సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి సీఎం పదవి లొల్లి మొదలైంది. ‘సీఎం సీటు’పై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి చేరాయి. సీఎం సీటు కోసం పోటీ నెలకొన్న క్రమంలో.. నిన్న మొన్నటి వరుకు చర్చలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి పేరు వినిపించాయి.. తాజాగా ఈ జాబితాలోకి సీతక్క కూడా చేరింది.
అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గిరిజన మహిళగా సీతక్క సీఎం అయ్యే అవకాశం లేకపోదన్న రేవంత్ వ్యాఖ్యలపై పార్టీలో, అటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది? ఎస్సీల నుంచి భట్టివిక్రమార్కను సీఎంగా ప్రతిపాదిస్తున్నారు. ఎస్టీల నుంచి సీతక్కకు కనీసం ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన రేవంత్.. కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ముగ్గురు సీఎంలు ఓబీసీలేనని చెప్పారు. పేదలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పారు.
అయితే, ఫలానా పోస్టుకు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పదని స్పష్టం చేశారు. సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ఎన్‌ఆర్‌ఐల సూచనను పార్టీ వేదికల మీద చర్చిస్తామని, అవసరమనుకుంటే సందర్భాన్ని బట్టి సీతక్క సీఎం కూడా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు స్పందిస్తూ ఇప్పుడే సీఎం ఎవరనే విషయంపై కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
చదవండి: అవసరమైతే సీతక్కే సీఎం..
Comments
Please login to add a commentAdd a comment