
నిత్యం యోగతాపంతో ఉంటాడు కాబట్టి ఆంజనేయుడికి ఆకుపూజ చేస్తారు. ఆయన విగ్రహానికి వెన్నతో లేపనం చేస్తారు. వినాయకుడు, ఆంజనేయుడు, హయగ్రీవుడు తదితర దేవతా స్వరూపాలకు ఆయా జంతువులకు ఇష్టమైన వాటిని నివేదిస్తే త్వరగా ప్రసన్నులవుతారు.
ఉదాహరణకు వినాయకుడికి, ఆంజనేయుడికి అరటిపళ్లు, కొబ్బరి కాయలు ఇష్టమైతే, హయగ్రీవుడికి ఉలవ గుగ్గిళ్లు నివేదించాలి.నిత్యం వాకిలి ఊడ్చి, కళ్లాపిజల్లి, గుమ్మం ముందు పరిశుభ్రంగా ఉంచుతూ, గడపకు వారానికి ఒకసారి అయినా పసుపు, కుంకుమలతో అలంకరించేవారి ఇంట లక్ష్మీదేవి నివసిస్తుందట.
Comments
Please login to add a commentAdd a comment