ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం శనివారం ధర్నాకు దిగారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు డీలర్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా ఉన్న రేషన్ డీలర్‌ను రాజకీయ కారణాలతో తొలగించి నాలుగు నెలల క్రితం ఇరుగు పోల్‌రెడ్డి అనే వ్యక్తికి డీలర్‌షిప్ అప్పగించారని గ్రామస్తులు అంటున్నారు. కొత్తగా వచ్చిన డీలర్ సరుకులను పంపిణీ చేయకుండా అక్రమంగా విక్రయించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా డీలర్‌కు వచ్చిననప్పటికీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ సరుకుల కోసం గ్రామస్తుల ఆందోళన
Published Sat, Sep 26 2015 11:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement