ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త | Husband Caught Redhanded Wife Government Teacher Extramarital Affair | Sakshi
Sakshi News home page

‘నేను వస్తున్నా.. తలుపు తీసి ఉంచు’..ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Published Wed, Feb 22 2023 9:43 AM | Last Updated on Wed, Feb 22 2023 9:49 AM

Husband Caught Redhanded Wife Government Teacher Extramarital Affair - Sakshi

సాక్షి, వరంగల్‌: ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాహేతర సంబంధాన్ని భర్త బట్టబయలు చేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన మంగపేట మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలి భర్త, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. మరో ఉపాధ్యాయురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

దీంతో కూతురితో అద్దె ఇంట్లో ఉంటున్న ఉపాధ్యాయురాలు, అప్పటికే ఇద్దరు భార్యలను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఉపాధ్యాయుడు నాగేందర్‌కు దగ్గరైంది. సెలవు రోజుల్లో వచ్చి వెళ్తే భర్తను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అనుమానం వచ్చి కూతురు ద్వారా ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ విషయంపై రెండు నెలల క్రితం పాఠశాల హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు దూరంగా ఉండాలని నాగేందర్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. స్పందించిన అధికారులు ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు.

అయినప్పటికి నాగేందర్, ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు భర్త కానిస్టేబుల్‌ ఈ నెల 18న శివరాత్రి బందోబస్తు డ్యూటీపై వేములవాడకు వెళ్లాడు. సోమవారం సెలవు ఉండటంతో మంగపేటలో ఉంటున్న భార్య, కూతురును చూసేందుకు వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాగేందర్‌.. ఉపాధ్యాయురాలి సెల్‌కు ఫోన్‌చేయగా భర్త లిఫ్ట్‌ చేశాడు. ‘నేను వస్తున్నా తలుపు తీసి ఉంచు’అని నాగేందర్‌ చెప్పాడు.

తన అనుమానం నిజమైందని భావించిన భర్త తలుపు తీసి బాత్‌రూంలో దాక్కున్నాడు. నాగేందర్‌ ఇంట్లోకి రాగానే గడియ పెట్టి ఇంతరాత్రి ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్న క్రమంలో పడుకుని ఉన్న తన భార్య, నాగేందర్‌ ఇద్దరు కలిసి అతనిపైనే దాడి చేసేందుకు యత్నించారు. దీంతో భయపడిన అతను ఇంటి గడియపెట్టి బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. ఉదయం తాళ్లతో ఇద్దరిని బంధించి పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement