే ఇష్టం. పాలవెల్లి ఎందుకు..? జ్యోతిస్సు అంటే గ్రహాలూ నక్షత్రాలూ. ఆ జ్యోతిస్సు ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రం. ఈ గ్రహాలూ నక్షత్రాలూ అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టే వినాయక చవితినాడు ఈ రహస్యాన్ని విశదీకరించేందుకే ‘పాలవెల్లి’ పేరిట వినాయకుని పైభాగంలో చతురస్రాకారంలో ఒక జల్లెడలాంటి అలంకారాన్ని వెదురుబద్దలతో ఏర్పాటు చేసి, వెలగ, బత్తాయి వంటి ఫలాలూ, కూరగా యలూ వేలాడదీస్తారు. బంకమట్టే ఎందుకు? గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే, వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి వుంటాయి. బంకమట్టికోసం ఆయా జలాశయాలలో దిగి, తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధగుణాలు సంతరించుకుంటుంది. నిమజ్జనమెందుకు? భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే! వినాయకుణ్ణి పూజిస్తే నిజంగా విఘ్నాలు తొలగుతాయా? ‘వి– విశేషంగా (ఎన్నడూ ముడిపడని రీతిలో), ఘ్న– పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక మానసిక ధైర్యాలని నాశనం చేసేది’ (విశేషేణ కార్యసామర్థ్యం హంతీతి విఘ్నః) అని విఘ్న పదానికి అర్థం. మనం పూర్వజన్మల్లో చేసుకున్న పాపాల కారణంగా రావలసిన విఘ్నాలేమేమి వున్నాయో వాటన్నింటినీ తొలగించగల శక్తి ఏ భగవంతుడికీ లేదు. అలాగే తొలగింపజేయగలిగిన వాళ్లయితే ప్రతివాళ్లూ నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే రాకుండా చేసేసుకునేవాళ్లు. అప్పుడు తాము లోగడ చేసిన పాపాలకి శిక్ష అనేది లేకుండానే పోయేది కూడా. ఇది లోక రక్షణ వ్యవస్థకి విరుద్ధం. మరి వినాయకుడేం చేస్తాడంటే, ఆయన్ని ప్రార్థించిన పక్షంలో ‘సర్వవిఘ్న ఉపశాంతయే...’ రావలసిన విఘ్నాలంటూ మనకేం ఉన్నాయో, ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తించిన వేళ మానసిక ఉపశాంతిని ఇచ్చి జీవితం మీద విరక్తి రానీయకుండానూ, కొత్తధైర్యంతో ముందుకి అడుగు వేసేలానూ చేస్తాడన్నమాట. అంటే విఘ్నమనేది కాలానికి సంబంధించింది కాబట్టి, ప్రతి వ్యక్తికీ ఒక్కొక్క కాలంలో జీవితదశలో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్న విఘ్ననాయకుణ్ణి ప్రార్థించి విఘ్నాలనుండి దూరం కావలసింది గానూ, ఒకవేళ విఘ్నమే తప్పనిసరై వస్తే తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని ఈయనని ప్రార్థించడం ద్వారా పొందవలసిందిగానూ ఈ పండుగ మనకి చెప్తుంది. -
రావమ్మా వరలక్ష్మీ తల్లీ రావమ్మా
భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, మడులు పాటించినా, పాటించకపోయినా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటేæ కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద లాంటివి కూడా. వ్రతం అనేసరికి అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో, ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని కంగారు పడనక్కరలేదు. మన ఇంటికి ఎవరైనా బాగా కావలసిన ఒక ముఖ్య అతిథి వచ్చారనుకోండి, మనం వారిని సాదరంగా ఆహ్వానించి, ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో ఎలా గౌరవించి, ఎంత మర్యాదగా సాగనంపుతామో అలా శ్రద్ధగా, భక్తిగా, నిష్ఠగా పూజ చేసుకోవాలి. చేతనైన పిండివంటలు చేయాలి. ఇంటికి వచ్చిన పేరంటాళ్లకు మర్యాద చేసి, కాళ్లకు పసుపు రాసి, నుదుట బొట్టు, మెడకు గంధం పెట్టి, చేతికి తోరం కట్టి, చేతిలో పండ్లు, తాంబూలం పెట్టి, నమస్కరించి, ఆశీస్సులు అందుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తోరం ఎందుకు? వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం ఉంది! ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు, ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం...అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని విశ్వాసం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, మరొకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అందుకే నవసూత్రం కట్టుకుంటారు. కొందరు ఐదు ముడులు కూడా వేసుకుంటారు. ఇలా కట్టుకున్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ! ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి పూజించాలి. దీనినే తోరగ్రంథిపూజ అంటారు. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ. ఇందుకోసం ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్షై్మనమ: పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామిఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి అని చదువుతూ ఒకో ముడినీ పూజించాలి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత...! బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’!!అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలి. అంతేకాదు, ఇలా ధరించిన తోరాన్ని కనీసం ఒక రాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవడం మంచిది. పూజకు కావలసినవి పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెబట్ట, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరాలు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి. వ్రత విధానం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన బియ్యపుపిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ప్రతిమ లేదా ఫొటో అమర్చుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని, నివేదన, హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని ధ్యాన ఆవాహనాది శోడశోపచారాలతో పూజించుకోవాలి. వ్రత కథ చదువుకుని, అక్షతలు శిరస్సున ధరించాలి. ముత్తయిదువలకు వాయినాలు, తాంబూలాలు ఇవ్వాలి. అనంతరం బంధుమిత్రులతో కలసి భుజించాలి. – డి.వి.ఆర్. -
యథావిధిగా నిరపుధారి పూజ
శబరిమల/తిరువనంతపురం: శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో ఏటా నిర్వహించే పవిత్రమైన ‘నిరపుధారి’పూజను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు బుధవారం యథావిధిగా పూజ ఉంటుంది. ఆలయ ప్రధాన పూజారి ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారని, పూజకు అవసరమైన వరిపంటను మంగళవారం సాయంత్రానికి తీసుకొస్తామని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2 బృందాలు వేర్వేరు మార్గాల ద్వారా పంటను తీసుకొస్తున్నాయి. మంగళవారం సాయంత్రం అయ్యప్ప దేవాలయాన్ని తెరుస్తారు. పంపానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భక్తులెవరూ శబరిమలకు రావోద్దని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ఓనమ్ వేడుకలను రద్దు చేశామని, ఈ మొత్తాన్ని వరద సహాయక కార్యక్రమాలకు వాడతామన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.వెయ్యి కోట్లు, శబరిమల రోడ్లకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం నాటికి 40 మంది ప్రాణాలు కోల్పోగా.. 20వేల ఇళ్లు, 10వేల కి.మీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. వరదలు కారణంగా వాయనడ్, ఇడుక్కి జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. మట్టుపెట్టి డ్యాం గేట్లు ఎత్తటంతో ఇడుక్కిలోని మన్నార్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
హరి హరీ.. మరో అపకీర్తి!
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న నానుడి ఉంది. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో అలాగే జరిగింది. లక్ష తులసి పూజ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం సింహగిరికి వచ్చిన ఓ భక్తుడికి భంగపాటు ఎదురైంది. ఈ రోజు లక్ష తులసి పూజ రద్దు చేశామని, పూజ చేసే అర్చకులు పలువురు సెలవులో ఉన్నారన్న సమాధానంతో భక్తుడు నోటిమాట రాలేదు. ఇదేంటని గట్టిగా ప్రశ్నించడంతో ఆలయ అధికారులు, అర్చకులు (కొందరు) ఆ భక్తుడ్ని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్దిచెప్పి అష్టోత్తర పూజ చేసి పంపించాల్సి వచ్చింది. దేవస్థానం అధికారులు..అర్చకుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యంగా అప్పన్న సాక్షిగా బయటపడింది. ఇటీవల కాలంలో తరచూ సింహాచలం దేవస్థానంలో ఇటువంటి అపకీర్తులు చోటుచేసుకుటున్నాయి. సింహాచలం(పెందుర్తి): రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరిగే ముఖ్యమైన ఆర్జిత సేవలు(నగదు చెల్లించి జరిపించుకునేవి)లో లక్ష తులసిపూజ ఒకటి. ఈ పూజను ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి జరుపుతారు. ఈ పూజలో పాల్గొనే భక్తుడు దేవస్థానానికి రూ.2500 చెల్లించి టిక్కెట్టు పొందాల్సి ఉంటుంది. స్వయంగా సింహగిరికి వచ్చికాని, ఇంటర్నెట్‌లోగాని సంబంధిత టిక్కెట్టును కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పూజను జరిపించేందుకు స్వామివారి సహస్రం చదివే పదిమంది వరకు అర్చకులు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో అర్చకుడు పదేసిసార్లు ఒక సహస్రాన్ని చదవాలి. అలా ఈ మంగళవారం లక్షతులసి పూజను జరిపించుకునేందుకు గత నెల 26వ తేదీన ఒడిశాకు చెందిన శరత్‌రెడ్డి టిక్కెట్ కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో పూజాసామగ్రి, పండ్లు ఇతర ద్రవ్యాలతో పూజకు హాజరయ్యాడు. ఆలయంలో అడుగుపెట్టగానే అర్చకులు, అధికారుల నుంచి వచ్చిన సమాధానంతో కంగుతిన్నాడు. పూజ చేసేందుకు సరిపడా అర్చకులు లేరంటూ అతన్ని పంపించే ప్రయత్నం చేశారు. ఇదేంటని శరత్ గట్టిగా ప్రశ్నించేసరికి ఆలయ అర్చకులకు, అధికారులకు ఏం మాట్లాడాలో తెలియరాలేదు. చివరికి అతనికి నచ్చజెప్పి, స్వామివారి అష్టోత్తర పూజచేసి పంపించారు. నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఆలయంలో అర్చకులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో స్పష్టంగా బయటపడింది. ఆలయంలో ఇద్దరు ఇన్చార్జి ప్రధానార్చకులు, ఒక ఉప ప్రధానార్చకుడు, ఎనిమిదిమంది ముఖ్య అర్చకులు, 12 మంది అర్చకులు, 5గురు పరిచారకులతో కలిపి 28మంది వరకు స్వామివారి సేవల్లో ఉన్నారు. వీరిలో పలువురు ఆయా షిఫ్టుల్లో స్వామికి సేవలందిస్తుంటారు. అలాగే ముగ్గురు సూపరింటిండెంట్లు, ఒక ఏఈవో, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆయా షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో చాలామంది ఎవరికివారే యమునా తీరుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఇటీవల కోకొల్లలు. మంగళవారం ఆరుగురు అర్చకులు సెలవులపై వెళ్లడం, ఆలయంలో కేవలం పదిమంది మాత్రమే అర్చకులు డ్యూటీలో ఉండడం గమనార్హం. ఉదయం లక్ష తులసిపూజ ఉందని కూడా తెలిసి ఎలా అంతమంది అర్చకులు సెలవు పెట్టారో...ఒకవేళ వాళ్లు శెలవు పెట్టినా పూజ సమయానికి ప్రత్యామ్నాయం చూపకపోవడంపై అటు వైదిక అధికారులను, ఇటు ఆలయ అధికారులను భక్తులు విమర్శిస్తున్నారు. ముందే తెలిసినా ఇవ్వని సమాచారం ఇదిలా ఉండగా మంగళవారం ఆలయంలో జరిగే లక్ష తులసిపూజకు తగినంత మంది అర్చకులు లేరని, కొందరు శెలవులపై వెళ్లారని ఆలయ అ«ధికారులకు సోమవారం సాయంత్రానికే తెలిసింది. దీంతో లక్ష తులసి పూజ రద్దు చేయమని చెప్పేశారు. ఈ తరుణంలోనే సింహగిరిపై ఉన్న చిన్నదాసుడుకు (ఈయన కూడా లక్ష తులసిపూజ జరిపించుకోవాల్సి ఉంది) పూజ లేని సమాచారాన్ని అందించారు. కానీ గత నెల 26వ తేదీన ఎంఆర్ రశీదు తీసుకున్న శరత్‌రెడ్డికి మాత్రం సమాచారం అందించలేదు. జరిగిన సంఘటనపై ఆలయ సూపరింటిండెంట్ తయారుచేసిన రిపోర్టు పూజ రద్దు చేయమని ఏఈవో చెప్పారు ఆలయంలో విధులు నిర్వర్తించే కొందరు అర్చకులు పెళ్లిళ్లు తదితర కారణాలతో శెలవులు పెట్టడంతో మంగళవారం లక్ష తులసిపూజ రద్దు చేయాలని ఏఈవో చెప్పారు. అధికారి ఇష్ట్రపకారంగా మేం చేయాల్సి వచ్చింది. మాకు ఎలాంటి పవర్స్ లేవు. చెప్పడం వరకే మా వంతు. కనీసం పదిమంది అర్చకులు లక్ష తులసిపూజకు అవసరం ఉంటుంది. ఉదయం లక్ష తులసిపూజకు వచ్చిన భక్తుడికి అష్టోత్తర పూజ చేయించి పంపించాం. గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఇన్చార్జి ప్రధానార్చకులు -
నో హెల్మెట్.. నో పూజ!
పారదీప్: హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారని తెలుసు. పూజారులు కూడా పూజ చేయరనే విషయం మీకు తెలుసా? ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక సరళాదేవి మాతా ఆలయ పూజారులు మాత్రం హెల్మెట్ లేకపోతే తాము పూజ చేయబోమని కచ్చితంగా చెప్పేస్తున్నారట. కొత్త ద్విచక్ర వాహనం కొనుక్కొని ఎవరు వచ్చినా.. హెల్మెట్ చూపితేనే పూజ చేస్తామని చెప్పడమే కాదు, లేనివారిని తిప్పి పంపుతున్నారట. స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆలయ పరిసరాల్లో కూడా పలుచోట్ల ‘నో హెల్మెట్.. నో పూజ’ అనే బోర్డులు పెట్టడంతో దేవి దర్శనానికి వచ్చిన భక్తులంతా హెల్మెట్ అవసరంపై చర్చించుకుంటాన్నారని పూజారులు చెబుతున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పూజారులు చెబుతున్నారు. ఈ సరళాదేవి మాతా ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని పూజారులు తెలిపారు. అందుకే ఇక్కడ వాహనాలకు పూజ చేయించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారని వారు చెప్పారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కొత్త బండి కొన్నా ఈ ఆలయానికే వచ్చి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోందట. అందుకే ఈ ఆలయంలోనే ‘నో హల్మెట్.. నో పూజ’ను అమలు చేయాలని భావించామని పోలీసులు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అన్నారు. -
ఒక నిమిషం – ఒక విషయం
ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే– ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది?’’ అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు, ఆరోగ్యానికి చాలా మంచిది’ అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం (అరటితోట)లోనూ విహరిస్తాడు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. ఆయనకు తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. ధ్యానం... విధానం సుఖాసనంలో.. హాయిగా.. కూర్చుని .. చేతులు రెండూ కలిపి.. కళ్ళు రెండూ మూసుకుని.. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే.. ఏకధారగా.. గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా వుండరాదు. ఈ విధమైన ఆలోచనారహిత–స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి.. అపారంగా శరీరంలోకి ప్రవేశించి.. నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత (సంవత్సరాలు) వుంటుందో.. కనీసం అన్ని నిమిషాలు.. తప్పనిసరిగా.. రోజుకి రెండుసార్లుగా.. ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. ధ్యానం వల్ల లాభాలు... ♦ ధ్యానసాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, క్యాన్సరు, గుండెనొప్పి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. దుర్గుణాలు, దురలవాట్లను కూడా పోగొట్టుకోవచ్చు. ♦ మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ♦ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి. ♦ ధ్యాన సాధన చేసిన వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలుగుతారు. ♦ మూఢ నమ్మకాలు, భయాలు పోతాయి. చావు–పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని జయించగలరు. ♦ ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది. -
మీకు తెలుసా?
నిత్యం యోగతాపంతో ఉంటాడు కాబట్టి ఆంజనేయుడికి ఆకుపూజ చేస్తారు. ఆయన విగ్రహానికి వెన్నతో లేపనం చేస్తారు. వినాయకుడు, ఆంజనేయుడు, హయగ్రీవుడు తదితర దేవతా స్వరూపాలకు ఆయా జంతువులకు ఇష్టమైన వాటిని నివేదిస్తే త్వరగా ప్రసన్నులవుతారు. ఉదాహరణకు వినాయకుడికి, ఆంజనేయుడికి అరటిపళ్లు, కొబ్బరి కాయలు ఇష్టమైతే, హయగ్రీవుడికి ఉలవ గుగ్గిళ్లు నివేదించాలి.నిత్యం వాకిలి ఊడ్చి, కళ్లాపిజల్లి, గుమ్మం ముందు పరిశుభ్రంగా ఉంచుతూ, గడపకు వారానికి ఒకసారి అయినా పసుపు, కుంకుమలతో అలంకరించేవారి ఇంట లక్ష్మీదేవి నివసిస్తుందట. -
పూలతోనే ఎందుకు పూజించాలి?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి. పుష్పామూలే వసేద్బహ్మ్ర మధ్యేచ కేశవః పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదళే పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారని, పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడట. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. -
అక్కతో కలిసి..
తమిళసినిమా: నటుడు శరత్‌కుమార్ రెండో కూతురు కూడా చిత్రరంగ ప్రవేశం చేసింది. శరత్‌కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మీ నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పోడా పోడీ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన వరలక్ష్మి బాలా దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మహిళల రక్షణ కోసం సేవ్ శక్తి అనే స్వచ్ఛంద సం స్థను ప్రారంభించన వరలక్ష్మి తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం గా రూపొందుతున్న శక్తి అనే చిత్రం లో నటిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్ శిష్యురాలు ప్రియదర్శని తొలిసారిగా మోగాఫోన్ పడుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారట. దీని గురించి ఆమె చెబుతూ ఇది పోలీస్ అధికారిణికి విలన్‌కు మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కిస్తు న్న యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు పూజ కాస్ట్యూం డిజైనర్‌గా పరిచయం అవుతోందని తెలిపా రు. చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది మార్చిలో శక్తి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. -
అహోబిలంలో బాలాలయ ప్రతిష్ట
- శ్రీజ్వాలానృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో సోమవారం బాలాలయ ప్రతిష్ట మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్వాలానరసింహస్వామి, చెంచులక్ష్మీ, శ్రీదేవి అమ్మవార్లు కొలువైన గుడి జీర్ణోద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు. గుడి జీర్ణోద్దరణ పనులకు ముందు బాలాలయ ప్రతిష్ట నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఉదయం నిత్యపూజలతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహీత శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చన, అభిషేకాది పూజల అనంతరం ప్రత్యేక మండపంలో కొలువుంచారు. వేద మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి శ్రీమాన్ శఠకోప రంగారాజ యత్రీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో హోమం, పున్యాహవచనం, మృత్యుసంగ్రహనం, అంకురార్పణ, చిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి గోపుర విమానప్రయాన పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కామేశ్వరి, ముద్రకర్త వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయన్, వేద పండితులు పాల్గొన్నారు -
సంగమేశ్వరుడికి విశేషపూజలు
కొత్తపల్లి: కృష్ణానది అంత్య పుష్కర పూజల్లో భాగంగా సోమవారం పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ స్వామికి సహస్ర కలుశాభిషేకములు, పుష్కర స్నపనం, భీమలింగ పూజ, మెట్లోత్సవము తదితర విశేష చేపట్టారు. ఇందుకు సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. 5వ రోజున ధనిష్ట నక్షత్రము సప్తనదులలోని దశాశ్వమేధ తీర్థములో స్వామికి త్రిశూల కల్యాణోత్సవ పంచలోహ మూర్తులు, రథోత్సవ ఉత్సవ విగ్రహములకు పుష్కర స్నానము, సహస్ర కలశాభిషేకములను ప్రవాహ జలముతో అభిషేకించారు. అనంతరం భీమలింగ పూజ, రుద్రహోమము, పుష్కర బృహస్పతి యాగము, వరుణ, అరుణ, రుద్ర ఋష్యశృంగ పాశుపత జపములు, వరుణయాగము నిర్వహించారు. అనంతరం మూల వేపదారు శివలింగానికి రుద్రాభిషేకం, మహా మంగళ హారతితో పూజలు ముగించారు. కార్యక్రమంలో ఈఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
హైదరాబాద్ : ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ చండీకుమార అనంత మహా గణపతి అవతారంలో కొలువదీరిన బొజ్జ గణపయ్యకు వీరు తొలిపూజ నిర్వహించారు. విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ మాట్లాడుతూ....ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో మహాగణపతిని దర్శించుకుంటున్నారు. -
సర్వరక్షా బంధనం
సోమవారం రక్షాపూర్ణిమ పర్వదినం శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి కట్టదలిచామో వారి ముంజేతికి కడుతూ– ఆ రక్షిక మీద అక్షతలని వేసి, రక్షాబంధనాన్ని కట్టాలి. రక్షాబంధనం కట్టించుకున్న వారు వీరికి అన్ని విధాలా అండగా నిలబడాలి. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి అండగా నిలవాలి. తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడాలని, భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వస్తారు ఆడపడచులు. తమ సోదరుల చేతికి రక్షాబంధనం కట్టి, వారికి తీపి తినిపిస్తారు. అప్పుడు ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయ . అయితే రక్షాబంధనాలను వెండివి, బంగారువి లేదా విలువైనవి కట్టాలని లేదు. సంప్రదాయ రక్షాబంధనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో సరిపెట్టకూడదు. దాని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది. -
ఐశ్వర్యప్రద వ్రతం
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాని, ఆ మాసంలోని రెండవ శుక్రవారం కాని ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు తర్వాత వచ్చే శుక్రవారంనాడైనా సరే, ఈ వ్రతం జరుపుకోవచ్చు. పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగా తయారు చేసి ఉంచుకోవాలి. ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి నూలు దారం, కొబ్బరికాయలు, దీపపు కుందులు, పంచహారతి, దీపారాధనకు ఆవు నెయ్యి, కర్పూరం, అగరు వత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పూజావిధానం: ఉదయాన్నే లేచి తలంటిస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిముంగిట కళ్లాపు చల్లి, ముగ్గుపెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరించాలి. ఇంట్లో ఇల్లాలు శుచిగా, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం విఘ్న నివారణకై పసుపు గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రనుగాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి కలశపూజ చేసుకోవాలి. అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో పూజించాలి. తెల్లని నూలు దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు పూయాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా ఐదు లేదా తొమ్మిది పోగులతో తయారు చేసిన తోరాలను పీఠం మీద ఉంచి పూజించాలి. కథానంతరం తోరాలు కట్టుకోవాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యంతో సహా విందారగించి రాత్రి భోజనాన్ని త్యజించాలి. -
మనోభావాలను దెబ్బతీసిన సీఎం
-
మనోభావాలను దెబ్బతీసిన సీఎం
నంద్యాల: నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. స్థానిక ఎస్పీజీ గ్రౌండ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన బూటు కాళ్లతోనే టెంకాయలు కొట్టి, పూజలు చేశారు. అలాగే ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే బూట్లు విడవకపోవడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, నారాయణ కూడా పాదరక్షలు తీయకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
పూజకు స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. తైవాన్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు కొల్లగొట్టారు. మహిళల 51 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పూజ స్వర్ణం సాధించింది. సోను 44 కేజీల విభాగంలో రజతం గెలవగా.. 59 కేజీల విభాగంలో మను కాంస్యం అందుకుంది. పురుషుల విభాగంలో సతీశ్ 120 కేజీల గ్రీకోరోమన్ స్టయిల్లో రజతం సాధించగా.. 50 కేజీల విభాగంలో మనీశ్ కాంస్యం సాధించాడు. -
జీఎస్టీ వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బంది
‘‘నా బాల్య మిత్రుడు, క్లాస్‌మెట్ పట్టాభికి సినిమా అంటే ప్యాషన్. చిత్ర పరిశ్రమలో తనకు ఎవరూ తెలిసినవారు లేరు. సినిమాపై ఇష్టంతో సురేశ్‌బాబుగారికి ఓ ఉత్తరం రాయడంతో, ఆయన పెద్ద మనసుతో పట్టాభిని తన సంస్థలో చేర్చుకున్నారు’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. సాయి రోనక్, హరీష్, పూజ ముఖ్య పాత్రల్లో పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాదలి’. ప్రసన్ ప్రవీణ్ శ్యాం స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను కేటీఆర్ రిలీజ్ చేసి, నిర్మాత సురేశ్‌బాబు, హీరో రామ్‌చరణ్‌కి అందించారు. కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘మిత్రుడు రామ్‌చరణ్‌ని అడగ్గానే ఈ ఫంక్షన్‌కి వచ్చాడు. ‘కాదలి’ టీం కొత్తవారైనా చక్కగా చేశారు. కథే కింగ్. బాగుంటే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం ‘పెళ్లి చూపులు’ చిత్రం నిరూపించింది. ‘బాహుబలి’ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచింది. అమెరికాలోని కాలిఫోర్ని యాకి వెళ్లినప్పుడు ‘బాహుబలి’ చూశాం అని అక్కడి వాళ్లు చెప్పడం గర్వంగా అనిపించింది. సినిమా రంగానికి 28 శాతం జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విధించడం వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బందే. కమల్‌హాసన్‌గారు కూడా ఇదే విషయాన్ని రైజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి అందరూ వెళ్లి కేంద్ర మంత్రి అరుణŠ æజైట్లీని కలిసి పన్ను తగ్గించాలని కోరదాం. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది’’ అన్నారు. హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు చనిపోయాక జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది. కాబట్టి అందరూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ‘కాదలి’ విజువల్స్ చూస్తే నా ‘ఆరెంజ్’ చిత్రం అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. నా తొలి చిత్రంలో నేను ఇంత బాగా చేసి ఉండను. యాక్టర్స్ కొత్తవారైనా పది సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారిలా చేశారు. ఈ సినిమా ఎప్పు డెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఇప్పుడు మనం 7 నుంచి 14 పర్సెంట్ పన్నులో ఉన్నాం. జీఎస్టీ 28 శాతం అంటే రీజనల్ సినిమాలు చాలా నష్టపోతాయి’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. ‘‘ఒక తెలుగు సినిమాకి తమిళ టైటిల్ పెట్టినప్పుడే ఈ మూవీ ప్రత్యేకమని అర్థమైంది. ‘హ్యాపీడేస్, పెళ్లిచూపులు’లా ‘కాదలి’ కూడా హిట్ ఇవ్వాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పట్టాభి మాట్లాడుతూ – ‘‘నాకు íసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశమిచ్చిన సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్. నా మిత్రుడు కేటీఆర్ ఇక్కడికొచ్చి నన్ను సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. చిరంజీవిగారికి ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్లో రామ్‌చరణ్‌గారు డ్యాన్స్‌లో ఉర్రూతలూగిస్తున్నారు. ‘కాదలి’ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. సాయి రోనక్, హరీష్, పూజ, దర్శకులు దశరథ్, వీరూ పోట్ల, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్, పాటల రచయిత వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ రంగా, కెమెరామేన్ శేఖర్ వి.జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన మద్దిలేటి క్షేత్రం
బేతంచెర్ల: శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం.. శనివారం భక్తులతో పోటెత్తింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని రైతులు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి వార్లకు అభిషేకం, కుంకుమార్చన, వరపూజ, ఆకుపూజ నిర్వహించారు. సుమారు నాలుగువేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వెండి పూలహారం సమర్పణ వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వెంకట శేషఫణి కుటుంబ సభ్యులు శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుబడి నిమిత్తం 265 గ్రాముల వెండి పూలహారంను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది.. వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
వైభవంగా వరాహ జయంత్యుత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ) : వరాహ జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జామున వరాహ క్షేత్రంలో కొలువైన వరాహ నారసింహస్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామి వారికి తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. -
వసంతోత్సవం.. ఆనందోత్సాహం
ఆస్పరి: మండల పరిధిలోని బిణిగేరి ఆంజినేయ స్వామి, శంకరబండలింగమేశ్వర స్వామి ఉత్సవాల చివరిరోజు వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయా దేవాలయాల్లో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల వారు రంగుల కడవలకు పూజలు చేసి ఆనందోత్సాహాల మధ్య రంగులు చల్లుకున్నారు. అనంతరం బిణిగేరిలో ఆంజినేయ స్వామి విగ్రహాన్ని , శంకరబండలో లింగమేశ్వర స్వామి పల్లకిని ఊరేగిస్తూ ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా కూడా రంగలు చల్లుకుంటూ సాగారు. కల్లుబావి జట్టుదే విజయం.. శంకరబండ గ్రామంలో లింగమేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఆదోని మండలం కల్లుబావి గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఆస్పరి మండలం ముత్తుకూరు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. కలబావిజట్టుకు రూ.10,016 నగదును పురుషోత్తమరెడ్డి, ముత్తుకూరు జట్టుకు రూ. 5,016 నగదును లింగమయ్య స్వామి యూత్ అందజేశారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
- ఫిబ్రవరి 27వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు -ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశం - సాయంత్రం 7గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ - ఆర్జిత అభిషేకాది అర్చనలు, హోమాలు రద్దు శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో స్వయంభూవుగా వెలిసిన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం యాగశాల ప్రవేశంతో అంకురార్పణ జరగనుంది. ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనము, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి 7 గంటలకు త్రిశూల పూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణలు జరుగుతాయి. 18 నుంచి 26 వరకు రోజూ ఉదయం 7.30గంటల నుంచి చండీశ్వరపూజ, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు రోజూ ఉదయం 9గంటలకు రుద్రహోమం, చండీహోమాలను నిర్వహిస్తారు. 10.30గంటలకు నిత్యబలిహరణలు, సాయంత్రం 6గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలుంటాయి. 18న టీటీడీ, 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంప్రదాయానుసారం ఈ నెల 18న తిరుమల తిరుపతి దేవస్థానం, 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికి ముందుగా ప్రధానాలయ రాజగోపురం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను చేసి, వివిధ రకాలైన ఫలపుష్పాదులను సమర్పించి ఆలయప్రదక్షిణ చేసిన తరువాత పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 24న మహాశివరాత్రి– బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 10.30గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30గంటల నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక వేదికను తయారు చేస్తునట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. 25న రథోత్సవం మహాశివరాత్రి పర్వదినాన వధూవరులైన భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను 25న అంగరంగ వైభవంగా రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతకుముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం ఉంటుంది. 25న సాయంత్రం 3.30గంటలకు రథాంగపూజ, రథాంగహోమం నిర్వహించాక, రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7గంటల నుంచి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలుంటాయి. 26న ఉదయం 9.15 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర కార్యక్రమాలుంటాయి. అదేరోజు సాయంత్రం ఉత్సవాల ఆరంభసూచనగా ధ్వజారోహణ చేసిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు. 27న భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ చేసి ఉత్సవాలకు సకల దేవత ఆహ్వాన పూర్వక ధ్వజపటావిష్కరణ జరుగుతుంది. 18న భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లు çభృంగివాహనంపై దర్శనమిస్తారు. 19న హంసç, 20న మయూర, 21న రావణవాహనం, 22న పుష్పపల్లకీ మహోత్సవం, 23న గజవాహనం, 24న ప్రభోత్సవం, నంది వాహనసేవ, 25న రథోత్సవం, 26న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 27న అశ్వవాహన సేవలుంటాయి. -
భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 80 వేలకుపైగా భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈఓ నారాయణ భరత్‌గుప్త ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. భక్తులందరికీ స్వామివార్ల దర్శనం కల్పించేందుకు దూర దర్శనం ఏర్పాటు చేశారు. కేవలం అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. అనంతరం ఇరుముడులతో ఉన్న శివదీక్షా స్వాములతో పాటు దీక్షా శివస్వాములను ప్రత్యేక క్యూ ద్వారా అనుమతించి వారికి స్పర్శదర్శన భాగ్యం కల్పించారు. కాగా రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో శనివారం సాయంత్రం నుంచే భక్తుల రద్దీ ప్రారంభం కాగా, మల్లన్నకు అభిషేకాలను నిర్వహించుకోవడానికి ముందస్తు టికెట్ల ద్వారా ఆదివారం ఉదయం 6గంటల నుంచి, ఆ తరువాత 7.30 గంటలకు తరువాత 12.30గంటలకు మూడు విడతల్లో సుమారు 600లకు పైగా సామూహిక అభిషేకాలను నిర్వహించుకున్నారు. అదేరోజు సాయంత్రం 6.30గంటలకు మరో విడతలో వందకు పైగా అభిషేకాలను నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత దర్శన క్యూ కంపార్టుమెంట్లలో భక్తులకు ఫలహారాన్ని అందజేశారు. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన వారం కావడంతో భక్తులరద్దీ అధికంగా ఉంటుందనే భావనతో ఆలయపూజావేళలను యథావిథిగా ఏర్పాటు చేసి వేకువజామున 5.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది: మహానంది క్షేత్రంలో రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలాచక్రవర్తి, తదితరులు విశేష పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనము, సూర్యయంత్రారాధన, ద్వాదశాదిత్యపూజ, రథాంగపూజ, రథాధిదేవతావాహనము పూజలు నిర్వహించారు. అనంతరం రథమును శివరాత్రిన జరిగే గంగా, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణోత్సవ ఉత్సవాలకు బయటకు తీశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజుయాదవ్, చింతకుంట్ల శివారెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, బండి శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు నిచ్చెనమెట్ల శేషఫణి, గంగిశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోటి పూజల్లో భక్తకోటి
-
అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్ డీఎస్పీ
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఇంటలిజెన్స్ డీఎస్పీ వంశీధర్‌గౌడ్ దర్శించుకున్నారు. ఆదివారం క్షేత్రానికి చేరుకున్న ఆయన ఎగువ, దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల్లో భాగంగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈయన వెంట ఐదుగురు ఇంటలిజెన్స్ ఎస్ఐలు ఉన్నారు. -
ఓం సాయి..శ్రీసాయి..
- ఘనంగా దత్తజయంతి వేడుకలు – భక్తులతో కిటకిటలాడిన సాయిమందిరాలు కర్నూలు (న్యూసిటీ/కల్చరల్) దత్త జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో ఓం సాయి.. శ్రీసాయి.. జయ జయ సాయి నామస్మరణ మార్మోగింది. తెల్లవారుజామునే మహిళలు కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవిష్ణు సహస్ర నామావళి మంత్రాలను పఠించారు. గురు చరిత్ర పారాయణం చేశారు. అంతకు ముందుగా వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి విగ్రహాలకు అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, పూజలతో అలంకరణ చేశారు. కర్నూలు నగరంలో పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన దక్షిణ షిరిడి శ్రీసాయిబాబా, బాలాజీ నగర్, బుధవారపేట, అశోక్‌నగర్, వినాయక ఘాట్, కృష్ణారెడ్డి నగర్లలోని సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. బిర్లాగేట్ సమీపంలోని శంకర మందిరరంలో షిరిడీసాయి జీవిత చరిత్రపై ప్రముఖ వాగ్గేయకారులు ఈమని రామకృష్ణప్రసాద్ మధురమైన గీతాలు వినిపించారు. సంగీత విభావరికి నాగరాజు, గోపాల్, శిరీష, వాయిద్యా సహకారం అందించారు. ఆలయ కమిటీలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
శ్రీశైలం కిటకిట
వరుస సెలవులతో పెరిగిన రద్దీ ఆలయపూజావేళల్లో మార్పులు నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవు దినాలు కలిసి రావడంతో లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. సుమారు లక్షన్నరకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను ఆదివారం దర్శించుకుని ఉంటారని అంచనా. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆలయపూజావేళల్లో మార్పులను చేశారు. భక్తుల రద్దీ దృష్టా్య ఉచిత, ప్రత్యేక దర్శన భక్తులకు స్వామివార్ల దూర దర్శనాన్ని ఏర్పాటు చేయగా, సామూహిక అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రం గర్భాలయంలోకి అనుమతించారు. ఉచిత దర్శన క్యూ కంపార్టుమెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచి రోడ్డుపైనే క్యూ కట్టారు. అక్కడ మొదలైన క్యూ ప్రధాన మాడా వీధిలోని ఆం్ర«ధా బ్యాంక్ వరకు చేరుకుంది. దీనికి తోడు అధిక సంఖ్యలో అభిషేకం టికెట్లను అధికారులు విక్రయించడంతో ఓ వైపు అభిషేక భక్తుల స్పర్శదర్శనాల కోసం క్యూలను నిలిపివేశారు. మరోవైపు ఉచిత,ప్రత్యేక దర్శన క్యూలలోఉన్న భక్తులకు మల్లన్న దర్శన భాగ్యం కలగడానికి సుమారు నాలుగైదు గంటలకు పైగా సమయం పట్టింది. ముగిసిన కార్తీకమాస శివ దీక్షలు: కార్తీకమాసం సందర్భంగా మండల, అర్థమండల శివదీక్షలను స్వీకరించిన భక్తులకు ఆదివారం శివదీక్షా విరమణ చేయడంతో కార్తీకమాస శివదీక్షలు ముగిశాయి. దీక్షా విరమణ కోసం రాష్ట్రం నలమూలల నుంచేగాకుండా తెలంగాణా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. స్థానిక శివదీక్షా శిబిరాల వద్ద దీక్షా విరమణ చేసి ఇరుముడులను సమర్పించుకున్నారు. ఇరుముడులతో మొదటగా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఇరుముడులను సమర్పించి పాతాళగంగ స్నానాలు చేసుకున్నారు. శివదీక్షా స్వాములకు ప్రత్యేక దర్శన క్యూ ద్వారా స్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించారు. వసతిగదుల్లేవ్: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకోవడానికి శనివారం రాత్రి సమయానికే వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో అన్ని సత్రాలు, దేవస్థానం, టూరిజం, ఆశ్రమాలు, పీఠాలు యాత్రికులతో నిండిపోయాయి.రాత్రి 8 గంటల సమయానికే ఏ సత్రానికి వెళ్లినా వసతిగదులు లేవని బోర్డులు పెట్టేశారు. దేవస్థానం, టూరిజం వసతి గృహాలను ఆన్లైన్లో గదులను అధిక సంఖ్యలో రిజర్వేషన్ చేసుకున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా వచ్చిన వందలాది మంది భక్తులకు వసతిగదులు లేక ఆయా సత్రాల వరండాలలో సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు ఆలయపూజావేళలను ఆదివారం తరహాలో 3.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కాగా వరుస సెలవు దినాలు వచ్చినప్పుడు శ్రీశైలం ఆన్లైన్. కామ్ ద్వారా ముందస్తుగానే గదులు, అభిషేకాది ఆర్జితసేవలను తీసుకోవాలని సూచిస్తున్నారు. -
శ్రీశైలాలయ పూజా వేళల్లో మార్పు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికీ దర్శనభాగ్యం కల్పించేందుకు అధికారులు ఆలయ పూజా వేళల్లో మార్పు చేశారు. ఆదివారం వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతి, 5.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి. -
వైభవోపేతం..స్వాతి ఉత్సవం
ఆళ్లగడ్డ: శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం అహోబిలంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అహోబిలం మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపారు. అర్చన, తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నావనారసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. -
వైభవోపేతం.. ఏకాదశి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలంలో శుక్రవారం ఏకాదశి మహాత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఎగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ఆవరణలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులను పుల్లకిలో కొలువుంచి మాడా వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
ఫైనల్లో పూజ, పలక్
టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పూజ, పలక్ ఫైనల్‌కు చేరుకున్నారు. తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్టాగ్ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన క్యాడెట్ బాలికల సెమీస్‌లో పూజ (ఏడబ్ల్యూఏ) 11-8, 11-9, 11-3తో ఫాతిమా (డాన్ బాస్కో)పై, పలక్ (జీఎస్ఎం) 11-5, 11-5, 11-9తో ప్రీతి (ఎన్సీసీ)పై గెలుపొందారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో పూజ (ఏడబ్ల్యూఏ) 11-7, 5-11, 11-9, 10-12, 11-7తో దేవిశ్రీ (నల్గొండ)పై, పలక్ (జీఎస్ఎం) 11-8, 11-4, 11-4తో అనన్య (జీఎస్ఎం)పై, ప్రీతి (ఎన్సీసీ) 5-11, 11-7, 11-6, 3-11, 11-6తో ప్రియాంక (హెచ్‌వీఎస్)పై, ఫాతిమా (డాన్‌బాస్కో) 11-2, 11-4, 11-1తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. మరోవైపు అంతర్ జిల్లా టోర్నమెంట్లో మహిళల విభాగంలో రంగారెడ్డి జిల్లా 3-0తో నల్గొండ జిల్లాపై గెలుపొందింది ఇతర మ్యాచ్‌ల ఫలితాలు క్యాడెట్ బాలుర క్వార్టర్స్: అథర్వ (ఏడబ్ల్యూఏ) 11-8, 9-11, 11-9, 4-11, 11-8తో వేణు మాధవ్‌పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-9, 11-7, 11-5తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, రాజు (ఏడబ్ల్యూఏ) 11-6, 13-15, 11-4, 11-4తో కుషాల్ (జీటీటీఏ)పై, త్రిశూల్ (ఎల్బీఎస్) 10-12, 11-7, 11-6, 6-11, 11-6తో క్షితిజ్ మల్పానీ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. మహిళల ప్రిక్వార్టర్స్ ఫలితాలు: నిఖత్ బాను (జీఎస్ఎం) 11-9, 11-6, 11-3, 11-3తో నవ్య నిఖిత (వైఎంసీఏ)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 11-6, 11-5, 10-12, 11-5, 11-7తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-4, 11-6, 11-1, 11-6తో హనీఫా ఖాతూన్ (స్టాగ్ అకాడమీ)పై, వినిచిత్ర (స్టాగ్ అకాడమీ) 3-11, 7-11, 13-11, 11-7, 11-7, 5-11, 11-6తో నిఖిత (జీఎస్ఎం)పై, వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం) 11-6, 9-11, 11-13, 11-8, 11-3, 11-9తో అనూప రూత్ (జీఎస్ఎం)పై నెగ్గారు. -
తల్లికి రోజూ పూజ చెయ్యడమా?
మాతృభక్తి అంటే... చిన్నప్పుడు పెద్దలు పిల్లల ఆలనాపాలనా చూస్తే, పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రుల ఆలనా పాలనా చూడాలి. ఏ కారణంగానైనా తల్లితండ్రులు పిల్లల పెంపకంలో శ్రద్ధ వహించక పోయినా వారిని చక్కగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. మాతృదేవోభవ’ అన్న గురువు ఆదేశం అందరికీ ఆచరణీయం. దాని అర్థం - ‘తల్లే దైవంగా కలవాడవు కమ్ము’ అని. తల్లి మొదటి గురువు, దైవం కూడా! భక్తి ప్రపత్తులతో తల్లిని సేవించాలి. తల్లి మాటను తల దాల్చాలి. ఇది వేదవాక్కు. ఆదర్శ పురుషులుగా పేరొందిన వారందరూ తల్లి మాటను శిరసావహించినట్టు చరిత్ర చెబుతోంది. ఎందుకంటే తల్లిగా ఏ స్త్రీ కూడా బిడ్డకి హాని చేయాలని అనుకోదు. వ్యక్తిగా, కూతురిగా, సోదరిగా, భార్యగా, కోడలిగా చెడ్డదై ఉండవచ్చు కానీ, తల్లిగా మాత్రం చెడ్డతనం ఏ కోశానా ఉండదు. ఎంతైనా తల్లి కూడా మానవమాత్రురాలు. ఆవిడ తెలివి, జ్ఞానం, పరిస్థితులు, మానసిక స్థితి మొదలైన అంశాల మీద ఆమె మాటలు ఆధారపడి ఉంటాయి. ఈ పరిమితులను అర్థం చేసుకుంటే తప్ప అవి ఆచరణ యోగ్యాలా కాదా అనేది తెలియదు. ఇవేవీ పట్టించుకోకుండా అమ్మ అన్నది కదా అని పాటించి, జీవితాలను వ్యర్థం చేసుకున్న సామాన్యులు ఎందరో కనపడతారు. విచక్షణ లేకపోవడమే దీనికి కారణం. ప్రహ్లాదుడు తండ్రి మాటని పాటించాడా? అలాగని ఎదిరించలేదు, చులకన చెయ్యలేదు. తండ్రిది సరైన దారి కాదు కనుక, తండ్రి మీద ఉన్న భక్తితో అతడిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. తల్లి కూడా పొరబాటున క్షణికావేశంలోనో, తెలివి లేకో, మతిమాలో ఏదైనా చెబితే - మాతృభక్తి ఉన్నవారు తల్లికి సర్దిచెప్పవలసి ఉంటుంది. అంతేకానీ ఆమెకు తెలియక విషం పెడుతుంటే తెలిసిన కొడుకో, కూతురో మాతృభక్తి పేరుతో తినరు కదా! మాతృభక్తి అంటే తల్లికి రోజూ పూజ చెయ్యడం కానట్టే, మూర్ఖంగా చెప్పినవన్నీ చెయ్యడం కూడా కాదు. ఆమె ధర్మమార్గంలో చరించేలా, ఉద్ధరించబడేలా, ఉత్తమగతులకు వెళ్ళేలా చేయడం నిజమైన మాతృభక్తి. దీనికి శ్రీరామచంద్రుడు పెద్ద ఉదాహరణ. తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి అడవికి వెళ్ళవద్దని ఎంతగానో బతిమాలింది. ‘తండ్రి మాట విన్నట్టే, నా మాట కూడా వినాల్సి ఉంది’ అన్నది. నిజానికి రాముడు తండ్రి మాట కూడా వినలేదు. దశరథుడు కూడా రాముణ్ణి అరణ్యానికి వెళ్ళవద్దనే అన్నాడు. తనను చెరసాలలో ఉంచి కానీ, చంపి కానీ సింహాసనాన్ని అధిరోహించమనే అడిగాడు. కానీ, తండ్రి చెప్పిన ఆ మాటలు రాముడు విన్నాడా? లేదే! పినతల్లి అయిన కైకకు తండ్రి గారిచ్చిన మాటను అమలు జరిపి, తండ్రిని సత్యవాక్య పాలకుణ్ణి చేశాడు. అదేవిధంగా తల్లిని కూడా ధర్మపాలన చేయడానికి ప్రోత్సహించాడే కానీ, కౌసల్య దుఃఖవివశురాలై అన్న మాటల్ని అమలు చేయలేదు. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా, వృద్ధాప్యంలో భర్తను వదలి ఉండడం ధర్మం కాదనీ, భర్తకు అవసరం ఉన్నప్పుడు అతడికి సేవ చెయ్యడం ముఖ్యధర్మమనీ కౌసల్యకు పాతివ్రత్య ధర్మాలను గుర్తుచేశాడు. ఆమెకి తెలియవని కాదు. దుఃఖం మాటున మరుగుపడ్డాయి. మాతృభక్తి అంటే అది. అంతేకానీ, తల్లి కదా అని చెప్పిన ప్రతి వెర్రి మొర్రిమాటనూ అమలు చెయ్యాలనుకోవటం మూర్ఖత్వం. ఇక, మూర్తీభవించిన ధర్మమైన అన్నగారి అడుగుజాడల్లో నడిచిన భరతుడు తల్లి కోరికను అనుసరించి సింహాసనాన్ని అధిరోహించలేదే! అయాచితంగా మహాసామ్రాజ్యం లభించింది కదా అని అంగీకరిస్తే, ఉభయతారకంగా ఉండేది. రాజ్యానికి రాజ్యం. మాతృవాక్య పరిపాలకుడన్న ఖ్యాతి. దోషం - ధర్మవిరుద్ధమైన కోరిక కోరిన తల్లిది. తనకు మాత్రం లాభం, సుఖం. అలా తల్లికి పాపం (అధర్మ దోషం) వస్తుంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకుంటే అది తల్లి మీద ప్రేమ ఉన్నట్టా? తల్లికి పాపం రాకూడదనీ, ఆమెకు దుర్గతి రాకూడదనీ కైక కోరికను నిరాకరించి ఆమెకు ఎంతో మేలు చేశాడు భరతుడు. ఇది మాతృభక్తి. పిల్లలకు భక్తి ఉన్నట్టే పెద్దలకు వాత్సల్యం కూడా ఉండాలి. ‘చిన్నతనంలో వాళ్ళకు సేవ చేశాం కాబట్టి, ఇప్పుడు మాకు చెయ్యవలసిందే’ అనడం సరి కాదు. అది తల్లితండ్రుల కర్తవ్యం. పెళ్లి చేసుకోవడమే ఈ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధమయ్యామని చెప్పడం! పిల్లలను పెంచడం ఏదో పెద్ద త్యాగం చెయ్యడమనుకునే వారికి సంతానమెందుకు? వృద్ధాప్యంలో తమని చూస్తారనుకుని పిల్లల్ని పెంచితే అది లాభనష్టాలను బేరీజు వేసుకొని చేసే వ్యాపారమవుతుంది. తల్లితండ్రులకు లేని మానవతా భావన పిల్లలకు ఎలా ఉంటుంది? ఉండాల్సిన అవసరం ఏముంది? నిజమే! చిన్నప్పుడు పెద్దలు పిల్లల ఆలనాపాలనా చూస్తే, పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రుల ఆలనా పాలనా చూడాలి. ఏ కారణంగానైనా తల్లితండ్రులు పిల్లల పెంపకంలో శ్రద్ధ వహించక పోయినా వారిని చక్కగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. అంత మాత్రాన పిల్లల్ని వారి సుఖసంతోషాలను వదులుకుని తమకు సేవ చెయ్యమనడం (తమకు శక్తి ఉన్నా కూడా) ఎంత సమంజసం? ‘బతికినంత కాలం బతకం కదా’ అంటారు. కానీ, ఈలోగా పిల్లలు (కొడుకు కోడలో, కూతురు అల్లుడో) వృద్ధులై పోతారు. జీవితాన్ని అనుభవించే వయసు దాటిపోయి ఉంటుంది. తాము యౌవనంలో అనుభవించిన సుఖాలనూ, భోగాలనూ తమ సంతానానికి దూరం చెయ్యడం భావ్యమా? ఏ కారణంగానైనా తాము సుఖాలని అనుభవించ లేదు కనుక అసూయతో పిల్లల్ని వాటికి దూరం చెయ్యడం న్యాయమా? తల్లితండ్రుల మీద ప్రేమ, భక్తి ఉన్న వారు గమనించవలసింది - వారు చెప్పినదాన్ని ఆచరించడం వల్ల వారికి ఉత్తమగతులు లభిస్తాయా, లేదా అన్నది. అంతేకానీ, పెద్దలు కదా అని వాళ్ళు చెప్పిన తప్పు పనులు చెయ్యడం వల్ల వాళ్ళూ తామూ కూడా ఇహపరాలను కోల్పోతారు. అటు పెద్దలు, ఇటు యువతరం గుర్తించవలసిన అంశం ఇది. - డా. ఎన్. అనంతలక్ష్మి -
మల్లన్న వైభవం
శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో స్వామిఅమ్మవార్లు వెండిరథంపై దర్శనమిచ్చారు. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో రాత్రి వెండిరథంపై ఉత్సవమూర్తులను ఆధిష్టింపజేసి విశేషపూజలను నిర్వహించి ఆలయప్రదక్షిణ చేయించారు. కార్యక్రమానికి ముందుగా ఉత్సవమూర్తులను సహస్రదీపాలంకరణ మండపంలో ఽఉంచి ప్రత్యేకపూజలను వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తకంగా అర్చకులు నిర్వహించారు. కళారాధనలో భాగంగా అక్కమహదేవి అలంకార మండపంలో హరికథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. - శ్రీశైలం -
శ్రీశైలాలయ పూజా వేలల్లో మార్పు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికి దర్శనభాగ్యం కల్పించడానికి అధికారులు ఆలయ పూజావేళల్లో మార్పు చేశారు. గురువారం వేకువజామున 4.30గంటలకు మంగళవాయిద్యాలు, 5గంటలకు సుప్రభాతం, 6గంటలకు మహా మంగళహారతి, 6.30 నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి. -
నిజరూపంలో కామేశ్వరీదేవి
మహానంది: తొమ్మిదిరోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి విశేష పూజలందుకున్న శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు సోమవారం నిజరూపంలో దర్శనమిచ్చారు. దేవస్థానం ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వవర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, తదితర పండిత బృందం విశేష పూజలు నిర్వహించారు. రాత్రి మయూర వాహనంపై కొలువైన అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించారు.స్థానిక స్వామివారి అలంకార మండపంలో శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి సహస్రదీపాలంకరణ సేవలు వైభవంగా జరిగాయి. నంద్యాలకు చెందిన విద్యార్థిని ప్రదర్శించిన భరతనాట్యం ¿భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రెడ్డి, దాతలు గంగిశెట్టి మల్లికార్జున, హైకోర్టు న్యాయవాది గంగిశెట్టి రాజేశ్, సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
బాధితులకు రూ.40 వేల ఆర్థికసాయం చేసిన ఎన్ఆర్ఐ కుటుంబం చెన్నూర్ : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన గడ్డం శంకర్-మాంతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు దీప, పూజల ధీనగాథపై ‘కన్నవారు దూరమై..బతుకు భారమై’ శీర్షికన ఈ నెల 18న సాక్షిలో ప్రచురితమైన మానవీయ కథనం సహృదయులను కదిలించింది. ఇప్పటికే జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డితోపాటు పలువురు 30 వేలకు పైగా ఆర్థికం సాయం అందించగా..తాజాగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మంచాల సంతోశ్ తన మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని చలించిపోయూరు. తన వంతు సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా మారిన బాలికలు దీప, పూజకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని తన తల్లిదండ్రులు మంచాల సత్యనారాయణ, సావిత్రితో ఇప్పించారు. ఈ సందర్భంగా సంతోశ్ అమెరికా నుంచి సాక్షితో మాట్లాడారు. ‘నిరుపేద బాలికలు దీప, పూజలు ధీనగాథ నన్ను కదిలించింది. అమ్మాయిలిద్దరూ ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలి. అప్పుడే వారి తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తారు’ అని అన్నారు. -
ఆలయంలో ఘనంగా విశేష పూజలు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా బాలాలయంలో నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, అర్చన, సహస్రనామార్చన, సుదర్శన హవనం వంటి విశేష పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 3 గంటలకే తెరిచి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఆలయంలోని స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకించారు. పట్టు వస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక పీఠంపై అధిష్టింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో ప్రత్యేక పూజలను చేసిన అనంతరం హారతిని సమర్పించారు. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు గావించారు. కోడే మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, నరిసింహాచార్యులు, రంగాచార్యులు, ఆలయ అధికారులు చంద్రశేఖర్, గోపాల్ పాల్గొన్నారు.