protesting
-
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
రైతుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
లక్నో: లఖింపూర్ ఘటనలో రైతుల పై దాడి విషయమై కేంద్ర మంత్రి కొడుకు ఆశిష మిశ్రా జైలు పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ రైతు నేత రాకేశ్ టికాయత్ రైతులతో కలిసి సుమారు 72 గంటల పాటు నిరసనలు చేపట్టారు. ఐతే అధికారుల హామీతో ఆ నిరసనలు విమించుకున్న సంగతి కూడా విధితమే. ఈ నేపధ్యంలో మంత్రి అజయ్ మిశ్రా లఖింపూర్ ఖేరీలో తన మద్దతుదారులను ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసంగంలో రైతులను ఉద్దేశిస్తూ....సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుక్కులు మొరగడం, కారుని వెంబడిచడం గురించి ప్రస్తావిస్తూ...వాటి స్వభావం అలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ మంత్రి రైతు నేత గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రైతులుగా పిలవబడుతున్నవారు పాకిస్తాన్ లేదా కెనడాలో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు లేదా ఉగగ్రవాదులు అంటూ విరుచుకుపడ్డారు. ఆఖరికి మీడియా కూడా వారితో కలిసి తనపై ఇలా దుష్ప్రచారం చేస్తుందని కలలో కూడా ఊహించుకోలేదని అన్నారు. బహుశా మీడియాకి కూడా ఇదే బలమనకుంటా, అయినా మీడియా కారణంగా ప్రజలు ఎప్పటికీ తనను ఎలా ఓడించాలో తెలుసుకోలేరంటూ ఎగతాళి చేశారు. ఏనుగు ఎప్పుడూ తన దారిన తను వెళ్తుంటుంది, కుక్కలే ఎప్పుడూ మొరుగుతాయని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.."తాను లక్నోకి కారులో ప్రయాణిస్తున్నాను, అప్పుడు కారు మంచి వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో కుక్కలు మొరుగుతాయి లేదా వెంబడిస్తాయి. అది వాటి సహజ స్వాభావం. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ నిరాశపరచలేరు. ఎంతమంది రాకేష్ తికాయత్‌లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతను రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి , పైగా అతని రాజకీయ జీవితం ఎక్కువ కాలం సాగదు. తానే ఏ తప్పు చేయలేదంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను తాను ప్రపంచంతో పోరాడుతున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 (చదవండి: 6న ఎస్కేఎం తదుపరి భేటీ) -
సొంత చెల్లిని వ్యబిచారంలోకి దింపిన అక్క.. బాలికపై కన్నేసి!
రాంచీ: ఏడు నెలల క్రితం కనిపించకుండా పోయిన 17 ఏళ్ల అమ్మాయి విగతజీవిగా కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని సోనార్ డ్యాం వద్ద ఝార్ఖండ్ పోలీసులు కోర్టు సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కాగా బాలికను తోడబుట్టిన వారే కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.. మైనర్‌ను ఆమె అక్కలు రాఖీ దేవి(30), రూపా దేవి(25), బావ ధనుంజయ్ అగర్వాల్(30), రాఖీ లవర్స్ ప్రతాప్ కుమార్, నితిష్‌లు కలిసి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుల్లో నితిష్ తప్ప మిగతా అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాంచిలోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. చదవండి: జిమ్ ట్రైనర్ ప్రేమ విఫలం.. పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా.. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాలిక తలకు గాయాలు ఉన్నాయని తేలింది. అయితే మృతురాలి సోదరీలు మాత్రం బాలిక ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు చెబుతున్నారు. పోలీసు అధికారి విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు అక్కాచెల్లెల్లో ఈ బాలిక నాలుగో అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అక్క రాఖీతో కలిసి ఉంటుంది. తన అక్క రాఖీ వ్యభిచారం నిర్వహిస్తుంది. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ రాఖీ, ధనంజయ్‌లు మైనర్‌ను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. వారు ఆమె ఇష్టానికి విరుద్ధంగా కస్టమర్ల వద్దకు పంపేవారు. అయితే బాలిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పగా వారు వ్యతిరేకించారు. ప్రతాప్, నితేష్ ఇద్దరూ బాలికపై కన్నేసి రాఖీ సాయంతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి యత్నించారు. ఈ క్రమంలో రాఖీ ఇంట్లో లేని సమయంలో హత్యకు రెండ్రోజులు ముందు ఆమె ఇంటికి వచ్చిన ప్రతాప్ ప్లాన్ ప్రకారం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసి ఆమె శరీరాన్ని ఉరితీశాడు. అనంతరం ఈ విషయం రాఖీ, రూప, ధనంజయ్‌లకు తెలుపగా అందరూ కలిసి మృతదేహాన్ని ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి పాతిపెట్టారు. -
పద్మవతి యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ నిరసన
-
జన్మభూమి కార్యక్రమంలో సోంత పార్టీ నుంచే నిరసన సెగ
-
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన క్యాబ్ డ్రైవర్లు
-
రైతుల కపాల దీక్షకు కనిమొళి మద్దతు
-
ఆందోళనకు దిగిన బిల్ట్ కార్మికులు
l కార్మికుడి మృతిపై ఆగ్రహం l యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ మంగపేట : మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌కు చెందిన కార్మికుడు కాసో జు పరమేశ్వర్రావు మృతికి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో పరమేశ్వర్ బుధ వారం రాత్రి మృతి చెందిన విషయం విది తమే. కొంత కాలంగా పరిశ్రమ మూతపడి వేతనాలు రాకపోవడంతో మనోవేదనతో పరమేశ్వర్రావు మృతి చెందాడని కార్మికులు ఆరో పించారు. దీనికి బిల్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం కార్మికులు బూర్గంపాడ్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎర్రవాగు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. బిల్ట్ మూతపడి రెండేళ్లు గడుస్తున్నదని, ఉపాధి కరువై, వేతనాలు లేక వైద్యం చేయిం చుకోలేని పరిస్థితిలో కార్మికులు మృతి చెందుతుంటే యాజమాన్యం పట్టించుకో కపోవడం సరికా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలుగా వేతనాలు, వైద్యసేవలు నిలిపివేయడంతో గత 35 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీలో పనిచేసి కాలుష్యం బారినపడి అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారని ఆరోపిం చారు. ఇప్పటికే ఐదుగురు కార్మికులు మృతి చెందారని తెలిపారు. త్వరలోనే వేతనాలు ఇప్పిస్తామని మంత్రుల హామీలు ఇచ్చి నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. పరమేశ్వర్రావు మృతికి బిల్ట్ యాజ మాన్యమే పూర్తి బాధ్యత వహించి మృతుని కుటుం బా న్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది తో చేరుకుని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్య క్రమంలో వడ్లూరి రాంచందర్, యలమంచిలి శ్రీనివాస్, వంగేటి వెంకట్‌రెడ్డి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
'హెలీ టూరిజం' నిరసనకారుల అరెస్టు
పనాజీ: హెలీ టూరిజంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. పవన్ హాన్స్ సంస్థతో కలిసి గోవా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, పనాజీ నుంచి అగ్వాడాకు మంగళవారం హెలీకాప్టర్ రైడ్స్‌ను ప్రారంభించింది. అయితే ఈ హెలీ టూరిజం వల్ల స్థానికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని గోవా కాంగ్రెస్ నాయకుడు అజ్నెల్ ఫెర్నాండేజ్, మరో పదిమంది స్థానిక పంచాయతీ నాయకులు మండిపడ్డారు. రాస్తారోకో నిర్వహించి హెలీపాడ్ వైపుగా వస్తున్న వారిని గోవా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. -
విజయవాడలో అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తం
-
కేసీఆర్ సభలో నిరసన తెలిపిన విజయ్ అరెస్ట్
-
డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన
వేములపల్లి: ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వేములపల్లి మండలం కనకమహాలక్ష్మి రైస్‌మిల్లులో దూదిమెట్ల సైదులు(28) రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో అతని బంధువులు మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. -
ధరాభారాల పై పోరుబాట
-
ధరల పెరుగుదలపై రేపు వైఎస్ఆర్ సీపీ సమరభేరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన నిత్యావసరాల ధరలపై వైఎస్ఆర్ సీపీ సమరభేరి మోగించింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టనున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా నిరసన తెలపాలని వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చింది. -
బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసనలు
-
బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసనలు
గుంటూరు: ఆర్టీసీ బస్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా: మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. సోమవారం ఉదయం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ మేరకు బస్టాండ్‌లో డీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పొన్నూరులో రావి వెంకట రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయనగరం: బస్సు చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం ఎంత భారమవుతోందో ప్రయాణికులకు వివరించారు. అనంతరం డీఎం బీవీఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామమూర్తి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. శ్రీకాకుళం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రెడ్డిశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. టెక్కలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు ఆధ్వర్యంలో పలాసలో నిర్వహించిన ధర్నాలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎదుట జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవభక్తుని సుబ్బారావు, రావులపాటి రామచంద్రరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగవీటి శ్రీనివాసప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు డీఎంకు వినతి పత్రం అందజేశారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అలాగే, నందిగామ, తిరువూరులోని బస్టాండ్ల వద్ద ధర్నా జరిగింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా: మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. దర్శి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా: మదనపల్లిలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డీఎంకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ జిల్లా: కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు రాస్తారోకో చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా: మండపేటలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం: పోలీసుల తీరుకు నిరసనగా వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట అధికార పార్టీ ఎమ్మెల్యే శ్యాంసుందర్ శివాజి బైఠాయించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. మత్స్యకారులపట్ల పోలీసుల తీరుకు నిరసనగా ఆదివారం సాయంత్రం బైఠాయించారు. మెట్టపల్లి మత్స్యకారులకు, స్థానిక మత్స్యకారులకు మధ్య చోటుచేసుకున్న వివాదంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. స్థానిక మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ శివాజి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. -
జననేత పిలుపు మేరకు..
-
ఆ బంక్‌లో డీజిల్ పోయించుకుంటే..అంతే
తగరపువలస: విశాఖపట్టణం పెద్దిపాలెంలో అది ఓ పేరుమోసిన పెట్రోల్ బంక్. ఏమి జరిగిందో తెలియదు కానీ, ఈ మధ్య ఆ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనతో ఆ బంక్‌లో డీజిల్ కల్తీ అవుతున్న విషయం బహిర్గతమైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో ఈ బంక్‌లో డీజిల్ నింపుకొని బయలుదేరిన పది కిలోమీటర్లకే వాహనం మొరాయించింది. దీంతో మెకానిక్కు చూపించగా.. కల్తీ డిజిల్ వల్ల వాహనం ఇంజన్ దెబ్బతిన్నదని చెప్పాడు. బాధితుడు బంక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వినియోగదారులకు బంక్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంత జరుగుతున్న అధికారులు ఆ బంక్ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనర్హం. -
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరసనలు
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఆందోళనలు మిన్నంటాయి. అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో స్థానిక వినాయక సర్కిల్లో పార్టీ శ్రేణులు మోదీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కల్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహనరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కదిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అత్తర్చాంద్ బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు భారీ ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, ఎమ్మెల్యేలు సునీల్, అమరనాథ్‌రెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం ఏటీఎం సర్కిల్ వద్ద చెన్నై-బెంగళూరు జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. నెల్లూరు: వెంకటాచలంలో వైఎస్సార్సీపీ నాయకులు వినూత్న నిరసనలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి కుండలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చోడవరం: విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. పార్టీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం మోదీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం చోడవరం- భీమిలి రహదారిపై రాస్తారోకో, మాన వహారం చేపట్టి, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కమలాపురం: వైఎస్సార్ జిల్లా కమలాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఆంధ్రాకు వెంటనే ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉత్తమ రెడ్డి, స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నర్సరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. గుంటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నేత అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వినూత్న నిరసనలకు దిగారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంపై ఏపీలోని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగనుంది. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాష్ట్రంలో అడుగుపెట్టిన మోదీ ప్రత్యేక హోదా అంశం గురించి ఊసెత్తకపోవడంపై ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానిని హోదా అడిగితే ఢిల్లీ నుంచి మట్టి, నీళ్లు తెచ్చారని దుయ్యబట్టారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని రుద్రరాజు పిలుపునిచ్చారు. సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేరవని అన్నారు. -
కరీంనగర్లో ఆందోళనకు దిగిన పత్తిరైతులు
-
ఇసుక అక్రమాలపై వైఎస్సాఆర్సీపీ ఆందోళన
విశాఖపట్నం : విశాఖ జిల్లా పెద్దబయలు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక్కడి అటవీ ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా విశాఖ పోర్ట్‌కు ఇసుకను తరలిస్తున్నారు. 1/70 చట్టం ప్రకారం ఇసుకను ఏజెన్సీ ప్రాంతంలోనే వినియోగించుకోవాలని రూల్స్ చెప్పుతున్నాయి. కానీ, అధికారులు వాటిని తుంగలో తొక్కుతూ మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ధర్నా
విజయనగరం: విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎంఎల్ఎస్ చక్కెర ఫ్యాక్టరీ వద్ద బుధవారం రైతులు ధర్నాకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన చెరుకు రైతులు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ నిలిచి పోయింది. -
రేషన్ సరుకుల కోసం గ్రామస్తుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం శనివారం ధర్నాకు దిగారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు డీలర్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా ఉన్న రేషన్ డీలర్‌ను రాజకీయ కారణాలతో తొలగించి నాలుగు నెలల క్రితం ఇరుగు పోల్‌రెడ్డి అనే వ్యక్తికి డీలర్షిప్ అప్పగించారని గ్రామస్తులు అంటున్నారు. కొత్తగా వచ్చిన డీలర్ సరుకులను పంపిణీ చేయకుండా అక్రమంగా విక్రయించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా డీలర్‌కు వచ్చిననప్పటికీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నాయకులు,కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
-
మంత్రి డొక్కా కారు అడ్డగింత
మార్టూరు, న్యూస్‌లైన్ : రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 325 షాపులను తొలగించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్టూరు గ్రామచావిడిలో భవనాలకు సంబంధించిన యజమానులకు గురువారం నోటీసులు కూడా అందించారు. సెంటుకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు తెలుసుకున్న భవన యజమానులు మార్కెట్ విలువ ప్రకారం రూ. సెంటు 30 లక్షల వరకు ఉందని, ప్రభుత్వం రూ. 50 వేలు చెల్లించటాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై శుక్రవారం ధర్నా చేపట్టారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు అదే మార్గంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెళ్తున్నారని సమాచారం అందుకున్న షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. మార్టూరు సమీపంలోకి రాగానే డొక్కా కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని కారును చుట్టుముట్టారు. కారు నుంచి దిగిన మంత్రి.. పరిహారం పెంచేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో షాపుల యజమానులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో మార్టూరు మాజీ సర్పంచ్ బొప్పూడి శ్రీనివాసరావు, హనుమంతరావు, షాపుల యజమానులు పాల్గొన్నారు. -
అంబికా కృష్ణకు సమైక్య సెగ
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు మంగళవారం ఏలూరులో సమైక్య సెగ తగిలింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏలూరు నగరంలో ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు ఆయన వచ్చారు. ఆ క్రమంలో ఆయనకు ఎన్జీవోల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అంబికా కృష్ణ గోబ్యాక్ అంటూ ఎన్జీవోలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆత్మగౌరవ యాత్ర ఎలా చేస్తారని వారు ఆ సందర్భంగా అంబికా కృష్ణను ఎన్జీవోలు ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఉద్యోగులు అంబికా కృష్ణను డిమాండ్ చేశారు.