TMC leader
-
‘సందేశ్‌ఖాలీ’ అరాచకాలు.. షేక్ షాజహాన్ మళ్లీ అరెస్టు
కలకత్తా: పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ కేసుల్లో ప్రధాన నిందితుడు తృణమూల్ మాజీ నేత షేక్ షాజాహన్ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం(మార్చ్ 30) అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీలో భూములు కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులో షాజాహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం బసిర్హట్ జైలులో ఉన్న షాజాహాన్‌ను మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ శనివారం జైలులోనే ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసింది. షాజాహాన్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ బసిర్హట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సందేశ్‌ఖాలీ ఆందోళనలకు కారణమయ్యారన్న కారణంతో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సందేశ్ ఖాలీలో షేక్ షాజహాన్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించన రేఖా పత్ర అనే మహిళకు బీజేపీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కూడా ప్రకటించింది. ఇదీ చదవండి.. ఇండియా జిందాబాద్ నినాదాలు చేసిన పాకిస్తానీలు -
షాజహాన్ షేక్ ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్‌కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలిలోని షాజహాన్ షేక్ నివాసం సమీప ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలకు వెళ్లిన 14 మంది అధికారుల బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీబీకి చెందిన ఆరుగురు, సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆరుగురు, ఈడీ అధికారులు ఇద్దరు గాయపడ్డారు. ఘటనతో సంబంధముందన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి షాజహాన్ షేక్ సస్పెండయ్యాడు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం షాజహాన్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, సందేశ్‌ఖాలిలోని అతడి నివాసం, కార్యాలయాలకు సీల్ వేశారు. -
సందేశ్‌ఖాలీ కేసు: టీఎంసీ నేత అరెస్టుపై హైకోర్టు క్లారిటీ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సందేశ్‌ఖాలీ నిరసనలకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజాహాన్పై కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షాజహాన్ అరెస్టుపై ఎలాంటి తాము ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. సుమోటోగా స్వీకరించిన ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ, పశ్చిమ బెంగాల్ హోం శాఖ కార్యదర్శిలను కోర్టు ఆదేశించింది. రేషన్ స్కామ్‌లో షాజహాన్ ఇంట్లో సోదాల కోసం వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై జనవరి 5న దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పటి నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. కాగా, షాజాహాన్ అరెస్టు హైకోర్టు పరిధిలో ఉందని, పోలీసుల చేతులను హైకోర్టు కట్టేసిందని టీఎంసీ ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు క్లారిటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ మంటలు -
Enforcement Directorate: టీఎంసీ నేత కోసం లుకౌట్ నోటీస్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఆచూకీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలిలో షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ బృందంపై అతడి అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి జాడ తెలియకుండా పోయిన షాజహాన్ షేక్ బహుశా దేశం విడిచి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అతడి గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. -
నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి
కోల్‌కతా: తన కారు ఆపాడని కోపంతో ఓ టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రకారం టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. బుర్ద్వాన్‌లోని పల్సిట్లో గురువారం రాత్రి ఆయన కారు టోల్ గేటు దాటుతుండగా టోల్ ఉద్యోగి నిబంధనల ప్రకారం వాహనాన్ని ఆపాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. ట్రాఫిక్ కోన్‌ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్ కోన్‌ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్ మండల్ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. నా కారునే ఆపుతావా అంటూ అతడిపై చేయి చేసుకోవడంతో పాటు తోసేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంపీకి నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్ధుమణిగింది. అయితే ఈ ఘటన మొత్తం టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో టీఎంసీ ఎంపీ సునీల్ మండల్స్పందించారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడంతోనే తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు. ये #MP #MLAs को समझना चाहिए कि टोल प्लाजा पर खडे सामान्य लोग उन्हें नहीं पहचानते. वो अपना काम कर रहे है. अगर गाडी रोक दी तो गुनाह नहीं कर दिया जनाब पश्चिम बंगाल के बर्दवान पूर्व के #सांसद #sunilmandal है हरकत तो दिख ही रही है https://t.co/w1sRx9QO3t pic.twitter.com/09EbhRDNDu — Archana Pushpendra (@margam_a) August 4, 2023 -
ఆ ట్వీట్ గురించి కాదు..తృణమాల్ నేత బీజేపీపై ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నకిలీ ట్వీట్ ఆరోపణలపై తృణమాల్ కాంగ్రెస్ అధికారి ప్రతినిధి సాకేత్ గోఖలే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాకేత్ భారతీయ జనతాపార్టీ ఆదేశాల మేరకే తనను అరెస్టు చేసినట్లు ఈ రోజు ప్రకటించారు. ఐతే మోదీ తనను ఒక ట్వీట్ బాధించింది కానీ మోర్బీ బ్రిడ్జి ఘటనలో135 మంది అమాయకుల మృతి గురించి కాదని ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాలతో మొదటి సారి అరెస్టు చేసినప్పుడు బెయిల్ పొందాను. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల కమీషన్ కేసు దాఖలు చేసింది. అయినా మళ్లీ బెయిల్ పొంగలిగాను. అని చెప్పారు సాకేత్. ఎన్నికల కమిషన్ బీజేపీ మిత్రపక్షం అంటూ సాకేత్ విరుచుకుపడ్డారు. బీజేపీ యధేచ్ఛగా తప్పులు చేసుకుంటూ పోతోందని, అయినప్పటికీ తాను మరింత గట్టిగా బయటకు వస్తాను అని నొక్కి చెప్పారు. అలాగే అహ్మదాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమోదైవ్వడానికి ముందుగా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అన్నారు. ఇంటిలిజెన్సీ బ్యూరో తనను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత జైపూర్ విమానాశ్రయంలో అడ్డగించి సీఐఎస్ఎఫ్కి అరెస్టు చేయమని చెప్పారు. వేరే కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న అహ్మదాబాద్ పోలీసులును జైపూర్‌కి తరలించి తనను అరెస్టు చేయమని చెప్పారని అన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసిన ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ...ఎవరో చేసిన ట్వీట్‌ను పంచుకున్నందుకు పెట్టిన పనికిమాలిన కేసు అని అన్నారు. ఇంతకీ ఆ షేర్ చేసిన ట్వీట్ పెట్టిన వ్యక్తి ఎవరో పోలీసులకు ఎలాంటి క్యూ దొరకలేదన్నారు. తృణమాల్ నేత మళ్లీ మోర్బి ఘటన తెరపైకి తీసుకువచ్చారు. ఆ వంతెనను నిర్మించిన ఒరెవా కంపెనీ యజమానుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉండవు, అరెస్టులు చేయరు. కానీ తనను మాత్ర లక్ష్యంగా చేసుకుని జైలులో ఉంచేందుకు యత్నిస్తోందని ఆరోపణలు చేశారు సాకేత్. గుజరాత్, యూపీలు మోదీ అమిత్‌షాల డైరెక్షన్లో వ్యవహారిస్తాయంటూ విరుచుకుపడ్డారు. వాస్తవానికి గురువారం సాకేత్ బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత గుజరాత్ పోలీసులు మళ్లీ సాకేత్‌ని మోర్బి పట్టణంలోని వంతెన కూలిపోవడానికి సంబంధించిన ట్వీట్ గురించి అరెస్టు చేయడం గమనార్హం. (చదవండి: పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి..) -
టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు.. బీజేపీ ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో బాంబు పేలి.. ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుకాగా, ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పూర్బా మేదినీపూర్ తూర్పు ప్రాంతం నార్యబిలా గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో టీఎంసీ నేత ఇంట్లో ఈ పేలుడు సంభించింది. సదరు నేత టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్నాగా నిర్ధారణ అయ్యింది. పేలుడు ధాటికి ఇల్లు ముక్కలైపోయింది. ఇప్పటివరకు మూడు మృతదేహాలను(రాజ్‌కుమార్ సహా) ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే పేలుడు తీవ్రత.. భారీగా ఉందని, చుట్టుపక్కల మేర కొంత నష్టం వాటిల్లిందని పోలీసులు చెప్తున్నారు. బీజేపీ నేత సువేందు అధికారి ఇలాకాగా పేరున్న కొంతాయ్ ప్రాంతంలో టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాడి జరగడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అయితే.. నాటు బాంబులు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్.. అధికార టీఎంసీని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ట్విటర్లో పోస్ట్ చేసి.. పలు అనుమానాలు వ్యక్తం చేశారు. TMC Booth President Rajkumar & 2 others died last evening while urgently making the bombs, as these bombs were intended to be hurled at Contai. Bombs are WB's most successful Cottage Industry products & are widely produced in TMC leaders' homes across Bengal.@AmitShah@HMOIndia — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) December 3, 2022 మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజన్ చక్రవర్తి స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలపై సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని, ఆమె స్పందించాలంటూ డిమాండ్ చేశారు. ఈ పరిణామలపై టీఎంసీ రాష్ట్ర కార్యదర్శి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. బెంగాల్లో అధికార పక్షాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఎలాంటి ఆధారాలు లేని వ్యవహారాలు భలే దొరుకుతున్నాయని పేర్కొన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, వాస్తవాలు అతిత్వరలోనే తెలుస్తాయని కునాల్ అన్నారు. ఇదీ చదవండి: తండ్రి వెంటే తనయుడు.. బీజేపీలోకి! -
రాష్ట్రపతి పై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
-
టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాలు జిల్లా భాట్‌పాడాలో మరోసారి హింస చెలరేగింది. టీఎంసీ యువనేత రాజ్ పాండేపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అతను కాళీమాత పండల్లో పూజ ఏర్పాట్లు చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఈ దాడి చేశారు. ఆరు రౌండ్ల కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రాజ్ పాండే చెతిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దీపావళికి ముందు రోజు ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అనంతరం ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాట్‌పాడాలో ఇటీవల తరచూ హింస చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు రెండు రోజుల ముందే మరో టీఎంసీ నేతపై దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. అతని శరీరంలోకి కూడా బుల్లెట్ దూసుకెళ్లింది. చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం -
‘బిర్యానీలో వాడే మసాలాలు తింటే లైంగిక కోరికలు తగ్గుతాయి’.. షాపులు బంద్!
బిర్యానీ.. ఈ పేరు వింటనే భోజనప్రియులు పేట్లకు పేట్లు లాగించేస్తారు. అలాంటిది బిర్యానీలో వాడే మసాలాలు.. పురుషుల్లో లైంగిక కోరికలను తగ్గిస్తాయంటే నమ్ముతారా?. తాజాగా ఇదే కారణాన్ని చూపిస్తూ ఓ బిర్యానీ సెంటర్‌ను బంద్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్, కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుతున్నాయని కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. కాగా, రవీంద్రనాథ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు వ్యాపారులు అక్రమంగా బిర్యానీ సెంటర్లను నడుపుతున్నారు. లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారు. వారు చేసే బిర్యానీలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, వారి షాపులను మూసివేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి మాట్లాడుతూ బిర్యానీల్లో వాడే మసాలాలతో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా షాపులను మూసివేయినట్టు తెలిపారు. It is learnt these two shops were adjacent to a Shani Dev temple in the Bhawaniganj market area in Cooch Behar town.#MunsifDigital#UnlicensedOutlets#SellingBiryani#DriveShutinBengal#RabindraNathGhosh https://t.co/Fj15Obm8oH — The Munsif Daily (@munsifdigital) October 24, 2022 -
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు -
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం -
బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. టీఎంసీ నేతలు వరుసగా అరెస్టవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మోండల్ సీబీఐ వలలో చిక్కుకోవడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరీ అనుబ్రతా మోండల్? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రతా మోండల్ ఉన్నారు. 61 ఏళ్ల మోండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే ఈ జిల్లాలో ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మోండల్ టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీలోనూ స్థానం దక్కించుకున్నారు. పోటీకి దూరంగా.. వివాదాలకు దగ్గరగా.. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనుబ్రతా మోండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాదాలు ఆయనకు కొత్త కాదు. చాలా సందర్భాల్లో రెచ్చగొట్ట ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలని టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. చాలా మంది రౌడీషీటర్లకు ఆయన ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రాళ్ల తవ్వకాలు, పశువుల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతిపక్ష నేతలను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే.. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో మోండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు పంపింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అంగీకరించింది. హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళుతుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో మోండల్‌ను సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది. (క్లిక్: సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత) -
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పార్థ చటర్జీ ఈడీ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లగా.. తాజాగా మరో అగ్రనేత సీబీఐకి చిక్కారు. మమతకు అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. బీర్భూమ్ జిల్లాలోని తన నివాసంలో అనుబ్రతా మోండల్‌ను గురువారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదరగొట్టి మోండల్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరుకావాలని 10 పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో రెండు సార్లు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. (క్లిక్: ఐటీ దాడులు.. డబ్బులు లెక్కించడానికి 13 గంటలు) -
ఇక్కడకు రాగలరా మీరు ?: స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మమతా
కోల్‌కతా: బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... బీజేపీని ఉద్దేశిస్తూ...మహారాష్ట్రలో పాగా వేసింది. ఇక చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించి అధికారం చేజక్కించుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు. అయినా మీరు ఇక్కడకు రావాలంటే... బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్, సుందరబన్స్‌లోని రాయల్ బెంగాల్ టైగర్లు, ఏనుగులు మీపై దాడి చేస్తాయ్ అంటూ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్థ ఛటర్జీ అడ్మిట్ అయిన ఎస్ఎస్కేఎం ఆస్పత్రి దేశంలోనే నెంబర్ వన్ హస్పటల్ అయినప్పటికీ ఎందుకు అభ్యంతరం చెప్పారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్పత్రి (భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కే ఆయన్ను ఎందుకు తరలించారు?. అసలు మీ ఉద్దేశం ఏమిటని నిలదీశారు. ఇది ముమ్మాటికీ బెంగాల్ ప్రజలను అవమానపరచటేమే అంటు ఆక్రోశించారు. కేంద్రం మాత్రమే మంచిది రాష్ట్రాలన్నీ దొంగలా? అంటూ బీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రాల వల్లే మీరు అక్కడ ఉన్నారు అంటూ మమతా గట్టి వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా.. ఐసోలేషన్‌కు తరలింపు) -
ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు. తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్ కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు. యాదృచికంగా సిన్హా జూన్21న తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది. దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం. (చదవండి: యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్) -
ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరు: దీదీపై కుష్భూ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హన్స్‌ఖలీ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది అధికార టీఎంసీ నేత కొడుకే కారణమంటూ ఆరోపణలు వస్తుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఐదుగురు సభ్యులతో కూడిన బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(శుక్రవారం) హన్స్‌ఖలీలో పర్యటించింది. బాధిత కుటుంబాన్ని పర్యటించి.. పూర్తి వివరాలను సేకరించింది. చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది ఆ కమిటీ డిమాండ్ చేసింది. ఇక ఈ కమిటీలో సభ్యురాలైన బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ... ఈ హత్యాచారాన్ని పక్కదోవ పట్టించేందుకు మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆమె అత్యాచారానికి గురయిందా? లేదంటే ప్రేమ వ్యవహారం కారణమా? అనే విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలుసు. ఒకవేళ వారు ప్రేమలో ఉంటే వారిని నేనెలా ఆపగలను?... సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరోవైపు ఒక మహిళ అయివుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కుష్భూ. ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరని, ఆమె మీద నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజలను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇద్దరు బిడ్డల తల్లిగా బాధిత కుటుంబం ఆవేదనను, బాధను తాను అర్థం చేసుకోగలనని, మమతా బెనర్జీ చేసిన ప్రకటన పూర్తిగా క్రూరంగా ఉందని, వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కుష్భూ. Mamata Banerjee should show the spine and courage to come out and apologise for the remark she made: BJP's @khushsundar.#NadiaRapeCase #HanskhaliRapecase #WestBengal #ReporterDiary (@RittickMondal) pic.twitter.com/BpKhhSpBbR — IndiaToday (@IndiaToday) April 15, 2022 ఇదిలా ఉండగా.. బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కుష్భూ అన్నారు. మరోవైపు ఈ ఘటనకు టీఎంసీ నేత కుమారుడే కారణమని భాదితురాలి కుటుంబం అంటోంది. -
బేల్దార్.. దాదా! తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి..
తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి ఎదగడం సినిమాల్లో చూశాం! బీర్భూమ్ ప్రధాన నిందితుడు అనరుల్ హుస్సేన్ కథ కూడా అలాంటిదే! చిన్న గుడిసెలో ఉండే బేల్దార్ అనరుల్ మూడంతస్తుల భవనంలో ఉండే దాదాగా మారిన తీరు అనూహ్యం. తానుండే ప్రాంతంలో చాలామందికి అనరుల్ ఒక దైవదూత. కానీ ఈ దైవదూత వెనుక చీకటి కోణాలు అనేకం. సజీవ దహనం కేసులో సీబీఐ అరెస్టు చేసేవరకు అనరుల్‌ను తాకడానికి స్థానిక పోలీసులు కూడా భయపడేవారు. ఆ ప్రాంతానికి అతను మకుటం లేని మహారాజు. చిన్నతనంలో తండ్రితో కలిసి అనరుల్ తాపీ పనులకు వచ్చేవాడని, తర్వాత మేస్త్రీగా ఎదిగాడని స్థానికులు గుర్తు చేసుకుంటారు. అప్పటినుంచే ఏదో సాధించాలన్న కసి అతనిలో ఉండేదని అనరుల్ చిన్నప్పటి స్నేహితుడు స్వపన్ మండల్ చెప్పారు. లక్ష్యసాధన కోసం తొలుత అన్రుల్ కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం మమత నేతృత్వంలోని టీఎంసీలోకి వచ్చి రామ్‌పుర్హాత్ బ్లాక్1 ప్రెసిడెంట్ అయ్యాడు. సజీవ దహనం కేసు దర్యాప్తునకు పోలీసులు బోగ్తుయ్ ఊర్లోకి రాకుండా అనరుల్ అడ్డుకున్నాడంటే అతని పరపతి అర్థం చేసుకోవచ్చు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్లు చివరకు సీబీఐ చేతికి చిక్కాడు. అవినీతి సోపానాలు అనరుల్ హుస్సేన్ ఎదుగుదల వెనుక అవినీతి, అక్రమాలున్నాయని, స్థానికంగా నర్సరీ నడిపే కార్తీక్ మండల్ చెప్పారు. పలు సంవత్సరాలుగా అనరుల్ అక్రమ సంపాదన కొనసాగిందన్నారు. ‘‘ఆయన ఇల్లు చూడండి. ఒక మేస్త్రీ ఇల్లులాగా ఉందా అది? గడిచిన రెండు దశాబ్దాల్లో అతను ఇంత శక్తిని, ఆస్తిని కూడబెట్టాడు. నిజాయితీపరుడెవరూ స్వల్పకాలంలో ఇంత కూడబెట్టలేడు’’ అని కార్తీక్ వ్యాఖ్యానించారు. తన స్థలాన్ని కబ్జా చేసి మరీ అనరుల్ ఇల్లు కట్టాడని ఆరోపించారు. స్థానిక ఎంఎల్ఏ, అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి హుస్సేన్ చాలా ఆప్తుడని పుకార్లున్నాయి. మంచి పనివంతుడని అనరుల్‌కు పార్టీలో పేరుందని స్థానిక నాయకులు చెప్పారు. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనరుల్‌కు అడ్డం లేకుండా పోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు, స్థానిక సిండికేట్ నిర్వహణ తదితరాల్లో అనరుల్ హస్తం ఉంది. 2019లో అతన్ని బ్లాక్ ప్రెసిడెంట్‌గా తొలగించాలని స్థానిక నేత భావించినా, ఎంఎల్ఏ అండతో గండం తప్పించుకున్నాడు. ఈర్ష్యతో ఆరోపణలు తన తండ్రి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అనరుల్ కుమార్తె ముంతాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరిన పనల్లా ఆయన చేశాడని, అందుకు ప్రతిగా ఆయనపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన చెందా రు. అయితే అనరుల్ లాంటివాళ్లు టీఎంసీలో చాలా మంది ఉన్నారని, ప్రస్తుతం ఇతనొక్కడే బయటపడ్డాడని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆశిష్ కింద చాలామంది అనరుల్ హుస్సేన్ లాంటి వాళ్లున్నారన్నారు. టీఎంసీ పాలనలో ఇలాంటి బాహుబలులు చాలామంది పుట్టుకువచ్చారని దుయ్యబట్టారు. వీరంతా స్థానిక సామంతరాజులని విమర్శించారు. ప్రస్తుతం అనరుల్‌ను పోలీసు కస్టడీలో ఉంచారు. ఇకపై ఆయన్ను సీబీఐ విచారించనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
బెంగాల్లో కలకలం.. టీఎంసీ యువనేత కాల్చివేత..!
కోల్‌కతా: బెంగాల్లో టీఎంసీ నాయకుడిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో ఓ టీఎంసీ యువనేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తిటాఘర్‌లోని బీటి రోడ్డులోని సంధ్య సినిమా థియేటర్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడుని టీఎంసీ యువ నాయకుడు రాణాజయ్ శ్రీవాస్తవగా గుర్తించారు. ఆయన బారక్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో తృణమూల్ హిందీ విభాగంలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా శ్రీవాస్తవను మొదట స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించడంతో కోల్‌కతాలోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ నార్త్ 24 పరగణాల చీఫ్ జ్యోతిప్రియో ముల్లిక్ మాట్లాడుతూ.. "ఈ ప్రాంతంలో అధికార పార్టీ కార్యకర్తలలో భయం కలిగించడానికే దుండగులు దాడికి పాల్పడ్డారు’’ అని ఆరోపించారు. అంతే కాకుండా టిఎంసీ అసెంబ్లీ చీఫ్ విప్, పానిహతి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ ఈ ఏడాది ఎన్నికలకు ముందు బిజెపి నుంచి రాష్ట్రంలో అధికార పార్టీలో చేరినందున కాషాయ పార్టీ కార్యకర్తలు శ్రీవాస్తవను చంపారని ఆరోపించారు. అయితే ఈ హత్య రాష్ట్రంలో అధికార పార్టీలోని అంతర్గత పోరు కారణంగానే జరిగిందని బీజేపీ పేర్కొంది. -
ఈ టీ ఖరీదు రూ.15 లక్షలు.. అయినా ఎగబడ్డ జనం
కోల్‌కతా: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి కొందరు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు. అదే తరహాలో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర ప్రధానిని టార్గెట్ చేస్తూ ఏకంగా చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ ఆ టీ తీసుకుని ఆనందంగా తాగారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దైన శైలిలో సెటైర్స్ వేశారు. మిత్ర మాట్లాడుతూ.. మా తృణమూల్ కాంగ్రెస్సే కాదు, ఇతర విపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తాయో అని ఎదురుచూస్తూనే ఉన్నాం. ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ అప్పట్లో మాట ఇచ్చారు. మరి ఏళ్లు గడుస్తున్న ఆ రోజు ఇంకా రాలేదని, ఇది ఎప్పుడు నెరవేరనుందోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెటిజన్లలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కమర్హతి ఎమ్మెల్యే, కోల్‌కతాలోని భువానిపూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులకు టీ అందిస్తూ.. "ఇది ఒక ప్రత్యేకమైన టీ. మోదీజీ రైల్వే స్టేషన్లలో చాయ్ వాలాగా ఉన్నప్పుడు చేసిన టీ రుచికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఉచితంగా అందిస్తున్నాను. కానీ మీరు ధర అడిగితే మాత్రం, ఒక కప్పు ధరను రూ .15 లక్షలుగా చెప్తాను ఎందుకంటే ఇది మోదీ వాగ్దానం చేసిన మొత్తం కూడా 15 లక్షలే కనుక అంటూ విమర్శలు గుప్పించారు. @AITCofficial MLA, Madan Mitra: A cup of tea costs 15 lakh rupees, the name of the ‘seller’ is Madan Mitra! An innovative campaign by @madanmitraoff 🙏 pic.twitter.com/ggT6bWIEbP — Satyaki Sengupta (@satyaki_sngupta) August 1, 2021 -
హథ్రాస్ : టీఎంసీ ఎంపీలపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ హథ్రాస్ సామూహిక హత్యాచార ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దళిత యువతి హత్యాచార ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు శుక్రవారం నిరసనకు దిగాయి. ఈ క్రమంలో యూపీలోని బాధిత యువతి కుటుంబానికి కలుసుకునేందుకు టీఎంసీ ఎంపీలు బయలుదేరారు. వారిని అనుమంతించే ప్రసక్తే లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తృణమూల్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ముఖ్యంగా డెరెక్ ఓ బ్రియన్, కాకోలి ఘోష్ దస్తిదార్, ప్రతిమా మొండల్‌హావ్‌తో సహా తృణమూల్ ఎంపీల ప్రతినిధి బృందాన్ని హత్రాస్‌లోకి ప్రవేశించకుండా శుక్రవారం నిలిపివేశారు. ఈ తోపులాటలో ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కింద పడిపోడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను పోలీసులు అక్రమంగా అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎంపీలు మండిపడుతున్నారు. మరోవైపు బాధితురాలి కుటుంబం అనుమతిలేకుండా రాత్రికి రాత్రికే బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా గురువారం స్వీకరించింది. అక్టోబర్ 12 న తదుపరి విచారణకు రాష్ట్ర, జిల్లా అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించింది. కాగా హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గురువారం యూపీ పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్నితొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం ఢిల్లీ నగంలో 144 సెక్షన్ విధించింది. ఇండియా గేట్ సమీపంలో ప్రదర్శనలు, అయిదుగురికి మించి అనుమతిచేదిలేదని పోలీసు ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. ये SDM प्रेम प्रकाश मीणा है, ये अफसरी कम और गुंडागर्दी ज्यादा करते हैं... देखिए कैसे TMC सांसद @derekobrienmp को धक्का मार रहे हैं, आज तक की संवाददाता @chitraaum के साथ भी बदतमीजी की, फिर हमारे चैनल की संवाददाता @PragyaLive के साथ भी बतमीजी से बात की, गुंडई पे उतारू है प्रशासन। pic.twitter.com/nz4UxP01oL — Devvesh Pandey | देवेश पांडेय | دیویش پانڈے۔ (@iamdevv23) October 2, 2020 -
కరోనా అనుమానితుడు.. పీపీఈ కిట్ ధరించి
కోల్‌కతా: కరోనా వైరస్ మనిషిని చంపితే.. భయం మనలోని మానవత్వాన్ని చంపుతోంది. కళ్లెదుట మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు వెళ్లి సాయం చేయట్లేం. కారణం వారికి కరోనా ఉంటే మనకు సోకుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎవరికి వారే దూరంగా ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ టీఎంసీ నాయకుడు చూపిన సాహసం ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశసంలు పొందుతుంది. వివరాలు.. గోపిబల్లవపూర్కు చెందిన అమల్ బారిక్(43) ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గత 5-6 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి వెళ్లడానికి కూడా ఓపిక లేదు. దాంతో బారిక్ భార్య ఇరుగుపొరుగును సాయం కోరింది. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్, ప్రైవేట్ వాహనం బుక్ చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదు వారికి. దాంతో ఏం చేయాలో తెలీక బాధపడుతోంది. (కరోనా జీవితం పోరాటంగా మారింది) అయితే ఈ విషయం గురించి గోపిబల్లవపూర్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సత్యకం పట్నాయక్‌కు తెలిసింది. దాంతో ఇతర కార్యకర్తలతో మాట్లాడి ఓ బైక్ ఏర్పాటు చేసుకున్నాడు. మెడికల్ షాప్‌కు వెళ్లి పీపీఈ కిట్ తెచ్చుకున్నాడు. అనంతరం బారిక్ ఇంటికి వెళ్లి అతడిని బైక్ మీద కూర్చోపెట్టుకుని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బారిక్‌ను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చి.. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని తెలిపారు. పట్నాయక్ తిరగి అతడిని ఇంటికి చేర్చాడు. పీపీఈ కిట్ ధరించి బైక్ మీద బారిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలయ్యింది. దీని గురించి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘బారిక్ పరిస్థితి తెలిసి.. కామ్‌గా ఉండలేకపోయాను. నా కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే చూడలేను. దాంతో పీపీఈ కిట్ ధరించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాను’ అన్నాడు. (కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్) అంతేకాక ‘పాపం నేను అతడికి ఇంటికి వెళ్లేసరికి బారిక్ భార్య, ఇద్దరు కుమారులు అతడి పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తానని తెలిసి బారిక్ భార్య మాతో పాటు హస్పటల్‌కి వస్తానంది. కానీ ఆమెకు నచ్చచెప్పి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి తీసుకువచ్చాను. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వుంటే వారికి కూడా సాయం చేస్తాను. అందుకే మరో 4 పీపీఈ కిట్లు కూడా ఆర్డర్ చేశాను’ అని తెలిపాడు. పట్నాయక్ పీపీఈ కిట్ ధరించి బారిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
నల్లమందు కేసులో టీఎంసీ నేత అరెస్ట్
కోలకతా: ఒక పక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ఆ పార్టీ నేత సుబోధ్ ప్రమాణిక్ ను నార్కోటిక్స్ విభాగం అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున మత్తు మందులు కలిగి వున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసలే స్టింగ్ ఆపరేషన్ ద్వారా అవినీతి ఆరోపణలతో అతలా కుతలమవుతున్న పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ వ్యవహారం మరింత ఇబ్బందుల్లో పడుతున్నట్టు కనిపిస్తోంది. మాల్దా జిల్లాలో వైష్ణవ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సబ్దల్ పూర్ గ్రామంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ .3 కోట్ల రూపాయల విలువైన నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా తుపాకీలు, బాంబులు సహా కొన్ని మారణాయుధాలను టిఎంసి నేత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.