ఆందోళనకు దిగిన బిల్ట్ కార్మికులు
-
l కార్మికుడి మృతిపై ఆగ్రహం
-
l యాజమాన్యమే బాధ్యత
-
వహించాలని డిమాండ్
మంగపేట : మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌కు చెందిన కార్మికుడు కాసో జు పరమేశ్వర్‌రావు మృతికి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు.
గుండెపోటుతో పరమేశ్వర్ బుధ వారం రాత్రి మృతి చెందిన విషయం విది తమే. కొంత కాలంగా పరిశ్రమ మూతపడి వేతనాలు రాకపోవడంతో మనోవేదనతో పరమేశ్వర్‌రావు మృతి చెందాడని కార్మికులు ఆరో పించారు. దీనికి బిల్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం కార్మికులు బూర్గంపాడ్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎర్రవాగు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. బిల్ట్ మూతపడి రెండేళ్లు గడుస్తున్నదని, ఉపాధి కరువై, వేతనాలు లేక వైద్యం చేయిం చుకోలేని పరిస్థితిలో కార్మికులు మృతి చెందుతుంటే యాజమాన్యం పట్టించుకో కపోవడం సరికా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలుగా వేతనాలు, వైద్యసేవలు నిలిపివేయడంతో గత 35 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీలో పనిచేసి కాలుష్యం బారినపడి అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారని ఆరోపిం చారు. ఇప్పటికే ఐదుగురు కార్మికులు మృతి చెందారని తెలిపారు. త్వరలోనే వేతనాలు ఇప్పిస్తామని మంత్రుల హామీలు ఇచ్చి నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. పరమేశ్వర్‌రావు మృతికి బిల్ట్ యాజ మాన్యమే పూర్తి బాధ్యత వహించి మృతుని కుటుం బా న్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది తో చేరుకుని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్య క్రమంలో వడ్లూరి రాంచందర్, యలమంచిలి శ్రీనివాస్, వంగేటి వెంకట్‌రెడ్డి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.