BUILT
-
దీవినే నిర్మించకున్న జంట! ఏకంగా రూ. 16 కోట్లు..!
ఖాళీగా ఉన్న దీవుల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుంటారు. అదంత విశేషం కాదు. కెనడాకు చెందిన ఒక జంట తమ కోసం ఏకంగా దీవినే నిర్మించుకున్నారు. వాంకోవర్ పడమటి తీరంలో ఈ దీవిని నిర్మించుకోవడానికి వాళ్లు ఇరవై ఏడేళ్లు అహరహం శ్రమించారు. వేన్ ఆడమ్స్, కేథరీన్ కింగ్ అనే దంపతులు అన్నీ వదిలిపెట్టి 1992లో వాంకోవర్‌కు చేరువలోని జనసంచారం లేని తీరప్రాంతానికి వలస వచ్చేశారు. రెక్కల కష్టంతోనే అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇంటి పరిసరాల్లో పంటలు పండించుకోవడం, చేపల వేటతోనే స్వయంసమృద్ధి సాధించుకున్నారు. క్రమంగా మరికొన్ని కట్టడాలను నిర్మించుకుని, తమ పరిధిని విస్తరించుకున్నారు. తోటలను ఏర్పాటు చేసుకున్నారు. వినోదం కోసం ఆరుబయట నృత్యవేదికను కూడా నిర్మించుకున్నారు. సొంతంగా ఒక దీవిని నిర్మించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో, ఇరవై ఏడేళ్ల కిందట ఆ దిశగా పనులు ప్రారంభించారు. తుఫానుల్లో కొట్టుకొచ్చిన కలప దుంగలు, చేపల వేట కోసం ఉపయోగించే వలలు, తాళ్లు మాత్రమే ఉపయోగించి, నీటిపై తేలియాడే చక్కని ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కృత్రిమ దీవిలో నివాసమే కాకుండా, ఇందులోనే తమకు కావలసిన పంటలు పండించుకోవడానికి కూడా పూర్తి వసతులను ఏర్పాటు చేసుకున్నారు. తమదైన దీవిని తయారు చేసుకోవడానికి వారు దాదాపు ఒక మిలియన్ పౌండ్లు (రూ.10.32 కోట్లు) ఖర్చు చేశారు. ఈ దీవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్అంబానీ కూతురు మాత్రం కాదు!) -
బెర్లిన్‌లో ‘గణేశ్ మహరాజ్ కీ జై’.. దీపావళికి కుంభాభిషేకం!
యూరప్ దేశమైన జర్మనీలో 20 ఏళ్లపాటు సాగిన విశేష కృషి అనంతరం హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. రాజధాని బెర్లిన్‌లో నిర్మితమైన ఈ గణేశ దేవాలయం 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి సాగించిన అవిశ్రాంత కృషి ఫలితం. కాగా ఈ ఆలయంలో ఇంకా దేవుని విగ్రహం ప్రతిష్ఠితం కాలేదు. ఈ ఏడాది (2023)దీపావళి సందర్భంగా బ్రహ్మాండమైన పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మీడియాతో మాట్లాడిన విల్వనాథన్ కృష్ణమూర్తి తాను 50 సంవత్సరాల క్రితం జర్మనీకి వచ్చానని తెలిపారు. ఆయన బెర్లిన్‌లో ఉంటున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేశారు. జర్మనీకి వచ్చినప్పటి నుండి అతని కల దేవాలయం నిర్మించడం. ఈ కల సాకారం అయ్యేందుకు 2004లో ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో బెర్లిన్ జిల్లా యంత్రాంగం ఆలయ నిర్మాణానికి హాసెన్హైడ్ పార్క్ వెలుపల ఒక ప్లాట్‌ను కేటాయించింది. అదిమొదలు విల్వనాథర్ ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించడం మొదలుపెట్టారు. 2007లోనే ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ 2010 వరకు కూడా ప్రారంభం కాలేదు. రుణాలు తీసుకువచ్చి ఆలయం నిర్మించడం తనకు ఇష్టం లేదని కృష్ణమూర్తి తెలిపారు. అందుకే ఆయన విరాళాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బెర్లిన్‌లో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని, దీంతో విరాళాలు అందడం కూడా పెరిగిందని ఆయన తెలిపారు. బెర్లిన్‌లో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారని, వారంతా విరాళాలు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువత హృదయపూర్వకంగా విరాళాలు అందజేస్తున్నారన్నారు. రాబోయే దీపావళి సందర్భంగా 6 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు విల్వనాథన్ కృష్ణమూర్తి తెలిపారు. ఇది కూడా చదవండి: అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్‌కు.. Germany's largest #Hindutemple is set to open in Berlin in November 2023. Sri-Ganesha Hindu Temple will be located in the tallest high-rise building currently under construction in Berlin, known as the "Amazon Tower." Opening of the temple is expected to coincide with the… pic.twitter.com/qwkq5SQ7IH — Centre for Integrated and Holistic Studies (@cihs_india) September 4, 2023 -
అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..
అంగారక గ్రహంపై మానవుని ఆవాసానికి యోగ్యమైనదా? కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నీటి జాడలు ఉన్నాయా లేదా ఒక వేళ ఉండాల్సి వచ్చినా అనువుగా ఉంటుందా లేదా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనులు చేశారు. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు తాజగా ఆ గ్రహంపై ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ వెల్లడించారు. జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మార్స్‌పై కాలనీని 22 మంది వ్యోమగాములతో నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేలా ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ కూడా చెప్పారు. తాము ఎన్నో యేళ్లుగా చేస్తున్న అధ్యయనాల్లో.. మానవ స్థావరాన్ని నిర్మించడం చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య అని తేలిందన్నారు. వనరులు పరిమితంగా ఉన్నందునన ఈ గ్రహంపై ఆవాసం నిర్మించడం అనేది సవాలుతో కూడినది. అయితే అక్కడ ఎంతమంది వ్యోమోగాములు ఆవాసాలను నిర్మించగలరు, ఎంతమంది ఉండొచ్చు అనేదానిపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాల్లో దాదాపు 22 మంది వ్యోమగాములతో కాలనీ నిర్మించొచ్చని, అలాగే సుమారు 100 నుంచి 500 మంది దాక ఉండొచ్చని గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో వలసవాద సమస్య గానీ, మానవ వికృతి ప్రవర్తనకు సంబంధించిన సవాళ్లు గానీ ఎదరయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా హెచ్చరించారు. అంగారక గ్రహంపై ఏ ప్రాంతంలో కాలనీలు నిర్మించాలనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహంపై మానవ మనుగడను అంచనా వేసేందుకు ఏజెంట్-బేస్డ్ మోడలింగ్ అనే కంప్యూటర్ అనుకరణను ఉపయోగించారు. అక్కడ ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తట్టుకుని జీవించగలిగే మానవుల మనసతత్వాలను గూర్చి కూడా ఈ కంప్యూటర్ వెల్లడించింది. "న్యూరోటిక్" మనస్తత్వం కలవారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, "పరిస్థితులను అంగీకరించదగిన" వ్యక్తిత్వ గల వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్) -
ఫ్యామిలీ కోసం సొంతంగా విమానం తయారు చేశాడు!
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయం ఎంతో భారంగా గడిచింది. కొంత మంది మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాల వ్యాపకాలతో తమ సృజనకు పదునుపెట్టుకున్నారు. కేరళకు చెందిన ఎన్నారై అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ అయితే ఏకంగా చిన్నపాటి విమానాన్నే తయారు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాను సొంతంగా తయారు చేసిన ఫోర్ సీటర్ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేస్తున్నాడు అశోక్. కేరళలోని అలప్పుజా ప్రాంతానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డాడు. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2006 యూకే వచ్చిన అశోక్ ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 18 నెలలు శ్రమించి.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ విధించడంతో విమాన తయారీకి ఉపక్రమించాడు. దాదాపు 18 నెలలు శ్రమించి ‘స్లింగ్ టీఎస్ఐ’ మోడల్లో చిన్న విమానాన్ని తయారు చేశాడు. తన చిన్న కూతురు దియా పేరు కలిసొచ్చేలా విమానానికి ‘జి-దియా’ అని నామకరణం చేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడైన అశోక్‌కు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. దీంతో కుటుంబంతో కలిసి తన విమానంలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను చుట్టేసి వచ్చాడు. విమానాన్ని ఎలా తయారు చేశానంటే.. ‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడిని. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లడానికి నాలుగు సీట్ల విమానం అవసరం. కానీ అవి చాలా అరుదుగా దొరుకుతాయి. జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా)కు చెందిన స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ 2018లో టీఎస్ఐ మోడల్ విమానాన్ని తయారు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకసారి నేను స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీని కూడా సందర్శించాను. ఆ తర్వాత నా సొంత విమాన తయారీకి అవసరమైన వస్తువులను ఆర్డర్‌పై అక్కడి నుంచి తెప్పించాను. లాక్‌డౌన్‌తో సమయం దొరకడంతో విమాన తయారీపై దృష్టి పెట్టాన’ని అశోక్ వివరించాడు. విమాన తయారీకి దాదాపు రూ.1.8 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కలల విమానంలో గగన విహారంతో వార్తల్లోకి ఎక్కారు అశోక్ అలిసెరిల్ తమరాక్షన్. అతడిని గురించి విన్నవారంతా ‘సూపర్’ అంటూ మెచ్చుకుంటున్నారు. (క్లిక్: స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ) -
ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో..
ఆ వృద్ధురాలికి చదువు లేదు.. సంకల్ప బలం ఉంది ఇంజినీర్లు సైతం సాధ్యం కాదన్నారు.. చిన్నాలమ్మ మాత్రం సాధ్యం కానిదేదీ లేదని నిరూపించింది. అధికారులు సాంకేతిక కారణాలతో చెక్ డ్యాం నిర్మించలేమన్నారు.. ఆ కారణాలకు ‘చెక్’పెడుతూ ‘డ్యాం’ నిర్మించారు.. చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించారు. తన ఇద్దరు కుమారులతో కలిసి పంట పొలాలకు నీరందించే భగీరథులయ్యారు. చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. సాక్షి, పాడేరు: పెదబయలు మండలంలోని మారుమూల కిముడుపల్లి పంచాయతీకి చెందిన కోడా చిన్నాలమ్మ అనే మహిళా రైతు తోటి గిరిజన రైతులకు ఉపకారిగా నిలిచారు. తనతో పాటు మరికొంత మంది గిరిజన రైతుల సాగు భూములకు నిత్యం అన్ని కాలాల పాటు సాగు నీరు అందే లక్ష్యంగా కంబాలబయలు సమీపంలోని గేదెగెడ్డ వాటర్‌ఫాల్ ప్రాంతంలో మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. పూర్వం నుంచి ఈ గెడ్డ వద్ద వృథాగా పోతున్న నీటిని పంట కాలువల ద్వారా దిగువ భూములకు సాగు నీటిని అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే వాటర్‌ఫాల్ ప్రాంతం ఎత్తుగా ఉండడంతో పాటు అక్కడ చెక్‌డ్యాం నిర్మించడం కష్టమని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు ఇక్కడ చెక్‌డ్యాం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనులు జరగలేదు. గేదెగెడ్డ వాటర్పాల్కు ఆనుకుని నిర్మించిన మిని చెక్‌డ్యాం అయితే కోడా చిన్నాలమ్మ, ఆమె ఇద్దరు కుమారులు కోడా సింహాద్రి, కోడా వరహనందంలు ఇక్కడ మినీ చెక్‌డ్యాం నిర్మాణానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3లక్షలకు పైగానే సొంత నిధులు ఖర్చుపెట్టి వాటర్ఫాల్కు ఆనుకుని మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. వాటర్‌ఫాల్ నుంచి దిగువుకు పోయే నీటిలో కొంత ఈ చెక్‌డ్యాం చానల్లోకి వస్తుంది. అక్కడ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట భూములకు కాలువ ద్వారా నీటిని మళ్లించారు. మట్టి కాలువ తవ్వడంతో పాటు కొంత భాగంలో సిమెంట్ కాంక్రీట్‌తో ప్రధాన కాలువను కూడా నిర్మించారు. ఆ సిమెంట్ కాలువ దిగువున చిన్నపాటి వంతెన కూడా నిర్మించడంతో ఈ మొత్తం నిర్మాణమంతా అద్భుతంగానే ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదారులైన కోడా చిన్నాలమ్మకు చెందిన భూములకు కూడా సాగు నీరు అందుతోంది. అలాగే సమీపంలోని మిగిలిన గిరిజనుల భూములకు కూడా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ పంట కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే చేదుపుట్టు సమీపంలోని పంట భూములకు వేసవిలో కూడా సాగునీరు అందించవచ్చని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మించిన చెక్‌డ్యాం, కాలువ ద్వారా 60 ఎకరాల భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని, వర్షాలు కురవకపోయిన పంటలు పండించవచ్చని స్థానిక గిరిజనులు పేర్కొంటున్నారు. దశాబ్దాల కల నెరవేరింది : కంబాల బయలు శివారున తమతో పాటు అనేక మంది గిరిజనులకు వ్యవసాయ భూములున్నాయి. పూర్వం నుంచి అక్కడ భూములకు గేదెగెడ్డ నుంచి సాగు నీరును అందించేందుకు చెక్‌డ్యాం నిర్మించాలని అధికారులను అనేకసార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుల సహాయంతో సొంతంగానే మిరీ చెక్‌డ్యాం, పంట కాలువలు నిర్మించడం సంతోషంగా ఉంది. చెక్‌డ్యాం నిర్మించాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరింది. ప్రధాన పంట కాలువ ద్వారా అందరి అవసరాలకు సాగునీరును మళ్లిస్తాం. –కోడా చిన్నాలమ్మ, నిర్మాణ దాత, కిముడుపల్లి -
ఇసుక, సిమెంట్ లేకుండా ఇల్లుని నిర్మించాడు, ఎలాగో తెలుసా?
Video of this house made of plastic bottles: ఇంతవరకు మనం అత్యాధునిక హంగులతో నిర్మించిన రకరకాల ఇళ్ల గురించి విన్నాం. అంతేకాదు తక్కువ బడ్జెట్‌తో నిర్మించే ఇళ్ల గురించి కూడా విన్నాం. పైగా విచిత్రమైన రీతిలో నిర్మించిన ఇళ్లను సైతం చూశాం. కానీ ఒక బాలుడు పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లతో అది కూడా నివాసం యోగ్యంగా ఉండేలా ఇల్లు రూపొందించాడు. ఆశ్యర్యంగా ఉంది కదూ! నిజమేనా? అనే సందేహంతో ఉండిపోకండి. అసలు విషయంలోకెళ్తే...ఇళ్లను నిర్మించేవాళ్ల సాయం కూడా తీసుకోకుండా ఒక బాలుడు ప్లాస్టిక్ బాటిళ్లతో ఇల్లుని నిర్మించాడు. పైగా భారత్‌లోని ఒక బాలుడు ఈ ఇల్లుని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇటుక గానీ సిమెంట్ గానీ వినియోగించకుండా కేవలం ప్లాస్టిక్ బాటిళ్లతో రూపొందించాడు. పైగా ఈ ఇంట్లో, తలుపులు, కిటికీలు, లైట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ ఇల్లుని చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!) -
కల కోసం రూ. 2 కోట్లు వెచ్చించాడు
బీజింగ్ : చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరం ఎన్నో కలలు కంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ కలల్ని నిజం చేసుకుంటారు. వీరి కోవలోకే వస్తాడు చైనాకు చెందిన ఓ రైతు. జూ యూ అనే వ్యక్తికి బాల్యం నుంచే సొంత కారు, బైక్ లాగానే సొంతంగా విమానం ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉండేది. ఈ క్రమంలో తన నలభయ్యో ఏట విమానాన్ని తయారు చేసే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి.. రెండు కోట్ల రూపాయలు వెచ్చించి తన కలకు ప్రాణం పోశాడు. 124 అడుగుల పొడవు.. 118 అడుగుల వెడల్పు.. 40 అడుగుల ఎత్తుతో ఎయిర్‌బస్ ఏ320కి ప్రతీకగా రూపొందించిన ఈ విమానం వచ్చే ఏడాది మే వరకూ పూర్తి కానున్నట్లు తెలిసింది. అనంతరం ఈ విమానంలో రెస్టారెంట్ లేదా హోటల్ ప్రారంభించాలనుకుంటున్నట్లు జూ యూ తెలిపాడు. తన కల గురించి తెలిసిన ఐదుగురు స్నేహితులు ఈ విమానం రూపకల్పనలో తనకి తోడుగా నిలిచారని తెలిపాడు జూ యూ. -
పట్టణ గృహ నిర్మాణాలు టిడ్కో చేతికి..
ఏలూరు (మెట్రో) : పట్టణాల్లో పేదల కాలనీల నిర్మాణం, లే–అవుట్ల అభివృద్ధి, ఇళ్ల సముదాయాల నిర్మాణ బాధ్యత టిడ్కో చేపట్టనుంది. ఇందుకోసం కొత్తగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టౌన్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్–టిడ్కో) ఏర్పాటైంది. ఇప్పటివరకూ ఈ బాధ్యతల్ని గృహ నిర్మాణ శాఖ చూస్తుండగా.. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. లే–అవుట్ల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనివల్ల పేదలకు అనుకున్న స్థాయిలో గృహాలు నిర్మించే పరిస్థితి లేదు. ఇప్పటికే అన్ని పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం, లే–అవుట్ల వివరాలను టిడ్కోకు అందజేసేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పట్టణాల్లో పేదల కోసం సేకరించిన స్థలాలకు సంబం ధించి రెవెన్యూ అధికారుల వద్ద రికార్డులు అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములను సైతం జిరాయితీ భూములంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. కొన్నిచోట్ల పట్టాలిచ్చి స్థలాలు అప్పగించినా లేఅవుట్లు అభివృద్ధి కాలేదు. జీ–ప్లస్ పద్ధతిలో గృహాలు మంజూరైనా.. నిర్మించేందుకు ఇబ్బందులు వల్ల ముందుకు రాలేని పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నిటినీ ఇకపై టిడ్కో పరిష్కరించనుంది. ఇదిలావుంటే.. జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలకు 23 వేల గృహ నిర్మాణాలు మంజూరు కాగా.. వీటిలో 1,910 గృహాలను గృహ నిర్మాణ శాఖ నిర్మించనుంది. మిగిలిన 21,090 గృహాలను జీ–ప్లస్ పద్ధతిలో టిడ్కో నిర్మించనుంది. మేజర్ పంచాయతీల్లోనూ.. జిల్లాలో 202 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిలోనూ ఇకపై టిడ్కో ద్వారానే గృహ నిర్మాణాలు చేపడతారు. ఆకివీడు, చింతలపూడి, శనివారపుపేట, తంగెళ్లమూడి, వట్లూరు, సత్రంపాడు, వెంకటాపురం, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ఉండి వంటి మేజర్ పంచాయతీల్లోనూ టిడ్కోయే నిర్మాణాలు చేపడుతుంది. మున్సిపల్ శాఖ చూస్తుంది పట్టణాలు, మేజర్ పంచాయతీల పరిధిలో గృహ నిర్మాణాల బాధ్యత ఇకనుంచి టిడ్కో చేపడుతుంది. ఈ నిర్మాణాలకు సంబంధిత మున్సి పాలిటీలు, నగరపాలక సంస్థలు, మేజర్ పంచాయతీలు బాధ్యత వహిస్తాయి. నిధులు విడుదల వంటివి విషయాలను మున్సిపల్ శాఖ చూస్తుంది. – ఈ.శ్రీనివాస్, ప్రాజెక్ట్ డైరెక్టర్, గృహ నిర్మాణ శాఖ -
కార్మికుల పొట్టగొట్టడం సరికాదు
బిల్ట్‌పై సమీక్షలో కేంద్ర డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రవీంద్రనాథ్ మంగపేట : నష్టాల సాకు చూపి కార్మికుల పొట్టగొట్టడం సరికాదని కేంద్ర డిప్యూటీ లేబర్ కమిషనర్ కేవీ.రవీంద్రనాథ్ అన్నారు. జూలై 28న బిల్ట్ జేఏసీ నాయకులు కేంద్ర ఉపాధి కల్పన, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి కార్మికుల పరిస్థితిపై వినతిపత్రం అందజేశారు. మంత్రి ఆదేశాల మేరకు కర్మాగారాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. బిల్ట్‌లో పరిస్థితిపై ఇక్కడి ఏడీఏం కార్యాలయంలో హెచ్ఆర్డీజీఎం కేశవరెడ్డి, బిల్ట్ జేఏసీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్ట్ యాజమాన్యం కార్మికులకు పద్నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. 680 మంది కార్మికులు, సిబ్బందికి రూ.20కోట్ల మేర వేతన బకాయిలు, రూ.1.80కోట్ల పీఎఫ్ బకాయిలు నిలిపివేయగా కార్మికుల కుటుంబాల్లో ఏర్పడిన ఇబ్బందులను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. 30 ఏళ్ల పాటు కర్మాగారంలో విషపూరిత వాతావరణంలో పనిచేసి అనారోగ్యానికి గురైన కార్మికులకు నేడు ఫ్యాక్టరీ వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను కమిషనర్‌కు కార్మికులు వివరించారు. పీఎఫ్ కార్మిక జేఏసీ నాయకులు సైతం కమిషనర్ ఎదుట తమకు జరిగిన అన్యాయంపై గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం బిల్ట్‌లో పరిస్థితి, కార్మికుల దుస్థితిపై కేంద్రమంత్రి దత్రాత్రేయకు నివేదిక అందిస్తానని కమిషనర్ తెలిపారు. బిల్ట్ జేఏసీ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి, వడ్డబోయిన శ్రీనివాస్, వడ్లూరి రాంచందర్, రవిమూర్తి, లక్ష్మీనారాయణ, డీవీపీ.రాజు, శర్మ, కార్మికులు పాల్గొన్నారు. -
ఆందోళనకు దిగిన బిల్ట్ కార్మికులు
l కార్మికుడి మృతిపై ఆగ్రహం l యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ మంగపేట : మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌కు చెందిన కార్మికుడు కాసో జు పరమేశ్వర్రావు మృతికి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో పరమేశ్వర్ బుధ వారం రాత్రి మృతి చెందిన విషయం విది తమే. కొంత కాలంగా పరిశ్రమ మూతపడి వేతనాలు రాకపోవడంతో మనోవేదనతో పరమేశ్వర్రావు మృతి చెందాడని కార్మికులు ఆరో పించారు. దీనికి బిల్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం కార్మికులు బూర్గంపాడ్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎర్రవాగు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. బిల్ట్ మూతపడి రెండేళ్లు గడుస్తున్నదని, ఉపాధి కరువై, వేతనాలు లేక వైద్యం చేయిం చుకోలేని పరిస్థితిలో కార్మికులు మృతి చెందుతుంటే యాజమాన్యం పట్టించుకో కపోవడం సరికా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలుగా వేతనాలు, వైద్యసేవలు నిలిపివేయడంతో గత 35 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీలో పనిచేసి కాలుష్యం బారినపడి అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారని ఆరోపిం చారు. ఇప్పటికే ఐదుగురు కార్మికులు మృతి చెందారని తెలిపారు. త్వరలోనే వేతనాలు ఇప్పిస్తామని మంత్రుల హామీలు ఇచ్చి నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. పరమేశ్వర్రావు మృతికి బిల్ట్ యాజ మాన్యమే పూర్తి బాధ్యత వహించి మృతుని కుటుం బా న్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది తో చేరుకుని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్య క్రమంలో వడ్లూరి రాంచందర్, యలమంచిలి శ్రీనివాస్, వంగేటి వెంకట్‌రెడ్డి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
20 ఏళ్లలో రాజధాని నిర్మిస్తాం: మంత్రి
నెల్లూరు: మరో 20 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని వంద శాతం పూర్తి చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి రూ. 1.15 లక్షల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 2018, జూన్ 7 నాటికి రాజధాని నిర్మాణంలో తొలి దశ పూర్తిచేస్తామని ప్రకటించారు. కాగా, రాజధానిని నిర్మించాలంటే వందేళ్లైనా పడుతుందని చెప్పారు.ఒకట్రెండు రోజులు పాటు తళుక్కుమని కనిపించి వెళ్లే వారికేం తెలుస్తుందన్నారు.