
స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి..
చంద్రగిరి: ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు మంగళవారం రాత్రి స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సింగపూర్ ప్రతినిధులకు రేణిగుంట విమానాశ్రయంలో వీడ్కోలు పలికి రాత్రి 10 గంటల ప్రాంతంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. తెలుగుతమ్ముళ్లు బాణసంచా పేల్చి.. పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
బుధవారం చంద్రబాబునాయుడు నారావారిపల్లెలోనే సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు. వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడానికి ఏడెకరాల స్థలంలో భారీ స్టేజిని ఏర్పాటు చేశారు.