
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఆచూకీ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలిలో షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ బృందంపై అతడి అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
ఘటనలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి జాడ తెలియకుండా పోయిన షాజహాన్ షేక్ బహుశా దేశం విడిచి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అతడి గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment