Anjaneya
-
కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!
‘ఊరు గాదు అడవి గాదు మాట్లాడే మనిషి లేడు ఒంటరి బతుకై పాయే ఒంటెలతో చావాయే దిక్కు మొక్కు లేని గల్ఫ్ బతుకవాయెనే కొడుకు చితికి పాయెనే!' అంటూ 'ఎడారి బతుకులు' కవితలో వాపోయాను. నిజమే కాని మన ఊర్లో మన కళ్ళ ముందు మన పశువుల కాపర్లు పడే కష్టాలు తక్కువేం కాదు సుమా! ఇంత చద్దన్నం కట్టుకొని వెళ్లిన వారు పొద్దంతా ఆ నోరులేని జీవాలతో వేగడం,రాత్రికి గాని ఇల్లు చేరలేకపోవడం అత్యంత కష్టమైన పనే కదా! ఒకప్పుడు సంపదంటే పశువులే. వాటితోనే పాడి, వ్యవసాయం, ప్రయాణాలు కూడా. అలాంటి పశువులు, వాటి పోషణే నేటికీ చాలా మంది బతుకు దెరువు మరి. అలా పశువులు కాస్తూ మంద నుండి తప్పిపోయిన ఒక గేదెను వెతుకుతూ కొండపైకి వెళ్లిన, ప్రస్తుత జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సింగం సంజీవుడికి పొదల్లో హనుమంతుడి విగ్రహం కనబడిందట. మరునాడు భార్య ఆశమ్మతో కలిసి వచ్చి ఆ స్వయంభూ స్వామిని వెలుగులోకి తెచ్చి, దానికో చిన్న గుడికట్టి, అందరికన్నా ముందు కొండగట్టు ఆంజనేయుడికి మొక్కిన వారు ఆ గొల్ల దంపతులు. ఇది దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి మాట. ఆ తర్వాతి కాలంలో కృష్ణారావు దేశముఖ్ అనే దొరవారు ఆ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంవల్ల స్వామివారి దర్శనానికి వచ్చి పోయే భక్తుల సంఖ్య పెరగడం, 1968 లో దాని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖవారు చేపట్టడం జరిగింది. చాత్తాద వైష్ణవులే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేది. జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కి మీ దూరంలో, కరీంనగర్ హైవే పైనున్న కొండగట్టు దేవస్థానం ఏడాది పొడుగునా వచ్చిపోయే హనుమాన్ భక్తులతో కళకళలాడుతుంటుంది. 'ఆంజనేయ స్వామి దీక్ష'ల కాలంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్త జనం. అయితే ఇక్కడ సరియైన రోడ్లు లేకనే చాలా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలకు జవాబా అన్నట్లుగా ఇటీవలే జగిత్యాల జిల్లా సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ ఈ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం విశేషం. 'బల్మూరి కొండాలరాయుడా నీ చరిత పౌరుషానికి మారు పేరురా!' అని ఇక్కడ జానపదులు పాడుకునే పాట. మానాల, పొలవాస, ఎలగందుల నుండి గోల్కొండ వరకు పేరు గాంచిన కొండాలరాయుడు ఈ గట్టును తన స్థావరంగా వాడుకున్నాడని అందుకే దీన్ని కొండగట్టు అన్నారని కొందరంటారు. సంజీవుడు ఆశమ్మలు ఆంజనేయస్వామికి చేసిన సేవలకు శాసనాధారం కూడా చూపుతున్నారు కాబట్టి ఆ గొల్ల దంపతుల విగ్రహాలు, పౌరుషానికి మారు పెరైన కొండలరాయుడి విగ్రహము కూడా కొండగట్టుపై పెట్టడం సమంజసంగా ఉంటుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి... చదవండి: Sagubadi: అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే.. -
హనుమ జన్మస్థలంపై వివాదం అనవసరం
తిరుమల: తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి జన్మస్థలమని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అనవసరమని చెప్పారు. టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి’ అంశంపై శుక్రవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది. భారతీ మహాస్వామి వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడుతూ కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా చెప్పుకుంటున్నామన్నారు. బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. దీంతో పాటు అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని పేర్కొన్నట్లు వివరించారు. కిష్కిందకు శాస్త్ర, పురాణ ప్రమాణాలు లేవని, సంస్కృతం, పురాణం, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉండదన్నారు. నమ్మకం కుదిరాకే ప్రకటించాం: ఈవో జవహర్‌రెడ్డి టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమనే విషయం గురించి పలువురు మెయిల్స్ ద్వారా సూచనలు చేశారని చెప్పారు. పలువురు ప్రముఖ పండితులతో మాట్లాడితే ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించినట్టు తెలిపారు. వీటిపై నమ్మకం కుదిరాకే 2020 డిసెంబర్లో పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఈవో వెల్లడించారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించినట్లు తెలిపారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చ పెట్టామని, వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉండడంతో వారితో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆక్స్ఫర్డ్ పుస్తకంలోనూ ఆధారాలు: మాడభూషి శ్రీధర్ మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల డీన్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, రామాయణం జరిగిందనడానికి ధనుష్కోటిలోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ తీసుకున్న పురాణ ఆధారాలు చాలా బాగున్నాయన్నారు. 2007లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ముద్రించిన ‘హనుమాన్ కేం’ పుస్తకంలోనూ అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని రాశారన్నారు. టీటీడీ కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయం రాశారని తెలిపారు. ప్రపంచానికి తెలియాలనే వెబినార్: మురళీధరశర్మ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య వి.మురళీధరశర్మ మాట్లాడుతూ, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించడానికి పండిత పరిషత్ పరిశోధన ప్రపంచానికి తెలియాలనే వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్ర పుస్తకం ముద్రిస్తామన్నారు. జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగరామానుజాచార్యులు, పుణె దక్కన్ కాలేజీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంపటి కుటుంబరావు శాస్త్రి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నం, ఆచార్య శంకరనారాయణ, ఆర్కియాలజీ, మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ విజయకుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ.ప్రసన్నకుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసకులు తదితరులు పాల్గొన్నారు. -
ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..
ఒకప్పుడు అది కారడవి.. ఎటు చూసినా పెద్ద పెద్ద గుట్టలు.. బండరాళ్లే దర్శనమిచ్చేవి. అటు వైపు ఎవరూ కన్నెత్తి చూసేవారు కూడా కాదు.. ఇదంతా గతం. గుట్టను తొలచారు.. గుడిగా మలచడంతో ఇప్పుడా ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. రాప్తాడు: రాప్తాడు మండలంలోని 44వ జాతీయ రహదారి సమీపంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రం (మౌనగిరి బ్రహ్మ పీఠం) నిరంతరం జై శ్రీరాం.. జై ఆంజనేయ నినాదాలతో మార్మోగుతోంది. 39 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం నేనున్నానంటూ భక్తులకు అభయమిచ్చేలా దర్శనమిస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విరిగిపోయిన విగ్రహం.. విశ్రాంత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యస్వామి, ఆయన సతీమణి ప్రధానోపాధ్యాయులురాలు వేదవతి వాళ్లకు వచ్చిన సంపాదనతో 1999 సంవత్సరంలో 14 ఎకరాల విస్తీర్ణంలో మౌనగిరి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎకరా విస్తీర్ణంలో అభయాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే 2008లో రూ.50 లక్షల వ్యయంతో 27 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహం తయారు చేయించారు. దీనిని మౌనగిరి క్షేత్రంలో ప్రతిష్టిస్తుండగా ప్రమాదవశాత్తూ విగ్రహం కిందపడి విరిగిపోయింది. ఫలితంగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది మౌనగిరి క్షేత్రం. ఆంజనేయస్వామి భారీ విగ్రహం ముక్కలు కాగానే కార్యక్రమ కార్యనిర్వాహకులు మౌనగిరి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్య స్వామితో పాటు విగ్రహ ప్రతిష్టకు వచ్చిన అశేష భక్త జనం ఆందోళన చెందారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 39 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల మందం, 12 అడుగుల వెడల్పు, 225 టన్నుల బరువు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని తయారు చేసేందుకు కర్ణాటకలోని కొయిరా గ్రామం నుంచి ప్రత్యేక రాయిని తెప్పించారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి విశేషానుభవం ఉన్న పలువురు శిల్పులు ఏడాది పాటు నిరంతరం శ్రమించి ఆంజనేయుని విగ్రహాన్ని మలిచారు. దాదాపుగా రూ. 9 కోట్లు వెచ్చించి 39 అడుగుల అభయాంజనేయస్వామి స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. అలాగే సీతారాములు, దక్షిణమూర్తి, వినాయకుడు, మహాలక్ష్మి, మృత్యుంజయుడు విగ్రహలతో పాటు ఆలయాలు నిర్మించారు. అలాగే ఆంజనేయస్వామి పాదాల కింద పీఠాన్ని కోలార్ జిల్లా శిలారుపట్నం నుంచి తెప్పించారు. గతంలో గుట్ట ఎక్కాలంటే భక్తులు సగం కొండ ఎక్కడానికే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం భక్తులు కొండ పైకి ఎక్కడానికి మెట్లు, వాహనాలు వెళ్లేందుకు మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. వంద మందికి ఆశ్రయం.. కొండపై విశాలమైన ప్రదేశంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచారు. దాదాపుగా 100 మంది అనాధ వృద్ధులను చేరదీసి వారికి కొండపైనే ఆశ్రయం కల్పిస్తున్నారు. అలాగే గోశాలను ఏర్పాటు చేసి మూగ ప్రాణులను సంరక్షిస్తున్నారు. మంగళ, శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అలాగే భక్తులకు వీరబ్రహ్మం బోధనలు, తత్వాన్ని, కాలజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్‌లో అభయాంజనేయస్వామి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. అతి పెద్ద ధ్వజ స్తంభాలు.. మౌనగిరి క్షేత్రంలో ఏ పని చేసినా భిన్నంగా ఉండాలనే ఈశ్వరయ్యస్వామి మూడు దివ్య జ్యోతులు ఎప్పుడూ వెలిగేలా ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూడు గుట్టలపై 33 అడుగులు ఎత్తున్న ధ్వజ స్తంభాల్లో రామకోటి, శివ, బ్రహ్మ శివ జ్యోతులను వెలిగించారు. జిల్లాలోనే ఏడున్నర అడుగుల అతిపెద్ద వినాయక విగ్రహం ఇక్కడే ఉండటం విశేషం. పర్యటక క్షేత్రంగా .. రాప్తాడు మండలంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ దివ్య క్షేత్రం, పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన 39 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం ఖ్యాతి గడించనుంది. 30 కిలో మీటర్ల వరకు అభయాంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సహకారంతో మరింత అభివృద్ధి ప్రజల్లో భక్తిభవాన్ని పెంపొందించేందుకే ఇక్కడ కొండపై 39 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మన రాష్ట్రంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులు, దాతల సహకారంతో మౌనగిరి క్షేత్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వసతి గృహాలు, ఆలయానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది. – ఈశ్వరయ్య స్వామి, మౌనగిరి క్షేత్రం వ్యవస్థాపకులు -
తిట్ల దండకం.. చిక్కుల్లో మంత్రి!
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖల మంత్రి హచ్.ఆంజనేయ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. టీ తేవాలని సిబ్బందిని కోరారు ఆ మంత్రి. అయితే టీ తేవడం కాస్త ఆలస్యం కావడంతో ఆంజనేయ తన సిబ్బంది మీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాను పని చెబితే త్వరగా చేయడానికి ఇంత నిర్లక్ష్యమా అంటూ టీ తెచ్చిన సిబ్బందిపై మండిపడ్డ మంత్రి, అంతటితో ఆగకుండా తిట్ల దండకానికి దిగారట. చెప్పినపని ఆలస్యంగా ఎందుకు చేశావంటూ అసభ్య పదజాలంతో సిబ్బందిని దూషించినట్లు తెలుస్తోంది. మంత్రిగారి చేష్టలు ఆనోటా ఈనోటా పాకి వైరల్ కావడంతో రాష్ట్ర మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి, అందులోనూ సాంఘిక, సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్నా.. సిబ్బందితో ఎలా ప్రవర్తించాలన్న కనీస మర్యాద కూడా తెలియదా అని ఆంజనేయను ప్రశ్నిస్తున్నారు. -
మీకు తెలుసా?
నిత్యం యోగతాపంతో ఉంటాడు కాబట్టి ఆంజనేయుడికి ఆకుపూజ చేస్తారు. ఆయన విగ్రహానికి వెన్నతో లేపనం చేస్తారు. వినాయకుడు, ఆంజనేయుడు, హయగ్రీవుడు తదితర దేవతా స్వరూపాలకు ఆయా జంతువులకు ఇష్టమైన వాటిని నివేదిస్తే త్వరగా ప్రసన్నులవుతారు. ఉదాహరణకు వినాయకుడికి, ఆంజనేయుడికి అరటిపళ్లు, కొబ్బరి కాయలు ఇష్టమైతే, హయగ్రీవుడికి ఉలవ గుగ్గిళ్లు నివేదించాలి.నిత్యం వాకిలి ఊడ్చి, కళ్లాపిజల్లి, గుమ్మం ముందు పరిశుభ్రంగా ఉంచుతూ, గడపకు వారానికి ఒకసారి అయినా పసుపు, కుంకుమలతో అలంకరించేవారి ఇంట లక్ష్మీదేవి నివసిస్తుందట. -
వైభవంగా అభయాంజనేయస్వామి విగ్రష ప్రతిష్ఠాపన
సిరిసిల్ల టౌన్ : స్థానిక శ్రీశివసాయి బాబా ఆలయ ఆవరణలో ఇటీవల నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న వేడుకల్లో భాగంగా ఉదయం 8గంటల నుంచి శ్రీశైవమహా పీఠాధిపతి అత్తలూరి మృత్యుంజయశర్మ, ముదిగొండ అమరనాథశర్మలు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 1గంటకు మహాన్నదానం చేపట్టారు. -
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ
కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం శివాలయంలో నూతనంగా నిర్మించిన శివాంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుజారులు రాయప్రోలు శ్రీరామశర్మ, రాయప్రోలు భద్రయ్యశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెంగుండ్ల వెంకటేశ్వర్లు పుష్పావతి దంపతుల విరాళంతో 25 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతకాయల రామచంద్రయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం కుర్చీ ఖాళీగా లేదు
బెంగళూరు: ‘రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. అందువల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జాఫర్ షరీఫ్ ‘దళిత సీఎం’ డిమాండ్‌ను ఇప్పటికైనా వదిలేయాలి’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లోక్‌సభలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఓ ధీమంతుడైన రాజకీయ నాయకుడు. రానున్న రోజుల్లో ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు లభిస్తాయి, దళితుడు సీఎం కావాలని జాఫర్ షరీఫ్ పదే పదే కోరుతున్నారు. ఆ కోరిక మంచిదే, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం కుర్చీ ఖాళీగా లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాలి’ అని విమర్శించారు. సీఎం అయ్యే అవకాశం మల్లికార్జున ఖర్గేకి కూడా వచ్చిందని, 2008లో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అప్పుడు తమ విజయం లభించక పోవడంతో ఖర్గే సీఎం కాలేకపోయారని పేర్కొన్నారు. -
ఇక్కడ ఆంజనేయుడంటే..ఆగ్రహిస్తారు
మన దేశంలో ఏ గ్రామంలో చూసిన హనుమంతుని ఆలయాలు మనకు దర్శనమిస్తుంటాయి. దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలన్నా....ధైర్యం కావాలన్నా ఆంజనేయుడినే పూజిస్తూ ఉంటారు. కానీ..ఉత్తరాఖండ్‌లోని ద్రోణగిరి గ్రామంలో ప్రజలు మాత్రం హనుమంతుని పూజించరు..పైగా ద్వేషిస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆ స్వామి పేరు పలికినా, పూజించినా నేరంగా పరిగణించి వాళ్లని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఎందుకంటారా?అయితే...చదవండి.. త్రేతాయుగంలో రామరావణ యుద్ధ సమయంలో మూర్ఛిల్లిన లక్ష్మణునికి హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. ఇక్కడ పూజించే గుట్టను ఆంజనేయుడు తీసుకెళ్లేసరికి అతనిపై ఈ గ్రామ ప్రజలు ద్వేషం పెంచుకున్నారు. అందుకే ఆంజనేయుడిని ఆ గ్రామ ప్రజలు ద్వేషిస్తారు. -
అడ్డంగా దొరికిపోయిన మంత్రిగారి సతీమణి
-
అడ్డంగా దొరికిపోయిన మంత్రిగారి సతీమణి
బెంగళూరు: విద్యార్థి వసతి గృహాలకు ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపులకు సంబంధించిన వ్యవహారంలో కమీషన్ తీసుకుంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ భార్య విజయ ఓ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా చిక్కారు. ఈ దృశ్యాలు టీవీఛానళ్లలో ప్రసారమైన వెంటనే హెచ్. ఆంజనేయ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్ష బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు... సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని హాస్టళ్లకు బియ్యం, పప్పుధాన్యాలు, నూనె తదితర పదార్థాల సరఫరాకు ఓ ఏడాదికి సంబంధించిన కాంట్రాక్ట్ తమకే అందేలా చూడాలంటూ ఓ ప్రైవేటు టీవీఛానల్ ప్రతినిధులు హెచ్.ఆంజనేయ భార్య విజయను సంప్రదించారు. ఇందుకు గాను ఆమెకు రూ.7 లక్షల నగదును కమీషన్ రూపంలో అందజేశారు. ఈ వ్యవహారాన్ని సదరు టీవీ ఛానల్ ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించి గురువారం ప్రసారం చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు అధికారిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా దళిత వర్గానికి చెందిన తమను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హెచ్. ఆంజనేయ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విషయమై మాట్లాడుతూ...‘హెచ్.ఆంజనేయ మంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే పోరాటానికి దిగుతాం’ అని హెచ్చరించారు. -
అంజన్నజాగ.. వేశారు పాగా..
పరాధీనంలో ‘ఊళ్లో ఆంజనేయుడు’ రూ.5 కోట్ల ఆలయ భూములు కబ్జా 1.20 ఎకరాల స్థలం అన్యాక్రాంతం తప్పుడు సర్వే నంబర్లతో నిర్మాణాలు పురాణాల్లో బలానికి ప్రతిరూపం ఆంజనేయుడు. ఆయనంతటి శక్తివంతుడు ఇంకెవరూ లేరనేది భక్తుల నమ్మకం. ఇలా.. బలానికి, శక్తికి మారుపేరుగా ఉన్న ఆంజనేయుడి ఆలయ భూములకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ‘ఊళ్లో ఆంజనేయస్వామి’ ఆలయానికి చెందిన రూ.5 కోట్ల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. వరంగల్ :రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హన్మకొండ మచిలీబజార్‌లోని ఊళ్లో ఆం జనేయస్వామి ఆలయ భూములపై కబ్జా దారుల కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 817లో 1.2 ఎకరాల భూమి ఉంది. వరంగల్ నగరం నడిబొడ్డున భద్రకాళి చెరువు కట్ట కింది భాగంలో ఈ స్థలం ఉంది. ప్రస్తుతం నగరంలోని ఇతర ప్రాం తాలతోపాటు ఇక్కడి భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆలయానికి చెందిన ఈ భూముల విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది. విలువైన ఈ భూములపై కొందరు కన్నేశారు. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి రియల్ వెంచర్‌గా మర్చేశారు. ఆలయూనికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమి ని కబ్జా చేసి అమ్మకానికి పెట్టినా... అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 817 లోని 1.2 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని... పక్కన ఉన్న వేరే సర్వే నంబర్లో ఉన్నట్లుగా పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టినట్లు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులకు చాలా ఫిర్యాదులు అందారుు. అరుునా.. అధికారుల నుంచి కనీస స్పందన కనిపించలే దు. ఆలయానికి చెందిన స్థలంలో నిర్మాణాలు జరుగుతుండడంతో భక్తులకు అనుమానం వచ్చింది. తప్పుడు పత్రాలతో ఆలయ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని, వాటి ని నిలిపివేసి భూములను పరిరక్షించాలని పలువురు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు యం త్రాంగం జోక్యం చేసుకుంది. ఫిర్యాదు అంశా ల్లో స్పష్టత వచ్చేవరకు స్థలంలో నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల తీరు... అనుమానాలు ! ఉన్నతాధికారులకు ఫిర్యాదు తర్వాత ఆలయ భూముల్లో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపేసినా.... రాత్రివేళల్లో ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెడీమేడ్ పిల్లర్లతో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలపై తాజాగా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులను కలిసినా... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం భూములపై స్పష్టత వచ్చేవరకు ఆగకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. భూములు ఆలయానికి సంబంధించినవా... లేదా... తేల్చే పని చేయాల్సిన అధికారులు ఈ విషయాన్ని పక్కనబెడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. భక్తులు ఆరోపిస్తున్నట్లుగా తప్పుడు పత్రాలతో ఆలయ భూములు కబ్జా చేసి, అమ్మకానికి పెట్టిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. -
మళ్లీ కీచులాట
= నిన్న శాఖ కోసం... నేడు గది కోసం = అప్పుడే డీకే ఆధిపత్య పోరు = 346 గది కోసం పట్టు .. సహించని ఆంజనేయ = కార్యక్రమంలోనే అధికారిపై మండిపాటు = అవాక్కయిన ఆహూతులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రులిద్దరు నిన్న శాఖల కోసం కొట్లాడుకోగా.. విధాన సౌధలో ఓ గది కోసం నేడు ఇద్దరు మంత్రుల మధ్య శీతల యుద్ధం ప్రారంభమైంది. వీరిలో ఓ మంత్రి తన ఆగ్రహాన్ని అధికారుల ముందే ప్రదర్శించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయకు విధాన సౌధలోని 340, 340ఏ గదులను కేటాయించారు. విశాలంగా ఉండడం కోసం రెండు గదుల మధ్య ఉన్న గోడను పడగొట్టాలని మంత్రి సూచించారు. ఆ పనుల నిమిత్తం తాత్కాలికంగా 346 గదిలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త గా మంత్రి వర్గంలో చేరిన డీకే. శివ కుమార్ 340 గది కోసం పట్టుబట్టారు. ఆయన పట్టుదల కాంగ్రెస్ నాయకులకు తెలియందేమీ కాదు. 1999-2004లో ఎస్ఎం. కృష్ణ హయాంలో ఆయన ఆడింది ఆట.. పాడింది పాట. ఇతర శాఖల్లో కూడా ఆయన వేలు పెడుతున్నారని అప్పట్లో సీనియర్లు గుర్రుమన్నా, నిస్సహాయంగా ఉండిపోయారు. కృష్ణ వద్ద ఆయనకున్న పలుకుబడి అలాంటిది. ఇప్పుడు మంత్రి వర్గంలో చేరారో, లేదో...అప్పుడే తన విశ్వ రూపాన్ని చూపడం ప్రారంభించారు. తనకు కేటాయించిన గదిని శివ కుమార్ కోరుతున్నారని తెలుసుకున్న ఆంజనేయ సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులపై మండి పడ్డారు. మంత్రులకు గదులు కేటాయించేది వారే. విధాన సౌధలో శుక్రవారం తన గదిలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంజనేయ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఆహూతులు కూడా వచ్చారు. అంతా సవ్యంగా జరుగుతున్న దశలో ఓ అధికారిని చూసి ఆంజనేయ కస్సుమనడం ప్రారంభించారు. ‘ఆ గది తాళం తీయండి, గోడ పగులగొట్టండి. ఎవడొస్తాడో చూస్తాను. ఎన్ని రోజులని బాధను భరించేది. ఆఫీసుకు ప్రజలు వస్తే కూర్చోవడానికి జాగా లేదు. తాళం తీయండి. పదండి నేనే వస్తాను’ అని మంత్రి ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడాన్ని చూసి ఆహూతులు నోళ్లప్పగించి చూస్తుండి పోయారు.