lord
-
కాశీ వెళ్లిన సాయిపల్లవి.. పూజల్లో మునిగి తేలుతూ (ఫొటోలు)
-
చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఒకరు మృతి!
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గానికి చెందినవారు ఈ రాళ్లదాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహూనా గ్రామంలో దశమి సందర్భంగా చార్భుజనాథ్ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన మార్కెట్ సమీపంలోకి రాగానే ఏదో ఒక విషయమై వాగ్వాదం జరిగి రాళ్లదాడి చోటచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్ చిపా అనే వ్యక్తి మృతి చెందాడు. నవీన్ జైన్ అనే మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. -
తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్‌లల్లా దినచర్య ఎలా గడిచిందంటే.. నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్‌లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్‌లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా, భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు. -
USA: టోర్నడో ఎగరేసుకుపోయినా... చెక్కుచెదరలేదు!
అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్భుతమే జరిగింది. రెండు భయానక టోర్నడోలు రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా ఆరుగురు వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకెగిసి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ నాలుగు నెలల బుడతడు మాత్రం చెక్కు చెదరలేదు! అంతటి ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కని్పంచే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఇలా జరిగింది.. సిడ్నీ మూర్ (22), అరామిస్ యంగ్‌బ్లడ్ (39) దంపతులది టెన్నెసీలోని క్లార్క్స్‌విల్లే. మొబైల్ వ్యాన్లోనే నివాసం. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రిన్స్టన్కు ఏడాది కాగా రెండో వాడు లార్డ్‌కు నాలుగు నెలలు. గత శనివారం హఠాత్తుగా టోర్నడో (భారీ సుడిగాలి) క్లార్క్స్విల్లేను కకావికలు చేసి పారేసింది. స్థానిక అధికార యంత్రాంగం టోర్నడో సైరన్ ఇవ్వకముందే వారి మొబైల్ వ్యాన్‌పై విరుచుకుపడింది. చూస్తుండగానే పైకప్పును లేపేసింది. దాంతో మూర్ హుటాహుటిన ప్రిన్స్టన్ను హృదయానికి హత్తుకుని నేలకు కరుచుకుపోయింది. ఊయలలో నిద్రిస్తున్న లార్డ్‌ను కాపాడేందుకు తండ్రి పరుగులు తీశాడు. అప్పటికే ఆ చిన్నారిని టోర్నడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. సుడిగాలి, అందులో అప్పటికే చిక్కిన అనేకానేక శిథిలాల మధ్య పాపం పసివాడు సుడులు తిరుగుతూ కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మొబైల్ వ్యాన్ పూర్తిగా నేలమట్టమైంది. హోరు గాలులు, వాటిని మించిన జోరు వానతో పరిస్థితి భీతావహంగా తయారైంది. శిథిలాల్లోంచి పెద్ద కొడుకుతో పాటుగా మూర్ పాక్కుంటూ సురక్షితంగా బయటికి రాగలిగింది. కానీ పసివాడితో పాటు అతన్ని కాపాడబోయిన తండ్రి సైతం సుడిగాలి దెబ్బకు కొంత దూరం ఎగిరిపడ్డాడు. అంతెత్తు నుంచి అమాంతంగా కిందపడి భుజం విరగ్గొట్టుకున్నాడు. అంతటి నొప్పితోనే బాబు కోసం 10 నిమిషాల పాటు శిథిలాల దిబ్బలన్నీ ఆత్రంగా వెదికాడు. చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్ గుక్కపట్టి ఏడుస్తూ కని్పంచాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. ఇదంతా ఏదో సినిమాలో సన్నివేశంలా తోస్తోందంటూ జరిగిన భయానక ఘటనను మూర్ గుర్తు చేసుకుంది. ‘‘హోరు వానలో జారిపోయిన భుజంతో నిలువెల్లా తడిసి చేతుల్లో మా చిన్న కొడుకుతో నా భర్త తిరిగొస్తున్న దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ హర్షాతిరేకాలు వెలిబుచ్చింది. టెన్నెసీలో అంతే... టెన్నెసీ రాష్ట్రం అమెరికాలో భారీ టోర్నడోలకు పెట్టింది పేరు. గత శనివారం గంటకు ఏకంగా 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడ్డ టోర్నడోలు పెను విధ్వంసమే సృష్టించాయి. వాటిలో ఒక టోర్నడో అయితే మాంట్గొమరీ కౌంటీ నుంచి లొగాన్ కౌంటీ దాకా ఏకంగా 43 మైళ్ల దూరం ప్రయాణించింది. దారిపొడవునా సర్వాన్నీ తుడిచిపెట్టేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెర్లిన్‌లో ‘గణేశ్ మహరాజ్ కీ జై’.. దీపావళికి కుంభాభిషేకం!
యూరప్ దేశమైన జర్మనీలో 20 ఏళ్లపాటు సాగిన విశేష కృషి అనంతరం హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. రాజధాని బెర్లిన్‌లో నిర్మితమైన ఈ గణేశ దేవాలయం 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి సాగించిన అవిశ్రాంత కృషి ఫలితం. కాగా ఈ ఆలయంలో ఇంకా దేవుని విగ్రహం ప్రతిష్ఠితం కాలేదు. ఈ ఏడాది (2023)దీపావళి సందర్భంగా బ్రహ్మాండమైన పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మీడియాతో మాట్లాడిన విల్వనాథన్ కృష్ణమూర్తి తాను 50 సంవత్సరాల క్రితం జర్మనీకి వచ్చానని తెలిపారు. ఆయన బెర్లిన్‌లో ఉంటున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేశారు. జర్మనీకి వచ్చినప్పటి నుండి అతని కల దేవాలయం నిర్మించడం. ఈ కల సాకారం అయ్యేందుకు 2004లో ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో బెర్లిన్ జిల్లా యంత్రాంగం ఆలయ నిర్మాణానికి హాసెన్హైడ్ పార్క్ వెలుపల ఒక ప్లాట్‌ను కేటాయించింది. అదిమొదలు విల్వనాథర్ ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించడం మొదలుపెట్టారు. 2007లోనే ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ 2010 వరకు కూడా ప్రారంభం కాలేదు. రుణాలు తీసుకువచ్చి ఆలయం నిర్మించడం తనకు ఇష్టం లేదని కృష్ణమూర్తి తెలిపారు. అందుకే ఆయన విరాళాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బెర్లిన్‌లో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని, దీంతో విరాళాలు అందడం కూడా పెరిగిందని ఆయన తెలిపారు. బెర్లిన్‌లో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారని, వారంతా విరాళాలు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువత హృదయపూర్వకంగా విరాళాలు అందజేస్తున్నారన్నారు. రాబోయే దీపావళి సందర్భంగా 6 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు విల్వనాథన్ కృష్ణమూర్తి తెలిపారు. ఇది కూడా చదవండి: అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్‌కు.. Germany's largest #Hindutemple is set to open in Berlin in November 2023. Sri-Ganesha Hindu Temple will be located in the tallest high-rise building currently under construction in Berlin, known as the "Amazon Tower." Opening of the temple is expected to coincide with the… pic.twitter.com/qwkq5SQ7IH — Centre for Integrated and Holistic Studies (@cihs_india) September 4, 2023 -
శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఉదంతమొకటి సంచలనంగా మారింది. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయంలో ఒక యువకుడు వృక్షాలను కట్ చేసే యంత్రంతో తన గొంతు కోసుకున్నాడు. సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు పరుగుపరుగున ఆలయానికి చేరుకుని, బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన రఘునాథ్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలీనాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దీపక్ తండ్రి పల్టూరామ్ తెలిపిన వివరాల ప్రకారం దీపక్‌కు ఇద్దరు పిల్లలు. దీపక్ మహాశివుని భక్తుడు. గత కొంతకాలంగా దీపక్ ఉదయం, రాత్రివేళల్లో మహాశివునికి పూజలు చేస్తుంటాడు. ఇటీవల దీపక్ తాను మెడ కోసుకుని మహాశివుని ప్రసన్నం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పల్టూ రామ్ తన కుమారుతో అటువంటి పని చేయవద్దని చెప్పాడు. అయితే కుమారుడు అతని మాట వినలేదు. కాగా దీపక్ ఒక నోట్‌బుక్‌లో మహాశివుని మంత్రాలను, శివునితో సాగించిన సంభాషణను రాస్తుంటాడు. దానిలో దీపక్ మహాశివునికి తనను తాను అర్పించుకుంటానని రాశాడు. దానిలో పేర్కొన్న విధంగా ఉదయం 4 గంటలకు ఆలయానికి వెళ్లాడు. అక్కడ చెట్లు కట్ చేసే యంత్రంతో మహాశివుని సమక్షంలో తన మెడను కట్ చేసుకుని జయజయధ్వానాలు చేశాడు. దీనిని అక్కడున్నవారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఆలయానికి చేరుకుని భాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీపక్ చిన్నాన్న ప్రసాద్ మాట్లాడుతూ దీపక్ మెడ కట్ చేసుకున్న సమయంలో ‘జై భగవాన్ శంకర్’ అనే నినాదాలు చేశాడని తెలిపారు. బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ సచిన్ మాహుర్ మాట్లాడుతూ దీపక్ అనే యువకుడు స్వయంగా తన మెడ కోసుకున్నాడని, అతనికి వైద్య చికిత్స జరుగుతున్నదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్
శ్రీ కృష్ణుని జన్మస్థలి మధుర, లీలాస్థలి బృందావనం.. ఈ రెండూ భక్తులకు భక్తి భావాన్ని పెంపొందింపజేస్తాయని అంటారు. శ్రీకృష్ణుని అపార ప్రేమకు ఈ రెండు ప్రాంతాలు నిదర్శనంగా నిలిచాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ తన అపార భక్తిభావనతో బృందావనం చేరుకుని, శ్రీకృష్ణుని భక్తిలో మునిగితేలుతోంది. షబ్నం.. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని జిగర్ కాలనీ నివాసి ఇక్రమ్ హుస్సేన్ కుమార్తె. ఇక్రమ్ వంటపాత్రలతో పాటు లోహ విగ్రహాలను తయారు చేస్తుంటాడు. షబ్నంనకు చిన్నప్పటి నుంచే హిందూ దేవీదేవతలపై ఆరాధనా భావం ఏర్పడింది. ఇదే ఆమెను కృష్ణునిపై ప్రేమకు, ఆపై బృందావనానికి పయనమయ్యేలా చేసింది. నాలుగు నెలల క్రితం ఆమె.. చేతిలో లడ్డూ పట్టుకున్న బాలగోపాలుని విగ్రహాన్ని తీసుకుని బృందావనం చేరుకుంది. ఇక్కడి గోవర్థన ప్రదక్షిణ మార్గంలోని గోపాల ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. దీంతో ఇక్కడే ఉంటూ శ్రీకృష్ణుని భక్తిలోనే తన జీవితం అంతా గడపాలని నిశ్చయించుకుంది. 2000లో షబ్నంకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో నిఖా జరిగింది. ఐదేళ్ల తరువాత ఆమకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి ఇక్రమ్ ఇంటికి తిరిగివచ్చి కొన్నాళ్లు అక్కడే ఉంది. తరువాత షబ్నం ఢిల్లీ చేరుకుని మొదట ఒక ప్రేవేట్ కంపెనీలో, ఆ తరువాత లేడీ బౌన్సర్గానూ పనిచేసింది. శ్రీకృష్ణునిపై తనకు ఏర్పడిన ప్రేమ గురించి షబ్నం మాట్లాడుతూ ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులందరితో బంధాన్ని తెంచుకున్నానని, ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిపింది. శ్రీ కృష్ణుడే తనకు సర్వస్వం అని, అందుకే అందరికీ దూరంగా ఉన్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: యువత పాడైపోతున్నదంటూ సంగీత పరికరాల దహనం! -
ప్రపంచానికి వరం పునరుత్థాన శక్తి
రెండువేల యేళ్ళనాటి ఈస్టర్ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆరోజున సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయానికి పూర్వమే చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన విశ్వాసులైన కొందరు స్త్రీలకు అక్కడ తెరువబడి ఉన్న సమాధి దర్శనమిచ్చింది. శుక్రవారం నాడు అసంపూర్తిగా మిగిలిన పరిమళ క్రియల్ని యేసు దేహానికి సంపూర్తి చేసేందుకు వాళ్ళు వెళ్లారు. సమాధికి అడ్డుగా రోమా ప్రభుత్వం ఒక పెద్దబండ రాయిని పెట్టి దానికి ముద్రవేసి అక్కడ కావలి వారిని కూడా పెట్టింది. తీరా స్త్రీలు అక్కడికెళ్తే, అడ్డు రాయి తొలగించబడి ఉంది, కావలివారు లేరు, స్త్రీలలో ఒకరైన మగ్దలీనా మరియ అది చూసి కంగారుపడి పరిగెత్తుకుని వెళ్లి పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులకు ప్రభువు దేహాన్నెవరో ఎత్తుకెళ్లారని చెప్పి వారితోపాటు మళ్ళీ వచ్చి చూసింది. సమాధిలో ప్రభువు దేహం లేదు. సమాధి చేయడానికి ముందు శుక్రవారం నాడు ఆయనకు తొడిగిన నారబట్టలు మాత్రం సమాధిలో పడి ఉన్నాయి. ఆమెకు దుఃఖం ఆగలేదు. మగ్దలీనా మరియ అక్కడే రోదిస్తుండగా ‘అమ్మా ఏడుస్తున్నావెందుకు? ఎవరికోసం వెదుకుతున్నావు?’అని ఎంతో అనునయంగా తనను అడుగుతున్న ఒక వ్యక్తి సమాధి వద్ద కనిపించాడు. చీకట్లో అతను తోటమాలీ కావచ్చనుకొని ‘అయ్యా, నా ప్రభువు దేహాన్ని నీవేమైనా మోసుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టావా?’ అనడిగింది మరియ. వెంటనే ‘మరియా’ అని ఆయన పిలువగా ఆయనే ప్రభువని గుర్తించి ‘రబ్బూనీ’ అంటే హెబ్రీ భాషలో ‘బోధకుడా’ అని ఆమె బదులిచ్చింది. మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను తాను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. పైగా అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశానిర్దేశం చేసి 40వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమేంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తి తో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాలదాకా నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తితోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధమయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మశక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీలోంచి గదిలోకి వస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. అపవిత్రత అంటకుండా జీవించడానికి ఆదిమ చర్చికి ఆ శక్తే తోడ్పడింది. తమకున్నదేదీ తమది కాదని, అదంతా సమిష్టి సొత్తని భావించి ఒకరిపట్ల ఒకరు అద్భుతమైన ప్రేమానురాగాలతో వాళ్ళు జీవించింది కూడా పరిశుద్ధాత్మ శక్తిగా ప్రభువు నిర్వచించి వారందరికీ భాగస్వామ్యాన్నిచ్చింది పునరుత్థానశక్తితోనే!! అదే శక్తిని కొన్నాళ్ల తర్వాత పొందిన అపొస్తలుడైన పౌలు కూడా ‘నాకు లోకసంబంధంగా లాభకరమైన వాటినన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను. ఆయన పునరుత్థానబలాన్ని తెలుసుకోవడానికి సమస్తాన్ని మలంతో సమానంగా ఎంచుకొంటున్నాను’ అన్నది కూడా ఆ పునరుత్థాన శక్తితోనే (ఫిలిప్పి 3:7–11). ఈస్టర్ ఆదివారం ఉదయం నాటి ఈ పునరుత్థానశక్తి చేత కొత్త నిబంధన యుగపు విశ్వాసులంతా నింపబడాలన్నది యేసుక్రీస్తు అభిమతం. పౌలు పత్రికల్లో పౌలు ద్వారా తన ఈ అభిలాషను ప్రభువు వ్యక్తం చేశాడు. ప్రభువు పునరుత్థాన శక్తినెరుగని, ఆ శక్తిని పొందడం ఎంత అత్యవసరమో అవగాహన లేని చర్చి ఎంత పెద్దదైనా, ఆ చర్చిలో వేలు, లక్షలమంది విశ్వాసులున్నా అది నిర్జీవమైనదే, నిస్సారమైనదే. యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురు తదితర శిష్యులకు ప్రభువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్థైర్యం కరువయింది. ఎందుకంటే వాళ్లంతా ఆయన్ను వదిలేసి ప్రాణభయంతో పారిపోయారు. ఇపుడు ఏ మొహం పెట్టుకొని ఆయనతో మళ్ళీ జత కలుస్తారు? అందువల్ల పేతురు గలిలయ సరస్సులో చేపలు పట్టే పనికి మళ్ళీ వెళ్లిపోదామనంటే మిగిలిన శిష్యులు కూడా ఆయనతో వెళ్లిపోయారు. కాని యేసుప్రభువు ప్రేమతో వెళ్లి వారిని అక్కడే కలుసుకున్నాడు. గలిలయ సరస్సులో చేపలు పడుతున్న శిష్యులకు ముఖ్యంగా పేతురుకు ఆయన సాక్షాత్కారం అలా లభించింది. వారిని ప్రభువు మళ్ళీ తన పరిచర్యకు పిలుచుకొని ఈసారి వారిని తన పునరుత్థాన శక్తితో నింపి అజేయులను చేశాడు. దేవుని పేరుతో లోకంలోని మంచివాటిని సంపాదించుకో వడానికి మామూలు శక్తియుక్తులు చాలు. కానీ లోకాన్ని ఆయన ప్రేమ, క్షమాపణ, సమాధానంతో నింపడానికి మాత్రం చాలా త్యాగపూరితమైన జీవితం, పరిచర్య అవసరం. అది ప్రభువిచ్చే పునరుత్థానశక్తితోనే సాధ్యం. దేవుని పేరుతో ఎన్నెన్నో కూడబెట్టుకోవాలి అ నుకునేవారికి, దేవునికోసం అన్నింటినీ నష్టపర్చుకొని, వ్యయపర్చుకొని, పోగొట్టుకునేవారికి, లోకశక్తికి, పునరుత్థాన శక్తికి ఉన్నంత తేడా ఉంది. ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్థాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ శక్తే!!! హ్యాపీ ఈస్టర్.... రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com స్కాట్లాండ్ దేశంలో జాన్ జి. ప్యాటన్ 13 మంది పిల్లలున్న ఒక నిరుపేద కుటుంబంలో 1824లో జన్మించాడు. చాలా చిన్నతనంలోనే ప్రభువును ఎరిగాడు. ప్రభువు పరిచర్య కోసం సిద్ధపడ్డాడు. ఇపుడు మనం వెస్టిండీస్ గా పిలుస్తున్న నల్లజాతీయులుండే ‘కెరీబియన్ దీవులకు’ తనను దయచేసి తనను పంపమని తన చర్చి ముఖ్యాధికారికి ఉత్తరం రాశాడు.‘నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్లిన మన మిషనేరీలను 19 ఏళ్ళ క్రితమే అక్కడి నరమాంసభక్షకులు చంపుకొని తిన్నారని నీకు తెలియదా? వెళ్లిన మరుక్షణమే నిన్ను కూడా వాళ్ళు చంపుకు తినేస్తారు జాగ్రత్త. కావాలంటే సురక్షితమైన, సుఖవంతమైన మరో స్థలానికి నిన్ను పంపుతాను’ అని జవాబిచ్చాడు డిక్సన్ అనే ఆ వృద్ధ మిషనేరీ. ‘కుదరదు. నేనక్కడికే వెళ్తాను. నా మృతదేహాన్ని భూమిలో పురుగులు తింటాయా, లేక నరమాంసభక్షకులు తింటారా? అన్నది నాకు చాలా చిన్న విషయం. చీకట్లో ఉన్న ప్రజలను దేవుని వెలుగులోకి తేవడమే నా జీవిత లక్ష్యం. అందుకు నాకు ప్రభువువారి పునరుత్థాన శక్తి తోడుగా ఉంటుంది. దయచేసి నన్ను అక్కడికే పంపండి’ అని ప్యాటన్ ఆయనకు మరో ఉత్తరం రాశాడు. ఎట్టకేలకు ప్యాటన్ 32 ఏళ్ళ వయసులో తన్నా అనే కెరీబియన్ దీవిలో తన భార్య మేరీతో సహా కాలుబెట్టాడు. అలా అనడం కంటే, కష్టాల కొలిమిలో కాలుబెట్టాడనడం ఉచితమేమో. నరమాంసభక్షకులైన దాదాపు 4000 మంది నల్లజాతీయులు ఆ దీవిలో ఉంటే, వారి నుండి తనను తాను రక్షించుకోవడమే తొలి రోజుల్లో అతనికి ప్రధాన వ్యాపకంగా ఉండేది. అయినా వారిమధ్య ధైర్యంగా తన పరిచర్య కొనసాగించాడు. వారికి బట్టలేసుకోవడం దగ్గరినుండి నాగరికతనంతా నేర్పించాడు. ఈలోగా ఆయన భార్య, కుమారుడు నిమోనియాతో వారం రోజుల వ్యవధిలో చనిపోతే తానుండే ఇంటిపక్కనే తానే స్వయంగా తవ్వి వారిని భూస్థాపన చేశాడు. ఎన్నో రాత్రులపాటు ఆ సమాధుల వద్ద ఒంటరితనంతో రోదిస్తూ గడిపాడు. ఇప్పటికైనా స్వదేశానికి వచ్చెయ్యమన్నారు పెద్దలు. కానీ అది మాత్రం జరగదన్నాడు. ఆ ద్వీపవాసులకు సువార్త చెబుతూనే వారి భాషను నేర్చుకొని వారి భాషకు లిపిని తయారుచేసి, ఆ లిపిని వారికి నేర్పించి ఆ భాషలోకి బైబిల్‌ను అనువదించాడు. అలా అక్షరాస్యతా ఉద్యమాన్ని అక్కడ ఆరంభించాడు. కెరిబియన్ దీవులన్నింటిలో అలా సువార్త ఉద్యమం, సాక్షరతా ఉద్యమం, నాగరికతా ఉద్యమం ఒకేసారి వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా ఆ దీవుల్లోని వాళ్లంతా నరమాంసభక్షణ మానేసి యేసుప్రభువు రక్షణలోకి వచ్చి దేవుని ఆరాధకులుగా మారారు. ఆయన మరణించేనాటికి అంటే 1907 నాటికి ఆ దీవులన్నీ, సువార్తతో, అక్షరాస్యతతో, నాగరికతతో నిండిపోయాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రభువువారి పునరుత్థాన శక్తితో నింపబడితే వచ్చిన విప్లవాత్మకమైన మార్పులివి. -
పరమదేవుని నివాస స్థలమది
మహా గోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. మన గురించి మనమేమనుకొంటున్నామన్నదానికన్నా, మన గురించి దేవుడేమనుకొంటున్నాడన్నది చాలా ముఖ్యమైన అంశం. లవొదికయలో నున్న చర్చికి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన లేఖ ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేవుని సాన్నిధ్యానికి, దేవుని ప్రసన్నతకు, పవిత్రతకు, ముఖ్యంగా దేవుని ప్రేమకు నిలయంగా దేవుడే నిర్దేశించిన స్థలం చర్చి. ఆదిమకాలంలో దేవుని ప్రేమను యేసుక్రీస్తులో సంపూర్ణంగా చవిచూసిన ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు ఆ ప్రేమనే లోకానికి ఆచరణలో చాటడానికి, ఆయన సాన్నిధ్యంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని లోకానికి రుచిచూపించేందుకు భూదిగంతాలకు వెళ్లి అనేక ప్రాంతాల్లో స్థాపించినవే ఆ చర్చిశాఖలు. అందువల్ల చర్చి దేవుని నివాసస్థలం, ఆశ్రితులు, నిరాశ్రయులు, నిరుపేదలు, సమాజంలోని బలహీనులు అక్కడి విశ్వాసుల సహవాసంలో వారి ఆదరణను, సహాయాన్ని, అనునయాన్ని పుష్కలంగా పొంది దేవుని ప్రేమను అనుభవించే పరలోకానందానికి సాదృశ్యస్థలం. అందుకే దేవుడు లవొదికయలోని చర్చికి రాసిన లేఖలో తన బాధనంతా వ్యక్తం చేశాడు. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల ప్రాపకంలో పెరిగి పెద్దవాడై, ఉన్నతవిద్యలనభ్యసించి, ఒక గొప్పసంస్థను స్థాపించి, సమాజంలో అత్యున్నతస్థానాన్ని, పేరుప్రఖ్యాతులను సంపాదించి, తన ఔన్నత్యానికి కారకులైన తల్లిదండ్రులనే చివరికి మర్చిపోతే అదెంత విషాదకరం? లవొదికయ చర్చిలో సరిగ్గా జరిగిందదే.‘నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అని నీవనుకొంటున్నావు కాని ఎంతోకాలంగా నేను బయట నిలబడి నీ తలుపు తడుతున్నాను కాని నీవు తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించడం లేదు’ అని దేవుడు తన లేఖలో ఆహ్వానించడం లేదన్నది ఆ చర్చిపై దేవుడు చేస్తున్న అభియోగం(ప్రక 3:14–21). మన భాషలో చెప్పాలంటే సెల్‌ఫోన్ అదేపనిగా మోగుతుంటే, ఎవరో అవతల మన తలుపు పదే పదే తడుతూ ఉంటే మనం స్పందించకుండా ఉండగలమా? కాని ఆ స్పందనే కరువైన చర్చి లవొదికయలోని చర్చి!! అందువల్ల ఒక కార్పొరేట్ సంస్థ స్థాయికి ‘నీవు ఎదిగినా, నీకు ఎంత ధనమున్నా నీవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవే. ఎంతో సింగారంగా దుస్తులు ధరించుకున్నా పవిత్రత లేని దిగంబరివే. నీకు లోకమంతా ఎరిగిన జ్ఞానమున్నా నీది దైవత్వాన్ని ఎరుగని అంధత్వమే !!’ అని వాపోతున్నాడు దేవుడు. లోకాన్నంతా లోపలి తెచ్చుకొని అన్నింటికీ కారకుడైన దేవుణ్ణి మాత్రం తలుపు అవతల పెట్టిన ‘దేవుడే లేని చర్చి’ అది. అంతకన్నా మరో విషాదం ఉంటుందా?ఎన్ని ఉన్నా, అది దేవుడు లేని చర్చి అయినా, కుటుంబమైనా, విశ్వాసి అయినా వాళ్ళు ఏమీ లేనివారికిందే లెఖ్ఖ!! మహాగోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. చర్చిని చందాలతో కాదు, విశ్వాసుల సాక్ష్యంతో, వారి ప్రేమపూర్వకమైన పరిచర్య, క్రియలు, త్యాగంతో నిర్మించాలి. అలాంటి చర్చి యేసుక్రీస్తు పునరాగమనానికి లోకాన్ని సిద్ధం చేస్తుంది. చర్చిని ఆదిమ అపొస్తలులు స్థాపించడంలో ఉద్దేశ్యం కూడా అదే!! యేసుక్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, కృపను చర్చి తన పరిచర్య ద్వారా లోకానికి పరిచయం చేసి ఆయన రెండవ రాకడకోసం లోకాన్ని సిద్ధం చేయాలన్నదే చర్చి ముఖ్య లక్ష్యం. రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పాపుల పరమ వైద్యుడాయన...
పన్నువసూలు చేసే వృత్తిలో ఉన్న మత్తయిని చూసి యేసుప్రభువు ‘నన్ను వెంబడించు’ అని పలకగానే అతను వచ్చి ఆయన శిష్య బృందంలో చేరాడు. ప్రభువు పలికిన ఆ ఒక్కమాట అతని జీవిత గమ్యాన్ని సమూలంగా మార్చేసింది. మత్తయి జీవితంలోకి ప్రభువు ఆహ్వానం ఎంతటి ఆనందాన్ని నింపిందంటే, అది వెల్లడించడానికి ఒక గొప్ప విందు చేసి ప్రభువును కూడా ఆహ్వానించాడు. నాటి రోమా ప్రభుత్వానికి తొత్తులైన పన్నులు వసూలు చేసే మత్తయి లాంటి సుంకరులను సాధారణ ప్రజలు ఏవగించుకునేవారు. శాస్త్రులు పరిసయ్యుల వంటి యూదు మత ప్రముఖులు ఎలాగూ రోమాప్రభుత్వానికి మద్దతుదారులు కాబట్టి వారు సుంకరులకు కూడా స్నేహితులు. అందువల్ల ఆ విందుకు పాపులుగా ప్రజలు ముద్రవేసిన ఎంతోమంది సుంకరులు, పరిసయ్యులు కూడా హాజరయ్యారు. యేసుప్రభువు ఎంతో ఆనందంగా వారందరితో కలిసి విందారగించడం యూదుమత ప్రముఖులైన పరిసయ్యులకు నచ్చలేదు. ‘మీ బోధకుడు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నాడు’ అని పరిసయ్యులు ఆయన శిష్యులను ప్రశ్నించారు. పరిసయ్యులు తమకు తాము చాలా నీతిమంతులమని భావిస్తారు. యూదు మత సంబంధమైన దాదాపు 615 నియమాలను ఎంతో నిష్టగా పాటిస్తారు. అవి పాటించని యూదులు, అన్యులతో కలిసి భోజనం చేయకూడదన్నది వాటిలో ఒకటి. అందువల్ల ఆ విందులో పరిసయ్యుల కోసం ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసి ఉంటారు కానీ తమతో కలిసి భోంచేస్తాడనుకున్న యేసుప్రభువు సుంకరులతో కలిసి వారి విభాగంలో కూర్చోవడంతో వాళ్ళు ఈ వివాదానికి తెర లేపారు. ‘వైద్యుని అవసరం రోగులకే గాని ఆరోగ్యవంతులకు కాదుకదా. నేను నీతిమంతులను కాదు, పాపులనే పిలవవచ్చాను. బలిని కాదు, కనికరాన్నే కోరుతున్నాను. ఆ వాక్యభావమేమిటో ముందు నేర్చుకోండి’ అంటూ ఒక్కమాటతో ప్రభువు వారి నోళ్లు మూసివేశాడు (మత్త 9:9–13).నిజానికి ఆ రాత్రి విందులో సుంకరులను చూసీ చూడగానే ‘మీరెప్పుడు మారుతారు?’ అని ప్రభువు వారిని నిలదీస్తూ ప్రశ్నించాలి. అక్కడికక్కడే ఎడాపెడా ‘మారుమనస్సు’ అనే అంశంపై ప్రసంగం చేసి వారినందరిని గద్దించాలి. నిజానికి తన శిష్యుడిగా చేర్చుకున్న మత్తయికే ప్రభువు ఆ ప్రశ్న వెయ్యలేదు. అది ఎవరో తనను అతిథిగా ఆహ్వానించిన ఒక విందు స్థలం. అందువల్ల అక్కడి వాతావరణాన్ని పాడుచెయ్యకుండా, విందు సాంప్రదాయాన్ని గౌరవించి తన పద్ధతి చొప్పున ఆయన అందరితో కలిసిపోయాడు. అదే ఆయన సంస్కారం, గొప్పదనం. అందరినీ తిట్టి దూరం పెట్టగలిగిన స్థాయి తనకున్నా వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్న ఎంతో విశాల హృదయమున్న గొప్ప రక్షకుడాయన. అయితే కొన్ని నియమాలను నిష్టగా పాటిస్తున్నారన్న మాటే గాని దేవుని హృదయాన్ని ఏమాత్రం ఎరుగని పరిసయ్యులు మాత్రం యేసుప్రభువు పాపులతో ప్రభువు కలవడమేమిటన్న వివాదాన్ని విందులో లేపి తమ కుసంస్కారాన్ని చాటుకున్నారు. ఈనాడు విశ్వాసులది కూడా అదే పద్ధతి. చర్చిల్లో తమకన్నా ఆత్మీయంగా తక్కువ స్థాయి గలవారొస్తే వారితో కలవరు, మాట్లాడరు సరికదా సూటిపోటిమాటలంటారు. చర్చిలు పాపుల వైద్యశాలలుగా ఉండాలని ప్రభువు నిర్దేశిస్తే, ‘నీతిమంతుల’ విశ్రామ స్థలాలు, సోషల్ క్లబ్బులుగా మారాయి. పాపిగా ముద్రపడ్డ వ్యక్తి చర్చికి పరుగెత్తుకెళ్లి అక్కడి విశ్వాసుల ప్రేమతో తడిసి పరివర్తన చెంది సమాజామోదం పొందే పరిస్థితి లేదు సరికదా, చర్చి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితిని ఈనాటి పరిసయ్యుల్లాంటి విశ్వాసులు కల్పించారు. ఇదే ఈనాటి అతి పెద్ద విషాదం. ప్రభువు హృదయాన్ని తెలుసుకోకుండా ప్రభువు అనుచరులమని చెప్పుకునే ‘నకిలీ క్రైస్తవం’ బాగా ప్రబలుతోంది. చర్చిల్లో దేవుని మాటలు వినబడతాయి, కానీ దేవుని హృదయం, ఆయన ప్రేమ, కనికరం మాత్రం కనిపించడం లేదు. పాటలు, ప్రసంగాలు, ప్రార్థన చేసే కొద్ది సమయం వదిలేస్తే మిగతా సమయమంతా ‘గెట్ టుగెదర్’లు, సోషల్ క్లబ్బుల కార్యకలాపాలే! అన్యులతో కాదు కదా, కనీసం ఇతర చర్చిలవారితో కూడా చాలామంది విశ్వాసులు కలవరు, ఇతరులను తమతో కలవనివ్వరు. ఇలా తమను తాము గొప్పగా, ఎంతో ప్రత్యేకమైన వారుగా భావించుకునే సంçస్కృతిని యేసుప్రభువు ఏవగించుకుంటాడు, అలాంటి జీవనశైలికి తన ఆమోదాన్ని అసలే ఇవ్వడు. అపురూపం స్వర్ణముఖి శిల పంచాయతన పూజలో కీలకంగా ఉపయోగించే స్వర్ణముఖి శిల చాలా అరుదైన వస్తువు. దక్షిణభారత దేశంలో చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది ఒడ్డున స్వర్ణముఖి శిలలు అక్కడక్కడా దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా తలచే స్వర్ణముఖి శిలకు బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా అక్షయతృతీయ నాడు స్వర్ణముఖి శిలను శాస్త్రోక్తంగా పూజించిన ఇంట సంపద దినదిన ప్రవర్ధమానంగా వృద్ధిచెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. స్వర్ణముఖి శిలలు మామూలు రాళ్లమాదిరిగానే ఉన్నా, వాటిలో బంగారు వెండి కలగలసిన ఛాయ కనిపిస్తుంది. స్వర్ణముఖి శిలను ఇళ్లలోను, కార్యాలయాల్లోను, వ్యాపార ప్రదేశాల్లోనూ ఎక్కడైనా సరే, పూజమందిరం ఏర్పాటు చేసిన చోట ఉంచి పూజించుకోవచ్చు. స్వర్ణముఖి శిలకు నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదు. స్వర్ణముఖి శిలను ఏదైనా సుముహూర్తంలో తీసుకువచ్చి, పూజమందిరంలో పసుపు వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, పూజించాలి. దీనిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనాయాసంగా కార్యసిద్ధి కలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
నాకు ఆ నమ్మకం ఉంది!
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులున్నారు. వారిలో ఒకరు భక్తిపరుడు. ప్రతిరోజూ పూజ చేసేవాడు. పూజలో భాగంగా దేవుడికి రకరకాల పండ్లను, పదార్థాలను నైవేద్యంగా సమర్పించి, అందులో ఒక ఫలాన్నో, ఆహార పదార్థాన్నో ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేవాడు. రెండోవ్యక్తికి దైవం అంటే నమ్మకం ఏ మాత్రం లేదు. ఒకరోజు ఇతను వచ్చేటప్పటికి దైవభక్తుడైన మిత్రుడు దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు. అది చూసి నాస్తిక మిత్రుడు ఎగతాళిగా ‘‘నువ్వు రోజూ దేవునికి నైవేద్యం పెడుతున్నావు. ఆ పండు నువ్వు పెట్టిన చోటే ఉంటోంది. దానిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. దీనిని బట్టి నీకిష్టమైన వాటిని దేవుని పేరు చెప్పి, ఆయన ముందుపెట్టి, ఆనక నువ్వే తింటున్నావు. నువ్వు చేసేది పొట్ట పూజే కానీ దైవపూజ కాదు’’ అంటూ నవ్వాడు. అందుకు ఆ భక్తుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు. ‘‘గీతలో కృష్ణుడు– భక్తులు భక్తితో తనకు పువ్వు, పండు లేదా కనీసం నీటిని సమర్పించినా, దానిని తాను స్వీకరిస్తానన్నాడు. దానిని బట్టే నేను సమర్పించేదానిని ఆయన తప్పక తీసుకుంటాడన్న భావనతో ప్రతిరోజూ నైవేద్యం పెడుతున్నాను. ఆయన సర్వశక్తి మంతుడైనందువల్ల ఆ ఫలాన్ని లేదా పదార్థాన్ని పూర్తిగా అదృశ్యం చేయవచ్చు లేదా దానిని వినియోగించినా కూడా అలాగే ఉండేటట్లు చేయగలడు. నాకు సంబంధించినంతవరకు భగవంతుడు ఆరగించిన తరువాత మిగిలిన ఫలాన్నే నేను ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నేనొక చిన్న ప్రశ్న అడగవచ్చా?’’ అన్నాడు. ‘‘సరే, అడుగు’’ అన్నాడు నాస్తిక మిత్రుడు. ‘‘మనం రోజూ వార్తాపత్రికలు చదువుతాం కదా, అందులోని అక్షరాలు ఏమైనా మాయం అవుతున్నాయా?’’ అనడిగాడతను. ‘‘లేదు. అయినా, అలా ఎలా మాయం అవుతాయి?’’ అనడిగాడితను. ‘‘అవి మాయం కాకుండానే వాటి సారం మీకు తెలుస్తోందా లేదా? ఇదీ అంతే అని ఎందుకనుకోవు? మరో విషయం– ఈ మధ్య నీ అభిమాన నటుడు ఒకతను మన ఊరికి వచ్చినప్పుడు మీరందరూ ఆయనకు పూలదండలు వేశారు. తనకు వేసిన దండల్లో ఒకదానిని ఆయన తిరిగి నీకే ఇస్తే, సంతోషంతో తీసుకున్నావా లేదా? అలాగే ఆయన కొన్ని పూలదండలను తన అభిమానుల మీదికి విసిరితే అందరూ ఆనందించారా లేదా? నీ అభిమాన నటుడు తనకు వేసిన పూలదండలన్నింటినీ తన దగ్గర ఉంచుకోక పోయినా మీరు పూలదండలు వేయడం మానుకున్నారా? అలాగే నేను చిత్తశుద్ధితో దేవునికి నైవేద్యం సమర్పించి, దానిని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను.?’’ అన్నాడు. అంగీకార సూచకంగా తల ఊపాడు నాస్తిక మిత్రుడు. – డి.వి.ఆర్. -
నా ప్రభువే కాపాడాడు
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ‘అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్ధం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’ అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, ‘హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికి సాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?’ అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’శాపగ్రస్తుడా..దుర్మార్గుడా..దూరంగా పారిపో..’ అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్ మరోపాచిక విసురుతూ..‘జీలానీ . నిన్ను నీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ‘కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు.. నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది.దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు. మాసం మహాత్మ్యం పుణ్యఫలాలనిచ్చే పుష్యం: పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం. పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి బుద్ధి కారకుడు కావడం వల్ల ఈ మాసం బృహస్పతికీ, శనికీ అత్యంత ప్రీతికరమైనది. శనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చే నూనె. కాబట్టి ఈ మాసంలో నువ్వులు, నువ్వులనూనెతో ఆయనను అభిషేకించి, పూజించాలని, నువ్వులు దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్రవచనం. అలాగే ఇది మంచు కప్పబడి ఉండే మాసం కాబట్టి పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైలగ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ నువ్వులనూనె ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేయడం. అలాగే సంక్రాంతి పిండి వంటలన్నిటిలో నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. ఇక ఈ మాసం శూన్యమాసం అని ఆందరూ ఆడిపోసుకుంటారు కానీ, అత్యుత్తమమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదీ, రైతులు పండుగగా, పితృదేవతల పండగగా చెప్పుకునే సంక్రాంతి పండగ వచ్చేది కూడా ఈ మాసంలోనే కాబట్టి చిన్న చూపు తగదు. -
వరుడైన శ్రీనివాసుడు
ద్వారకాతిరువుల : సర్వాభరణ భూషితుడైన శ్రీవారు నుదుటున కల్యాణతిలకం, బుగ్గనచుక్కతో పెండ్లి కువూరునిగా శోబిల్లారు. అలాగే పద్మావతి, ఆండాళ్ అవ్మువార్లు పెండ్లికువూర్తెలుగ ముస్తాబయ్యారు. శ్రీవారిని, అవ్మువార్లను పెండ్లికువూరుడు, పెండ్లికువూర్తెను చేÄýæుు వేడుకను చూసిన భక్తజనులు పరవశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరువులలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నేత్రపర్వంగా ప్రారంభ వుయ్యాయి. తొలిరోజున స్వామివారు, అవ్మువార్లు పెండ్లి కువూరునిగాను, పెండ్లికువూర్తెలుగాను అలంకార భూషితులయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, వుంగళ వాయిద్యాలు, వేద వుంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నావుస్మరణల నడువు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత ఆలయ ప్రదక్షిణ వుండపంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేసి సుగంధభరిత పుష్పవూలికలు, వూమిడితోరణలు, అరటి బోదెలుతో నయనానందకరంగా అలంకరించారు. అలాగే ఆలయ పరిసరాలను విశేష అలంకారాలతో తీర్చిదిద్దారు. వేదికపై ఏర్పాటుచేసిన రజిత సింహాసనంపై శ్రీవారు, అవ్మువార్ల ఉత్సవ వుూర్తులను వేంచేపుచేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విశేష పూజాధికాలు జరిపారు. ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఈవేడుకను అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు దంపతులు, రాష్ట్ర దేవాదాయశాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ పీవీ.రమణరాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. . రాజాదిరాజ వాహనంపై ఊరేగిన శ్రీవారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మెుదటిరోజున జరిగే రాజాదిరాజ వాహన సేవకు ఎంతో ప్రావుుఖ్యత ఉంది. ఈ వాహనంలో కొలువైన గరుత్మంతుడు స్వామి, అమ్మవార్లను మోస్తున్నట్లు ఉన్న అలంకరణ భక్తులకు నేత్రపర్వమైంది. శ్రీవారి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను మంగళవారం రాత్రి క్షేత్రపురవీదుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గజసేవనడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పువీదులకు పయనమైన స్వామివారిని అడుగడుగునా భక్తులు దర్శించి, నీరాజనాలను సమర్పించారు. శ్రీ హరికళాతోరణంలో జరపిని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వైభవంగా అభయాంజనేయస్వామి విగ్రష ప్రతిష్ఠాపన
సిరిసిల్ల టౌన్ : స్థానిక శ్రీశివసాయి బాబా ఆలయ ఆవరణలో ఇటీవల నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న వేడుకల్లో భాగంగా ఉదయం 8గంటల నుంచి శ్రీశైవమహా పీఠాధిపతి అత్తలూరి మృత్యుంజయశర్మ, ముదిగొండ అమరనాథశర్మలు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 1గంటకు మహాన్నదానం చేపట్టారు. -
దైవారాధన విధానం తెలిపినదేవదూత జిబ్రీల్
ప్రవక్త జీవితం తిరస్కారుల వ్యంగ్యవ్యాఖ్యలకు సమాధానమా అన్నట్లు, దైవదూత జిబ్రీల్ (అ) దైవవాణి తీసుకొని రానే వచ్చారు. వెలుగులు విరజిమ్మే పగలు సాక్షిగా ! ప్రశాంతంగా అవతరించే రాత్రి సాక్షిగా! (ఓ ప్రవక్తా ! ) నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడిచి పెట్టలేదు. నీపట్ల ఆయన అసంతృప్తి కూడా చెందలేదు. నిశ్చయంగా రాబోయేకాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీకు నీ ప్రభువు నువ్వుసంతోష పడే అంత అధికంగా ప్రసాదిస్తాడు. నువ్వు అనాథగా ఉండడం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నువ్వుమార్గమేదో తెలియని వాడిగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. నువ్వు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుణ్ణి చేశాడు. కనుక నువ్వు అనాథల పట్ల కఠినంగా వ్యవహరించకు. యాచకుణ్ణి కసురుకోకు. నీప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి. (అజ్ జుహా .1-11) అవును, దైవం ఆయన్ని విడిచి పెట్టలేదు. ఆయనపట్ల అసంతృప్తీ చెందలేదు. పైగా ఆయన్ని అమితంగా ప్రేమించాడు. తన కారుణ్య ఛాయతో ఆయన్ని కప్పేశాడు. తన అనుగ్రహాలను ఆయనపై కురిపించాడు. దైవవాణి క్రమం తప్పకుండా అవతరిస్తూనే ఉంది. దైవాదేశాలను తీసుకొని జిబ్రీల్ (అ)ఆయన వద్దకు వస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నవిషయాలను బోధపరుస్తున్నారు. దైవప్రార్ధనకు ముందు వజూ (ముఖం, కాళ్ళూచేతులు నియమబద్ధంగా కడగడం) ఎలా చేయాలి, నమాజ్ ఎలా ఆచరించాలి? అన్నవిషయాలనూ ఆయనే నేర్పారు. ఒకరోజు ముహమ్మద్ (స) మక్కా శివార్లలో దైవదూతకోసం నిరీక్షిస్తూ పచార్లు చేస్తున్నారు. భవిష్యత్ కార్యక్రమాలను గురించి ఆయన మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా దైవ ప్రార్ధన విషయంలో మార్గదర్శకం కోసం ఆయన మనసు తహతహలాడుతోంది. సరిగ్గా అప్పుడు జిబ్రీల్ ఆయన వద్దకు వచ్చారు. నమాజ్ ఆచరించడానికి ముందు ఇలా వజూ చేయాలి, అంటే పరిశుభ్రతను ఇలా పొందాలి. అని ఆయనకు చెప్పారు. చెప్పడం మాత్రమేకాదు, స్వయంగా జిబ్రీల్ (అ) వజూ చేసి చూపించారు. ముహమ్మద్ (స)కూడా ఆయన చేసినట్లుగానే వజూ చేశారు. తరువాత జిబ్రీల్ (అ) నిలబడి నమాజు చేసి చూపించారు. ముహమ్మద్ (స) కూడా అలాగే నమాజ్ ఆచరించారు. తరువాత జిబ్రీల్ వెళ్ళిపోయారు. ముహమ్మద్ (స) ఇంటికి వచ్చి, శ్రీమతికి అంతా వివరించారు. జిబ్రీల్ దూత నేర్పినవిధంగా నమాజ్ చేయడానికి, పరిశుభ్రతను పొందే విధానం ఇదీ అని శ్రీమతికి చెబుతూ, ఆమె ముందు వజూచేశారు. వెంటనే బీబీ ఖదీజా కూడా ఆయన చేసినట్లుగానే వజూ చేశారు. తరువాత ఆయన నమాజు కోసం ఉపక్రమించారు. బీబీ ఖదీజ కూడా ఆయన అనుసరణలో నమాజ్ ఆచరించారు. ముహమ్మద్ (స) సంరక్షణలో, వారిఇంట్లోనే ఉన్న పదేళ్ళ అలీకి ఈ నమాజ్ ఆచరణ కొత్తగా, వింతగా అనిపించింది. సంభ్రమాశ్చర్యాలకు లోైనెు తిలకించసాగాడా బాలుడు. మునుపెన్నడూ ఎక్కడా చూడని ప్రార్ధనా విధానం, శ్రవణానందమైన పారాయణ మధురిమ ఆతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
క్రియలు లేని విశ్వాసం మృతం
దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). నీకిష్టమైతే నన్ను బాగుచేయమంటూ ఒక కుష్ఠురోగి యేసుక్రీస్తును ప్రాధేయపడ్డాడు. దానికిష్టమేనంటూ ప్రభువతన్ని బాగుచేశాడు. ఎన్నో ఏళ్ల అతని శాపగ్రస్థమైన జీవితానికి దేవుని కృపవల్ల కొన్ని క్షణాల్లో అలా తెరపడింది. అయితే ఆ వెంటనే అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరికను ప్రభువు జారీ చేశాడు. ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. కానీ సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపర్చుకొని మోషే నియమించిన కానుక చెల్లించు’ అన్నాడు యేసుప్రభువు (మత్తయి 8:1-4). దేవుని అద్భుతాన్ని చవిచూసినవాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో యేసు తెలిపిన ఉదంతమిది. దేవుడు అద్భుతం చేశాడని చెప్పుకోవాలనుకోవడం సహజమే! కాని ఆ ‘కృతజ్ఞతాభావం’ విశ్వాసి మాటల్లో కాదు చేతల్లో లోకానికి వెల్లడి కావాలన్నది ప్రభువు మాటల తాత్పర్యం. కుష్ఠురోగం అంతకాలంగా అతన్ని లోకానికి, దేవునికి కూడా దూరంగా ఉంచింది. కాబట్టి అతను ముందుగా దేవాలయానికి వెళ్లి, యాజకునికి కనబర్చుకొని దేవుని ఆరాధించాలి. ఆ తర్వాతే సమాజంలోకి వెళ్లాలి. దేవుడు అద్భుతం చేసి గండం గట్టెక్కించే వరకూ దేవుని ప్రాధేయపడటం, ఉపవాస ప్రార్థనలు చేయడం షరా మామూలే! అద్భుతం జరిగి గండం గడిచాక దేవుని మాటల్లో స్తుతించడమే తప్ప దేవునికి మరింత దగ్గరై జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచనే లేకపోవడం విషాదకరం. మార్పు లేకుండా జీవించే వాడు ఎంత మాట్లాడినా దేవునికి మహిమ కలగదు. మన పెదాలు దేవుని స్తుతిస్తుంటే, మన జీవితం నిండా దైవవ్యతిరేకత అనే దుర్గంధముంటే, అది దేవునికెంత అవమానకరం? జీవితాన్ని పూర్తిగా మార్చేదే నిజమైన కృతజ్ఞత! మాటల్లో, పాటల్లో, ప్రసంగాల్లో టన్నులకొద్దీ కుమ్మరిస్తున్నాం కానీ చేతల్లో అణుమాత్రం కూడా చూపడం లేదు. దేవుని పట్ల కృతజ్ఞతతో మనం మారితే ఆ మార్పును లోకం స్తుతిస్తుంది. ఆ పెనుమార్పుకు కారణమేమిటో, దేవుడు చేసిన అద్భుతమేంటో దేవుడెవరో అలా మనం చెప్పకుండానే లోకం తెలుసుకుంటుంది. అందుకే ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు’ అన్నది ప్రభువు అతనికిచ్చిన ఆజ్ఞ. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపర్చబడతాడన్నాడొకసారి యేసుప్రభువు (యోహాను 15:8). చెట్టెప్పుడూ తన గొప్పదనాన్ని చెప్పుకోదు, ప్రసంగాలు చేయదు, పాటలు పాడదు. లోకానికి తియ్యటి తన ఫలాలనిస్తుందంతే! దేవునికోసం ఫలించడమంటే లోక కల్యాణార్థం, దీనుల సహాయార్థం మౌనంగా సత్కార్యాలు చేయడమే! తన సమస్యల్లో ఆదుకొని అద్భుతాలు చేసిన దేవుని పట్ల నిజంగానే కృతజ్ఞత కలిగిన విశ్వాసి, తోటి మానవుల సమస్యల పట్ల స్పందించకుండా ఉండలేడు. దేవునికోసం నేనేం మాట్లాడాలి? అని కాక దేవుని పేరిట దీనులకోసం నేనేం చేయాలి? అన్న ధ్యాసతో విశ్వాసి నిరంతరం రగిలిపోవాలి. అయితే దేవునికోసం ఏదైనా చేయమని హృదయం చెబుతుంటే, అది చేయకుండా ఉండేందుకు మెదడు రకరకాల సాకులు చూపెడుతుంటుంది. సాకులు తయారు చేసే మహాయంత్రమైన మన మెదడే మనకు ప్రధానమైన అవరోధమవుతుంది. మండుటెండకు కాగుతున్న వ్యక్తికి గిన్నెడు చల్లటి నీళ్లిచ్చినా అది అద్భుతమైన పరిచర్య అంటాడు ప్రభువు (మత్తయి 10:42). ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనమిచ్చే గిన్నెడు చల్లనీళ్లే, సముద్రమంత దేవుని ప్రేమను పరిచయం చేస్తాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
శివాలయం కట్టించిన అక్బర్..!
జైపూర్ః భరత భూమి సర్వ మానవ సమానత్వానికి పెట్టింది పేరు. హిందూ ముస్లిం భాయి భాయి అన్న నానుడి... ఈ పుణ్యభూమిలో అనుచరణలోనే ఉంది. తీవ్రమైన మతాచారాలు, కుల తత్వాలు ఆచరించే రోజుల్లోనే అక్బర్ చక్రవర్తి... మీరాబాయి భజనలు వినడానికి వెళ్లేవాడట. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్ని మతాలవారి ఆదరణను పొందారు. తమిళనాడు శ్రీరంగ దేవాలయం, భద్రాద్రి రాముని ఆలయాల్లో సన్నాయి వాయించేది ముస్లింలే. చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్నవాడినే దేముడు అంటాం. అదే జైపూర్ వాసికి అనుభవపూర్వకమైంది. చిన్ననాడు మసీదులో ప్రార్థనలతోపాటు.. సమీప దేవాలయంలోనూ పూజలు చేసిన అక్బర్ ఖాన్.. కష్టాలు తీరడంతో ఆ పరమేశ్వరుని భక్తుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఏకంగా దేవాలయ నిర్మాణానికి నడుం కట్టాడు. 'అల్లా కహో యా రామ్.. క్యా ఫరక్ పడ్తాహై' అంటూ అతడు మత సామరస్యాన్ని చాటి చెప్తున్నాడు. తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు జైపూర్ వాసి అక్బర్ ఖాన్. ఆ పరమ శివుడే తన రక్షకుడుగా భావిస్తున్నాడు. అందుకే జైపూర్ లో శివాలయం కట్టించేందుకు పూనుకున్నాడు. మసీదులో ప్రార్థనలతోపాటు చిన్నతనంలో తన స్నేహితులతో అనేక దేవాలయాలను దర్శించిన అక్బర్.. కష్టాల్లో అల్లాకు ప్రార్థనలతోపాటు పూజలు కూడ చేసేవాడు. అదే భక్తితో ప్రస్తుతం 39 ఏళ్ళ అక్బర్ ఖాన్ శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తాను నిర్మించిన ఆలయాన్ని ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేసే ముందు గణేశ హోమం, యజ్ఞ యాగాదులు నిర్వహించి, కైలాస యాత్ర, భజన కార్యక్రమాలు చేపట్టేందుకు రాజస్థాన్ లోని టాంక్ టౌన్ లో ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాలను కూడ అక్బర్ ఖాన్ ఏర్పాటు చేశాడు. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు కష్టం అనిపించినా శివుడ్ని తల్చుకుంటానని, వెంటనే కష్టాలు అదృశ్యమౌతాయని ఖాన్ చెప్తున్నాడు. పరమశివుడ్ని ప్రార్థించిన తర్వాతే తన జీవితంలో ఆనందం వెలుగు చూసిందని వెల్లడించాడు. ఓమ్ విహార్ కాలనీలోని వంద చదరపు మీటర్ల స్థలంలో భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం నిర్మించిన ఖాన్...ఆలయంలో పార్వతీ పరమేశ్వరులతోపాటు.. వినాయకుడు, కుమారస్వామి ప్రతిమలను కూడ స్థాపించాడు. నన్ను భక్తుడుగా మార్చుకొని, నా కష్టాలను తీర్చిన పరమేశ్వరుడికి.. చంద్రుడికో నూలు పోగులా ఆలయ నిర్మాణం చేపట్టి... నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఖాన్ చెప్తున్నాడు. ఎవరివద్దా ఎటువంటి విరాళాలు, ఆర్థిక సాయం సేకరించకుండానే గుడి నిర్మాణం చేపట్టానని, ఇప్పటి వరకూ ఓమ్ విహార్ కాలనీలో ఆలయం లేకపోవడంతో ఇక్కడ నిర్మించానని చెప్తున్నాడు. అయితే ఆలయ నిర్మాణ విషయంలో సమాజంనుంచీ, స్వంత కమ్యూనిటీ నుంచి కూడ ఎటువంటి అభ్యంతరాలు ఎదుర్కోలేదని అక్బర్ ఖాన్ చెప్తున్నాడు. అల్లా అని పిలిచినా, రామ్ అన్నా ఒక్కటేనని, ఏ మతస్థులైనా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అవసరమన్న స్పష్టమైన సందేశాన్ని ఆలయ నిర్మాణంతో ప్రజలకు ఇవ్వాలనుకున్నానని ఖాన్ తెలిపాడు. ఈ నూతన శివాలయం ఏప్రిల్ 30న ప్రారంభమై భక్తులకు అందుబాటులోకి వస్తుందని అక్బర్ వెల్లడించాడు. -
స్వామివారి ఆలయానికి క్యూ కట్టిన ముస్లింలు
కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం కడప నగరంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని... ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని ఈ సందర్భంగా ముస్లిం మహిళలు తెలిపారు. కాగా, ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది అస్థానం నిర్వహించారు. -
స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి..
చంద్రగిరి: ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు మంగళవారం రాత్రి స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సింగపూర్ ప్రతినిధులకు రేణిగుంట విమానాశ్రయంలో వీడ్కోలు పలికి రాత్రి 10 గంటల ప్రాంతంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. తెలుగుతమ్ముళ్లు బాణసంచా పేల్చి.. పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. బుధవారం చంద్రబాబునాయుడు నారావారిపల్లెలోనే సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు. వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడానికి ఏడెకరాల స్థలంలో భారీ స్టేజిని ఏర్పాటు చేశారు. -
విద్యార్థుల జీవన ప్రయాణం
హరీశ్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, స్వప్న, కావేరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం - ‘టెన్త్‌లో లక్.. ఇంటర్లో కిక్.. బి.టెక్‌లో...’. మంచి వెంకట్ దర్శకుడు. సురేందర్ యాదవ్ సమర్పకుడు. జె.ఎస్. రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. టెన్త్ నుంచి బీటెక్ వరకూ విద్యార్థుల పయనం ఎలా ఉంటోంది? వారి నిర్ణయాలు భవిష్యత్తుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అనీ, సందేశం, వినోదం మిళితమైన సినిమా ఇదనీ దర్శకుడు చెప్పారు. -
బ్రేక్‌ఫాస్ట్ షో : ఈ దృశ్యాలు శ్రీవారివే(నా)!!
-
ఈ దృశ్యాలు.. తిరుమల శ్రీవారివే(నా)?!
-
దైవం ఇచ్చిన బహుమానం
సువార్త బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. - సామెతలు 22:6 ఈ ప్రపంచంలో కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే... అది పసివాళ్ల మనసే అని చెప్పాలి. కానీ ఆ నిష్కల్మషత్వం ఎప్పటి వరకు ఉంటుంది! ఈ లోకం గురించి తెలుసుకునే వరకూ ఉంటుంది. లోకాశలకు లోబడే వయసు రానంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వారి బాట వేరవుతుంది. దేవుడి నుంచి దూరమవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వారిలో మంచి అనేది చిన్నతనంలోనే పెరగాలి. అలా పెరిగేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువు. వారిని సరైన దారిలో పెంచాల్సిన బాధ్యత మీదే అని పదే పదే హెచ్చరించాడు. పైన చెప్పుకున్న వాక్యమే అందుకు నిదర్శనం. అంతేకాక... ‘‘తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి’’ అన్నాడు ప్రభువు ఎఫెసీ 6:4లో. ఈ ఒక్క మాట చాలు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి. కోపం మనిషికి శత్రువు. అది మనిషిని విచక్షణా రహితుణ్ని చేస్తుంది. తప్పులు చేయిస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండటం అన్నది చిన్ననాటి నుంచే జరగాలి. కోపమనే విత్తును పిల్లల మనసుల్లో నాటకుండా ఉండాలి. దేవుడి బోధలను, ప్రవచనాలు వివరించి... వాటిని అనుసరించి నడచుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. నిజానికి పిల్లలు ఎలా ఉండాలి అన్నదానికి అత్యంత గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తే. తన తండ్రియైన యెహోవా దేవుని ఆజ్ఞ మేరకు క్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఈ నేలమీద స్థాపించాడు. తన తండ్రి ఆదేశించిన విధంగా శిలువ మరణం పొందాడు. ఓ గొప్ప కొడుక్కి అసలు సిసలు ఉదాహరణ క్రీస్తు. మరి మనకొద్దా అలాంటి గొప్ప బిడ్డలు! గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం (కీర్తనలు 127:3). ఆయన ఇచ్చిన బహుమానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఆయన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి పిల్లల నడవడికను కనిపెట్టాలి. నడవాల్సిన తోవను చూపించాలి. చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించాలి. - జాయ్స్ మేయర్ -
కోటీశ్వర గణపతి...
అగజానన పద్మార్కమ్ గజాననమహర్నిశమ్ అనేకదం తం భక్తానామ్ ఏకదంతముపాస్మహే ॥ జిఎస్బి సేవా మండలి వినాయకుడు విలక్షణుడు. ఆయన బంగారు మేని చాయ వాడు. అంతేనా ఆయన ఒళ్లంతా బంగారమే. అందుకే ఈయన అత్యంత సంపన్నుడు. 80 కిలోల బంగారం, 450 కిలోల వెండితో మెరిసిపోయే స్వామి ఆభరణాలలో... నాలుగు చేతులు, భుజాలు, చెవులు, రెండు కాళ్లు, సింహాసనం, తిలకం, జంధ్యం, శంఖం తదితరాలు ఉంటాయి. ప్రభావళి (మకర్), మూషికం, వినాయకుని నైవేద్యం సమర్పించే సామాగ్రి వంటివన్నీ వెండితో రూపొందినవి. ఈ సారి వజ్రోత్సవాల కారణంగా ఏకదంతుడికి... మరో మూడు కిలోల బంగారం, అయిదు కిలోల వెండితో ప్రత్యేకమైన వైజయంతిమాల (హారం) రూపొందించారు. ఈ హారాన్ని కర్నాటకలోని ఉడిపి ప్రాంతంలోని స్వర్ణకారులు తయారుచేశారు. ఈ హారంతో పాటు కెంపులు, పచ్చలు పొదిగిన ఆభరణాలు వినాయకుని కోసం ప్రత్యేకంగా చేయించారు. కేవలం అయిదు రోజులు మాత్రమే కొలువుండే ఈ వినాయకుడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కాపాడే స్వామికి కాపలా వినాయక చవితి వస్తోందంటే ఎక్కడ చూసినా నెల రోజుల ముందు నుంచే సంబరాలు ప్రారంభమవుతాయి... అయితే ప్రత్యేకంగా ముంబైలో దశాబ్దాలుగా వేలాది మండళ్లు ఇక్కడ వినాయకుడికి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో దేశంలోనే అత్యంత సంపన్నమైనది... ముంబై కింగ్స్ సర్కిల్ ప్రాంతంలోని ‘గౌడ సారస్వత్ బ్రాహ్మణ్ (జిఎస్బి) సేవా మండలి’. అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మండలి వినాయకుడు అత్యంత శ్రీమంతుడు. గత కొన్ని సంవత్సరాలుగా గణేశ విగ్రహం ఎత్తును 12 అడుగులకు మించనీయకుండా జాగ్రత్తపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ మండలి. ‘‘ఈసారి వజ్రోత్సవాలు కావడంతో మా జిఎస్బి సేవా మండలి వినాయకుని ఉత్సవాలకు మరింత ప్రాముఖ్యత ఇస్తున్నాం’’ అంటున్నారు ఈ కమిటీ ట్రస్టీ సతీశ్ నాయక్. భక్తులను కంటికి రెప్పలా కాపాడే వినాయకుని ఆభరణాలను కాపాడటానికి ఆ భక్తులే శ్రద్ధ తీసుకుంటారు. శ్రీమంతుడికి బీమా... అత్యంత సంపన్నుడైన ఇక్కడి వినాయకుడికి ఈ మండలివారు 258.90 కోట్ల రూపాయలకు బీమా చేశారు. ఈ వినాయకుని ఉత్సవాల్లో ఒక్క రోజు కోసం సుమారు రూ.51.7 కోట్లు బీమా చేశారు. ఈ బీమా... ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, అర్చకులు, సిబ్బందితో పాటు విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు... మొదలైన వాటి మీద చేయడం విశేషం. అగ్ని ప్రమాదం, ఉగ్రవాదుల దాడులు, అల్లర్లు ఇలా ఆరు రకాల విపత్తులకు ఈ బీమా వర్తిస్తుంది. వినాయక చవితిని పురస్కరించుకొని మొదటి రోజే ఈ బీమా ప్రారంభం అవుతోంది. ఈ విగ్రహానికి మొదటి రోజే బంగారు ఆభరణాలతో ముస్తాబు చేస్తారు. నిమజ్జనకు కొన్ని గంటల ముందు విగ్రహానికి అలంకరించిన బంగారు ఆభరణాలను తొలగించి వాటిని జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో భద్రపర్చే వరకు బీమా కొనసాగుతుంది. భద్రతకు పెద్ద పీట... వినాయకుడిని దర్శించుకోవడం కోసం అయిదు ద్వారాలు (గేట్లు) ఏర్పాటయ్యాయి. ముఖదర్శనం కోసం సుమారు ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన స్కై వాక్‌పై భక్తులు వినాయకుని ముఖదర్శనం చేసుకుని తరిస్తారు. - గుండారపు శ్రీనివాస్ ఫొటోలు: పిట్ల రాము, సాక్షి ముంబై -
ఆయన నిన్ను ఎన్నడు విడువడు!
సువార్త నీ దేవుడనైన యెహోవానగు నేను - భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. - యెషయా 41:13 బిడ్డ పడిపోకుండా తండ్రి చేయి పట్టుకుంటాడు. నడక నేర్పిస్తాడు. దారి చూపిస్తాడు. ప్రభువు కూడా అంతే. ఆయన ఎప్పుడూ మన చేయి పట్టుకునే ఉంటాడు. మనం నడవాల్సిన తోవను మనకు చూపిస్తాడు. దారి తప్పిన ప్రతిసారీ దారిలోకి తీసుకొస్తాడు. చేరాల్సిన గమ్యానికి చేర్చుతాడు. నాటి ఇశ్రాయేలీయుల నుంచి నేటి మన వరకు ఆయన అదే చేశాడు. ఎన్నడూ మాట తప్పలేదు. నేను నీ చేయిపట్టి నడిపిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటూ ఇశ్రాయేలీయులకు మాటిచ్చాడు ప్రభువు. అన్న విధంగానే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు. కష్టమన్నదే ఎరుగని దేశానికి వారిని నడిపించాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ వారు వెళ్తుంటే కాళ్లకు సత్తువనిచ్చాడు. అడవుల గుండా నడుస్తున్నప్పుడు క్రూరమృగమైనను, విష కీటకమైనను వారి దరికి రాకుండా అడ్డుకున్నాడు. సముద్రాన్ని చీల్చాడు. మన్నాను కురిపించి కడుపులు నింపాడు. కడదాకా వారికి అండగా ఉన్నాడు. కావలి కాశాడు. అదే ఆయన ప్రేమ. తన బిడ్డల పట్ల ఆయనకున్న మమత. అదే ప్రేమ, అదే మమత మన పట్ల కూడా కురిపిస్తున్నాడు తండ్రి. లోకం పాప పంకిలమైపోయిందని ఆయనకు తెలుసు. మనం కట్టడులు మీరుతున్నామని కూడా ఆయనకు తెలుసు. ఆదర్శంగా ఉండాల్సిన తన బిడ్డలు తనను విస్మరించినా... ఆయన మాత్రం మనలను విస్మరించడు. అందుకే దావీదు మహారాజు... విడువని, యెడబాయని దేవుడవు అంటూ ప్రభువును వేనోళ్ల స్తుతించాడు. మరి అంత చేస్తున్న దేవునికి మనమేం చేస్తున్నాం? ఆయన చూపించే ప్రేమకి మారుగా మనమేమి ఇస్తున్నాం? ఏమీ లేదు. కనీసం ఆయన చూపే ప్రేమానురాగాలకు కృతజ్ఞత కూడా చూపడం లేదు మనం. ఆయన ఏం కోరుకున్నాడు? కానుకలు అడగలేదు. అభిషేకాలు కోరలేదు. కల్మషాన్ని వదిలేయమన్నాడు. కారుణ్యతను ప్రదర్శించమన్నాడు. పొరుగువాడిని ప్రేమించమన్నాడు. తనకు మాదిరిగా నడుచుకొమ్మన్నాడు. క్షమించమన్నాడు. సహించమన్నాడు. అది కూడా చేయలేము మనం. విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన మాటలను పెడచెవిన పెట్టి, విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూనే ఉంటాం. అందుకే మనం ఆయన ప్రేమను పొందడానికి అనర్హులం. కానీ ఆయన ఎన్నడూ అలా అనుకోడు. సణగడు. ఆగ్రహించడు. మనల్ని దూరంగా నెట్టేయడు. మన మొరలు ఆలకించకుండా తన చెవులను కప్పుకోడు. మన అగచాట్లు చూడకుండా కన్నులు మూసుకోడు. నా దారిలో నడవని మీ దారికి నేను రానే రానంటూ ఒంటరిగా వదిలేయడు. ఏ ఒక్క సమయంలోనూ మన చేతిని విడిచి పెట్టడు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. దారి తప్పిపోతున్న తన కుమారులను దారిలో పెట్టేవరకూ విడువడు. భీతిల్లిన మనసుల్లో ధైర్యం నిండేవరకూ విడువడు. తన బిడ్డల కన్నుల్లో కన్నీళ్లు ఇంకేవరకూ విడిచిపెట్టడు. కళ్లు తుడుస్తాడు. వెన్ను తడతాడు. అవును... ఆయన మన చేయి విడువడు. ఎన్నడూ విడువడు! - జాయ్స్ మేయర్ -
ఆఖరి అవకాశం!
మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో భారత్ 0-4తో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత సొంత గడ్డపై కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఒకేసారి ఆ రెండింటికీ ప్రతీకారం తీర్చుకుంటామనే పట్టుదల ఈ సిరీస్‌కు ముందు భారత యువ జట్టులో కనిపించింది. ఇంగ్లండ్ పేలవమైన ఫామ్‌లో ఉండటం అందుకు కారణమైంది. ఇక లార్డ్స్‌లో విజయం సాధించగానే భారత్ తిరుగులేని స్థితిలో నిలిచినట్లు అనిపించింది. అయితే... ఒక్కసారిగా ధోని సేన సుడి మారిపోయింది! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏదీ కలిసి రాలేదు. దాంతో వరుసగా రెండు టెస్టుల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఫలితంగా మన జట్టు ఆత్మవిశ్వాసం అడుగంటితే... ప్రత్యర్థి మాత్రం అమితోత్సాహంతో ఉంది. ఇకపై సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేదు. కనీసం సమం చేసినా భారత్ పరువు నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సిరీస్ కోల్పోలేదన్న సంతృప్తి దక్కుతుంది. అలా జరగాలంటే ఇప్పుడు ఆఖరి అవకాశం జట్టు ముంగిట నిలిచింది. అయితే ఏ ఒక్కరో కాకుండా జట్టంతా సమష్టిగా రాణిస్తేనే అది సాధ్యమవుతుంది. ►ధోని సేన సత్తాకు పరీక్ష ►తీవ్ర ఒత్తిడిలో భారత్ ►సిరీస్‌పై ఇంగ్లండ్ గురి నేటినుంచి ఆఖరి టెస్టు మ.గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం లండన్: ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టెస్టు సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత జట్టు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ ధోని బృందం నేటినుంచి ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు సమాయాత్తమైంది. సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలన్నా... ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం తప్పనిసరి. మరోవైపు మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకోగలిగినా సిరీస్‌ను గెలుచుకునే స్థితిలో ఇంగ్లండ్ ఉంది. ఆటగాళ్ల ఫామ్‌తో పాటు తుది జట్టు కూర్పు వరకు టీమిండియా సమస్యల్లో ఉండగా... కుక్ సేన మాత్రం వరుస విజయాలు ఇచ్చిన జోరుతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇషాంత్ ఖాయం... లార్డ్స్‌లో సంచలన బౌలింగ్ తర్వాత గాయంతో రెండు టెస్టులకు దూరమైన ఇషాంత్ ఈ టెస్టు బరిలోకి దిగనున్నాడు. మేనేజ్మెంట్ ఈ విషయాన్ని నిర్ధారించింది. రెండు రోజుల పాటు అతను ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. పంకజ్ సింగ్ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. ఇషాంత్ వస్తే భువనేశ్వర్, ఆరోన్లతో కలిసి జట్టు పేస్ బౌలింగ్ పదునెక్కుతుంది. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో ఆడనున్నట్లు ధోని ప్రకటించాడు. ముగ్గురు పేసర్లతో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటాడు. అయితే ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా స్థానంలో స్టువర్ట్ బిన్నీని తీసుకురావచ్చని అంచనా. ప్రాక్టీస్ సెషన్లో బిన్నీ సుదీర్ఘంగా సాధన చేయడం కూడా దీనికి సంకేతంగా చెప్పవచ్చు. మరోవైపు గంభీర్, ధావన్‌లలో ఎవరిని తీసుకోవాలనే విషయంపైనే మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. మొదటి మూడు టెస్టులు ధావన్ ఆడాడు కాబట్టి... గంభీర్‌కే మరో చాన్స్ ఇవ్వవచ్చని వినిపిస్తోంది. లార్డ్స్‌లో ఆకట్టుకున్న రహానే తర్వాతి రెండు టెస్టుల్లో రాణించలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అన్నింటికి మించి పుజారా, కోహ్లిల ప్రదర్శనపైనే జట్టు విజయావకాశాలు ఉన్నాయనేది స్పష్టం. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే గౌరవప్రదంగా సిరీస్ ముగించవచ్చు. రాబ్సన్ మినహా... మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది. జట్టులోని ఆటగాళ్లలో ఓపెనర్ రాబ్సన్ మినహా అందరూ ఏదో ఒక దశలో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మూడో టెస్టులో రాణించినా... కుక్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే ఈ సారైనా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో జట్టు టాప్ స్కోరర్‌గా ఉన్న గ్యారీ బ్యాలెన్స్, ఫామ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మన్ జో రూట్ బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. సీనియర్ బెల్‌తో పాటు కీపర్ బట్లర్ బ్యాటింగ్ కూడా కీలకం కానుంది. తన స్పిన్‌తో భారత బ్యాటింగ్ పనిపట్టిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. ఈసారి అతను రాణిస్తాడని ఇంగ్లండ్ ఆశిస్తోంది. రాబ్సన్ విఫలమవుతున్నా... విజయాల జట్టును మార్చే ఆలోచన ఇంగ్లండ్ మేనేజ్మెంట్కు లేదు. గాయం నుంచి కోలుకున్న బ్రాడ్ మ్యాచ్ ఆడనున్నాడు. ముఖానికి ప్లాస్టర్ ఉన్నా... అతను ఎలాంటి అసౌకర్యం లేకుండా గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇక టీమిండియాపై మైదానంలోనూ, బయటా సమస్యగా మారిన అండర్సన్‌పై ఆ జట్టు ఎంతో ఆధారపడుతోంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, గంభీర్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, ఆరోన్, ఇషాంత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బ్యాలెన్స్, ఇయాన్ బెల్, రూట్, మొయిన్ అలీ, బట్లర్, వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జోర్డాన్. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో పాటు అండర్సన్కూ మంచి రికార్డు లేకపోవడం భారత్‌లో ఉత్సాహం నింపే అంశం. గత నాలుగేళ్లలో ఓవల్‌లో ఇంగ్లండ్ ఒక్కటే టెస్టు నెగ్గింది. 2010 నుంచి ఆ జట్టుకు ఇతర వేదికల్లో ఎక్కడా ఇలాంటి పేలవ రికార్డు లేదు. ఈ మైదానంలో అండర్సన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్లు తీయలేకపోయాడు. ఇక్కడ గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అతను ఒకేసారి రెండుకు మించి వికెట్లు తీయగలిగాడు. మరోవైపు ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే భారత్‌కు ఓవల్‌లోనే కాస్త మెరుగైన రికార్డు ఉంది. పైగా ప్రపంచంలోని ఏ గ్రౌండ్లో కూడా భారత్ ఇన్ని (7) మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించలేదు. గత ఆరు టెస్టుల్లో ఐదింటిలో ఏదో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ కనీసం 400 పరుగులు దాటగలిగింది. పిచ్ ఓవల్ పిచ్ గతంలో స్పిన్‌కు బాగా అనుకూలించినా ఇటీవల ఆ పరిస్థితి లేదు. అయితే నాలుగో టెస్టుతో పోలిస్తే ఇక్కడ వేగం, బౌన్స్ తక్కువ. భారత జట్టుకు ఇది అనుకూలాంశమనే చెప్పాలి. వాతావరణం గురువారం ఒక్కసారిగా వర్షం రావడంతో భారత్ ప్రాక్టీస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. టెస్టు జరిగే సమయంలో కూడా వర్షానికి అవకాశం ఉన్నా... మ్యాచ్‌కు అంతరాయం కలగకపోవచ్చు. -
నిండుకుండ వంటిది నిరాడంబరత
హైందవం నిరాడంబరత అనేది దేహ బాహ్య స్వరూపానికి సంబంధించింది కాదు. అది అంతర్గతమైన లక్షణం. నిరాడంబరత అంటే ఏమీ తెలియని ఒక నిర్లిప్త స్థితి కాదు, అన్నీ తెలిసిన సంపూర్ణ స్థితి. శివుడు, ఆంజనేయుడు, షిర్డీసాయిల నిరాడంబర అభివ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మహాదేవుడు: నివాసం శ్మశానం. కంఠహారం సర్పం. ఆయుధం త్రిశూలం. ఆసనం పులిచర్మం. ఇదీ శివుడి నిరాడంబర బాహ్యరూపం. కానీ, దీని అంతరార్థం వేరు. శివుడు ధరించిన త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. శరీరంపై సర్పాలు జీవాత్మలు. భస్మం పరిశుద్ధతకు ప్రతీక. ఆసనమైన పులిచర్మం కోరికలను త్యజించమనే సూచిక. వినయ హనుమ: అతి బలవంతుడు హనుమంతుడి జీవన విధానం కూడా ఎంతో నిరాడంబరమైంది. ఎంత శక్తి సంపన్నుడైనా ఎంతో నిరాడంబరంగా ఉన్నాడు. సుగ్రీవుడు, జాంబవంతుల ముందు కూడా వినయంతోనే మెలిగాడు. ‘జై హనుమాన్’ అని ఎక్కడా తనకు జేజేలు కొట్టించుకోలేదు. ‘జై శ్రీరామ్’ అంటూ తన నిరాడంబరతను ప్రకటించుకున్నాడు. బాబా ప్రేమ తత్వం: షిర్డీ సాయిబాబా అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. ఒక జుబ్బా, కఫనీ, సట్కా, తంబరి మాత్రమే ఆయన ఆస్తులు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా తిరిగి వారికే అత్యంత ప్రేమగా పంచేసేవారు. బాబాని దర్శించుకునేందుకు నిత్యం వందలమంది భక్తులు వచ్చేవారు. అయినా, పనులన్నీ సొంతంగానే చేసుకునేవారు. భిక్షాటన చేసి భోజనం చేసేవారు. లెండి బావి నుంచి స్వయంగా నీళ్లు తోడి మొక్కలను పెంచేవారు. ఎక్కడికి ప్రయాణమైనా కాలినడకే తప్ప, ఎలాంటి వాహనాలనూ ఉపయోగించలేదు. ఫకీరులా కనిపించే బాబాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కరతలామలకం. తన ముందు నిలబడ్డవాడు భక్తుడా మూర్ఖుడా అనే తేడా లేకుండా అందరికీ ప్రేమతత్వాన్ని పంచారు బాబా. సాయి నిరాడంబర జీవన సందేశం కూడా అదే. నిండుకుండ తొణకదు అంటారు. నిరాడంబరత కూడా నిండు కుండలాంటిదే. విజ్ఞానమూ, బలమూ పెరుగుతున్న కొద్దీ మనిషి నిండుకుండలా మారిపోవాలి. నిరాడంబరత అలవర్చుకోవాలి. - సురేష్‌బాబా -
పగకు ప్రతిఫలంగా...ప్రేమను పంచండి
సువార్త ‘‘నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన యెడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. (సామెతలు 25:21,22) కోపాన్ని జయించినవాడు ఉత్తముడని దేవుడు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. ఈ లోకంలో జరిగే ఎన్నో అనర్థాలకు మూలం కోపమే. దూషించుకోవడం, కొట్లాడుకోవడం, దాడి చేయడం, హతమార్చడం వంటి ఎన్నో నేరాలకు పురికొల్పేది కోపమే. మితిమీరిన కోపం పగగా మారుతుంది. అవతలి వ్యక్తికి కీడు చేసేందుకు ప్రేరేపిస్తుంది. అది తప్పు అని చెబుతున్నాడు ప్రభువు. కోపాన్ని అణచుకోలేక తిట్టడం, పగబట్టి హాని చేయడం కాదు... అతడిని ఆదరించి, ప్రేమ చూపించడమే అతడికి తగిన శిక్ష అని చెబుతున్నాడు. మనలో చాలామంది చేసేదేమిటంటే... ఒక వ్యక్తిమీద కోపం వస్తే వారిని చూడటానికి కూడా ఇష్టపడం. పరుష పదజాలంతో మాట్లాడుతాం. కఠినంగా వ్యవహరిస్తాం. దాన్ని తాను ఏమాత్రం సమర్థించను అని చెప్పకనే చెబుతున్నాడు ప్రభువు. పగను సైతం ప్రేమతో సాధించమని సెలవిస్తున్నాడు. పగవాడికి అన్నం పెట్టమంటున్నాడు. దాహమేస్తే మంచినీరు ఇమ్మంటున్నాడు. అలా చేయడం వల్ల అతడి తలమీద నిప్పులు కుప్పగా పోస్తావని ఆయన అన్నమాటకు అర్థం... నీ మంచితనంతో అతడిని సిగ్గుపరచేలా చేస్తావు అని. నిజమే కదా! చెడు చేయాలని చూస్తున్న వ్యక్తికి నువ్వు ప్రేమ చూపిస్తే, అతడిలో ఆ క్రూరమైన తలంపు నశించిపోతుంది. తిరిగి మంచే చేయాలనిపిస్తుంది. క్రైస్తవుడిగా పగవాడిని ప్రేమతో మార్చు తప్ప పగ సాధించవద్దు అన్నదే ఈ వాక్యం ద్వారా దేవుడిస్తున్న సందేశం. అలా చేస్తే తన దీవెనలను మెండుగా కుమ్మరిస్తానని ఆయన మాట ఇస్తున్నాడు కూడా! కాబట్టి పగను వదలాలి. ప్రేమను పంచాలి. ఆవేశాన్ని సైతం ఆప్యాయతగా మార్చగల శక్తి దానికి మాత్రమే ఉంది మరి! - జాయ్స్ మేయర్ -
ఓం వరుణాయ నమః
సందర్భం వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి వరుణుడి కరుణే కారణం. భగవంతుడు చేసే సృష్టిని నిశితంగా వీక్షిస్తాడు వరుణుడు. న్యాయానికీ, నిజాయితీకి ఈయన మూల స్తంభం. పడమటి దిక్కుకు అధిపతి. నాగులు ఈయన సేనలు. ఈయనకు దక్షిణాన యముడు, ఉత్తరాన కుబేరుడు ఉంటారు. ఈయన వాహనం మొసలి. అలాగే వరుణుడికి ఒక పక్క వాయవ్యం, ఒకపక్క నైఋతి మూలలు ఉంటాయి. వరుణుడు... కోపం, దయ రెండురకాల స్వభావాలను ప్రదర్శించగలడు. ఆకాశంలో బంగారు భవంతిలో కూర్చుని... పాముతో తయారయిన ‘ఉచ్చు’ లేదా ‘పాశం’ ధరించి దర్శనమిస్తాడో దేవుడు. ఆయనే వరుణుడు. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. అంతేకాక పాతాళానికి, న్యాయానికి, స్వర్గానికి, పృథివికి కూడా అధిదేవతగా పూజించారు. సూర్యుని లక్షణాలన్నీ వరుణుడిలో ఉన్నాయి. వరుణుడు ఆదిత్యులకు అధిపతిగా ఉన్నాడు. అయినప్పటికీ సూర్యుడితో విభేదించి రాత్రితో స్నేహం చేశాడు. సృష్టిని అభివృద్ధి చేసే అంశాలు వరుణుడిలో అధికం. న్యాయాధిపతి, శాంతికాముకుడు వరుణుడు ఆకాశరాజు, ఆకాశంలో ఉన్న చీకటి అనే సగ భాగానికి, మహాసముద్రాలకు అంటే రసాతలానికి అధిపతి. మిత్రుడు (సూర్యుడు) ఋతానికి అంటే న్యాయానికి, ధర్మానికి సర్వాధికారి. వరుణుడు, మిత్రుడు ఇద్దరూ... ప్రమాణాలతో కూడిన సాంఘిక కార్యకలాపాలకు దేవతలు. అందుకే వీరిద్దరినీ కలిపి ‘మిత్రా - వరుణ’ అన్నారు. ఋగ్వేదం వరుణుడిని ఇంద్రుడితో కలిపి చెబుతూ, ఇంద్రా - వరుణ (ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రపంచంలో శాంతిభద్రతలను చేకూరుస్తారు) అని వర్ణించింది. నీటిలో మునిగిపోయినవారిని సంరక్షించి, వారికి అమరత్వాన్ని ప్రసాదించేవానిగా వరుణుడు పూజలందుకున్నాడు. సర్వజ్ఞుడు, సర్వాధికారి తప్పు పనులు చేసేవారిని వరుణుడు ‘వల’ వేసి పట్టుకుంటాడని, ఆకాశంలో ఉండే నక్షత్రాలు వరుణుడికి ఉండే వెయ్యి కళ్లనీ, వీటి సహాయంతో వరుణుడు నిరంతరం మనుషుల ప్రతి కదలికను రహస్యంగా గమనిస్తూ ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. సోముడు ఇంద్రుడికి అతి దగ్గర వాడు అయినప్పటికీ వరుణుడు తనకున్న సర్వజ్ఞత కారణంగా సర్వాధికారి అయ్యాడు. ద్విజులు సాయంసంధ్యలో చేసే సంధ్యావందనంలో వరుణుడిని ఉద్దేశించి, తాము చేసిన తప్పులను క్షమించమని కోరుకుంటారు. వానలు కురిపించమని ప్రజలందరూ యాగాలు, ప్రార్థనలు చేస్తారు. రాముడు- వరుణుడు సముద్రాన్ని దాటి లంకను చేరడం కోసం రాముడు మూడు రోజులపాటు వరుణుడిని కఠోరదీక్షతో ధ్యానం చేశాడు. వరుణుడు కనికరించకపోవడంతో, నాలుగవరోజు బాణం సంధించాడు రాముడు. వెంటనే వరుణుడు ప్రత్యక్షమై రాముడికి నమస్కరించి, బ్రహ్మాస్త్రాన్ని సముద్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగించవద్దని, సముద్రగర్భంలో ఉన్న రాక్షసశక్తులను సంహరించడానికి ఉపయోగించమని ప్రార్థించాడు. వరుణుడి ప్రార్థనను మన్నించాడు రాముడు. ప్రతిగా రామదండు సముద్రాన్ని దాటడానికి వీలుగా నిశ్చ లంగా ఉంటానని వరుణుడు ప్రమాణం చేశాడు. సంతాన, ఆయుష్కారకుడిగా... హరిశ్చంద్రుడు సంతానప్రాప్తి కోసం ఏం చేయాలో చెప్పమని వశిష్ఠుని అర్థించాడు. వరుణుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహిస్తాడని సూచించాడు వశిష్ఠుడు. హరిశ్చంద్రుడు వరుణుడిని ప్రార్థించగా, ఆయన ప్రత్యక్షమై, ‘‘నువ్వు వరుణయాగం చేసి, నీకు జన్మించిన పిల్లవాడిని బలి ఇస్తానని మాట ఇస్తే సంతానం ప్రసాదిస్తాను’’ అన్నాడు. సత్యవాక్కును పరీక్షించడమే వరుణుడి ఉద్దేశం. హరిశ్చంద్రుడు అంగీకరించాడు. హరిశ్చంద్రుడి భార్య శైబ్యకు రోహితుడు జన్మించాడు. అర్ధాయుష్కుడిగా పుట్టిన ఆ పిల్లవాడు విశ్వామిత్రుడి సలహా మేరకు వరుణ మంత్రం జపించాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించిన వరుణుడు ఆ పిల్లవాడికి పూర్ణాయుష్షు ప్రసాదించాడు. అందుకే వరుణ మంత్రం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయని చెబుతారు. వరుణుడి కరుణ ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. - రోహిణి వరుణుడు - యురేనస్ జార్జెస్ డుమెజిల్ అనే శాస్త్రవేత్త భారతీయ వరుణుడికి, గ్రీకు యురేనస్‌కి ఉన్న పోలికలు వివరించాడు. రెండు పేర్లను పరిశీలిస్తే ఉరేనస్, వరుణ అనే ఉచ్చారణ ఒకేలా కనిపిస్తుంది. రెండింటికీ మూలం అయిన ఉరు అనే పదానికి కట్టుబడి ఉండటం అని అర్థం. యురేనస్ చీకటిగా ఉండే ఆకాశంతో ముడిపడి ఉంటాడు. యురేనస్ అంటే ఆకా శం అని అర్థం. వరుణుడు ఆకాశానికి, పాలసముద్రానికి కూడా అధిదేవత. లక్షీ్ష్మదేవి ఇందులో నుంచే పుట్టిందని భాగవతం చెబుతోంది. అందువల్ల ఈయన లక్ష్మీదేవికి తండ్రి అని గ్రీకు పురాణాలు చెబుతున్నాయి. -
నిత్య ప్రార్థనేనిత్య జీవము
సువార్త దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీ 4:6) ప్రార్థన... దేవుడిని, భక్తుడిని అనుసంధానం చేసే సాధనం. మనల్ని ప్రభువుకు దగ్గర చేసే అతి శక్తిమంతమైన ఉపకరణం. ప్రభువు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనం ప్రభువుతో ప్రార్థన ద్వారా మాట్లాడుతాం. ప్రార్థన లేని జీవితం అద్భుతాలను చూడలేదు. ప్రార్థన లేని జీవితం క్రైస్తవుని జీవితానికి సాఫల్యతనివ్వదు. అందుకే యెడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ప్రార్థన ఒక బలం. ప్రార్థన చెడును జయించే ఓ సాధనం. ప్రార్థన ఓ ధైర్యం. ప్రార్థన మనల్ని పరలోకానికి చేర్చే ఒక మార్గం. మనిషికి ఎన్నో చింతలు. అది ఉంది, ఇది లేదు, ఇంకేదో కావాలి అంటూ ఆలోచనలు. అయితే దేని గురించీ అంత చింతించాల్సిన పని లేదని సూటిగా చెబుతున్నాడు ప్రభువు పై వాక్యంలో. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? నాకిది కావాలి ఇవ్వు ‘తండ్రీ అని అడిగేస్తే సరిపోతుందా? లేదు. నిండు విశ్వాసంతో, పూర్ణమనసుతో, కృతజ్ఞత నిండిన ప్రార్థన చేయాలి. విన్నవించుకోవాలి. మనకు సర్వస్వాన్నీ అనుగ్రహించువాడు ప్రభువే. ఆయనే అన్నాడు ‘అడుగుడి ఇవ్వబడును’ అని. తండ్రీ నా శక్తి చాలదు, నాకిది అనుగ్రహించు’ అని వేడుకుంటే ఆయన తప్పక మనకు దానిని ఇస్తాడు. విశ్వాసంతో నిండిన ప్రార్థనను, నమ్మకంతో కూడా విన్నపాన్ని ఆయన ఎప్పుడూ తోసిపుచ్చడు. లోక సంబంధిత విషయాల కొరకు చింతించనవసరం లేదు. ఆయన అవన్నీ చూసుకుంటాడు. ఓ క్రైస్తవుడిగా దైవ సంబంధిత చింతనను మాత్రమే కలిగివుండాలి. ప్రార్థనాశక్తి ఎంతటిదో పలు సందర్భాల్లో రుజువు అయ్యింది. నమ్మకంతో ప్రార్థించినవారి రోగాలు నయమయ్యాయి. నమ్మకంతో ప్రార్థన చేసినవారి నుంచి దురాత్మలు దూరమయ్యాయి. యేసుక్రీస్తు సైతం ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. అంత గొప్ప ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రతిదినం దేవుడిని ప్రార్థిస్తున్నామా? ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో పడి ప్రార్థనను విస్మరిస్తున్నామా? ప్రతి క్రైస్తవుడూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ప్రార్థనకు మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నామో తరచి చూసుకోవాలి. నిత్యం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే... మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది. - జాయ్స్ మేయర్