బెర్లిన్‌లో ‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. దీపావళికి కుంభాభిషేకం! | Sri Ganesha: Germany's Largest Hindu temple to open in Berlin | Sakshi
Sakshi News home page

Temple in Germany: బెర్లిన్‌లో గణేశుని ఆలయం.. దీపావళికి ప్రారంభం

Published Sat, Sep 9 2023 11:00 AM | Last Updated on Sat, Sep 9 2023 11:16 AM

Largest Temple in Germany Sri Ganesha  - Sakshi

యూరప్ దేశమైన జర్మనీలో 20 ఏళ్లపాటు సాగిన విశేష కృషి అనంతరం హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. రాజధాని బెర్లిన్‌లో నిర్మితమైన ఈ  గణేశ దేవాలయం 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి సాగించిన అవిశ్రాంత కృషి  ఫలితం. కాగా ఈ ఆలయంలో ఇంకా దేవుని విగ్రహం ప్రతిష్ఠితం కాలేదు. ఈ ఏడాది (2023)దీపావళి సందర్భంగా బ్రహ్మాండమైన పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

మీడియాతో మాట్లాడిన విల్వనాథన్ కృష్ణమూర్తి తాను 50 సంవత్సరాల క్రితం జర్మనీకి వచ్చానని తెలిపారు. ఆయన బెర్లిన్‌లో ఉంటున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేశారు. జర్మనీకి వచ్చినప్పటి నుండి అతని కల దేవాలయం నిర్మించడం. ఈ కల సాకారం అయ్యేందుకు 2004లో ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో బెర్లిన్ జిల్లా యంత్రాంగం ఆలయ నిర్మాణానికి హాసెన్‌హైడ్ పార్క్ వెలుపల ఒక ప్లాట్‌ను కేటాయించింది. అదిమొదలు విల్వనాథర్‌ ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించడం మొదలుపెట్టారు. 2007లోనే ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ 2010 వరకు కూడా ప్రారంభం కాలేదు. 

రుణాలు తీసుకువచ్చి ఆలయం నిర్మించడం తనకు ఇష్టం లేదని కృష్ణమూర్తి తెలిపారు. అందుకే ఆయన విరాళాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బెర్లిన్‌లో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని, దీంతో  విరాళాలు అందడం కూడా పెరిగిందని ఆయన తెలిపారు. బెర్లిన్‌లో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారని, వారంతా విరాళాలు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువత హృదయపూర్వకంగా విరాళాలు అందజేస్తున్నారన్నారు. రాబోయే దీపావళి సందర్భంగా 6 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు విల్వనాథన్ కృష్ణమూర్తి తెలిపారు. 
ఇది కూడా చదవండి: అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్‌ నుంచి భారత్‌కు..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement