Ration
-
కూటమి ప్రభుత్వంలో కనిపించని కందిపప్పు పంపిణీ
-
కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!
బంజారాహిల్స్: కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు మీ–సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–7లోని మీ–సేవా కేంద్రంతో పాటు ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని సెంటర్ల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. కొత్త కార్డుతో పాటు ప్రస్తుత కార్డులో కొత్తపేర్లు చేర్చాలని ఆధార్‌తో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లును జతచేసి దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది సైతం అప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని మీ–సేవా కేంద్రానికి ఒక్కరోజే దాదాపు 1000 మంది వరకు, అలాగే బస్తీలు, కాలనీల్లోని మీ–సేవా కేంద్రాలకు కూడా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మరికొద్ది రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిబ్బంది తెలిపారు. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వేంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్ల పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవా కేంద్రాలకు వెళ్లి సదరు దరఖాస్తు ఫారానికి సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సర్కిల్–7 పరిధిలో 83,013 రేషన్‌కార్డులు.. ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలో 81 రేషన్ షాపులు ఉండగా ప్రస్తుతం వీటి పరిధిలో ఆహార భద్రత కార్డులు 79,531, అంత్యోదయ అన్నయోజన కార్డులు 3481, ఒక అన్నపూర్ణ కార్డు కలిపి మొత్తం 83,013 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 2,92,882 మంది లబి్ధదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం ప్రతినెలా 18,19,011 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నారు. కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో గత నెల 6,093 మందిని అర్హులుగా గుర్తించి సర్వే చేయగా ఇందులో 2,938 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో నూతన లబ్ధిదారులకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈనెల కూడా వారికి రేషన్ లేనట్లేనని తెలుస్తోంది. -
జగనన్న ఉండి ఉంటే.. ఈ కష్టాలు ఉండేనా? (ఫొటోలు)
-
AP: పండగపూట సరుకుల్లేవ్!
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘కోతల పర్వం’ నడుస్తోంది. పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను కూటమి ప్రభుత్వం కుదించేస్తోంది. ఎన్నికలకు ముందు రేషన్ షాపుల్లో 18 రకాల సరుకులను ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు... అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కొక్కటిగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే గోధుమ పిండి సరఫరాకు మంగళం పాడేశారు. కందిపప్పును కూడా అటకెక్కించారు. కేవలం బియ్యం పంపిణీ చేసి పేదలను పండుగ చేసుకోండని చెబుతున్నారు. వాస్తవానికి ఆ బియ్యంలో కూడా సగానికి పైగా కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఉచితంగా ఇస్తోంది. అంటే... కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొర పంచదార మినహా సొంతంగా పేదలకు పంపిణీ చేసిందేమీ లేదు. మూడు నెలల్లో ఇచ్చిన కందిపప్పు 249 టన్నులే... టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా, గడిచిన మూడు నెలల్లో కేవలం 2శాతం.. అంటే 2.50లక్షల కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందింది. మొత్తం కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, మూడు నెలల్లో ఇచ్చింది 249 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. పండుగ వేళ ప్రచారం ఎక్కువ.. పంపిణీ తక్కువ సెపె్టంబర్ నెలలో వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ రేషన్‌లో కందిపప్పు పంపిణీ చేయలేదు. అదే సమయంలో అకాల వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మూడు నెలలుగా ఇసుక దొరక్క... పనులు లేక సుమారు 45లక్షల మంది భవన నిర్మాణ కారి్మకుల కుటుంబాలు పస్తులుండే దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు వెచ్చించి కందిపప్పు కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కంటితుడుపుగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కందిపప్పు పంపిణీని ప్రారంభించింది. కానీ, 11 రోజుల్లో 1.19 కోట్ల మంది కార్డుదారులు బియ్యం తీసుకుంటే... కేవలం 21.70లక్షల కార్డులకు మాత్రమే కందిపప్పు పంపిణీ చేసింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు మాత్రం పండుగ వేళ ఇప్పుడే కొత్తగా కందిపప్పు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. బాబు హయాంలో ఇది కొత్తేమీ కాదుచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపివేయడం కొత్తేమీ కాదు. ఆయన అధికారంలో ఉండగా, 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. ఇక 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. జగన్ హయాంలో క్రమం తప్పకుండా పంపిణీ » వైఎస్ జగన్ పాలనలో ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా కందిపప్పు పంపిణీ చేశారు. » బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు రూ.170కి పైగా ఉన్నా.. రాయితీపై కిలో రూ.67లకే అందించారు. » టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేసినా... వారితో సంప్రదింపులు జరిపి అవసరమైతే మార్కెట్ రేటు ఇచ్చిమరీ కందిపప్పు కొనుగోలు చేసి కార్డుదారులకు రూ.67లకే అందించారు. » స్థానిక రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి కందిపప్పుగా మార్చి ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు సరఫరా చేశారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా రేటు పెంచలేదు. » జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్లు విలువైన 3.28లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. గతంలోనే బాగుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్ సరుకులు బాగా పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటి వద్దకే సరుకుల పంపిణీని ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించింది. పేదలకు నాణ్యమైన సరుకులు పారదర్శకంగా అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు అవసరమైన నిత్యావసర సరకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలకు అందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. – మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నకరికల్లు, పల్నాడు జిల్లా ప్రహసనంగా రేషన్ పంపిణీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ సరకుల పంపిణీ ప్రహసనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీ బాగుంది. అధికారంలో వచ్చిన వెంటనే కందిపప్పు, ఇతర నిత్యవసరాలు పంపిణీ చేస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించింది. పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – కోట బూరయ్య, మాజీ సర్పంచ్, పినపళ్ల, ఆలమూరు మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 4 నెలలుగా బియ్యం మాత్రమేమేము కర్నూలులో నివాసం ఉంటున్నాం. 4 నెలలుగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదార, కందిపప్పు ఇవ్వాలని కోరినా స్టాక్ లేదంటున్నారు. గతంలో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు ఇచ్చేవారు. ఇప్పుడు పండుగకు అయినా ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడంలేదు. – గొల్ల లలితమ్మ, కేసీ కెనాల్ ఏరియా, కర్నూలు -
సందేశ్‌ఖాలిలో మళ్లీ హింస
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
జనం తీర్పు ఏం చెప్పనుంది?
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఈ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగు పరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? అధికార ప్రతి పక్షాలు రెండూ తమవైన వివరణలను జోడించి చేసిన 85 శాతం–15 శాతం ప్రచారాన్ని ఓటర్లు ఎలా తీసుకున్నారు? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా? ఇలాంటి ప్రశ్నలకు ఓ రెండ్రోజుల్లో సమాధానం లభిస్తుంది.జూన్ 4న వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల లెక్కల్లో బీజేపీ 303 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చు. లేదా దాని స్థానాలు 272 నుంచి 303 మధ్య ఉండవచ్చు. లేదా మెజారిటీ మార్కు కంటే తక్కువగా ఉండవచ్చు. వీటి గురించి ఇప్పటికైతే ఎవ్వరికీ తెలియదు. అయితే నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు మనకు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఆ ఫలితాలను పరిశీలించండి.గత దశాబ్దం గురించిన స్పష్టమైన మొదటి పరికల్పనను ఇక్కడ చూద్దాం. నరేంద్ర మోదీ రాజకీయాలను పునర్నిర్వచించారు. ప్రతి ఎన్నికా స్థానిక, జాతీయ సమతూకంతో ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల పంపిణీ, ఎడతెగని జాతీయ సందేశపు ప్రదర్శనతో మోదీ జాతీయతను, స్థానికతను అనుసంధానించారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎదుర్కొన్న ప్రతికూలతలను పూడ్చడానికి మోదీ ప్రజాదరణ సరిపోయింది. మరోవైపున ఓటర్లు కూడా తమ శాసనసభా కార్యకలాపానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే అంశానికన్నా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు అనేదానికి ప్రాధాన్యతను ఇచ్చారు.2024 తీర్పు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో, కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఇంకా ఎక్కువ మంది ఓటర్లను మోదీ ఆకర్షిస్తున్నారా, లేదా? బీజేపీ అభ్యర్థి స్వభావం లేదా కుల సమీకరణలు లేదా ఆర్థిక ఆందోళన నుండి ఉత్పన్నమయ్యే స్థానిక బలహీనతలను పూడ్చడానికి మోదీ ఇమేజ్ సరిపోతుందా? ఓటర్లు భారత ప్రభుత్వ అధికారంలో ఒక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారా లేక బలమైన తనిఖీలతో 1989–2014 మధ్యకాలపు తరహా ఏర్పాటు తిరిగి రావాలని కోరుకుంటున్నారా?ఇక రెండో పరికల్పన హిందూ మత–రాజకీయ గుర్తింపునకు పెరుగుతున్న భావన గురించి. దీన్ని బీజేపీ స్పష్టమైన అవగాహనతోనే పెంచి పోషించింది. హిందూ మత గుర్తింపునకు సంబంధించిన రాజకీయ ప్రకటనకు ప్రభుత్వ మద్దతు ఉంది. కల్పిత మనోవేదనల సమాహారం ద్వారా ముస్లింలను ఇతరులుగా మార్చే భావన మరొకటి. వెనుకబడిన, దళిత ఉప సమూహాలకు సాంస్కృతిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడం ద్వారా సమ్మిళిత హిందూ గుర్తింపును నిర్మించడం కూడా దీని వెనుక ఉంది. అయోధ్యలో లేదా కశ్మీర్లో లేదా దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక అన్యాయాల ‘సవరణ’ ఉంది. హిందువులు ఐక్యంగా ఉంటే, వారు ముస్లిం ఓట్లను అసంగతం చేయగలరనీ, ముస్లిం ప్రాతినిధ్యాన్ని చాలావరకు తగ్గించగలరనీ చూపించడానికి ఒక ఎన్నికల నమూనా కూడా దీని వెనుక ఉంది.కులాలకు అతీతంగా హిందుత్వ సామాజిక గాఢత కనబడటం, ‘లౌకికవాదం’ ప్రతిధ్వనులు ఎక్కడా వినిపించకపోవడం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) మద్దతు వంటివి తనకు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోయింది. బీజేపీ తరహా రాజకీయ మతపరమైన గుర్తింపును సవాలు చేసే కథనం తన దగ్గర లేకపోవడంతో కుల గణన, మరిన్ని రిజర్వేషన్లు, అన్ని రంగాలలో అన్ని కుల సమూహాలకు దామాషా ప్రాతినిధ్యాన్ని వాగ్దానం చేసింది. ఇది చారిత్రాత్మకం!జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్... దేశాన్ని కుల సమూహాలు, మతాలు, జాతుల మొత్తంగా కాకుండా హక్కులతో కూడిన, వ్యక్తిగత పౌరులతో కూడిన ఒక పెద్ద సమూహంగా భావించింది. మౌలికమైన అస్తిత్వ ఆధారిత విధానాల కంటే సామాజిక ప్రయోజనాలను సమతుల్యం చేసే క్రమానుగతమైన మార్పును విశ్వసించింది. ఈ రెండు అంశాలకు సంబంధించినంతవరకూ నెహ్రూ పార్టీని రాహుల్ గాంధీ భారత రాజకీయాలను సామ్యవాద స్రవంతి వైపు తిరిగి మళ్లించారు. పైగా కమ్యూనిస్ట్ స్రవంతి నుండి అరువు తెచ్చుకున్న బలమైన పెట్టుబడిదారీ వ్యతిరేక వైఖరిని దానికి జోడించారు.హిందూ గొడుగులోని సంకీర్ణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, ప్రతిపక్షాలు ఎన్నికలను 85%–15% యుద్ధంగా మలిచాయి. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 15 శాతం అంటే ‘ఇతరులైన’ ఉన్నత కులాలు. దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఉద్దేశించినట్లు అది తప్పుగా పేర్కొంది. మరోవైపున తన సొంత హిందూ సామాజిక సంకీర్ణాన్ని కొనసాగించడానికి, బీజేపీ ఈ ఎన్నికలను 85% వర్సెస్ 15% యుద్ధంగా రూపొందించింది. ఇక్కడ 15 శాతం అంటే ‘ఇతరులైన’ ముస్లింలు ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించింది. అట్టడుగు హిందువుల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఉద్దేశించినట్లు బీజేపీ తప్పుగా ఆరోపించింది. అన్ని ప్రశ్నల పరంపరకు ఈ ఎన్నికల తీర్పు సమాధానం ఇస్తుంది. ఏకీకృత హిందూ రాజకీయ గుర్తింపునకు చెందిన ఆలోచన భౌగోళికంగా దక్షిణాదిలో కూడా విస్తరించి, సామాజికంగా దళితులు, గిరిజనులలో లోతుగా పాతుకుపోయిందా? రిజర్వేషన్ నిర్మాణాన్ని మరింత విస్తరించడానికి ఈ తీర్పు పార్టీలను ఎంతవరకు ఒత్తిడికి గురి చేస్తుంది?మూడవ పరికల్పన రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి. మోదీ నమూనా మౌలిక సదుపాయాలలో తయారీపై, పెట్టుబడులు పెంచడంపై ఆధారపడినది. ప్రైవేట్ వ్యవస్థాపకతను ముందుకు తీసుకుపోవడానికి డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులను ఉపయోగించడం; ఆర్థిక మార్కెట్లను విస్తరించడం; పరపతిని సరళీకరించడం; ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం; సేవలలో భారతదేశ బలాన్ని పెంచడం; నగదు, గృహాలు, నీరు, ఆహారం, విద్యుత్, వంటగ్యాస్ వంటి వాటిని అందుకునే కోట్లాది మంది ప్రజలతో కూడిన సంక్షేమ వలయాన్ని సృష్టించడం ఈ నమూనాలో భాగం. సంక్షేమం ఒక తరగతి లబ్ధిదారులను సృష్టించింది, గుర్తింపులు, ప్రాంతాల వ్యాప్తంగా మహిళా ఓటర్ల మద్దతును గెలవడానికి ఇవి మోదీకి సహాయపడ్డాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంపై ప్రజల్లో కోపం, బాధ పెరుగుతున్నాయని కూడా స్పష్టమైంది. గరిష్ఠంగా నగదు బదిలీలు, ప్రభుత్వ రంగ ఉపాధి, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రణాళికతో సహా మరింత సంక్షేమానికి ప్రతిపక్షాలు వాగ్దానం చేశాయి. ప్రస్తుత పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? ఓటర్లను, ముఖ్యంగా మహిళలను, యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికి లేదా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడానికి సంక్షేమం ప్రేరేపణ కలిగించిందా? రాజకీయ–క్యాపిటల్ నెట్‌వర్క్‌పై ప్రజలకు ఆగ్రహం ఉందా? మహమ్మారి అనంతరం వివిధ రూపాల్లో దేశం కోలుకోవడం జరిగిందా? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా?తమను ఎవరు నడిపించాలనుకుంటున్నారు, తమను ఎలా నిర్వచించాలనుకుంటున్నారు, తమ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి వారు ఎవరిని విశ్వసిస్తారు అనే కీలకాంశాలను రెండ్రోజుల్లో ఓటర్లు ప్రకటిస్తారు. ఇది 2024కి సంబంధించిన అసలైన కథ.- వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -ప్రశాంత్ ఝా -
పంజాబ్‌లో ‘ఉచిత రేషన్’ ఎలా అందిస్తున్నారు?
రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. పంజాబ్‌లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్‌లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు. పంజాబ్‌లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు. -
రైతులకు శుభవార్త.. ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం?
ఏప్రిల్- మే 2024 నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్ సమ్మాన్ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి. 16 విడుత విడుదల ఎప్పుడంటే? ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది. ఎంఎస్ఎంఈలకు అండగా ఇదిలా ఉండగా, 2024 మధ్యంతర బడ్జెట్లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయక చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం.. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (msme) అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం. 2018 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 5 కిలలో ఆహార ధాన్యాలు 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. -
Enforcement Directorate: టీఎంసీ నేత కోసం లుకౌట్ నోటీస్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఆచూకీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలిలో షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ బృందంపై అతడి అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి జాడ తెలియకుండా పోయిన షాజహాన్ షేక్ బహుశా దేశం విడిచి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అతడి గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త!
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్ కార్డ్ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించేందుకు బీజేపీ నేతృత్వంలోని రేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ అధికారుల అంచన ప్రకారం దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యయం కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. తద్వారా 80 కోట్లమంది మరో ఐదేళ్లపాటు లబ్ధి పొందుతారని, అన్ని వర్గాలకు ఉచిత బియ్యం అందుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు. మరోవైపు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ‘అక్రమ డబ్బు'ను ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్‌పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ప్రజల్ని దోచుకొనే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టదు. చివరికి ఆన్లైన్బెట్టింగ్ యాప్ ‘మహదేవ్’ ను కూడా వదల్లేదంటూ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రభుత్వంపై ప్రధాని విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిందితులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం.. ప్రతి పైసా వారి నుంచి తీసుకుంటాం వారి జైలుకు పంపిస్తామన్నారు. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. (షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి) కాగా 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలోపేద ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PMGKAY)ను పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్దిదారులందరికీ, నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది. దీన్ని జూలై 2013లో తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ (ఆహార భద్రత స్కీమ్) NFSAతో విలీనం చేసింది. ఈ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే అందిస్తోంది. దీని ద్వారా 81.35 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది. (కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్ మైండ్ కోసం వేట) ఇటీవల, ఆహార మంత్రి, పీయూష్ గోయల్, PMGKAY కింద, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఫేజ్ I నుండి ఫేజ్ VII వరకు మొత్తం) దాదాపు 1,118 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించి మొత్తం మంజూరైన బడ్జెట్ దాదాపు రూ. 3.91 లక్షల కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. (డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు) -
కేవైసీ కోసం క్యూ... రేషన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్‌గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు. మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు. గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
గర్బిణీలకు ఇచ్చే టేక్ హోం రేషన్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
AP: తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు విక్రయాలు
సాక్షి, అమరావతి : నిత్యావసరాల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా మిల్లర్లు, టోకు వ్యాపారులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. మార్కెట్ ధరల కంటే 15–20 శాతం తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పును విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఏపీలోని 26 జిల్లాల్లో శనివారం నుంచి తక్కువ ధరకు బీపీటీ, సూపర్ ఫైన్, ఫైన్ వెరైటీ బియ్యం విక్రయాలను ప్రారంభిస్తోంది. ఆయా జిల్లాల్లోని మార్కెట్ ధరల ప్రకారం జాయింట్ కలెక్టర్లు ఈ సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రత్యేక కౌంటర్లలో.. దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలలుగా నిత్యావసరాల ధరలు వేగంగా పెరిగాయి. ఒక్కసారిగా బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై అధిక రేట్ల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గత మూడ్రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, టోకు వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించాలని కోరగా.. అందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు రైతుబజార్లు, కళ్యాణమండపాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, వ్యాపారుల దుకాణాల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ రేట్లకు బియ్యం, కందిపప్పును విక్రయించనున్నారు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఒక కేజీ కందిపప్పు, 10 కేజీల ఫైన్ వెరైటీ బియ్యాన్ని అందిస్తారు. వ్యాపారులను సమన్వయం చేస్తూ.. కొన్ని జిల్లాల్లో ఫైన్ వెరైటీ బియ్యం రకాల్లేవు. అయితే, వాటిని ఇతర జిల్లాల నుంచి వ్యాపారులతో కొనుగోలు చేయించి ప్రజలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పప్పుమిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం తక్కువ రేటుకు కందిపప్పును విక్రయించేందుకు అంగీకరించారు. దీంతో అక్కడి నుంచి కందిపప్పు నిల్వలను మార్కెట్లోకి తరలిస్తారు. ఇక వచ్చే సోమవారం నుంచి కందిపప్పును పూర్తిస్థాయిలో తక్కువ రేటుకు అందిస్తారు. కార్పొరేషన్.. కొత్త బ్రాండ్.. ఏపీ పౌరసరఫరాల సంస్థ సైతం సొంత బ్రాండింగ్‌తో బియ్యం రకాలను విక్రయించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే కర్నూలు నుంచి 50 టన్నుల బీపీటీ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటిని మిల్లింగ్ చేయగా 32 టన్నుల బియ్యం వస్తున్నట్లు గుర్తించారు. వీటిని పైలెట్ ప్రాజెక్టు కింది ప్రత్యేక ప్యాకింగ్‌లో మార్కెట్ రేటు కంటే తక్కువకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్ నుంచి పౌరసరఫరాల సంస్థ స్థానిక రైతుల నుంచి కందులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. అవసరమైతే మద్దతు ధరకు మించి మార్కెట్ రేటు ఉన్నా కొనుగోలు చేసి ప్రజా ప్రజలకు చేర్చనుంది. నవంబర్, డిసెంబర్లలో కందుల సేకరణకు ప్రత్యేకంగా కార్పస్ పెట్టడంతో పాటు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నిల్వలపై పటిష్ట నిఘా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి నిత్యావసరాల రేట్లను పెంచకుండా పౌరసరఫరాల శాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. వివిధ వర్గాల వ్యాపారుల వద్ద సరుకు నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ http://fcainfoweb. nic.in/pspలో వెబ్సైట్లో నమోదు చేయాలని హెచ్చరిస్తోంది. నిల్వలు అధికంగా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. గుంటూరు కోల్డ్ స్టోరేజీల్లోని కందుల నిల్వలను సైతం తనిఖీచేసి వాటిని కూడా బయట మార్కెట్లోకి తరలించనుంది. 111 ప్రత్యేక కౌంటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా సీఎస్ఆర్ ద్వారా చౌకగా బియ్యం, కందిపప్పు విక్రయాలకు వీలుగా 111 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఇందులో 42 రైతుబజార్లలో, 56 ఓపెన్ మార్కెట్లలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ ఫైన్ వెరైటీలతో పాటు బీపీటీ, సోనా మసూరి, సాంబామసూరి, ఆర్జీఎల్, స్టీమ్డ్ బియ్యం రకాలను అందుబాటులో ఉంచనున్నారు. కేవలం ప్రజల కోసమే.. ప్రజలకు నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచేందుకు మిల్లర్లు, వ్యాపారులతో చర్చించాం. వారి ద్వారా మార్కెట్ రేటు కంటే 15–20 శాతం తక్కువకు సరుకులు అందిస్తాం. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. హోల్‌సేల్ వ్యాపారులు ఈ విక్రయాలను కేవలం ప్రజల కోసమే చేపడుతున్నారు. – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, పౌరసరఫరాల సంస్థ -
Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: నిత్యం విషపు రాతలు రాసే రామోజీకి వాస్తవం ఏదైనా విరోధే. అధికారంలో మనవాడు ఉంటే అప్పు చేసినా అది లోకకల్యాణం కోసమే.. వేరొకరు అధికారంలో ఉండి అప్పు చేస్తే పెను భూతం.. ఇదే రామోజీ పత్రికా ఫిలాసఫీ. అందుకే గురువారం ‘నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ’ శీర్షికతో ఈనాడు పత్రిక పౌర సరఫరాల పైనే పనికిమాలిన ఏడుపు కథనం అచ్చేసింది. అసత్యాల కథనాలు అల్లింది. రాష్ట్ర విభజన తర్వాతి లెక్కతో మొదలెట్టి.. మధ్యలోని టీడీపీ కాలం నాటి లెక్కల ఎక్కాలను ఎగ్గొట్టి.. ప్రస్తుతం అప్పుల భారం పెరిగిందంటూ.. ప్రతి పేద ఇంటికీ నాణ్యమైన రేషన్ అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ‘అప్పుల’ పేరుతో ఈనాడు రాసిన ‘తప్పుడు రాతల’ పురాణంలో వాస్తవాలేమిటో చూద్దాం.. ఆరోపణ: పౌర సరఫరాల సంస్థ రుణ భారం పెరిగిపోతోంది వాస్తవం: 2014–15లో పౌర సరఫరాల సంస్థ అప్పు రూ.6,042 కోట్లు. ప్రస్తుతం అది రూ.31,600. ఇందులో రూ.20 వేల కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గ్యారెంటీలతో చేసిన అప్పు. అందులో బ్యాంకులకు తిరిగి చెల్లించింది. రూ.300 కోట్లు మాత్రమే. ప్రస్తుతం.. ప్రభుత్వ గ్యారంటీలతో పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రూ.23,950 కోట్లు అప్పు తీసుకుంటే అందులో రూ.11,800 కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లించింది. వీటిల్లో టీడీపీ హయాంలో తీసుకున్న రుణాలకు రూ.2వేల కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించడం విశేషం. ఈనాడు రాతల్లో చేసిన అప్పు కనిపిస్తోంది తప్ప.. తిరిగి తీర్చింది చెప్పట్లేదు. వాస్తవానికి పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొంటుంది. దానిని మరాడించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ఇస్తుంది. ఇదంతా జరిగి సబ్సిడీ మొత్తం రాష్ట్రానికి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండేందుకు బ్యాంకు రుణాలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి రావాలి్సన మొత్తం వచ్చిన వెంటనే బ్యాంకులకు తిరిగి చెల్లిస్తోంది. ఆరోపణ: ప్రభుత్వ గ్యారెంటీలు రూ.42 వేల కోట్లకు చేరాయి వాస్తవం: పౌర సరఫరాల సంస్థ ప్రస్తుత రుణం రూ.31,600 కోట్లు. వాస్తవానికి రుణాల సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీలు రూ.37 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ అనుమతించిన దానికంటే తీసుకున్న రుణం తక్కువగా ఉంది. ఈనాడు మాత్రం రూ.37 వేల కోట్ల రుణ అనుమతులు ఉండగా.. ప్రభుత్వం కొత్తగా మరో రూ.5 వేల కోట్లకు అనుమతులు ఇవ్వడంతో రూ.42 వేల కోట్లకు చేరాయని రాసుకొచ్చింది. ఇక్కడ కార్పొరేషన్ రుణం కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఏడాదిలో వినియోగించుకోకుంటే గడువు ముగిసిపోతుంది. ఆ తర్వాత పౌర సరఫరాల సంస్థ తనకు రుణం కావాల్సి వస్తే.. ప్రభుత్వం పాత గ్యారెంటీల్లో నుంచే ఆ మొత్తాన్ని తీసుకుంటుంది. తాజాగా పౌరసరఫరాల సంస్థలో ప్రభుత్వం అలానే రూ.5 వేల కోట్ల రుణ అనుమతులను తీసుకుంది. దీనిని వక్రీకరిస్తూ ఈనాడు రూ.42 వేల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్పింది. ఆరోపణ: ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయట్లేదు. రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు ఉంటే రూ.900 కోట్లతో సర్దుకోమన్నారు వాస్తవం: ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు నాలుగేళ్లలో పంచదార, కందిపప్పు, బియ్యానికి రూ.8,766.83 కోట్ల సబ్సిడీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఒకేసారి రూ.7 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈనాడు మాత్రం 2019–20, 2020–21, 2021–22 లెక్కలను మాత్రమే చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు రాబట్టలేని రూ.1,756.57 కోట్లు మొత్తాన్ని తెలంగాణ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా రూ.31,197 కోట్ల సబ్సిడీని ఏపీకి చెల్లించింది. ఆరోపణ: ధాన్యం బకాయిల కోసం అప్పలు చేస్తోంది. అయినా సమయానికి రైతులకు డబ్బులు చెల్లించట్లేదు వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఆర్బీకేల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ప్రతి పైసా రైతుకు మద్దతు ధర కల్పించేందుకే ఖర్చు చేస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.10,001.43 కోట్లు పౌర సరఫరాల సంస్థ సొమ్మును వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించింది. అందులో 2019 ఎన్నికలకు ముందు రూ.4 వేల కోట్లు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. పౌర సరఫరాల సంస్థ లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వానికి అవసరం లేకుండాపోయింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4,800 కోట్లు బకాయిలు పెట్టిపోయింది. వీటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని తిరిగి పౌర సరఫరాల సంస్థకు చెల్లించింది. తద్వారా సంస్థ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసింది. ఇవన్నీ ఈనాడుకు కనిపించవా? రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించేందుకు రూ.58,728.77 కోట్లు ఖర్చు చేసింది. 32, 75,790 మంది రైతుల నుంచి 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇదే టీడీపీ హయాంలో చూస్తే కేవలం 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాస్తవంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎక్కువ మంది ధాన్యం రైతులకు మద్దతు అందించడం విశేషం. మద్దతు ధరతో పాటే ప్రతి ఖరీఫ్ సీజన్లో రూ.400 కోట్లు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చుల కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వీటితో పాటు కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రంలోని రైస్ కార్డుదారులకు ఏప్రి ల్ 2019 నుంచి సెప్టెంబర్ 2022 వర కు ఉచిత బియ్యం పంపిణీ కోసం ఏకంగా రూ.6,329.20 కోట్లు అదనంగా ఖర్చు చేసి పేదలను ఆదుకుంది. చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? వీటితో పాటు ప్రతి నెలా నాణ్యమైన బియ్యం ఇంటింటికీ పంపిణీ కోసం రూ.1,146 కోట్లు, బహిరంగ మార్కెట్లో కందిపప్పు, పంచదార ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలోనూ వాటిని సబ్సిడీపై అందించినందుకు రూ.2,727.82 కోట్లు, వంట నూనె పంపిణీకి రూ.126 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తోంది. వీటన్నింటికీ కలిపి సుమారు రూ.10,329.02 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. ఇంత పెద్ద ఎత్తున రైతులకు, పేదల సంక్షేమానికి పని చేస్తున్న ఏపీ ప్రభుత్వంలోని పౌర సరఫరాల సంస్థ రుణ భారం రూ.31,600 కోట్లు ఉంటే... ఇలాంటి సంస్కరణలు లేని.. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అప్పు ఏకంగా రూ.49 వేల కోట్లు ఉండటం గమనార్హం. తెలంగాణలోనూ ఈనాడు పత్రికను నడిపిస్తున్న రామోజీ.. అక్కడ నోరెత్తకుండా.. ఏపీలో మాత్రం గుండెలు బాదుకోవడం ఎల్లో ఏడుపునకు నిదర్శనం. -
Viral: బెంజ్కార్లో బీదవాడు.. ఇదీ అసలు సంగతి
వైరల్: దేశంలో సంక్షేమ ఫలితాలు అర్హులకే అందుతున్నాయా? లబ్ధిదారులకు పంపిణీ అంతా సజావుగానే సాగుతోందా?. కానీ, ఏదైనా ఘటన వెలుగు చూస్తేనే.. అవకతవకలంటూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి రేషన్ సరుకులు తీసుకెళ్లడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. నలోయన్ చౌక్‌లో ఉన్న ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి.. సరాసరి రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. కాసేపటికి ఒక వ్యక్తితో రేషన్ సరుకుల సంచులు మోయించుకుని వచ్చి.. బెంజ్ కారు డిక్కీలో వాటిని పెట్టించుకుని వెళ్లిపోయాడు. ఇంకేం.. అక్కడే ఉన్న కొందరు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. సరదా కోసం వాళ్లు చేసిన పని.. పెనుదుమారమే రేపింది. అర్హులు కానివాళ్లకు రేషన్ అందుతోందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో మీడియా సదరు రేషన్ డీలర్‌ను సంప్రదించింది. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్(బిలో పావర్టీ లైన్) కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని చెప్పాడు ఆ డీలర్. మరోవైపు బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి సైతం స్పందించాడు. #Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral @PMOIndia @NirmalaSitharaman @CMOPb @AamAadmiParty @ArvindKejriwal pic.twitter.com/7gFy589QAH — ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) September 6, 2022 తన పేరు రమేష్ సైని అని, ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి దగ్గర పార్క్ చేశారని చెప్పాడు. డీజిల్ కారు కావడంతో అప్పుడప్పుడు దానిని వాడుతున్నట్లు చెప్పాడాయన. నేను బీదవాడినే. నాకు చిన్న వీడియోగ్రఫీ దుకాణం ఉంది. నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. పిల్లలను ప్రైవేట్‌లో చదివించేంత డబ్బు కూడా నా దగ్గర లేదు అంటూ రమేష్ సైని వెల్లడించాడు. అయితే ఈ వివరణతో వివాదం చల్లారలేదు. పంజాబ్ ప్రభుత్వం అందిస్తున్న ఆటా దాల్ పథకంలో భాగంగా.. ఆ వ్యక్తి గోధుమల్ని రేషన్‌లో తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో విమర్శల నేపథ్యంతో.. పంజాబ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి లాల్ చంద్ కటారుచక్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అయ్యో.. జాలిలేకుండా చూస్తూ ఉండిపోయింది -
ఇకపై ఆ దేశంలో రేషన్ ద్వారా పెట్రోల్, డీజిల్ పంపిణీ!
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ పంపుల ముందు రోజుల తరబడి నిలుచోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 'నేషనల్ ఇంధన పాస్' పేరుతో ఇంధన రేషన్ పథకాన్ని శనివారం ప్రవేశపెట్టారు ఆ దేశ విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర. ఈ కొత్త పాస్ ద్వారా వారం పద్ధతిలో ఇంధన కోటాను కేటాయిస్తారు. వాహన నంబర్, ఇతర వివరాలను ధ్రువీకరించి నేషనల్ ఐడెండిటీ కార్డు(ఎన్ఐసీ) అందిస్తారు. దానికి క్యూఆర్ కోడ్లు కేటాయిస్తారు. Introduction to the National Fuel Pass will be held @ 12.30pm. A guaranteed weekly fuel quota will be allocated. 1 Vehicle per 1 NIC, QR code allocated once Vehicle Chassis number & details verified. 2 days of the week according to Last Digit of number plate for fueling with QR. https://t.co/hLMI9Nm5ZF — Kanchana Wijesekera (@kanchana_wij) July 16, 2022 రిజిస్ట్రేషన్ వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్ నంబర్లోని చివరి అంకె ద్వారా తమ వంతు ఎప్పుడు వస్తుందని తెలుసుకోవచ్చు. మరోవైపు.. దేశంలోని పర్యాటకులు, విదేశీయులు కొలంబోలో పెట్రోల్, డీజిల్ పొందేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు మంత్రి. ' శనివారం మధ్యాహ్నం నుంచి నేషనల్ ఇంధన పాస్‌ల పంపిణీ ప్రారంభిస్తున్నాం. పాస్‌ల ద్వారా వారం పద్ధతిలో గ్యారంటీపెట్రోల్, డీజిల్‌ల కోటాను కేటాయిస్తాం. ఒక వాహనానికి ఒక ఎన్ఐసీ, క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా నంబర్ ప్లేట్ లోని చివరి అంకె సహాయంతో వారంలో రెండు రోజుల్లో ఇంధనం పొందొచ్చు.' అని విజేశేకర ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలోని ఇంధన కొరతను తీర్చేందుకు పొరుగు దేశాలతో పాటు రష్యాతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ముడి చమురు సరఫరాకు మార్గం సుగమమైతే కొంత మేర ఇంధన కొరతకు తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధనంతో పాటు ఆహార, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ -
పంజాబ్‌లోనూ ఇంటి వద్దకే రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రవేశపెట్టిన ‘ఇంటి వద్దకే రేషన్’ విధానం, నాణ్యమైన బియ్యం పంపిణీని పలు రాష్ట్రాలు ప్రశంసించడంతో పాటు వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు రేషన్ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ‘తరచుగా రేషన్ పొందడానికి ఒక రోజు వెచ్చించాల్సి వస్తోంది. రేషన్ కోసం వృద్ధులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు. ప్రజలకు చేరే రేషన్‌లోనూ నాణ్యత కొరవడింది. ఇకపై పంజాబ్‌లో ఇది కొనసాగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది’ అని చెప్పారు. నాణ్యమైన రేషన్‌ను శుభ్రమైన సంచులలో ప్యాక్ చేసి ఇంటికే పంపిణీ చేసేందుకు త్వరలోనే విధానాలను రూపొందించనున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్ కంటే ముందుగానే ఢిల్లీలో ఇంటింటికీ రేషన్‌ను పంపిణీ చేయాలనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ అడ్డంకుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా పర్యటనలో కేంద్ర బృందం, విజయవాడ పర్యటనలో కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్.. రాష్ట్రంలో రేషన్ పంపిణీ విధానంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరుస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజల కోసం అదనపు భారం భరిస్తున్న ఏపీ వాస్తవానికి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది కిందటే రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు çపడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తంగా 1.45 కోట్ల కార్డుదారులు ఉండగా, నెలలో 18 రోజుల పాటు వీరందరికీ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా, ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌర సరఫరాల శాఖ నెలకు సుమారు రూ.16.67 కోట్లకు పైగా చెల్లిస్తోంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇలా ఏటా నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.830 కోట్లకు పైగా ప్రజల కోసం అదనపు భారం భరిస్తోంది. -
మరో 6 నెలలు.. నిరుపేదలకు ఉచితంగా రేషన్ బియ్యం
కాకినాడ సిటీ: కరోనా కష్టకాలంలో ఉచిత రేషన్ బియ్యాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఈ పథకాన్ని పొడిగించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో నిరుపేదలు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ లేనప్పటికీ అర్హులైన బియ్యం కార్డుదార్లు ఒక్కక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలోని 64 మండలాల్లో 6.81 లక్షల మంది రేషన్ కార్డుదార్లకు బియ్యం అందజేయడానికి కావల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈ నెల నుంచే కొనసాగింపు పేదలకు బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ ఒక నెల ముందు నుంచే ఇండెంట్లను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఈ నెలలో ఉచితంగా 5 కిలోల బియ్యం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకూ కూడా ఉచితంగా బియ్యం ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ఇండెంట్లను ముందస్తుగా స్వీకరించే పనిని అధికారులు ఇప్పటికే చేపట్టారు. 16.81 లక్షల కార్డులు అవిభక్త తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 64 మండలాల్లో 2,659 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో రైస్‌కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి మొత్తం 16.81 లక్షలు ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం చొప్పున కేటాయించడంతో ఈ నెల నుంచి ఉచితంగా ఇవ్వనున్నారు. సేల్స్ డిపోల డీలర్ల వద్ద గతంలో నిల్వ ఉన్న బియ్యం పోగా మిగిలినవి అందిస్తారు. జిల్లాలోని గోదాముల నుంచి ఆయా రేషన్ డిపోల వారీగా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందులో అంత్యోదయ కార్డుకు గతంలో 35 కిలోల బియ్యం అందించేవారు. ఇప్పుడు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 40 కిలోల బియ్యం అందిస్తారు. అలాగే అన్నపూర్ణ కార్డుదారుకు 5 కిలోల ఇచ్చేవారు. ఈ నెల నుంచి 15 కిలోలు పంపిణీ చేస్తారు. అలాగే ఒక్కో సాధారణ బియ్యం కార్డుదారుకు 5 కిలోల బియ్యం ఇస్తుండగా ఈ నెలలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన (కరోనా బియ్యం) పథకం కింద 5 కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నారు. మొత్తంగా అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి నెలా 22,219 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందజేయనుంది. సంతోషంగా ఉంది మరో ఆరు నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. దీంతో పేదల కుటుంబ పోషణకు కొంత మేర ఊరట కలుగుతుంది. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడం అభినందనీయం, కరోనా పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే వరకూ బియ్యం ఉచితంగా ఇవ్వాలి. – దంగేటి అప్పయ్యమ్మ, కాకినాడ సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని డీలర్లు సక్రమంగా పంపిణీ చేయాలి. రేషన్ ఇచ్చే సమయంలో కార్డుదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ బియ్యం ఎంతో ఉపయోగపడుతాయి. – ఐవీ రమణ, కాకినాడ -
మరో ఆరు నెలలు ఉచితమే..
సాక్షి, ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు మరోసారి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఒకటి, రెండు నెలలు కాదు మళ్లీ ఆరు నెలల పాటు లబ్ధిదారులందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా, గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పొడిగింపు.. కరోనా కేసులు మొదలైన సమయాన పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో అప్పట్లో వారిని ఆదుకునేందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా గత నెలతో ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించాయి. పంపిణీ వివరాలిలా.. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్ధిదారుడిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు బియ్యం కేటాయింపులు చేశాయి. ఆహారభద్రత లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది కేజీలు, అంత్యోదయ కార్డుకు 35కేజీలు ఇస్తుండగా... అదనంగా ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కేజీల బియ్యం ఇవ్వనున్నారు. ఇక అన్నపూర్ణ కార్డుదారులకు మాత్రం యథావిధిగా పది కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. కాగా, జిల్లాలో 669 రేషన్‌షాపులు, 4,16,826 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,89,765, అంత్యోదయ కార్డులు 27,058తో పాటు అన్నపూర్ణ కార్డులు మూడు ఉన్నాయి. నేటి నుంచి పంపిణీ చేస్తారు... ఏప్రిల్ నెలకు సంబంధించి ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో రేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నేటి నుంచి బియ్యం అందించాలని రేషన్ డీలర్లను ఆదేశించాం. – రాజేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
ఏపీ తరహాలో ఇంటింటికి రేషన్ పంపిణికి పంజాబ్ శ్రీకారం
-
Telangana: జనవరి 5 నుంచి రేషన్ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యల కారణంగా జనవరి నెల రేషన్‌ను ఈనెల 4న కాకుండా 5వ తేదీన పంపిణీ చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. రేషన్ లబ్ధిదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, పెద్ద మనసుతో అర్థం చేసుకుని రేషన్ కార్డుదారులు ప్రభుత్వానికి సహకరించాలని ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దొంగకు తాళాలు ఇచ్చిన అధికారులు
తాడేపల్లిరూరల్: సివిల్ సప్లయీస్ అధికారులు దొంగ చేతికి తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ ప్రాంతంలోని ఇప్పటం శివారుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోకి పంచర్ అయ్యింది. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని సగం వరకు దించి ముళ్ల పొదల్లో పెట్టి పంచర్ వేసుకుంటున్నారు. ఆ సమయంలో పొలాలకు వెళుతున్న గ్రామస్తులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్ధలానికి వెళ్లి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముళ్ల పొదల్లో ఉన్న బియ్యాన్ని ఆటోలోకి ఎక్కించి ఇప్పటం గ్రామంలో భద్రపరిచారు. ఈ సంఘటనపై వీఆర్వో సివిల్ సప్లయీస్ డీటీకి అదేరోజు సమాచారం ఇచ్చారు. ఇప్పటి వరకు ఆటోపైగానీ, ఆటోలో బియ్యాన్ని తరలిస్తున్న వారిపై గానీ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని దగ్గరలో ఉన్న రేషన్ షాపులో ఉంచి ఆటోను మాత్రం మూడు రోజుల అనంతరం వడ్లపూడిలోని ఒక రైస్‌మిల్లుకు తరలించారు. గతంలో ఇదే రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి పలుమార్లు కేసులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లుకు ఆటోను పంపండం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధంకావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆటో యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని, అలా చేయకుండా మంగళగిరి సివిల్ సప్లయీస్ అధికారులు ఆటోను రైస్‌మిల్లులో భద్రపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
సాయం చేసి ఫోటోలు తీసుకోవడమా ?
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దిగజారిన నేటి రాజకీయాల విష వలయంలో తాను ఇరుక్కున్నానని మాజీమంత్రి సంతోష్‌లాడ్ రేషన్ కిట్లు పంపిణీ వేళ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కలఘటికి తాలూకా కూడళిగి గ్రామంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తూ ఉద్వేగంతో మాట్లాడారు. కిట్లు ఇచ్చేటప్పుడు చాలా బాధేస్తుందన్నారు. రేషన్కిట్లు ఇచ్చి ఫొటోలు తీసుకోవడం నాకు సిగ్గు కలిగిస్తుందన్నారు. కలఘటికిలో క్యాంటీన్ ఓపెన్ చేశా మని రోజు 1000 మందికి ఆహారం అందిస్తున్నామని ఇది తనకెంతో ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ప్రస్తుతం సహాయం చేసిన విషయాలన్ని చెప్పు కోవడం వంటి విచిత్రమైన పరిస్థిలో ఉన్నామన్నారు. చదవండి: మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి.. మూడు రోజులకే.. -
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల డాటా బేస్ నిమిత్తం జాతీయ స్థాయిలో వర్కర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ‘వలస కార్మికుల సమస్యలు, కష్టాలు’పై సుమోటో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 80 పేజీల తీర్పు వెలువరించింది. ప్రతి వారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు, రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో కేంద్ర కారి్మక శాఖ కనబరుస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కారి్మకులకు రేషన్ సరుకుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకాలన్నీ జూలై 31 కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్ నేషన్–వన్ రేషన్ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలంది. రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగించాలని పేర్కొంది. వలస కార్మికులకు రేషన్ సరఫరా నిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకురావాలి. ఆ మేరకు కేంద్రం అదనపు ఆహారధాన్యాలను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగిన పథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది. చదవండి: ఆకలి మంటల్లో కార్మికులు! -
సుప్రీంకోర్టులో మమతాకు చుక్కెదురు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వ పథకం ఒక దేశం.. ఒక రేషన్ కార్డును రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. సమస్యలను బూచిగా చూపించకుండా వలస కార్మికులకోసం పథకాన్ని అమలు చేయాలని పేర్కొంది. శుక్రవారం వలసకార్మికుల కష్టాలకు సంబంధించిన సుమోటో కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఒక దేశం.. ఒక రేషన్ కార్టు పథకాన్ని పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేయకపోవటానికి కారణం ఆధార్ సమస్యేనని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, రాజకీయ కారణాలతోనే పథకాన్ని అమలు చేయటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో సమస్య ఉందని, అందుకే ఒక దేశం.. ఒక రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయటం లేదని అన్నారు. -
ప్రజలను ఫూల్స్‌ను చేద్దామనుకుంటున్నావా కేజ్రివాల్?
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేజ్రివాల్ ఇంటికే రేషన్ పథకం ఆమ్ ఆద్మీ పార్టీ రేషన్ మాఫియా కోసమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకాన్ని ఢిల్లీలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఇంటికే రేషన్ అన్నది వినడానికి బాగానే ఉంది. ఓ సారి అందులోని లూప్ హోల్స్‌ను పరిశీలిస్తే అందులో అవినీతికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుస్తాయి. కేజ్రివాల్‌కు కావాల్సింది కూడా అదే. నువ్వు(కేజ్రివాల్) చట్టాన్ని బ్రేక్ చేసి.. ప్రజల్ని ఫూల్స్‌ను చేద్దామనుకుంటున్నావా?. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అందించలేకపోతున్నాడు కానీ, ఇంటికే రేషన్ అందిస్తాడంట! ఢిల్లీ ప్రభుత్వం రేషన్ మాఫియా కంట్రోల్ ఉంది. మేము ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకాన్ని తెచ్చాం. ఈ పథకం ద్వారా ప్రజలు ఆధార్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని దేశం మొత్తం అమలు చేసింది. కానీ, ఢిల్లీ, బెంగాల్, అస్సాం రాష్ట్రాలు అమలు చేయకపోవటం బాధగా ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో సమస్య ఉంది. కానీ, ఢిల్లీకి, అరవింద్ కేజ్రివాల్‌కు ఏం సమస్య ఉంది. చవకగా రేషన్ కార్డుదారులకు, పేద ప్రజలకు రేషన్ అందిస్తున్నాము. అలాంటప్పుడు నువ్వెందుకు ఆ పథకాన్ని అమలు చేయలేదు? నీ సమస్య ఏంటి?’’ అంటూ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. -
ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: ఉచిత వ్యాక్సినేషన్ అలాగే కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీల విషయంలో కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల అదనపు భారం పడనుందని మంగళవారం నిపుణులు విశ్లేషించారు. 18 ఏళ్లు దాటిన వయోజనులందరికీ వ్యాక్సిన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. ఇక పేదలకు నవంబర్ వరకూ ఉచిత రేషన్‌ను ఇవ్వనున్నట్లూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ప్రధాని ప్రకటనకు సంబంధించి ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నత స్థాయి నిపుణుల విశ్లేషణలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►వయోజనులకు ఉచిత వ్యాక్సినేషన్ వ్యయం రూ.45,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్ల మధ్య ఉంటుంది. కేంద్రం 2021–22 బడ్జెట్లో కేటాయించిన రూ.35,000 కోట్లకన్నా ఇది అధికం. అంటే వ్యాక్సినేషన్‌పై ప్రధాని తాజా ప్రకటనతో పడే అదనపు భారం దాదాపు రూ.15,000 కోట్లన్నమాట. ►ఇక ఐదు కేజీల గోధుమలు లేదా బియ్యం, కేజీ పప్పు ధాన్యాలు నెలనెలా నవంబర్ వరకూ దాదాపు 80 కోట్ల మంది లబ్దిదారులకు అందిస్తే, ఈ వ్యయం దాదాపు రూ.1.1 లక్షల కోట్లు రూ.1.3 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. నిజానికి ఉచిత రేషన్ జూన్ వరకూ అమలు జరుగుతోంది. దీనిని నవంబర్ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ►పై రెండు ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రంపై బడ్జెట్ కేటాయింపులు కాకుండా అదనంగా రూ.1.45 లక్షల కోట్ల వ్యయ భారం పడుతుంది. ►ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి జరుగుతున్న విశ్లేషణలను పరిశీలిస్తే, కఠిన ద్రవ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి ఆర్బీఐ రూ.99,122 కోట్ల డివిడెండ్ బదలాయింపులు ఇప్పటికే పెద్ద ఊరట. అంచనాలకన్నా ఇది అదనం. ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కేవలం రూ.53.511 కోట్లు అందుబాటులోకి వస్తాయని 2021–22 బడ్జెట్ అంచనావేసింది. అంచనాలకు భిన్నంగా మార్చి 31వ తేదీతో ముగిసిన తొమ్మిది నెలల ‘అకౌంటింగ్ కాలంలో’ మార్కెట్ ఆపరేషన్లు, పెట్టుబడులు తాను పొందిన మొత్తంలో వ్యయాలుపోను మిగులును కేంద్రానికి ఆర్బీఐ బదలాయించాలని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక పెట్రోల్, డీజిల్ రికార్డు పన్నుల నుంచి కేంద్రానికి భారీ ఆదాయం ఒనగురుతోంది. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయాలు ఉచిత వ్యాక్సినేషన్, ఆహార ధాన్యాల పంపిణీ వ్యయాలకు దాదాపు సరిపోతుందని అంచనా. ►వ్యాక్సినేషన్లు ఎలా, ఎక్కడ నుంచి పొందుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజనికా వ్యాక్సిన్‌ను, అలాగే దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చెందిన మరో వ్యాక్సిన్‌ను వినియోగిస్తోంది. దీనికితోడు రష్యా అభివృద్ధి చేసిన స్పూత్నిక్ వీ వ్యాక్సినేషన్‌ను కూడా ఈ నెల్లో దేశంలో ప్రారంభించనున్నారు. అదనపు వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం ఇతర విదేశీ వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో చర్చిస్తోంది. దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత పూర్తి నత్తనడకగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం సెకండ్ వేవ్ ఆందోళనలతో ప్రస్తుతం కొంత ఊపందుకుంది. 23 కోట్ల డోస్‌ల వ్యాక్సినేషన్లు జరిగాయి. ►సెకండ్ వేవ్‌లో మే 7న 4,14,188 కేసుల గరిష్టాన్ని తాకిన కేసులు తాజాగా లక్ష దిగువకు పడిపోయాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించడం దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో భారత్ ఎకానమీ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం నుంచి 9.5 శాతం మధ్య పరిమితం అవుతుందని అంచనాలు ఉన్నాయి. మూడవ వేవ్ ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుత లాక్డౌన్ల... ఆన్‌లాకింగ్ ప్రక్రియపై ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచనలు అందుతున్నాయి. ►మహమ్మారి సెకండ్‌వేవ్ విజృంభించడానికి కేవ లం కొద్ది వారాల ముందు మార్చిలో ‘కోవిడ్– 19 మహమ్మారికి భారత్‌లో –ఎండ్‌గేమ్– పడుతు న్నట్లే’ అంటూ కేంద్రం ఆర్థిక మంత్రి హర్‡్షవర్థన్ చేసిన ప్రకటన అలాగే ఈ ప్రకటన ద్వారా భారత్ ఇతర దేశాలకు వైద్య వనరుల ఎగుమతులు, ప్రత్యేకించి 19.3 కోట్ల డోస్‌లను ఇతర దేశాలకు ఎగుమతులు తీవ్ర విమర్శకు కారణమైంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆహార సబ్సిడీ రూ.2.42 లక్షల కోట్లపైగా ఉంటుందని అంచనా. సవరిత అంచనాల ప్రకారం 2020– 21లో ఈ పరిమాణం రూ.4.22 లక్షల కోట్లు. -
పిజ్జా డెలివరీ ఓకే.. రేషన్ నాట్ ఓకేనా?
న్యూఢిల్లీ: ఇంటింటికి రేషన్ డెలివరీ పథకానికి కేంద్రం మోకాళ్లు అడ్డుపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారాయన. ‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్‌దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ, సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రసగించిన ఆయన.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ‘‘కరోనా టైంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలుచేస్తోంది. రేషన్ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు. కేసు ఉందనేనా? కాగా, ప్రైవేట్ డీలర్లలతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్ సర్కార్ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్‌ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్‌ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. చదవండి: ఇంటికి రేషన్.. ఇక్కడ తొలగిన అడ్డంకి -
కొరియోగ్రాఫర్ బర్త్‌డే.. అక్షయ్‌కుమార్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది ఉపాధి కోల్పోయి అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుకు వచ్చారు. సుమారు 3600మంది డ్యాన్సర్లకు ప్రతి నెలా ఉచితంగా రేషన్ అందిచనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీడియాకు తెలిపారు. ఇటీవలె కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 50వ బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏ గిఫ్ట్ కావాలో కోరుకోమని అక్షయ్ అడగ్గా..పదహారు వందలమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వృద్ధ నృత్యకారులకు ఒక నెల రేషన్‌తో పాటు సుమారు 2000 మంది ఇతర సహాయ డ్యాన్సర్లకు సహాయం చేయమని ఆయన కోరినట్టు తెలిపాడు. దీంతో వెంటనే అంగీకరించిన అక్షయ్..గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న డ్యాన్సర్లకు ప్రతినెలా రేషన్ అందించనున్నారు. ఇక గతేడాది కూడా కరోనా నేపథ్యంలో అక్షయ్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించిన సంగతి తెలిసిందే. కష్టకాలంలో ఆయన ఎన్నోసార్లు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో తన వంతు సాయం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. చదవండి : బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ నెలకు రూ.లక్ష పైనే, నన్ను పెళ్లి చేసుకుంటావా? -
కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ కోవిడ్ కొన్ని కుటుంబాల్లో తల్లితండ్రులకు పిల్లలను దూరం చేస్తే, మరి కొన్ని కుటుంబాల్లో పిల్లలకు వారి తల్లితండ్రులను దూరం చేసింది. ఇలా కొవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిన్నారులకు 25ఏళ్లు వచ్చేదాకా ప్రతి నెల రూ.2,500 జమ చేయడంతో పాటు ఉచిత విద్య అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే, పేద కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఈ నెలలో 10 కిలోల ఉచిత రేషన్ లభిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో సగం ఢిల్లీ ప్రభుత్వం, మిగిలినవి కేంద్ర ప్రభుత్వ పథకం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబాలకు నెలకు రూ.2,500 అందజేయనున్నట్లు తెలిపారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోతే భార్యకు, వివాహం కాని కొడుకును కోల్పోతే తల్లితండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. మీ బాధను మేము అర్థం చేసుకున్నాము. వారిని తిరిగి మేము తీసుకురాలేమని మాకు తెలుసు, కాని ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని” ముఖ్యమంత్రి అన్నారు. దిల్లీలో కరోనాతో నిన్నటివరకు 21,846మంది మృత్యువాత పడ్డారు. గత కొద్దీ రోజుల నుంచి ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. చదవండి: ఈ పెన్షన్ పథకంలో చేరితే ప్రతి నెల రూ.5 వేలు -
ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది. 50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్డౌన్లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. Put on your creative cap! Design a logo for the One Nation One Ration Card plan and stand a chance to win a cash prize of Rs.50,000. Visit: https://t.co/puosLH2Bqx today! @fooddeptgoi @UNWFP_India pic.twitter.com/RFbk0pW1ge — MyGovIndia (@mygovindia) April 29, 2021 ఈ పోటీలో పాల్గొనడానికి, మీరు మొదట myGov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు పోటీకి వెళ్లి లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ ఎంట్రీని సమర్పించాలి. లోగో డిజైన్ పోటీలో ఏ వయసు వారు అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు గరిష్టంగా మూడు ఎంట్రీలను నమోదు చేయవచ్చు. లోగో ఫార్మాట్ JPEG, BMP లేదా TIFFలో అధిక రిజల్యూషన్ (600 dpi) చిత్రంగా ఉండాలి. లోగో గురించి 100 పదాలలో సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
డీలర్లు ఉచిత రేషన్ ఇవ్వకపోతే ఇలా చేయండి?
హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లు విధించాయి. ఈ లాక్ డౌన్ వల్ల పని దొరక్క పేద ప్రజలు ఆకలితో అలమటించి పోతుంటే వీరిని దృష్టిలో పెట్టుకొని మే, జూన్ నెలల్లో పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ 5 కిలోల ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం చేకూరనుంది. అయితే, కొందరు రేషన్ డీలర్లు ఉచిత ఆహార ధాన్యాలను పేదలకు అందకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేల మీ గ్రామంలో గనుక రేషన్ కార్డు ఉన్న రేషన్ డీలర్లు మీ కోటా ఆహార ధాన్యాలను అందించడానికి నిరాకరిస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్(ఎన్ఎఫ్ఎస్ఏ)లో దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందించారు. మీరు డీలర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే మెయిల్ చేసే సదుపాయం కూడా ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ వెబ్సైట్(https://nfsa.gov.in)కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, ఇతర సహాయం కోసం వారిని సంప్రదించవచ్చు. పోర్టల్ ఓపెన్ చేశాక కుడి భాగంలో ఆన్లైన్ కంప్లయింట్ కింద ఉన్న హెల్ప్‌లైన్ టెలీఫోన్ నంబర్స్ క్లిక్ మీద చేసి మీ రాష్ట్రానికీ చెందిన నంబర్లు తెలుసుకోవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లు: ఆంధ్రప్రదేశ్ : 7093001872, 04023494822, 04023494808, 18004252977, 1967. తెలంగాణ : 04023310462, 180042500333, 1967. చదవండి: ఆన్లైన్లో బాల్ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? -
ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం
సాక్షి, డెహ్రాడూన్: ఇటీవల సీఎం పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. 'రిప్డ్ జీన్స్' అంటూ మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న తీరత్ సింగ్, అమెరికా, మన దేశాన్ని 200 ఏళ్లు పాలించిందంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. వీటిన్నింటికి మించి తాజాగా మరో వివాదానికి తెరతీశారు. కోవిడ్ మహమ్మారి మధ్య తమను తాము పోషించుకోవడానికి కష్టపడుతున్న పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎక్కువ లబ్ది పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాదు ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారు.. ఇరవైమందిని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. అటవీ దినోత్సవం సందర్బంగా రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంతో ఉత్తరాఖండ్ సీఎం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (ఉత్తరాఖండ్ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!) కరోనా వైరస్, లాక్డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా నాణ్యమైన రేషన్ సరుకులను పేదవారికి కేంద్రం అందిస్తోంది మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో, నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల సరుకులు దక్కుతుండగా, 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరుకులు లభిస్తున్నాయన్నారు. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్న వారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారంటూ విచక్షణా రహిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మీకు అసూయ..ఇద్దరు పిల్లల్నే కని ఆపేయడం ఎందుకు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. నేడు హస్తినకు తీరత్ మరోవైపు తీరత్ సింగ్ రావత్ ఈ రోజు (సోమవారం) ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ప్రధాని మోదీని హోంమంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులను కలువనున్నారు. #WATCH हर घर में पर यूनिट 5 किलो राशन दिया गया।10 थे तो 50 किलो, 20 थे तो क्विंटल राशन दिया। फिर भी जलन होने लगी कि 2 वालों को 10 किलो और 20 वालों को क्विंटल मिला। इसमें जलन कैसी? जब समय था तो आपने 2 ही पैदा किए 20 क्यों नहीं पैदा किए: उत्तराखंड CM मुख्यमंत्री तीरथ सिंह रावत pic.twitter.com/cjh2hH5VKh — ANI_HindiNews (@AHindinews) March 21, 2021 -
‘అది మీ పథకమే.. మేం ఏ పేరు పెట్టలేదు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ‘ఇంటింటికి రేషన్ బియ్యం’ పంపిణీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ఈ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఇక పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ తాము వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. అయితే ఢిల్లీలో ఈ పథకం అమలు విషయంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. చదవండి: సీఎం జగన్ పథకాల స్ఫూర్తితో మమతా బెనర్జీ ‘దీనికి ముఖ్యమంత్రి రేషన్ యోజన అనే పేరు పెట్టడం లేదు. ఈ పథకానికి ఎలాంటి పేరు లేదు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పేదలకు అందించే చౌకధరల వస్తువల సరఫరాలో మాఫియా ప్రవేశించిందని.. వారిని నుంచి కాపాడేందుకు ఇంటింటికి రేషన్ అమలు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం వివరణ ఇచ్చారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగానే ఇంటింటికి రేషన్ పథకం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఢిల్లీ ఆహార శాఖ మంత్రి సంయుక్త కార్యదర్శి జగన్నాథన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ పథకం కేంద్రానిదే, మేం కేవలం అదనపు సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. సహదార జిల్లా సీమపురి ప్రాంతంలో ఈ పథకం అమలు చేయనున్నారు. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేసే యోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది. -
ఇంటింటికి రేషన్.. వారి కళ్ళలో ఆనందం ఫోటోలు
-
మినీ వ్యాన్లు వచ్చేశాయ్!
సాక్షి, గుంటూరు: రేషన్ సరకులు డోర్ డెలివరీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా ప్రభుత్వం రేషన్ సరకులను మినీ వ్యాన్ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. అందుకు అవసరమైన మినీ వ్యాన్లు సిద్ధం చేస్తోంది. వ్యాన్లు తోలేందుకు డ్రైవర్లను కూడా త్వరలో నియామకం చేయనుంది. జిల్లాకు తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్ నుంచి గూడ్స్ రైలు ద్వారా మంగళవారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి. చదవండి: (బాబుపై భగ్గుమన్న ముస్లింలు) కాగా, జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకవసరమైన మినీ ట్రక్కులను అన్ని వర్గాల యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించనుంది. ఈ ట్రక్కులను రాయితీపై అందజేయనుంది. జిల్లాలో 817 మినీ ట్రక్కులు (వ్యాన్లు) అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. ఇందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మినీ ట్రక్కుల కోసం అనూహ్య స్పందన లభించింది. ఈ 817 మినీ ట్రక్కులకు 8,179 మంది దరఖాస్తు చేశారు. అంటే ఒక్కో ట్రక్కుకు సగటున పది చొప్పున పది రెట్టు అధికంగా వచ్చాయన్నమాట! -
సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్: ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్ వర్కర్లకు రేషన్ పంపిణీ చేయడంతోపాటు ఆ వివరాలను తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్ నెల రేషన్ అందజేయనుంది. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) చౌకధరల దుకాణాలు, అంగన్వాడీ సెంటర్ల ద్వారా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తించింది. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్ ఇస్తోందో అంతే మొత్తంలో పంపిణీ చేయనుంది. (ఇంటింటికీ కొళాయి.. ప్రతిరోజూ మంచినీళ్లు) -
1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి: పదెకరాలున్నా వారు కూడా బియ్యం కార్డు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ప్రతినెలా కొత్తగా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోంది. గతంలో 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారే బియ్యం కార్డు పొందేందుకు అర్హులుగా ఉండేవారు. ప్రస్తుతం మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు లేదా రెండూ కలిపి పది ఎకరాలున్నా కార్డు తీసుకునేందుకు అర్హులే. దీంతో నానాటికీ బియ్యం కార్డుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సంక్షేమ పథకాలు పేదల హక్కుగా భావిస్తున్న ప్రభుత్వం.. వారికి బియ్యం కార్డులు కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,52,70,217 బియ్యం కార్డులున్నాయి. ఇందులో 4,47,45,668 కుటుంబ సభ్యుల (యూనిట్లు) పేర్లు నమోదై ఉన్నాయి. జూన్‌లో 1,47,25,348 కార్డులు ఉండగా, జూలైలో 1,49,38,211, ఆగస్టులో 1,50,15,765, సెప్టెంబర్‌లో 1,50,80,690 కార్డులు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 1,52,70,217కి చేరింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసిన తర్వాత అర్హత ఉంటే చాలు గడువులోగా కార్డులను మంజూరు చేస్తున్నారు. త్వరలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం పేదల ఇళ్లకే వెళ్లి నాణ్యమైన బియ్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 3,100 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే అవసరమైన మినీ ట్రక్కులను కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రభుత్వం భారంగా భావించడం లేదు అర్హులందరికీ బియ్యం కార్డులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోపే సంబంధిత కుటుంబ సభ్యుల చేతికి కార్డు ఇస్తున్నాం. దీనిని ప్రభుత్వం భారంగా భావించడం లేదు. ఎంత ఖర్చయినా పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. కార్డులు మంజూరు చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. - కోన శశిధర్, ఎక్స్-అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ జిల్లాలవారీగా ఇప్పటివరకు జారీ చేసిన బియ్యం కార్డులు, వాటిలోని కుటుంబ సభ్యుల వివరాలిలా.. జిల్లా కార్డులు కుటుంబ సభ్యులు (యూనిట్లు) అనంతపురం 12,73,601 39,34,160 చిత్తూరు 11,88,779 37,04,862 తూర్పు గోదావరి 17,03,597 48,21,556 గుంటూరు 15,47,127 43,39,371 వైఎస్సార్ 8,37,057 25,29,877 కృష్ణా 13,47,292 38,28,203 కర్నూలు 12,43,324 39,25,629 నెల్లూరు 9,33,193 25,54,168 ప్రకాశం 10,25,455 30,17,497 శ్రీకాకుళం 8,41,047 24,93,119 విశాఖపట్నం 13,20,321 38,73,231 విజయనగరం 7,16,349 21,10,628 పశ్చిమ గోదావరి 12,93,075 36,13,367 మొత్తం 1,52,70,217 4,47,45,668 -
ఇప్పుడు కుక్కర్ ఖాళీగా ఉండదు!
కోల్‌కతా: మమతా బెనర్జీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న ఒక స్కీమ్‌కు సంబంధించి చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రసోడ్ మే ఖాళీ కుక్కుర్( వంటింట్లో ఖాళీ కుక్కర్) అనే పేరుతో ఒక వీడియోను రూపొందించి ఇంటర్నేట్లో షేర్ చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఉచిత రేషన్‌కు సంబంధించిన పథకాన్ని ప్రచారం చేయడం కోసం ఈ వీడియోను ఉపయోగించుకుంటుంది. దీనికి సంబంధించి టీఎంసీ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్‌ను విడుదల చేసింది. ''రసోడ్ మెయిన్ అబ్ కుకర్ ఖలీ నహీ రహెగా (వంటగదిలో ఇప్పుడు కుక్కర్ ఖాళీగా ఉండదు) ! అని. ఎందుకంటే మమత బెనర్జీ జూన్ 2021 వరకు ఉచితంగా రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 10కోట్ల మంది పేదవారికి దీని వలన లబ్ధి చేకూరుతుందని తెలిపారు. Rasode mein ab Cooker khali nahi rahega !!@MamataOfficial ne June 2021 tak Bengal mein free ration ki ghoshna jo kar di hai 🤩 https://t.co/7WAi6ArDDR — All India Trinamool Congress (@AITCofficial) August 24, 2020 ఈ విషయం గురించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, ‘లాక్డౌన్ విధించిన మూడు నెలల పాటు మేం ప్రతి కుటుంబానికి ఐదు కిలోలు ఉచిత బియ్యం అందించాం. సెప్టెంబర్ వరకు ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యంతో పాటు సమాన మొత్తంలో పిండిని కూడా అందిస్తాం. జూన్ 2021 వరకు మేము ఉచిత రేషన్ అందిస్తాం’ అని మమతా అన్నారు. 'సాథ్ నిభానా సాథియా' లోని 'ప్రెజర్ కుక్కర్' సీన్ ఆధారంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యశ్‌రాజ్ ముఖతే ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం 'రసోడ్ మే ఖాళీ కుక్కర్' ఇంటర్నెట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ మీమ్స్ రూపొందిస్తున్నారు. చదవండి: ‘అది నా మనస్సాక్షికి విరుద్ధం’ -
‘పవన్ కల్యాణ్‌ది ద్వంద్వ వైఖరి’
సాక్షి, అమరావతి: రేషన్ డీలర్ల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి లేఖ రాయాలని పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన నాలుగు విడతల కమీషన్‌ను విడుదల చేయించాలని, రేషన్ డీలర్లను కరోనా బీమా కింద పరిధిలోకి తీసుకురావాలని పవన్ కోరాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంపై తప్పు నెట్టేందుకు ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్ ద్వంద్వ వైఖరి ఉందని విమర్శించారు. రేషన్ డీలర్ల సమస్యలను రాజకీయం చేయొద్దన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన కమీషన్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని.. రేషన్ డీలర్లకు అండగా ఉన్నారని వెంకట్రావ్ పేర్కొన్నారు. -
పేదలకు అండగా
-
కందిపప్పు రాలే..!
నిజామాబాద్, ఇందూరు/మోర్తాడ్: కరోనా ప్యాకేజీలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందజేస్తున్న కందిపప్పు జూన్ నెలలో అందే పరిస్థితి కనిపించడం లేదు. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కానుండగా, స్టాక్ మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. దీంతో కందిపప్పు పంపిణీపై స్పష్టత కరువైంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు ఆకలితో ఉండకూడదని ఏప్రిల్, మే నెలలో రేషన్ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం కోటా కింద తెల్ల రేషన్ కార్డుకు కిలో చొప్పున కందిపప్పును మూడు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఏప్రిల్‌లో కూడా కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా, స్టాక్ రావడంలో ఆలస్యం అయ్యింది. దీంతో మే నెలలో ఏప్రిల్ కోటాను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో 3,90,687 రేషన్ కార్డులుండగా, 12,92,682 మంది లబ్ధిదారులున్నారు. మే నెలలో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 390 మెట్రిక్ టన్నులు లబ్దిదారులకు అందజేశారు. ప్రస్తుతం జూన్ నెలలో మే, జూన్లకు సంబంధించి లబ్ధిదారులకు రెండు కిలోల చొప్పున కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ స్టాక్ రాలేదు. జిల్లా సివిల్ సప్లై అధికారులు రాష్ట్ర అధికారులను సంప్రదించినా వారు కూడా స్పష్టత ఇవ్వలేదు. దీంతో కందిపప్పు పంపిణీ విషయం ప్రశ్నార్థకంగా మారింది. కందిపప్పుపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదని సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం అభిషేక్‌సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే, బియ్యం మాత్రం ఇప్పటికే జిల్లాలో దాదాపు సగం రేషన్ దుకాణాలకు చేరుకుంది. గత రెండు నెలలు ఇచ్చినట్లుగానే ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు డీఎస్వో వెంకటేశ్వరరావు తెలిపారు. రూ.1,500 సాయం నిలిపివేత.. కరోనా సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రేషన్ కార్డుకు రూ.1,500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయాన్ని జమ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల కుటుంబాలరు రూ.58.50 లక్షల వరకు సాయం అందింది. అయితే, జూన్ నెల నుంచి ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. -
పప్పు వచ్చింది..! ఉచితంగా పంపిణీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రేషన్‌కార్డు దారులకు వచ్చేనెలలో కందిపప్పు అంజేయనున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో పేద కుటుంబాలు ఆహారానికి ఇబ్బంది పడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు బియ్యంతోపాటు అదనంగా కిలో చొప్పున కందిపప్పు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు సాంత్వన కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌తోపాటు ఈ నెలలోనూ ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున పంపిణీ చేశారు. అలాగే రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందింది. వచ్చేనెలలో బియ్యంతోపాటు కిలో కందిపప్పు కూడా పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 524 మెట్రిక్ టన్నుల పప్పు జిల్లాలోని 919 రేషన్ దుకాణాలకు చేరుకుంది. రెండు నెలలు ఆలస్యంగా.. వాస్తవంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రేషన్‌కార్డు దారులకు బియ్యంతోపాటు ఉచితంగా కందిపప్పు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, నాఫెడ్ నుంచి సకాలంలో పప్పు సరఫరా కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ఏప్రిల్, మే నెలల కోటా జిల్లాకు చేరలేదు. జిల్లాకు కేటాయించిన 524 మెట్రిక్ టన్నుల కోటా రెండు నెలల ఆలస్యంగా తాజాగా జిల్లాకు వచ్చింది. ఈ మొత్తాన్ని ఆయా రేషన్ దుకాణాలకు చేరవేశారు. దీన్ని జూన్ నెల కోటాగా యంత్రాంగం పరిగణిస్తున్నట్లు తెలిసింది. అయితే ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటా తిరిగి వస్తుందా?రాదా? అనే విషయంపై స్పష్టత లేదు. మొత్తం మీద వచ్చేనెలలో జరగనున్న కందిపప్పు పంపిణీతో జిల్లాలోని 5.24 లక్షల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. -
ఉచిత ‘బియ్యం’ అందేనా!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కష్టకాలంలో ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రకియ వచ్చేనెల (జూన్)లో కూడా కొనసాగుతుందా.. లేదా? అనేది చర్చనీయంశమైంది. జూన్ నెల ఆరంభానికి గడువు మరో ఐదు రోజులు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియపై నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వరసగా మూడో నెలకు సంబంధించిన బియ్యం, కంది పప్పు కోటాను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను కలుపుకొని జూన్ నెల కోటాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ మాత్రం గత రెండు నెలల మాదిరిగానే సరిపడా బియ్యం, కంది పప్పు కోటాతో సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో కేటాయింపులు సైతం చేసి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది. రెండు నెలలుగా.. లాక్డౌన్లో నిరుపేదలు అకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఆహార భద్రత కార్డుదారులకు రెండు నెలలు (ఏప్రిల్, మే)గా ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వచ్చింది. సాధారణ కోటాను సైతం రెట్టింపు చేసి ఉచితంగా పంపిణీ చేసింది. అదేవిధంగా నిత్యావసరాల సరుకుల కోసం కూడా నెలకు రూ. 1500 చొప్పున నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. వరసగా బియ్యం సరుకులు డ్రా చేయని పేదలు సైతం కష్ట కాలంలో తిండి గింజలకు ఇబ్బంది పడకూడదని ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతోపాటు ఆలస్యంగానైనా నిత్యావసర సరుకుల కోసం నగదు చేయూత అందించింది. తాజాగా లాక్డౌన్ మినహాయింపులతో వివిధ రంగాల సాధారణ ప్రక్రియ పునఃప్రారంభమై ఉపాధి మెరుగుపడటంతో జూన్ నెలలో ఉచితం బియ్యం పంపిణీ చేయాలా.. వద్దా? అని ప్రభుత్వం యోచిస్తోంది. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి.. గ్రేటర్ పరిధిలో సుమారు 20 లక్షలకుపైగా ఆహార భద్రత కార్డు పేద కుటుంబాలున్నాయి. నగరంలో హైదరాబాద్– మేడ్చల్– రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల విభాగాలు ఉండగా, వాటి పరిధిలో 12 పన్నెండు అర్బన్ సర్కిల్స్‌తో పాటు శివారు గ్రామీణ ప్రాంతాల్లో కలిపి సుమారు 16 లక్షలపైగా ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలున్నాయి. మరో నాలుగు లక్షల వరకు ఇతర జిల్లాల ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు కూడా ఇక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నాయి. రేషన్ పోర్టబిలిటీ స్థానికేతులకు కలిసి వస్తోంది. దీంతో ఇక్కడనే∙రేషన్ సరుకులు డ్రా చేస్తుంటారు. -
రేషన్ తీసుకోని వారికీ సాయం
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో తీసుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 నగదు సాయాన్ని అందించింది. ఈ ఏడాది వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో 2.08 లక్షల మంది లబ్ధిదారులు రేషన్ తీసుకున్నారు. వీరికి ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.62.40 కోట్లను వారి ఖాతాలో జమ చేసింది. దీంతో రేషన్ లబ్ధిదారులకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా 3 నెలలు 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకోలేదు. వీరిలో 2.08 లక్షల మంది ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్నారు. అయితే మూడు నెలల పాటు రేషన్ తీసుకోని వారికి రూ.1,500 సాయాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఏప్రిల్‌లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులకు నగదు సాయం అందలేదు. అయితే వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోలేదన్న నిబంధనతో ప్రభుత్వ సాయాన్ని ఆపొద్దని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఏప్రిల్‌లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ నగదు జమ చేసింది. మొత్తంగా ఏప్రిల్‌లో 74.07 లక్షల మంది, మే నెలలో 74.35 లక్షల మంది కార్డుదారులకు రూ.1,500 చొప్పున రూ.2,227 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేశారు. బ్యాంకు ఖాతాలేని వారికి ఏప్రిల్‌లో 5.21 లక్షలు, మే నెలలో 5.38 లక్షల మంది కార్డుదారులకు పోస్ట్ ఆఫీసుల ద్వారా రూ.158.24 కోట్లు అందజేశారు. లబ్ధిదారులు భౌతిక దూరాన్ని పాటించి నగదు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉచిత బియ్యానికి సంబంధించి ఇప్పటి వరకు 81.49 లక్షల మంది కార్డుదారులకు 3.25 లక్షల టన్నుల బియ్యాన్ని, 5,187 టన్నుల కంది పప్పును పంపిణీ చేశామని తెలిపారు. -
రేషన్ తీసుకోని వారికి రూ.1,500 సాయం నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా కనీసంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండికూడా రేషన్ తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. వారికి ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.1,500 సాయాన్ని నిలిపివేసింది. దీనిద్వారా పౌర సరఫరాల శాఖకు రూ.67 కోట్ల మేర మిగులు వచ్చింది. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, 3 నెలలుగా రేషన్ తీసుకోని కుటుంబాల సంఖ్య ఒక్కో నెల ఒక్కోలా ఉంది. కాగా, రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.1,500 ఆర్థికసాయాన్ని అందిస్తోంది. తొలి విడతలో 74లక్షల మందికి, రెండో విడతలో 5.21 లక్షల మందికి పంపిణీ చేస్తోంది. మూడో విడతలో మరో 3లక్షల మందికి రూ.45 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం కాగా, మరో లక్ష కుటుంబాలకి బ్యాంకు ల్లో డబ్బులు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుటుంబాలన్నీ పోనూ మరో 4.50 లక్షలమంది కుటుంబాలు పూర్తిగా రేషన్ తీసుకోనివే. వీరికి రూ.1,500 ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్ బియ్యం వీ రి కి అవసరం లేనప్పుడు ప్రభుత్వ సాయం అనవసరమనే భావిం చాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
అడవి బిడ్డల ఆనందం
బుట్టాయగూడెం: రెక్కాడితేగానీ డొక్కాడని పేద గిరిజనులకు లాక్డౌన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సాయం కొండంత అండగా నిలిచింది. లాక్డౌన్ కారణంగా ముఖ్యంగా మారుమూల కొండరెడ్డి గిరిజనుల ఉపాధి కష్టతరంగా మారే పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రకటించిన సాయం వారికి వరంలా మారింది. ఫలితంగా అడవి బిడ్డలు రెండుపూటలా పట్టెడన్నం తింటున్నారు. కరోనాపై సరైన అవగాహన లేకున్నా గిరిపల్లెలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాయి. ఎవరూ గడప దాటి బయటకు రావడం లేదు. తమ గ్రామాల్లోకీ ఎవరినీ రానివ్వడం లేదు. గ్రామ పొలిమేరల్లో గిరిజనులు వెదురు తడికలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రోజుకు నలుగురు చొప్పున కాపలా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించిన బియ్యం, కందిపప్పు, రూ.1,000 పేదలకు వరంలా మారింది. గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు వల్ల మారుమూల దట్టమైన కొండకోనల్లో బాహ్య ప్రపంచానికి దూరంగా నివసిస్తున్న గిరిజనులకు సైతం సకాలంలో సాయం అందింది. దీంతో కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సహాయం మర్చిపోలేనిదని గిరిజనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గిరిజన ప్రాంతమైన పోలవరం నియోజకవర్గంలో 1,00,377 మంది తెల్ల రేషన్‌కార్డుదారులకు సుమారు 5,400 టన్నుల 875 కేజీల బియ్యం, 57,058 కేజీల కందిపప్పు పంపిణీ అయింది. వీటితోపాటు రూ. 1000 చొప్పున సుమారు రూ. 10,03,77,000 సొమ్ము నేరుగా లబి్ధదారులకు చేరింది. మారుమూల కుగ్రామాలకు సైతం ఒక్క రోజులోనే సాయం అందిందని, ఇది ఒక చరిత్ర అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా గిరిజనులకు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అండగా నిలిచింది కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచింది. బియ్యం, కందిపప్పు, రూ.1000 ఇవ్వడం వల్ల వాటితోనే పూట గడుపుకుంటూ జీవిస్తున్నాం. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇవ్వడం వల్ల కష్టకాలాన్ని ఎదుర్కోగలుగుతున్నాం. ప్రభుత్వానికి, దాతలకు కృతజ్ఞతలు. – పూసం భీముడు, కొండరెడ్డి గిరిజనుడు రేషన్ బియ్యంతో పొట్టపోసుకుంటున్నాం మాయదారి రోగం కరోనా కారణంగా పని లేకుండా పోయింది. దీంతో అందరూ ఇళ్లల్లోనే ఉండే పరిస్థితి నెలకొంది. భయంతో బయటకు వెళ్లలేకపోతున్నాం. ఈ పరిస్థితుల్లో కుటుంబ జీవనం కష్టతరంగా మారింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన రూ.1000, బియ్యం, కందిపప్పుతోనే పొట్ట పోసు కుంటున్నాం. కష్టకాలంలో ప్రభుత్వ సాయం మరువలేనిది. – సవలం ముత్యాలమ్మ, గిరిజనురాలు, గొల్లగూడెం -
తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ: కొడాలి నాని
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన విమర్శించారు. మంత్రి కొడాలి నాని సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్ ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ. ఎమ్మెల్యే కావడం కోసం సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమది. ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్ మంత్రి చేశారు. ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు భరోసా. టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసి రాకపోగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రైతులకు ప్రజలకు ధైర్యం చెప్పకపోగా వారి ఆత్మస్తైర్యం దెబ్బతినేల వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడాలనేది టీడీపీ ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయాలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాది. గత ఐదేళ్లు చంద్రబాబు చేసింది ప్రచార ఆర్భాటమే. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలుబొమ్మ. వ్యవస్థలు బాగుపడాలంటే నిమ్మగడ్డ రమేష్ లాంటి వారిని తీసేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎస్ఈసీగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్‌ను నియమించాం. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని నాటకాలాడుతున్నారు.’ అని ధ్వజమెత్తారు. 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ అంతకు ముందు మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ చేస్తామన్నారు. రెండో విడతలో 5 కేజీల బియ్యం, కేజీ శెనగలు ఇస్తామని తెలిపారు. 14వేల రేషన్ షాపులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, రేషన్ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కూపన్ల మీద ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్ దుకాణాల వద్దకు రావాలన్నారు. గ్రామ సచివాలయాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని, పౌర సరఫరాల శాఖ నేరుగా గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తోందన్నారు. -
పేద కుటుంబాలకు పెద్ద ఊరట..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ఆకలి బాధ పడకూడదని.. రేషన్ కార్డు ఉన్నా, లేకున్నా బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ఉపశమనం కలిగించింది. కొత్త కార్డు కోసం ప్రభుత్వానికి విన్నవించుకుని నెలలు గడుస్తున్నా.. అవి మంజూరు కాక, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి నోచుకోని వారంతా సీఎం ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లందరికీ ఇప్పుడు బియ్యం అందనుంది. రాష్ట్రంలో చాలా నెలలుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రతి జిల్లాలో కుప్పలు తెప్పలుగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా, వీటిల్లో కొన్ని క్షేత్ర స్థాయి పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగాయి. మీ–సేవ ద్వారా ఆహార భద్రతా కార్డు వెబ్సైట్లో ఆన్‌లౌన్ ద్వారా కొత్త కార్డులు, రదై్దన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా, చాలా వరకు పరిష్కారం దొరకలేదు. గత జూన్, జూలైలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రత్యేక బృందాలను నియమించి ఏడు రోజుల్లో కార్డులు జారీ చేయాలని ఆదేశించినా ఈ ప్రక్రియ నామమాత్రంగానే సాగింది. గ్రేటర్‌లోనే అత్యధికం... గత డిసెంబర్ నాటికి కొత్త దరఖాస్తుల సంఖ్య 4.44 లక్షలుగా ఉండగా, ఇందులో 1.62 లక్షల మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. మరో 2.82 లక్షల మందికి కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఈ మూడు నెలల కాలంలో మరో 20 వేల దరఖాస్తులు వచ్చినా కొత్త కార్డు దరఖాస్తులు 3 లక్షలకు చేరినట్లు సమాచారం. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1.65 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా యంత్రాంగాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 80వేల దరఖాస్తులు, రంగారెడ్డి పరిధిలో 60వేలు, మేడ్చల్ పరిధిలో 25వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. పూర్వ నల్లగొండ జిల్లా మొత్తంగా 40 నుంచి 50వేలు, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మరో 30వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయితే పెండింగ్ దరఖాస్తుదారులకు బియ్యం పంపిణీ చేయడం లేదన్న అంశా న్ని విలేకరులు సోమవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేసీఆర్, రాష్ట్రంలోని వలస కార్మికులకే రేషన్ బియ్యం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలకు బియ్యం అందడం లేదన్న అంశమే తలెత్తరాదన్నారు. బియ్యం అందని వారెవరైనా ఉంటే, దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి బియ్యం ఇప్పించాలని సూచిం చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని తెలిపారు. రేషన్ దరఖాస్తుదారులకు ఈ ప్రకటన పెద్ద ఉపశమనం కలిగించింది. -
గంటల కొద్దీ క్యూలోనే..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం కోసం పేదలకు పడిగాపులు తప్పడం లేదు. ఆదివారం సగం దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. మిగతా షాపుల వద్ద ఆహార భద్రత కార్డుదారులు రేషన్ కోసం గంటల కొద్ది వేచి ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వరుసగా నాలుగు రోజులు పరిమిత దుకాణాలు..ఆ తర్వాత మొత్తం షాపుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. పేదలు మాత్రం ఉదయం ఆరు గంటలకే రేషన్‌షాపుల వద్దకు చేరుకుని భారీగా బారులు తీరారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ కారణంగా గుంపులు గుంపులుగా నిలబడటం కనిపించింది. రేషన్ కోసం ఎగబడటం, కనీసం మాస్క్‌లు కూడా ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పనిచేయని పోర్టబిలిటీ రేషన్ పోర్టబిలిటీ ముప్పు తిప్పలు పెడుతోంది. హైదరాబాద్ మహా నగరంలో ఇతర జిల్లాల వారు అధికంగా ఉన్న కారణంగా పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ–పాస్ డాటాలో సాంకేతిక సమస్యల కారణంగా పోర్టబిలిటీలో బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా తయారైంది. దీంతో సుమారు 20 శాతం లబ్ధిదారులకు నిరాశ తప్పడంలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోర్టబిలిటీ తీరు ఇలా ఉంటే జాతీయ పోర్టబిలిటీ అసలుకే పనిచేయడం లేదు. ఏపీకి చెందిన తెల్లరేషన్ కార్డుదారులు పోర్టబిలిటీ విధానంలో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఐదురోజుల్లో ఇలా... మహా నగర పరిధిలో ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. ఐదో రోజు నాటికి సుమారు 6.19 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం చేరింది. ఆదివారం మొత్తం షాపుల్లో సగానికి పైగా తెరుచుకున్నాయి. దీంతో ఉచిత బియ్యం పంపిణీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదురోజుల్లో జరిగిన బియ్యం పంపిణీ జిల్లాల వారిగా పరిశీలిస్తే... హైదరాబాద్ జిల్లా పరిధిలో మొదటి రోజు 7600 కుటుంబాలకు 3,51,446 కిలోల బియ్యం, రెండో రోజు 8324 కుటుంబాలకు 3,92,677 కిలోలు, మూడో రోజు 9428 కుటుంబాలకు 4,50,440 కిలోలు, నాల్గో రోజు 55035 కుటుంబాలకు 25,14,215 కిలోల బియ్యం పంపిణీ చేశారు. నాలుగు రోజుల్లో మొత్తం 83088 కుటుంబాలకు 36,88,778 కిలోల పంపిణీ జరగ్గా, కేవలం ఐదో రోజు సుమారు 85 వేలకు పైగా కుటుంబాలకు బియ్యం పంపిణీ జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ ఇక రంగారెడి జిల్లా పరిధిలో పరిశీలిస్తే మొదటిరోజు 32,479 కుటుంబాలకు 12,86,951 కిలోలు, రెండో రోజు 73828 కుటుంబాలకు 30,37,803 కిలోలు, మూడో రోజు 48377 కుటుంబాలకు 19,66,791 కిలోలు, నాల్గో రోజు 77365 కుటుంబాలకు 31,43, 497 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మొత్తం నాలుగు రోజుల్లో 232049 కుటుంబాలకు 94,35,042 కిలోల బియ్యం పంపిణీ జరిగితే, ఐదో రోజు 49వేలకు పైగా కుటుంబాలకు బియ్యం అందజేసినట్లు సమాచారం. ♦ అలాగే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో పరిశీలిస్తే... మొదటి రోజు 10558 కుటుంబాలకు 4,17,758 కిలోల బియ్యం, రెండో రోజు 17241 కుటుంబాలకు 7,01,991 కిలోలు, మూడో రోజు 12598 కుటుంబాలకు 5,17,796 కిలోలు, నాల్గో రోజు 51734 కుటుంబాలకు 21,78,325 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మొత్తం నాలుగు రోజుల్లో 92131 కుటుంబాలకు 38,15,870 కిలోలు పంపిణీ జరగ్గా, ఐదు రోజు 78 వేలకు పైగా కుటుంబాలకు బియ్యం పంపిణీ జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
రేషన్' ఫ్రీ'
నెల్లూరు(పొగతోట): కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా బియ్యం, కంది పప్పు ఉచితంగా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చేశారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1,17,599 మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. 12.37 శాతం మందికి రేషన్ పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 9,04,220 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,895 చౌకదుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. వచ్చే నెల 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ పంపిణీకి ప్రత్యేకకాధికారులను నియమించారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్డు దారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేకాధికారి వేలిముద్ర ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. కంది పప్పు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో అనేక చౌకదుకాణాలల్లో బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. కందిపప్పు రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సరఫరా చేసి కార్డుదారులకు ఉచితంగా అందజేయనున్నారు. చౌకదుకాణాల వద్ద కార్డుదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అందరికీ రేషన్ పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రోజుకు ఇద్దరు, ముగ్గురు వలంటీర్ల ఆధ్వర్యంలో ఉండే కార్డుదారులకు సమాచారం ఇస్తున్నారు. సమాచారం ఇచ్చిన కార్డుదారులు చౌకదుకాణానికి వస్తే ప్రత్యేక అధికారులు కార్డులో వివరాలు నమోదు చేసి రేషన్ పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుడికి బదులు ప్రత్యేకాధికారి వేలిముద్ర వేస్తున్నాడు. కార్డుదారులు అవస్థలు పడకుండా రేషన్ పంపిణీ చేస్తున్నారు. చెక్కర మాత్రం కార్డుదారులు కొనుగోలు చేయాల్సి ఉంది. కందిపప్పు అవసరం అనుకున్న కార్డుదారులు నగదు చెల్లిస్తే మరొక కేజీ కందిపప్పు ఇస్తున్నారు. సక్రమంగా సరుకుల పంపిణీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయంలో సివిల్ సప్లయ్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రేషన్ పంపిణీ ప్రక్రియలో కార్డుదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒక్కో చౌక దుకాణంలో రోజుకు 100 నుంచి 150 మంది కార్డుదారులకు మాత్రమే రేషన్‌ను పంపిణీ చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం లారీలు త్వరగా అన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. డీఎస్ఓ బాలకృష్ణారావు, డీఎం రోజ్‌మాండ్, వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి, జిల్లా కోఆపరేటివ్ అధికారి తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
పేదకుటుంబాల ఆహార భద్రతకు...
-
రేషన్ సరఫరా..
వనపర్తి క్రైం: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరాల కోసం తప్ప.. దేనికీ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు రోడ్లపైకి ఎవ్వరినీ రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. సోమవారం ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించారు. ఇదే సందర్భంలో పేదలు బయటకు రాకుండా, పనులకు వెళ్లకుండా ఉంటే కుటుంబపోషణ భారమవుతుందని భావించిన ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణీ చేస్తామని తెలిపింది. ప్రతి రేషన్‌కార్డుపై నెలకు సరిపడే (ఒక్కో కుటుంబానికి 12కిలోలు), నిత్యావసర సరుకుల కోసం రూ.1500 నగదు అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో లబ్ధిదారులకు రూ.23.12కోట్ల నగదు పంపిణి చేయనున్నారు. జిల్లాలోని 1,54,165 రేషన్ లబ్ధిదారులకు 18.499 క్వింటాళ్ల బియ్యం అందనుంది. నేటి నుంచి అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 1,54,165 రేషన్‌కార్డులు జిల్లాలో 1,54,165 రేషన్ కార్డులు ఉండగా.. అందులో 114 అన్నపూర్ణకార్డులు, 9,871 అంత్యోదయ కార్డులు, 1,44,180 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో 5,19,160 యూనిట్లు ఉండగా.. ఒక్కో కుటుంబానికి 12కిలోల చొప్పున 6229.92 మెట్రిక్ టన్నుల (18.499 క్వింటాళ్ల బియ్యం) పంపిణీ చేయాల్సి ఉంది. వీటితోపాటు నిత్యావసర సరుకుల కోసం రేషన్‌కార్డుకు రూ.1500 చొప్పున జిల్లాకు రూ.23కోట్ల 12లక్షల 47వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. వీటిని ఈ రెండు, మూడు రోజుల్లో అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికే రేషన్ బియ్యం జిల్లాకు చేరే అవకాశం ఉందని డీఎస్ఓ రేవతి తెలిపారు. -
కోవిడ్ ఎఫెక్ట్: 6 నెలల రేషన్ ఒకేసారి
న్యూఢిల్లీ: వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ఉన్న 75 కోట్ల లబ్ధిదారులు 6 నెలల రేషన్ సరుకులను ఒకేసారి తీసుకోవచ్చని కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు గరిష్టంగా 2 నెలల వరకు రేషన్ సరుకులను తీసుకునేందుకు అవకాశం ఉండగా.. పంజాబ్ ఇప్పటికే ఆరు నెలల సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘గోదాముల్లో సరిపడా సరుకులున్నాయి. పేద వారికి ఆరు నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాం’అని పాశ్వాన్ చెప్పారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 435 లక్షల టన్నుల మిగులు ఆహార ధాన్యాలున్నాయని, అందులో 272.19 లక్షల టన్నుల బియ్యం, 162.79 లక్షల టన్నుల గోధుమలున్నాయని పేర్కొన్నారు. -
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, ఖమ్మం : నగదు రహిత లావాదేవీలకు రేషన్ దుకాణాలు వేదికలుగా మారాయి. కార్డులపై వినియోగదారులకు ఇప్పటివరకు బియ్యం, పంచదార వంటి సరుకులను పంపిణీ చేసిన దుకాణాలు.. ఈ నెల నుంచి బహుళ సేవలు అందించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా సాగేందుకు.. రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకునే వినియోగదారులు ఇతర సేవలు ఇక్కడి నుంచే పొందేందుకు అవకాశం కల్పించడం వల్ల ఇటు వినియోగదారులకు.. అటు డీలర్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం ప్రత్యేకంగా టీ–వాలెట్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 669 రేషన్ దుకాణాలు ఉండగా.. కార్డులు 4,07,622 ఉన్నాయి. వీటికి నెలవారీగా 64,29,346 కేజీల బియ్యం సరఫరా అవుతుంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువులు సరఫరా చేసేవారు. బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి వంటివి రేషన్ కార్డుదారులకు అందించేవారు. అయితే ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. పంచదార కూడా అంత్యోదయ కార్డులున్న వారికే ఇస్తున్నారు. దీనివల్ల రేషన్ డీలర్లు బియ్యం ఒక్కటే అమ్ముతున్నందున తమకు కమీషన్ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని సేవలను అందించడం వల్ల డీలర్లకు కమీషన్ పెంచడంతోపాటు డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అలవాటు చేయవచ్చనే ఉద్దేశంతో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అందుతున్న సేవలివే.. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న మొత్తంలో లావాదేవీల కోసం బ్యాంక్‌కు కానీ.. మీసేవ కేంద్రానికి కానీ వెళ్లాల్సి వచ్చేది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత జనం ఎక్కువగా ఉంటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చిన్న మొత్తంలో లావాదేవీలు చేయాలంటే రేషన్ దుకాణానికి వెళితే చాలు.. అక్కడ మన పని క్షణాల్లో చేసుకునే సదుపాయం కల్పించారు. రూ.2వేలలోపు లావాదేవీలను ఇక్కడ చేసుకునే వీలు కల్పించారు. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంతో వినియోగదారులకు డిజిటల్ లావాదేవీలు చేసుకోవడం ఇక సులువుగా మారింది. రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్ విధానం ద్వారా మొబైల్ రీచార్జి, నగదు బదిలీ, డీటీహెచ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు, బస్ టికెట్ బుకింగ్, ఇంటర్నెట్ సర్వీస్ చార్జీలు, ఆధార్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినందుకు రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించనున్నారు. దీంతో రేషన్ డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం కలగనున్నది. ప్రారంభమైన సేవలు జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఈ డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. గత నెలలో ఒక రోజుపాటు ఈ లావాదేవీలపై రేషన్ డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే డీలర్లు లావాదేవీలు ఎలా చేయాలో శిక్షణ పొందడంతో రేషన్ దుకాణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటిని కొత్తగా ప్రవేశపెట్టడం.. కొందరు డీలర్లకు దీనిపై ఇంకా పూర్తి అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో లావాదేవీలు జరగడం లేదు. దీనిపై రేషన్ డీలర్లు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారికి అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో సూచనలు చేసి.. లావాదేవీలు నిర్వహించేలా చూడనున్నారు. టీ–వాలెట్ సేవలు అందిస్తున్నాం.. రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్ ద్వారా సేవలు అందిస్తున్నాం. అయితే ఇప్పుడే కొత్త కావడంతో వినియోగదారులు పూర్తిస్థాయిలో అలవాటు కాలేదు. రేషన్ దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విధానం వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – షేక్ ఇబ్రహీం, రేషన్ డీలర్ పటిష్టంగా అమలు చేస్తాం.. రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్‌ను అమలు చేసేందుకు ఇటీవల డీలర్లకు శిక్షణ ఇచ్చాం. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్ ద్వారా లావాదేవీలు చేయిస్తున్నాం. ఏ ప్రాంతంలోనైనా టీ–వాలెట్ అమలు కాకపోతే మరోసారి డీలర్లకు సూచనలు చేసి పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – అనిల్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
పైలెట్‌లోనే సవాళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రారంభించిన రేషన్ నేషనల్ పోర్టబిలిటీ పైలట్ ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించి రెండు నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు. పౌరసరఫరాల అధికారులకు సైతం ఈ ప్రాజెక్టుపై స్పష్టత కరువైంది. దీంతో లబ్ధిదారుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. తెలంగాణ æఈపీడీఎస్తో ఏపీ ఈపీడీఎస్ డేటా పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడమే ఇందుకు కారణం. డీలర్లు బయోమెట్రిక్ గుర్తించడం లేదంటూ సరుకులు పంపిణీ చేయడం లేదు. దీంతో నగరానికి ఉపాధి కోసం వలస వచ్చిన ఏపీ తెల్లరేషన్ కార్డుదారులకు నేషనల్ పోర్టబిలిటీ కింద సరుకులు అందే దాఖలాలు కానరావడం లేదు. ఇదీ ప్రాజెక్టు... దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం–ఒకే కార్డు’ పేరుతో జూన్–2020 నుంచి అమలు చేయనున్న ‘నేషనల్ పోర్టబిలిటీ’ విధానం కోసం పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక క్లస్టర్.. గుజరాత్, మహారాష్ట్రను మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖాధికారులు మహానగరంలో ఈ విధానం అమలుకు సరిగ్గా రెండు నెలల క్రితం ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. అంతకముందు నగరంలోని ఒక ప్రభుత్వ చౌకధరల దుకాణంలో ట్రయల్ రన్ చేసి ఆంధ్రప్రదేశ్ లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో సుమారు లక్షకు పైగా ఏపీ లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. వీరు నేషనల్ పోర్టబిలిటీ కింద ఇక్కడే సరుకులు పొందేందుకు వీలుంది. అయితే వారు కేంద్ర ఆహార భద్రత పథకం కింద నమోదై ఉండాలి. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పౌరసరఫరా అధికారులు మొత్తం కార్డుదారులను బట్టి 70:30 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ఆహార భద్రత కార్డుల కింద కేటాయిస్తారు. పంపిణీ ఇలా... తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు నేషనల్ పోర్టబిలిటీ కింద బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను కేంద్రం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం అందజేస్తారు. వీరికి ఐదు కిలోల చొప్పున కుటుంబానికి 20 కిలోలకు మించకుండా మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారు. కిలోకు రూ.3 చెల్లించాల్సి ఉంటుంది. అదే తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థానికంగా ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు కిలో బియ్యం రూ.1 చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోలు పంపిణీ చేస్తోంది. బియ్యం కోటాపై పరిమితి లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని ఆరు కిలోల చొప్పున అందిస్తోంది. -
ఎక్కడుంటే అక్కడే రేషన్..
బొబ్బిలి: బతుకుదెరువు కోసం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు, కుటుంబాలు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. రేషన్ కార్డు తొలగింపు భయమే ‘రద్దయిపోయింది’. ఇప్పటి వరకూ అంతర్ జిల్లాల స్థాయిలోనే అంతంత మాత్రంగా ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రారంభించింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించి, ఏపీ లబ్ధిదారులకు తెలంగాణలో రేషన్ ఇచ్చే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. దీని వల్ల రేషన్ కార్డు రద్దవుతుందనే ఇబ్బందులు లేని వ్యవస్థ మొదలుకానుంది. కార్డు డిలీట్ కష్టాలకు ఇక చెక్.. జిల్లాలో 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా 846 అన్నపూర్ణ కార్డులుండగా.. 1,117 మంది లబ్ధిదారులన్నారు. అలాగే అంత్యోదయ కార్డులు 84,972 ఉంటే అందులో లబ్ధిదారులుగా 2,34,076 మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు 6,27,235 ఉండగా, లబ్ధిదారులు 18,25,778 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా దారిద్య్ర రేఖ దిగువన జీవిస్తున్న వారికి తెల్ల రేషన్ కార్డులు 7,13,053 ఉన్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు 80 వేలకు పైగానే ఉన్నాయి. అనేక కుటుంబాలు.. పిల్లలను కూడా అక్కడే చదివిస్తున్నాయి. వలస వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పటికీ రెండుమూడు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి రేషన్, పింఛన్లు తీసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి రాలేని వారి కార్డులు కూడా డిలీట్ అయిన సందర్భాలున్నాయి. కూలీలకు మరింత ప్రయోజనం.. కొత్తగా తీసుకొచ్చిన పొర్టబిలిటీ విధానాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించడం రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూరుస్తుంది. దీని వల్ల ఆయా కుటుంబాలు ఎక్కడుంటే అక్కడే రేషన్ తీసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల వలస కూలీలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే కొంత మంది నాలుగేసి నెలల పాటు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్తుంటారు. వారు ఇకపై అక్కడ మార్కెట్లో కొనుగోలు చేసుకోకుండా, రేషన్ ద్వారానే బియ్యం, ఇతర సరుకులు తీసుకోవచ్చు. గతంలో జిల్లా వరకే.. రాష్ట్రంలో 2015లో ఈ పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించినా కేవలం మండలాలకే పరిమితమై ఉండేది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఇతర మండలాల కార్డులను అనుసరించి సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ, అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నూతనంగా అమల్లోకి వచ్చింది. -
పైకమిస్తేనే చంద్రన్న సరుకులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు ఎం.పైడయ్య. నివాసముండేది మున్సి పాలిటీలోని 8వ వార్డు అమ్మిగారి కోనేటిగట్టు. చంద్రన్న రేషన్ సరుకుల కోసం అతని కార్డు ఉన్న 307వ నంబర్ రేషన్ షాపునకు వెళ్లగా అక్కడున్న డీలర్ రూ.10లు ఇచ్చి సరుకులు తీసుకెళ్లాలని ఓ కార్డు కూడా చేతిలో పెట్టాడు. దీంతో వృద్ధుడు రూ.10 ఇచ్చి కార్డు చూపించుకుంటూ సరుకులు తీసుకెళ్లాడు. ఇక్కడ వినియోగదారుడు నిజమైనా.. డీలర్ బినామీ కావడం విశేషం. విజయనగరం, బొబ్బిలి: రాష్ట్రంలో చంద్రన్న సరుకులు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో కమీషన్లు చాలక రేషన్ డీలర్లు చిలక్కొట్టుళ్లకు పాల్పడుతున్నారు. చంద్రన్న సరుకులు ఇచ్చేందుకు రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, వాటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు రేషన్ డీలర్ల డిమాండ్లను పక్కన పెట్టేయడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా తయారైంది. జిల్లాలో 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రెండో అంచెగా రేషన్ షాపులకు సరుకులను తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1456 రేషన్ దుకాణాల్లో అధిక సంఖ్యలో బినామీ డీలర్లు వ్యవహరిస్తున్నారు. వీరు గతంలోలా ఈ వెయింగ్‌లో బియ్యం, సరుకులు ఇవ్వడం లేదు. వాస్తవానికి ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న ఈ వెయింగ్ మెషీన్లనే వినియోగించడం లేదు. దీంతో వీరు కూడా డబ్బాలతోనూ, లేదా రాళ్లను ఈ వెయింగ్ మెషీన్లు పెట్టి చీటీలు ఇస్తున్నారు. ఈ స్లిప్‌లు పట్టుకుని డబ్బులు తీసుకువెళితే బియ్యం ఇస్తారు. ఇలా చేయడం వలన ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లతో పాటు డీలర్ల వద్దా తూకం తరుగు మిగులుతోందని వినియోగదారులు వాపోతున్నారు. నిలిచిపోయిన డిజిటల్ చెల్లింపులు .. జిల్లాలో గతంలో చేపట్టిన డిజిటల్ చెల్లింపుల విధానం నిలిచిపోయింది. దీంతో అందరు డీలర్లూ డబ్బులు తెస్తేనే సరుకులు ఇస్తున్నారు. ఏటీఎం కార్డు పట్టుకుని రేషన్ షాపునకు వెళితే అక్కడున్న డీలర్ ఆశ్చర్యంగా వినియోగదారుల వైపు చూస్తున్నారు. గతంలో ఈ విధానం అమలుకోసం డీలర్ల చేత కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేయించారు. ఈ అకౌంట్లు ఇప్పుడు పడకేసినట్టున్నాయి. అంతే కాదు ప్రతీ నెలా ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారికి బహుమతులు అందించే వారు సెల్‌లను డీఎస్ఓ, జేసీల చేతుల మీదుగా అందజేసి ప్రోత్సహించేవారు. ఇప్పుడా విధానం మానేసి దాదాపు రెండేళ్లు పైనే అయిందని పౌరసరఫరాల అధికారే ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. -
ఐరిష్‌తో రేషన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పేద కుటుంబాలకు సబ్సిడీపై అందజేస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత రానుంది. ఇకపై ఐరిష్ (కనుపాప) విధానంలో లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల 15 నుంచి 25వ తేదీల మధ్య ఈ విధానం ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. జిల్లా సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. అక్టోబర్ ఒకటి నుంచి ఐరిష్ విధానంలో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తారు. కార్డుదారుల వేలిముద్రల ఆధారంగా ఈ–పాస్ మిషన్ల ద్వారా సరుకులు అందజేస్తున్న పద్ధతికి చరమగీతం పాడనున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా కూడా సరుకుల పంపిణీలో అడపాదడపా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఐరిష్ విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వేలిముద్రల విధానం కంటే మరింత సులభంగా, వేగంగా ఐరిష్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేయొచ్చని చెబుతున్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసిన సమయంలోనే లబ్ధిదారుల చేతి వేలిముద్రలు, ఐరిష్ (కనుపాప)ను అనుసంధానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్డుదారుడు, వారి కుటుంబ సభ్యుల నుంచి మరోసారి ఐరిష్ సేకరించాల్సిన పనిలేదు. కాకపోతే ఇప్పుడున్న ఈ–పాస్ మిషన్ల స్థానంలో కొత్తగా ఐరిష్ కాప్చర్ మిషన్లను అందుబాటులోకి తెచ్చి సరుకులు పంపిణీ చేయనున్నారు. దశల వారీగా సంస్కరణలు.. రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం దశల వారీగా సంస్కరణలు చేపడుతోంది. తొలుత రేషన్ కార్డుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించి బోగస్ కార్డులను ఏరివేసింది. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా ఈ–పాస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చి వేలిముద్రల ద్వారా సరుకులను పంపిణీ చేస్తోంది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో 2016 మార్చి నుంచి అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో దీన్ని మన జిల్లా గ్రామీణ ప్రాంతానికి గతేడాది జూలైలో విస్తరించారు. దీని ఫలితంగా సరుకులు పక్కదారిపట్టడం దాదాపు తగ్గిపోయింది. నెలకు సగటున 25 నుంచి 27 శాతం కోటా ప్రతినెలా మిగులుతూ వస్తోంది. జిల్లాలో ఈ–పాస్ అమలుకు ముందు ప్రతినెలా 11,024 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేశారు. ఈ–పాస్ వినియోగంలోకి వచ్చాక ఈ కోటా 8,300 మెట్రిక్ టన్నులకే పరిమితమవుతోంది. అంటే ప్రతినెలా సగటున 2,700 మెట్రిక్ టన్నుల కోటా మిగులుబాటు అవుతోంది. అయితే, ఈ పద్ధతిలోనూ ఆయా జిల్లాల్లో బియ్యం పక్కదారి పడుతున్నట్లు సర్కారు గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఐరిష్ విధానంలో సరుకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. తొలుత రాష్ట్రంలో ఈనెల 15 నుంచి నాలుగు జిల్లాల్లో అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ విజయమైతే రెండో దశలో వచ్చేనెల తొలివారంలో మరికొన్ని జిల్లాల్లో, మూడో దశలో మన జిల్లాకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 7శాతం మిగులు.. బయోమెట్రిక్ విధానంలో సగటున ప్రతినెలా 25 శాతం బియ్యం కోటా మిగులుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఐరిష్ విధానాన్ని అమలు చేస్తే మరో 7 శాతం (581 మెట్రిక్ టన్నులు) వరకు కోటా ఆదా అవుతుందని పౌర సరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బయోమెట్రిక్ విధానంలో కుష్టువ్యాధి గ్రస్తులు, చేతులు లేని, వేలి ముద్రలు చెరిగిపోయిన లబ్ధిదారులు సరుకులు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఐరిష్ విధానంలో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ‘వచ్చే నెలలో మన జిల్లాలో ఐరిష్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాకు ఆదేశాలు అందాయి. బయోమెట్రిక్ కంటే ఐరిష్ విధానం అత్యుత్తమం. లబ్ధిదారులు సులభంగా సరుకులు పొందవచ్చు’ అని జిల్లా సరఫరాల అధికారి రమేష్ తెలిపారు. -
ఎక్కడి నుంచైనా..
సాక్షి, కామారెడ్డి : రేషన్ వినియోగదారులకు శుభవార్త.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరుకులు పొందే అవకాశం నేటి నుంచి అమల్లోకి రానుంది. తద్వారా వలస జీవులకు ఊరట కలగనుంది. రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత సరకులు తీసుకోవడానికి వినియోగదారులు ఎక్కడ ఉన్నా సొంత గ్రామానికి రావలసి వచ్చేది. కొన్నిసార్లు రేషన్ సరకులు తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యేవారు. కొందరు రేషన్ దుకాణాల డీలర్లకే వదిలేసే పరిస్థితి ఉండేది. అయితే, ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంతో ఇకపై ఆ ఇబ్బంది తొలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోర్టబిలిటీ పద్ధతి’ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు మంచి అవకాశం కల్పించింది. బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వలస వెళ్లిన వినియోగదారులు తాము ఉంటున్న చోట అందుబాటులో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి సరకులు తీసుకునే అవకాశం ఏర్ప డింది. కామారెడ్డి జిల్లాలో 2.46 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతీ నెలా 5,400 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. చాలా మంది బతుకుదెరువు కోసం సమీప పట్టణాలకో, నగరాలకో వలస వెళ్లారు. అయితే, ప్రతీ నెల రేషన్ సరుకులు సొంత గ్రామానికి వెళ్లి తీసుకోవలసి వచ్చేది. రేషన్ సరకులు సరఫరా చేస్తున్న రోజుల్లో ఏదో ఒ క రోజు గ్రామానికి వెళ్లి సరకులు తీసుకునే వారు. వరుస గా మూడు నెలల పాటు సరకులు తీసుకోనట్టయితే రేషన్ కార్డు రద్దవుతుందన్న భయంతో ఎంత దూరం ఉన్నా స రే, ఎంత ఖర్చయినా సరే షాపునకు వెళ్లి సరుకులు తీసుకునే వారు. అయితే, ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం తో పాటు పోర్టబిలిటీని కూడా అమలులోకి తేవడంతో రే షన్ సరుకులు ఎక్కడైనా తీసుకునే అవకాశం లభించనుంది. రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా సరే తమ రేషన్ కార్డును తీసుకెళ్తే చాలు అక్కడ సరుకులు ఇచ్చేస్తారు. తద్వారా వినియోగదారులకు వ్యయ ప్రయాసలు తగ్గినున్నాయి. లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం.. ఎక్కడున్నా రేషన్ సరుకులు తీసుకోవడానికి ఆస్కారం కల్పించడంతో లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లు ఒక చోట, రేషన్ షాపులు మరో చోట ఉంటాయి. తమకు సమీపంలో రేషన్ దుకాణాలు ఉన్నప్పటికీ ఇంత కాలం అక్కడ రేషన్ తీసుకునే అవకాశం లేకుండేది. అయితే పోర్టబిలిటీ విధానంతో తమకు అందుబాటులో ఉన్న షాపునకు వెళ్లి రేషన్ సరకులు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. . -
ఎక్కడి నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా (పోర్టబిలిటీ) ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) లబ్ధిదారులు నిత్యావసర సరుకులు తీసుకునే సదుపాయాన్ని పౌర సరఫరాలశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం నుంచి (ఏప్రిల్ 1) ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇటీవలే నెలపాటు జిల్లాల పరిధిలో అమలు చేసిన పోర్టబిలిటీ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఇప్పటివరకు కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్ షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. ఇల్లు మారినా, కొత్త ఇంటికి దగ్గరలో రేషన్ షాపున్నా కూడా పాత షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. పోర్టబిలిటీ విధానం ద్వారా ఈ పరిస్థితికి పౌర సరఫరాలశాఖ చరమగీతం పాడింది. ఒకే కార్డున్న కుటుంబం వేర్వేరు చోట్లా తీసుకోవచ్చు... రాష్ట్రంలో ఉన్న 85 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.75 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందించేందుకు 17 వేల రేషన్ షాపులున్నాయి. వీటన్నిటినీ ఇప్పటికే ఆన్లైన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అంతేకాదు ఒకే రేషన్ కార్డులో ఉన్న సభ్యులు వేర్వేరు రేషన్ షాపుల్లో తమ అవసరానికి తగినట్లుగా సరుకులు పొందవచ్చు. ఉదాహరణకు కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే ఇద్దరు సభ్యులు తమ కోటాకు సంబంధించిన బియ్యాన్ని మహబూబ్‌నగర్‌లో, మరో ముగ్గురు మెదక్‌లోనూ తీసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఆదిలాబాద్‌లో గోధుమలు తీసుకుంటే మరొకరు రంగారెడ్డిలో కిరోసిన్ తీసుకోవచ్చు. టీ–రేషన్ యాప్‌లో లొకేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా కార్డుదారుడికి దగ్గరలోని రేషన్ షాప్ వివరాలు గూగుల్ మ్యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. సరుకులు తీసుకున్న వెంటనే లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ ద్వారా తమ కోటాకు సంబంధించిన మొత్తం సమాచారం అందుతుంది. లబ్ధిదారులు వరుసగా ఏడాదిపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా వారి కార్డును తొలగించరు. వాళ్లకు ఎప్పుడు అవస రముంటే అప్పుడు సరుకులు తీసుకోవచ్చు. పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి పోర్టబిలిటీ విధానం ఎంతగానో దోహదపడనుంది. పోర్టబిలిటీతో డీలర్లలో మార్పు: సీవీ ఆనంద్ జిల్లాల్లో ఇప్పటివరకు అమలు చేసిన పోర్టబిలిటీతో రేషన్ డీలర్లలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఎక్కువమంది తమ షాపుల్లో సరుకులు తీసుకునేలా సేవలు అందించడానికి పోటీ పడుతున్నారని పౌర సరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సమయ పాలన పాటిస్తూ కార్డుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. ఈ విధానంలో రేషన్ దుకాణాలకు ముందుగానే 10 నుంచి 15 శాతం ఎక్కువ సరుకులను కేటాయిస్తామన్నారు. -
పంపిణీ పకడ్బందీ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రేషన్ బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటివరకు తమ పరిధిలోని రేషన్ దుకాణంలో బియ్యం తీసుకున్న లబ్ధిదారులు.. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రతి రేషన్ దుకాణానికి కోటాకన్నా.. 20 శాతం ఎక్కువ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. పోర్టబులిటీ విధానం ప్రవేశపెట్టి.. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సరుకులు లబ్ధిదారులకు అందేలా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 669 రేషన్ దుకాణాలు ఉండగా.. ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. వీటిని డీలర్లు.. లబ్ధిదారులకు నిర్ణీత తేదీలు, సమయాల్లో పంపిణీ చేస్తుంటారు. అయితే రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. బతుకు దెరువు కోసం మరోచోట నివాసం ఉంటున్నా.. డీలర్లు సరుకులు ఇచ్చే సమయానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి సొంత ఊరికి రావాల్సి వచ్చేది. అటువంటి వారికి వెసులుబాటు కల్పించేందుకు.. సరుకులు పక్కదారి పట్టకుండా.. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచైనా.. ప్రస్తుతం అమలు చేయనున్న పోర్టబులిటీ విధానంతో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి.. కార్డు నంబర్ చెప్పి.. అక్కడ వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లినా.. రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల సరుకులు నష్టపోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి నుంచే జిల్లావ్యాప్తంగా పోర్టబులిటీ విధానం అమలవుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కార్డు నంబర్ చెప్పి రేషన్ సరుకులు తీసుకునే వీలుంటుంది. 20 శాతం అదనంగా కేటాయింపు.. రేషన్ బియ్యం ఎక్కడి నుంచైనా తీసుకునే వీలుండటంతో అందుకు అనుగుణంగా బియ్యం కేటాయింపులు కూడా చేశారు. ప్రతి రేషన్ దుకాణానికి అదనంగా 20 శాతం బియ్యం కేటాయించారు. ఏ రేషన్ షాపు నుంచైనా తమ లబ్ధిదారుడు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు బియ్యం తీసుకెళ్తే ఇచ్చేందుకు వీలుగా ఎక్కువ మొత్తం కేటాయించారు. రేషన్ దుకాణంలో బియ్యం మిగిలితే తర్వాతి నెలకు కేటాయిస్తారు. ఇప్పటి వరకు జిల్లాకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ఇకనుంచి 8,699.64 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నది. అదనంగా బియ్యం వచ్చాయి.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపులకు పకడ్బందీగా బియ్యం పంపిణీ చేసేందుకు మరింత చర్యలు చేపట్టింది. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 20 శాతం బియ్యాన్ని అదనంగా కేటాయించింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు కానుంది. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం -
తరుగు..బస్తాకు 3 కిలోలు
పై చిత్రం పద్మాజీవాడి రేషన్ షాపులోనిది.. ఎల్ఎంఎస్ పాయింట్ నుంచి దుకాణానికి సరఫరా అయిన బియ్యం తూకం వేయగా.. 50 కిలోల బస్తాలో మూడు కిలోల తరుగు వచ్చింది. ప్రతి నెల ఇలాగే బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్ కిషన్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. సదాశివనగర్: ఆహార భద్రతాకార్డులు కలిగిన వారికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్ జరుగుతోంది. గోదాముల నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం సంచుల్లో.. బస్తాకు మూడు నాలుగు కిలోల తరుగు వస్తోంది. దీంతో రేషన్ డీలర్లు నష్టపోతున్నారు. నిబంధనల మేరకు ఒక్కో బస్తాలో 50 కిలోల బియ్యం ఉండాలి. హమాలీలు బస్తాలను లారీలలో ఎత్తేముందు ఒక్కో బస్తాను గోదాంలో తూకం వేస్తారు. తూకం తక్కువ ఉంటే బస్తాలో తిరిగి ఆ మేరకు బియ్యాన్ని కలిపి బస్తాలు కుట్టి పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో బస్తాలో ఒక్కో తీరుగా బియ్యం తూకం వస్తున్నాయని డీలర్లు పేర్కొంటున్నారు. బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు ఉంటోందంటున్నారు. యంత్రంతో లెక్కపక్కా.. ఒక్కో చౌకధరల దుకాణంలో లబ్ధిదారుల వివరాలను ముందుగానే యంత్రానికి అనుసంధానం చేయడంతో వారు చౌకధరల దుకాణంలో బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు నమోదు చేయగానే వారికి అందాల్సిన బియ్యం వివరాలను మిషన్ తెలియజేస్తుంది. బియ్యం తూకం వేసే సమయంలో ఏ మాత్రం తక్కువగా ఉన్నా వివరాలను చూపించదు. ఈ రకంగా తూకం వేస్తే ఒక్కో బస్తాకు మూడు కిలోలపైనే తక్కువగా వస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. నష్టపోతున్నాం.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లో తరుగు వస్తోంది. బస్తాకు మూడు నుంచి ఐదు కిలోలు తక్కువ వస్తున్నాయి. దీంతో నష్టపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – కిషన్‌రావు, రేషన్ డీలర్, పద్మాజీవాడి తరుగు లేకుండా చూస్తాం గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యంలో తరుగు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సరైన తూకంతో బియ్యం సరఫరా చేయాలని సూచించాం. గోదాంలో తూకం వేసిన తర్వాతే డీలర్లకు అందేలా చర్యలు తీసుకుంటాం. – అమీన్‌సింగ్, తహసీల్దార్, సదాశివనగర్ -
తిప్పలు తప్పినట్లే...!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రేషన్ కార్డు ఏ గ్రామంలో ఉంటే.. కార్డుదారులు అక్కడే సరుకులు తీసుకునే విధానం ఉండేది. దీనివల్ల బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ఇబ్బందిపడేవారు. ఇక అటువంటి వాటికి పౌరసరఫరాల శాఖ స్వస్తి పలకనున్నది. అమలులోకి రానున్న కొత్త విధానంతో జిల్లాలో ఎక్కడి నుంచైనా లబ్ధిదారులు సరుకులు తీసుకునే వీలు కలగనుంది. జిల్లాలోని 21 మండలాల్లో గల 669 రేషన్ దుకాణాలకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. వీటిని డీలర్లు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. రేషన్ పంపిణీ చేసే రోజుల్లో లబ్ధిదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. మరెక్కడైనా నివాసం ఉంటున్నా.. సరుకులు తీసుకునేందుకు స్వగ్రామానికి రావాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి లబ్ధిదారులకు ఆ అవసరం ఉండదు. అమలు ఇలా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేయనున్న విధానంతో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి కార్డు నంబర్ చెప్పి.. వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వాళ్లు ఎక్కడికి వెళ్లినా రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల రేషన్‌ను నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. దీనికి సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు ఎంత మేరకు రేషన్ సరుకులు సరఫరా చేయాలో ఆ మేరకే రేషన్ షాపులకు పంపిస్తారు. ఇతర దుకాణాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు తీసుకున్న సమయంలో రేషన్ తగ్గినప్పుడు పౌర సరఫరాల శాఖ తగ్గిన మేరకు రేషన్‌ను మళ్లీ సరఫరా చేస్తుంది. ఆన్లైన్ ద్వారా నమోదైన లెక్కల ప్రకారం లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ షాపు నుంచి ఆ బియ్యం, ఇతర వస్తువులను పంపిస్తారు. ఈ విధానాన్ని ఈ నెల నుంచి జిల్లాలో అమలు చేయనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మే నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. జిల్లాలో ఈనెల నుంచి పోర్టబులిటీ విధానం అమలవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల నుంచి అమలయ్యే అవకాశం ఉంది. మార్చి నెలలో లబ్ధిదారులు జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా బియ్యం, సరుకులు తీసుకునే వీలుంటుంది. ఇక మే నెల నుంచి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేందుకు పౌరసరఫ«రాల శాఖ చర్యలు చేపట్టింది. దీంతో అప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే వీలు కలుగుతుంది. -
నగదు బదిలీ వద్దు రేషనే మాకు ముద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో నేరుగా ప్రజలకు రేషన్ సరకులను సరఫరా చేయడానికి బదులుగా నగదు బదిలీ చేయడం పట్ల 97 శాతం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా, నగ్రీ సమతి స్థాయిలో పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని గతేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. అప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి తమకు కావాల్సిన బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున తీసుకొని వచ్చేవి. ఇప్పుడు ఆ కుటుంబాలు కేంద్రం నుంచి బ్యాంకులో డబ్బులు పడేవరకు నిరీక్షించాలి. బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు వచ్చాయో, లేదో ముందుగా విచారించాలి. డబ్బులు వచ్చినా అంత తక్కువ డబ్బు లావాదేవీలను బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. దాంతో కుటుంబాలు ప్రజ్ఞా కేంద్రాలకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఆ డబ్బులు తీసుకొని రేషన్ షాపులకు వెళ్లి కిలోకు 32 రూపాయలు చెల్లించి సరకులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. జార్ఖండ్‌లో ఇంటి నుంచి బ్యాంకులు దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు ఉండగా, బ్యాంకుల నుంచి ప్రజ్ఞా కేంద్రాలు 4.3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కాలి నడకన ఆ రెండు చోట్లకు వెళ్లి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి సరకులు తీసుకోవడానికి ఒకరికి 12 గంటల సమయం పడుతుందని పేద కుటుంబాలు వాపోతున్నాయి. ఊతకర్ర లేకుండా అడుగుకూడా వేయలేని జంత్రీదేవీ లాంటి వృద్ధులు ప్రతి నెలా కిలోమీటర్ల కొద్ది నడిచి రేషన్ సరకులు తెచ్చుకోవాలంటే చెప్పలేని గోసవుతోందని, దీనికి బదులు ఒక్కసారి ప్రాణం పోయినా బాగుండని వాపోతున్నారు. ఇక దౌరీదేవీ కాయకష్టం చేయడం వల్ల చేతి వేళ్లపై వేలిముద్రలు చెదిరి పోయాయని, ఆధార్ కార్డు వేలి ముద్రలతో పోలిక సరిపోక పోవడం వల్ల గత నాలుగు నెలలుగా ఆమెకు రేషన్ సరకులు ఇవ్వడం లేదట. రేషన్ సరకులు అందక ఒక్క జార్ఖండ్‌లోనే నలుగురు పిల్లలు మరణించిన విషయం తెల్సిందే. సమితి పరిధిలోని 13 గ్రామాల పరిధిలోని 244 కుటుంబాల అభిప్రాయలను విద్యార్థి వాలంటీర్లు సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్క జార్ఖండ్‌లోనే అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పైలెట్ ప్రాజెక్టలని నిర్వహిస్తున్నాయి. రేషన్ సరుకులు అన్యాక్రాంతం కాకుండా నిరోధించేందుకే తాము నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చామని, దీనివల్ల ఏకంగా 56 వేల కోట్ల రూపాయలు మిగిలాయని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. లబ్ధిదారులకే రేషన్ సరకులు అందక పోవడం వల్లనే ఈ నిధులు మిగిలాయన్నది వాస్తవం. -
ఎక్కడి నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : రేషన్ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా మరే రేషన్ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటును (పోర్టబిలిటీని) వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పాస్) ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా పోర్టబులిటీని అమలు చేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఏదైనా రేషన్ దుకాణంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. వలస వచ్చే కూలీలు ఎక్కడికి వెళితే అక్కడ రేషన్ సరుకులు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీవీ ఆనంద్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామని.. త్వరలో మరో 15–20 మందిపైనా నమోదు చేయనున్నామని తెలిపారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు వ్యవహారం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయని, వాటికి డీలర్ల ఎంపికపై ప్రభుత్వానికి ఫైలు పంపామని, అర్హతలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ–పాస్‌తో రూ.578 కోట్లు ఆదా రాష్ట్రంలోని 17 వేల రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈ–పాస్ విధానం ఎంతో సహాయపడిందన్నారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా డీలర్ల అక్రమాలకు చెక్ పెట్టడంలో ఈ–పాస్ విజయవంతమైందని చెప్పారు. ఈ–పాస్‌కు అనుసంధానం చేసేలా 4 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామని.. అందులో ఐరిస్ స్కానర్, బరువు తూచే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌తో బ్లూటూత్ అనుసంధానం, కార్డు స్వైపింగ్ సదుపాయం, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, వాయిస్ ఓవర్ వంటి సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో లావాదేవీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఈ–పాస్ విధానం ప్రారంభించాక ఇప్పటివరకు 2.15 లక్షల టన్నుల బియ్యం మిగిలాయని, రూ.578.90 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఈ నెల నుంచి ఏడాదికి రూ.800 కోట్ల నుండి రూ.850 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కచ్చితంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని, ఆ 15 రోజులు రేషన్ షాపులకు సెలవు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులకు రేషన్ సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తామన్నారు. -
ప్రాణం తీసిన ఈ–పాస్
కడెం(ఖానాపూర్) : రేషన్ సరుకుల్లో అవకతకలను నిరోధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ–పాస్ విధానం ఓ మహిళ ప్రాణాలు బలిగొంది. కడెం మండలం గంగాపూర్ గ్రామం నాయకపుగూడకు చెందిన ఏదుల లస్మవ్వ(45) రేషన్ సరుకుల కోసం వెళ్లి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు 4జీ నెట్‌వర్క్‌తోనే పని చేస్తాయి. కానీ మారుమూల గ్రామమైన గంగాపూర్‌లో సిగ్నల్స్ సరిగ్గా రావు. దీంతో డీలర్ వినియోగదారుల వేలిముద్రలు తీసుకునేందుకు బంగ్లాపైన సిగ్నల్స్ రావడంతో అక్కడ ఈ పాస్ యంత్రం ద్వారా వేలిముద్రలు తీసుకుంటూ, సరుకులు అందజేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఏదుల లస్మవ్వ రేషన్ సరుకుల కోసం బంగ్లాపైకి వెళ్లి తిరిగి దిగే సమయంలో మెట్లపై నుంచి(మెట్లకు పక్కన గోడలు లేవు) పడి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొర్ల ఆజయ్‌బాబు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు బుధవారం ఘటనా స్థలాన్ని జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి సుదర్శన్, తహసీల్దార్ నర్సయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ రహీమొద్దీన్ సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు భాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయగా అపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
ఆధార్ లేకున్నా ఆ మూడింటికి ఢోకా లేదు
ఆధార్ లేకపోతే... ఇటీవల కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రేషన్ రాక, ఆకలి తట్టుకోలేక మృత్యువు బారిన కూడా పడుతున్నారు. అయితే ఆధార్ లేకపోయినా..... కనీస సేవలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య సేవలు, స్కూల్ అడ్మినిషన్లు, తక్కువ ధరలకు రేషన్ ఈ మూడు సర్వీసులను ఆధార్ లేకున్నా తప్పక ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఆధార్ నెంబర్ లేదని, కనీస సేవలు తిరస్కరించవద్దని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ లేకపోవడంతో, లబ్దిదారులకు సామాజిక సర్వీసులు అందించడం లేదు. అయితే నిజమైన లబ్ధిదారుడికి ఆధార్ లేదని ప్రయోజనాలను తిరస్కరించకూడదని ప్రభుత్వ ఏజెన్సీలకు 2017 అక్టోబర్ 24నే యూఐడీఏఐ నోటిఫికేషన్ జారీచేసింది. ఆధార్ లేదని, నిజమైన లబ్దిదారున్ని ఆసుపత్రిలో చేర్చుకోలేదని మీడియా రిపోర్టులు వెలువడిన సంగతి తెలిసిందే. గుర్గావ్లో ప్రభుత్వ ఆసుపత్రి ఆధార్ లేదని ఓ నిండు గర్భిణిని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆమె గేటు వద్దే ప్రస్తావించింది. దీనిపై పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై మరోసారి యూఐడీఏఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖ రాసింది. ఆధార్ లేకపోతే, బేసిక్ సర్వీసులు అందించడం తిరస్కరించవద్దని హెచ్చరించింది. -
కూటి కష్టాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఈపాస్ మిషన్స్ సిగ్నల్స్‌పై రేషన్ సరుకుల పంపిణీ ఆధారపడింది. ఒకప్పుడు కార్డు, డబ్బులు తీసుకెళ్తే సరుకులు అందజేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సిగ్నల్స్ ఉంటేనే సరుకులు పొందాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోసారి సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో సరుకులు పంపిణీ ప్రక్రియ నిలిచిపోతోంది. ఫలితంగా పలుమార్లు కార్డుదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. యంత్రాంగం చర్యల వల్ల ప్రజాధనం మిగులుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్డుదారులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వీటిని కూడా సరిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జిల్లావాసులు వ్యక్తంచేస్తున్నారు. సమయ పాలన ఏదీ? చాలా రేషన్ దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో విధిగా సరుకులు పంపిణీ చేయాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉండాలి. కానీ, సమయ పాలన ఎక్కడా అమలు కావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. కొందరు డీలర్లు ఉదయం పూటకే పరిమితం చేస్తున్నారు. సాయంత్రం దుకాణం తెరవడం లేదు. మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో షాపులను మూసివేయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. వేలి ముద్రల కష్టాలు బయోమెట్రిక్ విధానం మరికొందరు కార్డుదారులకు శాపంగా మారింది. వృద్ధులతో పాటు మట్టి, రాయి పని, మేస్త్రీలుగా పనిచేసే వారి వేలిముద్రలు చెరిగిపోవడం సహజం. ఇటువంటి కార్డుదారులు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ–పోస్ యంత్రాలు వీరి వేలి ముద్రలు స్వీకరించడం లేదు. రెండుతో సరి! 2014 మే నెల వరకు రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు, వస్తువులు సరఫరా చేసేవారు. ఇప్పుడు సరుకుల సంఖ్యలో భారీగా కోతపడింది. చివరకు సరుకుల సంఖ్య రెండింటికే పరిమితం కావడంపై పేద కుటుంబాలు అసంతృప్తి వ్యక్తచేస్తున్నాయి. ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ మాత్రమే అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు దీనికి అందనంగా చక్కెర పంపిణీ చేస్తున్నారు. మిగిలిన సరుకులను కూడా అందజేస్తే తమకు భారం తప్పుతుందని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కార్డులను మరిచారు కొత్త రేషన్‌కార్డులు ఇంకా అందడం లేదు. దాదాపు ఏడాదిగా దరఖాస్తు చేసేకునే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కనీసం కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది లబ్ధిదారులు మీ–సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాక ఇప్పటికే రేషన్ పొందుతున్న వారు ఇంటర్నెట్ పత్రాలపై ఆధాపడుతున్నారు. కనీసం వీరు కూడా శాశ్వత కార్డులకు నోచుకోవడం లేదు. రేషన్‌కార్డులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. 15 రోజుల బెంగ ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీల్లోపే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని గత నెలలో అమలు చేశారు. సెలవులు అధికంగా రావడం వల్ల 17వ తేదీ వరకు సరుకులు అందజేసినా.. చాలా మంది వాటికి దూరమయ్యారు. ఈ నెల నుంచి నిక్కచ్చిగా 15వ తేదీ వరకే పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందడంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే సిగ్నల్స్ సరిగా ఉండడం లేదు. పొట్టకూటి కోసం కూలీలు ఉదయం వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి చేరుకుతుంటారు. ఇటువంటి వారికి పంపిణీ రోజుల కుదింపు శరాఘాతంగా మారుతోంది. కనీసం ప్రతినెలా 20వ తేదీ వరకైనా సరుకులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కోకార్డుదారునికి 18 నిమిషాలు మొయినాబాద్ (చేవెళ్ల): మొబైల్ సిగ్నల్స్ సమయానికి అందకపోవడంతో చాలా మంది రేషన్ షాపులకు రోజుల తరబడి తిరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మొయినాబాద్ మండల కేంద్రంలోని రేషన్ షాపును పరిశీలించగా.. రేషన్ తీసుకునేందుకు సుమారు యాబై మంది వరుసలో నిలిచి ఉన్నారు. సిగ్నల్స్ లేకపోవడంతో ఒక్కో కార్డుదారుడు రేషన్ సరుకులు పొందడానికి 18 నిమిషాల సమయం పట్టింది. మొయినాబాద్‌లో 700 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ నెల 1వ తేదీ నుంచే రేషన్ ఇవ్వాల్సి ఉండగా ఈ పాస్ మిషన్‌ను సాఫ్ట్వేర్ మార్పుకోసం తీసుకెళ్లి సోమవారం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం, మంగళవారం సరుకుల పంపిణీకి డీలర్ ప్రయత్నించగా సిగ్నల్ సరిగా రాక కేవలం 50 మంది వరకు మాత్రమే అందజేశారు. 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఆ గడువులోగా పంపిణీ ఎలా పూర్తిచేయాలో అర్థంకావడం లేదని డీలర్ పేర్కొన్నాడు. వేలి ముద్రలు పడలేదని.. నా వేలి ముద్రలు పడడం లేదని ఈ నెల బియ్యం ఇవ్వలేదు. నాకు కొడుకులు లేరు. నా భర్త కూడా చనిపోయాడు. కార్డుపై నెలకు ఇచ్చే 35 కిలోలపై ఆధారపడి బతుకుతున్నాను. ఈ నెలలో సరుకులు ఇంకా ఇవ్వలేదు. ఇస్తారో లేదో కూడా చెప్పడంలేదు. – మొదళ్ల రుక్కమ్మ, మల్కారం, శంషాబాద్. 15 రోజులే షాప్ తీస్తున్నారు కూలికి వెళ్లి తిరిగి వచ్చేలోగా దుకాణాన్ని మూసి వేస్తున్నారు. బయో మెట్రిక్ విధానం అని వేలిముద్ర తీసుకొని బియ్యాన్ని ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బియ్యం కోసం రెండు మూడు రోజులు రేషన్ దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. – గోవింద్, కేశంపేట ఈ–పాస్ మిషన్‌తో ఇబ్బందులు సిగ్నల్స్ లోపం, సర్వర్ సమస్యతో ఈ పాసు మిషన్ సక్రమంగా పనిచేయడం లేదు. పైగా నిత్యం కూలి పని చేసే లబ్ధిదారుల చేతి వేలి ముద్రలు రావడం లేదు. దీంతో వారికి రేషన్ సరుకులు సకాలంలో ఇవ్వలేక పోతున్నాం. కొంత మంది వృద్ధులకు కూడా వేలి ముద్రలు రావడం లేదు. ప్రతినెల 15వ తేదీలోపు సరుకులు ఇవ్వాలని నిబంధన. ఆ తరువాత వచ్చిన లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం కుదరదు. దీంతో లబ్ధిదారులు సరుకులు ఉండి కూడా ఎందుకు ఇవ్వవంటూ మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాతిరి సత్తయ్య, రేషన్ డీలర్, ఆరుట్ల -
ముద్ర పడదు.. రేషన్ రాదు!
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రంలో రేషన్ సరుకులకు ‘వేలిముద్రల’ తలనొప్పి వచ్చి పడింది. అక్రమాల నియంత్రణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం సమస్యల్లో పడింది. పలు చోట్ల సిగ్నళ్లు పనిచేయకపోవడం, సిగ్నల్ ఉన్నా ఈ–పాస్ సర్వర్లు మొరాయిస్తుండటంతో రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇక వృద్ధులు, మరికొందరి వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలు సక్రమంగా గుర్తించకపోతుండటంతో డీలర్లు వారికి సరుకులు ఇవ్వడం లేదు. రెవెన్యూ అధికారులు రాసి ఇస్తే సరుకులు ఇస్తామంటున్నారు. దాంతో సరుకులు రాక, అధికారుల చుట్టూ తిరగలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఊళ్లను, కుటుంబాలను వదిలి పని కోసం వలస వెళ్లిన వారికి ఈ–పాస్‌తో సమస్యలు ఎదురవుతున్నాయి. స్వయంగా వచ్చి వేలిముద్ర వేయాల్సి రావడంతో ఆ కుటుంబాలు సరుకులు తీసుకోలేకపోతున్నాయి. ఈ–పాస్ విధానం అమలు, లబ్ధిదారుల సమస్యలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బియ్యం తీసుకోలేక.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది పాత జిల్లాల్లో 78,85,980 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటికి పంపిణీ కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన బియ్యం కోటా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలకూ చేరింది. కానీ చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతున్నారు. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–పాస్’సమస్యలే దీనికి కారణం. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ–పాస్ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా.. క్షేత్రస్థాయిలో సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ–పాస్ యంత్రాలకు సిగ్నళ్లు అందకపోవడం, సర్వర్లు మొరాయిస్తుండడానికి తోడు వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడంతో సరుకుల పంపిణీ ఇబ్బందికరంగా మారుతోంది. అందులోనూ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకే సరుకులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని లబ్ధిదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇక వేలిముద్రలు పడని వారికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) నుంచి లేఖ తీసుకుని బియ్యం ఇస్తున్నారు. దీంతో వేలిముద్రలు పడని వృద్ధులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్రమాలు తగ్గినా.. పెరిగిన ఇబ్బందులు.. రేషన్ అక్రమాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానంతో చాలా చోట్ల రేషన్ షాపులలో బియ్యం మిగులుతున్నాయి. అందుబాటులో లేక బియ్యం తీసుకోని లబ్ధిదారులు, బోగస్ కార్డులు, రేషన్ బియ్యం వినియోగించనివారుంటే.. ఆ మేర బియ్యం మిగిలిపోతోంది. ఇలా మిగిలిన మేర మరుసటి నెల కోటాకు తగ్గించి సరఫరా చేస్తారు. తద్వారా రేషన్ సరఫరాలో అక్రమాలు తగ్గాయి. కానీ ఈ–పాస్ సమస్యల కారణంగా కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో కార్డుకు 20 నిమిషాలు! రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని ఓ రేషన్ షాపు వద్ద ‘సాక్షి’పరిశీలన జరిపింది. అక్కడ రేషన్ బియ్యం తీసుకునేందుకు యాభై మంది వరకు క్యూలో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు రేషన్ తీసుకోవడానికి ఇరవై నిమిషాల వరకు పట్టడం గమనార్హం. ఈ–పాస్ యంత్రాల ద్వారా వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. సిగ్నల్ రాకపోవడం, సర్వర్ డౌన్ చూపిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం గంటల తరబడి నిలబడడం, రోజుల తరబడి వేచి ఉండడం తప్పడం లేదు. ఇక పాత ఖమ్మం జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు.. ఎక్కడ ఏ కంపెనీ సిగ్నల్ అధికంగా ఉంటే ఆ సిమ్‌లను అందించారు. అయితే సిగ్నల్ సరిగానే ఉన్నా.. ఈ–పాస్ సర్వర్ మొరాయిస్తుండడంతో ఫలితం ఉండడం లేదు. పాత మెదక్ జిల్లాలోనైతే సిగ్నల్ లేకపోవడం, వేలిముద్రలను గుర్తించకపోవడం వంటి సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘వలసల’ వెతలు వలసలకు మారుపేరైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా మంది పేదలు.. బయోమెట్రిక్ విధానం కారణంగా ఈ నెల రేషన్ సరుకులు తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి పనికోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు.. బంధువులకు, తెలిసినవారికి తమ రేషన్‌కార్డులను ఇచ్చి, సరుకులు తీసుకుని పెట్టాలని చెబుతారు. రెండు, మూడు నెలలకోసారి స్వగ్రామాలకు వచ్చి బియ్యం తీసుకెళ్తారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి ఉంది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు చెందిన చాలా మంది గిరిజనులు ముంబైకి వలస వెళ్లారు. ఇక్కడి నుంచి నేరుగా ముంబైకి బస్సు సౌకర్యం ఉండటంతో.. స్థానికంగా ఉండే బంధువులు రేషన్ బియ్యం తీసుకుని, ఆ బస్సుల్లో ముంబైకి పంపేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెలనెలా ఇంత దూరం రాలేక చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నారు. కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని వలస కూలీలదీ ఇదే పరిస్థితి. ఇంకా చాలా దుకాణాలకు చేరని ఈ–పాస్ బయోమెట్రిక్‌తో రేషన్ సరుకులు అందించేందుకు తీసుకొచ్చిన ఈ–పాస్ యంత్రాలు ఇంకా చాలా దుకాణాలకు చేరలేదు. డీలర్లకు వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నెల మొదటి వారం గడిచిపోయినా ఇంకా చాలా దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు అమర్చే పని కొనసాగుతోంది. ఇక డీలర్లకు యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన లేకపోవడం, చాలా దుకాణాల వద్ద సిగ్నళ్లు సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు చెబుతున్నా.. ఈ నెలలో 25వ తేదీ వరకూ కొనసాగేలా కనిపిస్తోంది. సర్వర్ పనిచేయక సమస్యలు గతంలో రోజుకు కనీసం వంద కార్డులపై బియ్యం పంపిణీ చేశాం. ఇప్పుడు ఈ–పాస్ విధానం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సర్వర్ సరిగా పనిచేయక పోవడంతో ఒక్కో కార్డుకు బియ్యం పంపిణీ చేయడానికి 20 నిమిషాలు పడుతోంది.. – మల్లెపూల శారద, రేషన్ డీలర్, ఆసిఫాబాద్ రెండు రోజులుగా తిరుగుతున్నా.. నల్లగొండ జిల్లా చండూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చొప్పరివారిగూడెం గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు రేషన్ బియ్యం పొందాలంటే చండూరు పట్టణంలోని ఒకటో నంబర్ రేషన్ షాపు వద్దకు రావాలి. ఆ గ్రామానికి చెందిన చొప్పరి పెద్దులు రెండు రోజులుగా రేషన్ షాపు వద్దకు వచ్చి, తిరిగి ఖాళీగానే ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే వేలిముద్రలు పడక ఆయనకు బియ్యం ఇవ్వడం లేదు. -చొప్పరి పెద్దులు, చొప్పరివారిగూడెం, చండూరు, నల్లగొండ రేషన్‌పై గతంలో ఇచ్చిన సరుకులు బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, గోధుమలు, కిరోసిన్, చింతపండు ప్రస్తుతం సరఫరా అవుతున్నవి బియ్యం, కిరోసిన్ (అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రం కిలో పంచదార సరఫరా జరుగుతోంది) -
20 నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలు: ప్రత్తిపాటి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఉచితంగా పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే, జనవరి 1వ తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందిస్తామన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న కోటీ 43లక్షల 30వేల కార్డుదారులకు రూ.360కోట్లతో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి ఇతర రేషన్ సరుకులతో కలిపి చంద్రన్న సంక్రాంతి కానుకలను అందిస్తామని మంత్రి తెలిపారు. -
దివ్యాంగులకు రేషన్ తిప్పలు
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన కె.నాగేశ్వరరావుకు లెప్రసీ వ్యాధి వల్ల చేతి వేళ్లు సరిగా లేవు. ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేస్తేనే రేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం తీసుకోవాలంటే ప్రతి నెలా ఇలాంటివారికి కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో లెప్రసీతోపాటు తాపీ పనిచేసే వాళ్లకు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. వీరితోపాటు వయసు మీరడం వల్ల రేషన్ దుకాణం వరకు వెళ్లలేని వాళ్లు రాష్ట్రంలో 57,810 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.42 కోట్ల తెల్లరేషన్ కార్డుల్లో వేలిముద్రలు సరిగా పడని, రేషన్ దుకాణం వరకు వెళ్లలేని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆరు నెలల కిందట ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా వాటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. వేలిముద్రలు సరిగా పడనివారి నుంచి ఐరిష్ తీసుకొని సరుకులు ఇవ్వాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఐరిష్ మిషన్లు ఎక్కడా పనిచేయడం లేదు. అంబాజీపేటకు చెందిన నాగేశ్వరరావు సబ్సిడీ బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా ఐరిష్ పనిచేయలేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్ తూర్పుగోదావరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. దీంతో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు ద్వారా పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లడంతో తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. ఇలా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరిస్తే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు. కాగా.. రేషన్ షాపుల వరకు వెళ్లలేని వారికి.. మీ ఇంటికి–మీ రేషన్ పథకం ద్వారా ఇళ్లకే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆరు నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు రేషన్ డీలర్లు దీన్ని పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్వోల ద్వారా సరుకులను అంగవైకల్యం ఉన్నవారి ఇళ్లకు పంపాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే వీఆర్వోలు సరిగా అందుబాటులో ఉండని కారణంగా సమస్య ఉత్పన్నమవుతోందని డీలర్లు అంటున్నారు. వేలిముద్రలు సరిగా పడని కారణంగా, అంగవైకల్యం వల్ల రేషన్‌కు దూరంగా ఉంటున్న లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం జిల్లాల వారీగా సేకరించింది. -
కుష్టు వ్యాధిగ్రస్తులకు రేషన్ ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లాలోని ఓబులేశునిపల్లెలో కుష్టు వ్యాధిగ్రస్తులకు రేషన్ అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. వారికి బొటనవేలు కానీ ఇతర చేతి వేళ్లు లేకపోవడం వల్ల బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేయలేకపోయారని, అందువల్ల రేషన్ ఇచ్చేందుకు నిరాకరించారని ఆదివారం పత్రికల్లో వార్తలు చదివినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ బాధితులకు వెంటనే రేషన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
నో ప‘రేషన్’!
⇒ యథాతథంగా రేషన్ సరఫరా ⇒ సమ్మెపై డీలర్ల వెనకడుగు.. త్వరలో సమస్యల పరిష్కారం: ఈటల సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు ఆగస్టులో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సివిల్ సప్లైస్ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1 నుంచి సమ్మెకు వెళ్లాలని రేషన్ డీలర్ల సంఘాలు నిర్ణయిం చడంతో రేషన్‌షాపులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టారు. పీడీఎస్ యాక్టు మేరకు నిత్యా వసర సరుకుల పంపిణీని అడ్డుకునే వారి డీలర్ షిప్పులను రద్దు చేసి, వారి స్థానంలో మహిళా సంఘాలకు అప్పజెప్పేందుకు కసరత్తు పూర్తి చేశారు. దీంతో డీలర్లు పునరాలోచనలో పడ్డారు. మొత్తం 17వేల 200 రేషన్ షాపులకు గాను శుక్ర వారం నాటికే 11వేల మంది రేషన్ డీలర్లు ఆగస్టు నెల సరుకులు తీసుకునేందుకు డీడీలు చెల్లించారు. మూడ్రోజుల గడువు ఉండడంతో మిగిలిన డీలర్లు కూడా డీడీలు చెల్లిస్తారన్న ఆశాభావంతో అధికా రులు ఉన్నారు. సమ్మె వద్దు: రేషన్ డీలర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని పౌరసరఫ రాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సచివాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. -
‘ఆరు’విధాల కోత
- జిల్లాలో రేషన్ కార్డుల తొలగింపు - సిక్స్స్టెప్స్ వ్యాల్యుడేషన్ అమలు - రద్దయిన కార్డులు: 87, 302 - ప్రభుత్వ తీరుపై కార్డుదారుల ఆగ్రహం కర్నూలుకు చెందిన తొగర్చేడు బషీర్బాషాకు షాపు నంబరు 122లో రేషన్ కార్డు వచ్చింది. ఐడీ ఆర్సీ నంబర్ 5521512237031. ఇతను ఒక్క నెల కూడా సరుకులు తీసుకోలేదు. ఆధార్ కార్డు ఫోర్ వీలర్‌కు లింక్ అయిందనే కారణంతో కార్డు తొలగించారు. కర్నూలుకు చెందిన పి.పార్వతమ్మ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రేషన్ కార్డు కోసం ఎన్నో తిప్పలు పడగా.. జన్మభూమిలో ఎట్టకేలకు వచ్చింది. షాపు నంబర్ 21లో ఈమె కార్డు ఉంది. ఐడీ ఆర్సీ నంబరు 5521512243544. అయితే.. ఈమె ఆస్తి పన్ను కడుతున్నారనే ఉద్దేశంతో కార్డుపై వేటు వేశారు. వీరిద్దరే కాదు.. జిల్లాలో ఏకంగా 87,302 మంది రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. కర్నూలు (అగ్రికల్చర్): జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసిన రేషన్ కార్డులపై ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనర్హత వేటు వేస్తోంది. ఒక చేత్తో కొత్త కార్డులు మంజూరు చేసి..మరో చేత్తో రద్దు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జిల్లాకు 87,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కార్డులు వచ్చిన కుటుంబాలు ఎంతో సంతోషించాయి. అయితే.. ఆ ఆనందం కొన్ని రోజులకే పరిమితమైంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ పేరుతో ఏకంగా 17,756 కార్డులకు మంగళం పలికింది. ఒక్క నెల కూడా రేషన్ తీసుకోని కార్డులపై అనర్హత వేటు వేసింది. మొదట్లో 3,842 కార్డులను రద్దు చేయగా.. తాజాగా ఆ సంఖ్య 17,756కు పెరిగింది. వేలాది కార్డులను రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నుంచే ప్రభుత్వం ప్రజాసాధికార సర్వేను అమల్లోకి తీసుకొచ్చింది. నేడు అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు. సర్వే వివరాలు, ఆధార్ అనుసంధానం అనంతరం రేషన్ కార్డుల కోతను కొనసాగిస్తోంది. ఒక్క కర్నూలు నగరంలోనే 875 కార్డులను తొలగించింది. సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ అంటే .. రేషన్ కార్డులను అడ్డగోలుగా కోత కోసేందుకు ప్రభుత్వం ప్రజాసాధికార సర్వేలోని ఆరు నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వీటినే సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ అంటారు. – 5ఎకరాల మెట్ట, 2.50 ఎకరాల తరి భూమి ఉన్న రైతులు రేషన్ కార్డులకు దూరం కావాల్సిందే. – 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉండి, ఆస్తి పన్ను చెల్లించే వారు రేషన్ కార్డులకు అనర్హులు. – ఆధార్ నంబరుతో కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు అనుసంధానం అయ్యి ఉంటే కార్డు కోల్పోవాల్సిందే. – విద్యుత్ బిల్లులు ప్రతి నెలా రూ.150 కంటే ఎక్కువ చెల్లిస్తున్న వారు అనర్హులు. – అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులకు అర్హులు కాదు. – అర్బన్ ప్రాంతాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు వార్షికాదాయం కలిగిన వారికి రేషన్ కార్డు దక్కదు. రుజువులు చూపిస్తే పునరుద్ధరణ: సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ కింద ప్రభుత్వం రేషన్ కార్డులపై అనర్హత వేటు వేస్తోంది. వీరు దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారుగా భావిస్తోంది. అనర్హతకు గురైన కార్డుదారులు తాము దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లు నిరూపించుకోవాలి. ఉదాహరణకు.. ఫోర్‌వీలర్ ఉందనే కారణంతో కార్డుపై అనర్హత వేటు పడి ఉంటే.. అలాంటి వారు కారు లేదని నిరూపించుకోవాలి. ఇలా తగిన రుజువులు సమర్పిస్తే కార్డులను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ ద్వారా అనర్హత వేటు వేసే కార్యక్రమంతో జిల్లా యంత్రాంగానికి సంబంధం లేదు. -
ప్రజా పంపిణీ 81.47 శాతం పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మే నెలకు సంబంధించి ప్రజాపంపిణీ కార్యక్రమం సోమవారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా 11,48,970 రేషన్ కార్డులు ఉన్నాయి. రాత్రి 8 గంటల çసమయానికి 9,36,092 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,75,525 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో నగదు రహితంపై సరుకుల పంపిణీ కొంత వరకు పెరిగింది. సంజామల మండలంలో అత్యధికంగా 64.01శాతం, బేతంచెర్ల మండలంలో 60.81 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ప్యాపిలి మండలంలో కేవలం 2.931శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. -
అందని సరుకులు..ఆకలి కేకలు!
- అమలుకాని మధ్యాహ్న భోజన పథకం - భోజనం బదులు సరుకులిస్తామన్న సర్కారు - కూపనులిచ్చి చేతులు దులుకుపున్న వైనం - బియ్యం, గుడ్ల కోసం విద్యార్థుల ప్రదక్షిణ - సరుకులు రాలేదంటున్న చౌక దుకాణ డీలర్లు - బియ్యం కార్డులో పేరున్న వారికే సరుకులని కొత్తమెలిక =============== జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 2867 విద్యార్థుల సంఖ్య: 6,41,547 నెలకు వీరికి అవసరమయ్యే బియ్యం: 4,101 క్వింటాళ్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బియ్యం విడుదలకు సంబంధించిన సమాచారం సివిల్ సప్లై అధికారులకు, డీలర్లుకు అందలేదు. ============= వేసవిలో విద్యార్థులకు అందాల్సిన సరుకులివి : ప్రాథమిక స్థాయి విద్యార్థులకు :– నెలకు ఒక్క విద్యార్థికి 4 కేజీల బియ్యం, 15 గుడ్లు, నూనె 200 గ్రాములు, కందిపప్పు 800 గ్రాములు. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు : – బియ్యం 6 కేజీలు, గుడ్లు 15, నూనె 300 గ్రాములు, కందిపప్పు 1200 గ్రాములు. ============= కోడుమూరు: సెలవుల్లో సైతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం పథకం సరిగా అమలు కాలేదని, ఈ ఏడాది నేరుగా విద్యార్థులకే వంట సరుకులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదీన (ప్రొసీడింగ్ ఆర్సీ నెం. 01, మెమో నం.523349) జీవో విడుదలైంది. ఇందు కోసం విద్యార్థుల జాబితాను ప్రభుత్వానికి ప్రధానోపాధ్యాయులు పంపారు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ దగ్గరిలో ఉన్న చౌక దుకాణాల్లో మే 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా బియ్యం, గుడ్లు, కందిపప్పు, నూనె తెచ్చుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు కూపన్లు అందజేశారు. విద్యార్థులు ఆ కూపన్లు పట్టుకుని చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సరుకులు రాలేదని డీలర్లు చేతులెత్తేస్తున్నారు. విద్యార్థులు రేషన్ సరుకుల కోసం ఎండను లెక్కచేయకుండా కూపన్లను పట్టుకుని చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. సరుకులకు కొత్తమెలిక : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో సరుకులిస్తామని ప్రభుత్వం ఒకవైపు హామీ ప్రకటించి మరోవైపు కొత్తమెలిక పెట్టింది. బియ్యం కార్డులో ఉన్న వాళ్లకు మాత్రమే సరుకులిస్తామని ఏప్రిల్ 22వ తేదీ జీవో విడుదలైంది. విద్యార్థుల రేషన్‌కార్డు నంబర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలందాయి. వేసవి సెలవులు రావడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల బియ్యం కార్డు నంబర్లను ఆన్లైన్లో నమోదు చేయలేదు. దీనికితోడు చాలామంది విద్యార్థుల పేర్లు బియ్యం కార్డులో లేవని ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుచేసిన ఆధార్‌నంబర్ల ఆధారంగా విద్యార్థులకు సరుకులందజేస్తే సరిపోతుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. కూపన్లు ఇచ్చారు : మంజుల వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం బదులు బియ్యం, బ్యాళ్లు, నూనె ఇస్తారని మాబడి సారోళ్లు కూపన్లు ఇచ్చారు. రేషన్ షాపుకు వెళితే సరుకులివ్వబోమని డీలర్లు చెబుతున్నారు. దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం : భారతి మధ్యాహ్నం భోజనం సరుకులు రేషన్ దుకాణాల్లో ఇస్తారని మాబడి సారోళ్లు కూపన్లు ఇచ్చారు. సరుకుల కోసం కూపన్లు తీసుకుని ఎండలకు రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాం. డీలర్లు సరిగ్గా సమాధానం చెప్పడంలేదు. టోల్‌ఫ్రీ నంబర్(9393121651, 9985746401)లకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదు. 30 నుంచి సరుకులిస్తాం : అనంతయ్య, ఎంఈఓ, కోడుమూరు ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు రేషన్ దుకాణాల నుంచి విద్యార్థులకు సరుకులందివ్వాలని డీఈఓ కార్యాలయం సమాచారమందింది. ఎప్పుడిస్తారనే విషయం స్పష్టంగా సమాచారం లేదు. -
కిరోసిన్ కోటాకు కత్తెర
- 4 నుంచి 2 లీటర్లకు కుదింపు - ధర కూడా పెంచిన ప్రభుత్వం - ఇప్పటికే రేషన్ చక్కెర నిలిపివేత సాక్షి, హైదరాబాద్: పేదల కిరోసిన్ కోటాకు కత్తెర పడింది. కేంద్రం సబ్సిడీ ఎత్తివేయడంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కిరోసిన్ కోటా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కిరోసిన్ ధర పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ కోటాను తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కిరోసిన్ కోటా తగ్గింపును మే నెల నుంచి అమలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు కమిషనర్ ఆదేశించారు. రెండు లీటర్లకు పరిమితం ప్రజా పంపిణీ వ్యవస్ధలో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్ లేని ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు కార్పొరేషన్ పరిధిలో నాలుగు లీటర్ల చొప్పున పంపిణీ చేసే కిరోసిన్‌ను రెండు లీటర్లకు కుదించారు. మున్సిపాలిటీల్లో అందించే రెండు లీటర్ల కిరోసిన్‌ను యథాతథంగా ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు లీటర్ల చొప్పున పంపిణీæ చేసే కిరోసిన్‌ను లీటరుకు కుదించారు. సిలిండర్ గల లబ్ధిదారులకు పంపిణీ చేసే ఒక లీటర్ యధాతథంగా పంపిణీ చేస్తారు. సబ్సిడీ కిరోసిన్ ధర రూ. 19 నుంచి రూ. 21 లకు పెరిగింది. పన్నెండేళ్ల క్రితం తెల్లకార్డు లబ్ధిదారులకు 23 లీటర్ల చొప్పున, గులాబి కార్డుదారులకు 14 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ జరిగేది. క్రమంగా కిరోసిన్ కోటా కత్తెర పడుతూ వచ్చింది. తాజాగా రెండు లీటర్లకు పరిమితమైంది. సగానికిపైగా తగ్గిన కోటా కిరోసిన్ కోటా సగానికి పైగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో మొత్తం 85,66,427 ఆహార భద్రత కార్డుదారులుండగా.. అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులు 24,42,353 వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 90,65,732 కిలోలీటర్ల కిరోసిన్ కోటాను ప్రభుత్వం కేటాయిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరి«ధిలో మొత్తం 12 సర్కిల్స్ పరిధిలో సుమారు 11, 30, 548 కార్డుదారులు ఉండగా అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులు 1,97,075 వరకు ఉన్నారు. వీటికి ప్రతినెలా 12,82,870 కిలో లీటర్ల కిరోసిన్ కోటా కేటాయింస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కిరోసిన్ కోటా సగానికి పైగా తగ్గిపోయినట్లయింది. మరోవైపు గత 4 నెలల నుంచి హైదరాబాద్ సిటీని కిరోసిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వంటగ్యాస్ లేని లబ్ధిదారులకు దీపం పథకం కింద సిలిండర్ కనెక్షన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. సబ్సిడీ భరించలేక... కేంద్రం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వార పంపిణీ చేసే సరుకులపై క్రమంగా సబ్సిడీ ఎత్తేస్తోంది. ఇప్పటికే పామాయిల్, చక్కెరపై సబ్సిడీ ఎత్తివేసిన కేంద్రం తాజాగా సబ్సిడీ కిరోసిన్ కోటాను తగ్గించింది. చమురు కంపెనీల పాయింట్ల నుంచి కిరోసిన్ హోల్‌సెల్ డీలర్ల ద్వారా చౌకధరల దుకాణాలకు నీలి కిరోసిన్ సరఫరా జరుగుతుంది. చమురు కంపెనీలు లీటర్ ఒక్కంటికి నీలి కిరోసిన్‌ను రూ. 49ల చొప్పున ప్రభుత్వానికి అందిస్తాయి. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 30 లను సబ్సిడీగా భరించి రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు రూ.19లకు పంపిణీ చేసేది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం తెల్ల కిరోసిన్ లీటర్ ధర రూ. 50 వరకు పలుకుతుంది. -
సమస్యలు పరిష్కరించకపోతే ‘రేషన్’ బంద్
డీలర్ల సంఘం అల్టిమేటం పరకాల: రేషన్డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ.30 వేల చొప్పున వేతనమివ్వాలని.. దీనిపై 2 నెలల్లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలోని అన్ని షాపులను బంద్ చేస్తామని రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండ లం కోనాయమాకుల వద్ద మంగళవారం రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సభ జరి గింది. సభలో సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్‌బాబు మాట్లాడుతూ మంత్రి ఈటల హామీలు కూడా నెరవేరకపోవడంతోనే రేషన్‌షాపుల బంద్‌ను నిర్ణయించి నట్లు చెప్పారు. రేషన్ డీలర్లు అందరూ 27న హన్మకొండలో జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు తరలిరావాలన్నారు. -
రేషన్ దుకాణాల్లో నగదు రహితం తప్పనిసరికాదు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి కాకినాడ సిటీ: రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు తప్పని సరికాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో పౌర సరఫరాల శాఖ సమీక్షా సమావేశం ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ప్రత్తిపాటి ముఖ్య అతిథిగాను, రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళిశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సమావేశంలో తొలుత జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మంత్రులకు స్వాగతం పలికి, పౌరసరఫరా కార్యక్రమాలు, రైతులకు మద్దతు ధర కల్పన, దీపం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ తదితర అంశాలు జిల్లాలో అమలు ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రజల ఇష్టం మేరకే నిర్వహించాలని, బలవతం చేసి ఇబ్బందులకు గురి చేయవద్దని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా లాటరీ ద్వారా ఒకరికి రూ.లక్ష బహుమతి, రూ.5 వేలు విలువైన స్మార్ట్ఫోన్లు బహుమతిగా అందజేస్తున్నామని, ఆసక్తి కలిగిన వారందరూ నగదు రహిత లావాదేవీల్లో పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. బీసీ వర్గాల సంక్షేమానికి కృషి... రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళి శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చేతివృత్తుల వారికి అధునాతన పనిముట్లుపై శిక్షణ కల్పించి, వాటిని పంపిణీ చేస్తామన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. ఆహార సలహా కమిటీల ఏర్పాటు... ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ కోసం అన్ని స్థాయిల్లోని ఆహార సలహా కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలను తరచుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణ లేదని, సన్నబియ్యం కేజీ రూ.50కి అమ్మతున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మహానగరంలో ‘మాయా’పాలకుడు
లక్కింశెట్టి శ్రీనివాసరావు : అది ఒక కాకనందివాడ అనే పల్లెటూరు. బ్రిటిష్ పాలనలోకి వచ్చేసరికి ఆ ఊరు పేరు కో–కెనడాగా మారింది. తెల్ల దొరల పాలన పోయాక కో–కెనడా కాస్తా కాకినాడ అయింది. ఇప్పుడా కాకినాడ ఒక మహానగరంగా అవతరించింది. విద్య, వైద్య సదుపాయాలు మెండుగా ఉన్న నగరమది. కాకినాడకు పెన్షన ర్స్ పేరడైజ్‌గా రాష్ట్రవ్యాప్తంగా మం చి పేరు కూడా ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జాతిపిత మహత్మాగాంధీ నడయాడిన ప్రాంతం ఇది. ఈ మధ్యనే ఆ మహానగరం దేశంలో ఎంపికైన స్మార్ట్ సిటీలలో ఒకటిగా నిలిచింది. ప్రజలను దోచుకోవడంలో మాత్రం మహా స్మార్ట్‌గా మారిపోయారు. ప్రజలకు సేవ చేయాలనే తపన ముఖ్యనేతకే లేనప్పుడు వంది మాగధులకు ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుంది. చాలా కాలం క్రితం అనుకుంటా ప్రజా రవాణా వ్యవస్థ కేంద్రానికి ఆనుకుని ఉన్న చౌక ధరలతో కూరగాయలు అమ్మే బజార్లో దుకాణాలపై పడి ముఖ్య పాలకుడు, అనుచర గణం లక్షలు మూటగట్టుకుపోయారు. రెక్కాడితే కానీ డొక్కాడని రైతుల దుకాణాలు బినావీు లనే కుంటిసాకులు చూపించి ఖాళీ చేయాల్సి వస్తుందని, ఇది పాలకుడి మాటగా చెవిలో వేశారు. ఆ దుకాణాల వారికి జీవనాధారం కావడంతో మరోదారి లేక అధిక వడ్డీలకు అప్పులుచేసి అంతా కలిసి రూ.పాతిక లక్షలు మూటగట్టి చేతిలో పెట్టడంతో ఆ పాలకుడు శాంతించాడు. దోపిడీలో కొత్తదారులిలా... ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు ఆ తరహాలోనే ప్రధాన పాలకుడు మరో దోపిడీకి తెరదీశారు. ఆ నేతకు ఇక్కడే జిల్లా పాలనా వ్యవస్థంతా కేంద్రీకృతమై ఉంది, పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయనే స్పృహ కూడా లేకుండా పోయింది. అమరావతి కేంద్రంగా రాజ్యాన్ని ఏలుతున్న చంద్రవంశ చక్రవర్తి బాటలోనే ఇక్కడి పాలకుడు పనిచేస్తున్నాడు. చంద్రవశం చక్రవర్తే చేయగా లేంది నేనెందుకు చేయకూడదనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ దోపిడీలో కొత్తదారులు వెతుక్కుంటూ ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టే ఉద్ధేశం ఆ పాలకుడికి లేదన్నట్టుగా ఉంది. అప్పుడేమో పేద రైతుల పొట్టకొట్టి లక్షలు వెనకేసుకుంటే ఇప్పుడు అతని కన్ను పేద, మధ్య తరగతికి రాయితీ బియ్యం, పంచదార, కిరోసి¯ŒS పంపిణీ చేసే దుకాణాలపై పడింది. అటువంటి దుకాణాలు మహానగరంలో 117 ఉన్నాయని లెక్కతీశారు. వాటిలో కేసులు పెట్టగా రద్దుచేసేవి కొన్ని. నిర్వాహకులు మృతితో ఖాళీ ఏర్పడ్డవి మరికొన్ని ఉన్నాయి. పేదల బియ్యం, పంచదార తదితర సరుకులు కాజేశారని ప్రజా పంపిణీని పక్కదారిపట్టకుండా నియంత్రించే అధికారులు ఈ మధ్యనే కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే ఆ పాలకుడికి కలిసి వచ్చినట్టుంది. కేసులు పెట్టిన దుకాణాలు రద్దుచేయాల్సిన సమయం రానే వచ్చింది. పాలకుడి తరఫున మహానగరంలో ఒక అధికారి ద్వారా రాయబారం నడిపించారు. ఆ తొమ్మిది దుకాణాలు రద్దుచేసినట్టే రద్దు చేసి వాటిని మరొక బినామీ పేరుతో పాత వారికే ఇస్తామని పాలకుడు చెప్పిన మాటనే వారి చెవుల్లో వేశారు. అందుకు తలో లక్ష, లక్షన్నర ఇవ్వాలనేది డిమాండ్. అంటే మొత్తంగా రూ.10 లక్షలు పైనే జేబులో వేసుకోవాలని పాలకుడు ప్లా¯ŒS వేశాడు. ఆ ప్లా¯ŒSలో 15, 16, 28, 29, 63, 78, 82, 84, 89 నంబర్లు కలిగిన చౌకధరల దుకాణాలు న్నాయి. ఇందులో నిర్వాహకుడు చనిపోతే ఖాళీ అయిన దుకాణం కూడా ఉంది. అయినా కనీసం కనికరం చూప లేదు. పైసలివ్వందే ఇవ్వడం కుదరదని పాలకుడి మాటగా చెప్పారు. కాకుంటే ప్రత్యామ్నాయంగా లక్షన్నరకు మరో డీల్ సిద్ధంగా ఉంచుకున్నారు. ఈ రెండింటిలో పాలకుడు దేనికి ‘పచ్చ’జెండా ఊపుతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
నగదు రహితానికే ప్రాధాన్యం
- సమస్యలుంటే తప్ప నగదు లావాదేవీలు వద్దు - ప్రజా పంపిణీపై జేసీ హరికిరణ్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): చౌక ధరల దుకాణాల్లో నగదు రహితంపై మాత్రమే సరుకుల పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సి.హరికరణ్ తెలిపారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు, సరుకుల పంపిణీ నిలిచిపోయిన కార్డుదారులు ఇక్కట్లు పడుతున్న సందర్బాల్లో మాత్రమే నగదుపై సరుకులు ఇవ్వాలని జేసీ ఆదివారం ఒక ప్రకటనలో డీలర్లకు సూచించారు. ముందుగా నగదు రహిత లావాదేవీలకే ప్రయత్నించాలన్నారు. ఈ పాస్ మిషన్‌పై సాంకేతిక సమస్యలు (ఎర్రర్కోడ్) కనిపించినపుడు మాత్రమే నగదుపై సరుకులు పంపిణీ చేయవచ్చన్నారు. -
కష్టాలు ’డబ్బు’ల్
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం తొలిరోజే బెడిసి కొట్టిన ప్రయోగం 2.40 శాతం మందికే సరుకుల పంపిణీ లక్షలాది మందికి బ్యాంకు ఖాతాలు లేకున్నా ఖాతరు చేయని ప్రభుత్వం కొవ్వూరు : నగదు రహిత విధానమంటూ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్ సరుకులపై ఆధారపడి జీవించే బడుగు జీవులపై బలవంతంగా క్యాష్‌లెస్ విధానాన్ని ప్రయోగిస్తోంది. మార్చిలో నూరుశాతం నగదు రహిత విధానంలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో తొలిరోజైన బుధవారం డబ్బు తీసుకుని రేషన్ షాపులకు వెళ్లిన వారిని డీలర్లు సరుకులు ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ఇదిలా ఉంటే బ్యాంకుల సర్వర్లు పని చేయకపోవడంతో ఉదయం 10.30 గంటల నుంచి నగదు రహిత విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా 11,96,775 రేషన్ కార్డులు, 2,163 చౌక ధరల దుకాణలున్నాయి. మొత్తం రేషన్ కార్డుల్లో 32,49,664 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. తొలిరోజు 28,545 కార్డుదారులకు మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. ప్రతి నెలా ఐదో తేదీ నాటికే 90 శాతం సరుకుల పంపిణీ పూర్తి చేసేవారు. అంటే రోజుకు సగటున 23 శాతం రేషన్ పంపిణీ పూర్తయ్యేది. అటువంటిది ఈనెల మొదటి రోజు నగదు రహిత విధానం పుణ్యమా అని జిల్లాలో 2.40 శాతం కార్డుదారులకు మాత్రమే సరుకులు ఇవ్వగలిగారు బ్యాంక్ ఖాతాలు లేకపోయినా.. కార్డుదారుల్లో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ పరిస్ధితుల్లో క్యాష్ లెస్ విధానం అమలు సాధ్యం కాదని అధికారులకు తెలిసినా బలవంతపు ప్రయోగాలతో జనాన్ని అవస్థల పాల్జేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా పేదలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నగదు రహిత విధానంలో రేషన్ సరుకులు పొందాలంటే బ్యాంకు ఖాతాలో కనీసం రూ.100 నగదు ఉండాలి. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునే కూలీలకు ఈ విధానం ఎంతవరకు ఉపకరిస్తుందనేది ప్రశ్న. బ్యాంక్ ఖాతాలు ఉన్నా ఆధార్ అనుసంధానమైతేనే వారి పేర్లు డేటా మ్యాపింగ్‌లోకి వెళతాయి. అలా వెళ్లిన వారి ఖాతాలో సొమ్ములుంటే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే నగదు రహిత విధానం నూరుశాతం అమలు చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
రేషన్ కోతపై కన్నెర్ర
► పోరుబాటకు డీఎంకే నిర్ణయం ► నేడు జిల్లాల కార్యదర్శులతో స్టాలిన్ భేటీ రేషన్ దుకాణాల్లో పామోలిన్, ఉద్ది, కంది పప్పువంటి నిత్యావసర వస్తువుల సరఫరా నిలుపుదలపై డీఎంకే కన్నెర్ర చేసింది. పాలకుల తీరుపై మండి పడుతూ పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశానికి డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పిలుపునివ్వడంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రెండు కోట్ల మేరకు కుటుంబ కార్డుదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నారు. బియ్యం ఉచితంగా, చౌక ధరకే చక్కెర, కంది, ఉద్ది, పామోలిన్, కిరోసిన్ చేస్తున్నారు. బయటి మార్కెట్లో కంటే మరీ తకు్కవగా కంది, ఉద్ది పప్పు ఇక్కడ లభిస్తున్నది. ప్రస్తుతం రేషన్ డిమాండ్‌కు తగ్గ నిత్యావసర వస్తువుల సరఫరాలో పౌరసరఫరాల విభాగం విఫలం కావడం వివాదానికి దారి తీసింది. కేంద్ర ఆహార భద్రతా చటా్టన్ని రాష్ట్రంలోకి ఆహ్వానించిన దృష్ట్యా, తాజాగా, పప్పు ధాన్యాలు, పామోలిన్ పంపిణీకి తగ్గ టెండర్లను పిలవలేని పరిస్థితి. గత వారం రోజులుగా నిత్యావసర వస్తువుల సరఫరా ఆగడంతో పాటుగా బియ్యంకు బ దులు గోధుమ పంపిణీకి మార్చి ఒకటో తేదీ నుంచి అధికారులు చర్యలు తీసుకున్నారన్న సమాచారం కుటుంబ కారు్డదారుల్లో ఆగ్రహాన్ని, ఆందోళన రేపుతోంది. పాలకుల వైఖరితో రేషన్ సరఫరాలో నెలకొన్న గందరగోళంపై డీఎంకే కన్నెర్ర చేసింది. డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఎంకే స్టాలిన్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆహార భద్రతా చటా్టన్ని దొడ్డిదారిన ఆహ్వానించిన దోషి శశికళ నేతృత్వంలోని బినామీ ప్రభుత్వం, ఇప్పుడు పేద ప్రజల కడుపు మాడ్చేందుకు సిద్ధం అయిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి, సమస్యకు పరిష్కారం చూపించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాట సాగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు తీరు్పతో దోషులుగా తేలిన వారి జయంతి వేడుకల్లో బిజీ బిజీగా కాలంనెట్టుకు రావడం మానుకుని, రేషన్ కొరతను అధిగమించేందుకు తగ్గ చర్యలు చేపటా్టలని డిమాండ్ చేశారు. నేడు జిల్లాల కార్యదర్శులతో భేటీ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి తెలిసిందే. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చి అధికార పగ్గాలు తమ గుప్పెట్లోకి తీసుకోవడం లేదా, మళ్లీ ఎన్నికలో్లకి వెళ్లడం లక్ష్యంగా డీఎంకే అడుగులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాల కార్యదరు్శల భేటీకి స్టాలిన్ పిలుపు నివ్వడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తేనాం పేటలోని అన్నా అరివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పది గంటలకు స్టాలిన్ సమావేశం ప్రారంభం కానుంది. రేషన్ కోత, హైడ్రో కార్బన్, మేఘాధాతులో కర్ణాటక డ్యాం నిర్మాణం, తదితర అంశాలపై చర్చించి ఆందోళన బాటను ఉధృతం చేయడానికి కసరత్తు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
నగదు రహిత కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం ఇటు కార్డుదారులు.. అటు రేషన్ డీలర్లకు చుక్కలు చూపిస్తోంది. గోపాలపురం మండలం పెద్దగూడెంలో ప్రజలు ఈ పోస్ యం త్రాలను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. జిల్లాలో పలుచోట్ల రేషన్ డిపోల ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. పూర్తిస్థాయి కసరత్తు లేకుండా హడావుడిగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డుదారులందరికీ విధిగా బ్యాంక్ అకౌంట్లు ఉండాలనే నిబంధన విధించారు. గతంలోరేషన్ కార్డులో పేరు నమోదైన అందరి వ్యక్తుల వేలి ముద్రలు స్వీకరించారు. వారిలో ఎవరు రేష¯ŒS షాపునకు వెళ్లినా నిత్యావసర సరుకులు ఇచ్చేవారు. ఈ నెల నుంచి ఆన్లైన్ చెల్లింపు రావడంతో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయ్యింది. దీంతో కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందేనని డీలర్లు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోదని, నిత్యావసర సరుకుల కోసం ఎవరైతే వస్తారో వారి పేరిట కచ్చితంగా అకౌంట్ ఉండాలని, ఆ అకౌంట్ నుంచే నగదు బదిలీ అవుతుందని చెబుతున్నారు. అకౌంట్లో కనీసం రూ.500 నగదు నిల్వ ఉండాలని, లేకపోతే చార్జీలు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అంత సొమ్మును బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉంచే పరిస్థితి పేదలకు ఉండదు. కొందరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నా సరుకులు తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్లేముందు బ్యాంక్‌కు వెళ్లి సొమ్ము జమ చేయాల్సి వస్తోంది. ఆ తరువాత సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. కొందరి ఖాతాల్లో సొమ్ములున్నా సాంకేతిక సమస్య కారణంగా సరుకులు తీసుకోలేని దుస్థితి దాపురిస్తోంది. కొన్నిచోట్ల కార్డుదారుల ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగినా డీలర్ ఖాతాలో జమ కావడం లేదు. దీంతో కార్డుదారులు నగదు కోల్పోవడమేకాక, సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాల సమస్య జిల్లాలోని రేషన్ దుకాణాల్లో విజన్‌టెక్, ఎనలాజిక్ ఈ పోస్ యంత్రాలు ఉన్నాయి. విజన్‌టెక్ యం త్రాల్లో 25 నుంచి 30 శాతం నగదు రహిత విధానంలో పనిచేస్తున్నాయి. ఎనలాజిక్ యంత్రాలను గత నెల 31న ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. కనీసం డీలర్లకు శిక్షణ ఇవ్వకుండా ఈ నెల 1 నుంచి నగదు రహిత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. చాలాచోట్ల యంత్రాలు ఆన్‌లైన్‌తో అనుసంధానం కాలేదు. అందరూ ఒకేసారి ఈ యంత్రాలను అనుసంధానం చేయడంతో సర్వర్లు బిజీగా మారిపోయాయి. ఆచంట, భీమవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలకు డీలర్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఏపీపీడీఎస్ సర్వర్, ఆధార్ సర్వర్, బ్యాంకింగ్ సర్వర్ ఏకకాలంలో పనిచేయడంతోపాటు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో తగినంత సొమ్ము నిల్వ ఉంటేనే సరుకులు ఇవ్వడానికి వీలవుతోంది. ఏ సర్వర్ పని చేయకపోయినా, పదేపదే ప్రయత్నం చేయాల్సి వస్తోంది. మరోవైపు లబ్ధిదారులు తమ ఖాతాల్లో కనీస నగదు జమ చేసేందుకు, ఆధార్ అనుసంధానం చేసేందుకు పనులు మానుకుని బ్యాంకుల ఎదుట నిలబడుతున్నారు. డిసెంబర్ నెలలో సరుకులు అప్పుగా ఇచ్చారు. జనవరి నెలలో డీలర్లు రెండు నెలల డబ్బులు వసూలు చేశారు. డిసెంబర్లో తీసుకెళ్లిన సరుకులకు సొమ్ము చెల్లించలేనట్టు ఈ–పోస్ యంత్రాలు చూపిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతా నుంచి రెండు నెలల సొమ్ము డీలర్‌కు బదిలీ అవుతోంది. డీలర్ల ఆందోళన నగదు రహితం పేరుతో యూజర్ చార్జీలు వసూలు చేస్తుండటంతో డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక డీలర్ 400 కార్డులపై నగదు రహిత విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తే కార్డుకు రూ.3 చొప్పున రూ.1,200 యూజర్ చార్జీలు డీలర్ ఖాతా నుంచి కట్ అవుతున్నాయి. కొందరు కార్డుదారుల ఖాతాల నుంచి బదిలీ అయిన సొమ్ములు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈ సొమ్ములు బ్యాంకుల్లోని సస్పెన్స్ అకౌంట్లలోకి చేరుతున్నాయి. దీంతో డీలర్లు ఆ సొమ్మును తమ ఖాతాలోకి మార్పించుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నగదు రహితం పూర్తిస్థాయిలో చేశామని చెప్పుకోవడానికి జిల్లా ఉన్నతాధికారులు తీసుకువస్తున్న ఒత్తిడి కారణంగా కార్డుదారులు, డీలర్లు నలిగిపోతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు తమకు శాపంగా మారుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాతే నగదు రహిత లావాదేవీలు చేయాలని.. లేనిపక్షంలో వచ్చే నెలలో షాపులు మూసివేసి నిరసన తెలుపుతామని డీలర్ల అసోసియేషన్ నేత గంగాధర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక రేషన్ కూ ఆధార్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: ఇకపై రేషన్ దుకాణాల్లో సరుకులు పొందడానికి కూడా ఆధార్ తప్పనిసరి కానుంది. లబ్ధిదారులంతా తమ రేషన్ కార్డులను ఆధార్‌తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆధార్ చట్టం కింద కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల విభాగం బుధవారం ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆధార్ కార్డు లేనివారు కొత్తగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 దాకా గడువిచ్చింది. అయితే ఆ తర్వాత ఆధార్ లేని వారికి సరుకులు ఇవ్వబోమని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. జూన్ 30 తర్వాత సరుకులు పొందాలంటే రేషన్ కార్డు, ఏదేనీ మరో గుర్తింపుకార్డు(ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కిసాన్ ఖాతా పాస్‌బుక్, పోస్టల్ శాఖ ఇచ్చిన ఫొటోతో కూడిన అడ్రస్ కార్డు, అధికారిక లెటర్‌హెడ్‌పై గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు ధ్రువపత్రం, మొదలైనవి) ఆధార్‌కు దరఖాస్తు చేసినట్లుగా రుజువును కూడా చూపించాలంది. ఇప్పటిదాకా దేశంలో 72 శాతం రేషన్ కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం అయ్యాయనీ, రాష్ట్రాలు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నందున వేగం పెంచడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చామని ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. -
‘కేసీఆర్‌తోపాటు మోదీ బొమ్మ కూడా ముద్రించాలి’
భువనగిరి: రాష్ట్రంలో పేద ప్రజలకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందటం లేదని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డులను ముద్రించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ముద్రించబోయే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటే ప్రధానమంత్రి మోదీ చిత్రం కూడా ముద్రించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషి వల్లే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొరత లేకుండా ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.50 వేల కోట్ల జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రప్రభుత్వం చేపట్టిందని వివరించారు. హైదరాబాద్ చుట్టూ పది జిల్లాలను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో వేసేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షకు పైగా పక్కా ఇళ్లను పేదలకోసం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఇళ్లను కూడా కేటాయించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున నివేదించగా సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. -
ఈ..ఫార్స్!
- ఈ-పాప్ విధానంలో లోపాలు - కొనసాగుతున్న అక్రమాలు - పక్కదారి పడుతున్న సరుకులు - పేదలకు అందని రేషన్ - కొందరు డీలర్ల చేతివాటం - అరికట్టలేకపోతున్న ప్రభుత్వం జిల్లాలో రేషన్ కార్డులు: 10.76 లక్షలు జనవరి నెలలో కొత్తగా వచ్చినవి : 87 వేలు డిసెంబర్, జనవరి నెలల్లో రేషన్ పంపిణీ : 90 శాతం గతంలో 80 శాతం ప్రజాపంపిణీ ఉండేది కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ- పాస్ విధానం అపహాస్యమవుతోంది. పేదలందరికీ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం కొందరు డీలర్లకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతూ 149 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారంటే కుంభకోణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మంది డీలర్లు సస్పెండ్ అయినా ఈ-పాస్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలలతో పోలిస్తే డిసెంబరు, జనవరి నెలల్లో 3000 కార్డులకు పైగా ఎక్కువగా సరుకులు పంపిణీ కావడం విమర్శలకు తావిచ్చింది. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టిన వ్యవహారం అక్టోబర్ నెలలో వెలుగు చూసింది. ఇప్పటికీ ఈ వ్యవహారం నడుస్తోంది. అదెలాగంటే.. రెండేళ్ల క్రితం ఆధార్ నంబర్లతో రేషన్ కార్డులను అనుసంధానం చేశారు. ఈ బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు అప్పగించారు. డీలర్లు ఈ కార్యక్రమంలో అడ్డుగోలుగా వ్యవహరించారు. ఆధార్ కార్డు దొరికితే చాలు తమ దగ్గర ఉన్న కార్డులకు లింకప్ చేసుకున్నారు. ఆధార్ కార్డు నంబర్ల కోసం జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల కొత్త ఎత్తుగడలు వేశారు. ఎన్ఐసీ ప్రధాన సర్వర్ నుంచే అధార్ లింకప్ను తమ వద్ద ఉన్న రేషన్ కార్డులతో లింకప్ చేసుకున్నారు. ఆన్లైన్లో వివరాలు చూసుకున్న కొందరు ప్రజలు.. తమ రేషన్ కార్డుకు వేరొకరి ఆధార్ కార్డు లింకప్ కావడంతో తప్పులను సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ అందకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఫిర్యాదులు ప్రస్తుతం డీఎస్ఓ, ఎఎస్‌ఓ, తహసీల్దారు కార్యాలయాల్లో వేలాదిగా ఉన్నాయి. కర్నూలులో వారిదే హవా.. ఈ పాస్ కుంభకోణంలో ఇటీవల కర్నూలులో నూరు మంది డీలర్ల సస్పెండ్ అయ్యారు. వారి స్థానంలో ఇన్చార్జీలను నియమించారు. అయితే చాల వరకు సస్పెండ్ అయిన డీలర్లే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అక్రమాలు ఇవీ.. కర్నూలుకు చెందిన కళావతికి వైఏపీ 1382065ఎ0141 నంబరు రేషన్ కార్డు ఉంది. ఆధార్ నెంబరు 534513319754. ఆరు నెలల క్రితం వరకు ఎలాంటి సమస్య లేదు. ఇపుడు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన డబ్ల్యూఏపీ 1286026ఎ0199 రేషన్ కార్డుకు కళావతి ఆధార్ నెంబరు లింకప్ అయింది. పత్తికొండ ప్రాంతానికి చెందిన కురువ హనుమన్న రేషన్ కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 135103600049. ఆధార్ నెంబరు 852236000236. ఇటీవలి వరకు ఇక్కడే కార్డు ఉంది. కాని ఉన్నట్టుండి విశాఖపట్టణం జిల్లాకు చెందిన కార్డుకు ఈ ఆధార్ కార్డు అనుసంధానం అయింది. బోయ అనంతయ్యకు పత్తికొండలో రేషన్ కార్డు ఉంది. కార్డు నంబరు డబ్ల్యూఏపీ 135102200162. ఆధార్ నంబరు 296480428799. ఇపుడు ఈ ఆధార్ కార్డు నెల్లూరు జిల్లాకు రేషన్ కార్డుకు అనుసంధానం అయింది. -
డీలర్లు.. వేషాలు
సరుకుల పంపిణీలో అక్రమాలు - ప్రదక్షిణలు చేస్తున్న కార్డుదారులు - సరుకులు అయిపోయాయనే సమాధానంతో సరి - 15 వరకు షాపులు తెరవాలనే నిబంధనకు పాతర - ప్రజాపంపిణీలో యథావిధిగా దందా కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడని పరిస్థితి. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో డీలర్లు చేతివాటం చూపుతున్నారు. చౌక దుకాణాలను ప్రతి నెలా 15 వరకు తెరిచి ఉంచాలనే నిబంధనను గాలికొదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు రేషన్ షాపులు చుట్టూ తిరుగుతున్నా సరుకులు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది కార్డుదారులు డీలర్ల నిర్లక్ష్యంతో రేషన్ సరుకులు పొందలేకపోయారు. కర్నూలులోనే వందలాది మంది కార్డుదారులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంలోనూ ఇదే పరిస్థితి. కానుకల పంపిణీకి మొదట ఈ నెల 12 వరకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే చాలా మంది కార్డుదారులు పొందలేకపోవడంతో ఈ నెల 15 వరకు పంపిణీ చేసేలా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు వందలాది షాపుల్లో అమలుకు నోచుకోలేదు. కొత్త కార్డులకు కానుకలు ఇవ్వాల్సి ఉండగా 30శాతం కార్డుదారులకు నిరాశే మిగిలింది. ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ–పాస్ మిషన్లను తీసుకొచ్చినా యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్లనే బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టారు. ఇలాంటి డీలర్లు కర్నూలులోనే 100 మంది ఉన్నారు. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసిన కుంభకోణంలో 149 మంది డీలర్లను సస్పెండ్ చేసి వారి స్థానాల్లో ఇన్చార్జి డీలర్లను నియమించినా అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. సర్వర్‌కు లాక్ చేశారు.. ఇక అక్రమాలకు తావుండదని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కార్డుదారులు ఏ చౌకదుకాణం నుంచి అయిన సరుకులు తీసుకోవచ్చు. దీనినే పోర్టబులిటీగా వ్యవహరిస్తారు. చౌక దుకాణాలకు సరకులను కార్డుల సంఖ్యను బట్టి కేటాయిస్తున్నారు. పోర్టబులిటీ ప్రకారం డీలర్లకు సరుకులు ఇవ్వడం లేదు. నిబం«ధనల ప్రకారం ఈ నెల 15 వరకు షాపులను తెరచి ఉంచి కార్డులన్నింటికీ సరుకులు ఇవ్వాల్సి ఉంది. 15వ తేదీ వరకు సరుకులు ఇస్తారు కదా అని.. వారం, 10 రోజుల తర్వాత వెళ్లిన కార్డుదారులకు డీలర్లు మొండిచెయ్యి చూపుతున్నారు. సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపుతుండటం గమానార్హం. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత బియ్యం సరుకులు అయిపోయాయి అనే ప్రశ్నే రాదు. 15 వరకు సరకులు అలాగే ఉంచాలి. తర్వాత బ్యాక్లాగ్ చూపాల్సి ఉంది. కొందరు డీలర్లు పోర్టబులిటీ పేరుతో అదే షాపు పరిధిలోని కార్డుదారులకు మొండి చేయి చూపుతుండగా, మరికొందరు పోర్టబులిటీతో సంబంధం లేకుండానే సరకులు లేవు.. అలస్యంగా వచ్చారు.. అయిపోయాయి.. అంటూ వెనక్కి పంపుతుండటంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. షాపునకు ఉదయం పోతే సాయంత్రం రమ్మని, సాయంత్రం పోతే ఉదయం రమ్మని ఇలా రెండు మూడు రోజులు తిప్పుకొని తీరా సరకులు లేవు.. అయిపోయినాయని చెబుతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసే అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. అధికారికంగా పోర్టబులిటీ లేదు. ఉంటే ఆ విధంగా షాపులకు సరకులు కేటాయిస్తారు. జిల్లాలో ఏ షాపునకు పోర్టబులిటీ ప్రకారం సరకులు ఇవ్వడం లేదు. కానీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కార్డుదారులను తిప్పుకొని చివరికి డీలర్లు చేతులెత్తేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమాల్లో కొన్ని... – కర్నూలు నగరానికి చెందిన షేక్ మహమ్మద్‌కు ఆర్ఏపీ 138210834806 నెంబర్ రేషన్ కార్డు ఉంది. అయితే 130వ షాపు దగ్గరగా ఉండటంతో పోర్టబులిటీ కింద ఈ షాపులో సరకులు తీసుకుంటున్నారు. సరుకుల కోసం కార్డుదారుడు ఈ షాపు చుట్టూ తిరిగినా చివరకు సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపారు. 108వ షాపునకు సరుకుల కోసం వెళ్లగా అక్కడా మొండి చేయి చూపారు. ఇలా ఆయన జనవరి నెల సరుకులను కోల్పోయారు. – కర్నూలుకు చెందిన ఈడిగ రేవతికి 129వ షాపులో కార్డు ఉంది. కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ 1382129బి0045. జనవరి నెల సరుకుల కోసం 129-2 షాపులోను, అటు పోర్టబులిటీ కింద సరుకులు తీసుకునేందుకు 130 షాపునకు వెళ్లారు. పలు సార్లు తిప్పుకున్నా చివరకు సరుకులు అయిపోయాయంటూ వెనక్కు పంపించారు. – కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వీరన్నగౌడుకు జేఏబీ 131803500036 నెంబర్ కార్డు ఉంది. అయితే పోర్టబులిటీ కింద కర్నూలులో సరుకులు తీసుకుంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలను పోర్టబులిటీ కింద తీసుకునే అవకాశం లేదు. ఎక్కడ కార్డు ఉంటే అక్కడే కానుకలు తీసుకోవాల్సి ఉంది. కానుకల కోసం పెద్దపాడులోని డీలరు షాపునకు వెళితే నిరాకరించారు. -
పండుగ పూట.. ప‘రేషన్’
- మొరాయిస్తున్న ఈ-పాస్ సర్వర్లు - చాలాప్రాంతాల్లో అందని సిగ్నల్స్ -నత్తనడకన సరుకుల పంపిణీ -డీలర్లు, కార్డుదారుల అవస్థలు జిల్లాలో చౌక దుకాణాలు : 2,962 రేషన్‌కార్డులు : 11,20,323 లబ్ధిదారులు : 34,45,290 6వ తేదీ సాయంత్రానికి రేషన్ తీసుకున్న కార్డుల సంఖ్య : 6,05,888 ‘‘వీరు ఉపాధి పనుల కోసమో లేక ట్రెక్కింగ్ పేరిట కొండెక్కుతున్నారని అనుకుంటున్నారా? అదేమీ కాదు! రేషన్ సరుకులు తీసుకోవడానికి పడుతున్న అవస్థలివి. మడకశిర మండలం ఏఆర్రొప్పంలో ఈ-పాస్ సిగ్నల్స్ రాకపోవడంతో స్థానిక డీలర్, కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికారణంగా ఈ నెల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఆరుగురికి మాత్రమే సరుకులు ఇచ్చారు.474 మంది కార్డుదారులు మిగిలివున్నారు. వీరంతా శుక్రవారం డీలర్‌తో కలిసి ఈ-పాస్ యంత్రాన్ని తీసుకుని సమీపంలోని కొండపైకి వెళ్లారు. అక్కడా సిగ్నల్స్ రాలేదు. సమీప పొలాలన్నీ కలియదిరిగారు. అయినా ఫలితం లేదు. దీంతో నిరాశగా ఇంటిముఖం పట్టారు.’’ ధర్మవరం : చౌక దుకాణాలలో ఈ–పాస్ యంత్రాలు కార్డుదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గంటల తరబడి రేషన్‌షాపుల వద్ద వేచి చూస్తున్నా..సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సంక్రాంతి పండుగ నాటికైనా అందుతాయో..లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఏ చౌకడిపో వద్ద చూసినా బారులుతీరి కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిల్చున్న జనం.. ఇప్పుడు సర్వర్లు సరిగా పని చేయని కారణంగా చౌకడిపోల వద్ద వేచివుండాల్సి వస్తోంది. జిల్లాలో 11,20,323 రేషన్ కార్డులకు సరుకులు అందజేయాల్సి ఉండగా.. శుక్రవారం సాయంత్రానికి 6,05,888 కార్డులకు మాత్రమే (54 శాతం) పంపిణీ చేశారు. సామర్థ్యం లేని సర్వర్లు ఈ–పాస్ విధానం మొత్తం ఆన్లైన్ ద్వారా నడిచే వ్యవహారం. రేషన్‌కార్డులో ఉన్న లబ్ధిదారులలో ఎవరిదో ఒకరి వేలి ముద్రలను ఈ పాస్ యంత్రం ద్వారా తీసుకొని సరుకులు అందజేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం అన్ని అంశాలను ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తుండటంతో ఈ సర్వర్ల వేగం పూర్తిగా మందగించింది. దీంతో ఒక్కో లబ్ధిదారుడి వివరాలు సేకరించేందుకు 20 నుంచి 30 నిమిషాలు పడుతోందని డీలర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చాలా మంది డీలర్లు తెల్లవారుజాము నుంచే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే సర్వర్ వేగంగా పని చేస్తోందని, 10ఽ నుంచి సాయంత్రం ఏడు వరకు పూర్తిగా నిదానమవుతోందని డీలర్లు చెబుతున్నారు. ధర్మవరంలో 48,607 కార్డులు ఉండగా 59.30 శాతం మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఇక అత్యల్పంగా గుమ్మఘట్ట మండలంలో 14,436 కార్డులకు గాను 11.21 శాతం పంపిణీ జరిగింది. పరిగి, పుట్టపర్తి, గాండ్లపెంట, తలుపుల, ఉరవకొండ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. నాలుగు రోజులుగా తిరుగుతున్నా నాలుగు రోజుల నుంచి సరుకుల కోసం తిరుగుతున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా 20 మందికి కూడా వేయలేదు. ఏమంటే వేలి ముద్రలు తీసుకోలేదని చెబుతున్నారు.. పండుగపూట కూలికి పోకుండా స్టోర్ వద్ద ఉండాల్సి వస్తోంది. - రాములమ్మ, దుర్గానగర్, ధర్మవరం పండుగపూట ఎన్ని ఇబ్బందులో.. స్టోర్‌లో సరుకులు తీసుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది. మూన్నాళ్లుగా పని వదిలేసి స్టోరు దగ్గరే ఉంటున్నా సరుకులు ఇవ్వలేదు. ఏమంటే సర్వర్ పనిచేయలేదట.రేపు రమ్మన్నారు. రేపన్నా ఇస్తారో, లేదో! - లక్ష్మిదేవి, సత్యసాయినగర్, ధర్మవరం పాతపద్ధతిలోనే పంపిణీ చేయాలి గ్రామంలో ఈ-పాస్ సిగ్నల్స్ రాక సరుకులను తీసుకోవడానికి ఇబ్బంది అవుతోంది. ఐదు రోజుల నుంచి స్టోర్ వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదు. పాత పద్ధతి ద్వానే సరుకులను పంపిణీ చేయాలి.- గంగమ్మ, ఏఆర్ రొప్పం, మడకశిర మండలం సర్వర్ డౌన్ వాస్తవమే రేషన్ పంపిణీ చాలా ఆలస్యంగా జరుగుతున్నది వాస్తవమే. రెండు రోజులుగా సర్వర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి మాత్రం వేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా వీఆర్ఓ అథెంటిఫికేషన్ ద్వారా సరుకులు అందేలా చూస్తాం. - నారాయణమూర్తి, ఇన్చార్జ్ తహశీల్దార్, ధర్మవరం -
రేషన్ దుకాణాల్లో ’నగదు రహితం’
జిల్లాలో 1,932 షాపుల్లో అమలు జేసీ కోటేశ్వరరావు కొవ్వూరు: జిల్లాలోని 1,932 రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీని పరిశీలించేందుకు బుధవారం ఆయన కొవ్వూరులో పర్యటించారు. పట్టణంలో మసీదు వీధిలోని ఏడో నెంబర్ చౌక దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమిమా ఊరు కార్యక్రమంలో అందిస్తున్న కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారులకు కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందిస్తున్నామన్నారు. జిల్లాకు 20 శాతం సరుకులు అదనంగా కేటాయించినందున పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు. సర్వర్లలో సాంకేతిక లోపాల కారణంగా సరుకులు పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. 37 శాతం సరుకుల పంపిణీ పూర్తి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు చౌకదుకాణాల్లో సరుకుల పంపిణీ 37.26 శాతం, చంద్రన్న కానుకల పంపిణీ 27.92 శాతం పూర్తయ్యిందని జేసీ చెప్పారు. కొత్త రేషన్‌కార్డుల్లో పేర్లు గల్లంతైన వారి వివరాలను తహసీల్దార్ల ద్వారా చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 67 వేల కొత్త రేషన్‌కార్డులు జిల్లాలో కొత్తగా 67 వేల రేషన్‌కార్డులు అందిస్తున్నామని జేసీ చెప్పారు. మొదటి విడతలో ప్రింటింగ్ ప్రకియ పూర్తయిన వాటిని అందించామని, మిగిలిన ప్రాంతాలకు బుధవారం పంపిణీ చేశామని చెప్పారు. డిసెంబర్ 29 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి తొలుత 49,700 కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. మరికొంత మంది లబ్ధిదారులు ఉండటంతో జనవరి 2 వరకు ఆన్లైన్ చేసిన వారిలో అర్హత గల వారందరికీ కార్డులు అందిస్తామని చెప్పారు. జిల్లాలోని రేషన్‌దుకాణాల్లో ఈ నెలలో రూ.49 వేల లావాదేవీలు నిర్వహించామన్నారు. నగదు రహిత లావాదేవీలకు ఏర్పాట్లు జిల్లాలో 1,932 చౌకదుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జేసీ చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములుండి, ఖాతాలకు ఆన్లైన్ అనుసంధానం అయి ఉంటే వేలిముద్రల ద్వారా రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులతో పాటు చంద్రన్న కానుకలు కూడా అందించాలని ఆదేశించారు. డీలర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం దొమ్మేరులో ఆయన పర్యటించారు. తహసీల్దార్ కె.విజయకుమార్, సీఎస్‌డీటీ ఎం.కమల్ సుందర్, ఆర్ఐ పి.రమేష్ ఆయన వెంట ఉన్నారు. -
కొత్త చిక్కులు
నగదు రహిత రేష¯ŒSకు తిప్పలు చౌకడిపోల్లో వర్తించని పోర్టబులిటీ లబ్ధిదారులకు సరుకులు తిరస్కరిస్తున్న డీలర్లు కార్డు ఉన్నచోటకే వెళ్లాలంటూ సూచన ఉపాధి కోసం వచ్చినవారిలో అయోమయం నగదు రహిత రేష¯ŒS పంపిణీ వల్ల లబ్ధిదారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు రహిత లావాదేవీల్లో రేష¯ŒS పోర్టబులిటీ వర్తించడం లేదు. ఎప్పటిలాగే ఈ నెల కూడా రేష¯ŒS డిపోలకు వెళ్తే ఇతర ప్రాంతాల లబ్ధిదారులకు డీలర్లు సరుకులు నిరాకరిస్తున్నారు. తమ పరిధిలోనివారికే సరుకులు ఇస్తామని, ఇతర ప్రాంతాలవారు కార్డు జారీ అయిన రేష¯ŒS డిపోకే వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : రేష¯ŒS పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేష¯ŒS తీసుకునే సౌకర్యం ఉంది. గత నెల వరకూ కూడా ఈ విధానంలోనే రేష¯ŒS సరుకులు పంపిణీ చేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా చౌకడిపోల్లో కూడా నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అధికారులు రేష¯ŒS డిపోల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంలో ఈ–పోస్ యంత్రాల్లో లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలను, రేష¯ŒS కార్డు నంబర్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా తీసుకు న్న సరుకులకు సంబంధించిన నగదు లబ్ధిదారు ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమ అవుతుంది. దీని అమలును గత నెల నుంచే చేపట్టినా, ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం, పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యల తో ఆ నెలలో నగదు తీసుకోకుండానే సరుకులు పంపిణీ చేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాక జనవరిలో తీసుకుందామని అందరికీ అరువు కింద సరుకులు ఇచ్చారు. ‘పోర్టబులిటీ’ సరుకులకు ‘నో’ ఈ నెల నుంచి చౌకడిపోల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించారు. కొత్త విధానంలో లబ్ధిదారు బ్యాంకు ఖాతా అతడు రేష¯ŒS కార్డు పొందిన డీలర్ ఖాతాకే అనుసంధానమవుతోంది. దీంతో పోర్టబులిటీ విధానం కింద వేరేచోట నుంచి సరుకులు పొందే లబ్ధిదారు ఖాతా నుంచి నగదు ఆ డీలర్‌కే చేరుతోంది. సరుకులు ఇచ్చిన డీలర్ ఖాతాకు ఆ సొమ్ములు చేరడంలేదు. ఫలితంగా డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సరుకులు కావాలంటే కార్డు పొందిన డీలర్ వద్దకే వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లాలోని 2,444 చౌకడిపోల పరిధిలో 15,79,555 రేష¯ŒS కార్డులున్నాయి. ఇందులో సుమారు 1.50 లక్షలమంది కార్డుదారులు ఇన్నాళ్లుగా పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకుంటున్నారు. వీరిలో జిల్లాలోని కార్డుదారులతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలవారు కూడా ఉన్నారు. ఈ నెల సరుకులు ఇవ్వలేదు మాది అమలాపురం. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ రీత్యా రాజమహేంద్రవరంలో ఉంటున్నాను. నాలుగు నెలల నుంచి ఒకే రేష¯ŒS దుకాణంలో సరుకులు తీసుకుంటున్నాను. గత నెలలో క్రెడిట్ ఇచ్చారు. ఆ నగదు తన ఖాతాకు జమ అయితే వచ్చే నెలలో సరుకులిస్తామని డీలర్ అంటున్నారు. సోమవారం సరుకులకు వెళితే నగదు తన ఖాతాకు జమ కాలేదని, కార్డు ఎక్కడ జారీ చేశారో ఆ డీలర్ వద్దకే వెళ్లాలని చెప్పారు. నా ముందు మరో ముగ్గురికి కూడా ఇదే సమస్య ఎదురైంది. – కె.వెంకటసురేష్, లలితానగర్, రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోని కార్డుదారులకు ఇబ్బంది లేదు నగదు రహిత లావాదేవీలవలన జిల్లాపరిధిలోని కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వారందరికీ పోర్టబులిటీ వర్తిస్తుంది. ఇప్పటివరకూ 7 వేల మందికి పోర్టబులిటీ ద్వారా సరుకులు పంపిణీ చేశాం. నగదు రహిత లావాదేవీల వలన ఇతర జిల్లాల కార్డుదారులకు పోర్టబులిటీ వర్తించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో పై స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. – వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
అందని ఆదరువు
► 15వ తేదీ వచ్చినా పంపిణీ కాని పింఛన్లు ► పండుటాకులకు ఇక్కట్లు ►అందజేసింది 20 శాతమే సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రతి నెలా ఓ ప్రయోగమే. రెండు నెలలు బాగా ఇచ్చారంటే చాలు మరో రెండు నెలల పాటు నరకయాతనే. నిబంధనల పేరుతో ఆంక్షలు పెడుతూ íపింఛనుదారుల జీవితాలతో చలగాటమాడుతోంది సర్కారు. తాజాగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పింఛన్ కోసం బడుగు జీవులకు నరకం చూపిస్తోంది. బ్యాంకుల చుట్టూ తిప్పిస్తోంది. రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాయిస్తోంది. అయినా కరుణించేవారు లేరు. పట్టించుకునేవారు కానరారు. ఐదో తేదీలోగా అందాల్సిన పింఛన్ 15 రోజులైనా చేతిక రాని పరిస్థితి నెలకొంది. – సాక్షి, విశాఖపట్నం డిసెంబర్ నెలకు జిల్లాలో 3,24,707 మందికి రూ.35.42కోట్ల పింఛన్ మొత్తాన్ని మంజూరు చేస్తే ఇప్పటి వరకు 2,86,403 మందికి రూ.31 కోట్లు జమచేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇంకా 41వేల మందికి పింఛన్లు జమకాలేదని వీరంతా బ్యాంకు ఖాతాలు తెరవకపోవడం వల్లే జమ చేయలేదని చెబుతున్నారు. పోనీ కనీసం బ్యాంకుల్లో జమ చేసిన వారిౖకెనా సొమ్ములిచ్చారా అంటే అదీ లేదు. 2.86 లక్షల మందిలో కనీసం లక్షమందికి కూడా నేటి కి పింఛన్లు అందలేదని అధికారులే చెబుతున్నా రు. పింఛన్ లు అందుకుంటున్న వారిలో జిల్లాలో 1,48,784 మంది వృద్ధులు, 1,33,430 మంది వితంతువులు, 39,125 మంది దివ్యాంగులు, 2305 మంది చేనేత, 1063 మంది కల్లుగీత కార్మికులు ఉన్నారు. వీరిలో నేటికి సగం మందికి రూపేకార్డుల్లేవు. కార్డులున్నప్పటికీ యాక్టివేట్ కాకపోవడంతో రూపేకార్డుల ద్వారా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఉదయం లేచింది మొదలు వృద్ధులు, వికలాంగులు, వితంతువు లకు బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. పింఛన్ నగర పరిధిలోనిపింఛన్ దారులకు నూటికి 65 శాతంమందికి పింఛన్లు అందినప్పటికీ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం కనీసం 30 శాతం మందికి కూడా సొమ్ములు చేతికందని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరగడం, డబ్బుల్లేవని తిప్పి పంపించడం పరిపాటిగా మారింది. పింఛన్లు తీసుకోలేని వారిలో ఎక్కువ మంది వృద్ధాప్య, వికలాంగులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో కనీసం 20 శాతం మందికి కూడా ఇప్పటి వరకు పింఛన్ సొమ్ము చేతికందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికేపింఛన్ అందక అచ్యుతాపురం మండలంలో ఓ వృద్ధుడు ప్రాణాలొదలగా, ప్రతిరోజు ఏదో మూల స్పృహ తప్పిపడిపోతున్న ఘటనలు రోజు సర్వసాధారణమై పోయాయి. శుక్రవారం మునగపాక గ్రామానికి చెందిన దివ్యాంగుడు పిల్లా సూరిబాబు మునగపాక ఎస్బీఐ బ్యాంకు వద్ద ఎండలో నిల్చొలేక ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. అదే సమయంలో ఖాతాదారు లకు అందుతున్న సేవలను పరిశీలించేందుకు వచ్చిన మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో శాంతలక్షి్మలు అతనిని లేపి సపరిచర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఇలా క్యూలైన్లలో ప్రాణాలుకోల్పోయే బదులు బతికి బాగుంటే తర్వాత తీసుకోవచ్చు అన్న చందాన వేలాది మంది వృద్ధులు ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్య శుక్రవారం జరిగిన వీడియోకాన్ఫరెన్్సలో ఈ విషయా న్ని జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు ఖాతాల్లో జమైన వృద్ధులు, వికలాంగులకు నేరుగా వారి ఆధార్,పింఛన్ కార్డుల ఆధారంగా సొమ్ములు చేతికిస్తే బాగుంటుందన్న సూచన చేశారు. అదే విధంగా ఈ నెల వరకు ఖాతాల్లేని వారికి కూడా అదే రీతిలో సొమ్ములివ్వాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై సర్కార్ కూడా సానుకూలంగా స్పందించిందని గ్రామీణాభివృద్ధిశాఖాధికారులు చెబుతున్నారు. ఒకటి రెండ్రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులొస్తాయని..నగదు నిల్వలను బట్టి బ్యాంకుల పరిధిలో ఉన్నపింఛన్ దారులకు ఇవ్వాలని యోచనలో ఉన్నట్టుగా చెప్పారు. చిక్కిన రేషన్ మరో పక్క రేషన్ కార్డుదారుల పరిస్థితి అదే విధంగా ఉంది. జిల్లాలో ఈ–పాస్ వర్తింపచేసిన 1625 షాపుల పరిధిలో 9,79,813 మంది కార్డుదారులకు ఈనెల రేషన్ ఇవ్వాల్సి ఉంది. కాగా 1312 షాపుల్లో మాత్రమే ఈపాస్ మిషన్లు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఇప్పటి వరకు 8,61,151 మందికి మాత్రమే సరుకులు ఇవ్వగలిగారు. వీరిలో 3529 మందికి నగదు రహిత పద్ధతిలో ఇవ్వగలిగారు. ఈపాస్ వర్తింపచేయని మిగిలిన షాపుల్లో అరువుకు రేషన్ సరుకులు ఇస్తుండడంతో చాలా వరకు ఇబ్బంది లేకుండా పోయింది. -
ఇదేనా ‘సభ్యత’?
= టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్, పింఛన్ = తారాస్థాయికి అధికార పార్టీ ఆగడాలు = కార్డుదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ‘పచ్చ’ డీలర్లు = రూ.వంద కట్టించుకుని బలవంతంగా సభ్యత్వం ఇస్తున్న వైనం ధర్మవరం : అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదులోనూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఇష్టమున్నా, లేకున్నా బలవంతంగా సభ్యత్వ రశీదును అంటగడుతున్నారు. రూ.వంద చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పింఛన్‌దారులు, రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే ‘కోత’ పెడతామంటూ బెదిరిస్తున్నారు. దీనివల్ల బాధితులు లబోదిబోమంటున్నారు. అధికార టీడీపీ నాయకులు ప్రతియేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. అయితే.. ఈ సారి తమ అధినేత వద్ద మార్కులు కొట్టేయాలని భావించిన ధర్మవరం నియోజకవర్గ నాయకులు ఓ అడుగు ముందుకేసి తమ పార్టీ కేడర్‌కు, అనుయాయులకు టార్గెట్లు పెట్టారు. స్టోర్ డీలర్లు, పింఛన్ పంపిణీదారులు, ఉపాధి మేట్లకు కూడా టార్గెట్లను నిర్దేశించారు. వారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ టీడీపీ సభ్యులుగా చేరాలంటే ఒత్తిడి చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 72,490 రేష¯ŒSకార్డులు ఉన్నాయి. 41,819 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మందికి టీడీపీ సభ్యత్వం అంటగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ డీలర్లు తమ వద్దకు సరుకుల కోసం వచ్చే వారిని తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. సభ్యత్వం కోసం రూ.వంద కట్టి సరుకులు తీసుకెళ్లండని, లేకపోతే ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెల సరుకులను అరువుపై ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. డీలర్లు మాత్రం తప్పనిసరిగా రూ.వంద చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఈ నెల నుంచి «పింఛన్ దారులకు ఇబ్బందులు తలెత్తకూడదని నేరుగా అకౌంట్లకు పింఛన్ మొత్తాలను జమ చేశారు. వారిలో చాలా మందికి అకౌంట్లు లేకపోవడం, ఉన్నా ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ నాయకులు పింఛన్ రావాలంటే తప్పనిసరిగా రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని వృద్ధులు, వికలాంగులను భయపెడుతున్నారు. ఒకవైపు రేషన్.. మరోవైపు సభ్యత్వ నమోదు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన సిబ్బంది రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద కూర్చుని, కార్డుదారుల వివరాలు అక్కడికక్కడే సేకరించి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. రూ.100 కట్టించుకుని వారికి రశీదులు ఇచ్చిపంపుతున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్సు ఉంటుందని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుందని మభ్యపెడుతున్నారు. దీనిపై ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్‌ను సంప్రదించగా..ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేటి నుంచి కార్డుదారులకు అప్పుపై సరుకులు
–జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబరు నెల సరుకులను శనివారం నుంచి కార్డుదారులకు అప్పు ప్రాతిపదిక పంపిణీ చేయనున్నట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతోను శుక్రవారం.. జేసీ సమీక్ష నిర్వహించారు. నగదు కొరత ఉన్నందును కార్డుదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. అప్పుపై అన్ని రకాల సరుకుల పంపిణీ తక్షణం అమలులోకి వస్తుందన్నారు. ఇంతవరకు సరుకలు తీసుకోని కార్డుదారులందరూ నేటి నుంచి నగదు చెల్లించకుండానే సరుకులు పొందవచ్చని తెలిపారు. డీలర్లు కూడ ఎట్టి పరిస్థితుల్లోను కార్డుదారులను నగదు అడుగరాదని ఆదేశించారు. జిల్లాలో 10.75లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా శుక్రవారం నాటికి దాదాపు 40శాతం పంపిణీ పూర్తి అయింది. మిగిలిన 60శాతం కార్డుదారులు అప్పుపై సరుకులు పొందాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికోట్కూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఈ నెలలోనే త్వరలో అదనపు సరుకులు కందిపప్పు పెసరపప్పు, వేరుశనగ విత్తనాలు కిలో ప్యాకెట్లు మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు ఇస్తున్నామన్నారు. వీటిని కూడ అప్పుపై తీసుకోవచ్చని సూచించారు. అయితే జనవరి నెల సరకులు తీసుకునే సమయంలో ఈ బకాయిని చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. కార్డుదారుల నుంచి డబ్బులు తీసుకోకపోతే వచ్చే నెల డీడీలు కట్టడం కష్టం అవుతుందని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలపగా.. ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జేసీ చెప్పారు.కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి నగదు రహిత రేషన్ సరుకులు పంపిణీ
కార్డుదారుడు ఖాతాలో సొమ్ము లేకుంటే డీలర్ క్రెడిట్ కార్డుతో సరఫరా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ పెద్దాపురం :చౌక ధరల దుకాణాల డీలర్లు నేటి నుంచి కార్డుదారులకు నగదు రహిత రేషన్ సరుకు సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ లోని రేషన్ డీలర్లతో బుధవారం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నేటి నుంచి వినియోగదారులకు రూపే కార్డు ద్వారా నగదు రహితంగా సరుకులు అందజేయనున్నట్టు తెలిపారు. కార్డుదారుడు ఖాతాలో నగదు లేకపోతే డీలర్ల క్రెడిట్ కార్డుపై సరుకుల అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కార్డుదారు నుంచి నగదును స్వీకరించకూడదని తెలిపారు. క్రెడిట్‌పై ఇచ్చిన సరుకుకు తరువాతి నెలలో కార్డుదారుడు బ్యాంక్ నిల్వ నుంచి డీలరు పొందాలని సూచించారు. డీలర్లు రానున్న రోజుల్లో బిజినెస్ కరస్పాండెంట్‌గా గ్రామాల్లో పని చేయాల్సి ఉంటుందని జేసీ అన్నారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల ప్రకారంగా రేషన్ డీలర్లు నగదు రహితంగా సరుకులు పంపిణీ చేయాలని, ఎటువంటి అపవాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎఎస్వో పురుషోత్తమరావు నగదు రహిత రేషన్ సరుకుల పంపిణీపై డీలర్లకు శిక్షణ ఇచ్చారు. తహిసీల్దార్ జి.వరహాలయ్య, ఎంఎస్‌వో లక్ష్మికుమారి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
పది మంది రేషన్ దొంగల అరెస్టు
కర్నూలు: రేషన్ పంపిణీలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే విమర్శల నేపథ్యంలో పది మంది చౌక డిపో డీలర్లను అరెస్టు చేశారు. వీరిలో కర్నూలులో ఐదుగురు, నందవరంలో ఐదుగురు ఉన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి బుధవారం సాయంత్రం సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది, టూటౌన్ పీఎస్ పరిధిలో 42 మంది, త్రీటౌన్ పీఎస్ పరిధిలో 15 మంది, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో 11 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో వన్‌టౌన్ పరిధిలో ఖాశీం, శ్రీనివాసులు, టూటౌన్ పరిధిలో షేక్ చాంద్ బాషా, చంద్రబాబు, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో సోము సాయిబాబాలను పోలీసులు అరెస్టు చేశారు. చౌక దుకాణాల్లో అవినీతిని అడ్డుకోవడానికి గత ఏడాది ఈ–పాస్ మిషన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్‌తో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తక్కువ చూపించి రూ.లక్షల్లో ప్రభుత్వానికి గండి కొట్టారు. జిల్లా వ్యాప్తంగా 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పౌర సరఫరాల, రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కర్నూలు డివిజన్లో 121, నందికొట్కూరు పట్టణ పరిధిలో 12, కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 5, శ్రీశైలం పీఎస్ పరిధిలో 3, వెల్దుర్తి పీఎస్ పరిధిలో 1, పాణ్యం పీఎస్ పరిధిలో 3, నంద్యాల డివిజన్ పరిధిలో 3, దేవనకొండలో 3, నందవరంలో 7, ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో 15, ఆదోని డివిజన్ పరిధిలో 25 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన డీలర్లందరినీ త్వరలో అరెస్టు చేస్తామని, వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో... రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడిన కేసులో నందవరం మండలానికి చెందిన ఐదుగురు డీలర్లను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నందవరం మండలం గంగవరానికి చెందిన డీలర్ సత్యనారాణయశెట్టి, నాగలదిన్నెకు చెందిన డీలర్లు సుమిత్రబాయి, షబ్బిర్, ప్రేమకుమారి, కనకవీడు డీలర్ బోయ కోటేష్‌లు ఉన్నట్లు చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ఇకపోతే పట్టణంలో 13 మంది, రూరల్‌లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని.. వీరంతా పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నందవరం ఎస్ఐ జగన్మోహన్ పాల్గొన్నారు. -
డీలర్లపై వేటు
దేవనకొండ: ఈ–పాసును బైపాస్ చేసి నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతికి పాల్పడిన రేషన్‌డీలర్లపై అధికారులు చేపట్టారు. దేవనకొండలోని 17, 18, 30కు చెందిన ముగ్గురు డీలర్లపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఆర్ఐ ఆదిమల్లన్నబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీ నందవరం : మండలంలోని 7గురు డీలర్లపై వేటుపడింది. నందవరంలో 3వ షాపు లచ్చప్ప, గంగవరంలో 8వ షాపు సత్యనారాయణశెట్టి, నాగలదిన్నెలో 12వ షాపు తిప్పన్న, 13వ షాపు షబ్బీర్, 33వ షాపు ప్రేమ్‌కుమార్, టి.సోమలగూడూరులో 17వ షాపు మాదన్న, కె.పేటలో 21వ షాపు ఈరన్న అనే డీలర్లు వేటు చేసినట్లు తహసీల్దార్ హుశేన్‌సాహెబ్ తెలిపారు. ఈ నెలలో ఆయా డీలర్లు ద్వార డీడీ కట్టించుకోవడం లేదని, కొత్త డీలర్లు వచ్చే వరకు ఇన్‌చార్జ్‌ల ద్వార డీడీలు కట్టించి కార్డుదారులకు సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఎమ్మిగనూరు రూరల్: మండలంలో 15 మంది డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మండలంలో ఇద్దరు, పట్టణంలో 13 మంది డీలర్లపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటూ వారి నుంచి రికవరీకి చేస్తున్నట్లు సమాచారం. -
డీలర్లూ.. తూకం బయట ఉంచండి
కరప : రేషన్ డీలర్లు కార్డుదారులకు కనిపించేలా తూకం ఏర్పాటు చేయాలని, అలా చేయని వారిపై చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖాధికారి (డీఎస్ఓ) ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కరపలోని రేషన్ షాపులు తనిఖీ చేశారు. కొందరు డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు, స్టాకులేదని కుంటిసాకులు చెపుతున్నట్టు తెలిసిందని, అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 90 వేల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఒక్కసారి కూడా సరుకులు తీసుకోకపోవడంతో వారు జిల్లాలో లేనట్టుగా గుర్తిచామన్నారు. జిల్లాలోని తెలుపురంగు రేషన్ కార్డుదారులందరికీ డిసెంబరు నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్ఓ చెప్పారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రేపల్లె: మండలంలోని పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎన్.కిషోర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అడిషనల్ డీఎస్పీ శోభామంజరి ఆదేశాల మేరకు తమ సిబ్బందితో నిఘా ఉంచి పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రేపల్లె వైపునుంచి కృష్ణాజిల్లావైపు వెళ్తున్న ఏపీ28డబ్లు్య 6437 నంబరుగల పాల లారీ డ్రై వర్ తనిఖీలను గమనించి లారీని పక్కనే ఉన్న మట్టిరోడ్డుకు తరలించి అక్కడే వదిలి పారిపోయాడన్నారు. లారీలో గోతాలు మార్చి నింపిన 83 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయని, రికార్డులను పరిశీలించగా ఇవి కర్లపాలెంకు చెందిన మహ్మద్ అబీబ్‌బేగ్‌దిగా గుర్తించామన్నారు. మహ్మద్ అబీబ్‌బేగ్‌పై ఈ సంవత్సరం అక్రమంగా బియ్యం తరలింపుపై ఇప్పటికే ఐదు సార్లు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేపల్లె పోలీసులకు సమాచారం అందించి, లారీని రేపల్లె ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ టి.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ మహేష్, ఆర్ఐ పి.సుధీర్ తదితరులున్నారు. -
ఈ–పాసు’ గాలా..!
–రేషన్ బియ్యం పక్కదారి! –అక్రమాలను అరికట్టలేని టెక్నాలజీ –సర్కారు కోతలు వట్టిదే! –పట్టుబడిన 25 టన్నుల బియ్యం lప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానం ఆచరణలో విఫలమైంది. దీనివల్ల లబ్ధిదారులకే సరుకులు అందుతాయని, అవకతవకలకు తావే ఉండదని ప్రభుత్వం పలికిన బీరాలు వట్టిదేనని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 25 టన్నుల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అడపదడపా చేపట్టిన దాడుల్లోనే ఇంతపెద్దమొత్తంలో బియ్యం పట్టుబడితే.. వాస్తవంగా జిల్లాలు దాటుతున్న బియ్యం విలువ ఎంత ఉంటుందో అంచనాకూ అంతుబట్టని దుస్థితి నెలకొంది. చింతలపూడి : జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతూంది. మన జిల్లా నుండే కాకుండ సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడ రేషన్ బియ్యం భారీగా దిగుమతి అవుతూంది. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలు వస్తున్నాయి. పేదల కడుపు నింపాల్సిన రూపాయి కిలో బియ్యం రైస్ మిల్లులకు చేరి పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యంగా మారి అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో అధికారులకు పట్టుబడిన రేషన్ బియ్యం సుమారు 25 టన్నులు. పట్టుబడకుండ జిల్లాలు దాటుతున్న బియ్యం ఏస్ధాయిలో ఉందో ఊహకే అంతుపట్టదు. ప్రభుత్వం సబ్సిడీ భరించి రూపాయికే కిలో బియ్యం అందిస్తూంది. జిల్లాలో 12,46,871 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 10,77,504 తెల్ల రేషన్ కార్డులు కాగ, 1,034 అన్నపూర్ణ కార్డులు, 1,60,033 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. సబ్సిడీ బియ్యానికి బయట మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో అక్రమ రవాణా వ్యాపారంగా మారింది. కొన్నిచోట్ల డీలర్లు, మరికొన్ని చోట్ల లబ్దిదారులే చౌక బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతూంది. అధికారులకు విషయం తెలిసినా ఎవరైనా సమాచారం అందించే వరకు పట్టించుకోరన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని భావించిన ప్రభుత్వం ఈ పాస్ విధానం ప్రవేశపెట్టి బయోమెట్రిక్ విధానం ద్వార లబ్దిదారుల నుండి వ్రేలిముద్రలు సేకరించి మరీ రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంది. బియ్యం లబ్దిదారులకు చేరాక అసలు తతంగం ప్రారంభం అవుతుంది. రేషన్ బియ్యానికి భారీ సబ్సిడీ ఉండటం, భారీగా లాభాలు వస్తుండటంతో లబ్దిదారులను ప్రలోభపెట్టి కిలో 10 నుండి 12 రూపాయలకు దళారులు కొంటున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని మిల్లులకు సరఫరా చేసి కోట్లు దండుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలం, రాఘవాపురం కేంద్రంగా ఈ అక్రమ దందా యధేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తూంది. ఇటీవల రాఘవాపురం నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని పౌరసరఫరాల అధికారులకు అప్పగించారు. అంతకుముందు కూడ గణిజర్ల నుండి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెడుతున్నా పరిస్ధితిలో మార్పు రావడం లేదు. మూడు సార్లు ఒకే వ్యక్తి ఈ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం ఇక్కడ విశేషం. భారీ లాభాలు వస్తుండటంతో వ్యాపారులు బరితెగించి ఈ వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు సబ్సిడీ బియ్యం పట్టుబడ్డ సందర్భాల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలు కూడ నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ కేసుల్లో పట్టుబడ్డ వారిపై సాధారణంగా 6(ఏ) కేసులు నమోదు చేస్తారు. వీటిని పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకునే సరికి కాలం గడిచి పోతూంది. ఒకవేళ ఎవరికైనా శిక్ష పడిన దాఖలాలు ఉన్నాయా అంటే అవీ లేవు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా యధేఛ్ఛగా సాగిపోతూంది. తెలంగాణాకు సరిహద్దు మండలం కావడంతో తెలంగాణ రాష్ట్రం నుండి రేషన్ బియ్యం ఇక్కడికి భారీగా దిగుమతి అవుతూంది. ఇక్కడి నుండి లారీల్లో లోడు చేసి మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దష్టి సారించి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఏడాది 6 కేసులు నమోదు ఈ ఏడాది ఇప్పటి వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేశాం. 25 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు సమాచారం అందిస్తే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్ శివశంకర్‌రెడ్డి –డీఎస్ఓ ,ఏలూరు -
చేతులెత్తేశారు!
‘ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు’ బ్రేక్ - కార్పొరేషన్ పరిధిలో రేషన్ షాపు నిర్వాహకుల ససేమిరా - కోటా కార్డులకే సరుకులిస్తామని స్పష్టం - ఇతరులకు ఇవ్వలేమని తేల్చిన వైనం - వలస కుటుంబాలకు తప్పని అవస్థలు - 28 షాపులకు అధిక రేషన్ కోటా ఇవ్వండి - ప్రభుత్వాన్ని కోరిన జిల్లా జాయింట్ కలెక్టర్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రేషన్ సరుకులు ఏ రేషన్ దుకాణంలోనైనా తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుకు బ్రేక్ పడుతోంది. నిర్ణీత కోటా కార్దుదారులకు మించి రేషన్ కోసం ఇతర ప్రాంతాల వారు వస్తుండటంతో తమ పరిధిలోని కార్డుదారులకు చివరకు సరుకులు లేకుండా పోతున్నాయని కొద్ది మంది రేషన్‌షాపు యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి పరిధిలోని కార్డుదారులకు వారే రేషన్ ఇవ్వాలని... వేరే షాపునకు వస్తే సరుకులు ఇవ్వమని తేల్చి చెప్పేందుకు రేషన్‌షాపు యాజమాన్యాలు నిర్ణయించాయి. వాస్తవానికి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ–పాస్ విధానంలో కుటుంబంలోని సభ్యులు ఎవరైనా వేలిముద్రలు వేసి రాష్ట్రంలోని ఏ రేషన్‌షాపు నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, తాజాగా రేషన్‌షాపు యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో ఎక్కడైనా రేషన్ విధానానికి బ్రేకులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుదారుల అధిక రద్దీ ఉన్న షాపులకు అదనపు కోటా సరుకులను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ కోరారు. మా కార్డులకే రేషన్ జిల్లాలో 11 లక్షల 52 వేలకుపైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు రేషన్ సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా 2,414 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ–పాస్ విధానం అమలుతో జిల్లాలో ఏ కార్డుదారైనా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కలిగింది. గ్రామాల్లో రేషన్‌కార్డులు ఉండే అనేక మంది కూలీ కోసం పొట్టచేతబట్టుకుని కర్నూలు నగరానికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ–పాస్ విధానం అమలుతో ప్రధానంగా బతికేందుకు వలస వచ్చిన కుటుంబాలు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండే షాపులల్లోనే రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. అయితే, వీరు ముందుగానే రేషన్ సరుకులు తీసుకోవడంతో ఆ షాపు పరిధిలో ఉండే కార్డుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి సరుకులు కాస్తా మిగలడం లేదు. ఫలితంగా వీరు రేషన్‌షాపు డీలర్లతో వాదనకు దిగుతున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలోని 28 రేషన్షాపులల్లో ఈ సమస్య ప్రధానంగా ఉంది. దీంతో వీటికి అదనపు కోటా రేషన్ సరుకులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని జేసీ కోరారు. అదనపు కోటా ఇవ్వండి ప్రధానంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 28 షాపుల్లో సరఫరా చేసిన కోటాకు మించి రేషన్‌దారులు సరుకుల కోసం వస్తున్నారని అధికారులు లెక్క తేల్చారు. గత మూడు నెలల కాలాన్ని పరిగణలోనికి తీసుకుని ఎక్కడైతే కార్డులకు మించి సరుకులు కావాలనే డిమాండ్ ఉందో.. అలాంటి షాపులను గుర్తించారు. ఈ విధంగా ఎంపిక చేసిన 28 రేషన్ షాపులకు అదనపు కోటా సబ్సిడీ సరుకులకు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు తాజాగా లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం స్పందించి అదనపు కోటా సరఫరా చేస్తే ఈ–పాస్ విధానం అమలుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. ప్రభుత్వాన్ని కోరాం జిల్లాలో కొన్ని రేషన్‌షాపుల వద్ద ఈ–పాస్ విధానంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల పరిధిలోని కార్డుదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారని సమాచారం అందింది. అందువల్ల ఈ విధంగా సమస్యలున్న 28 రేషన్‌షాపులకు అదనపు కోటా సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అనుమతి వచ్చిన వెంటనే ఇబ్బందులు లేకుండా చూస్తాం. – హరికిరణ్, జాయింట్ కలెక్టర్ -
ఈసారైనా అర్హులకు అందేనా ?
జిల్లాలో 463 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ అర్హుల ఎంపికకు త్వరలో రాత పరీక్ష మండపేట : రేషన్ దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీ ప్రక్రియ మరోమారు తెరపైకి వచ్చింది. జిల్లాలోని 463 దుకాణాల్లో డీలర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. అర్హుల ఎంపికకు త్వరలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈసారైనా గతంలో మాదిరి పక్షపాతం చూపకుండా అర్హులకు షాపులు కేటాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. జిల్లాలో తెల్లరేషన్ కార్డులు 14,39,183 ఉండగా, అంత్యోదయ కార్డులు 84,742, అన్నపూర్ణ కార్డులు 1,199 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,647 దుకాణాలు ద్వారా వీరికి సరుకులు అందిస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణం పరిధిలో 500 కార్డులు మాత్రమే ఉండాలి. కాగా 800 నుంచి 1200ల వరకు కార్డులు ఉన్న రేషన్‌షాపులు ఎన్నో ఉన్నాయి. అధిక సంఖ్యలో కార్డులు ఉండటంతో సరుకులు తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బం దులు పడుతున్నారు. ఏడాదిక్రితం ఒక్కో షాపు పరిధిలో 500 కార్డులతో షాపుల సర్ధుబాటు చేయగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన 173 షాపులు, ఇన్చార్జిల పరిధిలో ఉన్న మరో 100 దుకాణాలు కలిపి 273 షాపుల్లో డీలర్ల భర్తీకి ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. డీలర్ల ఎంపికకు రాత పరీక్షతో ఇంటర్వూ్యలు కూడా నిర్వహించారు. కాగా అర్హతతో నిమిత్తం లేకుండా పలు రెవెన్యూ డివిజన్లలో అధికార పార్టీ వారు చెప్పిన వారికి, తెలుగు తమ్ముళ్లకు షాపులు కట్టబెట్టే ప్రయత్నాలు అప్పట్లో ముమ్మరంగా జరిగాయి. ఇంటర్వూ్యల నిర్వహణలోను నిబంధనలకు నీళ్లొదిలి కావాల్సిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు సైతం ఆదేశించారు. పలు విమర్శల నడుమ అప్పట్లో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మరోమారు షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కార్డుల సర్దుబాటుతో... కొత్తగా 463 దుకాణాల భర్తీకి ఇటీవల ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కార్డుల సర్దుబాటుతో జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన షాపులు 300లు కాగా ఇన్చార్జిల పరిధిలో ఉన్న 163 షాపులు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇప్పటికే షాపుల అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. 80 మార్కుల ప్రాతిపదికన త్వరలో రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వూ్య నిర్వహిస్తారని సమాచారం. కాగా ఈసారైన పక్షపాతానికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియను నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అర్హులకు మాత్రమే షాపులు కేటాయించాలంటున్నారు. -
రేషన్ దుకాణాలపై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు
సూర్యాపేట : పట్టణంలోని రేషన్ దుకాణాలపై సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. లేదా అని కీ రిజిస్టర్‌ను పరిశీలించారు. అలాగే స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. దాడుల్లో కోదాడ, హుజూర్నగర్ డీటీసీఎస్‌లు ఏవీ రమణారావు, చంద్రశేఖర్, సురేష్, ఆర్ఐసీఎస్ అల్లావుద్దిన్, వెంకట్ తదితరులు ఉన్నారు. -
రేషన్ దుకాణాల్లో మంత్రి సునీత తనిఖీ
నగదు రహితంపై ఆరా విజయవాడ (భవానీపురం) : స్థానిక చౌక ధరల దుకాణాలలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. 3, 4 షాపులలో నగదు రహిత సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించి, దానిపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో ప్రప్ర«థమంగా నగదు రహిత పంపిణీని ప్రారంభించి అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి కార్డుదారునికి పారదర్శకంగా సరుకులను అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ఇ–పోస్ ద్వారా ఇప్పటికే 69 శాతం సరుకులను పంపిణీ చేశామన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 87 శాతం పంపిణీ పూర్తి అయ్యిందని తెలిపారు. బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలలో ఉంటున్నవారు పోర్టబులిటీ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు. పోర్టబులిటీ ద్వారా గత నెలలో 48వేల మంది సరుకులు పొందగా, ఈ నెలలో 7లక్షల మంది పొందారని వివరించారు. ఆమెతోపాటు డీఎస్ఓ రవికిరణ్, 27వ డివిజన్ కార్పొరేటర్ షేక్ హబిబుల్లా, ఏఎస్ఓ శ్యామ్‌కుమార్ ఉన్నారు. -
సకాలంలో రేషన్ అందజేయాలి
ఆధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు సంగారెడ్డి టౌన్: ప్రతి నెలా 15లోపు రేషన్ కార్డుదారులకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. ప్రతి నెలా ఒకటిలోగా చౌక ధరల దుకాణాలకు సరుకులు చేరాలన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలను అధికారులకు సూచించారు. చౌకధరల దుకాణ డీలర్లు సమయ పాలన పాటిస్తూ అవకతవకలకు ఆస్కారం లేకుండా కార్డు దారులకు సరుకులు అందించేందుకు డివిజను సహాయ పౌర సరఫరాల అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. చౌకధరల దుకాణాలపై ముమ్మరంగా దాడులు జరిపి అక్రమాలకు పాల్పడిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినెలా విధిగా 16న సంబంధిత మండలాలలో డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ముగింపు నిల్వలు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాన్నారు. ప్రతినెలా 18న సంబంధిత సహాయ పౌరసరఫరాల అధికారులు, డీటీ(సీఎస్)లు విధిగా ముగింపు నిల్వల నివేదిక, 22న డీలర్లు రిలీజు ఆర్డర్ల నివేదికతో తాను నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని అన్నారు. ప్రతినెలా 5న గోదాం ఇన్చార్జులు.. సరుకుల సరఫరా ముగింపు నివేదికతో తాను నిర్వహించే సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ నెల 8 లోగా పౌరసరఫరాల సంస్థ ద్వారా సరఫరా చేయుచున్న అన్ని వాహనాలకు స్టేజి1, స్టేజి2లకు గ్లోబల్ పోజిషనింగ్ సామగ్రిని అమర్చవలసిందిగా ఆదేశించారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. సమీక్షలో జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అధికారులందరూ పాల్గొన్నారు. -
అక్రమాలు ఆగేనా..?
రేషన్‌బియ్యం అక్రమాలకు ముకుతాడు కొత్తగా పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ జారీ బియ్యం అమ్మినా, కొన్నా క్రిమినల్ చర్యలు లబ్ధిదారుల ఆహారభద్రత కార్డు రద్దు జిల్లాకు విజిలెన్స్ విభాగం పునరుద్ధరణ ముకరంపుర: రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర సరుకుల విషయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పలుకీలక మార్పులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రజాపంపిణీకి సంబంధించి కొత్తగా పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్‌ను మంగళవారం ప్రభుత్వం జారీచేసింది. గతంలో రద్దు చేసిన పౌరసరఫరాల శాఖలోని విజిలెన్స్ విభాగాన్ని పునరుద్ధరిం^è నుంది. ఈ–పాస్ విధానం ద్వారా సరుకులను సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో రేషన్‌బియ్యం పక్కదారికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నిత్యం ఎక్కడో చోట పేదలకు చేరాల్సిన బియ్యం విషయంలో అక్రమాలు బయటపడుతున్నాయి. అధికారుల దాడులు, తనిఖీలు చేస్తున్నా ఆగడంలేదు. ఎంఎల్ఎస్ పాయింట్లు, డీలర్లు, దళారులు, మిల్లర్ల పాత్రతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు బియ్యం అక్రమంగా తరలిపోతోంది. జిల్లాలో 10.62 లక్షల ఆహారభద్రత కార్డులుండగా.. ప్రతీనెలా 2300 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. 2015లో 417 కేసులు నమోదు చేసి రూ.3.96 కోట్ల విలువైన సరుకులను స్వాధీనంచేసుకున్నారు. అందులో 50 క్రిమినల్ కేసులు నమోదుచేశారు. ఈ ఏడాది జనవరి 1నుంచి జూలై వరకు 383 కేసులు నమోదు చేసి రూ.1.36 కోట్ల విలువైన రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి జారీ చేసిన పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్లో కీలక నిర్ణయాలున్నాయి. ప్రజాపంపిణీ ద్వారా సరఫరా చేసే సరుకులను కార్డుదారుడుగానీ, కొనుగోలుదారుడు, డీలర్ సహా ఎవరు పక్కదారి పట్టించినా క్రిమినల్ చర్యలతోపాటు జరిమానా విధించనున్నారు. ఈ లెక్కన బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తితోపాటు అమ్మిన కార్డుదారుడు లేదా డీలర్‌పై చర్యలతోపాటు లబ్ధిదారుడి కార్డును రద్దు చేయనున్నారు. ప్రత్యేక విజిలెన్స్ విభాగం పక్కదారి పడుతున్న సరుకులకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలో జిల్లాకు ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2001 ముందు ఈశాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ ఉండేది. దాని అవసరం తగ్గిందని అప్పటి ప్రభుత్వం రద్దుచేసింది. ప్రత్యేక యంత్రాంగం ఉండే విజిలెన్స్ విభాగంతో కేవలం అక్రమాలపైనే దృష్టి కేంద్రీకరించే అవకాశముంది. నిఘా ఏర్పాటు చేస్తే ప్రత్యేక యంత్రాంగాన్ని పోలీసులతో చేస్తారా? అధికార యంత్రాంగంతో ఏర్పాటు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. త్వరలో ఈ పాస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాస్‌విధానం(బయోమెట్రిక్)తో సరుకులు పంపిణీచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రంగారెడ్డిసహా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సత్ఫలితాలివ్వడంతో అన్నిజిల్లాల్లో అమలుచేయాలని కసరత్తు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరో ఒకరు రేషన్ షాపుకు వెళ్లి వేలిమద్రలతో సరుకులు తీసుకునే అవకాశముంది. దీంతో బియ్యం నిల్వలు, పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్టపడనుంది. కార్డుకు ఆధార్ అనుసంధానం, ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది. ఆహారభద్రత కార్డులు ముద్రించినా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే వరకు వాటిని పక్కనే ఉంచాలని మౌఖిక ఆదేశాలందాయి. ఈ–పాస్ విధానంతో ఈకార్డులు కూడా అక్కరకు రానివే కానున్నాయి. చక్కెరకూ లైసెన్స్.. ఇకపై చక్కెర అమ్మకాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. గతంలో లాగా చక్కెరను ఎవరు పడితే వారు అమ్మడానికి వీలు లేదు. పౌరసరఫరాల శాఖ ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులే అమ్ముకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చక్కెర లైసెన్స్‌లో భాగంగా హోల్‌సేల్ వ్యాపారులు రూ.12వేలు, రిటేల్ దుకాణాదారులు రూ.6వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ కోసం హోల్‌సేల్ వ్యాపారులు రూ.2వేలు, రిటేల్వ్యాపారులు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటోంది. వెయ్యి క్వింటాళ్ల వరకు హోల్‌సేల్ వ్యాపారులు, 40 క్వింటాళ్ల వరకు రిటేలర్లు చక్కెను నిల్వ ఉంచుకునేందుకు అనుమతించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత రామగుండం/పెద్దపల్లిరూరల్: మహారాష్ట్రకు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ప్యాసింజర్ రైలులో మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్‌ఫారంపైకి తరలించారు. సమాచారం తెలుసుకున్న పౌరసరఫరా శాఖ అధికారులు పెద్దంపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. 24 బ్యాగుల్లో ఉన్న సుమారు ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సమీపంలోని రేషన్ డీలర్‌కు అప్పగించారు. పెద్దపల్లి ఏఎస్వో బి.కిష్టయ్య, ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీ తహశీల్దార్ తొడుపునూరి అంజయ్య, సుల్తానాబాద్ డెప్యూటీ తహశీల్దార్ ఎన్.మల్లిఖార్జున్‌రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తదితరులున్నారు. పెద్దపల్లిలోని ప్రగతినగర్ ప్రాంతంనుంచి కరీంనగర్‌కు అక్రమంగా తరలిస్తున్న 11మెట్రిక్ టన్నుల రేషన్‌బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
కాంటాలతో.. కనికట్టు
తక్కెడలను ఉపయోగిస్తున్న డీలర్లు నష్టపోతున్న లబ్ధిదారులు చోద్యం చూస్తున్న అధికారులు తలమడుగు (తాంసి) : వార్తల్లో మనం తరుచూ చూస్తుంటాం... పట్టుబడ్డ రేషన్ బియ్యం, అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత... ఇవి చాలు లబ్ధిదారులకు చేరవల్సిన చౌకధరల దుకాణంలోని వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి అనడానికి నిదర్శనం. చౌక ధరల దుకాణంలో డీలర్ కొలిచి ఇచ్చినప్పుడు బరువులో వ్యత్యాసం ఉండదు. కానీ ఇంటి దగ్గరకు వచ్చి కొలిచి చూస్తే తేడా కొడుతుంది. కనికట్టు అంతా తక్కెడలోనే.... చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు, తునికల్లో మోసాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా ఎక్కడా అవి అమలు కావడం లేదు. తాంసి మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలో 23 చౌకధర దుకాణాలున్నాయి. తలమడుగు మండలంలో 16గ్రామ పంచాయతీలలో 16 రేషన్ దుకాణాలు ఉన్నాయి. రెండు, మూడు గ్రామాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగించడం లేదు. పాత తక్కెడలను ఉపయోగిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన బియ్యం, చక్కెర, వంటి సరుకుల బరువులో వ్యత్యాసాలుంటున్నాయి. సరుకుల పంపిణీలో పాత కాంటాలనే వినియోగిస్తున్నారు. దీంతో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు అక్రమాల నివారణ కోసం ప్రతి షాపులో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ఎక్కడా వాటి వినియోగించిన దాఖలాలు లేవు. ఎలక్ట్రానిక్ కాంటాల వల్ల అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోవడంతో వాటిని పక్కన పెట్టి పాత తక్కెడలను వాడుతున్నారనే ఆరోపిస్తున్నారు రేషన్ లబ్ధిదారులు. చౌకధరల దుకాణాల్లో బియ్యం, గోదుమలు, చక్కెర పంపిణీకి తక్కెడలను వినియోగిస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడు కాంట తూకం కారణంగా సరుకులు తక్కువ వస్తున్నాయని చెబుతున్నారు. తూకాల్లో మోసాల గురించి వినియోగదారులు డీలర్లను అడితే ఎక్కువో, తక్కువో వస్తాయి అని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు సరిగా పనిచేయడం లేదని, విద్యుత్ ఉంటనే పనిచేస్తాయి లేదంటే పనిచేయవు అని డీలర్లు చెబుతున్నారు. దీంతో పాత తక్కెడలను వాడుతున్నామని డీలర్లు వివరిస్తున్నారు. డీలర్లు మాత్రం ఎలక్ట్రానిక్ కాంటాలకు బదులు తక్కెడలను వాడుతూ తూకాల్లో తమను మోసం చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలను వాడాల్సిందే... ప్రతి రేషన్ షాపుల్లో తక్కెడలను ఉపయోగిస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రతి రేషన్ షాపుల్లో తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కాంటాలను వాడేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి రేషన్ దుకాణంలో ఎలక్ట్రానిక్ కాంటాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తూనికల్లో మోసాలను అరికట్టాలని కోరుతున్నారు. -
27 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఉప్పల్ (కమలాపూర్): మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. రైలు మార్గం ద్వారా తరచూ మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో జేసీ శ్రీదేవసేన ఆదేశాల మేరకు ఉప్పల్ నుంచి రామగుండం వరకు అన్ని రైల్వే స్టేషన్లలో మంగళవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహించినట్లు హుజూరాబాద్ డీటీసీఎస్ రాజమౌళి తెలిపారు. ఉప్పల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా నాగపూర్ ప్యాసింజర్ ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 65 సంచుల్లోని సుమారు 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. తమను గమనించిన అక్రమ వ్యాపారులు పరారయ్యారని, వారిపై 6ఏ కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక డీలర్ అరుణాదేవికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఎస్వో శ్రీనివాస్, భీమదేవరపల్లి డీటీసీఎస్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటా బీఎఫ్‌డీ ప్రక్రియ : డీఎస్ఓ
కాకినాడ సిటీ: రేషన్ లబ్ధిదారుల పది మంది చేతివేలిముద్రలు ఇంటింటికీ వెళ్ళి సేకరించే బెస్ట్‌ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ) ప్రక్రియను చేపట్టినట్టు పౌర సరఫరాలశాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి వేలిముద్రలు సేకరించాలని చౌకడిపో డీలర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల మంది రేషన్‌కార్డులకు సంబంధించి 40,20,904 మంది లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 17,63,671 మంది వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించి తిరిగి ఆగస్టు 10 నుంచి 30 వరకు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి బియ్యం చౌక దుకాణాలలోని ఈ పోస్ మెషీన్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 4,309 పాఠశాలలకు సంబంధించి 926 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. -
పెరిగిన సబ్సిడీ గోధుమల ధర
రూ.2 నుంచి రూ.7కుపెంపు పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే గోధుమల ధరను పెంచింది. నాలుగు మాసాలుగా రూ.2లకే కిలో ఇచ్చిన గోధుమల ధరను ఇపుడు రూ.7కు పెంచింది. గోధుమల «దరను పెంచిన విషయమై రేషన్ డీలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వక పోవడం విశేషం. వచ్చే నెల కోటా పొందేందుకు మీసేవా కేంద్రాల్లో కిలోకు రూ.1.80 చొప్పున డబ్బులు చెల్లించగా వారు చెల్లించిన సొమ్మును రూ.6.80తో తీసుకుని కోటా తగ్గించి రశీదు రావడంతో డీలర్లు అవాక్కయ్యారు. ఇప్పటిదాక రూ.2కే కిలో ఇచ్చి వచ్చే నెల నుంచి రూ.7చెల్లించాలని కోరితే లబ్దిదారుల నుంచి ఇబ్బందులు తప్పవని డీలర్లు వాపోతున్నారు. ధర పెరిగిన విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం దారుణమని డీలర్లు పేర్కొన్నారు. -
రేషన్... పరేషాన్
బ్యాంకు వద్ద బారులు తీరుతున్న లబ్ధిదారులు అకౌంట్ కోసం తిప్పలు నగదు బదిలీ నేపథ్యంలోనే అవస్థలు దహెగాం : ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో మార్పులు తెచ్చినప్పుడల్లా లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. గతంలో గ్యాస్ సబ్సిడీ విషయంలో గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ, గ్యాస్ పంపిణీదారుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడ్డారు. నేడు రేషన్ లబ్ధిదారులకూ ఆ తిప్పలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేషన్ కొనుగోలు సమయంలో చెల్లించిన నగదును జమచేసే నూతన విధానాన్ని తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలోనే రేషన్ లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. నగదు నేరుగా ఖాతాలో జమ కాబోతున్నందున బ్యాంక్ అకౌంట్ కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. నగదు బదిలీ పథకంలో భాగంగా రేషన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు నేరుగా జమ కానున్నందున ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రేషన్ లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకు ఖాతా కోసం వ్యవసాయ పనులు వదిలి బ్యాంకుకు వచ్చినా పని కాకపోవడంతో రేషన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10,821 మంది లబ్ధిదారులు మండలంలో మొత్తం రేషన్ కార్డుల లబ్ధిదారులు 10,821 మంది ఉన్నారు. బ్యాంకు ఖాతాలు సుమారు 75 శాతం లబ్ధిదారులకు ఇది వరకే ఉన్నాయి. మిగతా 25 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో తిప్పలు పడుతున్నారు. ఖాతా తెరవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గంటల తరబడి బ్యాంకు వద్ద ఉన్నా పని పూర్తి కాకపోవడంతో మళ్లీ పని వదిలి రావాలా అని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రైతులకు పంట రుణాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు రద్దీగా మారాయి. దీంతో రేషన్ లబ్ధిదారుల ఖాతా పనులు ముందుకు సాగడం లేదనేది బ్యాంక్ అధికారుల వాదన. వ్యవసాయ పనులు వదిలి జనాలు అందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడంతో చేళల్లో పనులు చేయడానికి కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. రేషన లబ్ధిదారులు దాదాపు వారం రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడంతో కూలీల కొరత ఏర్పడింది. బ్యాంక్ ఖాతా కోసం వచ్చిన చాలా మంది సైతం వ్యవసాయ పనులను వదిలేసి వచ్చామని తెలుపుతున్నారు. అనేక ఇబ్బందుల్లో.. అకౌంట్ తెరవడానికి బ్యాంక్ అధికారులు ఫారాలను ఇస్తున్నారు. మండలంలో ఎక్కువశాతం లబ్ధిదారులు నిరక్షరాస్యులు కావడంతో అకౌంట్ ఫాం నింపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఖాతా తెరవడానికి అధికారులు ఆలస్యం చేయడంతో వారి ఇబ్బందులు అధికమవుతున్నాయి. ఖాతా తెరవడానికి సంబంధించిన పత్రాలు ఏవేవీ అందజేయాలో తెలియక తికమక పడుతున్నారు. -
రేషన్ కొరత..
చాలని సరుకులు కార్డుదారుల ఇబ్బందులు పత్తాలేని పామాయిల్ గోధుమలదీ అదేపరిస్థితి కానరాని కందిపప్పు అరకొర చక్కెర మేడిపెల్లి: గ్రామీణ ప్రాంతాలు వర్షాలు లేక అల్లాడుతున్నాయి. పంటలు పండక రైతు కుటుంబాల వలస బాటపట్టాయి. పల్లెను పట్టుకుని ఉంటున్న జనం రేషన్ దుకాణాల ద్వారా అందే సరుకుల ఆధారంగా ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే, పేదలకు అందాల్సిన నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ కావడంలేదు. దీంతో కార్డుదారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. మేడిపెల్లి మండలంలో 15,995 ఆహార భద్రత కార్డులుండగా 41,346మంది లబ్ధిదారులు ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. సరుకులు పంపిణీ చేయడానికి 28 రేషన్‌షాప్‌లు ఏర్పాటు చేశారు. ప్రనెలా 2,723 క్వింటాళ్ల బియ్యం, 159 క్వింటాళ్ల చక్కెర, 15,144 పామాయిల్ ప్యాకెట్లు, 15,995 క్వింటాళ్ల గోధుమలు, 15,995 లీటర్ల కిరోసిన్, 15,995 కిలోల కందిపప్పు సరఫరా కావాల్సి ఉంది. ఆర్నెల్లుగా సరుకులు సక్రమంగా రావడంలేదు. బియ్యం, కిరోసిన్‌నే సరిపెడుతున్నారు. జూలైలో కేవలం బియ్యం, చక్కెరే పోశారు. ఇదేమిటని డీలర్లను అడిగితే.. పైనుంచి రాలేదని చెబుతున్నారు. అసలే కరువు.. ఆపై చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు.. కూలీనాలీ చేసుకునే పేదలు బహిరంగ మార్కెట్లో పెద్దమెుత్తంలో ధరలు చెల్లించి నిత్యావసరాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. రేషన్ దుకాణం, బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు(కిలో రూ.లలో) సరుకు రేషన్‌దుకాణం మార్కెట్ చక్కెర 13.50 40 గోధుమపిండి 16 30 పామాయిల్ 40 80 చింతపండు 60 120 కందిపప్పు 50 150 పేదల కడుపుకొడుతున్నరు – పుల్లూరి దేవయ్య, గోవిందారం వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్‌షాపుల్లో అన్ని సరుకులు ఇచ్చిండ్రు. పేదలకు రెండుపూటలా కడుపునిండా తిండి దొరికేది. ఇప్పుడు సరుకులు సరిగా ఇస్తలేరు. కిరాణాల్లో ఎక్కువ ధర పెట్టి కొనుడైతంది. తొమ్మిది సరుకులిచ్చిండ్రు – జంగంపెల్లి విజయ్, మోత్కురావుపేట కాంగ్రెస్ హయాంలో నూటా ఎనబై ఐదు రూపాయలకే తొమ్మిది రకాల సరుకులను రేషన్‌షాపుల ద్వారా అందజేసింది. పేదప్రజలకు అవసరమైన నిత్యావసరాలు తక్కువ ధరకే వచ్చినయి. ఇప్పుడు బియ్యమే ఇస్తే ఏం లాభం? గోదాముల నుంచి రావడంలేదు – కె.వసంత, తహసీల్దార్ అన్ని సరుకుల కోసం రేషన్ డీలర్లు డీడీలు చెల్లించారు. గోదాముల్లోనే సరుకులు లేవు. పైనుంచి సరుకులు రావడం లేదు. ఉన్నవాటినే కార్డుదారులకు అందజేస్తున్నాం. ఈనెలలో బియ్యం, కిరోసిన్, చక్కెర వచ్చింది. వాటిని పంపిణీ చేశాం. -
రేషన్‌కార్డుదారుల వేలిముద్రల సేకరణ
కాకినాడ సిటీ : జిల్లావ్యాప్తంగా రేషన్‌కార్డుదారుల చేతివేళ్ల ముద్రలు సేకరించే ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని చౌకదుకాణాల పరిధిలో ఉన్న రేషన్‌కార్డుల్లోని సభ్యుల చేతివేళ్ల ముద్రలను డీలర్లు ఇంటింటికీ వెళ్లి తీసుకోనున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 15 లక్షల రేషన్‌కార్డులకు సంబంధించి 43 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఇప్పటికే 15 లక్షల మంది వేలిముద్రల సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మిగిలినవారి చేతివేళ్ల ముద్రలు సేకరిస్తున్నామని తెలిపారు. కార్డుదారులు రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు సక్రమంగా పడకపోవడంవంటి ఇబ్బందులను అధిగమించేందుకు.. కార్డుదారుల కుటుంబంలోని సభ్యులందరి చేతివేళ్ల ముద్రలూ సేకరిస్తున్నట్టు ఉమామహేశ్వరరావు వివరించారు. -
తీరని రేషన్ చిక్కులు
* సాంకేతిక సమస్యలతో రేషన్ నిలిపివేత * అవస్థలు పడుతున్న లక్షా 27వేల మంది లబ్ధిదారులు * పరిష్కారానికి చర్యలు తీసుకోని యంత్రాంగం విజయనగరం కంటోన్మెంట్: సాంకేతిక తప్పిదాలు రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రకరకాల కారణాలతో వినియోగదారులు రేషన్ కార్డుల్లో పేర్లను కోల్పోతున్నారు. ఆధార్ అనుసంధానం గూర్చి రెండేళ్లుగా కుస్తీలు పడుతున్న అధికారులు ఈపాస్ విధానాన్ని అమలు చేసి ఏడాది దాటిపోయింది. ఇంకా ఆధార్ అనుసంధాన సమస్యలు వినియోగదారులను వదలట్లేదు. ఇలా రకరకాల సమస్యలతో జిల్లాలోని లక్షా 27వేల మంది లబ్ధిదారులు రేషన్సరకుకు దూరమవుతున్నారు. రేషన్ కార్డులో సభ్యుడిగా ఉన్నా ఆన్లైన్లో పేర్లు నమోదు కావడం లేదు. ఆధార్ లింక్ అవ్వకపోవడంతో కొందరి పేర్లు కీ రిజిస్టర్నుంచి తొలగిస్తున్నారు. జిల్లాలోని 6,01,987 తెల్ల రేషన్ కార్డులున్నాయి. అన్నపూర్ణ 839, ఏఏవై 76,009 కార్డులున్నాయి. అన్ని కార్డుల్లో కలిపి 17,79,516 మంది సభ్యులున్నారు. వీరికి ప్రతీ నెలా సరుకులు ఇచ్చే వారు. కానీ గత నెలలో ఆన్లైన్లో ఇచ్చే కీ రిజిస్టర్ ద్వారా చూసుకుంటే మొత్తం మూడు రకాల సమస్యలతో మొత్తం లక్షా 27వేల మందికి రేషన్‌ను తొలగించారు. ఆ మూడు తప్పిదాలివే! జిల్లాలోని రేషన్ కార్డుల్లో పేర్లున్నా మరో చోట వీరికి పేరుందని చూపిస్తున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 29వేల మంది ఉన్నారని వారి పేర్లను గత నెలలో తొలగించారు. సరయిన ఆధార్ నంబర్‌తో వస్తే పేర్లు నమోదు చేస్తామనీ, అంతవరకూ రేషన్ నిలిపేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు నివ్వెరపోతున్నారు. రెండో సమస్య ఏంటంటే.. మూడేళ్ల కిందట ఆధార్ నమోదు కేంద్రాలను మండలాలు, గ్రామాల వారీగా ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో పూర్తి స్థాయి పరిజ్ఙానం లేని సిబ్బందిని ఏర్పాటు చేయడంతో వారు తప్పుగా పేర్లు నమోదు చేశారు. ఆధార్ ఎన్రోల్ చేసేటప్పుడు ఓ కాలమ్‌లో ‘మీరు ఈ ఆధార్ సంఖ్యను ఏదేని ఇతర కార్యక్రమాలకు అనుసంధానిస్తారా? అని ప్రశ్నించేచోట ఎస్/నో అన్న ఆప్షన్లలో నో అని టైప్ చేయడంతో ఆయా ఆధార్ సంఖ్యలు అథెంటికేషన్ సమస్యలోకి వెళ్లిపోయి ఏ పథకానికీ అనుసంధానం కావడం లేదు. ఇటువంటివి జిల్లాలో 15వేల పైచిలుకు ఉన్నాయి. ఇవి కాకుండా ఆధార్ సంఖ్య ఇప్పటికీ నమోదు చేసుకోలేదని 83వేల మందిని చూపిస్తున్నారు. ఇలా మూడు రకాల సమస్యలతో లక్షా 27వేల మందికి రేషన్ నిలిపివేశారు. ఇది నిరంతర ప్రక్రియ! జిల్లాలో ఆధార్ అనుసంధానం దాదాపు పూర్తయింది. అందరూ అనుసంధానం చేసుకున్నారు. మూడు రకాల సమస్యలతో రేషన్ కార్డుల్లో సభ్యులు చోటు కోల్పోతున్నారు. వారెప్పుడయినా ఆధార్‌ను ఆయా కార్డుల్లో అనుసంధానం చేసుకుంటే వారికి ఆ నెల నుంచే రేషన్‌ను పునరుద్ధరిస్తాం. ఇది రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయం కనుక అందరూ పాటించాలి. ఎవరయినా రేషన్ అందని వారుంటే వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వారి పేర్లను ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది. - పి నాగేశ్వరరావు, డీఎస్ఓ, విజయనగరం -
ప‘రేషన్’..!
సివిల్ సప్లయీస్ హమాలీల నిరవధిక సమ్మె జిల్లావ్యాప్తంగా గోదాంలకు తాళం నిత్యావసర వస్తువుల ఎగుమతులు, దిగుమతుల నిలిపివేత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ రేషన్‌కార్డుదారులకు పస్తులు తప్పేలా లేవు. పౌరసరఫరాల హమాలీల సమ్మెతో నిత్యావసర వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. సివిల్ సప్లయీస్ గోదాంలకు తాళాలు దర్శనమిస్తున్నాయి. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో జూన్ నెల రేషన్.. సందిగ్ధంలో పడింది. వైరా: సివిల్ సప్లయీస్ హమాలీల నిరవధిక సమ్మెతో ఖమ్మం జిల్లాలో పౌర ‘సరఫరాలు’ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీల సంఘం ఈ నెల 25 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా సమ్మెకు పిలుపు నిచ్చింది. జిల్లాలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌కు చెందిన ఎంఎల్ఎస్ పాయింట్లు (గోదాంలు) 16 ఉన్నాయి. వీటిలో 392 మంది హమాలీలు పని చేస్తున్నారు. వీరంతా నాలుగు రోజుల నుంచి సమ్మెలో ఉండటంతో గోదాంల సేవలకు బ్రేక్ పడింది. పొరుగు జిల్లాల నుంచి జిల్లాకు దిగుమతి కావాల్సిన గోధుమలు, చక్కెర సరఫరా కూడా నిలిచిపోయింది. రేషన్ షాపులకు నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది. సమ్మెకు కారణాలేమంటే.. ఎగుమతులు, దిగుమతుల కమీషన్ 12 నుంచి 20 శాతానికి పెంచాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఒప్పందం చేసుకున్న వేతనాల అగ్రిమెంట్ గడువు 2015 డిసెంబర్ నాటికి ముగిసింది. 2016 జనవరి నుంచి హమాలీల రేట్లు పెంచాలని కోరుతూ సంబంధిత శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. హమాలీల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఏప్రిల్ 25 నుంచి సమ్మెకు దిగుతామని అదే నెల 5 తేదీన సమ్మె నోటీసు ఇచ్చారు. కార్పొరేషన్ అధికారులు మరోమారు కార్మికులతో చర్చలు జరిపారు. 20 రోజుల్లో వేతనాలు సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 15 నాటికి పూర్తయింది. పరిష్కార మార్గాన్ని సూచించపోవడంతో ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రజలకు ప ‘రేషన్’... హమాలీల సమ్మె వల్ల గోదాంల నుంచి గింజ బియ్యం కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మే నెల రేషన్ సరుకుల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 41 మండాల పరిధిలో 1,187 రేషన్ దుకాణాలు ఉండగా 7,23,923 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 13,016 టన్నుల బియ్యం, 431 టన్నుల గోధుమలు, చక్కెర 363 టన్నులు పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి నెలా 20 నుంచి 23వ తేదీ వరకు రేషన్ దుకాణాలకు సరుకులు అలాట్మెంట్ చేస్తారు. 23లోగా డీలర్లు డీడీలు చెల్లిస్తారు. 23 నుంచి 30 తేదీ లోపు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపుల వరకు హమాలీలే సరుకులు ఎగుమతి, దిగుమతి చేస్తారు. ఆ తర్వాత 2 నుంచి 13వ తేదీ వరకు డీలర్లు కార్డుదారులకు రేషన్ సరకులు పంపిణీ చేస్తారు. కానీ ప్రస్తుతం హమాలీలు సమ్మెలో ఉండటంతో జూన్ నెల కోటా రేషన్ అందకునేందుకు వేచి చూడాల్సిందే. -
కందిపప్పు.. గోధుమ పిండి..ఎక్కడ?
విజయనగరం కంటోన్మెంట్ : పౌరసరఫరాల శాఖ నుంచి కేటాయింపులు ఎక్కువగా వస్తున్నా.. ఆయా సరుకులు మాత్రం వినియోగదారులకు అందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా 1,392 రేషన్ షాపులకు ప్రతి నెలా అందిస్తున్న సరుకులు నామమాత్రంగానే ఉంటున్నాయి. రేషన్ కార్డుల ద్వారా గతంలో మొత్తంగా తొమ్మిది సరుకులను ఇచ్చేవారు. అందులో వినియోగదారులు కొన్ని సరుకులను విడిచిపెట్టినా మిగతా సరుకులను మాత్రం తీసుకునే వారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. వీటికి సంబంధించి ప్రతి నెలా క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్‌లు చూపుతూ సరుకులను కేటాయిస్తున్నారు. అలాగే వీటితో పాటు ఇవ్వని సరుకులకు కూడా ప్రతి నెలా ఇంత ఇస్తున్నామని కేటాయింపులు చూపించడం విశేషం. కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలను ఎక్కడా పంపిణీ చేయడం లేదు. అయినా ప్రతి నెలా కేటాయింపులో మాత్రం ఈ సరుకులను ఇస్తున్నట్లు పొందుపరుస్తున్నారు. జిల్లాలో 6,78,835 రేషన్ కార్డులుండగా అన్నపూర్ణ-839, అంత్యోదయ-76,009, తెలుపు రంగు కార్డులు-6,01,987 కార్డులున్నాయి. ఈ కార్డులన్నింటికీ కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు ఇస్తున్నామని కీ రిజిస్టర్లో చూపిస్తున్నారు. కానీ పంపిణీ మాత్రం జరగడం లేదు. పామాయిల్ పంపిణీ లేకపోయినా కేటాయింపుల్లో చూపించడం లేదు. అలాగే కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండిని ప్రతి నెలా ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ నెలకు సంబంధించి 6.74 టన్నుల కందిపప్పు, 6.58 టన్నుల గోధుమ పిండి, 6.71 టన్నుల గోధుమలు ఇస్తున్నట్లు కేటాయింపులో పొందుపరిచారు. అసలు సరుకులే ఇవ్వకుండా ఈ కేటాయింపులు ఎందుకని డీలర్లు, వినియోగదారులు విమర్శిస్తున్నారు. -
డీలర్లే అక్రమార్కులు..!
► దారితప్పిన రేషన్ వ్యవస్థ ► నల్లబజారుకు నీలి కిరోసిన్ ► రేషన్ బియ్యమూ పక్కదారి ► కార్డుదారులకిచ్చేది అరకొరే ► 50 మందిపై కేసులు నమోదు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిరుపేదలకు నిత్యావసర సరుకులు వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. అనేక ప్రాంతాల్లో డీలర్లు వినియోగదారుల పేరిట కోటా విడుదలైనా.. ఆ సరుకు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎంతోమంది డీలర్లు షాపుల్లో స్టాక్ పట్టికను నిర్వహించడం లేదు. అసలు రికార్డులు నిర్వహించని, సకాలంలో షాపులు తెరవని వాళ్లూ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో కనీసం 10 నుంచి 20 మధ్యలో డీలర్లు పట్టుబడుతూనే ఉన్నారు. వారికి ప్రతి నెల రెవెన్యూ డివిజనల్ అధికారులు రూ.7 వేలలోపు జరిమానా విధిస్తూ వదిలి పెడుతున్నారు. ఎన్ని జరిమానాలు విధించినా డీలర్ల తీరులో మార్పు రావడం లేదు. ఏడాది కాలంలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన 50 మంది డీలర్లపై కేసులూ నమోదు చేశారు. వారి డీలర్ షిప్ రద్దు చేశారు. రికార్డులు, స్టాక్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు 1067 క్వింటాళ్ల బియ్యం, 8376 నీలి కిరోసిన్, 200క్వింటాళ్ల గోధుమలు, 30 క్వింటాళ్ల కందిపప్పు, 34 క్వింటాళ్ల చక్కెరస్వాధీనం చేసుకున్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో డీలర్లలో మార్పు రావడం లేదు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్ నల్లబజారుకు తరలిస్తూనే ఉన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలాఖరు వరకు కార్డుదారులందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వాలనే నిబంధనలున్నా.. నెలకు ఐదు రోజులకు మించి రేషన్‌షాపులు తెరవడం లేదనే విమర్శలున్నాయి. మరోపక్క.. ఆ ప్రాంత ప్రజల పరిస్థితులను బట్టి ప్రతి రోజు నాలుగు గంటలు రేషన్ షాపులు తెరిచి ఉంచాల్సి ఉండగా.. కొందరు రోజుకు రెండు గంటలు మాత్రమే షాపులు తె రిచి తర్వాత మూసేస్తున్నారు. దీంతో కార్డుదారులు సరుకుల కోసం రేషన్ షాపులే కాదు.. డీలర్ల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షించాల్సిన పలువురు డీటీ(ఎన్ఫోర్స్మెంట్)ల పనితీరుపైనా విమర్శలొస్తున్నాయి. పలువురు డీటీల అండదండలతో డీలర్లు అక్రమాలకు తెరలేపారు. ముఖ్యంగా మంచిర్యాల పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉండడం.. రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు చెందిన డీలర్లు నిత్యావసర వస్తువుల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు మంచిర్యాల కేంద్రంగా రేషన్ బియ్యం, గోధుమలను ఇతర ప్రాంతాలకు తరలించి బడా వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారి మిల్లులు, గోదాములపై మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్ గతంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అక్రమార్కులు సెలైంట్‌గా ఉండడంతో.. తూర్పు ప్రాంత పరిధిలో ఉన్న డీలర్లు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు తెలిసింది. రెండ్రోజులకోసారి జిల్లాలో ఏదో చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పట్టుబడుతునే ఉన్నాయి. జిల్లాలో 7.38 లక్షల కార్డులు జిల్లాలో 7.38 లక్షల పైచిలుకు ఆహార భద్రత కార్డులున్నాయి. 23లక్షల మందికి రేషన్ సరుకులు అందుతున్నాయి. 1443 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ అవుతున్నాయి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2 లీటర్ల కిరోసిన్, గ్యాస్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కార్డుదారుల్లో సుమారు 3లక్షల మంది ప్రతి నెలా నిత్యావసర సరుకులు రేషన్ షాపుల నుంచి తీసుకోరు. వందలాది మెట్రిక్ టన్నుల బియ్యం, వేలాది లీటర్ల కిరోసిన్ ప్రతి నెలా మిగిలిపోతోంది. దీంతో రేషన్డీలర్లే ఆ బియ్యం, కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. పలు చోట్ల నిత్యావసర వస్తువుల కోసం షాపులకు వెళ్లిన వినియోగదారులకు అన్ని సరుకులు కాకుండా ఒకటి, రెండు రకాలు మాత్రమే ఇచ్చి పై నుంచి ఇంకా కోటా రాలేదంటూ డీల ర్లు తిరిగి పంపుతున్నారు. దీంతో ఇచ్చిన సరుకులే చాలంటూ.. వినియోగదారులు ఇచ్చిందే తీసుకుని వెనుదిరుగుతున్నారు. మరోపక్క జిల్లాలో మూడొందలకు పైగా రేషన్ దుకాణాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు షాపులు మంజూరు చేయొచ్చనే నిబంధన ఉండడంతో దాన్ని సాకు గా చేసుకుని కొందరు నేతలు తమ పలుకుబడితో బంధువులకు రేషన్ షాపులు ఇప్పించుకున్నారు. బినామీ పేరిట షాపులు నిర్వహిస్తూ.. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రజలూ సదరు డీలర్లపై ఫిర్యాదు చే సేం దుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు షాపులు నిర్వహించని డీలర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కఠినంగా వ్యవహరిస్తాం రేషన్ డీలర్లంద రూ సమయపాలన పాటించడంతోపాటు కార్డుదారులందరికీ ప్రతి నెల విధిగా నిత్యావసర సరుకులు ఇవ్వాలి. కార్డుదారులందరికీ సరుకులందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెల సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. రెగ్యులర్ యాక్టివిటీస్, బోర్డుపై స్టాక్ వివరాలు, సమయపాలన పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. సరుకులు పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. - ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
ఉగాదికి తీపిలేదు!
♦ రేషన్ చక్కెరకు ప్రభుత్వం మంగళం ♦ రెండు నెలలుగా విడుదలకాని కోటా ♦ ఇప్పటికే కందిపప్పు ఆపేసిన సర్కారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేద ప్రజలకు ఇది చే దు వార్త. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రతి కార్డుకు అరకిలో చొప్పున పంచ దార సరఫరా చేస్తున్న ప్రభుత్వం రెండు నెలలుగా పంపిణీని నిలిపివేసింది. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి 1,170 మెట్రిక్ టన్నుల చక్కెర కోటా రాకపోవడంతో తొలిపండగ ఉగాది పచ్చడిలో తీపికి అవకాశంలేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా అరకేజీ చొప్పున 585 టన్నుల చక్కెరను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే, ఈ కోటాను గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో 120 టన్నుల బఫర్‌స్టాకును జిల్లా పౌరసరఫరాల శాఖ సర్దుబాటుచేసింది. కాప్రా, రామంతాపూర్, యాచారం, వికారాబాద్, పరిగి, ఘట్కేసర్, మహేశ్వ రం కేంద్రాల్లో ఉన్న నిల్వలను కార్డుదారులకు అందజేసింది. అయితే, తాజా పరిస్థితులను గమనిస్తే చక్కెరను కూడా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోందని అధికారవర్గా లు అంటున్నాయి. ఇప్పటివరకు ప్యాకింగ్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాచేసే సరుకులను తగ్గించుకుంటూ వస్తున్న సర్కారు.. మూడు నెలలుగా కంది పప్పు పంపిణీ నిలిపివేసింది. తాజాగా పంచదారనూ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో కేవలం చౌక బియ్యం పంపిణీకే పరిమితం కానున్నట్లు అర్థమవుతోంది. -
మూడు రోజులు.. ముప్పు తిప్పలు!
ప‘రేషాన్’ ► మొరాయిస్తున్న సర్వర్ ► మొండికేస్తున్న డీలర్లు ► పేదలకు అందని రేషన్ ► ముగిసిన పంపిణీ గడువు కర్నూలు (అగ్రికల్చర్): పేదల పొట్టకొట్టే ప్రయత్నాలకు ప్రభుత్వం తెర తీసింది. అన్ని చౌకదుకాణాల్లో విధిగా ఒకటో తేదీ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ ప్రారంభించి మూడో తేదీలో పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించింది. సర్వర్ మొరాయించడం, డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో 3వ తేదీ నాటికి జిల్లాలో 64.73 శాతం పంపిణీ పూర్తయింది. రేషన్ కోసం లబ్ధిదారులకు మూడు రోజుల పాటు ముప్పు తిప్పలు తప్పలేదు. జిల్లా కేంద్రమైన కర్నూలులో సరుకుల పంపిణీ నత్తనడకన సాగింది. ప్రజాపంపిణీలో కర్నూలు జిల్లానే ప్రథమస్థానంలో ఉంది. అయితే 3వ తేదీలోపు సరుకుల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఈ-పాసు మిషన్ల ద్వారా మూడో తేదీలోపు సరుకుల పంపిణీ చేసి, వేలిముద్రలు పడని వారికి, ఇతరులకు 5వ తేదీలోపు పంపిణీ చేయాల్సి ఉంది. గతనెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ప్రజాపంపిణీ కొంత వరకు మెరుగైనా.. డీలర్లలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లాలో 2414 చౌకదుకాణాలు ఉన్నాయి. ఇందులో 7 షాపులకు మినహా మిగిలి 2407 షాపుల్లో ఈ-పాస్ మిషన్ల సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ నెలకు 11,18,340 సరుకులకు రేషన్ విడుదల అయింది. మూడో తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 7,12,477 కార్డులకు ఈ-పాస్ మిషన్ల ద్వారా సరుకులు పంపిణీ చేశారు. ఇంకా 4,05,863 కార్డులకు సరుకులు అందాల్సి ఉంది. ఆదివారం తెరచుకోని చౌక దుకాణాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం 106 షాపులు తెరచుకోలేదు. కౌతాళం మండలంలో -8, ఆలూరు మండలంలో -7 కోసిగిలో-10, పెద్దకడుబూరులో-5, ఆదోనిలో-6, వెల్దుర్తిలో-4, ప్యాపిలిలో-3, కర్నూలు అర్బన్‌లో-2, కొలిమిగుండ్లలో-2, నంద్యాలలో-2, చాగలమర్రిలో-2, రుద్రవరంమండలంలో మూడు ప్రకారం షాపులు తెరువలేదు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు వచ్చి గంటల తరబడి వేచిచూసి వెనుతిరిగారు. ఈనెల 1వ తేదీ 2.80 లక్షల కార్డులకు, 2వ తేదీ 3.15 లక్షల కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. మూడో తేదీ ఆదివారం డీలర్లు సెలవు తీసుకోవడంతో 1,22,477 కార్డులకు మాత్రమే సరుకులు చేరాయి. మొత్తం 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 7,12,477 కార్డులకు పంపిణీ పూర్తి అయింది. దీంతో జిల్లాలో ఇంకా 4,05,863 కార్డులకు సరుకులు అందాల్సి ఉంది. వీటికి సరుకులు పంపిణీ చేయడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వేలిముద్రలు పడని వారికి, ఇతరులకు సరుకుల పంపిణీ మరింత జాప్యం కానుంది. స మస్య ఇదీ.. మార్చి నెలలో పోలిస్తే ఈనెలలో డీలర్లు షాపులు తెరువడం మెరుగ్గా ఉన్నా సర్వర్ మొరాయిస్తుండం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. 95 శాతంపైగా షాపులు తెరచి ప్రజాపంపిణీ మొదలు పెట్టడం వల్ల సర్వర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇందువల్ల లైన్లు దొరకక ప్రజా పంపిణీ ఆలస్యం అవుతోంది. దీనికి తోడు హార్డ్‌వేర్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సర్వర్ సమస్యలు, హార్డ్‌వేర్ సమస్యలను అధిగమించకుండా ప్రజాపంపిణీ చేపట్టడంతో తల ప్రాణం తోకకు వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముందున్నాం: ఈ-పాస్ విధానం ద్వారా ప్రజాపంపిణీలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అత్యధిక కార్డులకు సరుకుల పంపిణీలో గతనెల వరకు గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉండింది. ఆ స్థానాన్ని కర్నూలు జిల్లా చేజిక్కించుకుంది. జాయింట్ కలెక్టర్ తీసుకున్న చర్యల వల్ల కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. డీఎస్ఓ తిప్పేనాయక్ -
బైక్ ఉంటే.. రేషన్ కట్!
80 వేల బియ్యం యూనిట్లకు కోత 20 శాతం కార్డులకు సరుకులు నిల్ 6 నెలలు వరుసగా రేషన్ తీసుకోని వారి పేర్లు తొలగింపుట ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కుంటున్న సర్కారు సామాన్య ప్రజల గగ్గోలు మీకు 100 సీసీ బైకు ఉందా.. 750 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు ఉందా.. 2.5 ఎకరాల మాగాణి ఉందా.. 5 ఎకరాల మెట్ట భూములున్నాయా.. మీ ఇంటికి రూ.500కు పైగా విద్యుత్ బిల్లు వస్తోందా?.. వీటిలో ఏ ఒక్కదానికి మీరు ‘అవును’ అని తలూపినా.. సంక్షేమ కార్యక్రమాలకు మీరు అనర్హులైనట్లే! ఇదేమిటి.. ఇదెక్కడి చోద్యం అనకండి.. ఎందుకంటే రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉంటున్నాయి మరి..!! పైన పేర్కొన్న కొలమానాలు పెట్టి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల సంఖ్యను తెగ్గొట్టి నిధులు మిగుల్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు తలపోస్తున్నారు. చివరికి ఇదే ఫార్ములాతో రేషన్ బియ్యంలోనూ కోత విధించేందుకు సిద్ధపడ్డారు. తర్వాత వంతు సామాజిక పెన్షన్లదని అధికారులే చెబుతున్నారు. ఇంటిలో ఒకరి పేరే.. మా ఇంటిలో నాభర్త, నేను, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి పేరుతోనే రేషన్‌కార్డులో అచ్చయింది. దీంతో ఐదుకిలోల బియ్యమే ఇస్తున్నారు. ముగ్గురికి రేషన్ ఇవ్వరట. కార్డు సమస్య ఇలా ఉండడం వల్ల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసినా స్పందన లేదు. - సీహెచ్.సంతోషి, ఇందిరానగర్ విశాఖపట్నం : ప్రస్తుతం జరుగుతున్న రేషన్ బియ్యంలో కోత విధించే తంతు చూస్తే.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కున్నట్టుంది సర్కార్ తీరు. ఆధార్ సీడింగ్ పేరుతో గత ఏడాది కాలంలో రెండున్నర లక్షలకు పైగా కార్డులను, ఐదులక్షలకు పైగా యూనిట్లను తొలగించిన ప్రభుత్వం.. అనంతరం తీరిగ్గా కొత్త కార్డులు జారీ చేసింది. అందులో భాగంగా విశాఖ జిల్లాలో 1.15 లక్షల కొత్తకార్డులు ఇచ్చారు. ఈ కార్డుల పరిధిలో 1.85 లక్షల బియ్యం యూనిట్లు(కుటుంబంలోని ఒక మనిషికి ఇచ్చే బియ్యాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు) ఉన్నాయి. జనవరిలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’లో అట్టహాసంగా పంపిణీ చేసిన ఈ కార్డుల అసలు రంగు ఫిబ్రవరిలో బయటపడింది. రేషన్ కార్డుల్లో నమోదైన ఒకరిద్దరిద్దరు సభ్యులకు మినహా మిగిలిన సభ్యులకు బియ్యం ఇవ్వం పొమ్మన్నారు డీలర్లు. కాగా సుమారు 20 శాతం కార్డులకు అసలు సరుకులే అందలేదు. కారణం అడిగితే ఈ కార్డుల్లో ఏ ఒక్కరికీ సరుకుల ఎలాట్మెంట్ జరగలేదని చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆధార్, ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ కానందునే సరుకులు కేటాయించలేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ 20 శాతం కొత్తకార్డులతోపాటు మొత్తం కార్డుల్లో సుమారు 80వేల యూనిట్లకు ఫిబ్రవరిలో సరుకులందలేదు. దీంతో వారంతా తమ ఆధార్, ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు, ఏఎస్వో కార్యాలయాల వద్ద క్యూలు కట్టారు. కానీ అక్కడి కంప్యూటర్లు వీరిలో చాలా మందిని తెల్లకార్డుకు అనర్హులుగా ప్రకటిస్తూ.. వారికి సరుకులిచ్చే అవకాశం లేదని తేల్చేశాయి. ఏ విధంగా మేము అనర్హులమో చెప్పాలని కోరితే.. మీకు వందకుపైగా సీసీ సామర్థ్యమున్న బైకు ఉందని కంప్యూటర్ చూపిస్తోంది. ఈ ఒక్క కారణంతోనే సరుకులందని 80 వేల యూనిట్లలో సగానికిైపైగా కంప్యూటర్ వ్యవస్థ తొలగించేసిందని అధికారులే చెబుతున్నారు. ఇది ఆరంభమే.. ఇక్కడితో అయిపోలేదని.. తర్వాత దశల్లో ఇంకా చాలామంది పేర్లు అనర్హుల జాబితాలో చేరిపోతాయని అంటున్నారు. అదేలా అంటే.. తర్వాతి దశల్లో 750 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు.. 2.5 ఎకరాల మాగాణి.. 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని.. రూ.500కు పైగా విద్యుత్ బిల్లులొస్తున్న వారి పేర్లను రేషన్ అర్హుల జాబితా నుంచి తొలగించేలా కంప్యూటర్ వ్యవస్థకు ఫీడ్ చేస్తారని తెలుస్తోంది. మరోపక్క ఈ-పా్స్ ద్వారా సరుకులు తీసుకోలేని 21 శాతానికి పైగా రేషన్‌కార్డులను ఈ-పాస్ మిషన్ల నుంచి ఇప్పటికే తొలగించేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా సరుకులు తీసుకోని వారిని గుర్తించి వారి పేర్లను హైదరాబాద్ స్థాయిలోనే సర్వర్ నుంచి తొలగించేశారు. వీరి కార్డులు రద్దు కావని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ ఈ-పాస్ మిషన్లలో వాటి వివరాలు ఇక కన్పించవు. ఈ విధంగా లక్షన్నరకు పైగా కార్డులు పూర్తిగా ఈ-పాస్ నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదంతా హైదరాబాద్ స్థాయిలో జరిగిందని.. తమకు కూడా కనీస సమాచారం లేదంటున్నారు. కాగా ఇచ్చినట్టే ఇచ్చి ఈ కోతలేమిటని కొత్త కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. జనవరిలో కొత్తగా జారీ చేసిన 1.15 లక్షల కార్డుల్లో కనీసం 20 శాతం కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరో పక్క సరుకులందక ఇబ్బందిపడుతున్న పాత కార్డుల వారి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. అడిగితే నాపేరు తీసేశారు... 18జీపీఎల్15: కాళ్ల రమణమ్మ మా ఇంటిలోని అందరి పేర్లు రేషన్‌కార్డులో ఉన్నా.. రికార్డులో లేవంటూ డీలరు చెప్పారు. తొలుత ఐదుగురిలో ఇద్దరికే రేషన్ ఇచ్చేవారు. తర్వాత నాపేరు, ఎవరి పేరూ లేదట. ఇదేం విడ్డూరమో తెలీదు. పేదల బాధలు వినడానికి అధికారులకు తీరిక లేదు. కాళ్ల రమణమ్మ, గోపాలపట్నం -
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం పట్టివేత
సాలూరు (విజయనగరం జిల్లా): రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఒడిశాకు తరలిస్తుండగా సాలూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సాలూరు ఆర్టీసీ సముదాయం సమీపంలో25 కేజీల బరువున్న 108 బస్తాల బియ్యాన్ని లారీల్లోకి ఎక్కిస్తుండగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బియ్యం వ్యాపారులు గోపీ, భీమాలకు ఈ రేషన్ బియ్యం తరలింపు వెనకు హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
పస్తులు తప్పవా..?
లంఖణం(పస్తు ఉండడం) దివ్య ఔషధం అన్నారు పెద్దలు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యమేమో గాని..ఏకంగా నెలంతా ప్రతిరోజూ పస్తులుంటే శుష్కించి అనారోగ్యం బారిన పడతారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా చౌకధరలకు సరుకులను పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గ్రామాల్లో డిపోలకు అందజేసిన ఈ పోస్ మెషీన్లు సరిగా పనియకపోవడం, కొంతమంది వృద్ధుల వేలిముద్రలు స్కాన్ అవకపోవడం వంటి ఇబ్బందులతో లబ్ధిదారులకు వచ్చిన రేషన్ కాస్తా తిరిగి వెళ్లిపోతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. సరుకులు అందకుండా వెనక్కి వెళ్లిపోతే నెలంతా పస్తులుండాల్సిదేనని వాపోతున్నారు. * జిల్లాలో 76వేల మందికి పైగా అందని రేషన్ * ఇబ్బందుల్లో లబ్ధిదారులు భోగాపురం: జిల్లాలోని 34మండలాల్లో ఈ పోస్ ద్వారాపనిచేస్తున్న 1341 రేషన్ షాపుల్లో 6,62,681 లబ్ధిదారులు ఉండగా ఫిబ్రవరిలో కేవలం 5,86,080మందికి మాత్రమే రేషన్ సరుకులు అందాయి. ఈ పోస్ సిగ్నల్స్ అందని షాపులు జిల్లాలో 30నుంచి 40వరకు ఉండవచ్చు. వారికి మాన్యువల్‌గానే సరుకులు అందిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈనెల సరుకులు 88.44శాతం పంపిణీ జరిగాయి. జిల్లాలో అత్యధికంగా కొత్తవలసలో 93.49శాతం సరుకులు అందించగా, అతితక్కువగా మెంటాడ మండలంలో 84.79శాతం సరుకులను మాత్రమే అందించారు. దీంతో ఈనెల చౌకధరల దుకాణాల ద్వారా 76,541మంది సరుకులను పొందలేకపోయారు. జిల్లాలో ఇన్చార్జ్ డీలర్లు ఎక్కువగా ఉండడం, ఈపోస్ మెషీన్లు పనిచేయకపోవడం. మెషీన్లు పనిచేసినా ఇంట్లో ఒక్కరే ఉన్న కార్డుల్లో వేలిముద్రలు స్కాన్ కాకపోవడంతో సరుకుల పంపిణీ కాలేదు. అయితే రేషను సరుకులపైనే ఆధారపడే పేదవారు ఈపోస్ విధానం ద్వారా సరుకులు పొందలేక ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతినెలా 15నుంచి 20వ తారీఖుల్లో ఈ పోస్ ఆన్లైన్ ఆగిపోవడంతో సరుకులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. రేషన్ ఇస్తున్నారంటే చాలు లబ్ధిదారులు పగలనక, రాత్రనక డిపోల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. పడిగాపులు కాసినా తీరా వారివంతు వచ్చేసరికి వేలిముద్రలు పడకపోవడమో, సర్వర్ ఆగిపోవడమో జరుగుతుండడంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాలోని ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలోనే ఫిబ్రవరి నెలలో సుమారు 10వేల మంది లబ్ధిదారుల రేషన్ వెనక్కి వెళ్లి పోయింది. దీంతో లబ్ధిదారులు ఈనెల ఏంతిని బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు తిరిగినా రేషన్ రాలేదు మాది భోగాపురం మండలం రావాడ పంచాయతీ చినరావాడ గ్రామం. మేము రేషన్ అందుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావాడ గ్రామానికి వెళ్లాలి. నా వయసు 80ఏళ్లు. నేను ఒక్కదాన్నే ఉంటాను. వారంరోజులు తిరిగాను వేలి ముద్రలు పడలేదని వెనక్కి పంపించేశారు. కోటా బియ్యమే ఆధారం. నెలకు నాకు ఇచ్చే ఐదు కేజీల బియ్యం కూడా అందలేదు. - బమ్మిడి అచ్చెమ్మ, చినరావాడ రేషను సరుకులకు ఇబ్బంది పడుతున్నాం రేషన్ సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెషీన్లు పనిచేయడం లేదని సరుకులు రాత్రిపూట ఇవ్వడంతో మా గ్రామం నుంచి చీకట్లో ఇబ్బందులు పడి మరీ వెళ్తాం. అయినా నాకు రేషను అందలేదు. రావాల్సిన ఐదుకేజీల బియ్యం అందకపోతే ఏం తిని బతకాలి. మా పరిస్థితి ఏంటి? - ఇప్పిలి తాత, చినరావాడ -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెగడపల్లి: కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు బుధవారం పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు వ్యాపారి అక్కినపల్లి రవి ఇంట్లో సోదాలు చేయగా... నిల్వ చేసిన 100 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యం వెలుగు చూసింది. ఆ బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు రవిపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. -
35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అమీరపేట్: అక్రమంగా నిల్వ ఉంచిన స్థావరాలపై అధికారులు దాడులు నిర్వహించి 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఉద్దమర్రి గ్రామం లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజా కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు, కృష్ణమూర్తిలు కొంతకాలంగా వివిధ మండలాల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తూ ఉద్దమర్రిలో ఓచోట డంప్ చేస్తున్నారు. పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్దమర్రిలోని కృష్ణమూర్తి, నాగరాజుల ఇళ్లపై ఏకకాలంలో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నాగరాజు, కృష్ణమూర్తిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రేషన్ డీలర్ సుగుణ ఆధీనంలో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ దీప్తీ, ఆర్ఐ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు రేషన్ డీలర్లకు జరిమానాలు
కొమరోలు: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ.. పేద ప్రజలను మోసగిసతున్న ఇద్దరు రేషన్ డీలర్లకు అధికారులు జరిమానాలు విధించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో బుధవారం వెలుగుచూసింది. స్థానిక కొమరోలు -1, కొమరోలు -2 రేషన్ దుకాణాల్లో కొలతల్లో అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు బియ్యం తూకాల్లో 35 కిలోలకు గాను 33 కిలోలు మాత్రమే ఉండటాన్ని గుర్తించి ఇద్దరు దుకాణ దారులపై రూ. 10 వేల చొప్పున జరిమానాలు విధించారు. -
పని భారంతో డీలార్లు
రేషన్ సరుకు పంపిణీలో సంస్కరణలు ప్రవేశపెట్టి డీలర్లపై పనిభారం పెంచిన ప్రభుత్వం కమీషన్ పెంపుపై మీనమేషాలు లెక్కిస్తోంది. రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ విధానం ప్రవేశపెట్టి కమీషన్ చెల్లిస్తామన్న హామీని తుంగలో తొక్కింది. దీనిపై ప్రభుత్వంతో పలు దఫాలుగా రేషన్‌డీలర్లు జరిపిన చర్చల్లో ఆ మేరకు హామీ లభించినా, అమలుకు నోచుకోవడం లేదు. ఆర్బీఐ ఎప్పుడో నిషేధించిన పైసాల్లోనే ఇప్పటికీ డీలర్లకు కమీషన్‌గా ఇస్తున్న ప్రభుత్వ నిర్ణయం పరోక్షంగా కొందరు డీలర్ల అవినీతికి కారణమవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తెనాలి రూరల్ : గుంటూరు జిల్లాలో 2,716 రేషన్ దుకాణాలు, సుమారు 30 లక్షల వరకు కార్డులు ఉన్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం వల్ల రేషన్ దుకాణాల్లో అవినీతి తగ్గినా, పనిభారం విపరీతంగా పెరిగింది. ఒక్కోసారి సర్వర్లు పని చేయక రేయింబవళ్లు సరుకును పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిపోతున్న వ్యయానికి తగ్గట్టుగా ఆహార భద్రత చట్టం ప్రకారం కమీషన్‌ను పెంచాలని కేంద్ర ప్రభత్వం సూచించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ-పోస్ యంత్రాలకు సాంకేతిక లోపం ఏర్పడినా సంబంధిత డీలర్లే మరమ్మతులు చేరుుంచుకోవాల్సి రావడంతో చేతి చమురు వదులుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ పెంపు కోసం ఎదురు చూపు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమార భద్రత చట్ట ప్రకారం కమీషన్ పెంచుతుందని డీలర్లు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో డిసెంబర్ 21వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. అయితే పండుగల సీజన్ కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను డీలర్లు విరమించారు. అయినా ఇప్పటి వరకు దీనిపై స్పష్టత లేదు. సమస్యలను పరిష్కరించకపోతే రేషన్ దుకాణాల నిర్వహణ నుంచి వైదొలిగేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమయ్యే రోజులకు, ఇప్పటికీ కమీషన్లో పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 29వేల మంది డీలర్లు నెలకు రూ. 191 కోట్లు పెట్టుబడి పెడుతుంటే, వారికి వస్తున్న కమిషన్ కేవలం రూ. 10.71 కోట్లు మాత్రమే. బియ్యం కేజీకి గతంలో 12 పైసలు ఉండగా ప్రస్తుతం 20 పైసలకు, పంచదార 13 పైసలు నుంచి 16 పైసలు, గోధుమలకు 7 నుంచి 13 పైసలకు కమీషన్‌ను పెంచి ఇస్తున్నారు. కిరోసిన్‌కు మాత్రం ఇప్పటికీ లీటరుకు 25 పైసలే ఇస్తున్నారు. కందిపప్పు విషయంలో డీలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.89.45 పెట్టి కిలో కందిపప్పు కొనుగోలు చేస్తే వారికి వచ్చే కమిషన్ కేవలం 55 పైసలు మాత్రమే. ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ-పోస్ విధానాన్ని అమలు చేస్తున్న రేషన్ దుకాణాల్లో డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను బియ్యానికి 87 పైసలు, పంచదారకు 60పైసలు, గోధుమలకు 70 పైసలు, కిరోసిన్‌కు 75 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించి ఏడు నెలలు గడుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కమిషన్ పెంపు జరుగకపోగా పనిభారం పెరగడంతో డీలర్లు డీలా పడుతున్నారు. జాడలేని ‘కానుక’ల కమీషన్.. గోదాముల నుంచి నేరుగా తీసుకువస్తున్న రేషన్ సరుకుల్లో వస్తున్న విపరీతమైన తరుగు డీలర్లను ఇక్కట్ల పాల్జేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎలక్ట్రానిక్ యంత్రాలపై సరుకులను తూచి ఇస్తుండగా, గోదాముల నుంచి బస్తాలను నేరుగా లోడింగ్ చేస్తున్నారు. దీనిపై పలుమార్లు పౌరసరఫరా అధికారులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఇంతే కాక పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రన్న కానుక, చంద్రన్న రంజాన్ తోఫా పేరిట సరుకులను డీలర్ల చేత పంపిణీ చేయించింది. అయినా వాటికి సంబంధించిన కమీషన్లు ఇప్పటికీ రాలేదు. దీనికి తోడు ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి కానుకల పంపిణీ జరుగుతోంది. వీటికి ఎప్పటికి కమీషన్ వస్తోందో తెలీని పరిస్థితి. -
మొరాయించిన ఈ పాస్ మిషన్లు
సంతమాగులూరు: క్రిస్మస్ సందర్భంగా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న వంట సరుకుల పంపిణీకి ఈ-పాస్ మిషన్ల రూపంలో పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో 42 రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో.. పేదలకు ఇవ్వాల్సిన సరుకుల పంపణీ ఆగిపోయింది. దీంతో రేషన్ కార్డుదారులు ఆందోళన చేస్తున్నారు. -
ఏది నీటి చుక్కాని?
నెలాఖరుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాలు ఖాళీ వట్టిపోయిన మంజీర ఈ నెల 29 నుంచి నిలిచిపోనున్న నీటి సేకరణ గ్రేటర్ ప్రజలకు తప్పని కష్టాలు కుత్బుల్లాపూర్: గ్రేటర్ శివార్లను నీటి కష్టాలు వేధిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి ఒడ్డున పడేసే చుక్కాని కోసం శివారు జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మహా నగర దాహార్తిని తీరుస్తున్న సింగూరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు ఈ నెలాఖరుకు పూర్తిగా వట్టిపోనున్నాయి. ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో శివారు మున్సిపల్ సర్కిళ్లలో తీవ్ర ఎద్దడి నెలకొంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో మంగళవారం నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో వందలాది కాలనీలు, బస్తీలు తీవ్ర దాహార్తితో విలవిల్లాడాయి. సింగూరు, మంజీర జలశయాల ద్వారా సరఫరా చేసే నీటిలో సగానికి కోత విధించారు. ఎస్.ఆర్‌నగర్ , కూకట్పల్లి, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు సరఫరా అవుతున్న నీటిలో 50 శాతం కోత పడింది. ప్రస్తుతం సింగూరు నుంచి తరలిస్తున్న 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వివిధ ప్రాంతాలకు పొదుపుగా (రేషన్) సరఫరా చేస్తుండడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. డిసెంబరు రెండో వారంలో సరఫరా చేసే 85 ఎంజీడీల గోదావరి జలాలతో నగర దాహార్తిని తీరుస్తామని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో యుద్ధాలు కుత్బుల్లాపూర్ సర్కిల్‌కు వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లుజలమండలి జీఎం ప్రవీణ్‌కుమార్ ప్రకటించడం కలకలం రేపింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, అపార్టుమెంట్లు, కాలనీలు, మురికివాడలకు మంగళ వారం 36 ట్యాంకర్లతో అరకొరగా నీటి సరఫరా చేశారు. దీంతో ఈ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద నీటి కోసం స్థానికులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రసూన నగర్లో గొడవ చోటు చేసుకోగా ఓ మహిళ ముక్కు పగిలి గాయమైంది. మాణిక్యనగర్లోని ప్రతి వీధిలో జనం ట్యాంకర్ల కోసం పడిగాపులు కాశారు. వాణీ నగర్, వసంత కెమికల్స్, షాపూర్ నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో రిజర్వాయర్ల వద్ద కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు క్యూ కట్టి ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. మొత్తం సర్కిల్లో 58 వేలకు పైగా ఉన్న కనెక్షన్లకు వారం రోజులుగా నీళ్లు లేవు. చింతల్ డివిజన్‌కు 18 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా కేవలం 8 ఎంజీడీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ సరఫరా 3 ఎంజీడీలకు మించి లేకపోవడం గమనార్హం. ముందుకు సాగని రిజర్వాయర్ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 2న ఇక్కడ 5 ఎంఎల్ రిజర్వాయర్‌కు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7 కోట్ల వ్యయమే అవుతుండగా... మరో రూ.3 కోట్ల మేరకు అంచనాలు పెరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టెండర్లు రద్దు చేయడంతో రిజర్వాయర్ నిర్మాణం అటకెక్కింది. నీటి కోసం ఆందోళనలు... మంచినీటి ఎద్దడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మంగళవారం వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ఐడీపీఎల్ చౌరస్తా వద్ద ఆందోళన చేసి.. అక్కడి నుంచి ర్యాలీగా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గోదావరి జలాలతో కొరత తీరుస్తాం ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సింగూరు నుంచి అరకొరగా సరఫరా అవుతోంది. ఈ నెలాఖరుకు ఇదీ నిలిచిపోనుంది. డిసెంబరు ద్వితీయ వారంలో నగరానికి తరలించనున్న 85 ఎంజీడీల నీటితో వివిధ ప్రాంతాల దాహార్తిని తీరుస్తాం. -విజయ్ కుమార్ రెడ్డి, జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం సీజీఎం -
నల్లబజారుకు కందిపప్పు
రేషన్ డీలర్ల చేతివాటం రెండు రోజులకే కోటా ఖతం కంది పప్పు నో స్టాక్ కొరవడిన అధికారుల నిఘా సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దఎత్తున ‘రేషన్ కంది పప్పు’ నల్లబజారుకు తరలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన రెండు మూడు రోజులకే కంది పప్పు నో స్టాక్‌గా మారడం ఇందుకు బలం చేకూర్చుతోంది. కొందరు రేషన్ డీలర్లు వచ్చిన కంది పప్పు ఆయిపోయిందంటూ... మరి కొందరు పూర్తి కోటాను దిగమింగి సబ్సిడీ కంది పప్పు ఈ సారి రైతుబజార్, ప్రత్యేక కేంద్రాల్లో విక్రయిస్తున్నారని లబ్ధిదారులకు పేర్కొంటూ చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ధర పెరగడంతో డీలర్లు చేతివాటం ప్రదర్శించి లబ్ధిదారులు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.200 లు పలుకుతుండగా.. చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై రూ.50లకు పంపిణీ చేయా ల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం ఫలితంగా చౌక ధర కంది పప్పు గుట్టుచప్పుడు కాకుండా డీలర్లు సొమ్ము చేసుకుం టున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి లో కంది పప్పు కోసం పూర్తిస్థాయి కోటా కోసం డీడీలు కట్టి ఇండెంట్ పెట్టిన డీలర్లు మొదటి విడతగా కేటాయించిన సుమారు 70 శాతం వరకు కోటాను గోదాముల నుంచి నేరుగా నల్లబజారుకు తరలించినట్లు తెలుస్తోంది. దాల్‌మిల్లర్స్, పప్పు దినుసుల వ్యాపారులు, దళారులు రేషన్ పుప్పుపై దృష్టి సారించడం డీలర్లకు మరింత కలిసివచ్చింది. అధికారుల నిఘా కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో నల్లబజారుకు తరలిపోయింది. సగానికి పైగా దుకాణాల్లో నో స్టాక్.. గ్రేటర్‌లోని సగానికిపైగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో గురువారం నాటికి కంది పప్పు లేకుండా పోయింది. మొత్తం 13.96 లక్షల కార్డుదారులు ఉండగా, ప్రతి కార్డు కు కిలో కంది పప్పు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు పౌరసరఫరా శాఖ హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిల్స్‌లోని రేషన్ షాపులకు 817 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లా అర్బన్‌లోని మూడు సర్కిల్స్లోగల షాపులకు 578 మెట్రిక్ టన్నుల చొప్పున కంది పప్పు కోటాను కేటాయించి మొదటి విడతగా 75 శాతం విడుదల చేసిం ది. చౌకధరల దుకాణాల డీలర్లకు కిలో రూ.49.45 పైసల చొప్పున సరఫరా చేసి రూ.50ల చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించింది. అయితే కంది పప్పుకు డిమాండ్ పెరగడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. -
రేషన్ కోసం గ్రామస్తుల ధర్నా
మూడు నెలలుగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ.. దర్శి మండలం ఎర్రబోనపల్లె గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనతో ఆర్ఐ సత్యమూర్తి గ్రామానికి చేరుకుని రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ చింతా వెంకటరమణారెడ్డి పరారయ్యాడు. ఇంతకు ముందున్న డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి తొలగించారు. అతని స్థానంలో వచ్చిన టీడీపీ కార్యకర్త రమణారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
రేషన్ సరుకుల కోసం గ్రామస్తుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం శనివారం ధర్నాకు దిగారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు డీలర్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా ఉన్న రేషన్ డీలర్‌ను రాజకీయ కారణాలతో తొలగించి నాలుగు నెలల క్రితం ఇరుగు పోల్‌రెడ్డి అనే వ్యక్తికి డీలర్షిప్ అప్పగించారని గ్రామస్తులు అంటున్నారు. కొత్తగా వచ్చిన డీలర్ సరుకులను పంపిణీ చేయకుండా అక్రమంగా విక్రయించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా డీలర్‌కు వచ్చిననప్పటికీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రేషన్ ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం
నాలుగు నెలలుగా తనకు రేషన్ సరిగా ఇవ్వటం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా ఆగలి మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగేంద్ర(45)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని సోదరి వీరనాగమ్మ చనిపోవటంతో ఆమె ఇద్దరు పిల్లలు కూడా వారితోనే ఉంటున్నారు. అయితే, నాగేంద్ర రేషన్‌కార్డుపై అతని కుటుంబానికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. తన చెల్లెలి పిల్లల పోషణ భారం తనపైనే ఉందని, వారికి కూడా రేషన్ ఇవ్వాలని అధికారులను కోరుతున్నా ఫలితం కనిపించడం లేదని.. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు. అతని డిమాండ్ మేరకు నాలుగు నెలల రేషన్ సరుకులను ఇచ్చి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పంపించి వేశారు. -
రోడ్డు పక్కన రేషన్ కందిపప్పు ప్యాకెట్ల గుట్ట
నిరుపేదలకు అందించాల్సిన సబ్సిడీ కందిపప్పును రేషన్ డీలర్లు అక్రమంగా షాపులకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్డు గాడుదల వాగు వద్ద రోడ్డు పక్కన సోమవారం ఉదయం రేషన్ కందిపప్పు ఖాళీ ప్యాకెట్లు గుట్టగాలుగా పడి ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈ ప్యాకెట్లపై తయారీ ముద్రలు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు ఆర్ఐ హుస్సేన్, వీఆర్వోలు కె.శ్రీధర్, వెంకటేశ్వర్లు హడావుడిగా ఆ ఖాళీ ప్యాకెట్లను బస్తాలలో కుక్కి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మండలంలో మూడు నెలల నుంచి సరిగా సబ్సిడీ కందిపప్పు పంపిణీ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.140వరకు ఉండటంతో అదే అదనుగా భావించిన కొందరు రేషన్ డీలర్లు నిరుపేదల పొట్టగొట్టి షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఐదు రేషన్ దుకాణాల్లో విచారణ నిర్వహిస్తామని సివిల్ సప్లై డీటీ కరుణాకర్ తెలిపారు. అవసరమైతే పక్క మండలాల చౌక ధరల దుకాణలపైన కూడా విచారణ చేస్తామని అన్నారు. -
మంత్రి సునీతకి చేదు అనుభవం
-
‘చౌక’బారు కోతలు!
పేదల రేషన్‌లో కోతలు రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్లకార్డులు వాటిలో నమోదైన 75.57 లక్షల మంది పేర్లు తొలగింపు ఆధార్ లేదని, వేలిముద్రలు సరిపోవడంలేదనీ రేషన్ నిరాకరణ {పభుత్వానికి ప్రతినెలా 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి నిరుపేదల పొట్ట కొడుతోంది. ఆధార్ కార్డు లేదన్న కారణంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం లేదు. ఒకవేళ ఆధార్ ఉన్నా ఈ-పాస్ మిషన్లకు వేలి ముద్రలు సరిపోవడం లేదంటూ రేషన్ నిరాకరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులుంటే ఆధార్ కార్డులు లేవన్న కారణంతో రేషన్ కార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ 75.57 లక్షల మంది పేర్లు (యూనిట్స్) తొలగించి వారి రేషన్ నిలిపివేశారు. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో అయిదుగురు సభ్యులుంటే వారికి ఒక్కొక్కరికి అయిదు కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారందరి పేరుతో విడివిడిగా ఆధార్ కార్డులు లేవని, సీడింగ్ కాలేదని, వేలి ముద్రలు సరిపోవడం లేదని... ఇలా రకరకాల కారణాలతో ఆ కుటుంబానికి రేషన్‌లో కోత పెడుతున్నారు. మరోవైపు ఏ ఆధారంలేని అంత్యోదయ అన్న యోజన పథకం ఉన్న వారి పరిస్థితి, అందులో వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులు, ఈ-పాస్ మిషన్ల వేలిముద్రలతో సరిపోవడంలేదని వారికి రేషన్ తిరస్కరిస్తున్నారని తిరస్కరిస్తున్న విషయాన్ని అనేకచోట్ల రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోవడంలేదు. ఈ రకంగా ప్రభుత్వానికి ప్రతి నెలా 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఆధార్ సీడింగ్, ఈ-పాస్ విధానంలో లోటుపాట్ల వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా ఈ విధానం వల్ల ఏటా వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. దాంతో ఆ విధానాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో నిరుపేదలు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. రాష్ట్రవ్యాప్తంగా అంత్యోదయ అన్న యోజన పథకం కింద 9.43 లక్షల కార్డులున్న వారందరికీ నెలకు 35 కిలోలు, అదేవిధంగా అన్నపూర్ణ పథకం కింద కార్డులున్న మరో 12,914 మందికి నెలకు 10 కిలోలు, 2,470 మంది చేనేత కార్మికులకు 25 కిలోల చొప్పు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో అధికారులనుంచి రేషన్ డీలర్ వరకు జరుగుతున్న అవినీతిని ప్రభుత్వం అరికట్టే సాహసం చేయకుండా కేవలం పేదలపైనే ప్రతాపం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో రేషన్ డీలర్‌పై ఏడుగురు పర్యవేక్షణాధికారులుగా కొనసాగుతున్నారు.వీరికి అనేక స్థాయిల్లో ఒక్కో డీలర్ నుంచి కొంత మొత్తం ముడుతుండటంతో వారు పేదల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదన్న ఆరోపణలున్నాయి. ఈ కమీషన్లుగా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాల్సి ఉన్నందున రేషన్ పంపిణీలో కోతలు పెట్టాల్సి వస్తోందని పలువురు డీలర్లు వాపోతున్నారు. మూడు నెలల్లో సర్కారుకు రూ. 88 కోట్ల మిగులు వచ్చే అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 7,595 రేషన్ షాపుల్లో ఈ-పాస్ అమలు చేయడంవల్ల మే, జూన్, జూలై మూడు నెలల్లో రూ.88.51 కోట్లు ఆదా అయినట్టు ఇటీవల ముఖ్యమంత్రి ప్రజా పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో తేల్చారు. ఈ -పాస్ అమలు చేయడం ద్వారా ఏటా వెయ్యి కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇంకా బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడానికి ఆధార్ సీడింగ్‌ను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదీ పరిస్థితి.. కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా నిత్యావసర సరుకుల సరఫరా నిలిచిపోయింది. చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు మొరాయించాయి. మంగళవారం విజయవాడకు ప్రత్యేక బృందాలు వచ్చి నాలుగైదు డిపోలను సందర్శించి వెనక్కి వెళ్లిపోయారు. జిల్లాలో 2,150 చౌరధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ నగరంలో 255 ఉన్నాయి. డిపోల్లో ఈ-పాస్ మిషన్లు సరిగా పని చేయటం లేదు. బెంగుళూరులో సర్వర్ బ్రేక్‌డౌన్ అవటంతో ఆధార్ ట్యాలీ కావటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం నుంచి కొన్ని డిపోల్లో సర్వర్ నెమ్మదిగా పని చేయటం ప్రారంభించింది. అప్పటికే జనం వెనక్కి వెళ్లిపోయారు. దాంతో చౌకధరల దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. -
రేషన్ గోధుమల ప్యాకెట్లో రసాయనాలు
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌షాపుల ద్వారా సరఫరా చేస్తున్న గోధుమల ప్యాకెట్లలో రసాయన ఎరువుల గుళికలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ రేషన్‌షాపు నుంచి తీసుకొచ్చిన గోధుమ ప్యాకెట్‌ను వినియోగదారులు బుధవారం విప్పి చూడగా వాటిలో యూరియా, 20-20-20 వంటి ఎరువుల గుళికలు కన్పించాయి. ఇలాంటివి వాడితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్యాకెట్లపై బ్యాచ్ నెంబర్-1, 2015 జూలైలో ప్యాక్ చేసినట్లు ముద్రించి ఉంది. -
మిగులు బియ్యం... 2 వేల క్వింటాళ్లు!
నల్లగొండ : రేషన్ దుకాణాల్లో బియ్యం మిగులు నిల్వలపై లెక్కతేలింది. డీలర్లు మిగులు నిల్వలపై సరైన సమాచారం ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా మిగిలిన నిల్వలపై పారదర్శకంగా సమచారం ఇవ్వకుండా డీలర్లు బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించడం సర్వసాధారణంగా మారింది. దీంతో డీలర్ల అక్రమాలు అరికట్టి బియ్యం నిల్వలపై సమగ్ర సమాచారం రాబట్టేందుకు జిల్లా పౌరసఫరాల శాఖ ప్రతి నెలా 13వ తేదీ నాటికి డీలర్ల వద్ద మిగులు నిల్వల సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. రెండు మాసాల నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని అధికారులు ఇటీవల మరింత ఉధృతం చేశారు. జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాలు 2,082 ఉన్నాయి. 9.89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 30 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రతినెలా రేషన్ బియ్యం లక్షా 80 వేల క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయగా జూలైలో 1500 క్వింటాళ్లు మిగులు ఉన్నట్లు డీలర్లు లెక్కలు సమర్పించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం డీలర్లపై నిఘా మరింత పెంచడంతో ఆగస్టుకు వచ్చే సరికి 2,238 క్వింటాళ్లకు పెరిగింది. సచ్ఛీలురూ వీరే.... ఈ నెలలో లక్షా 80 వేల క్వింటాళ్లు డీలర్లకు సరఫరా చేశారు. దీంట్లో లబ్ధిదారులకు పం పిణీ చేయగా డీలర్ల వద్ద 2,238 క్వింటాళ్లు మిగులు ఉన్నట్లు తేలింది. దీంట్లో తమ వద్ద గింజ బియ్యం కూడా నిల్వ లేదని 14 మంది డీలర్లు లెక్కలు సమర్పించారు. క్వింటాకు తక్కువ బియ్యం నిల్వలు కలిగిన దుకాణాలు 50 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అతితక్కువ బియ్యం నిల్వలు ఉన్న మండలాల్లో చిట్యాల మండల పరిధిలోని దుకాణాల్లో 14 క్వింటాళ్లు, పెద్దవూర మండలంలో 19 క్వింటాళ్లు, బీబీనగర్ మండలంలో 8 క్వింటాళ్లు, సూర్యాపేట 12 క్వి ంటాళ్లు, అర్వపల్లి 13 క్వింటాళ్లు, మర్రిగూడ మండల పరిధిలోని దుకాణాల్లో 10 క్వింటాళ్లు మాత్రమే బియ్యం నిల్వలు మిగిలి ఉన్నట్లు పౌరసరఫరాల శాఖకు లెక్కలు ఇచ్చారు. నేటినుంచి విస్తృత తనిఖీలు... జీరో బ్యాలెన్స్ దుకాణాలు, అతితక్కువ నిల్వలు కలిగిన రేషన్ దుకాణాలపై శుక్రవారం నుంచి జిల్లా యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహించనుంది. ఈ తనిఖీల్లో సరుకుల నిల్వలు తేలితే అక్కడికక్కడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తనిఖీల అనంతరం కీ రిజిస్టర్ రూపొం దిస్తారు. ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో డీలర్లందరూ బియ్యం సహా అన్ని సరుకులకు ఒకేసారి డీడీలు చెల్లించాల్సి ఉం టుంది. మీ సేవా కేంద్రాల్లో ఎంటర్ అయిన దుకాణాల డీడీలను తహసీల్దార్లు పరిశీలించిన పిదప గోదాములకు పంపుతారు. అక్కడినుంచి డీలర్లుకు రేషన్ సరుకులు సరఫరా చేస్తారు. ఈ విధానం ద్వారా డీడీలు చెల్లించే క్రమంలో డీలర్లు రెండు సార్లు కాకుండా ఒకేసారి డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఒకేసారి సరుకులన్నీ దుకాణాలకు చేరుతాయి. లబ్ధిదారులకు పంపిణీ కూడా ఏకకాలంలో పూర్తవుతుంది. -
నల్లబజారుకు.. రాయితీ ఉల్లి
ఉల్లి.. తల్లివంటిదని అంటారు. ఓ కవి ‘ఉల్లుండవలయు లేదా తల్లుండవలయు భోజనోత్సవ వేళన్!’ అన్నాడు. ఎవరెలా అన్నా ప్రతి రోజూ వంటకాల్లో ఉల్లిపాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తగ్గిన దిగుబడితో ప్రస్తుతం మార్కెట్లో దాని ధర రెక్కలు కట్టుకు విహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని కూడా కొంతమంది అక్రమార్కులు అవకాశంగా పయోగించుకుంటున్నారు. రాయితీపై వస్తున్న సరుకును అధిక ధరకు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తుని : దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.35 నుంచి రూ.45 వరకూ ఉంది. దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఉల్లి వినియోగం రోజువారీ అధికంగానే ఉంటుంది. ధర పెరగడంతో నెలవారీ బడ్జెట్లో దీనికే రూ.500 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌కంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తూతూమంత్రంగానే దీనిని విక్రయిస్తున్నారు. రాయితీపై విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నియోజకవర్గానికి 10 టన్నుల చొప్పున ఉల్లిపాయలు సరఫరా చేశారు. వీటి అమ్మకం బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించారు. తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కిలో రూ.20 చొప్పున 2 కిలోలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల ఒకటిన అట్టహాసంగా మార్కెట్ యార్డుల్లో, రైతుబజార్లలో వీటి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో ఉల్లికోసం జనం బారులు తీరడం మొదలుపెట్టారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. కొన్నిచోట్ల పంపిణీ సక్రమంగానే జరుగుతున్నా.. కొంతమంది ప్రభుత్వం సరఫరా చేసిన ఉల్లిపాయలను గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ ఉల్లిని రూ.2600కు అమ్ముకుంటున్నారు. బయట మార్కెట్లో క్వింటాల్ ధర రూ.3వేలు పైగానే ఉంది. మొత్తంగా జిల్లాలో సుమారు 250 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాయితీపై అందించాల్సి ఉండగా, ఈ సరుకును నల్లబజారుకు తరలించి, టన్నుకు రూ.6 వేల చొప్పున అడ్డదారిలో సంపాదిస్తున్నారు. ఒక్క తుని నియోజకవర్గంలోనే ఒక టన్ను ఉల్లిపాయలను రాయితీపై కౌంటర్ల ద్వారా విక్రయించారు. మిగిలిన తొమ్మిది టన్నులను బయటి వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా ఒక్క తునిలోనే రూ.50 వేలు అడ్డదారిన సంపాదించారు. ఇతర నియోజవకర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించినందువల్లనే రాయితీ ఉల్లి నల్లబజారుకు తరలిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫలితంగా తమకు ఉల్లి ధరల ఘాటు తప్పడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
కరుణలేని నిబంధన... చేయి కోల్పోయిన వృద్ధురాలి వేదన
కర్నూలు (ఆత్మకూరు రూరల్) : సాంకేతిక అభివృద్ధి మనిషిని సౌకర్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడాలి కానీ వారిని మరింత కష్టాల పాలు చేయడానికి కాదు. అక్రమాల నిరోధానికంటూ ప్రవేశ పెట్టిన ఆధార్ ఎందరి ఆధారాలనో పోగొట్టిందో అందరికి తెలిసిందే. అలాంటి కోవలోనిదే పౌరసరఫరాలలో అక్రమాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పద్ధతి. లబ్దిదారుల వేలి ముద్రలను స్కానింగ్ చేసి భధ్రపరచి వారు స్వయంగా వేలి ముద్రలు వేసిన తరువాత సరిచూసే ఈ పద్ధతి ఓ వృద్దురాలిని కడుపు కాలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ భర్త ఇటీవలే మృతిచెందాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఉన్న కష్టాలు చాలవన్నట్లు చేతి వేళ్ళకు అయిన చిన్నపాటి గాయం పెరిగి పెద్దదై గాంగ్రిన్‌గా మారి చేతిని కుళ్ళ జేసింది. దీంతో సంవత్సరం క్రిందట అనివార్యంగా ఆమె ఎడమ చేతిని వైద్యులు ముంజేతి వరకు తొలగించారు. దీంతో ఆమె రేషన్ కార్డుకు రావాల్సిన వెచ్చాలను తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్తే.. తన ఎడమ చేతి బొటన వ్రేలి ముద్ర వేయలేని కారణంగా డీలరు ఆమెకు రేషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. భర్తను కోల్పోయి , మోచేతి వరకు చేతిని కోల్పోయిన హుసేనమ్మకు న్యాయంగా రావాల్సిన రేషన్ వేలి ముద్ర వేయలేని కారణంగా ఏడాదిగా ఇవ్వకపోవడం ప్రభుత్వ సాంకేతికత డొల్లతనాన్ని సూచిస్తోంది. తనకు రేషన్ ఇప్పించండంటూ ఆమె ఆత్మకూరు తహశీల్దార్ రాజశేఖరబాబుకు గురువారం మొరపెట్టుకుంది. -
కోటాలో కోత వద్దు
- అర్హులందరికీ రేషన్ ఇవ్వాలి - గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశ తీర్మానం ఇందూరు: కుటుంబంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా చూడాలని, ఇక ముందు కోటాలో కోత లేకుండా సరఫరా చేయాలని కోరుతూ గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశం తీర్మానించింది. గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశం శుక్రవారం జిల్లాపరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షతన జరిగింది. డీఆర్డీఏ, ఐకేపీ, పరిశ్రమలు, హౌసింగ్, సహకార, నెడ్‌క్యాప్, సివిల్ సప్లయ్, స్టెప్, ఆర్టీసీ, గనులు, భూగర్భ, డ్వామా శాఖలు చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చించింది. పలువురు సభ్యులు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ అక్రమాలు రేషన్ డీలర్ల అక్రమాలను సభ్యులు ప్రస్తావించారు. కుటుంబ సభ్యులందరికీ ఒక నెల రేషన్ కోటా వస్తే.. తదుపరి నెలలొ ఒకరిద్దరికి డీలర్లు కోత పెడుతున్నారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ)తో సభ్యులు చెప్పారు. ఆధార్ అనుసంధానం కాలేదని డీలర్ చెప్పడంతో ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రేషన్ కోటా వచ్చినప్పటికీ రాలేదని కొందరు డీలర్లు చెబుతున్నారని, సరుకులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో దాడులు చేయిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. అంత్యోదయ కార్డులు డీలర్ల వద్దనే ఉన్నాయని అన్నారు. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. జీవన భృతి చెల్లింపులో కూడా... బీడీ కార్మికులకు జీవన భృతిపై ఈ సమావేశం చర్చించింది. భృతి చెల్లింపులోనూ అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి జాబితాలో పేరుండి, రెండవ జాబితాలో లేకపోవడంతో బీడీ కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీడీ భృతి చెల్లింపులోనూ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై సోషల్ ఆడిట్ చేయించాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. నందిపేట్, నవీపేట్, వర్ని ప్రాంతాల్లోని జోగినులకు భృతి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరో తీర్మాం చేసింది. బ్యాంకర్లతో ఇబ్బందులు నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చే విషయంలో అనుమతుల పేరిట బ్యాంకర్లు ఇబ్బందులపాలు చేస్తున్నారని సభ్యులు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సభ్యులు కోరారు. హరితహారం గుంతలపై... హరితహారం కార్యక్రమంపై కూడా ఈ సమావేశం చర్చించింది. పక్క పక్కనే గుంతలు తీసి మొక్కలు నాటుతున్నారని, అవి ఎలా ఎదుగుతాయని డ్వామా పీడీని సభ్యులు ప్రశ్నించారు. హరితహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాలను ఏర్పాటు చేయూలని కోరారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్థిక స్థాయూసంఘం సమావేశం జరిగింది. జడ్పీ సీఈఓ మోహన్‌లాల్, జడ్పీటీసీ సభ్యులు తానాజీ రావు, మాధవ రావు దేశాయి, స్వాతి, అధికారులు పాల్గొన్నారు. -
ఈ-పోస్.. పెద్ద ఫార్స్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం సర్కారుకు మిగులు చూపుతుండగా, రేషన్ కార్డుదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో ఒక్క మే నెలలోనే రూ.10 కోట్ల రేషన్ మిగిలిందని అధికారులు లెక్కలు చూపుతుండగా, ఈ విధానమే పెద్ద ఫార్స్ అని జనం మండిపడుతున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ సరఫరాలో కోత విధించేందుకు సర్కారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శిస్తున్నారు. - రోజుకు నాలుగు గంటలు పనిచేయని మిషన్లు - రేషన్ ముగింపు కటాఫ్ డేట్లో మాయ - సీఎంను త ప్పుదారి పట్టించే నివేదికలు - ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థలో కృష్ణాజిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం వల్ల ఒక్క మే నెలలో జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల రేషన్ మిగిలింది. ఈ లెక్కన కృష్ణాజిల్లాలో ఏడాదికి రూ. 120 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. ఈ విధానాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అమలు చేస్తే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల రేషన్ దుబారా కాకుండా మిగల్చవచ్చని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో జరిగిన సమీక్షలో రేషన్ సరఫరాపై మాట్లాడారు. ఈ-పోస్ విధానం ద్వారా రేషన్ కోత విధించే ప్రక్రియ జరుగుతోందని, ఇదంతా పెద్ద ఫార్సు అని సర్వత్వా నిరసన వ్యక్తం అవుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం విస్మయానికి గురిచేస్తోంది. ఇదంతా పచ్చి బూటకమని, రకరకాల కారణాలతో రేషన్ మిగులుతోందని కార్డుదారులు విమర్శిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం ఈ-పోస్ విధానం వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ప్రరజలు విమర్శిస్తున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ కు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీపై కొత్త విధానం ప్రవేశపెట్టిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేషన్ పొందటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ సర్వర్లు మొరాయించి గంటల తరబడి నిలబడి వెనక్కి వెళ్లిపోవటం, ఆధార్‌లేని వారికి రేషన్ కోత, వేలిముద్రలు సరిపోక బియ్యం ఎగనామం, కార్డుదారుని కుటంబంలో వారికే సరఫరా చేయడంతో, వృద్ధులు, వికలాంగులకు రేషన్‌కు వెళ్లలేకపోతున్నారు. రేషన్ సరఫరాకు ఆఖరు తేదీ స్పష్టంగా ఉండకపోవటం వంటి కారణాలతో కార్డుదారులకు రేషన్ అందటం లేదని వాపోతున్నారు. జిల్లాలో మే నెలలో దాదాపు రూ. 10కోట్ల మేరకు రేషన్ మిగిలిపోయిందని, ఆ మొత్తం ప్రభుత్వ బడ్జెట్‌కు ఆదా అయిన ట్లేనని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లాలో 2,158 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో వంద క్వింటాళ్లు పంపిణీ చేసే డిపోలో నెలకు 10 క్వింటాళ్లు మిగిలిపోతున్నాయి. కాగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలు పనిచేయాల్సి ఉండగా రోజుకు నాలుగు గంటలు మిషన్లు పని చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆధార్ నంబర్ లేని వారికి రేషన్ ఇవ్వటం లేదు. జిల్లాలో ఒక శాతం మంది ఆధార్ నమోదు కాని వారు ఉండగా 11 లక్షల కార్డుదారుల్లో సుమారు 11వేల మందికి రేషన్ కట్ అవుతుందని సమాచారం. రేషన్ కోసం ఉపాధి పోగొట్టుకుని వేల కుటుంబాల వారు సరుకులు తీసుకోవడం లేదని చెపుతున్నారు. ప్రతినెలా 1వ తేదీన రేషన్ పంపిణీ ప్రారంభించి చివరి తేదీలో కూడా అధికారులు పథకం ప్రకారం మార్పులు చేస్తున్నారు. ముందుగా 15 తేదీతో రేషన్సరఫరా ఆఖరు అని ప్రకటించి, ఆ తరువాత 18, 20వరకు గడువు పొడిగించారు. ఈ విధంగా రేషన్ గడువు ముగింపు తేదీని రకరకాలుగా మార్చి, ఆ తేదీలను ప్రకటించకుండా రేషన్ ఎగవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులు స్వాధీనం
హైదరాబాద్ : హైదరాబాద్ మైలార్దేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాబుల్ రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి దుకాణంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సరఫరా చేసే రేషన్ సరుకులను కనుగొన్నారు. దుకాణంలో నిల్వ ఉంచిన 80 కేజీల చక్కెర, 400 కేజీల గోధుమ, 2500 కేజీల బియ్యం, 90 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ షాపు యాజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
200 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు(కావలి): బియ్యం మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తహశీల్దార్ సాంబశివరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు..స్థానిక కేవీఆర్ మిల్లుపై అధికారులు బుధవారం వేకువజామున తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆ కార్డులకు రేషన్ కట్
- ఈ నెలలో కూడా తీసుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ లేనట్టే - ఈ-పాస్‌తో ప‘రేషాన్’ - త్వరలో ఫ్యామిలీ కార్డులు జారీ సరుకులు కేటాయింపులు ఆపేసినప్పటికీ ఆ కార్డులను మాత్రం రద్దు చేసే అవకాశాలు లేవని జేసీ నివాస్ చెబుతున్నారు. కనీసం రెండు నెలల పాటు వరుసగా సరుకులు తీసుకోలేని కార్డుదారులను గుర్తించి వారికి కేటాయింపులు ఆపేస్తామన్నారు. మాకు సరుకులు అవసరం లేదు.కార్డు ఉంటేచాలు అని కోరే వారందరికి రేషన్ కార్డుల స్థానే స్మార్ట్ కార్డు తరహాలో ఫ్యామలీ కార్డులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. సాక్షి, విశాఖపట్నం: ‘ఈ-పాస్’ సాకుతో ‘సర్కార్’ నిరుపేదలకు ‘రేషన్’ దూరం చేస్తోంది. గత నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేశామని చెబుతున్న సర్కార్ సరుకులు తీసుకోలేని వారికి ఈ నెలలో మరో అవకాశం ఇస్తోంది. ఈ నెలలో కూడా సరుకులు తీసుకోకుంటే వచ్చేనెల నుంచి పూర్తిగా ఆపేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఆ మేరకు కేటాయింపులుతగ్గించేస్తామని తెలిపారు. జీవీఎంసీలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీలతో పాటు మరో పదిమండలాలపరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈపాస్ అమలు చేస్తున్నారు. మిషన్లు మొరాయించడం, నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో తొలి నెలలో 26 శాతం మందికి మాత్రమే ఈపాస్ ద్వారా పంపిణీ జరిగింది. మిగిలిన వారికి మాన్యువల్‌గానే పంపిణీ చేశారు. మేలో నూరు శాతం ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించగా, జీవీఎంసీలోని 2,50,888 కార్డుదారులకు, , ఇతర మన్సిపాల్టీలు, ఎంపిక చేసిన మండలాల్లో 3,55,556 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. అర్బన్‌లో 72 శాతం, రూరల్‌లో 89శాతం మాత్రమే పంపిణీ చేశారు. జీవీఎంసీలో 28 శాతం, రూరల్‌లో 11 శాతం చొప్పున 2,56,245 కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు. సెలవులు..డీలర్ల ఆందోళన: వేసవి సెలవులు కావడంతో చాలా మంది పుణ్యస్థలాలు, పర్యాటక ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల సరుకులు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఈ పాస్ మిషన్ల పనిచేస్తున్నప్పటికీ చాలా మంది డీలర్లు కావాలనే ఒకటికి పదిసార్లు తిప్పించుకోవడంతో చాలామంది కార్డుదారులు తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు. మరి కొంత మంది బయోమెట్రిక్ పనిచేయకపోవడంవంటిసాంకేతిక కారణాలతో కూడా సరుకులు తీసుకెళ్లలేకపోయారని తెలుస్తోంది.కమిషన్ పెంచాలంటూ డీలర్లు ఆందోళన బాటపట్టడం కూడా సరుకుల పంపిణీపై ప్రభావం చూపిందంటున్నారు. కానీ అధికారుల వాదన మరోలా ఉంది. గతంలో రేషన్ సరుకుల కోసం కార్డులు తీసుకునే వారు కొంతమందైతే.. వైద్యం,ఇతర అవసరాల కోసం మరి కొంతమంది కార్డులు తీసుకున్నారని, వీరంతా ఏనాడు రేషన్‌సరుకులు తీసుకునే వారు కాదని చెబుతున్నారు. గతనెలలో సరుకులు తీసుకోలేని వారిలో ఎక్కువ మంది ఇదే కోవకు వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. -
'రేషన్' కోసం ఆందోళన
చెన్నూరు: వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో రేషన్ సరుకుల కోసం స్థానికులు శనివారం ఆందోళన బాట పట్టారు. సాంకేతిక సమస్యల కారణంగా మే నెలకు సంబంధించి బియ్యం, చక్కెర ఇవ్వడం కుదరదని, గడువు తీరిపోయిందని డీలర్ చెబుతుండడంతో స్థానికులు ధర్నాకు దిగారు. తమకు అన్ని రేషన్ సరుకులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎమ్మార్వో శాంతమ్మను వారు ముట్టడించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. -
బియ్యం, కంది బేడల పంపిణీ కేంద్రం ప్రారంభం
ధర్మవరంటౌన్ : తక్కువ ధరలకు కందిబేడలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేసేందుకు మర్చంట్స్ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. స్థానిక వాసవి కొత్తసత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చౌక ధరలకు సోనామసూరి బియ్యం, కంది బేడలు పంపిణీ చేసే కౌంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రేషన్ లబ్ధిదారులకు కిలో రూ. 90లకు నాణ్యమైన కంది బేడలు, కిలో రూ.29లకు సోనామసూరి బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. సేవా దృక్పథంతో రైస్‌మిల్లర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, జి.సూర్యనారాయణ, ఆర్డీవో నాగరాజు, తహశీల్దార్ వి.కుమారి పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం, చక్కెర, కిరోసిన్ సీజ్
♦ 82.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం,3 క్వింటాళ్ల చక్కెర, 80 లీటర్ల కిరోసిన్ స్వాధీనం ♦ ఇంటి యాజమానిపై కేసు నమోదు నర్మెట : ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌బియ్యం, చక్కెర, కిరోసిన్‌ను గ్రామస్తుల సమాచారంతో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు వచ్చి సీజ్ చేసి, తరలించిన సంఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామంలోని బొప్పిశెట్టి శంకర్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం అందడంతో జిల్లా ధాన్యం కొనుగోలు అధికారి సంపత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్ విజిలెన్స్ బృందం ఆ ఇంటిని సోదా చేసి 82.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 3 క్వింటాళ్ల చక్కెర, 80 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యాజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. సరుకులను దగ్గర్లోని రైస్‌మిల్లుకు తరలించారు. అనంతరం గ్రామంలోని షాపు నెం.8ను తనిఖీ చేసి పలురికార్డులను పరిశీలించారు. ఇదిలా ఉండగా ఒకేసారి పెద్దమొత్తంలో అక్రమంగా సరుకులు నిల్వ ఉండటం చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. ఇదిలా ఉండగా చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యక్తుల వద్ద నిత్యావసర సరుకులు కొనుగోలుచేసినట్లు ఇంటియజమాని అధికారులకు తెలిపా డు. దీంతో తరిగొప్పుల కేంద్రంగా రీసైక్లింగ్ వ్యాపారం జోరుగా సాగుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సోదాల్లో ఏఎస్ఓ రోజారాణి, సివిల్ సప్లయ్ డీటీ సురేష్, రేణుక, తహసీల్దార్ దేవరాయ నర్సయ్య, ఆర్ఐ మనోహర్, వీఆర్వో సాయిలు, అంజయ్య ఉన్నారు. రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు పర్వతగిరి : మండలంలోని రావూర్ గ్రామానికి చెందిన శ్రీవెంకటేశ్వర రైస్‌మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 267 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్సమేంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. దాడుల్లో సివిల్ సఫ్లై ఏఎస్ఓ అనిల్ కుమార్, డీటీలు రాజ్‌కుమార్, రత్నవీరాచారి,హెడ్కానిస్టేభుల్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 200 క్వింటాళ్ల బియ్యం పట్టివేత సింగరాజుపల్లి(దేవరుప్పుల) : జనగామ-సూర్యాపేట రహదారి సింగరాజుపల్లి వద్ద సివిల్ సప్లయ్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. సివిల్ సప్లయ్ జిల్లా పర్యవేక్షణ అధికారి సంపత్‌కుమార్ నేతృత్వంలో మహబూబ్‌బాద్ నుంచి జనగామ వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా 414 బస్తాల్లో ప్యాక్ చే సిన రేషన్ బియ్యాన్ని గుర్తించారు. తదుపరి చర్యల కోసం ఆ బియ్యాన్ని జనగామలోని ఓ రైస్‌మిల్లుకు తరలించారు. దాడుల్లో జనగామ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఏఎస్ఓ రోజారాణి, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఇదే ప్రాంతంలో గత 15 రోజుల క్రితం రేషన్ బియ్యం పట్టుబడడం గమనార్హం. -
ఈ-పాస్‌కు ఆదిలోనే హంసపాదు
పని చేయని సర్వర్ ఇబ్బందులుపడ్డ కార్డుదారులు నెల్లూరు(రెవెన్యూ) : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఆదివారం ఈ-పాస్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు. ప్రారంభంలోనే ఈ విధానంతో డీలర్లు, కార్డుదారులు ఇబ్బందులుపడ్డారు. ఈ-పాస్ సర్వర్ పని చేయకపోవడంతో మిషన్లు ఆన్ కాలేదు. డీలర్లు ఇబ్బందులుపడ్డారు. గంటల సమయం కార్డుదారులు షాపుల వద్ద పడిగాపులుకాశారు. ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. చౌకదుకాణాల డీలర్లు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. హైల్ప్‌లైన్ సిబ్బంది వచ్చి మిషన్లను పరిశీలించినా ఫలితం లేదు. జిల్లాలో 1874 చౌకదుకాణాలున్నాయి. నెల్లూరు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని 320 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశారు. కార్డుదారుల వివరాలు అప్లోడ్ చేశారు. ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని 90 శాతం చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానం పని చేయలేదు. పలు షాపుల్లో మిషన్లు ఆన్కాకాపోవడంతో కార్డుదారులు అవస్థలుపడ్డారు. ఈ-పాస్ మిషన్‌లో కార్డుదారుల వివరాలు నమోదు చేసి కావాల్సిన రేషన్‌కు సంబంధించి వేర్వేరుగా నమోదు చేయాల్సి ఉంది. మిషన్‌లో వివరాలు నమోదు చేస్తేనే రేషన్ విడుదలవుతుంది. మిషన్లు పని చేయకపోవడంతో రేషన్ పంపిణీ కాలేదు. ఈ-పాస్ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ-పాస్ విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. డీలర్లు సాధారణ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంలేదు. ఏదిఏమైనా నూతన విధానం కార్డుదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది. సర్వర్ పనిచేయలేదు : సంధ్యారాణి, డీఎస్ఓ ఈ-పాస్ విధానం ద్వారా ప్రజా పంపిణీ ప్రారంభించాం. సర్వర్ పని చేయకపోవడంతో ఈ-పాస్ మిషన్లు పని చేయలేదు. ఈ విషయం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తెలియజేశాం. త్వరలో సర్వర్ పని చేసేలా చర్యలు తీసుకుంటాం.