ఇక్కడ ఆంజనేయుడంటే..ఆగ్రహిస్తారు | Here people hate hanuman | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఆంజనేయుడంటే..ఆగ్రహిస్తారు

Published Sun, Jul 10 2016 4:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

ఇక్కడ ఆంజనేయుడంటే..ఆగ్రహిస్తారు

ఇక్కడ ఆంజనేయుడంటే..ఆగ్రహిస్తారు

మన దేశంలో ఏ గ్రామంలో చూసిన హనుమంతుని ఆలయాలు మనకు దర్శనమిస్తుంటాయి. దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలన్నా....ధైర్యం కావాలన్నా  ఆంజనేయుడినే పూజిస్తూ ఉంటారు. కానీ..ఉత్తరాఖండ్‌లోని ద్రోణగిరి గ్రామంలో ప్రజలు మాత్రం హనుమంతుని పూజించరు..పైగా ద్వేషిస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆ స్వామి పేరు పలికినా, పూజించినా నేరంగా పరిగణించి వాళ్లని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.

ఎందుకంటారా?అయితే...చదవండి.. త్రేతాయుగంలో రామరావణ యుద్ధ సమయంలో మూర్ఛిల్లిన లక్ష్మణునికి హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. ఇక్కడ పూజించే గుట్టను ఆంజనేయుడు తీసుకెళ్లేసరికి అతనిపై ఈ గ్రామ ప్రజలు ద్వేషం పెంచుకున్నారు. అందుకే ఆంజనేయుడిని ఆ గ్రామ ప్రజలు ద్వేషిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement