
సీఎం కుర్చీ ఖాళీగా లేదు
రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. అందువల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జాఫర్ షరీఫ్
బెంగళూరు: ‘రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. అందువల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జాఫర్ షరీఫ్ ‘దళిత సీఎం’ డిమాండ్‌ను ఇప్పటికైనా వదిలేయాలి’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లోక్‌సభలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఓ ధీమంతుడైన రాజకీయ నాయకుడు.
రానున్న రోజుల్లో ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు లభిస్తాయి, దళితుడు సీఎం కావాలని జాఫర్ షరీఫ్ పదే పదే కోరుతున్నారు. ఆ కోరిక మంచిదే, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం కుర్చీ ఖాళీగా లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాలి’ అని విమర్శించారు. సీఎం అయ్యే అవకాశం మల్లికార్జున ఖర్గేకి కూడా వచ్చిందని, 2008లో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అప్పుడు తమ విజయం లభించక పోవడంతో ఖర్గే సీఎం కాలేకపోయారని పేర్కొన్నారు.