cm seat
-
లోకేష్ టార్గెట్ సీఎం సీట్.. పవన్ కు పంగనామం
-
ముందే ప్రకటిస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు!
ముందే ప్రకటిస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు! -
టీ కాంగ్రెస్‌లో ‘సీఎం సీటు’ లొల్లి.. అధిష్టానం దృష్టికి రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి సీఎం పదవి లొల్లి మొదలైంది. ‘సీఎం సీటు’పై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి చేరాయి. సీఎం సీటు కోసం పోటీ నెలకొన్న క్రమంలో.. నిన్న మొన్నటి వరుకు చర్చలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి పేరు వినిపించాయి.. తాజాగా ఈ జాబితాలోకి సీతక్క కూడా చేరింది. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గిరిజన మహిళగా సీతక్క సీఎం అయ్యే అవకాశం లేకపోదన్న రేవంత్ వ్యాఖ్యలపై పార్టీలో, అటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది? ఎస్సీల నుంచి భట్టివిక్రమార్కను సీఎంగా ప్రతిపాదిస్తున్నారు. ఎస్టీల నుంచి సీతక్కకు కనీసం ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన రేవంత్.. కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ముగ్గురు సీఎంలు ఓబీసీలేనని చెప్పారు. పేదలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పారు. అయితే, ఫలానా పోస్టుకు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పదని స్పష్టం చేశారు. సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ఎన్ఆర్ఐల సూచనను పార్టీ వేదికల మీద చర్చిస్తామని, అవసరమనుకుంటే సందర్భాన్ని బట్టి సీతక్క సీఎం కూడా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు స్పందిస్తూ ఇప్పుడే సీఎం ఎవరనే విషయంపై కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు. చదవండి: అవసరమైతే సీతక్కే సీఎం.. -
సీఎంగా ఐదేళ్లు ఆయనే(నా)?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావడంతో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం జనతాదళ్ సెక్యులర్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరో ఫార్ములా తెరపైకి తెచ్చారు. కొత్తగా 30–30 ఫార్ములా తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం.. ఫలితాలు వచ్చాక మరో ఆలోచన.. అధికారం చేపట్టాక ఇంకో మలుపు తెచ్చింది. జేడీఎస్ 30 నెలల అనంతరం సీఎం పదవిని కాంగ్రెస్ కోరినట్టు తెలుస్తోంది. దీంతో జేడీఎస్ నాయకులు కలవరపాటుకు గురవుతున్నారు. రెట్టింపు సీట్లు వచ్చినప్పటికీ.. జేడీఎస్ (37) కన్నా కాంగ్రెస్ (79) రెట్టింపు సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్నికల తర్వాత నెలకొన్న అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు అండగా నిలిచి.. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా మారింది. అయితే జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ విషయంలో సీఎం పదవి కీలకం కానుంది. ముందుగా కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పాటు కుమారస్వామి కొనసాగుతారా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుమారస్వామి ఐదేళ్లు పదవిలో ఉండటం తమకు మింగుడు పడటం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు అదిష్టానం వద్ద మొర పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఐదేళ్లు సరికాదు : ఖర్గే అయితే తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు ఐదేళ్ల పాటు సీఎం పదవి కట్టబెట్టడం సరికాదని లోక్‌సభ ప్రతిపక్షనేత మలికార్జునఖర్గే ఆవేదన చెందినట్లు తెలిసింది. ఈమేరకు ఆయన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మరోసారి చర్చించి నిర్ణయిస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రిమండలి తీర్మానాల్లో భాగంగా ప్రధానమైన శాఖలన్నీ జేడీఎస్‌కే కేటాయించారని ఖర్గే మండిపడ్డారు. ఆ శాఖలతో జేడీఎస్ ఐదేళ్ల పాటు పాలిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. బీజేపీ అధికారంలోకి రాకూడదనే.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. హంగ్ రావడంతో బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అధికారంలోకి వస్తుందని భావించిన కాంగ్రెస్ సీఎం పదవిని జేడీఎస్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐదేళ్ల పాటు సీఎం పదవిలో కుమారస్వామి ఉంటారని కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. అయితే బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే జేడీఎస్‌తో కలిశామని.. ఐదేళ్ల పాటు జేడీఎస్‌కు సీఎం పదవి ఇవ్వడంపై చాలామంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తలా 30 నెలలు పాలించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలుస్తోంది. కాలమే సమాధానం చెబుతుంది పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న కర్ణాటక రాజకీయంలో కాంగ్రెస్ –జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ఎన్ని రోజులు నిలుస్తుందనే దానిపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మూడు నెలలకే కుప్పకూలుందని ప్రతిపక్షనేత బీఎస్ యడ్డూరప్ప వ్యాఖ్యానించారు. కాగా చెరో 30 నెలలు పాలించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీకే శివకుమార్ దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటారా? మారుతారా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. కుమారస్వామే మా సీఎం ‘జేడీఎస్ అధినేత కుమారస్వామే మా సీఎం. ఆయనే ఐదేళ్ల పాటు పదవిలో ఉండవచ్చు. మా పూర్తి మద్దతు జేడీఎస్‌కే. ప్రభుత్వం ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం’ అని మే 15న కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, డాక్టర్ పరమేశ్వర్ బహిరంగంగా ప్రకటించారు. సీఎం సీటు పంచుకోం ‘కాంగ్రెస్–జేడీఎస్ కూటమిలో భాగంగా ఏర్పడే ప్రభుత్వంలో సీఎం సీటు పంచుకోం. ఐదేళ్ల పాటు నేనే సీఎంగా కొనసాగుతా. కాంగ్రెస్ నాకు పూర్తి మద్దతు ఇచ్చింది’ అని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు -
‘అందుకే సీఎం కుర్చీలో బాలకృష్ణ’
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎన్నికోట్ల పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు ఏమోగానీ దోచుకున్నది.. దాచుకోవడానికి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బాబు హయాంలో గిరిజనులు, దళితులు, మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. మరోవైపు ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను పొగడటమే పనిగా పెట్టుకున్నారని రఘువీరా ఆరోపించారు. ఇరు రాష్ట్రాలను పక్షపాతం లేకుండా చూసే బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు. బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు.. కాగా, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించిన అంశంపై రఘువీరా స్పందించారు. 'తన తండ్రి ఎన్టీఆర్ కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని బాలకృష్ణ మనస్సులో ఉండి ఉండొచ్చు.. అందుకే సీఎం రాష్ట్రంలో లేనప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు. సీఎం సీట్లో కూర్చుని బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు' అని వ్యాఖ్యానించారు. -
సీఎం చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ
-
సీఎం కుర్చీలో బాలయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ కూర్చుని సమీక్షా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ బుధవారం లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించే మందిరంలో ఆయన కూర్చునే కుర్చీలో బాలకృష్ణ కూర్చున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ఐఏఎస్‌లు బాలకృష్ణకు ఎదురుగా కూర్చోవడం విశేషం. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన బావమరిది.. ఆయన కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించడంపై అధికారులే విస్తుపోయారు. కానీ సీఎంకు బావమరిది కావడంతో ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారు. అదే సమయంలో మంత్రి హోదాలో ఉన్న దేవినేని బాలయ్య ఎదుట కూర్చుని ఆయనడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గమనార్హం. దీనిపై మీడియాలో వార్తలు రావడం, ఏ హోదాలో సీఎం కుర్చీలో కూర్చుంటారని విమర్శలు రావడంతో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో బాలకృష్ణ సీఎం కుర్చీలో కాకుండా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించారు -
సీఎం బావ అయితే కుర్చీ మనదేనా..?
-
సీఎం చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చొని ఆయన సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి ఉత్సవాల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని ఉమ, ఐఏఎస్ అధికారులతో సమీక్ష చేశారు. అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు... ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పోస్ట్‌పై ఆసక్తి లేదని చెప్పే...ఆయన సాక్షాత్తూ.. సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే...ఈ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ నోరు మెదపడం లేదు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రొటోకాల్‌పై టీడీపీ రసవత్తరంగా చర్చ జరుగుతోంది. -
సీఎం కుర్చీ ఖాళీగా లేదు
బెంగళూరు: ‘రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. అందువల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జాఫర్ షరీఫ్ ‘దళిత సీఎం’ డిమాండ్‌ను ఇప్పటికైనా వదిలేయాలి’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లోక్‌సభలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఓ ధీమంతుడైన రాజకీయ నాయకుడు. రానున్న రోజుల్లో ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు లభిస్తాయి, దళితుడు సీఎం కావాలని జాఫర్ షరీఫ్ పదే పదే కోరుతున్నారు. ఆ కోరిక మంచిదే, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం కుర్చీ ఖాళీగా లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాలి’ అని విమర్శించారు. సీఎం అయ్యే అవకాశం మల్లికార్జున ఖర్గేకి కూడా వచ్చిందని, 2008లో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అప్పుడు తమ విజయం లభించక పోవడంతో ఖర్గే సీఎం కాలేకపోయారని పేర్కొన్నారు. -
సమాధులపై కట్టుకోలేకపోయారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కావాల్సిన మాట నిజమే అయినా రైతుల కడుపుకొట్టి, బలవంతంగా బయటకు పంపి నిర్మిస్తారా? ఇంతకన్నా రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సమాధులమీద నిర్మించుకోలేకపోయారా?’’ అని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అతుల్‌కుమార్ అంజన్ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి భూమ్యాకాశాల్ని ఏకం చేసిన వ్యక్తికి ఇదో పెద్ద లెక్కా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలివితేటలేమిటో తమకు బాగా తెలుసంటూ.. సీఎం పీఠాన్ని ఎక్కడానికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తన్నారు. గురువారమిక్కడ ప్రారంభమైన రైతుసంఘం 29వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన అతుల్, ఏపీకి చెందిన మరికొందరు రైతు నేతలు ‘సాక్షి’లో వస్తున్న ‘రాజధాని దురాక్రమణ’ కథనాలపై గురువారం స్పందిం చారు.ఎస్సీ, ఎస్టీలు, చిన్న,మధ్యతరహా రైతుల్ని తరిమివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారన్నారు. మంత్రులా? రియల్టర్లా? రాజధాని అమరావతిపై గద్దల్లా వాలిన పెద్దలు మంత్రులు కాదు.. రియల్టర్లు. మంత్రులుగా చెలామణి అవుతున్న నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు బరితెగించారనే దానికి నిదర్శనమే సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలియబట్టే వీళ్లు వందలాది ఎకరాల్ని పేదలనుంచి కొనేసి వాళ్లనోట మట్టికొట్టారు. -రామచంద్రయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు చినబాబు పాత్ర ఉంది ప్రస్తుత భూ కబ్జాలో పెద్దబాబు, చినబాబుల పాత్ర ఉంది. పేదల నోళ్లు కొట్టేలా జోన్లు ఏర్పాటు చేశారు. సీఎం, ఆయన అనుచరులు కొనుగోలు చేసిన భూముల్ని అగ్రికల్చర్ జోన్ నుంచి మినహాయించి ఇప్పుడు రియల్ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. - రావుల వెంకయ్య, కేవీవీ ప్రసాద్, రైతుసంఘం జాతీయ నేతలు విచారణకు సిద్ధంకండి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలు రాసిన మీడియాపై చిందులేసే బదులు బహిరంగ విచారణకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిద్ధపడాలి. నీతిమంతులైతే భయపడడమెందుకు? -గుడితి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి ఎక్కడొస్తుందో సీఎం ముందే చెప్పారు.. సీఎం ముందే తన అనుచరులకు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పారు. రైతుల్ని త్యాగాలు చేయమన్నారు. మంత్రుల్ని కుబేరుల్ని చేశారు. - జి.చంద్ర, వైఎస్సార్ జిల్లా కార్యదర్శి -
సీఎం సీటుపై ఉద్ధవ్ ఠాక్రే కన్ను!
-
సీఎం సీటుపై ఉద్ధవ్ ఠాక్రే కన్ను!
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి సీటుపై కన్నేశారు. దాంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయే పరిస్థితి ఏర్పడింది. సిఎం పదవి ఇస్తే ఎవరితోనైనా ఆయన పొత్తుకు సిద్ధమవుతారా? కాంగ్రెస్, ఎన్సీపిలను ఉద్ధవ్ ఏకం చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపి అతి పెద్దపార్టీగా అవతరించినప్పటికీ మరో పార్టీ సహకారంలేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఉద్ధవ్ ఠాక్రేకు మొదటి నుంచి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి, చాయ్‌వాలా ప్రధానికాగా లేంది, తాను ముఖ్యమంత్రి కావటంలో తప్పేమిటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితిని అదునుగా చేసుకొని ముఖ్యమంత్రి కాగలిగే అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ఉద్ధవ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపిలతో శివసేన కలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే సీఎం పదవి ఇస్తేనే బీజేపీతో పొత్తుకు అంగీకరించే అవకాశం ఉంటుంది. మెజార్టీ స్థానాలు బీజేపికి ఉన్నందున ఆ పార్టీ సీఎం స్థానాన్ని వదులుకోదు. మరీ పట్టుబడితే చెరో రెండున్నర ఏళ్లు సీఎం పదవిని పంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శివసేన దివంగత ముండే కుమార్తె పంకజకు సీఎం పదవిఇస్తే తమకు అభ్యంతరంలేదన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తాము ఎటువంటి పరిస్థితులలోనూ ఎన్సీపితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని బీజేపీ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితులలో పాత మిత్రులు బీజేపీ, శివసేనలే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవిని కూడా అడిగే అవకాశం ఉంది. ** -
బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి
అధికారాన్ని 'విషం'గా అభివర్ణించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ముఖ్యమంత్రి పీఠం ముళ్లకిరీటం అంటూ సచివాలయ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నిజమే అధికారం ముళ్ల కిరీటమే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. తెలిసినప్పుడు మళ్లీ ముళ్లకిరీటం అందుకోవాలని ఎందుకు తహతహలాడినట్లు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గతంలో లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని ఆయన భావించినట్లు ఉన్నారు. అందుకే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు కైవనం చేసుకోగా బాబు తెగ ఖుషీ ఖుషీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు మెల్లగా అర్థమవుతున్నాయి. దాంతో బాబులోని వేదాంతి బయటకు తన్నుకొచ్చినట్లు ఉన్నాడు. అందుకే సీఎం పీఠం ముళ్ల కిరీటం అంటూ వేదాంతాలు పలుకుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెలన్నర అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలన ప్రారంభమైంది లేదు. అదికాక ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హమీపై నేటికి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇవాళో రేపో రుణమాఫీపై బాబు ప్రకటన చేస్తారంటూ రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ అంశంపై కమిటీ వేశాం... నివేదిక వస్తుంది... అంటూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. దాంతో రైతులకు రుణమాఫీ చేయాలంటూ చంద్రబాబును ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అదే అంశంపై ప్రతిపక్షాలు చంద్రబాబుపై రోజురోజూకు ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు రుణమాఫీపై మీ నాయకుడు ఏం చేశారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దాంతో సదరు నాయకులు తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు మోహం చూపించలేక పోతున్నామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. రోలు వచ్చి మద్దెలతో దరువు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. రైతులు, సొంత పార్టీ నాయకులు, ప్రతిపక్షాలకు రైతు రుణమాఫీపై ఏం చెప్పాలో అర్థం కాక చంద్రబాబు తలను గోడకు బాదుకుంటున్నారు. సీఎంగా మరోమారు ఎన్నికైనందుకు నవ్వాలో లేక ఏడవాలా తెలియని పరిస్థితి బాబులో నెలకొంది. అందుకే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న ఠీవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆ విషయం చంద్రబాబు తీరులోనే ఇట్టే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠంపై అధిష్టించిన ఆయనకు ముళ్ల మీద కుర్చునట్లుంది. ఆ విషయాన్ని వెల్లడిస్తే బాగోదని అనుకున్నారో ఏమో పాపం చంద్రబాబు సీఎం పీఠం బంగారమని అందరూ అనుకుంటారు కానీ ... ముళ్ల కిరీటం అంటూ బాబు సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శనివారం విజయవాడలో ఏపీఎన్జీవోలు ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 'సీఎం పీఠం'పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. -
ఒక్క ఛాన్సివ్వండి ప్లీజ్
-
సింగిల్ డే సీఎంగానైనా....
నెల్లూరు : రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్రంగా రగిలిపోతుంటే, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాత్రం చివరి దశలో అయినా సీఎం కుర్చీ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేయటానికి రెండు రోజుల ముందు నుంచే ఆనం ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారు. 39 నెలల తర్వాత చేస్తున్న రెండో ప్రయత్నం నెరవేరొచ్చనే ఆశ ఆనం వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2009లో అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యకు సీఎం కుర్చీ వరించిన సంగతి తెలిసిందే. అనేక కారణాలరీత్యా 2010 నవంబరులో రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిని తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాంనారాయణరెడ్డి ఏఐసీసీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించారు. సీఎం పదవిపై అప్పట్లో ఆయన చాలా ధీమాగా వ్యవహరించారు. అయితే ఊహించని విధంగా అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడంతో ఆనం తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం కిరణ్ కచ్చితంగా అర్థాంతరంగా పదవి పోగొట్టుకోవడం ఖాయమని రాంనారాయణరెడ్డి అంచనా వేశారు. కిరణ్ రాజీనామాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదని అధిష్టానానికి విన్నవించుకుంటున్న వర్గంతో ఆయన చేతులు కలిపారు.