ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనంలో భక్తులు
సిరిసిల్ల టౌన్ : స్థానిక శ్రీశివసాయి బాబా ఆలయ ఆవరణలో ఇటీవల నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న వేడుకల్లో భాగంగా ఉదయం 8గంటల నుంచి శ్రీశైవమహా పీఠాధిపతి అత్తలూరి మృత్యుంజయశర్మ, ముదిగొండ అమరనాథశర్మలు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 1గంటకు మహాన్నదానం చేపట్టారు.